భోపాల్: 'ప్రాజెక్టు చీతా'లో భాగంగా తీసుకువచ్చిన చీతాల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో ఆడ చీతా ప్రాణాలు విడిచింది. ఐదు నెలల్లోనే తొమ్మిది చీతాలు మరణించడం గమనార్హం. తాజాగా మరణించిన చీతాను 'దాత్రి'గా గుర్తించారు. దీని మరణానికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు. పోస్టుమార్టం తర్వాత వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
కునో నేషనల్ పార్కులోని బోమాస్ ఎన్‌క్లోజర్‌లో ఏడు మగ, ఆరు ఆడ, ఓ ఆడ చితాపిల్లతో కలిపి మొత్తం 14 చీతాలను సంరక్షిస్తున్నారు. వీటి బాధ్యతల కోసం పార్కు జంతు సంరక్షకులతో సహా ఓ నమీబియాకు చెందిన నిపుణుడు కూడా ఉన్నారు. ఈ చీతాల్లో రెండింటిని ఇటీవల బయటకు వదిలారు. ఇందులో ఓ చితా చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.
కునో నేషనల్ పార్కులో మూడు చీతా పిల్లలతో కలిపి మొత్తం ఐదు నెలల్లోనే తొమ్మది చీతాలు మరణించాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రాజెక్టు చీతాలో భాగంగా 20 చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వాటికి నాలుగు పిల్లలు కూడా జన్మించాయి. తీసుకువచ్చిన చీతాల్లో ఒక్కొక్కటిగా మరణించడం.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన చీతాల సంరక్షణ కార్యక్రమానికి పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు.
చీతాలను గుర్తించడానికి వాటకి రేడియా కాలర్‌ను తగిలించారు. వాటి కారణంగానే చీతాలు అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు గుర్తించారు. చివరికి వాటిని తొలగించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఎన్సీఆర్‌కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్.. ఢిల్లీ హై అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment