female
-
మాట వినకుంటే ఉద్యోగం ఫట్
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టుల పేరుతో పాతుకుపోయిన వ్యక్తులు రాజకీయ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పిందే వేదంగా పనిచేస్తేనే ఉద్యోగంలో ఉంటారంటూ హుకుం జారీ చేస్తూ.. ఏ ప్రజాప్రతినిధి, అధికారీ తమను ఏం చేయలేరంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో దారుణాలు జరుగుతున్నాయని, తమ కుటుంబాల పోషణ, ఉపాధి కోసం భరించాల్సి వస్తోందంటూ మహిళా సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ కోసం కాంట్రాక్ట్ సిబ్బందిగా చేరితే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఘొల్లుమంటున్నారు. సిబ్బంది అంతా కాంట్రాక్టర్ చేతుల్లో ఉంటారనీ.. తమ పరిధిలోకి రారంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసుల్లో పురోగతి కరువు ఏలూరు నగరానికి చెందిన ఓ దళిత మహిళ ఏలూరు జీజీహెచ్‌లో శానిటేషన్ సిబ్బందిగా చేరింది. కొన్నిరోజులు సాఫీగానే ఉండగా.. కాంట్రాక్ట్ విభాగంలోని కీలక వ్యక్తి, మరికొందరు కన్ను ఆమెపై పడింది. ఆమెను వేధింపులకు గురిచేయటం ప్రా రంభించారు. తమ మాట వినకుంటే రాత్రి డ్యూ టీలు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పిలిస్తే రావాల్సిందేనంటూ వేధించటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో కేసును పురోగతి లేకుండా వదిలేశారు. ఇదే తరహాలో మరో ఇద్దరు మహిళలు కేసులు పెట్టేందుకు సిద్ధపడగా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనీ, కేసులు పెట్టినా తమను టచ్ చేసేవారు లేరంటూ సదరు వ్యక్తులు బెదిరించారు. కుటుంబ పోషణకు ఈ పనిలో చేరామని, బయట తెలిస్తే పరువుపోతుందంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహస్య విచారణ చేయించాలిఏలూరు జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే ఒక దళిత మహిళపై ఆస్పత్రిలో కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ఇదే తరహాలో మరో మహిళను వేధించటంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. జీజీ హెచ్లో చాలా కాలంగా పనిచేస్తున్న దళిత సి బ్బందిని సైతం వేధింపులకు గురిచేస్తూ వారిపై తప్పుడు ఆరోపణలు చేయించి ఉద్యోగాల్లో లే కుండా చేస్తున్నారని, అతడిపై రహస్య పోలీస్ వి చారణ చేయిస్తేనే మరిన్ని కీచక పర్వాలు వెలుగులోకి వస్తాయని బాధితులు అంటున్నారు. మాట వినకుంటే ఉద్యోగం ఫట్ జీజీహెచ్‌లో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పలువురు పేద మహిళలు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. శానిటేషన్‌లో 120 మంది వరకు మహిళలు ఉన్నారు. సెక్యూరిటీ విభాగంలో 56 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో 30 మంది వరకు మహిళలు ఉన్నారు. ఒక్కో సిబ్బందికి వేతనం రూ.16 వేల వరకూ ఉండగా కటింగ్‌లు పోను రూ.13 వేల వరకు చేతికి అందుతుంది. రెండు, మూడు రోజులు అనారోగ్యంతో విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నిలుపుకునేందుకు వేలల్లో సమరి్పంచుకోవాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులకు నచ్చితే రాత్రి డ్యూటీలు ఉండవని, టైమ్‌కు డ్యూటీకి రాకున్నా పర్వాలేదని, లేకుంటే జీతం కట్.. ఉద్యోగం ఊడటం ఖాయమని పలువురు ఆవేదన చెందుతున్నారు. -
పారా గ్లైడింగ్‌లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
పనాజీ: పారాగ్లైడింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే పారాగ్లైడింగ్ విషయంలో అప్పుడప్పడు ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పర్యాటకులు ప్రమాదాలు బారిన పడుతుంటారు.తాజాగా ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పారాగ్లైడింగ్(Paragliding) చేస్తున్న మహిళా పర్యాటకురాలితో పాటు కోచ్ మృతిచెందాడు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కేరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.ఈ దుర్ఘటనలో పూణే నివాసి శివానీ డేబుల్ ఆమె శిక్షకుడు సుమన్ నేపాలీ (26) మృతిచెందారని, డేబుల్ పారాగ్లైడింగ్ కోసం బుకింగ్ చేసుకున్న 'అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ' చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. పారాగ్లైడర్ టేకాఫ్ అయిన వెంటనే అది లోయలో పడిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఉదంతంలో కంపెనీ యజమాని శేఖర్ రైజాదాపై మాండ్రేమ్ పోలీస్ స్టేషన్(Mandrem Police Station)లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారుఈ కేసులో కంపెనీతో పాటు దాని యజమానిపై నేరపూరిత హత్య కేసు నమోదు చేసినట్లు గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారి పరేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు శేఖర్ రైజాదా ఉద్దేశపూర్వకంగా పైలట్‌కు లైసెన్స్ లేకుండా పారాగ్లైడింగ్ నిర్వహించడానికి అనుమతించాడు. ఫలితంగా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం -
సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!
రాజస్థాన్(Rajasthan)కి చెందిన బిష్ణోయ్ తెగ(Bishnoi community) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంతా పర్యావరణ యోధులు. వారి జీవన విధానమే పచ్చదనంతో మమేకమై ఉంటుంది. వన్యప్రాణులకు హాని కలిగించిన జీవన విధానం వారి సొంతం. అలాంటి కమ్యూనిలో తొలి ఐఎస్ అధికారిణిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన అమ్మాయి కాస్త అందరికి పెద్ద షాకిచ్చేలా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఎవరామె..? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..రాజస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందిన పరి విష్ణోయ్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏస్ అధికారిణిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసుల్లోనే ఈ ఘనత సాధించింది. అయితే ఆమె విజయ తీరాలను అంత సులభంగా చేరుకోలేదు. ఫిబ్రవరి 26, 1996న బికనీర్‌లోని కక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్ణోయ్ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరామ్ బిష్ణోయ్ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్ణోయ్ పోలీసు అధికారి. ఆమె ఇంటర్ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించింది. దీంతోపాటు అజ్మీర్‌లోని ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుండేది. అలా ఆ ఒక్క యూపీఎస్సీ తోపాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్ జెఆర్ఎఫ్ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది. అయితే సివిల్స్ ఎగ్జామ్ తొలి రెండు ప్రయత్నాలలో పరి ఘోరంగా విఫలమైంది. మూడో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక పరి తన జీవన శైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేగాదు ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాక్ ఇస్తూ..2023లో పరి విష్ణోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. భవ్య బిష్ణోయ్ తండ్రి, కుల్దీప్ బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు. తొలుత 2022లో సహజవాయువు మంత్రిత్వశాఖ(Ministry of Natural Gas)లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్‌టక్(Gangtok)లో ఎస్డీఎంగా పనిచేసింది. ప్రస్తుతం హార్యానాలో సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!) -
స్వరంతో కోట్లు సంపాదించిన గాయనీమణులు వీరే! (ఫోటోలు)
-
స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులు
ధనికుల జాబితాలో చోటు సంపాదించుకోవడంలో వ్యాపారవేత్త(BusinessMan)లతో సమానంగా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ముందుంటున్నారు. అందులో భారతీయ మహిళా గాయకుల(Singers)కు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని సర్వేల ప్రకారం భారత్‌లోని ధనిక మహిళా గాయకుల జాబితా కింది విధంగా ఉంది. ఇందులో లాతా మంగేష్కర్, తులసీ కుమార్, శ్రేయాఘోషల్, సునిధి చౌహాన్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది.టాప్ ధనిక భారతీయ మహిళా గాయకులు, వారి ఆస్తుల(Asset) విలువ కింది విధంగా ఉంది.లతా మంగేష్కర్ రూ.368 కోట్లుతులసి కుమార్ రూ.210 కోట్లు శ్రేయా ఘోషల్ రూ.185 కోట్లు సునిధి చౌహాన్ రూ.100-110 కోట్లు నేహా కక్కర్ రూ.104 కోట్లు ఆశా భోంస్లే రూ.80-100 కోట్లు అల్కా యాగ్నిక్ రూ.68 కోట్లు మోనాలీ ఠాకూర్ రూ.25 కోట్లుపలక్ ముచ్చల్ రూ.8-9 కోట్లుఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?సంపద పెరగాలంటే భవిష్యత్తులో మంచి రాబడి ఇచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా రియల్ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు.. వంటి చాలా మార్గాలు సంపదను పెంచుతాయని చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని మృతి
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం. ఇష్టమైన వ్యక్తితో వివాహం. బంగారం లాంటి ఇద్దరు సంతానం. అన్నీ సాఫీగా సాగుతున్న ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. వేరే వాహనం చేసిన తప్పునకు ఆమె జీవితం బలైపోయింది. ఏడాది కిందటి వరకు చిత్తూరులో టీచర్‌గా పనిచేసిన ఆమె ఇంటికి దగ్గరగా ఉండాలని కోరి మరీ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కానీ అంతలోనే విధి వెక్కిరించి ఆమెను తీసుకెళ్లిపోయింది. టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి మండలం సన్యాసిపేట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంపతిరావు త్రివేణి(30) మృతి చెందా రు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన త్రివేణి చిత్తూరు జిల్లాలో పనిచేస్తుండేవారే. ఏడాది కిందటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని టెక్కలి మండలం సన్యాసిపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఆమె స్వగ్రామం నుంచి పాఠశాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. తిమ్మాపురం నుంచి కోటబొమ్మాళి వరకు బస్సులో వచ్చి.. అక్కడ ఉంచిన తన స్కూటీపై బడికి వెళ్లేవారు. బుధవారం కూడా కోటబొమ్మాళి నుంచి తన పాఠశాలకు వెళ్లేందుకు గాను టెక్కలి వైపుగా స్కూటీపై బయల్దేరారు. అదే సందర్భంలో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఏపీ 39 జేక్యూ5568 నంబర్ గల కారు జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వెళ్తున్న త్రివేణి బండిని ఢీకొని అప్రోచ్ రోడ్డులోకి వెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న టెక్కలి మండల ఎంఈఓలు తులసీరావు, చిన్నారావు మృతదేహాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయురాలి మృతిపై పలు ఉపాధ్యాయ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. త్రివేణి ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. టీచర్ చనిపోయారని తెలిసి సన్యాసిపేట వాసులు ఘట నా స్థలానికి చేరుకుని రోదించారు. కోటబొమ్మాళి ఎస్ఐ బి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పిల్లలను అంగన్వాడీలో ఉంచి..ఆమదాలవలస: మున్సిపాలిటీ ఒకటో వార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని సంపతిరావు త్రివేణి (30) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పెద్ద కుమార్తె చైత్ర, చిన్న కుమార్తె ఇషికలను అంగన్వాడీ కేంద్రంలో విడిచిపెట్టి ఆమె స్కూల్‌కు బయల్దేరారు. అంతలోనే ఆమె చనిపోయారన్న వార్త తెలియడంతో భర్త సింహాచలంతో పాటు స్థానికులు నిశ్చేషు్టలయ్యారు. సాయంత్రానికి అమ్మ వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న ఆ చిన్న పిల్లలను చూసి కంట తడి పెట్టారు. వడ్డీ ఆశచూపి.. నట్టేట ముంచి.. -
ట్రాన్స్జెండర్లూ మహిళలేనా?
మహిళ అంటే ఎవరు? ఒక వ్యక్తి స్త్రీ అని నిర్ధారించేందుకు ప్రాతిపదిక ఏమిటి? జన్మతః సంక్రమించిన లైంగికత మాత్రమేనా? లింగ మార్పిడితో మహిళగా మారిన వాళ్లు కూడా ‘స్త్రీ’అనే నిర్వచనం కిందకు వస్తారా? తద్వారా మహిళలకు వర్తించే హక్కులన్నీ వారికీ వర్తిస్తాయా? అత్యంత సంక్లిష్టమైన ఈ అంశాలను తేల్చాల్సిన బాధ్యత బ్రిటన్ సుప్రీంకోర్టుపై పడింది. అతి వివాదాస్పదమైన ఈ అంశంపై జోరుగా కోర్టులో వాద వివాదాలు జరుగుతున్నాయి. ఒకరకంగా ‘మహిళ వర్సెస్ మహిళ’అని చెప్పదగ్గ న్యాయపోరాటం జరుగుతోంది. స్త్రీగా గుర్తింపు సర్టిఫికెట్ ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని సమానత్వ చట్టాల ప్రకారం మహిళగా పరిగణించవచ్చా, లేదా అన్నది ఈ కేసు. బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు దీనిపై మంగళవారం లోతైన వాదనలు సాగాయి. అవి బుధవారమూ కొనసాగాయి. ఇక న్యాయమూర్తులు తీర్పు వెలువరించడమే మిగిలింది. అందుకు రెండు వారాలు పట్టవచ్చు. రాబోయే తీర్పు బ్రిటన్‌తో పాటు ప్రపంచమంతటా లింగమార్పిడి ద్వారా మహిళలుగా మారిన వారి గుర్తింపును, హక్కులు తదితరాలపై ఎంతగానో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఏమిటీ కేసు? నిజానికి మహిళా హక్కుల ఉద్యమకారులకు, స్కాట్రండ్ ప్రభుత్వానికి దీర్ఘకాలంగా సాగుతున్న వివాదమిది. స్కాట్లాండ్ ప్రభుత్వ రంగ సంస్థళ బోర్డుల్లో 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా 2018లో అక్కడి ట్లాండ్ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. లింగమారి్పడి ద్వారా మహిళలుగా మారిన వారిని కూడా ఈ చట్టం ప్రకారం ‘స్త్రీ’నిర్వచన పరిధిలో చేర్చారు. దీన్ని స్కాటిష్ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ‘మహిళ’ను పునరి్నర్వచించే అధికారం పార్లమెంటుకు లేదన్నది వారి వాదన. ‘‘ఈ చట్టం అమలైతే బోర్డుల్లో 50 శాతం మంది పురుషులతో పాటు మిగతా 50 శాతం కూడా మహిళలుగా మారిన పురుషులే ఉంటారు. అది మహిళా ప్రాతినిధ్య లక్ష్యాలకే గొడ్డలిపెట్టు’’అని ‘ఫర్ విమెన్ స్కాట్లాండ్’(ఎఫ్‌డబ్ల్యూఎస్) అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అంటోంది. అంతిమంగా ఇది మహిళల రక్షణకూ విఘాతమమేనన్ని వాదిస్తోంది. ఈ చట్టాన్ని స్కాట్లాండ్ కోర్టులో సవాలు చేయగా చుక్కెదురైంది. ఈ కేసును కోర్టు తిరస్కరించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడానికి గతేడాది అనుమతించింది. అలా బంతి బ్రిటన్ సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం: ఆమ్నెస్టీ సమానత్వ చట్టం ప్రకారం లైంగికత తల్లి గర్భంలోనే నిర్ణయమవుతుందని ఎఫ్‌డబ్ల్యూఎస్ తరపు న్యాయవాది అంటున్నారు. పుట్టిన అనంతరం దాన్ని మార్చడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. దీనితో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా పలు మానవహక్కుల సంఘాలు విభేదిస్తున్నాయి. ‘‘జెండర్ అనేది శారీరక వ్యక్తీకరణ. లింగ గుర్తింపు సరి్టఫికెటున్న ట్రాన్స్జెండర్లకు మహిళల హక్కులను నిషేధించడం మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధం’’అని అవి అంటున్నారు. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని బ్రిటన్ సుప్రీంకోర్టును ఆమ్నెస్టీ లిఖితపూర్వకంగా కోరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రేజీ.. డీజే..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్‌తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్‌కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు. ‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్‌లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్‌టైమ్ డీజేయింగ్ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్‌ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్‌లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా.. ‘నేను ఇక్ఫాయ్లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో క్లబ్స్‌కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్‌లో తన మ్యూజిక్‌ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.‘ఫ్లో లో.. ‘జో’రుగా.. ‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్‌లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్‌లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్‌ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు. ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు! -
ఐపీఎల్ మెగా వేలం-2025: ఎవరీ మల్లికా సాగర్? (ఫొటోలు)
-
అఘోరీ హల్చల్
మంగళగిరి : మంగళగిరి – తాడేపల్లి జాతీయ రహదారిపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన మహిళా అఘోరీ సోమవారం హల్చల్ చేసింది. పుర్రెలు మెడలో ధరించి, దిగంబరంగా ఆటో నగర్‌లోని తన కారు సర్వీస్ సెంటర్‌కు వెళ్లింది. కారు సర్వీస్ చేస్తుండగా ఓ జర్నలిస్టు అఘోరీని ఫొటో తీశారు. దీంతో ఆగ్రహించిన అఘోరీ జర్నలిస్టుపై దాడి చేసి, గాయపరచింది. అతడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతలో మరికొంత మంది జర్నలిస్టులు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీయడంతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని అఘోరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
మండే కండలు
తల్లిదండ్రులు లేరు. అండ దండలు లేవు. నానమ్మ నేటికీ పల్లెలో ఆకుకూరలు అమ్ముతుంది. కాని 24 ఏళ్ల ఎస్తేర్ రాణి గుంటూరు జిల్లా వేమూరు నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా బాడీబిల్డర్ అయ్యింది. ఇటీవల చెన్నైలో జరిగిన‘మిస్టర్ అండ్ మిస్ హిందూస్తాన్’ పోటీలో గోల్డ్‌మెడల్ సాధించింది. హైదరాబాద్‌లో జిమ్ ట్రయినర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎస్తేర్ ఏ సాయం అందక గుండె మండుతోందని అంటున్నది.ఎస్తేర్ 2021లో గుంటూరు జిల్లా వేమూరు నుంచి హైదరాబాద్ వచ్చింది. కేవలం ఇంటర్ వరకూ చదువుకుంది. ఏదో ఒక పని చేయాలనుకుంటే ఏం చేయాలో తెలియలేదు. ఆమెకు సిటీలో ఎవరూ తెలియదు. స్కూల్లో కాలేజీలో అథ్లెటిక్స్‌లో మంచి ్రపావీణ్యం ఉంది. హామర్ త్రోలో నేషనల్స్ వరకూ వెళ్లింది. ఆ ఫిట్నెస్ వల్ల జిమ్‌లో పనికి కుదిరి ట్రయినర్‌గా మారింది. ‘‘కొద్దిపాటి జీతం. గుర్తింపు లేని పని. ‘ఏదైనా సాధించాలనే నా తపనకు ఆ పని సరిపోలేదు. ఆ సమయంలోనే మహిళా బాడీ బిల్డర్ల మీదకు నా దృష్టి వెళ్లింది. జాతీయస్థాయి కాంపిటీషన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు కూడా లేకపోవడాన్ని గమనించాను. ఇదే ఎందుకు నేను సాధించకూడదు అని భావించి ఎవరికీ చెప్పకనే ఎవరి అంగీకారం లేకనే నాకై నేనుగా కృషి చేసి ఎదిగాను’ అంటుంది ఎస్తేర్.అన్నీ ఆటంకాలేమహిళా బాడీగార్డ్ కావాలంటే పర్సనల్ ట్రయినర్ ఉండాలి. అందుకు నెలకు పది వేల నుంచి భారీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదీగాక నిర్దిష్ట డైట్ తీసుకోవాలి. రోజుకు కనీసం 7 గంటలు వర్కవుట్స్ చేయాలి. అవన్నీగాక మహిళలు బాడీ బిల్డింగ్ చేసే సమస్యలు అనేకం ఉంటాయి. ‘అయినా సరే అప్పుచేసి కండలు పెంచాను. రెండేళ్లలోనే తగినట్టుగా తయారయ్యి మొన్నటి సెప్టెంబర్‌లో వరల్డ్ ఫిట్నెస్ ఫెడరేషన్ (డబ్లు్య.ఎఫ్.ఎఫ్) నిర్వహించిన నేషనల్స్ బాడీబిల్డింగ్ పోటీల్లో ‘స్పోర్ట్స్ మోడల్’ కేటగిరీలో ద్వితీయస్థానంలో రజత పతకం సాధించాను.ఆ ఉత్సాహంతోనే ఈనెల 9,10 తేదీల్లో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డబ్లు్య.ఎఫ్.ఎఫ్ నిర్వహించిన ‘మిస్టర్ అండ్ మిస్ హిందూస్తాన్ ’ బాడీబిల్డింగ్ ఫిట్నెస్ చాంపియన్ షిప్ అండ్ మోడల్స్’ పోటీల్లో ‘మిస్ ఫిగర్’ కేటగిరీలో ప్రథమ స్థానంలో బంగారు పతకం గెలుచుకున్నాను. నా కేటగిరిలో దేశవ్యాప్తంగా పోటీ ఉన్నా నాకు స్వర్ణం రావడం మర్చిపోలేను’ అంటుంది ఎస్తేర్.దొరకని సాయంబాడీ బిల్డింగ్‌లో నిరంతర సాధన ఉండాలి. రోజుకు తీసుకునే ఆహారానికే 1500 నుంచి రెండు వేలు ఖర్చు అవుతుంది. ‘ఉద్యోగం చేస్తే సాధన మిస్ అవుతుందని ఫ్రీలాన్స్ జిమ్ ట్రయినర్‌గా పని చేస్తున్నాను. ఆసియా స్థాయి, ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ వరకూ వెళ్లాలని నా కల. ఊళ్లో మా నానమ్మ నేటికీ ఆకుకూరలు అమ్ముతుంది. మాకు సరైన తిండి లేదు. నా తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదు. మహిళా బాడీ బిల్డింగ్ అంటే ఎన్నో సవాళ్లు.బంధువులు అందరూ నన్ను నిరోధించారు. అబ్బాయిగా మారిపోయానని సందేహించారు. ఇలా అయితే ఎవరు పెళ్లి చేసుకుంటారన్నారు. కాని నా గెలుపులను చూసి వారు ఇప్పుడు సంతోషిస్తున్నారు. మన సమాజంలో స్త్రీ తన శరీరాన్ని సరైన వస్త్రధారణలో ఉంచుకోవాలి. అందుకే ఎక్కువమంది స్త్రీలు ఆ రంగంలోకి రారు. ఏదైనా సాధించాలని వచ్చిన నావంటి వారిని ఎంకరేజ్ చేయడం ప్రభుత్వ బాధ్యత. అందరికీ అదే నా విన్నపం’ అంది ఎస్తేర్. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి‘మహిళా బాడీబిల్డింగ్‌లో ఉత్తర భారతదేశం వారు ముందంజలో ఉన్నారు. మనకు ప్రతిభ ఉన్నా పైస్థాయిలో మనల్ని ముందుకు తీసుకెళ్లేవారు లేరు. మçహారాష్ట్ర, హర్యాణ మహిళా బాడీబిల్డర్లు ఎంతో సౌకర్యంగా కెరీర్లో రాణిస్తున్నారు’ – ఎస్తేర్ -
పెంపుడు కుక్కపిల్లలు మృతి..
అన్నానగర్: కాంచీపురంలో పెంపుడు కుక్క పిల్లలు మురుగు కాలువలో పడి మృతి చెందడంతో భర్తతో ఏర్పడిన గొడవతో మహిళా హెడ్‌కానిస్టేబుల్ శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాంచీపురం తిరువీధి పల్లంకి చెందిన దిగేశ్వరన్. ఇతని భార్య గిరిజ(42). ఈమె చెంగల్పట్టు ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో హెడ్ కానిస్టేబుల్. దిగేశ్వరన్ మధురవాయల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు లేకపోవడంతో కుక్కను పెంచుకున్నారు. పెంపుడు కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. వీటిలో రెండు సమీపంలోని కాలువలో పడి మృతిచెందాయి. ఈ విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గిరిజ శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
మహిళా బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య
జ్యోతినగర్ (రామగుండం): పెద్దపల్లి జిల్లా ఎనీ్టపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన మహిళా బీఎస్ఎఫ్ జవాన్ బల్లా గంగాభవాని (26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ దంతివాడలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. శనివారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. గంగాభవాని విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు ఆమె నివాసం ఉండే గదికి చేరుకుని చూశారు. గది తలుపులు వేసి ఉండటంతో వాటిని పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా, ఆత్మహత్య చేసుకుని కనిపించారు. రామగుండం ఎన్టీపీసీ సుభాష్ గర్‌లో నివాసం ఉంటున్న బల్ల సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతుల కుమార్తె గంగాభవానికి 2021లో బీఎస్ఎఫ్లో ఉద్యోగం లభించింది. తొలుత ఆమె పశి్చమబెంగాల్లో పనిచేశారు. ఇటీవల గుజరాత్‌లోని గాం«దీనగర్ దంతివాడకు బదిలీపై వెళ్లారు. గతనెల 5వ తేదీన నుంచి 24వ తేదీ వరకు సెలవుపై రామగుండం వచ్చిన గంగాభవాని.. ఈనెల రెండో తేదీన తిరిగి విధుల్లో చేరారు. అయితే, అక్కడ రోజూ 18 గంటల పాటు డ్యూటీ చేయాల్సి వస్తోందని, ఆరు గంటలే విశ్రాంతి ఉంటోందని ఇటీవల తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. ‘అమ్మా.. నాన్న.. ఈ ఉద్యోగం చేయలేను.. ఇక్కడ ఉండలేను’అని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచి్చనట్లు తెలిసింది. దీంతో ఇబ్బందిగా ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రావాలని చెప్పామని, ఇంతలోనే తమ కూతురు ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. గంగాభవాని మృతదేహాన్ని ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడినుంచి కుటుంబసభ్యులు స్వస్థలానికి తీసుకొచ్చారు. -
‘మహాలక్ష్మి’ దెబ్బకు కొత్త కేటగిరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు డిపోలకు చేరాయి. త్వరలో వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడంతో ఆర్టీసీకి టికెట్ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వం.. పూర్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేయలేకపోతోంది. ఇప్పటివరకు రీయింబర్స్ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ. 610 కోట్లు బకాయిపడింది. ఇది ఆర్టీసీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించనుంది.ఎక్స్‌ప్రెస్ కన్నా కాస్త ఎక్కువ టికెట్ ధరతో.. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీకి బాగా ఆదాయాన్ని తెచి్చపెట్టేవి ఎక్స్‌ప్రెస్ బస్సులే. అందుకే వాటి సంఖ్య మిగతావాటి కంటే చాలా ఎక్కువ. కానీ మహిళలకు పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాలను అమలు చేస్తుండటంతో సంస్థ ఆదాయం సగానికి సగం పడిపోయింది. డీలక్స్ కేటగిరీ బస్సులున్నా వాటికి ఆదరణ తక్కువే. అందుకే వాటి సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంది.ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్ కంటే వాటిల్లో టికెట్ ధర 5–6 శాతం ఎక్కువగా, డీలక్స్ కంటే 4 శాతం తక్కువగా ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే సీట్లు కూడా మెరుగ్గా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉన్న రూట్లలో వాటిని తిప్పాలని నిర్ణయించారు. ఉచిత ప్రయాణ వసతితో బస్సుల్లో మహిళల సంఖ్య బాగా పెరిగి పురుషులకు సీట్లు దొరకటం కష్టంగా మారింది.దీంతో పురుషుల్లో దాదాపు 20 శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాలకు మళ్లుతున్నారని ఇటీవల ఆర్టీసీ గుర్తించింది. ఇప్పుడు అలాంటి వారు ఈ బస్సులెక్కుతారని భావిస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూసే మహిళా ప్రయాణికుల్లో 10–15 శాతం మంది ఈ బస్సులెక్కే సూచనలున్నాయని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ కంటే తక్కువ స్టాపులు ఉండటంతో ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు సెమీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.ఆ సర్వీసు మళ్లీ పునరుద్ధరణగతంలో సిటీలో మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులు తిరిగేవి. బస్సులు పాతబడిపోవటంతో వాటిని తొలగించారు. తర్వాత ప్రారంభించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించబోతున్నారు. నగరంలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉంది. దీంతో టికెట్ ఆదాయం బాగా పడిపోయింది. ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయాల్లో కొందరు మహిళలు కూడా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారు ఈ కొత్త కేటగిరీ బస్సులెక్కే వీలుంటుంది. వెరసి వీటి వల్ల ఆదాయం ఎక్కువే ఉంటుందని భావిస్తున్న సిటీ అధికారులు.. 300 బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తున్నారు. -
యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ ..బడ్జెట్ బాధ్యత ఆమెదే..!
గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మెజారిటీ ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా 45 ఏళ్ల రాచెల్ రీవ్స్ నియమితులయ్యారు. ఆమె ఇప్పుడు బడ్జెట్‌కు బాధ్యత వహిస్తున్నారు. ఆమె ఈ అత్యన్నత పదవిని దక్కించుకుని..తన కెరీర్లోనూ,యూకే చరిత్రలోనూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. యూకే కొత్త ప్రధాని కైర్ స్టార్మర్ ద్వారా ఈ అత్యున్నత పదవీలో నిమితులయ్యారు రీవ్స్. ఈ మేరకు రీవ్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా..ఖజానకు ఛాన్సలర్‌గా నియమించడబడటం తన జీవితంలోని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అన్నారు. ఎవరీ రాచెల్ రీవ్స్..?లండన్ బోరో లెవిషామ్‌లోని విద్యావేత్తలకు ఫిబ్రవరి 13, 1979న జన్మించిన రీవ్స్ ఎల్లప్పుడూ సమగ్ర విద్యను నేర్చుకోవడం పట్ల అత్యంత ఆసక్తి కనబర్చేది. ఆమె న్యూ కాలేజీ ఆక్స్‌ఫర్డ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం రీవ్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో దాదాపు ఒక దశాబ్దం పాటు ఆర్థికవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ రంగానికి మారారు. రీవ్స్ 2021లో లేబర్ ఫైనాన్స్ పాలసీ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న స్టార్మర్ వద్ద షాడో ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా పని చేశారు. అంతేగాదు ఆమె అనేక చెస్ ఛాంపియన్షిప్ టైటిళ్లను కూడా గెలుచుకుంది. తన తండ్రి ప్రభావంతో రాజకీయాలవైపు మొగ్గు చూపారు రీవ్స్. అలా 2010లో లిబరల్ డెమోక్రాట్లతో సంకీర్ణంలో కన్జర్వేటివ్‌లు అధికారంలోకి వచ్చినప్పుడు, రీవ్స్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని లీడ్స్ వెస్ట్‌కు లేబర్ ఎంపీగా ఎన్నికయ్యారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత స్టార్మర్ ఆమెను లేబర్ ఆర్థిక ప్రతినిధిగా నియమించారు. అలాగే ఆమె సోదరి ఎల్లీ రీవ్స్ కూడా లేబర్ పార్టీ ఎంపీ.ప్రస్తుతం రీవ్స్ యూకే తొలి మహిళా ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా మందగమన వృద్ధి, అధిక రుణాలు, అత్యధిక పన్ను భారం వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంది. ఆమె వీటన్నింటిని అధిగమించేలా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాల పట్ల నిబద్ధత వ్యవహరించి ఆర్థిక పాలనా ప్రపంచంలో మంచి విజయం సాధించాలనే సంకల్పంతో ఉంది రాచెల్ రీవ్స్.(చదవండి: సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..) -
మహిళా యూట్యూబర్ అరెస్టు
సాక్షి, చెన్నై: ఓ యువతి అనుమతి లేకుండా యూట్యూబ్ ఛానల్లో ఆమెకు సంబంధించిన వీడియోను అప్లోడ్ చేసిన వీరా టాక్ డబుల్ ఎక్స్ యూట్యూబ్ వ్యా ఖ్యాత వీజే శ్వేత, నిర్వాహకుడు రామ వీరప్పన్, కెమెరామెన్ యోగరాజ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లైక్‌లు, ప్రచారం కోసం యూ ట్యూబ్ ఛానళ్ల రూపంలో ఇష్టానుసారంగా వ్యవహరించే వారు రోజురోజుకూ అధికమైన విషయం తెలిసిందే. కొన్ని చానళ్లు మరీ అశ్లీలంగా మాట్లాడడం, జుగుప్స కలిగించే ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టడం, ఫ్రాంక్‌ల పేరిట వేధించడం పెరుగుతున్నాయి. ఈ కోవకు చెందిన వీరా టాక్ డబుల్ ఎక్స్ యూ ట్యూబ్ ఛానళ్ ఓ యువతి ప్రమేయం లేకుండా, ఆమె అనుమతి కూడా తీసుకో కుండా ఓ వీడియోను అప్లోడ్ చేసింది. ఈ వీడియో కారణంగా ఆయువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమాచారంతో కీల్పాకం పోలీసులు కేసు నమోదు చేశారు. యూ ట్యూబ్ ఛానల్‌కు చెందిన వీజే శ్వేత, నిర్వాహకుడు వలసరవాక్కంకు చెందిన రామ వీరప్పన్, కెమెరామెన్ యోగరాజ్‌ను బుధవారం అరెస్టు చేశారు. ఆ చానల్లో అశ్లీల వ్యాఖ్యలతో కూడిన వీడియోలు కోకొల్లలుగా ఉండడంతో ఆ ఛానల్‌ను సీజ్ చేయడానికి చర్యలు చేపట్టారు. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..
ఓ టీనేజ్ అమ్మాయి లండన్ ప్రిన్స్ చార్లెస్‌ని కలిసే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ఆయన చేతుల మీదుగా లండన్ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. ఎవరా యువతి, ఏం సాధించిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందని ఆర్తీ అనే 18 ఏళ్ల రిక్షా డ్రైవర్ లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన అమల్ కూన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డుని అందుకుంది. ఈ అవార్డు బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్ ట్రస్ట్చే స్పాన్సర్ చేయబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఇంగ్లీష్ బారిస్టర్ అమల్ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తీ ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతులను ప్రేరేపించినందుకుగానూ ఆమెకు ఈ లండన్ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పింక్ రిక్షా ఇనిషియేటివ్ అంటే..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఇది రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మహళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధలన గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ముఖ్యంగా వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు. చెప్పాలంటే యూపీలో ఆమె తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్ కూడా. చాలా చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికిగానూ ఈ ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టాయి. " అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీపుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది" ప్రిన్స్ ట్రస్ట్. ఆర్తీ తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్‌గా ఎలా మారిందంటే..ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ఆర్తీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నా. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించింది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలన కూడా నెరవేర్చగలుగుతున్నాను. ఈ చోరవే నాకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్‌ని కలిసే అవకాశం లభించేలా చేసింది.ఇది ఒక అద్భుతమైన అనుభవంగా పేర్కొంది ఆర్తీ . అంతేగాదు చార్లెస్ తనకు ఈ రిక్షా డ్రైవింగ్ పట్ల ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. ఆయనతో ఆర్తి తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహానం అని గర్వంగా చెప్పుకొచ్చింది కూడా. ఐదేళ్ల కుమార్తె ఉన్న ఆర్తీ ఇలాంటి సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొని ఇతర బాలికలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. (చదవండి: 'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?) -
21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని స్పష్టమైంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువ మంది ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ గణాంకాలు పేర్కొన్నాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు, హిందూపురం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే మహిళలు కన్నా పురుషులు స్వల్పంగా ఎక్కువగా ఓటేశారు. కాకినాడ, అనంతపురం లోక్‌సభ స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువగా ఓటేసినా.. తేడా మాత్రం స్వల్పంగానే ఉంది.మిగతా లోక్‌సభ స్థానాల్లో 11 వేల నుంచి 47 వేల వరకు మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయంటే సహజంగానే వైఎస్సార్సీపీకే మొగ్గు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే కారణమని వారు విశ్లేíÙస్తున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట పథకాలు మంజూరు చేయడంతో మహిళా ఓటింగ్ పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసిన విషయం తెలిసిందే.రాష్ట్రంలోని మహిళలందరూ మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే గట్టి పట్టుదలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారని సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల ఓట్లు ఎక్కువగా నమోదైన 21 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లన్నీ వైఎస్సార్సీపీకే పడ్డాయని, పోలింగ్ రోజు ఇది స్పష్టంగా కనిపించిందని ఆ రాజకీయ నాయకులు చెబుతున్నారు.హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ఇస్త్రీ పనికి వెళ్లిన వారితో పాటు వివిధ రకాల చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వెళ్లిన మహిళలందరూ కూడా ఏపీ వెళ్లి వైఎస్సార్సీపీకే ఓటు వేశామని చెబుతున్నారు. ప్రభుత్వం వల్ల మేలు పొందిన వారందరూ ఎక్కడున్నా సరే పోలింగ్ రోజున రాష్ట్రానికి వచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఓటు వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆయుధంతో సహా మహిళా కానిస్టేబుల్ అదృశ్యం
బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అదృశ్యమయ్యారు. సీతామర్హిలో మే 20న జరిగిన ఐదో విడత పోలింగ్‌లో ఈ మహిళా కానిస్టేబుల్‌కు విధులను కేటాయించారు. అయితే ఆమె ఆయుధంతో పాటు అదృశ్యమయ్యారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ ఉదంతంపై స్థానిక పోలీసుశాఖలో చర్చలు జరుగుతున్నాయి.మహిళా కానిస్టేబుల్ సుభంతి కుమారి ఘాటో పోలీస్ స్టేషన్‌లోని డయల్ 112లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సీతామర్హిలో ఎన్నికల విధులలో కొన్ని భాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరారయ్యారు. ఆమె మొబైల్ ఫోన్ కంటిన్యూగా స్విచ్ ఆఫ్ చేసి ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ విషయమై సీతామర్హి ఎస్పీ సమస్తిపూర్ ఎస్పీకి లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి సమాచారం లేకుండా అదృశ్యమైన ఈ మహిళా కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా సమాచారం ప్రకారం ఈ మహిళా కానిస్టేబుల్ సమస్తిపూర్ పోలీస్ సెంటర్లో తన దగ్గరున్న ఆయుధాన్ని సమర్పించారు. ఉన్నతాధికారులు ఈ మహిళా కానిస్టేబుల్‌పై చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది. -
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
-
ఇది మాయని ‘మరక’ : లైంగిక వేధింపులపై వినూత్న నిరసన
ప్రపంచవ్యాప్తంగా బాలికలు,మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నం ప్రచారాన్ని చేపట్టింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్సైలెన్స్ ది వయలెన్స్’ అని పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికపై వేధింపుల హింస ఎన్నటికీ మాయని మచ్చ అనే అంశాన్ని విగ్రహాల రూపంలోప్రదర్శించడం విశేషం. మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శన చర్చ నీయాంశంగా నిలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటు న్నారని జర్మన్ మహిళా హక్కుల సంఘం టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. ఈ లైంగిక వేధింపులపై చాలామంది మౌనంగా ఉంటారని, ఈ మౌనమే మరో మహిళ వేధింపులకు దారి తీస్తోందని సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. “ప్రతీ నేరస్థుడు వేలమందికి కారణమవుతున్నాడు ఇకపై మహిళలపై లైంగిక వేధింపులను ఉపేక్షించవద్దు అప్రమత్తంగా ఉందాం. బాధితులకు అండగా నిలుద్దాం. కలిసికట్టుగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం’’ సినా టాన్ టెర్రే డెస్ ఫెమ్మెస్ బాలికలు ,మహిళలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ-నిర్దిష్ట వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతోంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యాలని హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాల్లో పేర్కొన్న మాదిరిగా లైంగిక వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. -
అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్ వీడియో వైరల్
నెమలి మన జాతీయ పక్షి. అందమైన అపురూపమైన పక్షి. ఆడ నెమలిని ఇంప్రెస్ చేసేందుకు మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. గున గున అడుగులేస్తూ ఆడ నెమలి వెంట తిరుగుతుంది. ఈ నాట్యం చేసేటప్పుడు తన పింఛాన్ని చుట్టూ వృత్తం లాగా చేస్తుంది. ఒక్కోసారి విసినకర్రలా వంచి అందంగా నాట్యం చేస్తుంది. ప్రేయసి సంతృప్తి చెంది, చెంతక చేరేదాకా మగ నెమలికి ఈ తిప్పలు తప్పవు. అకస్మాత్తుగా మబ్బులు కమ్మేసి, చినుకులు పడినపుడు, ప్రధానంగా వడగళ్లు పడినపుడు సంతోషంతో పింఛంతో మగ నెమలి చేసే నాట్యం వర్ణశోభితంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది కదా. తాజాగా గ్రేట్ ఆర్గస్ నెమలి ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు పాట్లు, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో దాదాపు 30 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. వాస్తవానికి ఈ వీడియో 2021లో ఫ్లోరిడాలోని బే లేక్‌లోని డిస్నీస్ యానిమల్ కింగ్‌డమ్‌లోని మహారాజా జంగిల్ ట్రెక్‌లో తీసింది. ఇపుడు మళ్లీ సందడి చేస్తోంది. ఈ తతంగం అంతా చూసి నెటిజన్లు చతురోక్తులతో స్పందిస్తున్నారు. ఇంత చేసినా అలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫన్నీ కమెంట్లు పెడుతున్నారు. A male Pheasant is trying to impress her but she is not impressed! 😂 pic.twitter.com/dqfAj2icz4 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 20, 2024 An incredible leucistic peacock! (Video Laurel Coons) pic.twitter.com/H0eO6ID6TM — Natural Science & History (@joehansenxx) March 20, 2024 This is so so beautiful 🦚🥰😍 pic.twitter.com/XHwbmH5lUC — Aisha Abbasi (@aisha_FCB) March 20, 2024 -
ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా 'పిచాయా పామ్'!
బ్యాంకాక్‌లోని పోటాంగ్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన చెఫ్ పిచాయా పామ్ సూన్టోర్నియానాకిజ్ 2024 సంవత్సరానికి ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్ ఆఫ్ ది ఇయర్‌గా టైటిల్‌ని గెలుచుకుంది. బ్యాంకాక్‌లో పెరిగిన థాయ్, చైనీస్ ,ఆస్ట్రేలియన్ చెఫ్ పిచాయా పొటాంగ్లో మంచి పేరుగాంచిన చెఫ్‌గా ప్రసిద్ధి చెందింది. తన పామ్ జాతి వారసత్వానికి గుర్తుగా థాయ్ చైనీస్ వంటకాలను హైలెట్ చేస్తోంది. ఆమె ఈ అవార్డుని మార్చి 26, 2024న కొరియాలోని సియోల్‌లో వేడుకగా జరగనున్న అవార్డుల ఫంక్షన్లో ఆ అవార్డుని తీసుకుంటారు. ఈ ఏడాదిలో ఓపెనింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలైన తొలి మహిళా చెప్గా పిచాయా పామ్ నిలిచింది. ఈ ఏడాది అవార్డులను ఉత్తమ రెస్టారెంట్లు, బెస్ట్ చెఫ్‌ల వారిగా విస్తృత జాబితాను చేసింది. గతేడాది ఆసియాలో 50 ఉత్తమ రెస్టారెంట్లలో ఆమె రెస్టారెంట్ 35వ స్థానంలో ఉండగా, ప్రపంచంలోనే 50 ఉత్తమ రెస్టారెంట్ జాబితాలో పిచాయ్ రెస్టారెంట్ 88వ స్థానానికి పరిమితమయ్యింది. 'పోటాంగ్ ' అంటే సింపుల్ అని అర్థం. ఆమె తన పామ్ జాతి వారసత్వాన్ని, కుటుంబ వృత్తి అయినా ఆయర్వేద వైద్యాన్ని ప్రతిబింబించేలా వంటలు చేస్తుంది. అంతేగాదు చైనాటౌన్ ఆధారిత రెస్టారెంట్ ఆమె కుటుంబానికి చెందిన హెర్బల్ ఫార్మసీని కూడా పునర్నిర్మించే పనిలో ఉంది. ఆమె ప్రధానంగా 'సాల్ట్, యాసిడ్, స్పైస్, టెక్స్చర్, మైలార్డ్ రియాక్షన్ వంటి ఐదు ఇన్‌గ్రేడియంట్స్ ఫిలాసఫి కచ్చితంగా ఉండేలా తన వంటల మెనూని రూపొందించింది. ఆమె వంటల మెనూ పురాతన సంప్రదాయల్ని మిళితం చేసేలా ఉంటుంది. అంతేగాదు పిచాయా అమెరికన్ ఉమెన్స్ క్లబ్ ఆఫ్ థాయిలాండ్ సహకారంతో సొంతంగా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉమెన్ ఫర్ ఉమెన్(డబ్ల్యూఎఫ్డబ్ల్యూ)ని కూడా ప్రారంభించింది. ఇది ఒక లాభప్రేక్ష లేని సంస్థ. దీని సాయంతో గ్రామీణ మహిళకు పాకశాస్త్రంలో నైపుణ్యాలను, మెళుకువలను నేర్పిస్తుంది. పిచాయా ఏళ్లుగా పాకశాస్త్రంలో తీసుకున్న శిక్షణ, తన కుటుంబ ప్రోత్సహాం, చిన్ననాటి నుంచి రుచుల సమ్మేళనాల గూర్చి విన్న కథలు, తదితరాలు తనను ప్రపంచ స్థాయిలో అందరూ మెచ్చుకునేలా వండే స్థాయికి తీసుకొచ్చాయని చెప్పుకొచ్చింది. అదే తనకు ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా స్థానం దక్కించుకునేలా చేసిందని చెప్పింది చెఫ్ పిచాయా. View this post on Instagram A post shared by Tatler Dining Hong Kong (@tatlerdininghk) (చదవండి: తేనెను నేరుగా వేడిచేస్తున్నారా? పాయిజన్‌గా మారి..) -
ఈ ఏడాది నిర్మాతలుగా డామినేట్ చేసిన మహారాణులు
‘అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తి కావాల్సిందే... ప్లాన్ తప్పకూడదు’ అని హుకుం జారీ చేయాలంటే చేసే పని మీద ప్రేమ, శ్రద్ధ... ఈ రెంటికీ మించి ధైర్యం, ఆత్మవిశ్వాసం లాంటివి కూడా ఉండాలి. ముఖ్యంగా ‘మేల్ డామినేటెడ్’ ఇండస్ట్రీస్‌లో ఒకటైన సినిమా పరిశ్రమలో ‘ఫీమేల్ప్రొడ్యూసర్’ రాణించాలంటే తెగువ కావాలి. అవసరమైనప్పుడు రాణిలా హుకుం జారీ చేయాలి. సున్నితంగా పనులు చక్కబెట్టడంతో పాటు కఠినంగానూ ఉండాలి. అలా రెండు రకాలుగా ఉంటూ... ‘మేం రాణిస్తాం’ అంటూ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి వచ్చిన కొందరు ఫీమేల్ ప్రొడ్యూసర్ క్వీన్స్ గురించి తెలుసుకుందాం. హీరోయిన్గా యాభైకి పైగా సినిమాలు చేశారు సమంత. అగ్రశ్రేణి నటిగా ప్రేక్షకులు కితాబులిచ్చారు.ఇప్పుడు ‘ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన కథలను ఈ నిర్మాణ సంస్థ వేదికగా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నామని సమంత పేర్కొన్నారు. ► ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రి బాటలో నిర్మాత అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఇప్పటికే 50కి పైగా సినిమాలు నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఇక ‘దిల్’రాజుప్రొడక్షన్స్ స్థాపించి ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ నిర్మించిన హన్షిత తొలిసారి ‘బలగం’ సినిమా నిర్మించి, బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకునిగా మారారు. ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నట్లు.. ‘బలగం’కి హర్షిత్ రెడ్డి మరో నిర్మాత. ఇక ఆ మధ్య రెండు చిత్రాలు ఆరంభించిన ఈ నిర్మాతలు మంగళవారం మరో చిత్రాన్ని ఆరంభించారు. ► ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ‘మ్యాడ్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 6న రిలీజై, హిట్‌గా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగా నవ్వించింది. తొలి చిత్రంతోనే అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు హారిక. ► తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. ఇక కూతురికి సినిమాలంటే ఫ్యాషన్. ఆ∙ఇష్టంతో ‘మంగళవారం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలి విజయం అందుకున్నారు స్వాతీ రెడ్డి. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా గత నెల 17న విడుదలై హిట్‌గా నిలిచింది. ► మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక (నాగబాబు కుమార్తె) అటు నటన, ఇటుప్రొడక్షన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ నిర్మించిన ఆమె తొలిసారి ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా యాదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయమవుతుండటం విశేషం. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ► శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసుతో కలిసి విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న విడుదలైన ఈ పొలిటికల్, పోలీస్ బ్యాక్‌డ్రాప్ మూవీ హిట్‌గా నిలిచింది. ► నటిగా, గాయనిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాతగా మారి, ‘కలశ’ చిత్రాన్ని నిర్మించారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొండ రాంబాబు దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. చిన్న బడ్జెట్ చిత్రమైనా కాన్సెప్ట్ బాగుందనిపించుకుంది. ► పాయల్ సరాఫ్కి సినిమా నేపథ్యం లేదు. అయితే నిర్మాత కావాలన్నది ఆమె కల. ‘భరతనాట్యం’ చిత్రంతో నిర్మాతగా మారారామె. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా, మీనాక్షీ గోస్వామి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ‘‘షూటింగ్ లొకేషన్లో అమ్మాయిలు తక్కువగా ఉంటారు. మనం అమ్మాయి అనే విషయాన్ని మరచిపోయి మన పని మనం శ్రద్ధ చేయగలిగితే సక్సెస్ గ్యారంటీ’’ అంటున్నారు పాయల్ సరాఫ్. -
సియాచిన్‌లో ‘నారీ పర్వం’
లేహ్/జమ్మూ: ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో ప్రప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీమ్ రికార్డు సృష్టించనున్నారు. మొదటిసారిగా ఆపరేషనల్ పోస్టులో భారత ఆర్మీ ఈమెను నియమించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని సియాచిన్‌లో బాధ్యతలు చేపట్టనున్న రెండో వైద్యాధికారి ఫాతిమా అని భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యురీ కార్ప్స్ మంగళవారం తెలిపింది. సైన్యంలో లింగసమానత్వం పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో కెప్టెన్ ఫాతిమా నియామకం ఒకటని తెలిపింది. సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో కఠోర శిక్షణ పొందిన ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ పోస్టులో బాధ్యతలు చేపడతారని వివరించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఈమె బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కెప్టెన్ గీతికా కౌల్‌ను సియాచిన్‌లో మొదటి మహిళా వైద్యాధికారిగా నియమించినట్లు ఈ నెల మొదటి వారంలో ఆర్మీ ప్రకటించింది. -
మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్,లక్షల ప్యాకేజిని వదిలి..
ఛావీ రాజావత్ రాజస్థాన్‌లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌గా వార్తల్లో నిలిచి, యుఎన్లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది. ‘‘2010లో తొలిసారి సర్పంచ్ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్‌లో కొన్ని పనులు పూర్తయ్యాయి. మా ఊరు తనవైపు లాగింది.. మా తాత బ్రిగేడియర్ రఘుబీర్‌సింగ్ 1990 వరకు సర్పంచ్‌గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్‌లోని మాయో కాలేజీ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడ్రన్ మేనేజ్మెంట్ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. మహిళకు రిజర్వ్ అని.. 2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్‌ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్‌ని అయ్యాను. వర్షపు నీటి సంరక్షణ ముందుగా ఊరి భవితవ్యాన్ని ఒంటరిగా మార్చలేమని, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అందరికీ స్పష్టంగా చెప్పాను. నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించాను. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, గ్రామాలను అనుసంధానించడం, కరువును ఎదుర్కోవడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు. గ్రామంలోని నీటివనరులన్నీ పూడికతో నిండిపొంయాయి. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి వనరుల్లో పూడిక మట్టిని తొలగించేందుకు లక్షల రూపాయలు సేకరించి, ఖర్చు చేశాం. మహిళలు ముందు గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు చెప్పేదాన్ని. మహిళల బృందం డిజైనర్ ల్యాంప్‌లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లప్రాధాన్యత నా ఎజెండాలో రోడ్లప్రాధాన్యత స్పష్టంగా ఉంచాను. ముందు ప్రైవేట్ బస్సుల సహాయం తీసుకున్నాను. బాలికల కోసం పాఠశాల, మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాను. మూతపడిన బి.ఎడ్ కాలేజీని స్వాధీనం చేసుకొని దానిని బాలికల చదువుకోసం కేటాయించాను. ఓ ప్రైవేట్ కంపెనీ 200 టేబుళ్లు, బెంచీలను అందజేసి మా వెన్ను తట్టింది. అందరికీ బ్యాంకు ఖాతా.. సర్పంచ్ అయిన ఐదేళ్లలోనే రోడ్లు, డ్రైన్లు, అందరికీ బ్యాంకు ఖాతా తెరిపించాను. ఎప్పుడూ ఫీల్డ్ వర్క్‌లోనే ఉండేదాన్ని. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల, చదువుప్రాముఖ్యతను వివరించేదాన్ని.. నా స్వభావం అందరినీ కలుపుకొని ఉంటుంది. ఐక్యరాజ్యసమితి 11వ ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించినప్పుడు మొదటిసారి భారతదేశం నుండి ఒక మహిళా సర్పంచ్‌గా దేశం తరపునప్రాతినిధ్యం వహించాను. ఇది నాకు గర్వంగా అనిపించింది. అక్కడ వారందరి మదిలో సర్పంచ్ అంటే తలపై ముసుగు వేసుకుని ఉన్న గ్రామస్థురాలు అనుకున్నారు. కానీ, నన్ను కార్పొరేట్ లుక్‌లో చూసి అందరూ ఆశ్చర్యపొంయారు. సోడా విలేజ్ అభివృద్ధికి డబ్బు కంటే వ్యక్తులు, అందరి సమష్టి కృషి అవసరం అని ఫోరమ్‌లో చెప్పాను. రెండుసార్లు సర్పంచ్‌గా నా విధులను నిర్వర్తించాను. తర్వాతి వారికి అవకాశాలు ఇవ్వాలని నేను మళ్లీ పొంటీ చేయలేదు. ఇప్పుడు హోటల్ని నిర్వహిస్తున్నాను. గుర్రపు స్వారీ వచ్చు కాబట్టి, ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని వివరిస్తుంది ఈ యంగ్ లీడర్. -
MP: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీర రాణా.. రెండో మహిళగా రికార్డ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వీర రాణా నియమితులయ్యారు. రాష్ట్ర సీఎస్‌గా గురువారం ఆమె అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. వీర రాణా ప్రస్తుతం మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు సార్లు పొడిగింపుల తర్వాత పదవీ విరమణ చేయనున్న అవుట్గోయింగ్ సీఎస్ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ స్థానంలో 1988 బ్యాచ్‌కు చెందిన వీర రాణా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బెయిన్స్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 మే 31 వరకూ మొదటిసారి పదవీ కాలాన్ని పొడిగించగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2023 జూన్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు మరోసారి పొడిగించారు. రెండో మహిళగా రికార్డ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళగా వీర రాణా రికార్డు సృష్టించారు. 1990వ దశకం ప్రారంభంలో మధ్యప్రదేశ్‌కు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి నిర్మలా బుచ్ నియమితులయ్యారు. ఈమె ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం బెయిన్స్‌కు వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఐబీపీఎస్‌లో రాష్ట్రానికి అత్యధిక సీట్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ ఆధారిత సేవలను విస్తరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియన్ బిజినెస్ ప్రమోషన్ స్కీమ్ (ఐబీపీఎస్)లో రాష్ట్రానికి అత్యధిక సీట్లు కేటాయించాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. గ్రామీణ భారతదేశంలో మహిళలకు ఉపాధిని పెంపొందించడంలో ఐబీపీఎస్ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా ఏపీలో మహిళలకు ఉపాధి లభించిందని తెలిపారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా నిర్వహించే ఈ పథకంలో కంపెనీలకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం నిధులను సమకూరుస్తుంది. ఐబీపీఎస్ ద్వారా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న పల్సస్ గ్రూపు 5,000 మందికి ఉపాధి కల్పించి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వీరిలో 4,000 మంది మహిళలే. రెండో విడత పథకం కింద రూ.41 కోట్లు పల్సస్ గ్రూపునకు ఎస్టీపీఐ విడుదల చేసింది. ఏపీలో ఐబీపీఎస్ సీట్లు పెంచాలని కోరుతూ పల్సస్ గ్రూప్ సీఈవో గేదెల శ్రీనుబాబు కూడా కేంద్ర మంత్రి చంద్రశేఖర న్కు వినతిపత్రాన్ని అందించారు. ఐబీపీఎస్‌తో ఉ పాధి కల్పన, తద్వారా ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యాన్ని అందించగలగడం తమకు దక్కిన గౌరవమని శ్రీనుబాబు చెప్పారు. దేశవ్యాప్త డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో తమకున్న సాటిలేని నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. పల్సస్ గ్రూప్ పదిహేనేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 25 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని, వాటిలో ఎక్కువ భాగం మహిళలకు అందించిందని వివరించారు. -
దయచేసి రావాలి..!!
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినా పార్టీ నాయకులు, క్యాడర్ బయటకు రాకపోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా నిరసనలు చేయకపోవడం సరికాదన్నారు. ఎందుకు ఆందోళనలు చేయడం లేదని చాలామంది తనను అడుగుతున్నారని, తనకు చాలా బాధగా ఉందని, ఇప్పటికైనా జనసమీకరణ చేయాలని పార్టీ నాయకులను ప్రాధేయపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎలాగైనా జనాన్ని తరలించాలని అచ్చెన్నాయుడు వేడుకుంటున్న ఆడియో లీక్ అయింది. ‘పార్టీ అధ్యక్షుల వారిని అరెస్టు చేశారు. ఇంతకంటే మనకు, పార్టీకి ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు.. రాదు కూడా! నేను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించటానికి కారణం... ఆ చుట్కుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. పోలీసులు ఆపుతున్నారని మీరు అనవచ్చు. వాళ్లు చేస్తారు. దయ ఉంచి.. ఎక్కడి కక్కడ అర్బన్ నియోజకవర్గాల్లో బొండా ఉమ, గద్దె రామ్మోహన్, వన్‌టౌన్ నాయకులు, బోడె ప్రసాద్ బయటకు రావాలి. పెద్ద నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు గానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్‌కు ఎక్కడా ఇబ్బంది లేదు. వెంటనే అందరూ రంగంలోకి దిగి జనసమీకరణ చేయాలి. అందులో మహిళలు ఎక్కువ మంది ఉండాలి’ అని అందులో అచ్చెన్న పేర్కొన్నారు. రాత్రి నుంచి చెబుతూనే ఉన్నా.. తాను రాత్రి 3 గంటల నుంచి జనసమీకరణ గురించి అందరికీ చెబుతూనే ఉన్నానని విజ యవాడ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కాన్ఫరెన్స్‌లో వివరణ ఇచ్చారు. తమ నియోజకవర్గం వాళ్లను పో లీస్ స్టేషన్లో పెట్టారని, వాళ్లంతా చాలా చికాకుగా ఉందని ఫోన్లు చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాపోయారు. మహిళల్ని ఇబ్బంది పెట్టకపోయినా... వెళ్లిపోతారా? లేదా వ్యాన్ ఎక్కించమంటారా? అని అడుగుతున్నారని చెప్పారు. సెకండరీ లీడర్లు చాలా భయపడుతున్నారని, ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పోలీసులు బయటకు రానివ్వడం లేదని విజయవాడ సెంట్రల్ ఇన్‌ఛార్జి బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చాలా ఇబ్బందులున్నాయని, 20 మంది కార్యకర్తలను పంపిస్తే రాత్రి 11 గంటలకు వదిలారని మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి తిప్పుతున్నా చిన్న చిన్న కారణాలు చెప్పి బయటకు రాకపోవడం బాగోలేదని టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇస్రో అదుర్స్.. మానవరహిత గగన్‌యాన్ మిషన్!
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్ మానవరహితమనే ప్రకటన వెలువడింది. ఇందుకోసం ప్రత్యేక మహిళా రోబోట్ 'వ్యోమిత్ర'ను పంపనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అక్టోబర్ రెండవ వారంలో ట్రయల్ స్పేస్ ఫ్లైట్‌ను ప్రయోగిస్తామని చెప్పారు. తదుపరి మిషన్‌లో మహిళా రోబో "వ్యోమిత్ర"ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా గగన్‌యాన్ ప్రాజెక్టు ఆలస్యం అయిందని చెప్పారు. రెండో మిషన్‌లో భాగంగా పంపే మహిళా రోబోట్ మానవునితో సమానంగా మాట్లాడుతుందని చెప్పారు. అంతా సవ్యంగా సాగితే ముందుకు వెళతామని అన్నారు. చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరడం ఎంతో ఉపషమనం కలిగించిందని చెప్పారు. ప్రయోగాన్ని దగ్గర నుంచి చూసినవారు ఆందోళనకు గురయ్యారు. భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్యకు ప్రయోగం చేరినప్పుడు తాను మొదటిసారి ఆందోళన చెందినట్లు చెప్పుకొచ్చారు. అంతరిక్ష రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ చేయూతనిచ్చారని అన్నారు. దాదాపుగా 2019 వరకు శ్రీహరికోట సందర్శనార్థం మూసి ఉండేది.. కానీ ప్రస్తుతం మీడియాకు, విద్యార్థులను ఆహ్వానిస్తోందని చెప్పారు. ఆ సంపద ఈ దేశ ప్రజలదని పేర్కొన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని మొదటి దేశం భారత్ అని అన్నారు. గగన్‌యాన్ ఉద్దేశం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇందులో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు సభ్యులను మూడు రోజులపాటు అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారు. ఎల్వీఎం3ని లాంచ్ వెహికిల్‌గా ఉపయోగించనున్నారు. ఇదీ చదవండి: PM Modi Gets Emotional: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం.. -
ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల సెటైర్
సాక్షి, హైదరాబాద్: ‘బీ ది ఛేంజ్ యు వాంట్ టూ సీ’అంటూ 33% మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సలహా ఇచ్చారు. నిజంగా కవితకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే..రానున్న ఎన్నికల్లో 33% అమలు చేయించాలని మంగళశారం ఆమె ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా అని నిలదీశారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్లోనూ ప్రాధాన్యత దక్కలేదన్నారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి.. కేబినెట్లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలంటూ సెటైర్ వేశారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అని మండిపడ్డారు. -
ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి వృషణాలు లేకుండా పుట్టాడు. 40 ఏళ్లుగా అలాగే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నా.. ఎంతకు పిల్లలు పుట్టకపోవడం, పొత్తి కడుపు కింద నొప్పితో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయగా.. ఆ వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు రెండూ ఉన్నట్టు గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టు తేల్చారు.ఆస్పత్రిలో ఆయనకు ఆండ్రాలజిస్టు, రోబోటిక్ సర్జన్ వైఎం ప్రశాంత్ చికిత్స చేశారు. దీనికి సంబంధించి వైద్యుడు వెల్లడించిన వివరాల మేరకు.. సాధారణంగా పిండం ఏర్పడిన సమయంలోనే హార్మోన్ల ప్రభావంతో ఆడ, మగ అన్నది నిర్ణయమైపోతుంది. అయితే మంచిర్యాల వ్యక్తి కేసులో జన్యు మ్యుటేషన్ కారణంగా.. హార్మోన్ల అసమత్యుల్యత ఏర్పడి ఆడ, మగ రెండు రకాల జననాంగాలు ఏర్పడ్డాయి. అందులో గర్భ సంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలు ఉదర భాగంలోనే ఉండిపోయాయి. ఇలాంటి వారు అన్ని అంశాల్లో మామూలుగానే ఉంటారు. హార్మోన్లు, పురుషాంగం, మీసాలు, గడ్డాలు అన్ని సాధారణంగానే ఉంటాయి. అయితే వృషణాలు లోపలే ఉండి, వీర్య కణాలు ఉత్పత్తిగాక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. లాప్రో స్కోపిక్ శస్త్రచికిత్సతో.. ఈ వ్యక్తికి వైద్యులు చిన్నపాటి కోతతో కూడిన ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి.. గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్స్‌తోపాటు వృషణాలను కూడా తొలగించారు. సాధారణంగా 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా వృషణాలు లోపలే ఉండిపోతే కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని.. అందువల్ల వాటినీ తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఇన్నేళ్లుగా ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని.. కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిపారు. 18 ఏళ్ల వయసుకు ముందే ఈ సమస్యను గుర్తించి శస్త్రచికిత్స చేస్తే వృషణాలను సాధారణ స్థితికి తెచ్చే అవకాశం ఉండేదని.. కానీ పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఇన్నేళ్లుగా సమస్యను గుర్తించలేకపోయారని వివరించారు. ఇలాంటి కేసులు అరుదని, ప్రపంచంలో ఇప్పటివరకు 300 కేసులు, దేశంలో 20 కేసులు మాత్రమే బయటికి వచ్చాయని తెలిపారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,06,42,333
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరింది. అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/ కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉందని తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ముసాయిదా జాబితాలో 3,06,26,996 మంది సాధారణ ఓటర్లతో పాటు మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సరీ్వసు ఓటర్లున్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. కొత్త ఓటర్లు 8,31,520 మంది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. 1,82,183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటు తొలగిస్తే 15 రోజుల్లోగా అప్పీల్ చేయాలి ముసాయిదా జాబితాలో ఎవరిదైన పేరును తప్పుగా తొలగిస్తే బాధిత ఓటర్లు 15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూ పకల్పనలో పాలుపంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు నిషేధం అమల్లోకి ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సివస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయన్నారు. దీర్ఘకాలిక సెలవు ల్లో వెళ్లడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు. -
హ్యాపీ బర్త్‌డే పీచెస్
విశాఖపట్నం: ఇందిరా గాంధీ జూ పార్కులో పీచెస్ అనే ఆడ తెల్ల పులి పుట్టిన రోజు ఘనంగా జరిగింది. తెల్ల పులుల ఎన్‌క్లోజర్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీఈ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు విద్యార్థులు పులి మాస్క్‌లు ధరించి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్యూరేటర్ నందనీ సలారియా కేకు కట్ చేసి సందర్శకులకు పంచిపెట్టారు. సీపీఈ కళాశాల యాజమాన్యం ఆ పులిని నెల రోజుల పాటు దత్తత తీసుకుంది. పీచెస్ పుట్టి ఐదేళ్లు పూర్తయిందని, ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించామని క్యూరేటర్ తెలిపారు. నెల రోజుల పాటు పీచెస్కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన సీపీఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాలనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది..
భోపాల్: 'ప్రాజెక్టు చీతా'లో భాగంగా తీసుకువచ్చిన చీతాల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో ఆడ చీతా ప్రాణాలు విడిచింది. ఐదు నెలల్లోనే తొమ్మిది చీతాలు మరణించడం గమనార్హం. తాజాగా మరణించిన చీతాను 'దాత్రి'గా గుర్తించారు. దీని మరణానికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు. పోస్టుమార్టం తర్వాత వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. కునో నేషనల్ పార్కులోని బోమాస్ ఎన్‌క్లోజర్‌లో ఏడు మగ, ఆరు ఆడ, ఓ ఆడ చితాపిల్లతో కలిపి మొత్తం 14 చీతాలను సంరక్షిస్తున్నారు. వీటి బాధ్యతల కోసం పార్కు జంతు సంరక్షకులతో సహా ఓ నమీబియాకు చెందిన నిపుణుడు కూడా ఉన్నారు. ఈ చీతాల్లో రెండింటిని ఇటీవల బయటకు వదిలారు. ఇందులో ఓ చితా చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. కునో నేషనల్ పార్కులో మూడు చీతా పిల్లలతో కలిపి మొత్తం ఐదు నెలల్లోనే తొమ్మది చీతాలు మరణించాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రాజెక్టు చీతాలో భాగంగా 20 చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వాటికి నాలుగు పిల్లలు కూడా జన్మించాయి. తీసుకువచ్చిన చీతాల్లో ఒక్కొక్కటిగా మరణించడం.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన చీతాల సంరక్షణ కార్యక్రమానికి పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు. చీతాలను గుర్తించడానికి వాటకి రేడియా కాలర్‌ను తగిలించారు. వాటి కారణంగానే చీతాలు అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు గుర్తించారు. చివరికి వాటిని తొలగించాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: ఎన్సీఆర్కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్.. ఢిల్లీ హై అలర్ట్ -
సైలెంట్ కిల్లర్.. వయెలెంట్‌గా..
సాక్షి, హైదరాబాద్: సైలెంట్ కిల్లర్‌గా పిలిచే కేన్సర్ వ్యాధి రాష్ట్రంలో వయెలెంట్‌గా విస్తరిస్తోంది. పొగాకు, మద్యం వినియోగం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో పెరిగిపోతున్న రసాయన ఎరువులు, శీతల పానీయాల వినియోగం, ఆధునిక జీవన శైలి పోకడల వంటి పరిణామాలతోనే కేన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతుండగా...శరీరంలో తెలియకుండానే మొదలైన ఈ వ్యాధిని ముదిరిపోయేంతవరకూ పసిగట్టలేకే మరణాలవరకూ తెచ్చుకుంటున్నాం. జాతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన తాజా నివేదికలోని కేన్సర్ కేసుల, మరణాల గణాంకాలు ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తు న్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 8.08లక్షల మంది కేన్సర్‌తో మరణించగా...అందులో ఒక్క తెలంగాణలోనే 27,339 మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. రెండేళ్లతో పోలిస్తే పెరిగిన మరణాల సంఖ్య అంతకుముందు రెండేళ్లతో పోల్చుకుంటే దేశంతో పాటు రాష్ట్రంలోనూ కేన్సర్ రోగులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉంది. 1.16లక్షల మరణాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా 66,879 మరణాలతో మహారాష్ట్ర దాని తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని ప్రతి లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022లో దేశంలో కేన్సర్ రోగులు 14.61 లక్షలుండగా అందులో తెలంగాణలోనే కొత్తగా 49,983 కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోనుందని ఐసీఎంఆర్ తాజా నివేదికలో హెచ్చరించింది. అధికంగా ఆ వయసువారే.. 60–64 వయస్సు గలవారు అత్యధికంగా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు 10.6%, నోటి కేన్సర్ 8.4%, ప్రొస్టేట్ కేన్సర్ కేసులు 6.1%, నాలుక కేన్సర్ కేసులు 5.9%, కడుపు కేన్సర్ కేసులు 4.8% నమోదవుతున్నాయి. మహిళల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో రొమ్ము కేన్సర్ 28.8%, గర్భాశయ కేన్సర్ 10.6%, అండాశయ కేన్సర్ 6.2%, ఊపిరితిత్తుల కేన్సర్ 3.7% నమోదవుతున్నాయి. 35 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారైనా కేన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు చేయించుకోవాలి. దంత వైద్యుల వద్దకు వెళితే వారు చేసే పరీక్షలు నోటి కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడతాయి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా టీకాను వేయించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. యాభై ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యంగా రావడం వల్లే అధిక మరణాలు ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక విదే శాల్లో 70 నుంచి 80 శాతం మంది మొదటి దశలోనే ఆస్పత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. సర్వైకల్, రొమ్ము కేన్సర్లను సులువుగా నయం చేయవచ్చు. రొమ్ము కేన్సర్‌ను మూడో దశలోనూ, థైరాయిడ్ కేన్సర్ వస్తే 100% నయం చేయవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పిల్లల్లో రక్త సంబంధిత కేన్సర్లే అధికం.. జన్యుమార్పిడి వల్లే పిల్లల్లో కేన్సర్ వస్తుంటుందని, ఎక్కువగా వారి లో రక్త సంబంధిత కేన్సర్లు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ వారికి వచ్చే కేన్స ర్లలో 80% వరకు నయం చేయడానికి వీలుంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. మూడో దశ కేన్సర్లతో వచ్చే పిల్లల్ని సగం మందిని, నాలుగోదశలో వస్తే 25% మందిని బతికించవచ్చని అదే తొలి రెండు దశల్లో వస్తే 90%మందికి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. దేశంలో 2035 నాటికి 13లక్షల కేసులు.. పొగాకు, మద్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల 66 శాతం, ఇన్ఫెక్షన్లతో 20% కేన్సర్లు వస్తున్నాయి. హార్మోన్లు, జన్యుమార్పుల వల్ల 10% పైగా, కాలుష్యం వల్ల ఒక శాతం కేన్సర్ రిస్క్‌లున్నాయి. 2035 నాటికి దేశంలో కేన్సర్ మరణాలు 13 లక్షలకు చేరుకుంటాయని అంచనా. –డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
మహిళల్లో క్రీడాస్ఫూర్తికి..
తాన్వీ హన్స్, శ్వేతా సుబ్బయ్య. ఒకరు ఫుట్ బాల్ క్రీడాకారిణి, మరొకరు ఫిట్నెస్ ట్రైనర్. ఈ ఇద్దరు ఏడేళ్ల క్రితం బెంగళూరులో మహిళల కోసం సరదాగా ఓ స్పోర్ట్స్ సెషన్‌ను ఏర్పాటు చేశారు.అది మొదలు ఇప్పుడు దేశం అంతటా మహిళల కోసం స్పోర్ట్స్ సెషన్ లు, నెట్వర్కింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 5000 మందికి పైగా ఈ మహిళా నెట్వర్క్ ఉమెన్ స్పోర్ట్స్ కమ్యూనిటీని విస్తరించడానికి ట్రావెల్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తుంటారు. 14 ఏళ్లలోపు అమ్మాయిల నుంచి అరవై ఏళ్లకు పైగా వయసున్న బామ్మలు కూడా వీరి గ్రూప్‌లో సభ్యులు. ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు మహిళల్లో క్రీడాస్ఫూర్తి నింపడానికి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు తాన్వి, శ్వేత. క్రీడల ద్వారా కనెక్ట్ అయిన మహిళల సంఘంగా తాన్వి, శ్వేతలు ఏర్పాటు చేసిన ‘సిస్టర్స్ ఇన్ స్వెట్’ గురించి చెప్పుకోవచ్చు ప్రోఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన తాన్వీ హన్స్ 2017లో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ ఆమెకు శ్వేత సుబ్బయ్య పరిచయం అయ్యింది. తన ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్లలో శ్వేత ఒకరు. కొద్దిరోజుల్లోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ‘‘ఒకసారి జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో లేడీస్ అంతా ‘మాకు కూడా క్రీడలు నేర్పించవచ్చు కదా! అని అడిగారు. దాంతో ఆ వీకెండ్లో ఒక గ్రౌండ్ బుక్ చేసి, కొంతమంది మహిళలను ఆహ్వానించాం. అదొక ఫన్ సెషన్ అనుకున్నాం. నలుగైదుగురు వస్తారు అనుకుంటే ఏకంగా 17 మంది మహిళలు వచ్చారు’ అని నాటి రోజులను గుర్తుచేసుకుంటుంది తాన్వి. సరదాగా మొదలై.. 35 ఏళ్ల వయసున్న మహిళల కోసం గంటన్నర స్పోర్ట్స్ సెషన్‌ను మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో శ్వేత ఫిట్నెస్ ట్రైనర్‌గా... తాన్వి క్రీడల కోసం మహిళలు తమ శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో వివరించింది. అంతా సరదాగా జరిగిన ఈ కార్యక్రమం తర్వాత కొత్త ఆలోచనకు దారి వేసింది. ‘ఆ మొదటి సెషన్ తర్వాత లేడీస్ మా వద్దకు వచ్చారు. ఈప్రోగ్రామ్ చాలా బాగుందని, ప్రతి వారాంతంలో తమకోసం ఓ సెషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలా ఈ కమ్యూనిటీ మొదలైంది’ అని వివరిస్తుంది తాన్వి. స్కూళ్లు, కాలేజీల తర్వాత క్రీడల నుండి తప్పుకుంటున్న మహిళల ఆలోచనల్లో తిరిగి స్పోర్ట్స్ పట్ల జీవం పోయడమే తమ ధ్యేయంగా చెబుతారు వీరు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టచ్ రగ్బీతో సహా ఇతర స్పోర్ట్స్ ఫార్మాట్లతో ఈ గ్రూప్ రన్ అవుతోంది. అన్ని వయసుల వారూ.. . ‘‘2017లో మొదటి సెషన్ప్రారంభమైనప్పుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు అని మాత్రమే అనుకున్నాం. ఆ తర్వాత సగటు వయసు 25 నుంచి 30కి చేర్చాం. కానీ, మాతో ఆడుకోవడానికి ఉత్సాహం చూపే 12–14 ఏళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాగే, 65 ఏళ్ల మహిళలు కూడా ఆసక్తి చూపారు. అలా చిన్న వయసు నుంచి సీనియర్ మహిళల వరకు అందరూ మా గ్రూప్‌లో ఉన్నారు. వీరితోపాటు పరిశ్రమల యజమానులు, తల్లులు, గృహిణులు, విద్యార్థులూ ఉన్నారు. కాలేజీల్లో ఆడుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉందని మొదట్లో మేం అనుకునేవాళ్లం. కానీ, అలాంటి వ్యవస్థ చాలా వరకు మన విద్యా సంస్థల్లో లేదని తెలిసింది. మొత్తమ్మీద వివిధ రకాలప్రోఫైల్స్ మా వద్దకు చేరాయి. సాధారణంగా క్రీడలు అబ్బాయిలు, పురుషుల కోసమే అనే ఆలోచన మన సంస్కృతిలో పాతుకుపోయాయి. స్కూల్ స్థాయిలో మన దగ్గర కొన్ని విద్యా సంస్థలు అమ్మాయిలకు క్రీడల్లో అవకాశాలను ఇస్తాయి. కానీ, వారి ఎంపికలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కాలేజీల్లోనూ ఇదే తేడా కనిపిస్తుంది. అందువల్లే, క్రీడల్లో పాల్గొనాలని ఉన్నా మహిళలు డ్రాప్‌ఔట్ అవుతుంటారు. వీటన్నింటినీ ఆలోచించి మేం ఈ ఏర్పాటు చేశాం’ అని తాన్వి చెబుతుంది. ‘మహిళలు ఇతర మహిళలతో ఆడుకోవడానికి మేం అవకాశాలు కల్పిస్తున్నాం. దీని వల్ల వారు సుఖంగా, సురక్షితంగా ఉంటారు. తమ కోసం మంచి సమయం గడుపుతారు’ అంటుంది శ్వేత. బెంగళూరులో ప్రతివారం ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, టచ్ రగ్బీ సెషన్స్ నిర్వహిస్తున్నారు ఈ టీమ్. అలాగే, ప్రతి ఆదివారం, మూడు నెలలకోసారి సైక్లింగ్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. స్విమ్ సెషన్స్ కూడా నిర్వహిస్తూ తమ బృంద సభ్యులను మరింత ఉల్లాసపరుస్తున్నారు. ఇందుకోసం స్పెషల్‌గా తమలోనే కోచ్‌లను నియమించుకుంటున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా వీరి బృందంలో చేరవచ్చు. ‘ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీలో చేరడానికి మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. క్రీడల్లో పాల్గొనడానికి మాత్రం నామమాత్రపు రుసుము చెల్లించాలి’ అని చెబుతున్నారు తాన్వీ, శ్వేత. ప్రతి ఈవెంట్‌కు స్పాన్సర్లను వెతకడం, వాటి ద్వారా ఖర్చులు తగ్గించడం వల్ల క్రీడల్లో పాల్గొనే మహిళలు ఈ సెషన్స్‌లో సంతోషంగా పాల్గొంటున్నారని వివరిస్తున్నారు. -
షాకింగ్ ట్విస్ట్: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..
ఇంత వరకు మగవాళ్లు కూడా పిల్లలు కనడం గురించి మానవజాతిలోనే జరిగింది. అది కూడా వారు ట్రాన్స్ జెండర్‌గా మారే క్రమంలో జరిగిన అరుదైన ఘటనే. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ జంతుశాలలో చోటు చేసుకుంది. అప్పటి వరకు అది ఆ జూలో మగ గొరిల్లాగా పెరిగింది..ఉన్నటుండి ఒక రోజు ఓ ఆడ గొరిల్లా పిల్లకు జన్మనివ్వడంతో జూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన యూఎస్‌లోని కొలంబస్ జూలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొలంబస్ జూలో సుల్లీ అనే గొరిల్లా 2019లో తన తల్లితో కలిసి ఉంటోంది. దాన్ని చిన్నపటి నుంచి ఆ జూ సిబ్బంది అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఊహించని విధంగా గురువారం తెల్లవారుఝామున ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చేంత వరకు అది ఆడ గొరిల్లా అని కనుగొనలేకపోయారు. జూ సిబ్బంది ఆ గొరిల్లాను పర్యవేక్షించే కీపర్లు అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఈ విషయాన్ని ఫేస్బుక్లో అధికారికంగా జూ అధికారులు వెల్లడించారు. ఎందుకు తాము దాన్ని మగ గొరిల్లా అని భావించామో కూడా వివరించారు. నిజానికి సుమారు 8 ఏళ్ల వయసు వరకు గొరిల్లాలు మగ లేదా ఆడవిగా గుర్తించలేమని, అవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. పైగా వాటికి ప్రముఖ లైంగిక అవయవాలు ఉండవు. గొరిల్లాలు ఒక వయసు వచ్చే వరకు ఏ లింగం అనేది గుర్తించడం కష్ట అని చెప్పుకొచ్చారు. మగ గొరిల్లాలకు చాలా వయసు వచ్చే వరకు గెడ్డం, వెన్ను, కొన్ని ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెందవు. దీంతో వాటిని మగవా, ఆడవా అని గుర్తించడం కష్టమవుతుందని జూ నిర్వాహకులు చెప్పారు. అవి గర్భం దాల్చిన కూడా బాహ్య సంకేతాలు ఏమి పెద్దగా చూపవని చెబుతున్నారు. సహజంగానే గొరిల్లాకు పెద్ద పొత్తికడుపు ఉండటంతో గర్భదాల్చినట్లు గుర్తించడం కష్టమేనని కొలంబస్ జూ వివరణ ఇచ్చింది. ఇక సదరు గొరిల్లాకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, అది ఆడగొరిల్లా పిల్లలానే ఉందని జూ పేర్కొంది. ఇక సదరు సుల్లీ గొరిల్లాకు వెల్సన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించి ఆడ గొరిల్లా పిల్ల తండ్రిని కూడా గుర్తిస్తామని కొలంబస్ జూ పేర్కొంది. (చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!) -
ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్త పనులుచేసే ముసలోడికి అరదండాలు!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆవు మొదలుకొని ఆడ కుక్క వరకూ.. ఇలా పలు జంతువులపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చిన ఒక వృద్దుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఉదంతంలో గుజైనీ నివాసి విజేంద్ర మిశ్రా(62)ను అరెస్టు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితునిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా నిందితునిపై గతంలోనూ పలు నేరారోపణలు వచ్చాయని తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారి మాట్లాడుతూ పోలీసులు తమ దర్యాప్తులో పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారని, వాటిలో మిశ్రా బహిరంగ ప్రదేశాల్లో వివిధ జంతువులతో లైంగిక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమయ్యిందన్నారు. మిశ్రా మానసికంగా అనారోగ్యానికి గురయ్యాడని, అతనిని ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించామన్నారు. దీనికిముందు బులంద్షహర్లోనూ ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 65 ఏళ్లవృద్దుడు పెంపుడు కుక్కతో లైంగిక చర్య జరిపాడు. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ శునకం యజమాని ప్రేమ్‌చంద్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వృద్దుడుని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది కూడా చదవండి: అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే.. -
డ్రైవర్ కాదు.. ఓనర్ షర్మిల
సాక్షి, చైన్నె : డ్రైవర్‌గానే కాకుండా, పదిమంది యువతులకు ఉద్యోగాలు ఇచ్చే ఓనర్ స్థాయికి షర్మిల ఎదగాలని కాంక్షిస్తూ మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమల హాసన్ ఆమెకు ఒక కారును బహుమతిగా ఇచ్చారు. ఆయన సోమవారం షర్మిలకు డాక్యుమెంట్లు అందజేశారు. కోయంబత్తూరులో తొలి ప్రైవేటు బస్సు మహిళా డ్రైవర్‌గా షర్మిల(24) సుపరిచితురాలు. గతవారం ఆమె నడుపుతున్న బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి ఎక్కారు. ఆమెను అభినందించారు. బహుమతిగా చేతి గడియారం ఇచ్చారు. తర్వాత ఆమె డ్రైవర్ ఉద్యోగం ఊడింది. షర్మిల ఇటీవల కాలంగా సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీ కావడంతో ఆమె ప్రచారం కోసం పాకులాడుతున్నట్టుందని ఆ బస్సు యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో బస్సును గాంధీపురం బస్టాప్‌లో వదలి పెట్టి ఆమె వెళ్లి పోయారు. దీనిపై ఎంపీ కనిమొళి స్పందించారు. తాను ఆటో నడుపుకుంటానని షర్మిల చెప్పడంతో నగదు సాయంతోపాటు బ్యాంకు ద్వారా రుణ సాయం చేస్తానని కనిమొళి హామీ ఇచ్చారు. తక్షణం స్పందించిన కమల్‌హాసన్ షర్మిలకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ తక్షణం స్పందించారు. ఆమెను డ్రైవర్‌గానే పరిమితం చేయకుండా ఓనర్ స్థాయికి ఎదగాలని కాంక్షిస్తూ ఏకంగా ఒక కారును బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం షర్మిలను చైన్నెకి పిలిపించి కారుకు సంబందించిన పత్రాలను కమల్ అందజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ తొలి ప్రభుత్వ బస్సు డ్రైవర్ వసంత కుమారి, తొలి అంబులెన్స్ డ్రైవర్ వీరలక్ష్మీ అని గుర్తు చేశారు. తొలి ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా షర్మిల పేరుగడించారని గుర్తు చేశారు. డ్రైవర్ కావాలన్న తన కలను సాకారం చేసుకున్న షర్మిల భవిష్యత్తులో తనలాంటి యువతులకు ఆదర్శంగా ఉండటమే కాకుండా, పది మందికి ఉద్యోగాలు కల్పించే యజమాని స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. -
కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయింది?
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా అందరి మన్ననలు పొందుతున్న ఎం షర్మిల(24) శుక్రవారం రోడ్డున పడ్డారు. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లో ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది. కోయంబత్తూరులో బస్సు డ్రైవర్ షర్మిల ఇటీవల సెలబ్రటీ అయ్యారు. ఆమె ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు అనేక మంది మీడియా ముందుకొచ్చారు. తాము సైతం డ్రైవింగ్ నేర్చుకుని బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రటీగా మారిన షర్మిలను అభినందించేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడే వాళ్లు మరీ ఎక్కువే. డ్రైవర్‌గా ఆమె పనితీరును పరిశీలించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం కోయంత్తూరుకు వచ్చారు. కండక్టర్ తీరుతో.. షర్మిల నడిపే బస్సులో ఇదివరకు ఉన్న మగ కండక్టర్‌ను తొలగించి శుక్రవారం నుంచి కొత్తగా లేడీ కండక్టర్‌ను ఆ ట్రావెల్స్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే, ఆ లేడీ కండక్టర్ రూపంలో షర్మిలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన బస్సులోకి హఠాత్తుగా కనిమొళి ఆమెతో పాటు మరికొందరు ఎక్కడంతో షర్మిల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె పనితీరున స్వయంగా కనిమొళి వీక్షించి, అభినందించారు. అయితే, ఆ లేడీ కండక్టర్ టికెట్టుకు చిల్లర ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు ఆమెతో వచ్చిన వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. జాబ్ పోలేదు? తనకోసం కనిమొళి రావడంతో ఆ కండక్టర్‌ను షర్మిల వారించారు. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్‌లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ గాంధీపురం స్టాప్‌లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎంపీ కనిమొళి పట్ల మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేశారు. ఏదేమైనా తన కలల కొలువుకు దూరమైనట్టు బాధపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బస్సు యజమాని దురై కన్నా మాత్రం మరోలా స్పందించారు. వ్యక్తిగత పబ్లిసిటీ షర్మిలకు పెరిగిందని, అయినా, తాము భరిస్తున్నామని, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని బస్సు యాజమాని దురై కన్న పేర్కొన్నారు. ఈ వ్యవహారం కనిమొళి దృష్టికి చేరడంతో షర్మిలతో ఆమె వ్యక్తిగత సహాయకులు మాట్లాడినట్టు సమాచారం. -
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
తుంగభద్ర డ్రెయిన్‌లో పడి మహిళా వలంటీర్ మృతి
మన్నవ(చేబ్రోలు): పొన్నూరు రూరల్ మండల పరిధిలోని మన్నవ గ్రామంలో మహిళా వలంటీర్ ప్రమాదవశాత్తూ కాలువలో పడి మరణించిన ఘటన గురువారం జరిగింది. అన్నవరపు మానస(26) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తోంది. ఉదయం స్థానికంగా ఉన్న తుంగభద్ర డ్రెయిన్‌లో దుస్తులు ఉతకటానికి వెళ్లి ప్రమాదవశాత్తూ పడిపోయింది. నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న మానసను స్థానికులు కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అనంతనం వలంటీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వలంటీర్ మానస మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
మరో చీతా కన్నుమూత! జతకట్టే సమయంలో గాయపడటంతో..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో దక్ష అనే మరో ఆడ చీతా కన్నుమూసింది. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ అన్నారు. తాము ఆ ఆడ చీతాకు అవసరమైన అన్ని మందులు, చికిత్స తక్షణమే అందించామని, కానీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణాలు విడిచిందని తెలిపారు. వాయు, అగ్ని అనే మగ చీతాలతో సంభోగ సమయంలో అవి పరస్పరం హింసాత్మక దాడులు చేసుకున్నాయని, అందువల్లే దక్ష అనే చీతా మరణించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఎన్‌క్లోజర్ నెంబర్ 1లో ఉన్న దక్షను బోమా 7 ఎన్‌క్లోజర్‌లో ఉన్న వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు. అయితే ఈ ప్రక్రియలో మగ చిరుతలు హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. కానీ ఇది చాలా సర్వ సాధారణ విషయమని చౌహాన్ చెబుతున్నారు. మగ చిరుతలు జత కట్టే సమయంలో తమకు సంబంధంలేని మగ చిరుతలతో దాడులకు దిగుతాయని, గెలిచిన మగ చిరుత ఆడ చిరుతతో జత కడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, గతేడాది ప్రాజెక్టు చీతా కింద దక్షిణాఫ్రికా నుంచి దాదాపు ఇరువై చీతాలను జాతీయ పార్కుకి తీసుకురాగా వాటిలో సాషా, ఉదయ్ అనే రెండు చిరుతలు మార్చి, ఏప్రిల్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఆ రెండు చిరుతలను సెప్టంబర్ 2022లో వేర్వేరు బ్యాచ్‌లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో వద్ద ఉన్న క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి నమీబియా నుంచి ఐదు ఆడ చీతా పిల్లలు, మూడు మగ చీతా పిల్లలతో కూడిన ఎనిమిది చీతా పిల్లలను విడుదల చేశారు. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రధాని మోదీ బహిరంగ లేఖ! ఆ లేఖలో ఏముందంటే..) -
టైర్ పేలి స్కూటర్ పల్టీ
బనశంకరి: స్కూటర్ టైర్ పేలిపోయి డివైడరును ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా టెక్కీ మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కెంగేరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. డీసీపీ సుమన్ పన్నేకర్ తెలిపిన ప్రకారం వివరాలు... మండ్యకు చెందిన సులోచన (24) పద్మనాభనగర ఇట్టిమడులో నివాసం ఉంటూ కోరమంగలలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె స్నేహితుడు అనంద్‌కుమార్ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తుంటాడు. సాయంత్రం 5.30 సమయంలో కోరమంగల నుంచి హోసకెరెహళ్లికి స్కూటర్లో సులోచన, అనంద్‌కుమార్ బయలుదేరారు. ఆనంద్‌కుమార్ ఫుల్ హెల్మెట్ ధరించగా, సులోచనా హాఫ్ హెల్మెట్ పెట్టుకుంది. నైస్ రోడ్డులో వెళుతుండగా స్కూటర్ టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప రైలింగ్‌ను ఢీకొన్నారు. హాఫ్ హెల్మెట్ వల్ల అధిక గాయాలు ఈ ప్రమాదంలో ఇద్దరికి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు తగిలాయి. తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయి పడి ఉండగా ఇతర వాహనదారులు అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి పంపించారు. సులోచనా తల, మెదడు భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం కన్నుమూసింది. హాఫ్ హెల్మెట్ వల్ల ఆమె తలకు ఎక్కువ గాయాలు తగిలి మరణానికి దారితీసింది. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మరో బాధితుడు ఆనంద్ కుమార్ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సులోచనా మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. కెంగేరి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గెస్ట్ ఎడిటర్ రోల్ బాగా నచ్చింది
మహిళా గెస్ట్ ఎడిటర్ రోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఒక పత్రిక వెలువడడానికి ఇంతమంది శ్రమ దాగి ఉందని నాకు తెలియదు. తెరవెనుక ఉండి నడిపిస్తున్న సిబ్బంది, వారి పనితీరు నాకు స్ఫూర్తినిచ్చింది. – సల్మాబాను సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆహ్వానం మేరకు ఎస్సీ కార్పొరేషన్ నల్లగొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సల్మాబాను మంగళవారం యూనిట్ కార్యాలయంలో గెస్ట్ ఎడిటర్‌గా ఒక్కరోజు విధులు నిర్వర్తించారు. ‘మహిళా గెస్ట్ ఎడిటర్’గా ముఖ్యమైన వార్తలపై ఎడిటోరియల్ సిబ్బందితో చర్చించారు. వార్తల ప్రాధాన్యత, ఎడిటింగ్, పేజినేషన్‌ను పరిశీలించి సూచనలు చేశారు. కొన్ని వార్తలకు శీర్షికలను కూడా పెట్టారు. మహిళల్లో చైతన్యం కలిగించే వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా యూనిట్ కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీలించారు. పత్రిక ప్రింటింగ్ విధానం, సిబ్బంది విధులు, టెక్నికల్ అంశాల గురించి కూడా తెలుసుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని, వాటిని అందిపుచ్చుకోవాలంటే కేవలం చదువు వల్లే సాధ్యమవుతుందని సల్మాబాను చెప్పారు. ప్రస్తుతం సమాజంలో మహిళలకు ఉన్న అవకాశాలు, మహిళలు ఉన్నతంగా ఎదగాల్సిన ఆవశ్యకతపై మాట్లాడుతూ.. తాను ఆఫీసర్‌గా గుర్తింపు పొందానంటే అది రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లేనని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్లు, అన్ని రకాల సదుపాయాలు గురించి అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మంచి చదువులు చెప్పించి ఆర్థికంగా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా కృషిచేయాలి ఆమె సూచించారు. హేళన చేసిన వాళ్లే.. గొప్పగా చెబుతున్నారు.. చిన్నప్పుడు తన అమ్మానాన్నను చాలా మంది.. ఆడ పిల్లలను ఎందుకు చదివిస్తున్నారు అని అనడం తాను చూశానని. అయినా వారు కష్టపడి తనను చదివించారని చెప్పారు. అప్పటి నుంచే తాను సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అనే దిశగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించానని, ఆరోజు హేళన చేసిన వాళ్లే ఈ రోజు తన గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరుకోగలిగానని సల్మాబాను చెప్పారు. మహిళలైనా, విద్యార్థినులైనా పనిచేసే చోట, కళాశాలలు, పాఠశాలల్లో జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసిపోయి ప్రతి విషయాన్నీ చర్చించాలని చెప్పారు. కొందరు చిన్న చిన్న విషయాలకు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతుండడం బాధ కలిగిస్తోందని అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఎడిటోరియల్ సిబ్బందితో మాట్లాడుతున్న గెస్ట్ ఎడిటర్ సల్మాబాను టెక్నాలజీకి అనుగుణంగా పత్రికా రంగంలో మార్పులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పత్రికా రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అరచేతిలో ఉండే సెల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న ఈ రోజుల్లో జర్నలిజం వ్యాల్యూస్‌తో పనిచేస్తున్న ‘సాక్షి’ సిబ్బందిని ఆమె అభినందించారు. తనకు గెస్ట్ ఎడిటర్ అవకాశం కల్పించిన సాక్షి యాజమాన్యానికి సల్మాబాను కృతజ్ఞతలు తెలిపారు. ఎడిటర్‌గా పత్రికను నిర్వహించడం కత్తి మీద సామేనని పేర్కొన్నారు. -
కేడీ పోలీస్.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే అలా..!
తిరుపతి రూరల్: తిరుపతి ముత్యాలరెడ్డి పల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే గుట్టుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి మహిళలను రప్పించి జోరుగా ఈ దందాను నడుపుతున్నారు. ఆ ఎస్ఐ ఏ స్టేషన్లో పనిచేస్తే ఆ స్టేషన్ పరిధిలోనే వీరు దుకాణం తెరుస్తారు. ట్రాన్స్ఫర్ అయితే అక్కడకు మకాం మారుస్తారు. అందులో భాగంగా ఆ మహిళా ఎస్ఐ తిరుచానూరులో పనిచేస్తున్నప్పుడు ఆ స్టేషన్ పరిధిలోని లింగేశ్వరనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆమె ముత్యాలరెడ్డిపల్లెకు వచ్చిన తర్వాత ఆ స్టేషన్ పరిధిలోకి వచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టిన ఎంఆర్ పల్లె పోలీసులు సీఐ సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధనలక్ష్మి నగర్లో దాడులుచేశారు. మహిళా ఎస్ఐ తమ్ముడు ప్రశాంత్, తల్లి, తిరుపతి అవిలాల, హైదరాబాదుకు చెందిన ఇద్దరు మహిళలు, తిరుచానూరుకు చెందిన ఓ విటుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి, తమ్ముడు వ్యవహారశైలి నచ్చక, వారితో గొడవ పడి మహిళా ఎస్ఐ ఏడాది నుంచి వారికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎస్ఐ మెడికల్ లీవ్‌లో వెళ్లిన తర్వాత మూడు నెలలుగా ధనలక్ష్మినగర్‌లో అద్దె ఇంటిని తీసుకుని ఆమె తల్లి, తమ్ముడు వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి..
కన్నకూతుళ్లను దక్కించుకోవడం కోసం ఓ వ్యక్తి తన లింగాన్ని మార్చుకున్నాడు. చట్టపరంగా పోరాటం చేసి ఐడీ కార్డులో మగ నుంచి ఆడగా మారాడు. ఈక్వేడార్‌లో ఈ ఘటన జరిగింది. చట్టపరంగా లింగాన్ని మార్చుకున్న ఈ వ్యక్తి పేరు రినె సలినాస్ రామోస్(47). భార్యతో విడిపోయాడు. అయితే ఈ దేశ చట్టాల ప్రకారం పిల్లలు తల్లిదగ్గరే ఉండాలనే నిబంధన ఉంది. కానీ తన కూతుళ్లు తల్లి వద్ద సంతోషంగా లేరని, తనకు అప్పగించాలని రామోస్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఐడీ కార్డులో తన లింగాన్ని పురుషుడి నుంచి స్త్రీగా మార్చుకున్నాడు రామోస్. చట్టపరంగా అనుమతులు తీసుకున్నాడు. ఇప్పుడు తాను కూడా తల్లిని అయ్యానని, పిల్లలను తనకే అప్పగించాలని రామోస్ కోర్టును కోరాడు. అయితే న్యాయస్థానం దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. రామోస్ తన కూతుళ్ల కోసమే లింగాన్ని మార్చుకున్నప్పటికీ దేశంలోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము సర్జరీ చేయించుకొని ఆడ నుంచి మగగా, పురుషుడి నుంచి స్త్రీగా మారితే అధికారిక గుర్తింపు లభించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాంటిది ఓ పురుషుడు మాత్రం సులభంగా మహిళగా లింగాన్ని మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాను చేసిన దాంట్లో దురుద్దేశం ఏమీ లేదని రామోస్ పేర్కొన్నాడు. కేవలం తన కూతుళ్ల కోసమే ఇలా చేసినట్లు చెప్పాడు. పురుషులకు కూడా తమ పిల్లలపై హక్కు కల్పించేందుకే తాను పోరాడుతున్నట్లు వివరణ ఇచ్చాడు. చదవండి: బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం -
కోర్టులో లేడీ లాయర్ల ఫైటింగ్ .. వీడియో వైరల్..
-
ఆటోలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్
-
మహిళల క్యాన్సర్లు: ఓ అవగాహన
క్యాన్సర్లలో మనదేశపు స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనిపై అమ్మాయిలకు అవగాహన లేక వేయించుకోకపోవడం ఒక కారణమైతే, పరిశుభ్రత తక్కువగా ఉండటం, కాన్పులు ఎక్కువ కావటం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడం, గ్రామీణ నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హెచ్.పి.వి. వైరస్ ఎక్కువగా ఉండటం వంటివి మరిన్ని ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే పెళ్లి కాని అమ్మాయిలూ లేదా పెళ్లి అయినా, ఈ క్యాన్సర్ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే సర్విక్స్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలం. డాక్టర్ సలహా మేరకు వారు సూచించిన కాల పరిమితుల్లో పాప్స్మియర్స్ చేయించుకుంటూ ఉంటే గర్భాశయ ముఖ ద్వారంలోని కణాల మార్పును ముందే పసిగట్టగలం. ఇంకా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఏయే క్యాన్సర్స్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. అండాశయాల (ఒవేరియన్) క్యాన్సర్: స్త్రీలలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్స్ తర్వాత ఈ క్యాన్సరే ఎక్కువ. అండాశయం పొట్టలో ఉండటం వల్ల లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించగలుగుతాం. అందుకే ఈ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. పిల్లలు కలగని స్త్రీలలో, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. లక్షణాలు: ►పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు ►యోని అసాధారణ స్రావాలు, మూత్రం ఎక్కువగా రావటం ∙అలసట, జ్వరం, సీఏ 125 రక్త పరీక్ష, అల్టాస్రౌండ్ స్కానింగ్లతో ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయవచ్చు. యుటెరైన్ లేదా ఎండోమెట్రియల్ లేదా గర్భాశయ క్యాన్సర్స్: గర్భసంచిలో ఉండే లైనింగ్ ఎండోమెట్రియల్, ఈ పొర మరీ పలుచగానూ లేదా 14 మి.మీ. కంటే ఎక్కువగా మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలగని స్త్రీలు, శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉండటం, రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండటం, నెలసర్లు 9 ఏళ్ల కంటే ముందు ప్రారంభం కావడం, మెనోపాజ్‌కు చేరుకున్న స్త్రీలు, అధిక బరువు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ కు గురయ్యే ముప్పు ఎక్కువ. 50 నుండి 64 మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది. అందుకనే మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక ఏడాది తర్వాత రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కన్పించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘‘ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి, ఎవ్వరితో చెప్పుకోను’’ అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ అది మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానే కాదు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు టెమాక్సిఫెన్ మందు వాడిన స్త్రీలు, పెల్విస్‌కు రేడియేషన్ తీసుకున్నవారు, హార్మోన్ థెరపీ దీర్ఘకాలంపాటు తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. నెలసరి మధ్యలో, మెనోపాజ్ దశ దాటాక రక్తస్రావం కనిపిస్తే అల్టాస్రౌండ్, హిస్టిరోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షలు తప్పనిసరి. వెజైనల్ అండ్ వల్వా క్యాన్సర్స్: యోని, యోని పెదాలకు సంబంధించిన క్యాన్సర్స్ అరుదుగా కన్పించేవే కాని ఈ అవయవాలు క్యాన్సర్స్‌కు గురైతే ట్రీట్మెంట్ ఇవ్వటం మరింత కష్టం. మెనోపాజ్ వయస్సులో థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నవారిలో, హెచ్.పి.వి. వైరల్, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఖచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ‘‘లైకెన్ స్లీ్కరోసస్’’ అనే చర్మవ్యాధి వల్ల స్త్రీలకు యోని ప్రాంతంలో తెల్లటి మచ్చలు, దురదలతో కూడిన మచ్చలు పడతాయి. ఆ మచ్చలు ‘వల్వార్ కార్సినోమా’ అనే చర్మ సంబంధ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. ‘లైకెన్ స్లీ్కరోసస్’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు చికిత్స తీసుకోవటంతో పాటు తప్పనిసరిగా క్యాన్సర్ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గైనిక్ క్యాన్సర్స్‌కు చెక్ పెట్టాలంటే స్త్రీలు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ►పొత్తికడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం ∙అసాధారణమైన యోనిస్రావాలు, రక్తస్రావం ∙కలయిక సమయంలో రక్తం కన్పించడం ∙నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం ∙అలసట, జ్వరం, బరువు తగ్గటం. ►గైనకాలజికల్ క్యాన్సర్లు ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీలద్వారా చేయించుకున్న వెంటనే కీమో, రేడియోథెరపీలను తీసుకోవటతో ఈ క్యాన్సర్లను అదుపులో ఉంచటం సాధ్యం అవుతుంది. -
మగాళ్లలో మార్పు తీసుకొచ్చేలా ‘ఫిమేల్’ ఉండాలి: మంత్రి సబితా
మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ‘ఫీమేల్’ చిత్రం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడాలని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వీపీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాని తిక్కిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..వెలిచర్ల ప్రదీప్ రెడ్డి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ‘ఫిమేల్’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ రివేలింగ్ పోస్టర్ ను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మగాళ్లలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ చిత్రం ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దర్శకుడు నాని తిక్కిశెట్టి, నిర్మాత వెలిచర్ల ప్రదీప్ రెడ్డి మరియు చిత్రబృందానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. శుభాంగి తంభాలే టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న దారుణాలపై విప్లవాత్మకమైన పరిష్కారాన్ని సూచిస్తూ రూపొందిన ఈ విభిన్న కథాచిత్రం త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. -
ఆ అమ్మాయి ఈడేర లేదు..!
ఆడపిల్ల ఉంటే ఇంట్లోని వారు ఇరుగు పొరుగు వారు ఆ పిల్ల ఈడేరే విషయమై ఎదురు చూస్తూ ఉంటారు. ‘మీ అమ్మాయి ఈడేరిందా?’ అని అడుగుతూ ఉంటారు. కాని అందరు అమ్మాయిలు ఈడేరాలని లేదు. ప్రతి ఐదువేల మంది ఆడపిల్లల్లో ఒకరు ఎప్పటికీ రజస్వల కాని లోపంతో ఉంటారు. ఈ లోపాన్ని ‘టర్నర్ సిండ్రోమ్’ అంటారు. వైద్యశాస్త్రం పెద్దగా ఏ సహాయం చేయలేని ఈ సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవడం గురించి ఇటీవల తెలుగులో కథలు వస్తున్నాయి. ఆ కథలు ఏమంటున్నాయి? ‘తొమ్మిదో తరగతికి వచ్చిన చెల్లెలు ఏపుగా ఎదిగి పోతుంటే నేనేమో గిడసబారిన మొక్కలాగా నాలుగున్నర అడుగులు దాటలేదు. అసలే మెడ కురచ. భుజాలు కొంచెం దగ్గరకొచ్చి మరింత చిన్నగా కనిపించేదాన్ని. నాతో కాలేజీకి వచ్చే అమ్మాయిల్లో కొందరికి నేనంటే చాలా చులకన. ఎప్పుడూ ఏదో రకంగా నన్ను ఆట పట్టించడం, జోకులేసి నవ్వుకోవడం వాళ్లకి సరదా. కళ్లలో తడి కనిపిస్తే మరింత ఏడిపిస్తారు. నేను పుష్పవతిని కాలేదు. అంతమాత్రం చేత నన్నెందుకు చిన్నచూపు చూడాలి. అందుకు బాధ్యురాలిని నేను కాదు కదా’ – రచయిత్రి వల్లూరిపల్లి శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్ సిండ్రోమ్’ అనే కథ నుంచి ‘ఎనిమిదో తరగతి అయిపోయింతర్వాత యేసవి సెలవుల్లో మా క్లాసుల మిగిలిన ఆడగుంటలు కరణాలమ్మాయి రాజేస్వరి, తెలకలోళ్ల కమల పుష్పవతులైపోయినారు. మా లచ్చుమత్త వచ్చినప్పుడల్లా ‘ఎప్పుడు మూల కూకుంటావే, ఎప్పుడు తిరపతిగాడిని పెల్లి సేసుకుంటావే’ అని అడుగుతుండీది. కళ్లు మూసి కళ్లు తెరిసినప్పుడికి రోజులు గిర్రున తిరిగిపోతున్నాయిగాని నేను పెద్దమనిషి కాకుండా శీలవతిలాగ మిగిలిపోతానేమో అని మాయమ్మకు, నాయనకు బెంగ పట్టుకున్నాది. మా ఊరిలోన నా ఒయసు ఆడగుంటలు తొమ్మండుగురు. నేను తొమ్మిదో తరగతికొచ్చినప్పుడికి ఏడుగురు పెద్దమనుసులైపోయినారు. నేను, పెదరైతుగారింటి మంగ ఇంకా అవ్వలేదు. నాలాగే కూకోడానికి ఇంకొక మనిషి ఊర్ల ఉందని మాయమ్మకు, మా నాన్నకు కొంచెం దైర్యంగా ఉండేది. ఇదిగో ఇప్పుడు పెదరైతుగారి పిల్ల సంవర్తాడిందనగానే మాయమ్మ, మా నాయిన తడిసిపోయిన సొప్పకట్టల్లాగా అయిపోగానే మొదటిసారి నేను పెద్దపిల్లనవ్వనేమో అని నాకు బయ్యమేసింది’ – రచయిత కరుణ కుమార్ రాసిన ‘పుష్పలత నవ్వింది’ కథ నుంచి. ఆడపిల్ల ఈడేరకపోతే మన దగ్గర భూకంపాలు వస్తాయి. ఆడజన్మ అంటేనే మన దృష్టిలో అమ్మ అయ్యే జన్మ అని అర్థం. సెంటిమెంట్ బలం ఎక్కువ. ఆమె ప్రత్యుత్పత్తికి అనువుగా ఉంటేనే గౌరవం. మన్నన. ప్రత్యుత్పత్తికి యోగ్యంగా లేకపోతే ఆమె మీద, కుటుంబం మీద చాలా ఒత్తిడి పెడుతుంది సమాజం. వింతగా చూస్తుంది. గేలి చేస్తుంది. చులకనతో విడిగా ఉంచేస్తుంది. ఈడేరని అమ్మాయికి సమాజం దృష్టిలో ఏ భవిష్యత్తూ లేనట్టే. ఇది ఒక రకంగా మూస దృష్టి. ఇంత మూసలో అందరూ ఉండకపోవచ్చు. పై రూపం బాగున్నా లోపల స్వల్ప మార్పుల వల్ల భిన్నంగా ఉండొచ్చు. అంతమాత్రం చేత వారికి ఏ భవిష్యత్తూ లేదనట్టుగా చూసే తీరు తప్పు. అలాంటి స్త్రీలు తమకు నచ్చిన రీతిలో జీవితాన్ని నిర్మించుకోవచ్చు. సంతోషంగా జీవించవచ్చు. కుటుంబం, సమాజం చేయాల్సింది అందుకు సహకరించడమే... అని చెబుతూ తెలుగులో కథలు వస్తున్నాయి. అలాంటి రెండు కథలే ‘టర్నర్ సిండ్రోమ్’, ‘పుష్పలత నవ్వింది’. ఆడపిల్లలు ఎందుకు ఈడేరరు? వివిధ కారణాలు ఉండొచ్చు. కాని ప్రధాన కారణం ‘టర్నర్ సిండ్రోమ్’. మనుషుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. స్త్రీలలో ఈ 23 జతల క్రోమోజోముల్లో ఏదైనా ఒక జతలో ఒక ఎక్స్ క్రోమోజోము ఏర్పడకపోతే అటువంటి వారిలో మొత్తం 45 క్రోమోజోములు ఉంటాయి. ఇలా 45 క్రోమోజోములు ఉన్నవారిలో అండాశయాలు చాలా చిన్నగా ఉండాయి. నెలసరి రాదు. అంటే వీరు ఎప్పటికీ రజస్వల కాలేరు. అది వినా ఇతరత్రా సాధారణ జీవనం జీవించొచ్చు. వైవాహిక జీవితం కూడా పొందవచ్చు. హెన్రీ టర్నర్ అనే అమెరికన్ ఎండోక్రైనాలజిస్ట్ ఈ సంగతి కనిపెట్టాడు కనుక దీనిని టర్నర్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్య ఉన్న 70 శాతం గర్భస్థ శిశువులను ఆల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపెట్టి అబార్షన్ చేస్తున్నారు అమెరికాలో. మిగిలిన ముప్పై శాతం శిశువుల్లో ఈడేరే వయసు వచ్చే దాకా ఈ సమస్య ఉన్నట్టు తెలియదు. కథలు ఏమంటున్నాయి? కరుణ కుమార్ రాసిన ‘పుష్పలత నవ్వింది’, శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్ సిండ్రోమ్’ ఈడేరని ఆడపిల్లల వేదనను చెబుతాయి. ‘పుష్పలత నవ్వింది’లో తండ్రి దాదాపు విరక్తిలోకి వెళతాడు తన ఒక్కగానొక్క కూతురు పెద్దమనిషి కాలేదని. టర్నర్ సిండ్రోమ్‌లో కథానాయిక తల్లి, నానమ్మ ఎంతో ఒత్తిడికి గురవుతారు. కథానాయిక కూడా. అయితే ‘పుష్పలత నవ్వింది’లో తల్లి, కూతురు కలిసి తండ్రికి అబద్ధం చెబుతారు. అమ్మాయి ఈడేరిన నాటకం ఆడతారు. అదొక ఇంటి రహస్యంగా ఉంచుతారు. ‘మంచి మనసున్న కుర్రాడిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత అతనే అర్థం చేసుకుంటాడు’ అనే ముగింపు ఇస్తే... ‘టర్నర్ సిండ్రోమ్’ లో మాత్రం కథానాయిక బాగా చదువుకుని మొదట తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంటుంది. కుటుంబం నుంచి దూరంగా వచ్చి తన సమస్య తెలిసి తనతో జీవితాన్ని పంచుకునే అబ్బాయిని జీవితంలోకి ఆహ్వానిస్తుంది. ఈ రెండు కథల్లోనూ కథానాయికలకు కుటుంబం నుంచి, సమాజం నుంచి సవాలే ఎదురయ్యింది. ఇంత సవాలు అక్కర్లేదు. మనుషులకు ఎన్నో శారీరక లోపాలు ఉంటాయి. కళ్లద్దాలు రావడం కూడా ఒక లోపమే కదా. అలాంటి సర్వసాధారణ లోపంగా భావించే దశకు ఇటువంటి ఆడపిల్లల విషయంలో సమాజం వెళ్లాలి. ఆ చైతన్యం కథలు ఇస్తున్నాయి. అలాంటి కథలను ఆహ్వానించాలి. మా సమీప బంధువు ఒకరు తన కూతురు పెద్దమనిషి కావటం లేదని చాలా సంవత్సరాలు బాధపడటం దగ్గరగా చూశాను. అలాగే వరుసకు నాకు మేనత్త అయ్యే ఒకామె చివరి వరకు పెళ్లి లేకుండా ఉండిపోవడం చూసాను. అప్పుడే ఈ సమస్య వెనుక ఉన్న సామాజిక కోణం అర్థమయ్యింది. అప్పుడు ఈ కథ రాయాలని అనిపించింది. – కరుణకుమార్, రచయిత, సినీ దర్శకుడు నాకు బాగా తెలిసిన ఓ పోస్ట్‌గ్రాడ్యుయేట్ యువతి ఒక సందర్భంలో తన సమస్య గురించి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. మహిళలందరికీ నెలసరి అనే శరీర ధర్మం సహజం. కానీ కొందరిలో ఉండదు. అది నిజం. నాకు తెలిసిన గైనకాలజిస్ట్ దగ్గరకి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను. ఫలితం శూన్యం. అప్పటి నుంచి ఈ సమస్యపై రాయాలి అనుకునేదాన్ని. శరీర అంతర్గత అవయవాల్లో సమస్య ఉన్న ఆ అమ్మాయిలు ఎటువంటి మానసిక, సామాజిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటారో అని నేను చేసిన ఆలోచనకు జవాబే ఈ కథ. – వల్లూరుపల్లి శాంతిప్రబోధ, రచయిత్రి ఇది కూడా చదవండి: Period Pain and Cramps: రోజుకో నువ్వుల ఉండ, ఇంకా... -
‘కళావతి’ పాటతో కల్లోలం రేపుతున్న సింగర్స్ (ఫొటోలు)
-
భార్య సమ్మతి లేకుంటే.. బలాత్కారమే!
బెంగళూరు: తాళి కట్టినంత మాత్రాన, అర్ధాంగిగా స్వీకరించినంత మాత్రాన అమ్మాయిపై సర్వహక్కులు తమవేననే భావన భారత పితృస్వామ్య వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయింది. ఇది సరికాదని, స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. దాన్ని మానభంగంగానే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు బుధవారం విస్పష్టంగా పేర్కొంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ పరోక్షంగా దేశంలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన చర్చకు తెరతీసింది. ఇష్టం లేకున్నా కోరిక తీర్చుకున్నాడని ఓ మహిళ పెట్టిన కేసును కొట్టివేయాలని ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది. వైవాహిక బంధం భర్తకు ప్రత్యేక అధికారాలు, పెత్తనం ఏమీ కట్టబెట్టదని.. స్ట్రీకి ఇష్టం లేని సంభోగం కచ్చితంగా రేప్ కిందకే వస్తుందని, భర్త అయినంత మాత్రాన దీనికేమీ మినహాయింపు ఉండదని అభిప్రాయపడింది. చారిత్రక చర్చకు తెరలేపింది. కూతురిని కూడా భర్త లైంగికంగా వేధించాడని సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో.. అతనిపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా అదేశించింది. లైంగిక వాంఛలకు పెళ్లి లైసెన్స్ కాదు! సతీమణి ఇష్టానిష్టాలకు విలువనివ్వకుండా... ఎప్పుడు పడితే అప్పుడు వాంఛలు తీర్చుకోవడానికి పెళ్లి అనేది ఒక లైసెన్స్ కాదని జస్టిస్ నాగప్రసన్న పేర్కొన్నారు. పాశ్చాత్యదేశాల్లో మహిళ సమ్మతి లేకుండా సంభోగానికి పాల్పడితే దాన్ని చట్టపరంగా నేరంగానే పరిగణిస్తున్నారు. అయితే భారత్‌లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పితృస్వామ్య వ్యవస్థ భావనలు బలంగా వేళ్లూనుకొని ఉండటం, సామాజిక కట్టుబాట్లు, ఆచారవ్యవహారాల పేరిట.. కేంద్ర ప్రభుత్వాలు చాన్నాళ్లుగా ఈ అంశం జోలికి (మారిటల్ రేప్‌ను నేరంగా మార్చే చట్ట సవరణకు) పోవడం లేదు. భార్యాభర్తలు అనే దానితో సంబంధం లేకుండా.. అమ్మాయి సమ్మతి లేకుండా లైంగిక దాడికి పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుందని జస్టిస్ నాగప్రసన్న బుధవారం అభిప్రాయపడ్డారు. బలత్కారమనేది స్త్రీల మానసిక స్థితిపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, వారికి భయకంపితులను చేస్తుందని పేర్కొన్నారు. అమ్మాయిని బలవంతంగా అనుభవించడం నేరమైనపుడు అది జీవిత భాగస్వామి అయినా సరే నేరంగానే చూడాలన్నారు. ‘తరతరాలుగా పురుషుడు భర్త అనే ముసుగులో.. మహిళలను తన సొంత ఆస్తిగా చూస్తున్నాడు. భార్యలు తమ చెప్పుచేతల్లో ఉండాలనుకునే బూజుపట్టిన ఆలోచనలు, సంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టాల్సిందే. భర్తకు రేప్ నుంచి మినహాయింపునిస్తున్న భారత నేర స్మృతిలోని (ఐపీసీ) 375 సెక్షన్ ఏమాత్రం ప్రగతిశీల ఆలోచన కాదు. నా దృష్టిలో అది తిరోగమన భావన. అర్ధాంగిగా స్వీకరించిన మహిళ శరీరం, ఆలోచనలపై తమకు సంపూర్ణ హక్కులు దఖలు పడ్డాయనే భావన.. కచ్చితంగా తిరోగమన ఆలోచనే. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమనే భావనకు ఇది తూట్లు పొడుస్తుంది. అందువల్లే చాలాదేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా చేశాయి. యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని మూడు ఫ్రావిన్సులు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్... తదితర దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయని జస్టిస్ నాగప్రసన్న ఎత్తిచూపారు. భారత్‌లోనూ అసంఖ్యాక స్త్రీల మౌనరోదనను గుర్తించి చట్టసభల సభ్యులు ఈ మేరకు మారిటల్ రేప్ చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు. -
ఎస్తేర్ ‘జిమ్’దాబాద్.. ఏపీ తొలి మహిళా బాడీబిల్డర్
సృష్టికి మూలం స్త్రీ. ప్రతి మగాడి గెలుపు వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ ఈ వనితల విజయం వెనుక వారి స్వయంకృషి ఉంది. అచెంచల ఆత్మవిశ్వాసం.. మొక్కవోని దీక్ష.. కఠోర సాధనతో వీరు తాము అనుకున్న లక్ష్యం సాధించారు. అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టారు. ఉరిమే ఉత్సాహంతో ముందుకురికారు. జయభేరి మోగించి విజయతీరాలు చేరారు. తమ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రతిభ కనబరిచారు. మహిళా లోకం సగర్వంగా తలెత్తుకునేలా.. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు. చదవండి: ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం తెనాలి(గుంటూరు జిల్లా): రావూరి ఎస్తేరు రాణి.. ఈమె జీవితం వడ్డించిన విస్తరి కాదు.. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యారు. పేదరికం శాపంలా వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. జిమ్ ట్రైనర్‌గా ఉపాధి పొందుతూనే బాడీబిల్డర్గానూ రాణించారు. రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ఫలితంగా ఈనెల 11న సిక్కింలో జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేరురాణి సొంతూరు తెనాలి సమీపంలోని వేమూరు. నాలుగున్నరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను, ఆమె తమ్ముడినీ నాయనమ్మ చేరదీసింది. ఇద్దరినీ చదివించింది. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేరు రాణి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేసేవారు. కొద్దినెలల్లోనే అక్కడ జిమ్ ట్రైనర్‌గా మారారు. ఆ తర్వాత శరీర సౌష్టవ పోటీలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కఠోర సాధనతో ఏడాదిన్నరలోపే అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు గత జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సత్తాచాటారు. ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ప్రముఖుల ప్రోత్సాహం ఎస్తేరురాణికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ రూ.లక్ష, అడిషనల్ డీజీపీ శ్రీధర్, సునీల్ కలిసి రూ.50 వేలు చొప్పున సాయాన్ని సమకూర్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. నిత్యం ఆరు గంటల కఠోర సాధన ఎస్తేరురాణి రోజూ ఆరు గంటలు కఠోర సాధన చేస్తారు. ఈ సాధన ఫలించాలంటే రోజూ కిలో చికెన్, ఇరవై గుడ్లు మెనూలో ఉండాలి. వచ్చే జీతం సరిపోకపోయినా.. కొందరి సాయంతో మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. నేషనల్స్‌లో పతకం సాధించి ఉద్యోగం పొందాలనేదే లక్ష్యమని ఎస్తేరు రాణి చెబుతున్నారు. ప్రతిభా ‘మాధవీ’యం తెనాలి: చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గాలి మాధవీలతకు ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల జాబితాను ప్రకటించింది. అందులో మాధవీలతకు స్థానం లభించింది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఈ నెల 3న ఈ జాబితాను ప్రకటించారు. వీరి స్ఫూర్తిదాయక సేవలను ‘షి ఈజ్ 75 విమెన్ ఇన్ స్టీమ్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురానున్నారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు వీరి వీడియోలను ప్రదర్శిస్తారు. సదస్సులో వీరిని పరిచయం చేస్తారు. ఆ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సైంటిస్ట్‌లు, కళాకారులు, సమాజ సేవకులు, మానవతావాద డాక్టర్ల సరసన చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కనకారెడ్డి, శివలీల కోడలు మాధవీలతకు స్థానం లభించింది. సాధారణ రైతు కుటుంబం నుంచి.. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం మాధవీలత స్వస్థలం. 1971లో సాధారణ రైతు కుటుంబంలో అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి దంపతులకు జని్మంచారు. జేఎన్టీయూ, కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, స్వగ్రామంలో తొలి ఇంజినీరుగా గుర్తింపును పొందారు. ఎన్ఐటీ, వరంగల్‌లో ఎంటెక్, ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని సర్వోత్తమ విశ్వవిద్యాలయం ఐఐఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్‌పర్సన్‌గా మాధవీలత సైన్స్‌ని, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువచేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలో జమ్ములో గల చీనాబ్ నదిపై రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జి డిజైన్, నిర్మాణంలో మాధవీలత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత విషయానికొస్తే గృహిణిగా, అమ్మగా తన పాత్రపోషిస్తూనే వృత్తిపరంగానూ రాణిస్తున్న మాధవీలత అభిరుచిలోనూ తనదైన శైలి కబరుస్తుంటారు. కవితలనూ రాస్తుంటారు. ‘ఆశా’వహ దృక్పథంతో.. గుంటూరు వెస్ట్: ఆశావహ దృక్పథమే ఆమెను ముందుకు నడిపింది. పరిస్థితులకు ఎదురీదుతూనే ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. రూ.200తో వ్యాపారం మొదలు పెట్టి రూ.40లక్షల టర్నోవర్‌కు చేర్చారు. ఆమె పేరు ఆశా సేకూరు. ఊరు గుంటూరు. సహజసిద్ధ ఉత్పత్తుల తయారీతో సమున్నత ప్రగతి సాధించారు. ఇప్పుడు విదేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆశా విజయగాథ ఆమె మాటల్లోనే.. ఆలోచనాత్మకంగా ముందడుగు.. 2008లో విజయ్ ప్రసాద్‌తో పెళ్లయింది. నేను గర్భిణిగా ఉండగా ఆయన నడిపే యానిమేషన్ స్టుడియో ఆర్థిక ఇబ్బందులతో మూతపడింది. ఎనిమిదో నెలలోనే కూతురు తన్వీ పుట్టింది. సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయినా బెదిరి పోలేదు. ఆ సమయంలో పాప రంగు రావాలని కొన్ని లోషన్స్ వాడాను. అవి వికటించి ర్యాషెస్ వచ్చాయి. అమ్మమ్మకు చెబితే వంటగదిలో లభించే కొన్ని వస్తువులతో సున్నిపిండి చేసి ఇచ్చింది. ఇది పాపకు బాగా పనిచేసింది. అప్పుడే సహజసిద్ధ ఉత్పత్తులు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. సున్నిపిండి తయారీకి కేవలం రూ.200 ఖర్చయింది. ఆచరణ ఇలా.. ఆ తర్వాత పాప శరీరానికి బాదం ఆయిల్ మంచిదని రూ.5.000 వెచ్చించి చత్తీస్‌గఢ్ నుంచి ఆయిల్ ఎక్స్్రస్టేట్ మిషన్ కొన్నాను. కేజీ బాదం పప్పును పిండితే కేవలం 150 గ్రాములే వచ్చింది. దానిలో మరికొన్ని వస్తువులు కలిపి పాపకు వాడాను. బాగా పనిచేసింది. ఆ తర్వాత సహజసిద్ధ ఉత్పత్తుల తయారీలో ఆయుర్వేదిక్ కాస్మొటాలజీ, ఆర్గానిక్, ఇతర సర్టిఫికేట్ కోర్సులు చేశా. సొంతంగా సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి మొదట నా బిడ్డకు వాడేదాన్ని. వాటి ఫలితాల ఆధారంగా తన్వీ నేచురల్స్ పేరిట సంస్థ స్థాపించి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టా. ప్రస్తుతం 25 రకాల వస్తువులు తయారు చేస్తున్నా. సంస్థ టర్నోవర్ ఇప్పుడు రూ.40లక్షలు. విదేశాలకూ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నా. ప్రస్తుతం 600 మంది రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. యువతకూ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అనుభవాలు వారికి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను. -
అవాక్కయ్యే విషయం: ఒక సగం ఆడ.. మరో సగం మగ
Dual Gender Stick Insect That Is Half Male And Half Female: ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. గ్రీన్‌బీన్ స్టిక్ ఇన్సెక్ట్ అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన లారెన్ గార్ఫీల్డ్ దాన్ని పెంచుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. ఇదేమిటా అని శాస్త్రవేత్తలకు చూపిస్తే.. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఎందుకంటే చార్లీ ఒక సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు. సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయి. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు ఉన్నాయి. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు. -
అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకూ బర్త్ రేషియో (జననాల నిష్పత్తి) పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ ఉండటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు. చదవండి: టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్ చివరి స్థానంలో అనంత.. అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే జిల్లాలో చూస్తే వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీన్నిబట్టి రమారమి వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 908 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఎందుకిలా? కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలంటే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మగ సంతానానికి ఇస్తున్న ప్రాధాన్యత అమ్మాయిల విషయంలో ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం, అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించడం పరిపాటిగా మారింది. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. జిల్లాలో లింగనిర్ధారణ నిరోధక చట్టం ( పీసీ పీ అండ్ డీటీ) గట్టిగానే అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేశారని తేలితే తీవ్ర చర్యలుంటాయని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు అధికారులు హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యుల (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు కుమ్మక్కై లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎవరైనా లింగనిర్ధారణ చేసినట్టు ఫిర్యాదు చేసి.. అది నిజమని తేలితే ఫిర్యాదుదారుడికి రూ.25 వేల బహుమతి ఇస్తారు. అలాగే ఆ ఫిర్యాదుపై విచారణ జరిగి డాక్టరుకు గానీ, నిర్వాహకులకు గానీ శిక్షపడితే రూ.లక్ష బహుమతి ఇస్తామని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. నిఘా మరింత పెంచాం జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లపైనా నిఘా ఉంచాం. ఎక్కడైనా లింగనిర్ధారణ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయొచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరిస్తే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. – డాక్టర్ కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్ఓ రాయలసీమ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య ఇలా.. జిల్లా అమ్మాయిలు వైఎస్సార్ జిల్లా 925 చిత్తూరు 924 కర్నూలు 908 అనంతపురం 902 -
తవాయిఫ్‌ల నుంచి దేవదాసీల వరకు
స్త్రీని తన లైంగిక బానిస చేసుకోవడానికి పురుషుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బలవంతపు పడుపువృత్తి లేదా ఆచారాల ముసుగులో నిర్బంధ లొంగుబాటు కొనసాగించాడు. దక్షిణభారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఉత్తర భారతదేశంలో తవాయిఫ్‌లు గొప్ప నాట్యకత్తెలుగా సంగీతకారిణిలుగా గుర్తింపు పొందినా వీరి లైంగిక అస్తిత్వం వీరిని సమాజంలో అథమ స్థానానికి నెట్టింది. సినిమా ఈ పాత్రలను తరచూ ప్రస్తావించింది. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా దేవదాసీ వ్యవస్థ దురాచారాన్ని గట్టిగా చర్చించింది. అలాంటి పాత్రలపై ఒక అవలోకన. ‘శ్యాం సింగరాయ్’ సినిమాలో బెంగాల్లో 1970 నాటి సాంఘిక దురన్యాయాల మీద తిరగబడతాడు హీరో నాని. ఆ కాలంలో హరిజనులపై అగ్రకులాలు చేసే దుర్మార్గాలను వ్యతిరేకిస్తాడు. అది కొంత వరకు కుటుంబం సహిస్తుంది. కాని ఎప్పుడైతే అతడు ‘దేవదాసి’ వ్యవస్థలో మగ్గుతున్న సాయి పల్లవిని తీసుకుని కోల్‌కతా వెళ్లిపోయి ఆమెకు విముక్తి ప్రసాదించి వివాహం చేసుకుంటాడో ఆ కుటుంబం రగిలిపోతుంది. తమ పరువును బజారున పడేస్తున్నాడని ఏకంగా అతణ్ణి హత్య చేసి శవం మాయం చేస్తుంది. ‘స్త్రీ శరీరానికి’, ‘పాతివ్రత్యానికి’, దాని చుట్టూ ఉండే ‘సామాజిక విలువ’కు ఈ హత్య ఒక తీవ్ర సూచిక. తమ ఇంటి యువకుడు స్త్రీలను పేదరికంలో నుంచి బయటకు తెస్తే ఆమోదం ఉంటుందేమో కాని, తక్కువ కులం నుంచి వివాహం చేసుకుంటే ఆమోదం ఉంటుందేమో కాని, ‘శీల పతనం’లో ఉండే స్త్రీకి గౌరవం తేవడానికి ప్రయత్నిస్తే మాత్రం కుటుంబం కాని, సమాజం కాని సహించదు. పురుషుడి శీల పతనానికి మించి స్త్రీల శీల పతనానికి ఎక్కువ విలువ, తీవ్రత ఆపాదిస్తుంది సమాజం. నిజానికి పురుషుడు తన స్వార్థం, సుఖం కోసం కల్పించిన వ్యవస్థ ‘దేవదాసీ’ వ్యవస్థ. దేవుణ్ణి అడ్డం పెట్టి పై వర్గాల వారు కింద వర్గాల స్త్రీలను లైంగిక దోపిడికి వాడుకోవడమే ఈ వ్యవస్థ పరమ ఉద్దేశం. పురుషుడు తాను తయారు చేసిన ఈ వ్యవస్థను గౌరవించడు సరి కదా ఈసడిస్తాడు. ఈ వర్గంలో ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉన్న స్త్రీలు కళల్లో తయారైనా వారంతా ఇంటి బయటే ఉండాలి తప్ప ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఈ భావజాలాన్ని భారతీయ/ తెలుగు సినిమా అప్పుడప్పుడు చర్చిస్తూ వచ్చింది. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ కూడా చర్చించింది. ‘ధర్మపత్ని’తో మొదలయ్యి... 1941లో బి.శాంతకుమారి, భానుమతి నటించిన ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ‘దేవదాసీ’ వ్యవస్థ ప్రస్తావన మన సినిమాల్లో వస్తూనే ఉంది. ‘ధర్మపత్ని’లో హీరోయిన్ శాంతకుమారి పెంపుడు తల్లి ఒకప్పుడు దేవదాసి అని తెలియడంతో హీరోకు కష్టాలు మొదలవుతాయి. దేవదాసి పెంచిన కూతురిని కోడలిగా ఆమోదించడం అసాధ్యమని హీరో వివాహానికి ఆటంకం ఏర్పడుతుంది. చివరకు శాంతకుమారి హీరోను పెళ్లి చేసుకోలేకపోతుంది. ‘దేవదాసు’లో ప్రేమ విఫలమైన అక్కినేని దేవదాసి అయిన చంద్రముఖి (లలిత–ట్రావెన్కోర్ సిస్టర్స్) పంచన చేరుతాడు. ఆ పాత్ర ఎంత ఉదాత్తంగా ఉన్నా ఆమె స్థాయి ఇలాంటి పతితులకు ఆశ్రయం కల్పించేదే తప్ప ఇల్లాలు అయ్యే స్థాయి మాత్రం కాదు. ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రి అంతటివాడు ‘ఆటపాటలే వృత్తి’గా చేయబడిన కుటుంబం నుంచి వచ్చిన మంజుభార్గవి చేతికి తంబూర ఇస్తేనే సహించలేకపోతుంది పాడులోకం. మంజుభార్గవి సంగతి సరే ఏకంగా శంకరశాస్త్రినే నిరాకరిస్తుంది. స్త్రీలు మోయాల్సిన పాతివ్రత్యపు బరువు పట్ల దానికుండే పట్టింపు అది. మరి ఆ స్త్రీలను ఆ స్థితికి తెచ్చింది ఎవరు? ‘మేఘ సందేశం’లో ఇంటి ఇల్లాలి నుంచి ఎటువంటి స్ఫూర్తి పొందలేని అక్కినేని కళావంతురాలైన జయప్రదను అభిమానిస్తే ఆరాధిస్తే వారిరువురికి కూడా ఏకాంత వాసమే దక్కుతుంది. స్త్రీలకు తమ శరీరాల మీద, జీవితాల మీద పూర్తి హక్కు లేదని సమాజం పదే పదే చెప్పడం ఇది. అనార్కలికి దక్కని ప్రేమ... దక్షణాదిలో దేవదాసీ వ్యవస్థ ఉన్నట్టే ఉత్తరాదిలో తవాయిఫ్‌ల వ్యవస్థ ఉంది. తవాయిఫ్‌లు వినోద నాట్యకత్తెలు. గాయనీమణులు. దర్బారుల్లో ఆడిపాడటం వీరి పని. అంతిమంగా ఎవరో ఒకరి పంచన వీరు చేరక తప్పదు. వైవాహిక జీవితం వీరికి ఉండే అవకాశం లేదు. అందుకే ‘మొఘల్–ఏ–ఆజమ్’లో దిలీప్ కుమార్‌ను ప్రేమించిన మధుబాలకు ఆ ప్రేమ దక్కదు. ఆమెకు ప్రాణాలతో బొందపెట్టే శిక్ష దక్కుతుంది. ఆమె ఏ చిన్న నవాబు కూతురో అయినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తండ్రి ఎవరో తెలియని ఒక వ్యవస్థను తయారు చేసి ఆ పుట్టిన సంతానాన్ని తిరిగి అదే కూపంలో ఉంచే అమానవీయమైన వ్యవస్థ ప్రతిఫలం ఇది. దీనిని స్త్రీలే అనుభవించాలి. పురుషుడు కాదు. ‘గైడ్’ సినిమాలో దేవదాసీ అయిన వహిదా రహెమాన్‌ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాననుకుంటాడు ఆమె భర్త. కాని అతడి లోలోపల ఆమె మీద అనుమానం, చిన్నచూపు. ఆ పెళ్లి నుంచి ఆమె బయటపడి దేవానంద్లో ప్రేమ వెతుక్కున్నా ఆ పరుషుడు కూడా అంతే దారుణంగా ఆమెతో వ్యవహరిస్తాడు. చివరకు ఆమె జీవితకాల విరక్తిని పొందుతుంది. ఇక రేఖ చేసిన ‘ఉమ్రావ్‌జాన్’ తవాయిఫ్‌ల జీవన విషాద వీచిక. ఎన్నో ప్రశ్నలు.. పాత్రలు మత దురాచారాల వల్ల కాని, కొన్ని సమూహాల వెనుకబాటుతనం వల్ల గాని, సామాజిక దోపిడి వల్ల గాని స్త్రీలు లైంగిక వ్యాపారాల్లో చిక్కుకుంటే ఆ స్త్రీలు తిరిగి గౌరవం పొందడానికి యుగాల కొలదీ పోరాటం చేయవలసి వస్తోంది. వారికి ఉండవలసిన సమాన హక్కుల గురించి, సమాన మర్యాద గురించి మారవలసిన భావజాల దృష్టి చాలా ఉంది. ‘పవిత్రత’, ‘శీలం’ అనే మాటలకు సర్వకాల సర్వావస్థల్లో ఒకే ప్రమాణం ఉండదని, స్థలకాలాలను బట్టి వాటికి అర్థాన్ని ఆపాదించాల్సిన పద్ధతి మారుతుండాలని, ముఖ్యంగా ఇవి స్త్రీలు మాత్రమే మోయాల్సిన పదాలు కావని పురుషులు కూడా సమాన హక్కుదారులే అని మళ్లీ మళ్లీ చర్చించాల్సిన సినిమాలు పాత్రలు రావాలి. ఇకపై అదే జరుగుతుందని ఆశిద్దాం. -
జనాభా వృద్ధికి జాగ్రత్తగా పగ్గం
దేశంలో జనాభా విస్ఫోటన భయం కొంత తగ్గినట్టే! జనాభా వృద్ధి నియంత్రణ చర్యలు ఫలితా లిస్తున్నాయి. దాదాపు దేశమంతటా ఆశించిన స్థాయిలోనే జనాభా వృద్ధిని కట్టడి చేయగలిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) తేల్చింది. మరో ఆరోగ్యకరమైన సంకేతం... దేశంలో మహిళా జనాభా పురుష జనాభాను దాటడం. ప్రతి వెయ్యి మంది పురుషులకు దేశంలో 1020 మంది మహిళలున్నట్టు తాజా సర్వే తెలిపింది. ఇలా మహిళల జనాభా పెరగడం, దాదాపు మూడు దశాబ్దాల ఈ సర్వే పర్వంలో తొలి నమోదు! అయితే ఈ లింగ నిష్పత్తి జననాల స్థాయిలో (ఎస్సార్బీ) ఇలా లేదు! అక్కడ పరిస్థితి భిన్నంగానే ఉంది. ప్రతి వెయ్యిమంది పురుషులకు 929 మంది మహిళలే ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) సహజమని చెప్పే స్త్రీ–పురుష నిష్పత్తి 950–1000తో పోలిస్తే ఇది తక్కువే! కానీ, అయిదేళ్ల కిందటి 2015–16 సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–4) చెప్పిన నిష్పత్తి (919–1000) కన్నా ప్రస్తుత పరిస్థితి మెరుగే! పరిమిత నమూనాలతో జరిపే ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా భావించరు. పదేళ్లకోసారి వచ్చే సాధా రణ జనాభా లెక్కలే ప్రామాణికం. 2001, 2011 జనాభా లెక్కల్లో స్త్రీ–పురుష నిష్పత్తి సరళి కూడా ఇట్లాగే ఉంది. సాపేక్షంగా ఈ సర్వే నివేదికలూ వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్టే! ఒకటి మాత్రం నిజం. వివిధ సమాజాల్లో ఈ లింగవివక్ష, కాన్పుకు ముందే లింగ నిర్ధారణ దురదృష్టకరం, నేరం! ఆడ పిల్లలను అంతమొందించే బ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వెయ్యిమంది పురుషులకు హిమాచల్‌ప్రదేశ్(875), తమిళనాడు(878), హరియాణా(893), ఒడిశా(894) లాగే తెలంగాణ (894)లోనూ మహిళల సంఖ్య తక్కువగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మెరుగ్గా (934) ఉంది. కేరళలో అయిదేళ్ల కింద 1047గా ఉన్న మహిళల సంఖ్య తాజాగా 951కి పడిపోయింది. ఢిల్లీలో 812 నుంచి ఏకంగా 923కి పెరిగింది! ఒట్టి జననాల్లో కాకుండా మొత్తం జనాభాలో మహి ళల నిష్పత్తి పురుషుల కన్నా ప్రస్తుతం పెరగడానికి పలు కారణాలుంటాయి. మరణాల రేటులో వ్యత్యాసం, మహిళల్లో ఆయుఃకాలం పెరగటం వంటివీ ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబ ఆరోగ్య సర్వేలో కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తే, మరికొన్ని విషయాల్లో ఆందోళనకర సంకేతాలు వెలువడటాన్ని పాలకులు గుర్తించాలి. పిల్లలు, మహిళల్లో పౌష్టికాహార లోపం, ఇనుము కొరవడి రక్తహీనత (అనీమియా) ప్రబలడాన్ని తీవ్రంగా పరిగణించి, నివారణ చర్యల్ని ముమ్మరం చేయాలి. పిల్లల్లో రక్తహీనత కేసులు గత సర్వే కాలంలో 58.6 శాతం ఉంటే, ఇప్పుడది 67 శాతానికి పెరిగింది. గర్భిణీల్లో 50.4 శాతం నుంచి 52.2 శాతానికి, 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో 53 నుంచి 57 శాతానికి పెరిగింది. అదే వయసు పురుషుల్లో 22.7 నుంచి 25 శాతానికి పెరగటం సమస్య తీవ్రతకు నిదర్శనం. ‘అనీమియా రహిత భారత్’ నినాదంతో, 2022 నాటికి కేసుల్ని తగ్గిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నా ఆశించిన ప్రగతి లేదని సర్వే తేల్చింది. పళ్లు, కూరగాయలు సరిగా తినకపోవడం, ఇతరత్రా పౌష్టికాహార లోపాలతోనే రక్తహీనత పెరిగి సమస్య జటిలమౌతోంది. కరోనా కాలంలో ఆదాయాలు రమారమి పడిపోయి, నిత్యావసరాల ధరలు పెరగ టం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేసింది. రోజువారీ భోజనంలో, తమ ఆర్థిక స్థాయిలోనూ సమ కూర్చుకోగలిగిన నిర్దిష్ట ఆహార పదార్థాలపైన జనాలకి స్పష్టమైన అవగాహన ముఖ్యం. జాతీయ పౌష్టికాహార సంస్థ ప్రచారం కల్పిస్తున్నప్పటికీ, సరిపోవడం లేదు. ప్రజలింకా చైతన్యం కావాలి. దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గ్రూపులు చేసి రెండు విడతల్లో నిర్వహించిన ఈ సర్వే ఏపీ, తెలంగాణల్లో తొలివిడతలోనే జరిగింది. వైద్యారోగ్యపరంగా కొన్ని మంచి సంకేతాలీ రాష్ట్రాల్లో వెలువడ్డాయి. పౌరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయడంలో దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన ఉన్నాయి. ఏపీలో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ‘నాడు– నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖల్ని మారుస్తున్న చర్య సత్ఫలితాలిస్తోంది. ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి. కాన్పువేళ, తదనంతరం మాతా–శిశు మరణాలు తగ్గాయి. కొన్ని విషయాల్లో దేశవ్యాప్తంగానూ ఆశావహ సంకేతాలున్నాయి. దేశంలో నాల్గింట మూడొంతుల మంది మహిళలు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచారు. స్త్రీ–పురుషుల్లోనూ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. గృహ హింస, అదీ జీవిత భాగస్వామి నుంచి తగ్గినట్టు నమోదైంది. కుటుంబ నియంత్రణ పట్ల అవ గాహన పెరగటమే కాక సురక్షిత పద్ధతులు వారికి తెలిసి వచ్చాయి. జననాల రేటు తగ్గించడంలో ఇదెంతో ఉపయోగపడ్డట్టు గణాంకాలున్నాయి. జనాభా వృద్ధి కట్టడిలో చాలా రాష్ట్రాలు గణనీయ ఫలితాలే సాధిస్తున్నాయి. మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్పార్)ను 2.1 కన్నా తక్కువకి నియం త్రిస్తే జనన–మరణాల ప్రక్రియ కొనసాగుతూనే, ఇప్పుడున్న జనసంఖ్య స్థిరపడుతుందనేది ఓ లెక్క! బిహార్, మేఘాలయ, మణిపూర్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ టీఎఫ్పార్ని 2 కన్నా కిందే నిలిపేయడం మంచి పరిణామం. అయినా, 2040–50 సంవత్సరాల మధ్య భారత్ అత్యధిక (160 నుంచి 180 కోట్ల మందితో) జనాభా దేశంగా ఆవిర్భవించనుంది. 2031 నాటికే చైనాను అధిగమిస్తామని మరో అధ్యయనం! 2022కే అధిగమి స్తామన్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) అంచనాను తప్పించామంటే, జన విస్ఫోటన తేదీని మనం ముందుకు, మరింత ముందుకు జరుపుతున్నట్టే లెక్క! ఇది ఆశావహ సంకేతం!! -
యువతి గురించి తెలియక పిచ్చి వేషాలు వేసి అడ్డంగా బుక్కయ్యాడు!
ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న మహిళలు, బాలికలు ఎక్కడో ఒక దగ్గర లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కొందరు ఆకతాయిలైతే బరితెగించి చుట్టూ ఎందరు ఉన్నా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా బస్సులో ఒంటరిగా కుర్చన్న యువతితో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తీరా చూస్తే ఆమె ఓ లేడీ బ్రూస్లీ కావడంతో అతను దెబ్బలు తినడంతో పాటు అందరి ముందు అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 20న బ్రెజిల్‌లోని బెలెమ్‌కు చెందిన ఓ మహిళ బస్సులో ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో బస్సు ప్యాసింజర్లతో పుల్గా ఉంది. ఆమె ఎదురుగా నిలుచున్న ఓ వ్యక్తి పిచ్చి చేష్టలు మొదలుపెట్టాడు. బస్సులో ప్యాసింజర్లు అంత మంది ఉన్నా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చుట్టూ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తు కొచ్చిన ఆ యువతి అతడి ముక్కుపై గట్టాగా ఒక్క పంచ్ ఇచ్చింది. దెబ్బకు ఆ వ్యక్తికి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే వెనకాల నుంచి గొంతును చేతుల్తో చుట్టి పడేసింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. చివరికి డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్‌స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా గత ఏడాది కూడా బస్సులో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని అందుకే ఆత్మరక్షణ కోసం తాను ప్రత్యేకంగా ముయే థాయ్, కాపోయిరాలను కళను నేర్చుకున్నట్లు ఆ యువతి తెలిపింది. బ్రెజిలియన్ చట్టం ప్రకారం లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినట్లు రుజువైతే, నిందితుడికి ఏడాది నుంచి ఐదు సంవత్సరాల మధ్య జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చదవండి: జైలుకెళ్లొచ్చాక కూడా బిడ్డలపై అత్యాచారం చేస్తా: తండ్రి -
రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!
రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన ఓ రెస్టారెంట్.. కస్టమర్లకు ఓ విచిత్ర షరతు పెట్టింది. కస్టమర్ల పక్కన మహిళ ఉంటేనే లోపలికి ప్రవేశమట. అందేంటి?? అనుకుంటున్నారా... దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆకలేసి సదరు హోటల్‌కి వెళ్లబోతే, పక్కన లేడీ ఎవ్వరూ లేరని వెనక్కి పంపారట. దీనితో ఒక మహిళను తీసుకొచ్చి, హోటల్లో కూర్చోబెట్టి కడుపునిండా తిన్నాడట. ఐతే పాపం ఆ మహిళ మాత్రం పప్పు రోటీ తినడానికి ఈ వ్యక్తి నన్నిక్కడికి తీసుకొచ్చాడనే క్యాప్షన్‌తో తన ఇమేజ్‌తో సహా ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరరాలైంది!! So this guy took me here to have dal roti because pic.twitter.com/PVrgeuS4H9 — Harshita Sharma (@Harshita511) October 17, 2021 -
యువనటి ఆత్మహత్య కేసులో ట్విస్టు.. నటుడు వివేక్‌పై ఆరోపణలు
శివాజీనగర్ (కర్ణాటక): బుల్లితెర నటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నటుడు వివేక్ ప్రేమ, పెళ్లిపేరుతో వేధించడం వలన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి ప్రభు మాదప్ప ఆరోపించాడు. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేశ్‌లపై కుంబళగోడు పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. కాగా, తన కూతురు అమాయకురాలని,ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తన కూతురు దగ్గర ఉన్న బంగారం,డబ్బులు కనిపించడంలేదని ఫిర్యాదులో ప్రభు మాదప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడికి ఒక సంవత్సరం నుంచి తన కూతురితో పరిచయం ఉందని తెలిపాడు. తన కూతురిని ప్రేమించాలని వేధించాడని చెప్పుకొచ్చాడు. కాగా, పోలీసులు వచ్చేలోగా ఘటనా స్థలం నుంచి తన కూతురి మృత దేహన్ని నిందితుడు మార్చాడని ఆరోపించాడు. ఆమె మొబైల్ కూడా కనిపించడం లేదని తెలిపాడు. మొబైల్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నాడు. ఇక ఈ ఆరోపణలపై నటుడు వివేక్ స్పందిస్తూ.. ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నాడు. నటి సౌజన్య తనకు.. ఏడాదిగా తెలుసని అన్నాడు. ఆమె చాలా అమాయకురాలని అన్నాడు. సౌజన్య.. ఒత్తిడికి గురైనప్పుడల్లా తనబాధను నాతో చెప్పుకునేదని వివేక్ పేర్కొన్నాడు. మరోవైపు సౌజన్య గదిలో లభించిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె తన మానసిక స్థితి బాగాలేదని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది. ఇక ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: Actress Soujanya : విషాదం.. సూసైడ్ నోట్ రాసి యువనటి ఆత్మహత్య -
అర్చకత్వంలోనూ సగం..
దేవాలయాల్లో అర్చకులుగా ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. ఇప్పుడా స్థానాల్లోకి సైతం మహిళలు అడుగుపెట్టేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల సుహంజన గోపీనాథ్ వడియార్ (పూజారి) బుధవారం బాధ్యతలు చేపట్టి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అర్చకత్వం చేస్తూ మరెంతోమంది మహిళలకు ప్రేరణగా నిలవనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ సుహంజనను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తో తమిళనాడులో రెండో మహిళా పూజారిగా నిలిచింది సుహంజన. 208 మంది అర్చకులను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. దీనిలో మహిళా పూజారిగా సుహంజన, ఇతర కులాల నుంచి శిక్షణ పొందిన అర్చకులు 24 మంది ఉన్నారు. మాడంబాకమ్‌లోని ధేనుపురీశ్వరర్ ఆలయంలో సుహంజన వడియార్‌గా సేవలందించనుంది. సుహంజనను అర్చకత్వం చేయడానికి ఆమె భర్త, మామగారు ముందుండి ప్రోత్సహించడం విశేషం. తమిళనాడులో మహిళ అర్చకత్వం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. తండ్రి మరణించడంతో అతడు చేసే అర్చకత్వాన్ని వారసురాలిగా అతని కుమార్తె చేయవచ్చని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నియక్కళ్ తమిళనాడులోనే తొలి మహిళా పూజారిగా బాధ్యతలు చేపట్టింది. పిన్నియక్కాళ్ తండ్రి పిన్న తేవార్ మధురైలోని అరుల్మిగు దురై్గ అమ్మన్ కోవెలలో పూజారిగా పనిచేసేవారు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆలయంలో ఆయన చేయాల్సిన పనులను పిన్నియక్కాళ్ చేసేది. కొంత కాలం గడిచాక ఆరోగ్యం క్షీణించి పిన్నతేవార్ 2006లో మరణించాడు. దీంతో ఆయన స్థానంలో పిన్నియక్కాళ్కు ఆ బాధ్యతలు ఇవ్వడానికి గ్రామస్థులు ఒప్పుకోలేదు. ఆమె హైకోర్టును ఆశ్రయించడం తో పిన్నియక్కాళ్ అర్చకత్వం నిర్వహించవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. దాంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 2007లో పిన్నియక్కాళ్ను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విషయాన్ని వక్కాణించి చెప్పడం విశేషం. ‘‘నేను కరూర్ సామినాథన్‌లో మూడేళ్లు అర్చకత్వాన్ని చదివాను. ఇది ఒక ఉద్యోగ అవకాశంగా నేను చూడడం లేదు. నిర్మాణాత్మకమైన సాంప్రదాయం ఇది. అర్చకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళలు కూడా ఇది చేయగలరని సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాను’’అని సుహంజన చెప్పింది. -
దూసుకొచ్చిన మహిళా ‘ఆక్సిజన్’ రైలు
బెంగళూరు: కరోనా వ్యాప్తి బాధితులకు అందించేందుకు చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రాణవాయువు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్‌ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అయితే తాజాగా చేసిన ఆక్సిజన్ సరఫరా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే ఆ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపిన వారంతా మహిళలే. మహిళా పైలెట్లే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపి ప్రత్యేకత చాటారు. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ టాటానగర్ నుంచి బయల్దేరిన 7వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కర్నాటకలోని బెంగళూరుకు చేరింది. ఆ రైల్లో సిబ్బందితో పాటు పైలెట్లంతా మహిళలు ఉండడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బెంగళూరు చేరుకుందని తెలిపారు. -
క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది
స్పేస్ ఎక్స్ ‘క్రూ–3’ మిషన్‌కు నాసా మహిళా వ్యోమగామి కేలా బ్యారన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆఖరి దశ నిర్మాణంలో ఉన్న ‘డ్రాగన్’ అనే వ్యోమనౌకలో కేలా, మరో ముగ్గురు పురుష వ్యోమగాములు వచ్చే అక్టోబర్ 23 న అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి బయల్దేరి వెళ్తారు. అక్కడ కనీసం ఆరు నెలల పాటు పరిశోధనలు జరిపి భూమిని చేరుకుంటారు. ‘క్రూ–3’ కి కేలా బ్యారన్.. మిషన్ స్పెషలిస్ట్. నిన్న గాక మొన్న నాసాలోకి వచ్చిన కేలా తన ప్రతిభతో స్పేస్‌లోకి స్పేస్ సంపాదించారు! ‘నాసా’ ప్రభుత్వానిదైతే, ‘స్పేస్ ఎక్స్’ ప్రైవేటు సంస్థ. నాసా వాషింగ్టన్లో ఉంటే, స్పేస్ ఎక్స్ కాలిఫోర్నియాలో ఉంటుంది. రెండిటి పనీ అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష ప్రయాణాలు. స్పేస్ ఎక్స్‌కి ఇప్పటివరకైతే సొంత వ్యోమగాములు లేరు. నాసా నుంచి, లేదంటే మరో దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి సుశిక్షితులైన వ్యోమగాములను తీసుకుంటుంది. ఎలాన్ మస్క్ అనే బిలియనీర్ స్థాపించిన సంస్థ స్పేస్ ఎక్స్. మార్స్‌లోకి మనిషిని పంపేందుకు ప్రయోగాత్మకంగా స్పేస్ ఎక్స్ వేస్తున్న మెట్లే ఈ స్పేస్ షటిల్స్. ఆ మెట్లలోని మూడో మెట్టే ‘క్రూ–3’. ఇందులో నాసా నుంచి కేలా, రాజాచారి (మిషన్ కమాండర్), టామ్ మార్ష్‌బర్న్ (మిషన్ పైలట్), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మథియాస్ మారర్ (మిషన్ స్పెషలిస్ట్ 1) ఉంటారు. కేలా బ్యారన్.. మిషన్ స్పెషలిస్ట్ 2. స్పేస్ ఎక్స్ ఇలా మార్స్‌కి ఎన్ని మెట్లు కట్టుకుంటూ వెళుతుంది? తెలియదు! మార్స్‌లోకి మనిషిని పంపి, మెల్లిగా మార్స్‌లో మానవ కాలనీలను నిర్మించే ధ్యేయంతోనే ఎలాన్ మస్క్ 2002 లో ఈ సంస్థను నెలకొల్పారు. వ్యోమగాములతో అతడు వేయించే ప్రతి అడుగు, గమ్యమూ చివరికి అంగారక గ్రహమే. వాస్తవానికి స్పేస్ ఎక్స్ వల్ల నాసాకు ఖర్చు, భారం తగ్గాయి. పరిశోధనలకు సమయమూ కలిసివస్తోంది. అందుకే స్పేస్ ఎక్స్‌కి సహాయపడుతోంది. అంతే తప్ప తనకు పోటీ అనుకోవడం లేదు. ∙∙ ఇప్పటికి స్పేస్ ఎక్స్ పంపిన రెండు ‘క్రూ’ మిషన్లలోనూ ఒక్కో మహిళా వ్యోమగామి ఉన్నారు. వారిద్దరి కన్నా వయసులో చిన్న.. ఇప్పుడు ‘క్రూ–3’లో సభ్యురాలిగా ఉన్న కేలా బ్యారన్. ‘క్రూ–1’లో అంతరిక్షంలోకి వెళ్లిన మహిళా వ్యోమగామి షానన్ వాకర్ వయసు 55. ‘క్రూ–2’లో వెళ్లిన మహిళ మెగాన్ మెకార్తర్ వయసు 49 ఏళ్లు. కేలా బ్యారెన్ వయసు 33 ఏళ్లు. షానన్ వాకర్ భూమి మీదకు తిరిగి వచ్చేశారు. మెగాన్ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లబోతున్న కేలా బ్యారన్ వాషింగ్టన్లో పుట్టారు. యు.ఎస్. నేవల్ అకాడమీలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివారు. తర్వాత ఇంగ్లండ్ వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం యుద్ధ నౌకల్ని కమాండ్ చేసే సబ్‌మెరైన్ ఆఫీసర్‌గా శిక్షణ తీసుకున్నారు. యు.ఎస్.ఎస్. మెనీలో డివిజన్ ఆఫీసర్‌గా, నేవల్ అకాడమీలో సూపరింటెండెంట్‌గా పని చేశారు. 2017లో నాసాకు ఎంపిక అయ్యారు. వ్యోమగామి గా రెండేళ్లు శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడీ స్పేస్ ఎక్స్ ప్రయాణానికి అవకాశం పొందారు. మిషన్ ఆఫీసర్‌గా ఆమె అంతరిక్షంలో ఉన్నంత కాలం కమాండర్, పైలట్, మరొక మిషన్ స్పెషలిస్టుతో అనుసంధానం అయి ఉండాలి. క్రూ యాక్టివిటీ ప్లానింగ్, పర్యవేక్షణ ఆమె విధులే. ఇక ప్రయోగాలు ఎలాగూ ఉంటాయి. వ్యోమగామిగా నాసా శిక్షణలో ఉన్నప్పుడు కేలా బ్యారన్ -
భారత తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత కన్నుమూత
న్యూఢిల్లీ: భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు(88) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇండోర్‌లోని తన నివాసంలో పరమపదించారు. చంద్ర నాయుడు క్రికెట్ దిగ్గజం డా. సీకే నాయుడు కుమార్తె. క్రికెట్ వ్యాఖ్యానంతోపాటు ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ఆమె.. 50 వ దశకంలో జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడారు. అయితే, ఆరోజుల్లో మహిళల క్రికెట్‌కు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా, ఆమె కామెంటరీపై దృష్టి సారించి, భారతదేశపు తొలి మహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు. క్రికెట్ పట్ల ఆమెకున్న ఆసక్తి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. చంద్ర నాయుడు మృతి పట్ల మాజీ క్రికెటర్, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) అధ్యక్షుడు సంజయ్ జగ్దలే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చదవండి: పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్ -
ఆడ, మగ కలిసి ఉండడం నేరం కాదు
తిరువొత్తియూరు: తాళం వేసిన గదిలో స్త్రీ, పురుషుడు ఉండడం తప్పు కాదని, దాని ఆధారంగా ఒకరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వీలు కాదని మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. 1998లో దాఖలైన కేసు విచారణను హైకోర్టు ముగించింది. 1997లో సాయుధ దళం విభాగంలో శరవణబాబు కానిస్టేబుల్‌గా చేరాడు. 1998లో అతని ఇంటి లోపల అదే ప్రాంతంలో నివా సం ఉంటున్న మరో మహిళా కానిస్టేబుల్ ఉండడాన్ని స్థానికులు చూసి గదికి తాళం వేశారు. దీంతో కానిస్టేబుల్ శరవణబాబుకు, మహిళా పోలీసు కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందా అని భావించి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడానికి నిర్ణయించారు. అతన్ని డిస్మిస్ చేస్తూ సాయుధ దళం విభాగం ఐజీ మణి ఆదేశాలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శరవణబాబు మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తనకు మహిళా కానిస్టేబుల్‌కు వివాహేతర సంబంధం లేదని పేర్కొన్నారు. ఆమె బయటకు వెళ్లినప్పుడు తాళం పెట్టి వెళుతూ ఉంటారని, దాన్ని తీసుకోవడానికి వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై తుది విచారణ అనంతరం శుక్రవారం హైకోర్టు తీర్పు ప్రకటించింది. న్యాయమూర్తి సురేష్‌కుమార్ ఫిర్యాదుదారుడు శరవణబాబు, ఆ మహిళ ఒకే ఇంటిలో ఉంటున్నట్లు సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. ఆరోపణలపై చర్యలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. శరవణ బాబును డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పురుషుడు, ఒక స్త్రీ ఒకే గదిలో ఉండడాన్ని వ్యభిచారంగా చూడడం సరికాదన్నారు. సమాజంలో పలువురికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీలు లేదని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
నాసాకు తొలి మహిళా చీఫ్?
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు తదుపరి అధిపతిగా ఒక మహిళ రాబోతుందా? అంటే అవునంటున్నాయి అమెరికా మీడియా వర్గాలు. జోబైడెన్ అధ్యక్షుడిగా పదవి చేపట్టడంతో ఇప్పటివరకు నాసా అధిపతిగా ఉన్న జిమ్ బ్రిండెన్స్టైన్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. జిమ్ స్థానంలో నాసా చీఫ్‌గా ఒక మహిళ ను ఎంచుకోవాలని బైడెన్ భావిస్తున్నట్లు సైంటిఫిక్ అమెరికన్ అనే పత్రిక తెలిపింది. ఇదే నిజమైతే 1958లో ఏర్పాటైన తర్వాత తొలిసారి నాసాకు ఒక మహిళాధిపతి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం జిమ్ స్థానంలో స్టీవ్ జుర్జెక్ను నాసా తాత్కాలిక అధిపతిగా బైడెన్ నియమించారు. మీడియా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే బైడెన్ టీమ్‌లో పనిచేస్తున్న ఎల్లెన్ స్టోఫాన్, పామ్మెల్ రాయ్ తదితరులు ఈ రేసులో ఉన్నారు. వీరిలో స్టోఫాన్ ప్లానెటరీ జియాలజిస్టు, 2013–16లో నాసా చీఫ్ సైంటిస్టుగా పని చేశారు. ఇప్పటికే స్మిత్ సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంకు పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సాధించారు. మెల్రాయ్ యూఎస్ వైమానిక దళంలో, నాసాలో పనిచేశారు. టీటీఓ, యూఎస్డీఏఆర్పీఏ సంస్థలకు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. వీరితోపాటు క్లైమేట్ సైంటిస్టు షానన్ వాలీ, టెక్నాలజీ అనలిస్టు భవ్యా లాల్, ఆస్ట్రోఫిజిస్ట్ జెడిదా ఐలర్ పేర్లు సైతం నాసా రేసులో వినిపిస్తున్నాయి. కేబినెట్లో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించిన బైడెన్– హారిస్ ప్రభుత్వం ఇదే ధోరణిని నాసాకు కూడా విస్తరించాలని యోచిస్తోందని ప్రముఖ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్, నాసా ప్యానెల్స్‌లో మెంబర్‌గా పనిచేసిన జాక్ బర్న్స్ అభిప్రాయపడ్డారు. నిజానికి నాసాకు ఎప్పుడో మహిళాధిపతిని నియమించాల్సి ఉందన్నారు. నాసా చీఫ్‌గా నియమించే అవకాశాలున్న కొందరి పేర్లను తాను అంచనా వేస్తున్నానని, కానీ ఇప్పుడు బహిర్గతం చేయనని తెలిపారు. ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం కరోనా కట్టడిపై అధిక శ్రద్ధ పెడుతున్నందున కొత్త చీఫ్ ఎంపిక 2021 మధ్యలో ఉండొచ్చని అంచనా. -
నావికా నాయికలు
త్రివిధ దళాలు నిన్న ఒకేసారి.. మహిళలు ఎగరేసిన త్రివర్ణ పతాకాలు అయ్యాయి! నేవీ హెలికాప్టర్లు తొలిసారి మహిళల చేతికి వచ్చాయి! ఆర్మీ ‘పర్మినెంట్’ సర్వీస్‌లలోకి మహిళలు రావడం మొదలైంది! ఎయిర్‌ఫోర్స్‌లో రఫేల్‌ను ఒక మహిళ నడపబోతోంది! రితిసింగ్, కుముదిని త్యాగి.. నావికా నాయికలుగా నిలవడం పతాక సన్నివేశం అయింది! పంచభూతాలతో చెలిమి కలుపుకొని శత్రువు తో తలపడవలసిన పరిస్థితి నేవీలో ఉంటుంది. నింగి, నేల, నీరు అని చూడ్డానికి ఉండదు. ఎగరడమే, దూకడమే, ఈదడమే! ‘సమరమే..’ అంటూ యుద్ధనౌక నుంచి విమానాన్నైనా హెలికాప్టర్నైనా పైకి లేపాలి. సరిహద్దుల వైరి స్థావరాల్లో ప్రకంపనలు రేపాలి. దుద్భేద్యాలను బీటలు వార్చేంత మెరుపు వేగంతో గగనం నుంచి నిప్పులు కురిపించాలి. ఇంతటి అరివీరభయంకర విధి నిర్వహణ అవకాశం నేవీ చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళల చేతికి అంది వచ్చింది! అంది రావడం కాదు, అంది పుచ్చుకున్నారు! ఇప్పటివరకు పురుషులకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ సవాలును కష్టపడి చేజిక్కించుకున్నారు. నౌకాదళంలో ఇప్పటికే సబ్ లెఫ్ట్నెంట్లుగా ఉన్న రితీసింగ్, కుముదినీ త్యాగి నేవీలోని ‘అబ్జర్వర్’ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. భారతీయ నౌకాదళానికీ గౌరవం, గర్వం తెచ్చిపెట్టారు. సోమవారం కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ నుంచి కదనోత్సాహంతో కొత్త పాత్రను పోషించడానికి బయటికి వచ్చిన రితి, కుముదినిలకు అక్కడి ఐ.ఎన్.ఎస్. గరుడ భారతీయ నౌకా స్థావరం ‘వింగ్స్’ని తొడిగి అభినందించింది. బాధ్యతల పూలగుచ్చాన్ని చేతికి అందించింది. యుద్ధనౌకల్లోని ఫైటర్ హెలికాప్టర్ల పైలట్లు ఇప్పుడు.. రితి, కుముదిని. యుద్ధనౌకల్లో ఆకస్మిక, అత్యవసర విధుల నిర్వహణ మహిళలకు అనువుగా ఉండదు. గంటల పాటు సుదీర్ఘంగా సముద్రంపై గస్తీ కాస్తుండాలి. సిబ్బంది గదుల్లో మరుగు, మాటు ఉండవు. మహిళలకు అవసరం అయ్యే ప్రత్యేకమైన సదుపాయాలు, సౌకర్యాలు కనిపించవు. నీటిలో నీటిలా, గాలిలో గాలిలా ఉండిపోవలసిందే. అందుకే నేవీలో వైద్యాధికారులు, వ్యూహకర్తలుగా మాత్రమే మహిళలు కనిపిస్తారు. ఈ పరిస్థితి రితి, కుముదినిలతో మారబోతోంది. అంటే వీళ్ల కోసం నేవీ తనను తాను మార్చుకుంటుందని కాదు. నేవీకి అవసరమైన పోరాట పటిమను.. అన్ని ప్రతికూలతలకూ అతీతంగా వీళ్లు కనబరుస్తారు. శత్రువుపై ఒక కన్నేసి ఉంచుతారు. దాడులను ఊహిస్తారు. దళాలను అప్రమత్తం చేస్తారు. అప్పటికప్పుడు హెలీకాప్టర్లలో రివ్వున లేచి యుద్ధ సన్నద్ధ సంకేతాలను అందజేస్తారు. వీరి ఆగమనం కోసం ఇప్పుడు నౌకాదళంలోని ఎం.హెచ్.–60 ఆర్ హెలికాప్టర్లు ఎదురు చూస్తున్నాయి. రితి సింగ్ హైదరాబాద్ అమ్మాయి. మూడు తరాలుగా వాళ్లది ‘రక్షణ దళాల కుటుంబం’. రితి తాతగారు ఆర్మీ ఆఫీసర్. రితి తండ్రి నేవల్ ఆఫీసర్. రితి ఇప్పుడు ‘వింగ్’ ఫైటర్ పైలట్. ‘వైట్ యూనిఫాం వేసుకోవడం నా కల’’ అంటారు రితి. ఇక కుముదిని యు.పి.లోని ఘజియాబాద్ నుంచి వచ్చారు. 2015లో ఒక నౌకాదళ విమాన ప్రమాదంలో లెఫ్ట్‌నెంట్ కిరణ్ షెకావత్ మరణించిన దుర్ఘటన కుముదిని నేవీలోకి వచ్చేందుకు ప్రేరణ అయింది. ఇక ఇటీవలే ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు శిక్షణ పొందే బృందంలో సభ్యురాలిగా ఒక మహిళను కూడా ఎంపిక చేసినట్లు యాదృచ్ఛికంగా సోమవారమే భారత వైమానిక దళం ప్రకటించింది. హర్యానాలోని అంబాలాలో ఉన్న ‘గోల్డెన్ యారో’ స్థావరంలో ప్రస్తుతం ఆమె శిక్షణ పొందుతున్నారు. రఫేల్ వంటి ఒక ‘మల్టీ రోల్’ యుద్ధ విమానాన్ని ఒక మహిళ ఆపరేట్ చేయబోవడం అన్నది కూడా రితి, కుముదిని సాధించిన ఘనతకు, సృష్టించిన చరిత్రకు సమానమైనదే. అయితే ఆ మహిళ ఎవరు? ఆ మహిళకు మిగ్–21 ఫైటర్ జెట్‌ను నడిపించిన అనుభవం ఉందన్న ఒక విషయాన్ని మాత్రమే ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. 2018లో ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది సోలోగా యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందారు. అప్పుడు ఆమె నడిపింది మిగ్–21 నే. వైమానిక దళంలోని యుద్ధ విధుల్లోకి ప్రయోగాత్మకంగా మహిళల్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన ఏడాదికే 2016 జూలైలో ‘ఫ్లయింగ్ ఆఫీసర్’ కోర్సు పూర్తి చేసుకున్న ముగ్గురు యువతులలో అవని ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌లో 10 మంది మహిళా ఫైటర్లు, 18 మంది మహిళా నేవిగేటర్లు ఉన్నారు. మొత్తంగా 1875 మహిళా అధికారులు ఉన్నారు. -
స్త్రీలకు రెట్టింపు నిధి
వేపాడ: మహిళా సంఘాల సభ్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సంఘాల సభ్యు లకు ఇచ్చే స్త్రీ నిధి రుణాల మంజూరు మొత్తాన్ని రెట్టింపు చేసింది. వైఎస్సార్ క్రాంతి పథకం కింద బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్త్రీ నిధి రుణం మంజూరు చేస్తోంది. జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న ఏడు క్లస్టర్ల పరిధిలో 43,752 మహిళా సంఘాలు ఉన్నాయి. స్త్రీనిధి రుణ లక్ష్యం 2019–20 ఆర్థిక సంవత్సంలో 7,775 సంఘాలకు 124.66 కోట్లు కాగా, ఇప్పటి వరకు 5,944 సంఘాలకు 83.89 కోట్లు స్త్రీనిధి రుణం అందజేశారు. లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి మొ త్తాన్ని రెట్టంపు చేయడం, వడ్డీ› తగ్గింపు, వాయిదాల కుదింపుతో మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పాడిపరిశ్రమ, కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర దుకాణాలు, పండ్ల దుకాణం తదితర వ్యాపారాలకు స్త్రీ నిధి రుణం తోడ్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. స్త్రీ నిధి రుణం మంజూరు ఇలా.. డ్వాక్రా సంఘంలో పదిమంది సభ్యుల్లో ఇద్దరు సభ్యులకు రూ.లక్ష చొప్పున, లేదంటే నలుగురు సభ్యులకు రూ.50 వేలు చొప్పున రెండు లక్షలు పొందవచ్చు. అదే 11 మంది సభ్యులున్న సంఘంలో ఆరుగురు మహిళలు రూ.మూడు లక్షల వ్యక్తిగత రుణం తీసుకునే అవకాశం ఉంది. స్త్రీ నిధి రుణాలకు అర్హత ఉన్న సంఘాలు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. గతంలో వడ్డీ 12.50 శాతం ఉండేది. ప్రస్తుత జగనన్న ప్రభుత్వం 11.75 శాతానికి తగ్గించింది. గతంలో బ్యాంకు లింకేజీ రుణంగా తీసుకుంటే 60 వాయిదాల్లో చెల్లించుకునేవారు. ఇకపై 48 నెలల్లో చెల్లించుకునే వెసులబాటు కల్పించారు. సక్రమంగా వాయిదాలు చెల్లించే సంఘాలకు ప్రభుత్వమే వడ్డీ లేని రుణం మంజూరు చేస్తుంది. మహిళలకు మేలు చేయాలనే... సీఎం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళల ఇబ్బందులకు స్వయంగా గమనించారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో స్త్రీ నిధి రుణం రెట్టింపు చేశారు. గత ప్రభుత్వంలో బ్యాంకు లింకేజీ రుణం గ్రూపునకు రూ.5 లక్షలు మించి తీసుకుంటే స్త్రీ నిధి రుణం ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు రుణాన్ని డీఆర్డీఏ సిబ్బంది బ్యాంకు నుంచి అందజేస్తున్నారు. అంతకన్నా తక్కువ రుణం తీసుకున్న సంఘంలోని పది మంది సభ్యుల్లో ఇద్దరికి మాత్రమే స్త్రీ నిధి రుణం రూ.లక్ష మాత్రమే పొందే అవకాశం ఉంది. ఇద్దరికి చెరో రూ.50వేలు రుణం చాలక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని అవస్థలు పడేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు పొదుపు సంఘాల సంభ్యులకు మేలు చేకూర్చుతున్నాయి. పెరిగిన కేటాయింపులు: బ్యాంకు లింకేజీ రుణాలు, ఉన్నతి, స్త్రీనిధి, రుణాలు వసూలు చేయడం, సమావేశాలు, రికార్డుల నిర్వహణ, సమర్ధవంతంగా పనిచేస్తున్న మండల సమాఖ్యలను ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజిస్తారు. గతంలో గ్రేడ్లు వారీగా ఇచ్చే స్త్రీనిధి మొత్తాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల్లో ఆనందం కలిగించింది. ఏ గ్రేడ్‌కు ఎంత పెంచారంటే... ఏ–గ్రేడ్‌లోని సంఘాలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు, బీ గ్రేడ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు, సీ–గ్రేడ్‌కు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు, డీ గ్రేడ్‌లోని సంఘాలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు రుణాన్ని పెంచారు. సక్రమంగా రుణాలు చెల్లించడంతో పాటు పేదరిక నిర్మూలన సంస్థ షరతులను సక్రమంగా అమలు చేస్తే సంఘాలకు అదనంగా నిధులు మంజూరు చేస్తారు. ప్రథమ స్థానంలో ఎస్.కోట... జిల్లాలోని 7 ఏసీ క్లస్టర్ల పరిధిలో ఎస్.కోట క్లస్టర్‌లోని 1464 సంఘాలకు రూ.25.43 కోట్లు రుణ లక్ష్యంకాగా.. ప్రోగ్రెస్‌లో ఉన్న వాటితో కలిపి 1716 సంఘాలకు 25.79 కోట్ల రుణాలు మంజూరు చేసి జిల్లాల్లో 101.42 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. పార్వతీపురం క్లస్టర్ రూ.63.44 కోట్లు రుణం ఇచ్చి ఆఖరు స్థానంలో నిలిచింది. ఆనందం రెట్టింపు మహిళా సంఘాల స భ్యులకు స్త్రీనిధి రుణం రెట్టింపు చేయడం ఆనందంగా ఉంది. చిన్నచిన్న వ్యాపారాల తో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కలి గింది. బయట అప్పులు చేసుకునే అవసరం లేదు. వాయిదాలు సకాలంలో కడితే వడ్డీ రాయితీ వస్తుందని చెబుతున్నారు. – భోజంకి మాధవి, సంఘసభ్యులు, వేపాడ స్వయం ఉపాధికి ఊతం స్త్రీనిధి రుణాల మంజూరుతో పొదుపు సంఘాల మహిళల స్వయం ఉపాధికి ఊతం లభిస్తుంది. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్త్రీ నిధి రుణం ఇవ్వడం, గతంలో కంటే సభ్యులను పెంచడం, రెట్టింపు రుణం ఇవ్వడం చాలా మంచినిర్ణయం. మహిళలు ప్రైవేటు అప్పులు చేసే అవసరం ఉండదు. రుణాలతో వ్యాపారపురోగతి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో స్త్రీ నిధి లక్ష్యం చేరువలో ఉన్నాం. నేటికి ప్రోసెస్‌లో ఉన్న నంఘాలతో కలిపి 88.95 శాతం లక్ష్యం చేరుకున్నాం. ఎస్.కోట క్లస్టర్ మొదటి స్థానంలో నిలిచింది. స్త్రీనిధి రుణం రెట్టింపు వల్ల మహిళలకు ఆనందం కలుగుతోంది. – కె.సుబ్బారావు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ, విజయనగరం -
ఫి'మేల్' ఇదే నేటి లేటెస్ట్ ఫ్యాషన్
యూనిసెక్స్ ఫ్యాషన్..ఇప్పుడు లేటెస్ట్ టాపిక్. జెండర్ ఈక్వాలిడీ, జెండర్ న్యూట్రాలిటీ క్లాతింగ్ అని కూడా అనవచ్చు. స్త్రీ, పురుషులశరీరాలకు అనుగుణంగా దుస్తుల రూపకల్పన చెయ్యటం పరిపాటి. అన్నింటిలో సమానత్వం కోరుకుంటున్నట్టుగానే వస్త్రధారణలోను సమానత్వాన్ని ఇనుమడింప చేసేందుకే యూనిసెక్స్ ఫ్యాషన్ ప్రారంభమైంది. హ్యాపీగా జీన్స్.. చుడీదార్ ‘‘వామ్మో. ఏంటే జీన్స్ వేసుకున్నావ్.. రేయ్..ఏంట్రా నీ డ్రెస్ చుడీదార్లా ఉంది..!’’ ఇటువంటి మాటలు 90వ దశకం వరకు వినిపించాయి. అయితే రాను రాను పరిస్థితి మారిపోయింది. గతంలో దక్షిణాదిలో చుడీదార్ వేసుకునే అమ్మాయిలు తక్కువనే చెప్పాలి. అయితే ఇప్పుడు అందరూ (అమ్మాయిలు, అబ్బాయిలు) హ్యాపీగా జీన్స్, షాట్స్ వేసుకుంటున్నారు. అబ్బాయిలు.. అమ్మాయిలు వేసుకునే కుర్తీలు కూడా కాస్త డిజైన్ మార్చి ధరిస్తున్నారు. ఈ వస్త్ర ధారణనే యూనిసెక్స్ క్లాతింగ్ అంటారు. ఇతర రాష్ట్ర సంప్రదాయ దుస్తులు స్వీకరించలేని స్థితి నుంచి సంస్కృతులకు సంబంధించిన దుస్తులు ధరించే స్థాయికి చేరుకున్నాం. సమయం, అవసరాలు, ఆలోచనలు మారుతున్న క్రమంలో లింగ బేధం లేని దుస్తుల ధరించాలనే దిశగా నేటి యువత సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో యూనిసెక్స్ ఫ్యాషన్ దుస్తులు, యాక్ససరీస్ లభిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పాపులర్.. యూనిసెక్స్ క్లాతింగ్‌లో రెండు రకాలు.. మొదటి రకం పూర్తిగా యూనిసెక్స్ దుస్తులు. ఏ జెండర్ వారైనా వేసుకునే విధంగా కొంచెం వదులుగా ఉండే దుస్తులు. మరొకటి, స్త్రీ, పురుషులు కామన్‌గా వేసుకునే దుస్తులు. ట్రౌజర్స్, టీ షర్ట్స్, వెస్ట్‌లు, బ్లేజర్లు, సూట్లు లాంటివి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ వేసుకుంటారు. అయితే వీటిలో కొంత ఫిట్టింగ్ మార్పులుంటాయి. ఈ దుస్తులు అందించే బ్రాండ్లు ఇప్పుడిప్పుడే ఇండియాలో పాపులర్ అవుతున్నాయి. యూనిఫాం కూడా.. మిలిటరీ, పోలీసు, నేవీలో ఒకే విధమైన యూనిఫాం ఉంటుంది. కుట్టే విధానంలో చిన్న చిన్న మార్పులు మినహాయిస్తే దాదాపు యూనిసెక్స్ క్లోతింగ్ చాలా చోట్ల వచ్చేసిందనే చెప్పాలి. స్పోర్ట్స్ వేర్లోజెండర్ ఈక్వాలిటీ లండన్ ఎయిర్‌పోర్ట్‌లో రోహన్ డిజైన్ అనే స్పోర్ట్స్ వేర్ స్టోర్‌కి పనిచేసేవాడిని. అది ఇండియన్ కంపెనీ కాదు.ఆ స్టోర్‌లో, ముఖ్యంగా స్పోర్ట్స్ వేర్లో జెండర్ ఈక్వల్ దుస్తులు చాలా ఉండేవి. స్పెషలైజ్డ్ ఫ్యాబ్రిక్స్ అక్కడ ఉండేవి. అసాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి రూపొందించిన దుస్తులు కూడా అక్కడ ఉండేవి. అవన్నీ ఒక జెండర్ కోసం రూపొందించినవి కావు. హైకింగ్, మౌంటనీరింగ్ కోసం రూపొందినవి. కాబట్టి యూనిసెక్స్ క్లోతింగ్. అవి జెండర్ తేడా లేకుండా కొనుక్కుని వెళ్లేవారు. మరో లేటెస్ట్ఇండియన్ ఫ్యాషన్ జంప్‌సూట్స్. ఇవి జనరల్గాజంప్సూట్స్ ఆర్మీ, నేవీలో ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్న వారు విధుల్లో ధరిస్తుంటారు. వాటిని ప్యాషనబుల్గా రెగ్యులర్వేర్గా ధరించేలా ఫ్యాషన్ లుక్ ఇచ్చాను. హిందీ బిగ్‌బాస్ షో పార్టిసిపెంట్లునేను రూపొందించిన జంప్‌సూట్ వేసుకుని షోలో కనిపిస్తున్నారు. జంప్ సూట్లు అమ్మాయిలు కూడా వేసుకుంటారు. బాలీవుడ్లో శిల్పాశెట్టి, మలైకా అరోరాధరిస్తుంటారు. – నిశ్చయ్ నియోగి, ప్రముఖ స్టైలిస్ట్ ముంబై.. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో అయితే.. కుర్తా, పైజామాలో పెద్ద విప్లమం వచ్చిందనే చెప్పాలి. పురుషుల కుర్తాలకు ఎంబ్రయిడారీ తక్కువ వాడతారు. అమ్మాయిల కుర్తా అయితే కొంచెం ఎక్కువ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్, ప్యాట్రన్ సేమ్‌గా ఉంటున్నాయనే చెప్పాలి. ప్రింట్స్ ఫ్యాషన్‌లో ఉన్నాయి. అవి పురుషులు కూడా హాయిగా ధరిస్తున్నారు. సంప్రదాయంగా కుర్తాలు యూనిసెక్స్ క్లోతింగ్‌లో చేరిపోయినట్లే.. నేపథ్యం.. లింగ సమానత్వం అనే అంశం మన దగ్గర ఈ మధ్యే ఊపందుకుంటోంది. ఇది విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. 1968లో లైఫ్ అనే మ్యాగజైన్లో తొలిసారి యూనిసెక్స్ ఈ పదాన్ని వాడారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్త్రీలకు సమానావకాశాల కల్పన జరగాలనే ఆలోచన పాశ్చాత్య దేశల్లో బలంగా వచ్చింది. అక్కడ వాళ్లు అనేక అంశాల్లో సమానత్వాన్ని సాధించారు. దుస్తుల్లోను లింగబేధంలేని వస్త్రధారణ అక్కడ చూడవచ్చు. బాగా ఫ్యాషన్ ఫాలో అయ్యే వారు వీటిని ధరిస్తుంటారు. ఇక్కడ యూనిసెక్స్ క్లోతింగ్ అంటే జనం తికమక పడతారు. అవి ఏరకమైన దుస్తులో, ఎలా ఉంటాయో అని జంకుతారు. -
ఐసీసీ రిఫరీగా తెలుగు మహిళ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో తొలిసారి ఒక మహిళకు చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండికోట సర్వ (జీఎస్) లక్ష్మి ఆ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇకపై ఏ అంతర్జాతీయ మ్యాచ్‌కైనా లక్ష్మి రిఫరీగా వ్యవహరించవచ్చని ఐసీసీ ప్రకటించింది. 51 ఏళ్ల లక్ష్మి ఇప్పటి వరకు కేవలం మహిళల క్రికెట్ మ్యాచ్‌లకే (3 వన్డేలు, 3 టి20లు) రిఫరీగా పని చేసింది. తాజా మార్పు తర్వాత ఆమె అన్ని మ్యాచ్‌లకు ఆ బాధ్యతను నిర్వహించేందుకు అర్హత లభించింది. గతవారం బీసీసీఐ ప్రయోగాత్మకంగా నిర్వహించిన మహిళల టి20 చాలెంజ్ కప్‌లోనూ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా పని చేసింది. పురుషుల క్రికెట్లో ఇటీవల తొలిసారి క్లాయెర్ పొలొసాక్ తొలి సారి అంపైర్‌గా వ్యవహరించి అరుదైన ఘనత నమోదు చేయగా... ఇప్పుడు లక్ష్మికి రిఫరీగా అవకాశం దక్కింది. ఐసీసీ అంపైర్ డెవలప్మెంట్ ప్యానెల్లో ఇప్పటికే ఏడుగురు మహిళలు ఉండటం విశేషం. ‘మహిళలను ప్రోత్సహించాలనే ఐసీసీ ప్రణాళికల్లో ఇదో ముందడుగు. అయితే లక్ష్మి ఎంపిక పూర్తిగా ప్రతిభపైనే ఆధార పడి జరిగింది. ఇక ముందు కూడా ఆమె పనితీరును బట్టే ముందుకు వెళుతుంది తప్ప మహిళ అని మాత్రం కాదు’ అని ఐసీసీ స్పష్టం చేసింది. రిఫరీ ప్యానెల్లో ఎంపిక కావడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఇన్నేళ్ల అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకముందని ఈ సందర్భంగా లక్ష్మి విశ్వాసం వ్యక్తం చేసింది. రాజమండ్రిలో జన్మించిన లక్ష్మి... తండ్రి శేషగిరి శర్మ టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె విద్యాభ్యాసం జంషెడ్‌పూర్‌లో జరి గింది. బిహార్, ఆంధ్ర, ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్, రైల్వేస్ జట్లకు ఆమె ప్రాతినిధ్యం వహించిన లక్ష్మి ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పీఆర్ఓ కార్యాలయంలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. -
ఈవెనింగ్ సినిమా
స్త్రీని, పురుషుడిని ప్రకృతి వేర్వేరుగా సృష్టించింది తప్ప, స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఏమీ సృష్టించలేదు. వెలుగునీడలు, ఎండావానలు ఇద్దరికీ ఒకటే. అంటే ప్రకృతికి స్త్రీ పురుషులిద్దరూ సమానం. పురుషుడే.. స్త్రీ తనకు సమానం కాదనుకుంటాడు! అందుకే స్త్రీలకు ఏ కాలానికి ఆ కాలం ధర్మయుద్ధాలు, న్యాయ పోరాటాలు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. మహిళల తాజా పోరాటం, తాజా విజయం.. ఈవెనింగ్ సినిమా. మాధవ్ శింగరాజు స్త్రీ తనంత బలమైనది కాదని, తనంత తెలివైనది కాదని, తనంత చురుకైనది కాదని భావించి గొప్ప పెయిన్‌ని ఓర్చుకునే ఔదార్యంతో ఆమెను తనతో సమానంగా పైకి తెచ్చేందుకు అప్పుడప్పుడు చట్టాలు తెస్తుంటాడు పురుషుడు. స్త్రీకన్నా తను బెటర్ హ్యూమన్ బీయింగ్ అనుకోవడం వల్ల తనపై తనకే కలిగే ఆత్మవిశ్వాసంతో ఆమెనూ తనలా బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా మలిచేందుకు తను తగ్గి, తనలోని అధికుడినన్న భావనను తనకు తానుగా దహింపజేసుకుని తిరిగి తనే మరింతగా ఉన్నతీకరణ చెందుతాడు! అందుకే.. స్త్రీకి స్వేచ్ఛనివ్వడం పురుషుడి దృష్టిలో ఈనాటికీ గొప్ప సంస్కరణగా మన్నన పొందుతోంది. చితిపై నుంచి సతిని పైకి లేపాడు. చిన్నప్పుడే పెళ్లేమిటని పీటల పైనుంచీ లేపేశాడు. చదువుకోనిచ్చాడు. సినిమా చూడనిచ్చాడు. తను చేసే ప్రతి పనినీ చెయ్యనిచ్చాడు. ఈమధ్యే శబరిమలకు కూడా వెళ్లనిచ్చాడు. ఇప్పుడు హాస్టల్ అమ్మాయిల్ని ఫస్ట్షోకి, సెకండ్‌షోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. ఇవ్వడం, చెయ్యనివ్వడం రెండూ గొప్ప ఉదారతలే. అయితే తీసుకున్నది తిరిగి ఇచ్చేయడం, కట్టడి చేసి పట్టు విడవడం ఔదార్యం ఎలా అవుతుంది.. చేసిన తప్పును, ఇచ్చిన తీర్పును దిద్దుకోవడం అవుతుంది గానీ! ఏదో ఒకటి ప్రసాదిస్తున్నారు కదా, పోనివ్వండి. మనది మనకు ఇవ్వడం కూడా పురుషధర్మం అనుకుంటున్నారు కనుక మనమూ అలాగే మహాప్రసాదం అనుకుంటే వచ్చే నష్టం ఏమిటి? నష్టం ఏంటంటే.. తిరిగి ఇచ్చేసిన దానిని తిరిగి లాగేసుకుని మళ్లీ ఆంక్షలు విధించి, సంకెళ్లు వేసి.. సంస్కరణలు అవసరమైన పూర్వపు కాలాల్లోకి స్త్రీలను పురుషులు లాక్కెళ్లరనే నమ్మకం లేదు. అందుకే స్త్రీ ఎప్పుడూ తన కోసం జరిగిన ఏ మెరుగైన మార్పునూ కళ్లు విప్పార్చి చూడలేదు. మహిళల జీవితాలు మెరుగుపడేందుకు జరుగుతున్న పురుష ప్రయత్నాల వల్ల పైకి మీగడ తేలుతున్నది పురుష స్వామిత్వం తప్ప స్త్రీ పురుష సమానత్వం కాదు. మెరుగుపడటం అంటే స్త్రీ పురుషులకు ప్రకృతి ఇచ్చిన సమానత్వానికి పురుషుడు తలవొగ్గడం. సమానత్వాన్ని తీసేసుకుని తిరిగి ఇచ్చేయడం ‘మెరుగు’ ఎలా అవుతుంది? ఐదు రోజుల క్రితం కేరళ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది. అయితే అది మగవాళ్లకే సంచలనాత్మకం కానీ, ఆడవాళ్లకు కాదు. అందుకే స్త్రీలు గానీ, స్త్రీవాదులుగానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ‘కోర్టిచ్చిన తీర్పు ఈ పురుషస్వామ్య సమాజానికి పెద్ద కనువిప్పు’ అనే స్టేట్మెంట్లూ వినిపించలేదు. ఆ తీర్పుకంత ప్రాచుర్యం లభించకపోవడానికి ఇంకోకారణం.. దేశం ఇప్పుడు ఎలక్షన్ మూడ్‌లో ఉండడం. త్రిశ్సూర్‌లోని ‘శ్రీ కేరళ వర్మ కాలేజ్’ హాస్టల్ విద్యార్థినులు.. తమను హాస్టల్ యాజమాన్యం ఫస్ట్షోలకు, సెకండ్‌షోలకు వెళ్లనివ్వడం లేదని కేసు వేశారు. ‘బాయ్స్ హాస్టల్లో లేని ఈ ఆంక్ష, వివక్ష గర్ల్స్ హాస్టల్‌కు ఎందుకు?’ అన్నది వారి వాదన. నిజమే అనిపించింది న్యాయస్థానానికి. ‘‘ఈవెనింగ్ మూవీలకు వెళ్లే స్వేచ్ఛ అబ్బాయిలకు మాత్రమే ఎందుకు ఉండాలి? అమ్మాయిలకూ కల్పించండి’’ అని కోర్టు ఆ హాస్టల్ వారిని ఆదేశించింది. రాజ్యాంగంలోనే స్త్రీ పురుష సమానత్వం ఉన్నప్పుడు ఆ సమానత్వ హక్కును నిరాకరించడం నేరం అవుతుందని కూడా హాస్టల్ యాజమాన్యాన్ని మేల్కొలిపింది. దీనికి ఆ అమ్మాయిలు సంతోషించారు. నిజంగానే వాళ్లు ఫస్ట్ షోలకు, సెకండ్ షోలకు వెళ్తారా అన్నది తర్వాతి మాట. వెళ్లడానికైతే అనుమతి సాధించారు. అనుమతి సాధించడం కాదది. ఉన్న అనుమతిని సాధించుకోవడం!ప్రకృతి ఇచ్చిన సమానత్వ హక్కుల్ని పొందడం కోసం స్త్రీ పురుషుడి నుంచి అనుమతి తీసుకోవలసిన పరిస్థితిని పురుషుడు కల్పించిన నాటి నుంచీ ఈ పోరాటం సాగుతూనే ఉంది. అంటే.. స్త్రీలెవరూ హక్కుల సాధనకోసం పోరాటం చేయడం లేదు. హక్కుల్ని కాపాడుకోవడం చేస్తున్నారు. కొత్తగా వాళ్లేదైనా చెయ్యాలంటే.. చేయవలసింది ఒక్కటే. మగవాడిని సంస్కరించడం. అంటే ఏంటి? స్త్రీలను ఉద్ధరించే పని నుంచి అతడికి విముక్తి కల్పించడానికి ఆధిక్య భావనల నుంచి అతడిని కిందికి తోసేయడం. సాయి పల్లవి (ప్రతీకాత్మక చిత్రం) హాస్టల్ విద్యార్థినులను ఈవెనింగ్ షోలకు వెళ్లనివ్వకుండా నిరోధించడం.. స్త్రీ, పురుష సమానత్వ హక్కులకు భంగం కలిగించడమేనని కేరళ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. -
కండలు తిరిగిన కెరీర్
ఇంజనీరో, డాక్టరో అంతకీ కాదంటే ఇంకేదైనా గ్లామర్ రంగాన్నో అమ్మాయిలు ఎంచుకుంటే ముచ్చటపడేవారే. అదే కనుక అమ్మాయి క్రీడల్లో, మరీ ముఖ్యంగా బాడీ బిల్డింగ్ లాంటి కఠినమైన ఏ రంగాన్నో ఎంచుకుంటే ముఖం చిట్లించుకుంటారు. అందుకేనేమో తెలుగు రాష్ట్రాల్లో మహిళా బాడీ బిల్డర్లు దాదాపుగా కనిపించరు. ఈ నేపథ్యంలో వడ్డించిన విస్తరిలాంటి జీవితం ఉన్నా.. వ్యయప్రయాసలను భరిస్తూ బాడీ బిల్డింగ్ రంగాన్ని ఎంచుకున్న కీర్తి చెన్నా (25) ఇటీవలే ‘మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ టైటిల్’ని గెల్చుకున్నారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ మన దగ్గర మహిళా బాడీ బిల్డింగ్‌కు కొత్త ఊపిరి పోస్తున్నారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.... మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్. అమ్మ గృహిణి. నా సోదరి సహా ఫ్యామిలీలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను కాస్మొటాలజీ కోర్సు చేశాను. అయితే ఎవరూ ఎంచుకోని రంగాన్ని ఎంచుకోవాలని దృఢంగా అనిపించింది. అదే సమయంలో జస్ట్ హెల్త్ కోసం జిమ్‌లో చేరాలనుకున్నా. కాని ఏ జిమ్‌లో చూసినా మహిళా ట్రైనర్లు కనిపించలేదు. అంటే.. బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ అనేవి పురుషులకు సంబంధించినవిగా మాత్రమే పరిగణన పొందుతున్నాయని అర్థమైంది. అప్పుడే అనుకున్నాను.. నేనెందుకు బాడీ బిల్డర్‌ని కాకూడదని. అలా రెండేళ్ల క్రితం నా ఫిజిక్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంట్లో ఒప్పించడం కష్టమే! నా శరీరాన్ని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకునేందుకు బాడీ బిల్డింగ్‌లోకి వెళదామని నిర్ణయించుకున్నా. అయితే అమ్మానాన్నకు నేను బాడీ బిల్డింగ్‌లోకి వెళ్లడం అంత ఇష్టం లేదు. ఈ రంగంలోకి అమ్మాయిలు వెళ్లడాన్ని కుటుంబం ఇష్టపడటం అనేది అంత సులభ సాధ్యం కాదు. అబ్బాయిల్లా మజిల్ బిల్డ్ అవడం చూసి కంగారు పడటం సహజమే. ఇద్దరం కూతుళ్లమే కాబట్టి నన్ను అబ్బాయిగా అనుకోండి అని చెప్పా. తర్వాత నా పట్టుదల, కొన్ని చాంపియన్‌షిప్స్‌లో గెలవడం... వీటితో ఇంట్లోవాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. దీన్నేదో నేను ఆషామాషీగా తీసుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో నన్ను ప్రూవ్ చేసుకుని మా కుటుంబాన్ని మెప్పించాలనుకుంటున్నా. కఠిన శ్రమ...కాస్ట్లీ రొటీన్ అబ్బాయిలకు కాస్త వెయిట్ లిఫ్ట్ చేస్తే మజిల్ వచ్చేస్తుంది. ఈజీగా షేప్ అప్ అవుతుంది. కాని మహిళలకు అలా కాదు. మరోవైపు బాడీ బిల్డింగ్ అంటే వ్యయ ప్రయాసలు ఎక్కువే. మంచి జిమ్‌లో రెండు పూటలా వర్కవుట్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కలిపి రెండు గంటల చొప్పున చేస్తున్నాను. అయితే పోటీల సమయంలో ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. ఉదయం 45 నిమిషాలపాటు కార్డియో, సాయంత్రం వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను. జంక్ ఫుడ్ అసలు తినకూడదు. కూరగాయలు, స్టీమ్ ఫుడ్, బాయిల్డ్ చికెన్, సాల్మన్డ్ ఫిష్, ఎగ్‌వైట్స్ తీసుకుంటాను. అమ్మాయిగానే ఉండాలి ఒక అమ్మాయి మాత్రమే మరో అమ్మాయి శారీరక తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలదు. నాకైతే మహిళల కోసం మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి జిమ్ ప్రారంభించాలని ఉంది. బాడీ బిల్డింగ్ రంగంలోకి రావాలనుకునే, మంచి ఫిట్నెస్ సాధించాలనుకునే మహిళలకు స్ఫూర్తి కావాలని ఉంది. అమ్మాయిగా మెలితిరిగిన మజిల్‌తో ఉండటం నాకో ప్యాషన్. అదే సమయంలో అమ్మాయికి మాత్రమే స్వంతమైన రూపం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఎమ్‌టివి విజె జాకీ నాకు స్ఫూర్తి. కాంపిటీషన్ టైమ్‌లో ఒకలా, మిగిలిన సమయంలో ఒకలా ఫిజిక్‌ని మార్పు చేర్పులు చేసుకుంటూ వెళ్లొచ్చు. ఏదేమైనా... నా విజయాలకు మంచి స్పందన వస్తోంది. మంచి గౌరవం కూడా లభిస్తోంది. ఇటీవలే నాకు స్పాన్సర్ కూడా దొరికారు. ప్రత్యర్థులు అవసరం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం మహిళా బాడీ బిల్డర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. అదే ఉత్తరాది రాష్ట్రాలు, బెంగళూర్ నుంచి బాగా ఉన్నారు. మహారాష్ట్రలో అయితే ఇంటింటికీ ఫిమేల్ అథ్లెట్ అన్నట్టు ఉన్నారు. రీజనల్గా నాకు సరైన ప్రత్యర్థులు లేకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురి చేస్తోంది. త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న పోటీల్లో పార్టిసిపేట్ చేయనున్నాను మరిన్ని అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాను’’ అంటూ వివరించారు కీర్తి. – ఎస్.సత్యబాబు -
క్షణాల్లో కళ్లముందుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఏ నగరానికెళ్లినా, ఎక్కడో అక్కడ ఆడపిల్లలను అల్లరిపెడుతూ ఆకతాయులు అగుపడుతూనే ఉంటారు. రైల్లే స్టేషన్లలో, బస్టాండుల్లోనే కాకుండా మాల్స్ ముందు, వీధి చివరన మాటువేసి అల్లరి పెట్టే కొత్త తరం ఆకతాయులు తయారయ్యారు. వారిలో ఆడపిల్లలను కట్టు బొట్టు దగ్గరి నుంచి కామెంట్ చేసి ఇబ్బంది పెట్టడమే కాకుండా కనుగీటి ఏడిపించే ముదురులు కూడా ఉంటున్నారు. అయితే రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో వీరి ఆటలు ఇప్పుడు అంతగా సాగడం లేదు. ఆడపిల్లలను ఏడిపిస్తున్నారని ఏ మాత్రం అనుమానం వచ్చినా నీలి రంగు దుస్తుల్లో, నెత్తిన హెలిమెట్లతో బైక్‌పై ఇద్దరు మహిళా పోలీసులు కన్నుమూసి తెరిచే లోపల కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నారు. ఏడిపించే ఆకతాయులు ఎవరైనా, ఎంతటి వారైనా సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి సముచిత రీతిన సత్కరిస్తున్నారు. ఏడిపిస్తున్న తీరు, స్థాయినిబట్టి ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ఆకతాయులు అల్లరి చేస్తూ కనిపిస్తే రోడ్డుపై జిగ్‌జాగ్‌గా కూడా బైకులు నడుపుతూ వెళ్లి అమ్మాయిలకు రక్షణగా నిలబడుతున్నారు. రౌడీలను, ఆకతాయిలను, నేరస్థులను సివిల్ దుస్తుల్లో చూసినప్పుడు తమకూ భయం వేసేదని, ఒక్కసారి యూనిఫామ్ చేసుకున్నాక తమకు భయం అంటూ లేకుండా పోయిందని నిర్మలా, ప్రమీలా అనే మహిళా పోలీసులు తెలిపారు. కొత్తలో 30 రోజుల్లోనే 256 టీజింగ్ కేసులను నమోదు చేశామని ఇప్పుడు వారి సంఖ్య భారీగా తగ్గిపోయిందని వారు తెలిపారు. ముఖ్యంగా ఒక్కసారి పట్టుబడిన వారు మళ్లీ అల్లరి చేయక పోవడం విశేషమని వారు చెప్పారు. నగర వీధుల్లో తిరుగుతూ ఆడపిల్లలను అల్లరిపెట్టే ఆకతాయులపై చర్య తీసుకోవడం కోసమే ఈ మహిళా పోలీసు బైకర్లు ఉన్నారు. నిర్మలా, ప్రమీలాను కలుపుకొని నగరంలో మొత్తం 52 మంది మహిళా బైకర్లు ఉన్నారు. అయితే వీరి సంఖ్య సరిపోవడం లేదని వీరి సంఖ్యను వందకు పెంచాలనుకుంటున్నామని అడిషనల్ పోలీసు కమిషనరల్ గౌరవ్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి మహిళా దళాలు దేశంలో ఢిల్లీ, జైపూర్‌లతోపాటు ఉధయ్‌పూర్ నగరాల్లో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో రఫ్తార్ స్క్వాడ్ పేరిట ఇలాంటి మహిళా దళాన్ని 2017, మే నెలలో ఏర్పాటు చేశారు. వారి వద్ద తుపాకులు, స్టెన్గన్లతోపాటు పెప్పర్ స్ప్రేలు ఉంటాయి. ప్రస్తుత జైపూర్ మహిళా పోలీసుల వద్ద లాఠీలు మాత్రమే ఉన్నాయి. పోలీసుల్లోకి మహిళలు రావడానికి ఇప్పటికీ అంతగా ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యకరమని పోలీసు అధికారి శ్రీవాత్సవ అన్నారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఉండగా పది శాతానికి మించి మహిళలు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా పోలీసుల ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన చెప్పారు. నేడు భారత్‌లో ప్రతి 13 నిమిషాలకు ఒక రేప్ జరుగుతోంది. 2016లో రోజుకు ఆరుగురు మహిళలపై గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. కట్నం కోసం ప్రతి 69 నిమిషాలకు ఓ పెళ్లి కూతురు హత్యకు గురవుతున్నారు. 2012లో ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య జరిగిన తర్వాత కొన్ని కఠిన చట్టాలను తీసుకొచ్చినా, సాధ్యమైనంత వరకు త్వరిత గతిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అత్యాచారాలు ఆశించినంతగా తగ్గడం లేదు. ఆడపిల్లల అల్లరి కేసుల్లో ఆకతాయిలను అరెస్ట్ చేసి కేసులు పెట్టడం కన్నా వారికి కౌన్సిలింగ్ క్లాసులను నిర్వహిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు – స్పోర్ట్స్ ఉమెన్ షేక్ జఫ్రీన్
-
లైసెన్స్‌లో అమ్మ పేరు
మహిళలు ఇంటిని నడిపారు, ప్రపంచాన్నీ నడిపిస్తున్నారు. అయితే ఎక్కడ, ఏ రంగంలో ఏ అప్లికేషన్ ఫామ్ నింపాలన్నా వీరి పేరు నడవడం లేదు! ఇప్పుడా పరిస్థితి క్రమంగా మారుతోంది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వేస్తున్న ఈ తొలి అడుగు... స్త్రీ పురుష సమానత్వం సాధన కోసమా, అభ్యుదయ పథంలోపయనించడానికా అనేది పక్కన పెడితే అది.. ఒక సామాజిక అవసరం అయిందనే చెప్పాలి. ఓ సింగిల్ ఉమన్ పేరెంట్ తన బిడ్డను స్కూల్లో చేర్చాలంటే ఆ బిడ్డ తండ్రి పేరు రాయవలసిన కాలమ్ మాత్రమే కనిపిస్తుంది. స్కూలు ఫీజు కట్టడానికి, బుక్స్ కొనడానికి తల్లి డబ్బు పనికొస్తుంది. కానీ అప్లికేషన్ ఫారమ్‌లో తల్లి పేరు రాయడానికి కాలమ్ ఉండదు! ఆ తండ్రి అనే మనిషి పాపాయి పుట్టినప్పటి నుంచి ముఖం చూడకపోయినా, తన ముఖం బిడ్డకు చూపించకపోయినా సరే తండ్రి కాలమ్ తప్పని సరి! సాఫ్ట్‌వేర్‌లోనే దారి లేదు! ‘నేను పెళ్లి చేసుకోలేదు, బిడ్డను దత్తత తీసుకున్నాను, తండ్రి కాలమ్ నింపడం కుదరదు’ అని వాదించి, సుస్మితాసేన్ లాంటి వాళ్లు ఒక దారి చూపారు. ఆ దారిలో నడిచేందుకు సమాజంలో అనేక మంది సింగిల్ ఉమన్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ వాదనను అంగీకరించడానికి స్కూళ్లు, కాలేజ్‌లు ఇటీవలి వరకు సిద్ధంగా ఉండేవి కాదు. కొన్ని స్కూళ్లు అందుకు సంసిద్ధంగా ఉన్నప్పటికీ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో ఆ కాలమ్ ఉండదు. కాబట్టి గార్డియన్ కాలమ్ దగ్గరే తల్లి పేరు రాసుకోవాల్సి వచ్చేది. అలాగే ఇతర రంగాలు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ ఫామ్‌లో తల్లి పేరున కూడా ప్రత్యేకంగా ఒక కాలమ్ ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సమానత్వం కాదు.. అవసరం ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వేస్తున్న ఈ తొలి అడుగు... స్త్రీ పురుష సమానత్వం సాధన కోసమా, అభ్యుదయ పథంలో పయనించడానికా అనేది పక్కన పెడితే అది.. ఒక సామాజిక అవసరం అయిందనే చెప్పాలి. ఇప్పుడు అనేక కారణాలతో సింగిల్ పేరెంట్స్ ఎక్కువవుతున్నారు. ఇండియాలో సింగిల్ పేరెంట్ అంటే సాధారణంగా.. తల్లి మాత్రమే. అలా తల్లి పెంపకంలో పెరిగిన పిల్లలు ఏ అప్లికేషన్లో అయినా తల్లి పేరు మాత్రమే రాయగలుగుతారు. ఒకవేళ తండ్రి పేరు ఫలానా అని తల్లి చెప్పినా సరే... బాధ్యత లేని ఆ తండ్రి పేరుతో తమ ఐడెంటిటీని ఇష్టపడటం లేదు ఈ తరం పిల్లలు. వీటన్నింటి దృష్ట్యా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ విభాగం తల్లి పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమలులోకి రానుంది. మిగతావీ తల్లి పేరు మీదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ దేశమంతటా చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఐడీ ప్రూఫ్ ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే మరే కార్డు అయినా తల్లి పేరుతోనే ఉంటుందని, దేశంలో ఇలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఢిల్లీనే అని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాస్‌పోర్ట్ విషయంలో ఈ వెసులుబాటు కల్పించింది. భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలలో వారి పిల్లలు నాచురల్ గార్డియన్ అయిన తల్లి సంరక్షణలో ఉండే అవకాశాలే ఎక్కువ. ఆ పిల్లలకు జారీ చేసే పాస్‌పోర్టులో తండ్రి పేరు ఇప్పుడు తప్పని సరి కాదు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడంలో చొరవ తీసుకున్నది మాత్రం ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వమే. ఓ పదేళ్ల కిందట ఒక మహిళ తాను సింగిల్ పేరెంట్నని చెప్పుకోవడానికి బిడియ పడేది. అప్పటి సామాజిక పరిస్థితులు అలా ఉండేవి. ఇప్పుడిక ఇలాంటి భరోసా కూడా దొరికితే ఇకపై ధైర్యంగా జీవించగలుగుతారు. వాళ్ల పిల్లలను వేధిస్తున్న ‘మీ నాన్న ఎవరు? ఎప్పుడూ కనిపించడేంటి’ వంటి ప్రశ్నలు దాదాపుగా ఉండవు. హర్ నేమ్ యొలాండా రీనీ ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ అన్నారు మార్టిన్ లూథర్ కింగ్. ఇప్పుడు ఆయన మనవరాలు 9 ఏళ్ల యొలాండా రీనీ అదే మాట అంటోంది. నలుపు, తెలుపు అనే తేడా లేకుండా మనుషులంతా ఒక్కటే అవ్వాలని మార్టిన్ కలగన్నారు. ‘అయిందేదో అయింది. గన్ కల్చర్ లేని గొప్ప దేశం కావాలి అమెరికా’ అని యొలాండా ఇప్పుడు కలగంటోంది. శనివారం వాషింగ్టన్లో జరిగిన ‘మార్చ్ ఫర్ అవర్ లైవ్జ్’ ప్రదర్శనలో మాట్లాడే చాన్స్ వచ్చినప్పుడు.. యొలాండా తన శక్తిమంతమైన గొంతుతో వేలాదిమందిని ఉర్రూతలూగించింది. ఎవరినైనా కట్టిపడేసే కంఠం అది. ఇంకో 27 ఏళ్ల తర్వాత 2036లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పే స్వరం అది. అప్పటికి ఏడాది ముందు మాత్రమే యొలాండాకు అధ్యక్షురాలిగా పోటీ చేసే కనీస వయసు (35 ఏళ్లు) వస్తుంది. లతీతియా కాయ్ ‘ఆహా.. ఎంత అందమైనదీ ప్రపంచం?!’ అని విస్మయం చెందుతుంది లతీతియా కాయ్. అత్యాచార దోషాన్ని బాధితుల మీదికే నెట్టేసే ఈ ప్రపంచంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసే తీరు ఇది! ఈ ఐవరీ కోస్ట్ దేశపు టీనేజ్ కళాకారిణి.. సామాజిక రుగ్మతలను ప్రశ్నించడానికి తరచు తన జుట్టును కూడా ముడి వేస్తుంటుంది. ‘మీటూ’ఉద్యమానికి మద్దతుగా లతీతియా వేసుకున్న ఈ ముడి.. వాటిల్లో ఒకటి. మినీస్కర్ట్‌లు వేసుకుంటున్నందువల్లనే అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయనే వాదనకు నిరసనగా ఈ అమ్మాయి ఇలా ‘హెయిర్డ్’ చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను పోస్ట్ చేసుకుంది. ఇదొక ఆలోచనాత్మకమైన సందేశం. ఆరాధ్యా రాయ్ అచ్చం ఐశ్వర్యలా ఉన్న ఆరాధ్య ఫొటోను చూసి సోషల్ మీడియా ఇప్పుడు ముద్దుగా మెటికలు విరుస్తోంది. ఇందులో ఆ నవ్వు, ముఖ కవళికలు అచ్చు అమ్మనే పోలివున్నాయి. ‘ఆరాధ్య తనకు తానుగా, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా ఎదగాలి’ అని ఐశ్వర్య అదే పనిగా అంటుంటారు. ఇక ముందు అలా అనే అవసరం ఆమెకు ఉండకపోవచ్చు. గ్లామర్ ఫీల్డులో ఉన్న అమ్మానాన్నను, తాతయ్యను చూస్తూ పెరుగుతున్న ఆరాధ్య ఒక మామూలు అమ్మాయిగా పరిణతి చెందడాన్ని ‘బిగ్’ ఫ్యామిలీ ఆనందంతో వీక్షిస్తోంది. బనితా సంధూ ఏప్రిల్‌లో విడుదల అవుతున్న ‘అక్టోబర్’ చిత్రంలో ప్రధాన కథానాయికగా మనం ఈ అమ్మాయిని చూడొచ్చు. పేరు బనితా సంధూ. అయితే అది హిందీ చిత్రం. అంతమాత్రాన ఆమెను చూడలేకపోతామని తెలుగువాళ్లం నిరాశ చెందే పనే లేదు. నటనలో ఆమె ప్రదర్శించిన ‘ఒడుపు’ను చూసి ముగ్ధుడైన చిత్ర దర్శకుడు షూజిత్ సర్కార్.. ఆమె ఎలా చేస్తే అలా చెయ్యనిచ్చి, అదే అసలైన నటన అని ప్రశంసించడంతో పాటు.. ‘పరభాషా చిత్రాలకు త్వరలోనే మీకు పిలుపు వస్తుంది’ అభినందించారు కూడా! బనితా వయసు ఇరవై. లండన్‌లో పుట్టారు. లండన్‌లోనే చదువుతున్నారు. పీజా తినడం, స్పెయిన్ వెళ్లడం ఆమెకు ఇష్టమైన విషయాలు. –మంజీర -
అవునట!
వాలెంటైన్స్ డే దగ్గరికి వస్తోంది. అన్ని చోట్లా రొమాన్స్ విరబోసే కాలం ఇది. అయితే ఈ ఏడాది ‘ఆఫీస్ రొమాన్స్’ బాగా తగ్గిపోయిందని రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్‌లు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు! అంత దిగ్భ్రాంతి అవసరం లేదు కానీ, ‘యంగ్ వాయిసెస్’ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ లిజ్ వోల్ఫ్ ఆ ఎక్స్‌పర్ట్‌ల చేత చిన్న సర్వే చేయిస్తే.. ఈ విషయం బయటపడింది! ‘మీ టూ’ ఎఫెక్ట్‌తో యు.ఎస్.లోని చాలా ఆఫీస్‌లలో మగాళ్లు తమ ఫిమేల్ కొలీగ్స్‌తో అంటీముట్టనట్లు ఉంటున్నారట. దాంతో పలకరింపులు తగ్గి, కనికరం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారట. కనికరం ఏంటి? పనిఒత్తిడితో ఆడవాళ్లు అవస్థలు పడుతుంటే, మగవాళ్లు ఆ ఒత్తిడిని కొంత షేర్ చేసుకోవడం ఏ ఆఫీస్‌లోనైనా సహజమే. ఇప్పుడు అదీ లేకుండా పోయిందట. హాయ్‌లు చెప్పుకోవడం, బాయ్‌లు చెప్పుకోవడం వరకే ఆడామగ రిలేషన్స్ పరిమితం అయిపోయి, కలిసి బ్రేక్ తీసుకోడానికి కూడా మగవాళ్లు సంశయిస్తున్నారని ఎక్స్‌పర్ట్‌లు ‘యంగ్ వాయిసెస్’ ఎడిటర్‌కి నివేదిక ఇచ్చారు. ఎంతోకాలంగా పరిచయం ఉన్న కొలీగ్‌తో కూడా జోక్‌లు వేయడానికి, హ్యాండ్ షేక్ ఇవ్వడానికి, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడ్డానికి పురుష ఉద్యోగులు సంశయించడంతో.. ఆఫీస్‌లలో ఒకలాటి ‘జెండర్ వార్’ పరిస్థితులు ఏర్పడ్డాయని కొంతకాలంగా అమెరికన్ మీడియా కూడా అంటోంది. దీన్ని బట్టి ఏం అర్థమౌతోంది? హెరాస్మెంట్ కొత్త పుంతలు తొక్కిందని! -
లేడీ డిటెక్టివ్‌గా త్రిష
తమిళసినిమా: లేడీ డిటెక్టివ్‌గా అవతారమెత్తనున్నారు నటి త్రిష. కథానాయకి డిటెక్టివ్‌గా నటించడం అన్నది కోలీవుడ్‌లో ఇదే ప్రప్రథం అన్నది గమనార్హం. నటి అనుష్క, నయనతారల తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల అవకాశాలు నటి త్రిషనే వరిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చేతిలో మోహిని, గర్జన, పరమపదం విళైయాడు వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు 96, చతురంగవేట్టై–2, 1818, తదితర 8 చిత్రాలున్నాయి. తాజాగా మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. దీనికి కుట్రపయిర్చి అనే టైటిల్ నిర్ణయించారు. శ్రీ గురుజ్యోతి ఫిలింస్ పతాకంపై జీ.వివేకానందన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వర్ణిక్ పరిచయం కానున్నారు. ఈయన దర్శకుడు బాలా వద్ద తారైతప్పటై్ట చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఈ చిత్ర విరాలను ఈయన తెలుపుతూ కుట్రపయిర్చి 1980లో సాగే నేర పరిశోధన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఒక హత్య, దాని గురించి ఇన్వెస్టిగేషన్ ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందన్నారు. ఇందులో త్రిష ప్రధాన పాత్రను పోషించనున్నారని తెలిపారు. ఆమె ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌గా నటించనున్నారని చెప్పారు. హీరోయన్ డిటెక్టివ్‌గా నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే అవుతుందని అన్నారు. తొలి భారతీయ లేడీ డిటెక్టివ్ రజనీ పండిట్‌ను స్ఫూర్తిగా తీసుకుని త్రిష పాత్ర ఉంటుందని చెప్పారు. అయితే కుట్రపయిర్చి నిజసంఘటనల ఆధారంగా తయారు చేసిన కథ అని తెలిపారు. ఇందులో త్రిషతో పాటు నటి సురభి, సూపర్ సుబ్బరాయన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారని తెలిపారు. దీనికి రథన్ సంగీతం, బాబుకుమార్ ఛాయాగ్రహణం అందించనున్నారని చెప్పారు. చిత్రం త్వరలోనే ప్రారంభం అవుతుందని దర్శకుడు తెలిపారు.