
మంగళగిరి : మంగళగిరి – తాడేపల్లి జాతీయ రహదారిపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన మహిళా అఘోరీ సోమవారం హల్‌చల్ చేసింది. పుర్రెలు మెడలో ధరించి, దిగంబరంగా ఆటో నగర్‌లోని తన కారు సర్వీస్ సెంటర్‌కు వెళ్లింది. కారు సర్వీస్ చేస్తుండగా ఓ జర్నలిస్టు అఘోరీని ఫొటో తీశారు.
దీంతో ఆగ్రహించిన అఘోరీ జర్నలిస్టుపై దాడి చేసి, గాయపరచింది. అతడు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతలో మరికొంత మంది జర్నలిస్టులు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీయడంతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని అఘోరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment