బకెట్ల కొద్దీ పెట్రోలు ఫ్రీ! | Tanker roll over in Nalgonda district | Sakshi
Sakshi News home page

బకెట్ల కొద్దీ పెట్రోలు ఫ్రీ!

Published Thu, Jun 30 2016 7:43 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

బకెట్ల కొద్దీ పెట్రోలు ఫ్రీ!

బకెట్ల కొద్దీ పెట్రోలు ఫ్రీ!

నల్లగొండ జిల్లాలో ట్యాంకర్ బోల్తా
 
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారు 65వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఓ పెట్రోలు ట్యాంకర్ బోల్తాపడింది. రంగారెడ్డి జిల్లా చర్లపల్లి ఐవోసీ టెర్మినల్ పాయింట్ నుంచి నల్లగొండకు 12 వేల లీటర్ల పెట్రోలుతో బయలు దేరిన ఏపీ 31డబ్ల్యూ 4668 నంబరు గల ట్యాంకర్ చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోకి రాగానే అదుపుతప్పి బోల్తాపడింది.

విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా పెట్రోల్‌ను బకెట్లలో, క్యాన్లలో నింపుకొని తీసుకెళ్లారు. హైవే మీదుగా వెళ్తున్న కార్లు, మోటార్ సైకిళ్లను ఆపి, డబ్బాలతో వాహనాల్లో పెట్రోల్ పోసుకున్నారు. ఇలా దాదాపు 6 వేల లీటర్ల పెట్రోల్ తీసుకెళ్లారు. సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐలు మల్లీశ్వరి, హరిబాబు అక్కడికి వచ్చి, జనాన్ని చెదరగొట్టారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పెకైత్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఫైరింజన్‌ను రప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement