cheetah
-
ఆపరేషన్.. పెరంబులేషన్
తిరుపతి సిటీ: చిరుత జాడ కోసం పెరంబులేషన్ పేరుతో తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, వర్సిటీ సెక్యూరిటీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీయూలో రెండు నెలలుగా చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు వర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు అమర్చి చేయి దులుపుకున్నారు. అయితే మంగళవారం సాయంత్రం వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో చిరుత విద్యార్థుల కంట పడింది. వెంటనే వారు అటవీ, వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. ఉలిక్కిపడిన అధికారులు చిరుతకు పిల్లలు ఉంటేనే తరచూ వర్సిటీలో సంచరిస్తోందన్న అనుమానంతో బుధవారం వంద మందితో నాలుగు బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయినా చిరుత పిల్లల ఆచూకీ లభించలేదు. జిల్లా ఉప అటవీశాఖ అధికారి నాగభూషణం వర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ చిరుతను బంధించేందుకు నాలుగు రోజుల ముందు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదన్నారు. వర్సీటీ రిజిస్ట్రార్ భూపతినాయుడు, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ హరిక్రిష్ణ, అటవీశాఖాధికారులు పాల్గొన్నారు. -
చింతపల్లి అటవీప్రాంతంలో చిరుత సంచారం
-
ప్రాజెక్ట్ చిరుత.. పరాజిత
భారతదేశంలో అంతరించిపోయిన చిరుత జాతులను పునరుజ్జీవింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ చిరుత’ (ప్రాజెక్ట్ చీతా) ప్రశ్నార్థకంగా మారింది. అడవిలో వదిలిన చిరుతల్లో జీవించి ఉన్న ఒకే ఒక చిరుత పవన్ కొద్దినెలల క్రితం మృతి చెందడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వన్యప్రాణి ప్రేమికుల ఆనందోత్సాహాల మధ్య 2022 సెప్టెంబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆఫ్రికాలోని నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వాటిలో మొట్టమొదటిది పవన్. ఆఫ్రికన్ చీతాలు సాధారణంగా 10 నుంచి 12 సంవత్సరాలపాటు అడవిలో జీవిస్తాయి. కానీ.. పవన్ ఆరేళ్ల వయసులోనే బతకలేక చనిపోయింది. దీంతో చీతా ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, అమరావతిసరైన సంరక్షణా చర్యలు లేవా! పవన్ మృతి చెందిన తర్వాత మిగిలి ఉన్న చీతాలన్నింటినీ ఎన్క్లోజర్లు, అడవిలా తీర్చిదిద్దిన ప్రాంతాల్లో ఉంచి వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చీతా ప్రాజెక్టు అతి పెద్దది. దేశంలోని చాలా వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఈ ప్రాజెక్టుకు మళ్లించి సుమారు 58 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు. అయితే, శాస్త్రీయ అధ్యయనం, సరైన సంరక్షణ చర్యలు లేకపోవడం వల్లే అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్టు విఫల దశలో ఉన్నట్టు చెబుతున్నారు. సరైన ప్రణాళిక, అవగాహన లేకుండా చీతాలను ఆఫ్రికా నుంచి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు వన్యప్రాణుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేసి ఉంటే.. ఆఫ్రికన్ చీతాలకు అనువుగా ఉండే అడవులను మొదట సిద్ధం చేసి ఆ తర్వాత వాటిని తీసుకురావాల్సి ఉంది. కానీ.. ముందే వాటిని తీసుకువచ్చి ఆ తర్వాత కునో జాతీయ పార్కు అందుకు అనువైనదని భావించి అందులో వదిలారు.కానీ.. కునో పార్కు వాటికి సరైన ఆవాసం కాదని తేలింది. అందుకే చీతాలు అందులో జీవించలేకపోయాయి. దీంతో కొన్ని గడ్డి మైదానాల్లోని ఫెన్సింగ్‌లు, క్యాప్టివ్ బ్రీడింగ్‌పై ఆధారపడ్డారు. కేవలం ప్రచారం కోసం పాకులాడడం తప్ప నిబద్ధత లోపించడంతో వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించి భారతదేశం పరువు అంతర్జాతీయంగా మసకబారింది. అత్యంత వేగం చిరుతల ప్రత్యేకతచిరుతలు అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు. మూడు సెకన్లలోనే గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత. 1967 వరకూ ఇవి మన దేశంలోనూ ఉన్నాయి. వాటి ఆవాసాలు కుచించుకుపోవడం, అడవులు తగ్గిపోవడం, వేటాడటం, సింహాలు, పులులు, చిరుతలు వాటి ఆహారం కోసం పోటీ పడుతుండడంతో క్రమేపీ అవి దేశంలో అంతరించిపోయాయి. ఇన్ఫెక్షన్లు, గాయాలతో.. దేశంలో వీటిని మళ్లీ పునరుజ్జీవింపచేసేందుకు నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికన్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరిపింది. ఇందుకోసం 2021లో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మన అడవుల్లో చీతాల పునరుత్పత్తిని ప్రారంభించి అడవిలో వాటి జనాభాను పెంచాలని భావించింది. అయితే.. తీసుకువచ్చిన చీతాలను అడవిలో వదిలిన తర్వాత అవి ప్రాణాంతకమైన సెప్టిసిమిమా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడ్డాయి. మరికొన్ని ప్రమాదాల వల్ల గాయాలపాలయ్యాయి. దీంతో వాటిని ఎన్‌క్లోజర్లలోనే ఉంచి పర్యవేక్షించారు. ప్రభుత్వం చీతా ప్రాజెక్టు చేపట్టిన లక్ష్యాన్ని సాధించాలంటే పర్యావరణ వ్యవస్థలో భాగమైన గడ్డి భూముల అడవుల్లో మనుగడ సాగిస్తేనే ఉపయోగం ఉంటుంది. అలాంటి వాతావరణం లేకపోవడంతో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ మిగిలిన ఏకైక చీతా పవన్ మృతి చెందింది. అంతకుముందు 12 చీతాలు కూడా ఇలాగే మృత్యువాతపడ్డాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్కులో 12 చీతాలు, మరో 12 పిల్ల చీతాలు ఎన్క్లోజర్లలో ఉన్నాయి. వాటిని అడవిలోకి వదిలితే అవి బతుకుతాయో లేదోననే అనుమానాలు, భయాలతో వాటిని అక్కడే ఉంచి సంరక్షిస్తున్నారు. ఇలా సంరక్షణలో ఉన్న చీతాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి శివారులో రెండ్రోజుల చిరుత పులి సంచరించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను గుర్తించేందుకు స్థానికంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.అయితే సోమవారం ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు గుర్తించారు. ఆ ప్రాంతం పాదముద్రలు సేకరించి రాజమండ్రి ల్యాబ్‌కు పంపించారు. అదే సమయంలో చితరు సంచరిస్తుందని, పరిసర ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. -
HYD: మియాపూర్‌లో చిరుత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది. స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్లో బందించారు. -
నంద్యాలలో చిరుత సంచారంతో కలకలం?
నంద్యాల జిల్లా: జిల్లా మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అయితే స్థానికులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పాద ముద్రలు సేకరించారు. పాదముద్రలు సరిగ్గా లేకపోవడంతో.. అది పులినా లేక మరేదైనా జంతువు అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసతమైతే కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, కొద్ది నెలల క్రితం నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్‌బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి చిరుత సంచరిస్తుందనే ప్రచారంతో స్థానికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. -
బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం
బెంగళూరు: బన్నెర్ఘట్టలోని నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఊహించని ఘటన ఎదురైంది. చిరుత ఒకటి సఫారీ బస్సు కిటికీ గుండా ఎక్కడానికి ప్రయతి్నంచడంతో పర్యాటకులంతా కేకలు వేశారు. మొదట భయపడ్డా.. తరువాత దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొద్దిసేపు ప్రయత్నించిన చిరుత.. ఆ తరువాత ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా తన ఆవాసం వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు సఫారీ డ్రైవర్ ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సఫారీ వాహనాలన్నింటికీ మెష్ విండోస్ ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. Come, let's meet face-to-face. 🐆 A leopard at Bannerghatta National Park recently jumped onto the window of a jungle safari bus, creating a moment of both awe and fear for the passengers inside. The wild cat’s sudden appearance startled everyone, as it leaped onto the bus… pic.twitter.com/YqDI265CS2— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2024 -
పరుగులు పెట్టిస్తున్న పులి
రాజమహేంద్రవరం రూరల్/కడియం: కొద్ది రోజులుగా చిరుత పులి అందరినీ పరుగులు పెట్టిస్తోంది.. ఎక్కడా చిక్కకుండా తిరుగుతోంది.. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో తెలియక జనంతో పాటు అధికారులూ తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది.. ఆ చిరుత పులి నుంచి ఎవరికి ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం అందరిలో వెంటాడుతోంది. కడియం నుంచి వీరవరం వెళ్లే రోడ్డులో దోసాలమ్మ కాలనీ సమీపంలోని ఎన్‌ఎస్‌టీసీ నర్సరీలో మంగళవారం రాత్రి చిరుతపులి పాదముద్రలు గుర్తించారు. ఇవి దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో తిరిగిన పులి పాదముద్రలతో సరిపోలడంతో అది ఇక్కడకు వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులూ ధ్రువీకరించారు. అయితే బుధవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగా పులి పాదముద్రల ఆనవాళ్లు పోయాయి. చిరుతపులి కదలికలను గుర్తించడానికి పలుచోట్ల ట్రాప్, సీసీ కెమెరాలను అమర్చారు. జిల్లా అటవీశాఖాధికారి ఎస్.భరణి ఆధ్వర్యంలో చిరుతపులి కదలికలను గుర్తించడానికి ఐదు బృందాలుగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాని జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖాధికారి ఎస్.భరణి మాట్లాడుతూ వరద సమయంలో గోదావరి మీదుగా వచ్చినట్లు భావించిన చిరుత పులి బుర్రిలంక సమీపంలోని లంకల్లో జింకలు ఉంటాయని అటువైపు వెళ్తున్నట్లు భావిస్తున్నామన్నారు. కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడామని, వారి పూర్తి సహాయ సహకారాలు అటవీశాఖ సిబ్బందికి అందజేస్తున్నారన్నారు. నర్సరీలో పనిచేసే వారికి, చుట్టుపక్కల గ్రామస్తులకు సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. అటవీ శాఖ సిబ్బందికి అంతా సహకరించాలని, అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దన్నారు. అసత్య ప్రచారాలకు పాల్పడిన వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని భరణి హెచ్చరించారు.చిరుత సంచారంపై ఆరారాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తూ కడియపులంక గ్రామంలో ఆగి చిరుత పులి సంచారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ చిరుత పులి అని దాని కదలికలు, పాదముద్రల ద్వారా నిర్ధారించామని వివరించారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేస్తున్నామని, మనుషులపై దాడిచేసే అవకాశం లేదని, వర్షం వల్ల చిరుత ఎక్కడో నక్కిందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా చిరుతను పట్టుకుని ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాలని మంత్రి ఆదేశించారు. దాని కదలికల కోసం ప్రయత్నిస్తున్నామని భరణి మంత్రికి వివరించారు.పనులకు రాని కూలీలుకడియం నర్సరీల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో నర్సరీలో పనిచేసే కూలీలు కానీ, ఎగుమతి దిగుమతులు చేసే జట్టు కూలీలు కానీ పనులకు రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఈ చిరుత పులిని పట్టుకునే ఏర్పాట్లను వేగవంతం చేయాలని నర్సరీ రైతులు కోరుతున్నారు. -
వనమంటే..వణుకు
నల్లమల అభయారణ్యంలో సంచరించే చిరుతలు మనుషులపై దాడి చేస్తున్న వరుస సంఘటనలు గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. స్వేచ్ఛగా అడవిలోకి వెళ్లి ఫలసాయాన్ని తెచ్చుకునే గిరిజనులు అడవిలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతంలో ఎప్పుడూ చిరుతలు మనుషుల మీద దాడిచేసిన ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. అయితే ఇటీవలి వరుస ఘటనలు అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలో నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న పచ్చర్ల సమీపంలో పదిహేను రోజుల క్రితం అడవిలో కట్టెల కోసం వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసి చంపటం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడిని రేకెత్తించింది. దీంతో పాటు చంపిన మహిళ మృతదేహాన్ని చిరుత భక్షించిందన్న వార్తలతో స్థానిక గిరిజనులు హడలిపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు అటవీ ప్రాంతంలోకి వెళ్లి అటవీ ఫలసాయాన్ని సేకరించే తమకు ఈ సంఘటన అత్యంత భయాందోళన కలిగిస్తోందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత మహిళపై దాడి చేయటంతో అది మ్యాన్ ఈటర్‌గా మారి ఉంటుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దశాబ్దాల నల్లమల అభయారణ్య చరిత్రలో ఇలా చిరుతలు మనుషులను చంపి తినటం జరగలేదని గిరిజనులు చెబుతున్నారు. అంతకు ముందు పచ్చర్ల సమీపంలోనే రైల్వే పనులు చేస్తున్న మరో మహిళపై చిరుత దాడికి పాల్పడగా, వారం రోజుల క్రితం పచ్చర్ల చెక్‌పోస్టు వద్ద మరో యువకుడిపై చిరుత దాడి చేసి గాయపర్చటం, మహానంది ఆలయం పరిసరాల్లో చిరుత సంచరించటం వంటి వార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దీంతో పాటు గురువారం రాత్రి శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఓ కుక్కను చిరుత పట్టుకెళ్లిన వీడియోలు వైరల్‌గా మారి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.నీటి కోసమే అడవులను దాటుతున్నాయా..నల్లమల దట్టమైన అటవీప్రాంతం కావడంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు తదితర ఎన్నో జంతువులు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంపై అటవీశాఖ అధికా రులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మూడు జిల్లాలకు ప్రధాన కార్యాలయంగా ఉన్న శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా సంచరిస్తున్నాయన్న విషయం చర్చనీ యాంశంగా మారింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం చెక్‌డ్యాంలు, సాసర్పిట్లలో నీరులేక అవి చాలా చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు లేకపోవడంతో చిరుతలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేస్తున్నాయి.చిరుతలు స్వేచ్ఛా జీవులు:తెలుగు రాష్ట్రాల విభజన తరువాత పెద్ద పులులు అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌లోకే అధికంగా చేరింది. ఫలితంగా పులులు, చిరుతల సంఖ్య కూడా మనరాష్ట్రంలోనే ఎక్కువ. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి దేశవ్యాప్త పులుల గణన జరుగుతుంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోని అభయారణ్యంలో 83 కు పైగా పెద్దపులులు, లెక్కకు మించి చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చిరుత పులులు స్వేచ్ఛా జీవులని, పెద్దపులిలా ఒక పరిధిని ఏర్పరచుకొని అవి ఒక చోట ఉండవని... ఎక్కడంటే అక్కడ సంచరిస్తూ ఉంటాయని పేర్కొంటున్నారు. -
మహానందిలో మరోసారి చిరుత సంచారం
-
మహానందిలో మరోసారి చిరుత సంచారం
మహానంది: నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది. శనివారం తెల్లవారు జామున 1.20 గంటల ప్రాంతంలో మూడోసారి గోశాల ప్రాంగణంలో సంచరించింది. ఉదయం విధులకు హాజరైన ఏఈవో ఓంకారం వేంకటేశ్వరుడు సీసీ కెమెరాలు పరిశీలించగా గోశాల ముందు నుంచి కృష్ణనంది మార్గం వైపు చిరుతపులి వెళ్లిన దృశ్యం కనిపించింది. దీంతో ఆయన ఈ విషయాన్ని ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన డీఆర్వో హైమావతి, ఎఫ్‌బీవో ప్రతాప్‌లకు సమాచారం ఇచ్చారు. చిరుత భయంతో వణికిపోతున్న స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఆ చిరుతను బంధించాలని కోరుతున్నారు. -
మహానందిలో మరోసారి చిరుత కలకలం
మహానంది: మహానంది గోశాల వద్ద బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చిరుతపులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ ఏఈఓ ఓంకారం వెంకటేశ్వరుడు, సిబ్బంది వెంటనే నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దినేష్‌కుమార్‌రెడ్డి, డీఆర్ఓ హైమావతి, ఎఫ్బీఓ ప్రతాప్‌లకు సమాచారం అందించారు. వారు మహానంది గోశాల వద్దకు చేరుకుని చిరుతపులి సంచరించిన ప్రదేశం, పాదముద్రలను గుర్తించారు. ఇదిలా ఉండగా.. నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని శిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో మంగళవారం ఓ మహిళ మృతి చెందిన విషయాన్ని మరువక ముందే తాజా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఘటనతో పచ్చర్ల వద్ద నల్లమలలో అటవీశాఖ అధికారులు చిరుతపులి కోసం బోను, పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే అటుగా సంచరించే చిరుతపులి అంతటా తిరుగుతుందని, బోనులోకి మాత్రం రావడం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. గతంలోనూ మహానంది, పచ్చర్ల ప్రాంతాల్లో చిరుతలు సంచరించగా.. ఈ గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయనే విషయాలపై అటవీశాఖ అధికారులు ఇప్పటికీ గోప్యత పాటిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశంలో చిక్కిన చిరుత ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు ప్రకాశం జిల్లా దేవనగరం సమీపంలో ఘటన గిద్దలూరు రూరల్: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం సమీపంలో ఓ చిరుతపులి స్థానికులకు కంటబడడంతో భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు చిరుతపులిని బంధించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుతపులి దేవనగరం గ్రామ శివారులో మేకలు మేపుకునేవారి కంటపడింది. దీంతో వారు కేకలు వేయడంతో చిరుతపులి అక్కడే ఉన్న ఓ పాడుబడిన బావిలోకి దిగింది.దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ డైరెక్టర్ వై.వి.నరసింహారావు, రేంజి ఆఫీసర్ కుమార్‌రాజ రెస్క్యూ టీమ్ సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకుని బావి చుట్టూ వలచుట్టి చిరుతను బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను బోనులో బంధించి అడవిలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. -
నంద్యాలలో ‘చిరుత’ టెన్షన్
మహానంది: చిరుత పేరు వినిపిస్తే చాలు నల్లమల అటవీ పరిసర గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో ఏదైనా అరుపులు వినిపిస్తే చాలు తెల్లవార్లు జాగారమే చేయాల్సి వస్తుంది. నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్‌బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. అనంతరం గిద్దలూరు మార్గంలోని అటవీ చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న ఓ ఉద్యోగిపై దాడి చేసి గాయపరిచింది. రైల్వే పనులకు వచ్చిన ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన పాండవ అనే బాలికపై దాడి చేయగా తలకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. శిరివెళ్ల మండల పరిధిలోని నల్లమలలో ఉన్న పచ్చర్ల గ్రామానికి చెందిన షేక్ బీబీ వారం రోజుల క్రితం నిద్రిస్తుండగా చిరుతపులి దాడి చేసి గాయపరిచింది. తాజాగా మంగళవారం అదే గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మోహరున్నీసా కట్టెపుల్లల కోసం వెళ్లగా దాడి చేసి తలను తినేసింది. ఇదిలా ఉండగా పచ్చర్ల సమీపంలోని చిరుతపులిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలతో పాటు బోను ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు.మహానందిలో భయం...భయం..మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లో వారం రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. దేవస్థానానికి చెందిన గోశాల, అన్నప్రసాద వితరణ కేంద్రం, పాత వివేకానంద పాఠశాల ప్రాంగణాల్లో చిరుతపులి సంచరిస్తుంది. దీంతో స్థానికులతో పాటు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వరుస దాడి ఘటనలు జరుగుతున్నా అటవీశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. అటవీశాఖ అధికారులు స్పందించి మహానంది, పచ్చర్ల గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించి సుదూర ప్రాంతాలకు తరలించాలని నల్లమల పరిసర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చిరుత దాడిలో మహిళ మృతి..
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం పచర్లలో దారుణం జరిగింది. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా మృతి చెందింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేసింది. తలను తినేసింది. మొండాన్ని వదిలేసింది. అయితే కట్టెల కోసం వెళ్లిన మెహరున్నిసా రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో మెహరున్నిసా మొండెం లభ్యం కావడంతో హతాశులయ్యారు. స్థానికులు సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లు ఏర్పాటు చేశారు. చిరుత కోసం అన్వేషణ ప్రారంభించారు. కాగా, నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. -
చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలోని కొండల్లో చిరుత పిల్లలు సంచరిస్తున్నాయి. చిరుత పిల్ల రైతుల కంట పడింది. చనుగొండ్ల గ్రామానికి ఆనుకొని కొండ ప్రాంతం ఉండటంతో చిరుత పిల్లను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లి చిరుత ఎప్పుడు గ్రామంలోకి వస్తుందోనని భయభ్రాంతులు చెందుతున్నారు.గతంలో చిరుత వెంకటాపురం గ్రామ సమీప కొండ గుహల్లో నివాసాలు ఏర్పరచుకొని రాళ్ల మధ్యలో ఉంటూ అటుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కొండ ప్రాంతానికి అనుకొని ఇల్లు ఉండటం వలన గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. -
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్‌పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
మదనపల్లె వైపు..చీతా చూపు!
రాజంపేట: చీతా..ఈ భూమ్మీద అత్యంత వేగంతో పరిగెత్తే జంతువు. ఇప్పుడు దీని చూపు మదనపల్లె వైపు పడింది..అంటే చీతాలను పునరుత్పత్తి కేంద్రంగా ఎంపిక చేసుకోవాలనే భావన డబ్ల్యూఐఐ తెరపైకి తీసుకొచ్చినట్లు అటవీవర్గాల సమాచారం. 1965లో ఒక సారి చీతా కనిపించింది. ఆ తర్వాత ఈ జాతి కనుమరుగైంది.భారత్‌లో అంతరించిన ఈ జాతిని తిరిగి పునరుద్ధరించేందుకు చీతా ప్రాజెక్టు చేపట్టారు. 2022లో నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను కునో నేషనల్ పార్క్(మధ్యప్రదేశ్)లోకి వదిలిన సంగతి తెలిసిందే. ► అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె టెరన్ ఏరియా విస్తారంగా ఉండటంతో..ఆ ప్రాంతంలో చీతా పునరుత్పత్తికి దోహదపడుతుందనే యోచనలో వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ముఖ్య శాస్త్రవేత్త రమేష్ ఉన్నట్లు అటవీవర్గాలకు సమాచారం అందింది. ఈనెల 25న చీతా పునరుత్పత్తిపై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఉంటుందని అటవీవర్గాలు చెబుతున్నాయి. ► 70వేల హెక్టార్ల అటవీ ప్రాంతం కలిగిన మదనపల్లె రేంజ్ ప్రాంతం టెరన్ ఏరియాగా పిలుస్తారు. 18 మండలాలు ఉన్నాయి. కొండ, గట్టు, గడ్డి విపరీతంగా పెరగడం లాంటి ప్రదేశాలు ఉన్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అందువల్ల చీతాల పునరుత్పత్తి ఉండటానికి అనుకూల ప్రదేశంగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. అటు కర్ణాటక, ఇటు చిత్తూరు, మరోవైపు సత్యసాయి జిల్లాలతో టెరన్ ప్రాంతం ముడిపడి ఉంటుంది. ► చీతా అనే పదం..హిందుస్ధానీ నుంచి పుట్టింది. సంస్కృతంలో దీనర్థం చిత్ర..యా అంటే రంగురంగులది అని. చీతాలు నాలుగు ఉపజాతులుగా ఇప్పుడు భూమ్మీద ఉన్నాయి. సౌతాఫ్రికన్ చీతాలు, ఆసియాటిక్ చీతాలు, నార్త్ ఈస్ట్ ఆఫ్రికన్ చీతాలు, నార్త్‌వెస్ట్ చీతాలు. చీతా గర్జిస్తుందని పొరపాటు పడొద్దు. దాని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల అది గర్జించలేదు. పిల్లిలాగే మియావ్ అని, లేదంటే పిష్ అంటూ విచిత్రమైన అరుపులు చేస్తుంది. ► చీతా వేట నిమిషం కంటే వ్యవధిలోని ముగిస్తుంది. ఇది ఎంతలా అంటే స్పోర్ట్స్ కారుకంటే వేగంగా. చీతాలకు వాటి లుక్కే ప్రధాన ఆకర్షణ. అందుకే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగుతీసింది. ►చీతాలకు త్వరగా దొరికే ఆహారం అంటే ఇష్టం. అందుకే కుందేళ్లు, జింకలను వేటాడుతాయి. పెద్దవాటి జోలికి ఎక్కువగా పోవు. ఇతర జంతువుల బెడదను దృష్టిలో పెట్టుకొని త్వరగా తినేస్తాయి. మదనపల్లె ప్రాంతం అనుకూలం చీతా జీవించడానికి .. వాటి మనుగడకు మదనపల్లె అటవీ ప్రాంతం అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనిపై పరిశోధన నిమిత్తం డబ్ల్యూఐఐకి చెందిన చీఫ్ సైంటిస్టు రమేష్ ఈ అంశం గురించి ప్రస్తావించారు. ఈనెల 25న సమావేశం ఉంటుందని సమాచారం అందింది. –వివేక్, జిల్లా అటవీశాఖాధికారి, రాజంపేట -
చిరుత నవ్వింది!
చిరుతలు దుమ్ము రేపుతున్నాయి. దేశమంతటా యమా స్పీడుతో దూసుకెళ్తున్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్యలో 8 శాతం పెరుగుదల నమోదైంది. మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వాటి సంఖ్య బాగా పెరిగింది. కాకపోతే తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో చిరుతలు తగ్గుతుండటం కాస్త కలవరపెట్టే అంశమేనని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది. 2018లో భారత్‌లో 12,852గా ఉన్న చిరుతపులుల సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ‘భారత్‌లో చిరుతల స్థితిగతులు–2022’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. చిరుతల సంఖ్యలో మధ్యప్రదేశ్ టాప్‌లో నిలిచింది. అక్కడ 3,907 చిరుతలున్నట్టు తేలింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మాత్రం చిరుతల సంఖ్యలో గత నాలుగేళ్లలో తగ్గుదలే నమోదైంది. ఆవాస ప్రాంతాలతో పాటు ఆహార లభ్యత కూడా తగ్గిపోవడం, చిరుతల వేట విచ్చలవిడిగా పెరగడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. ‘‘ఫలితంగా చిరుతలు నివాస ప్రాంతాలపైకి వచి్చపడుతున్నాయి. దాంతో జనం వాటిని హతమారుస్తున్నారు. ఈ ధోరణి కొంతకాలంగా పెరుగుతుండటం ఆందోళనకరం’’ అని నివేదిక ఆవేదన వెలిబుచి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా చిరుతల సంఖ్య కాస్తో కూస్తో స్థిరంగానే కొనసాగినట్టు తెలిపింది. మొత్తమ్మీద వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరాన్ని సర్వే వెలుగులోకి తెచి్చందని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల భారతీయుల సహన ధోరణి ప్రపంచానికి ఆదర్శం కావాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్ చౌబే అభిప్రాయపడ్డారు. సంఖ్య పెరిగినా... ► గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 1,022 చిరుతలు పెరిగాయి. ► మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ పెరుగుదల నమోదైంది. ► శాతాలపరంగా చూసుకుంటే ఏకంగా 282 శాతం పెరుగుదలతో అరుణాచల్‌ప్రదేశ్ టాప్‌లో నిలిచింది. ► కానీ తెలంగాణతో పాటు గోవా, బిహార్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాల్లో చిరుతల సంఖ్య తగ్గింది. ► ఒడిశాలోనైతే ఏకంగా నాలుగో వంతు, అంటే 192 చిరుతలు తగ్గాయి. సర్వే ఇలా... ► దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే జరిపారు. ► ఇందుకు ఏకంగా 6.4 లక్షల పనిదినాలు పట్టింది! దీన్ని ప్రపంచంలోకెల్లా అతి విస్తారమైన వణ్యప్రాణి సర్వేగా కేంద్రం అభివరి్ణంచింది. ► చిరుతలను గుర్తించేందుకు 32,803 వ్యూహాత్మక స్థానాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. ► అలా సమకూరిన 4 కోట్ల పై చిలుకు ఫొటోలను విశ్లేíÙంచారు. వాటిలో చిరుతలకు సంబంధించిన 85 వేల ఫొటోలను గుర్తించారు. ► తద్వారా చిరుతల మొత్తం సంఖ్యను 13,874గా నిర్ధారించారు ► అయితే సర్వేలో దేశంలోని చిరుతల ఆవాస ప్రాంతాల్లో 70 శాతాన్ని మాత్రమే కవర్ చేయగలిగినట్టు కేంద్రం పేర్కొంది. ► హిమాలయాలు, అటవేతర ఆవాసాలు, మెట్ట ప్రాంతాలను సర్వే పరిధి నుంచి మినహాయించారు. ► ఆ లెక్కన భారత్‌లో చిరుతల వాస్తవ సంఖ్య 13,874 కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది. విశేషాలు ఇవీ... మధ్య భారతంతో పాటు తూర్పు కనుమల్లో నాలుగేళ్లలో చిరుతలు 8,071 నుంచి 8,820కి పెరిగాయి. అంటే 1.5 శాతం పెరుగుదల నమోదైంది. పశి్చమ కనుమల్లో 3,387 నుంచి 3,596కు పెరిగాయి. ఈశాన్య కొండప్రాంతాలు, బ్రహ్మపుత్ర వరద మైదానాల్లోనూ అవి 141 నుంచి 349కి పెరిగాయి. 2018లో శివాలిక్ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో మాత్రం చిరుతలు 1,253 నుంచి 1,109కి, అంటే 3.4 శాతం తగ్గాయి. అయితే, ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ అటవీ డివిజన్లో గత నాలుగేళ్లలో చిరుతలు తగ్గగా పులుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరగడం విశేషం! – సాక్షి, నేషనల్‌డెస్క్ -
ఫుల్‌గా తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?
ఫుల్‌గా తాగితే మనిషి ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కపడితే అక్కడ పడిపోయి ఉంటాడు. పైగా ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. అలా తాగేసి రోడ్లపై పడిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ఇలా క్రూర జంతువులు తాగినే పరిస్థితి ఇలానే ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేం అవి కూడా మత్తులోనే జోగుతాయని. కానీ ఇక్కడొక చిరుతని చూస్తే అవి కూడా ఇంతేనా! అని అనుకుంటారు. అసలేం జరిగిందంటే..బీహార్ రాష్ట్రంలో అడవికి దగ్గరగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో మద్యం తయారీ కర్మాగారం ఉంది. అయితే అందులోకి ఓ చిరుత పులి అనుకోకుండా ప్రవేశించింది. పైగా అక్కడ ఉండే మద్యాన్ని ఫుల్‌గా తాగేసింది. పాపం ఆ మద్యం సేవించిన తర్వాత అది ఒక్కసారిగా మత్తులోకి వెళ్లిపోయింది. కనీసం అడుగు తీసి అడుగువేయలేనంత మత్తులోకి వెళ్లిపోయింది. ఇంతలో కర్మాగారంలో పనిచేసే సిబ్బంది అక్కడకు వచ్చారు. మొదట ఆ చిరుతను చూసి వారంతా భయపడ్డారు. అయితే అది అలాగే పడుకుని ఉండటం చూసి బహుశా మద్యం తాగేసి ఉంటుంది అందుకే అలా ఉందని అనుకున్నారు. అయినప్పటికి అది ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుని దాన్ని అక్కడ నుంచి బయటకు పంపే యత్నం చేశారు. ఇంతలో అది లేచింది. కానీ నడిచే మూడ్‌లో అస్సలు లేదు. ఇక వాళ్లు ఎలాగో లేచింది కదా అని నెమ్మదిగా బయటకు వెళ్లేలా చేశారు. అయితే అక్కడున్న వారంతా దాని దగ్గరకు వచ్చి దాని మీద చేయి వేసినా.. కిమ్ అనకుండా ఉంది. పైగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తోంది. అందుకు సంబంధించిన ఘటనను ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లంత ఆశ్చర్యం వ్యక్తం చేయడమే గాక ఆ పులి గనుకు మత్తులో లేకుంటే మీ అందరి తలలు తీసుకువెల్లేది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!) -
3 పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’.. కునోలో చీతా కూనల సందడి
మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో చీతాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా ‘జ్వాల’ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేంధ్ర యాదవ్ పేర్కొన్నారు. ‘కునోలోకి కూన చీతాలు వచ్చేశాయ్..జ్వాల అనే నమీబియా చీతా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆశ అనే చీతా రెండు కూనలకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే ఈ సంఘటన జరిగింది. దేశంలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసేవారు, జంతు ప్రేమికులకు ఇది గుడ్ న్యూస్. భారత వన్యప్రాణులు వృద్ది చెందుతున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. తల్లి వద్ద ఆడుకుంటున్న కూన చీతలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోను షేర్ చేశారు. 2023 మార్చిలో జ్వాలా చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది. కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా తీసుకొచ్చిన శౌర్య అనే చీత జనవరి 16న మృతిచెందిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు శౌర్య అస్వస్థతకు గురవ్వడం గమనించినట్లు అదనపు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కునోలోని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. వెంటనే దానికి వైద్యం అందించగా కుదుటపడిందని చెప్పారు, కానీ కాసేపటికే మళ్లీ బలహీనపడి వైద్యానికి స్పందించలేదని, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. చదవండి: విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’ Kuno’s new cubs! Namibian Cheetah named Jwala has given birth to three cubs. This comes just weeks after Namibian Cheetah Aasha gave birth to her cubs. Congratulations to all wildlife frontline warriors and wildlife lovers across the country. May Bharat’s wildlife thrive… pic.twitter.com/aasusRiXtG — Bhupender Yadav (@byadavbjp) January 23, 2024 ఇక 2022 సెప్టెంబరు 17న ప్రాజెక్టు చీతా’లో భాగంగా మొదటి బ్యాచ్‌లో ఎనిమిది నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో బ్యాచ్‌లో 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునోకు తీసుకొచ్చారు. అయితే మొత్తం 20 చీతాల్లో 8 చనిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 10 చీతాలు( ఏడు పెద్దవి, మూడు కూనలు) మరణించాయి. ఇదిలా ఉండగా గత 75 ఏళ్ల తర్వాత చీతాలు తిరిగి భారత్ గడ్డపై అడుగు పెట్టాయి. -
రాజస్థాన్ జైపూర్ లో చిరుత హల్ చల్
-
కునో నేషనల్ పార్క్‌లో మరో నమిబియా చీతా మృతి
భోపాల్: ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమిబియా దేశం నుంచి తీసుకువచ్చిన మరో చితా ‘శౌర్య’ మధ్య ప్రదేశలోని కునో నేషనల్ పార్క్‌లో మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు ‘శౌర్య’ చీతా మరణించినట్లు ప్రాజెక్టు చీతా డైరెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీతా మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని అన్నారు. చీతాకు పోస్ట్ మార్టం చేసి మరణించడాకి గల కారణాన్ని చెబుతామని అన్నారు. ఈరోజు(మంగవారం) ఉదయం నుంచి శౌర్య చీతా చాలా తీవ్ర ఆందోళనకరంగా అస్వస్థతతో ఉన్నట్లు కునో నేషనల్ పార్క్ సిబ్బంది గమనించింది. వెంటనే అధికారులు, పార్క్ సిబ్బంది స్పందించి చీతాకు చికిత్స అందిస్తూ పర్యవేక్షించారు. చీతాకు సీపీఆర్ కూడా అందించారు. కానీ, దురదృష్టవశాత్తు చీతా ‘శౌర్య’ మరణించిందని తెలిపారు. Today, on 16th January, 2024 around 3:17 PM, Namibian Cheetah Shaurya passed away...Cause of death can be ascertained after Post Mortem: Director Lion Project pic.twitter.com/ISc2AlCNcy — ANI (@ANI) January 16, 2024 ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా సెప్టెంబర్ 17, 2022న నమిబియా నుంచి 8 చీతాలు తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్‌లో వదిలిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఫిబ్రవరి 18, 2023న మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో పార్క్‌లో విడిచిపెట్టారు. ఇప్పటివరకు ‘శౌర్య’తో మొత్తం 10 చీతాలు మృతి చెందటం గమనార్హం. చదవండి: ఆప్ మంత్రి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు -
జొన్న కురుకుల గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం
-
కునో నేషనల్ పార్క్‌లో సందడి.. మూడు చీతాలకు జన్మనిచ్చిన ‘ఆశా’
‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా నుంచి తీసుకోచ్చిన ‘ఆశా’ అనే చీతా తాజాగా మూడు చీతా పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయానికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘కునో నేషనల్ పార్క్‌లో ‘ఆశా’ చీతా.. మూడు చీతా కూనలకు జన్మనిచ్చిన విషయం పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. ‘ఆశా’ను ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకువచ్చారు. ఈ ప్రజెక్టులో చీతాల సంరక్షణకు కృషి చేస్తున్న కునో నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు’ అని భూపేందర్ యాదవ్ తెలిపారు. దశాబ్దాల క్రితం ఇండియాలో అంతరిచిన పోయిన చీతాలను తిరిగి అభివృద్ధి చేయాలన్నలక్ష్యంతో 17 సెప్టెంబర్ 2022న ప్రాజెక్టు చీతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా పుట్టిన మూడు చీతా పిల్లతో కలిపి మొత్తం చీతాల సంఖ్య 18కి చేరింది. అయితే నమీబియా నుంచి తీసుకువచ్చిన ‘సాశా’ అనే ఆడ చీతా 2023 మార్చి 27న మరణించిన విషయం తెలిసిందే. ‘ప్రాజెక్టు చీతా’ భాగంగా మొత్తం 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. Purrs in the wild! Thrilled to share that Kuno National Park has welcomed three new members. The cubs have been born to Namibian Cheetah Aasha. This is a roaring success for Project Cheetah, envisioned by PM Shri @narendramodi ji to restore ecological balance. My big congrats… pic.twitter.com/c1fXvVJN4C — Bhupender Yadav (@byadavbjp) January 3, 2024 చదవండి: ప్చ్.. మన బాహుబలికి అంత బలం లేదట! అందుకే ఇలా.. -
మూగజీవాలపై దాడులుచేస్తున్న చిరుతలు.. ఆందోళనలో గ్రామస్తులు!
ఖిల్లాఘనపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని రాంరాయనిపల్లి (మల్కిమియాన్‌పల్లి) గ్రామ సమీపంలో చిరుతల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా రెండు చిరుతలు సంచరిస్తుండటంతో హడలెత్తిపోతున్నారు. రాంరాయనిపల్లి సమీపంలోని బోడగట్టు వద్దనున్న సందపురం వెంకట్‌రెడ్డి పశువుల పాక వద్ద శుక్రవారం ఉదయం రెండు చిరుతలు కనిపించాయి. విషయాన్ని గ్రామపెద్ద సాయిలు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో సెక్షన్ ఆఫీసర్ భాస్కరాచారి, సిబ్బంది అంజనేయులు గుట్టపైకి వెళ్లి పరిశీలించారు. చిరుతల జాడ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీరా సాయంత్రం అదే గుట్టపై చిరుత కనిపించడంతో హీర్లతండాకు చెందిన కొందరు దూరం నుంచి వీడియో తీశారు. చిరుతల సంచారంతో రాంరాయనిపల్లితో పాటు హీర్లతండా, అల్లమాయపల్లి, వసురాంతండా, సూర్యతండా, దేవబండతండా, నేలబండతండా, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. దూడలపై చిరుత దాడి నవాబుపేట: నవాబుపేట మండలంలోని యన్మన్గండ్ల శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం గ్రామ శివారులోని గుట్ట పక్కనున్న పొలాల్లో రైతులు దూడలను కట్టేయగా.. అర్ధరాత్రి సమయంలో చిరుత దాడిచేసి గాయపర్చింది. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు.. రక్తపు మడుగులో ఉన్న దూడలను చూసి భయాందోళనకు గురయ్యారు. మొత్తం నాలుగు దూడలపై దాడి చేసినట్లు రైతులు తెలిపారు. చిరుత బారి నుంచి మూగజీవాలను కాపాడాలని కోరారు. -
చిరుత కలకలం: బయటికి రావద్దంటూ పోలీసుల హెచ్చరికలు
న్యూఢిల్లీలోని సైనిక్ ఫాంహౌజ్‌లో చిరుతపులిసంచారం కలకలంరేపింది.శనివారం తెల్లవారుఝామునరాత్రి వాహనదారులకు కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక వీడియోలో, చిరుతపులి గోడపై నుండి దూకి అడవిలోకి పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, రాత్రి బయటకు రావద్దంటూ ప్రకటన జారీ చేశారు. ఫాంహౌజ్‌కు కొద్ది దూరంలో చిరుత సంచారంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి సుబోధ్ కుమార్ సమాచారం ప్రకారం చిరుత గోడ దూకి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో రెండు కేజ్‌లను ఏర్పాటు చేయడం తోపాటు, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 80-90 కిలోల బరువున్న పూర్తిగా పెరిగిన చిరుతపులి అని తెలిపారు. అటవీ, ఢిల్లీ పోలీసులకు చెందిన 40 మంది సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అధికారి తెలిపారు. అలాగే ఫాంహౌజ్ వైపు ఎవరూ వెళ్లకుండా స్థానికులను అప్రమత్తం చేశామని ట్రాప్ బోనులను ఏర్పాటు చేసి, వాటి సమీపంలో గుమిగూడ వద్దని ప్రజలకు సూచించినట్లు తెలిపారు. ట్రాప్ బోనులకు సమీపంలో గుమిగూడవద్దని ప్రజలకు సూచించినట్లు పోలీసు అధికారి తెలిపారు.. ఇందులో భాగంగానే అందరూ ఇళ్లనుంచి బయటికి రావద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం. #WATCH | Announcements are being made in Delhi's Sainik Farm area urging people to stay indoors after a leopard was spotted in the area, earlier today. https://t.co/P4nFo6i3rx pic.twitter.com/HzKnabl7qB — ANI (@ANI) December 2, 2023 -
వలలో చిక్కి.. చెట్టుకు వేలాడిన చిరుత
అడ్డతీగల: కోతుల బెడద నివారణ కోసం వరి చేను చుట్టూ అమర్చిన వలలో చిక్కిన చిరుత పులి తప్పించుకుపోవడానికి చెట్టు పైకి ఎక్కి.. దానికి వేలాడుతూ రాత్రంతా అవస్థ పడింది. అటవీ అధికారులు వచ్చి రక్షించినా.. తీవ్ర గాయంతో చివరకు ప్రాణాలు విడిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం శివారున రేగులపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం రేగులపాడు వద్ద చెట్టుకు వేలాడుతున్న చిరుతను చూసిన స్ధానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంపచోడవరం డీఎఫ్‌వో జీజీ నరేంద్రన్, అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో బి.శ్రీరామారావు, అడ్డతీగల రేంజి అధికారి షేక్ షెహన్షా, ఎస్ఐ అప్పలరాజు ఇతర సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వల నడుముకు చుట్టుకుపోయి వేలాడుతున్న చిరుతను రక్షించేందుకు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం జూ నుంచి రెస్క్యూ టీంని రప్పించి రాజమహేంద్రవరం నుంచి బోను తెప్పించారు. రాత్రి నుంచి చెట్టుకు వేలాడడంతో చిరుత అలసిపోయిన విషయం గమనించి.. ట్రాక్టర్లో నిచ్చెన ఉంచి దాని మీద ఆధారపడి చిరుత సేదతీరేలా చేశారు. మంచినీటిని అందించారు. అనంతరం రెస్క్యూ టీం సభ్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బోనులోకి చేరవేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం చిరుత మరణించింది. దీంతో అటవీ అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఘటనా స్ధలంలోనే చిరుతను దహనం చేశారు. కొన్నిగంటల పాటు వల నడుం చుట్టూ చుట్టుకుపోవడంతో చిరుత పెనుగులాడటం, ఆహారం లేక నీరసించి పోవడంతో మృతి చెందిందని డీఎఫ్‌వో నరేంద్రన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతలు మరిన్ని ఉండవచ్చని, ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత కలకలం
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మూడు రోజులుగా నడక మార్గంలో చిరుత కనిపించింది. శ్రీవారి మెట్టు మార్గంలో భద్రత పెంచారు. గుంపులుగా వెళ్లాలని, చిన్న పిల్లలను దగ్గరే ఉంచుకోవాలని భక్తులకు అటవీ శాఖాధికారులు సూచించారు. ఇటీవల కాలంలో చిరుతల సంచారం భక్తులకు భయాందోళన కలిగిస్తోంది. టీటీడీ భక్తుల భద్రత దృష్ట్యా ట్రాప్ కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసింది. నడుచుకుంటూ వెళ్లే వారి చేతికి కర్రను కూడా అందిస్తోన్న టీటీడీ.. మరిన్ని భద్రతా చర్యలు చేపట్టే అంశంపై కసరత్తు చేస్తోంది. -
శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత కదలికలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కదలికలు కలకలం సృష్టించాయి. తిరుమలలో శ్రీవారి ఆలయానికి వెళ్లే భక్తులకు చిరుత కదలికలు ఆందోళన రేకెత్తించాయి. చిరుత కదలికల్ని గుర్తించిన భక్తులు.. టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో కాలినడకన వెళ్లే భక్తులు,.. గుంపులుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది టీటీడీ. వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరొకవైపు ప్రత్యేక కెమెరా టాప్స్‌ను టీటీడీ ఫారెస్ట్‌అధికారులు ఏర్పాటు చేశారు. -
తిరుమలలో చిక్కిన మరో చిరుత
-
తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా టీటీడీ!
సాక్షి, తిరుపతి: తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో ఇనుక కంచె ఏర్పాటు అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇనుపకంచె ఏర్పాటుకు కేంద్రం అనుమతులను టీటీడీ కోరింది. ఈ నెల 12 ఎక్స్పర్ట్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. నడకమార్గంలో పర్యటించి నివేదిక అందజేసే అవకాశాలు ఉన్నాయి. నివేదిక ఆధారంగా టీటీడీ తదుపరి చర్యలు తీసుకోనుంది. స్పెషల్ టైప్ క్వార్టర్స్, శ్రీవారి మెట్టు నడకదారి, నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే. తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
తిరుమలలో చిరుతను ట్రాప్ చేసిన అటవీశాఖ అధికారులు
-
చీతాతో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోలు అందరినీ తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ వీడియోలలో కొందరి విచిత్ర విన్యాసాలే కాదు.. వినూత్న ఆవిష్కరణలు కూడా కనిపిస్తుంటాయి. వీటికితోడు ఇక జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవేలేదు. వాటికి వచ్చే వ్యూస్‌కు అంతేలేదు. తాజాగా ఒక వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చీతా, తాబేలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటుండటాన్ని చూడవచ్చు. ఎక్స్(ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోలో రెండు విభిన్నజాతులకు చెందిన జంతువులు కలివిడిగా ఉండటాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. చిరుతలు వేగానికి, చురుకుదనానికి పెట్టిందిపేరు. అలాగే అది మాంసాహారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తాబేళ్ల విషయానికొస్తే ఇవి సాధారణంగా శాకాహార జంతువులు. నిదానంగా సాగే కార్యకలాపాలకు ప్రతీక. అయితే ఈ వీడియోలో విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు జంతువులు ఒకే పాత్రలోని ఆహారాన్ని ప్రశాంతంగా తింటుడటాన్ని గమనించవచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60 వేల వీక్షణలు దక్కాయి. లెక్కలేనన్ని కామెంట్లు వస్తున్నాయి. ఈ విచిత్ర స్నేహం చూసి కొందరు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుండగా, మరికొందరు దీనివెనుకగల కారణం తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Cheetah & tortoise share food. Those who give their food give their heart. 📽️Carson Springs Wildlife pic.twitter.com/kf4agZCXOZ — Hakan Kapucu (@1hakankapucu) August 31, 2023 -
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్‌ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్‌కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్‌కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
తల్లీ పిల్ల చిరుతలు బందీ
మైసూరు: తల్లి చిరుత రెండు పిల్లలతో కలిసి బోనులోకి చిక్కింది. జిల్లాలోని కేఆర్ నగర తాలూకాలోని దొడ్డవడ్డరగుడి గ్రామానికి దగ్గరలోని చెరుకు తోటలో ఇది జరిగింది. కొన్నిరోజులుగా పరిసర గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తోంది. దీంతో గ్రామస్తులు, రైతులు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు పలుచోట్ల బోనులను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఒక ఆడ చిరుత రెండు పిల్లలతో కలిసి చెరుకుతోటలోని బోనులోకి పడింది. శనివారం ఉదయం తోటకు వెళ్ల్లిన కూలీలు చూసి అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి చిరుతలను తీసుకెళ్లారు. -
చిరుత ఎదురుపడితే ఇలా చేయండి చాలు..! వెంటనే..
కుమరం భీం: ఎవరైనా అడవిలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా చిరుతపులి ఎదురుపడితే ఏం చేయాలి? దాని భారినుంచి ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలపై డెప్యూటీ కన్జర్వేటర్, జన్నారం ఎఫ్‌డీవో మాధవరావు పలు సూచనలు చేశారు. ఇటీవల తిరుమలలో కాలినడకన వెళ్లిన బాలికను చిరుతపులి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వాటి ద్వారా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తప్పించుకునే మెలకువల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే.. పిల్లి జాతి జంతువు.. చిరుతపులి పిల్లి జాతికి చెందిన సిగ్గరి. మనుషుల కంట పడేందుకు ఇష్టపడదు. మనుషుల అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతుంది. సాధారణంగా ఫారెస్ట్ సఫారీకి వెళ్తే పులి కనిపిస్తుంది. కానీ చిరుతపులి కనబడటం చాలా తక్కువ. అది ఒంటరిగా నివసించేందుకు ఇష్టపడుతుంది. కలయిక సమయంలో సహచరిణితో, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అడవిలో ఇవి గుహల్లాంటి ఆవాసాల్లో నివసిస్తాయి. జింకలు, సాంబర్లు, అడవి పందులను చిరుతలు ఎక్కువగా వేటాడుతాయి. పైకి చూస్తే శరీరంపై మచ్చలు చూడటానికి ఒకేలా కనిపించినా రెండు చిరుతలకు ఒకే విధంగా ఉండవు. ఎదురుపడితే ఎలా తప్పించుకోవాలి? దేశంలో పులుల సంఖ్య కంటే చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది. కవ్వాల్ టైగర్ జోన్లో సుమారుగా 80 వరకు చిరుతలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చిరుత పులుల జాతి ఉంది. చిరుతలు జనావాసాల్లోకి ఊరికే రావు. వాటికి ఆహారం, నీటి సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. చిరుత వేగంగా కదిలే జంతువు కావడంతో జనాల్లోఎక్కువ అలజడి సృష్టిస్తుంది. జనాల మఽ ద్యకు వచ్చిన చిరుతను బంధించడం సులువుకాదు. చిరుత పులి ఎంతదూరంలో ఎదురుపడిందన్న అంశంపై ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. దూరంగా ఎదురుపడితే సాధారణంగా అదే పక్కకు వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో మనుషులపై దాడి చేయాల్సిన అవసరం చిరుతకు ఉండదు. అనుకోని పరిస్థితుల్లో అతి సమీపంలో ముఖాముఖిగా ఎదురుపడితే దాడి చేసే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో రెండు చేతులు పైకెత్తి గట్టిగా అరవాలి. అడవి జంతువుల సైకాలజీ ప్రకారం ఆకారంలో తమకన్నా పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా చిరుతలు దాడికి దిగవు. చిరుత పులి ఎదురుపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగెత్తడం, లేదా పొదల చాటున దాక్కోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే చిరుత వెంటపడి దాడిచేసే అవకాశం ఉంది. ఒకవేళ పారిపోతే ఎంత పరుగెత్తినా చిరుత వేగం ముందు మనం నిలువలేం. కాబట్టి చిరుత కాస్త దూరంలో ఎదురుపడితే చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి నడవడం, దగ్గరగా ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి నడిస్తే చిరుత అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చెట్లు ఎక్కినా వేటాడాలనుకునే చిరుత సులభంగా చెట్లు ఎక్కుతుంది. కూలీలు ఏంచేయాలి? అడవిలోకి పనికి వెళ్లే కూలీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిరుత పులి వెనుక వైపు నుంచి వేటాడుతున్నందున కూలీలు మాస్కులు, తలకు వెనుకవైపు ఫేస్ మాస్కులు పెట్టుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు ఫేస్ మాస్కులు ధరించి, మాట్లాడుకుంటూ వెళ్లాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చిరుత పులి బారి నుంచి తప్పించుకోవచ్చని మాధవరావు సూచించారు. -
కాకుల కొండ వద్ద చిరుత కళేబరం
మడకశిర రూరల్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి సమీపంలోని కాకులకొండ వద్ద గురువారం మగ చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ఆడ చిరుత కళేబరం కనిపించిన నేపథ్యంలో ఘటనా స్థలంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గురువారం అటవీశాఖ అధికారులు కొండలోని గుంతలో పరిశీలించగా అక్కడ మగ చిరుత కళేబరాన్ని గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రారెడ్డి, పెనుకొండ అటవీశాఖ డివిజన్ అధికారి ఆనంద్, రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ ఘటనాస్థలికి చేరుకుని గుంతలో ఉన్న చిరుత కళేబరాన్ని పరిశీలించారు. ఆడ చిరుతలాగే తాజాగా లభించిన మగ చిరుత కూడా మృతి చెందిన సమయంలో మల, మూత్ర విసర్జన చేసింది. సమీపంలో ఏదో ద్రవ పదార్థం ఉందన్న అనుమానంతో నమూనాలను సేకరించారు. చిరుత కళేబరాన్ని మడకశిర అటవీశాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ బుధ, గురువారాల్లో లభించిన ఆడ, మగ చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను కాల్చి వేశారు. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..2 చిరుతలూ ఒకే రోజు మృతి చెంది ఉండవచ్చని చెప్పారు. వీటి వయసు రెండేళ్లు ఉంటుందన్నారు. ఈ చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్‌లకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగమా...? లేదా వ్యాధి సోకి మృతి చెందాయా..? అన్నది ల్యాబ్ రిపోర్టుల ద్వారా తెలుస్తుందన్నారు. -
రెండు చిరుతలు అనుమానాస్పద స్థితిలో మృతి..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మడకశిర మండలంలోని మెళవాయి సమీపంలో రెండు రోజుల క్రితం (బుధవారం) ఒక ఆడ చిరుత మృతి చెందింది. గురువారం కూడా అదే ప్రాంతంలోనే మరో మగ చిరుత విగతజీవిగా కనిపించింది. రెండు చిరుతలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. కారణాలు అంతుచిక్కడం లేదు. విషాహారం తినడంతో మృతి చెందాయా? అనారోగ్యం బారిన పడి మృతి చెందాయా? లేదా వేటగాళ్ల దాడిలో మృతి చెందాయా? అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. తల్లీపిల్లని అనుమానం.. మృతి చెందిన రెండు చిరుతలు తల్లి, పిల్లగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. బుధవారం మృతి చెందిన ఆడ చిరుతకు దాదాపు 32 నెలల వయసు ఉంటుందని చెబుతున్నారు. గురువారం మృతి చెందిన మగ చిరుతకు 18 నెలల వయసు ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన చిరుతలు తల్లి, పిల్లగా భావిస్తున్నారు. మగ చిరుతకు ఇంకా పాల పళ్లు అలాగే ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుసగా చిరుత పులులు మృత్యవాత పడుతుండటం విస్మయం కలిగిస్తోంది. మడకశిర నియోజకవర్గంలో రెండు రోజుల్లోనే రెండు చిరుతలు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిగ్గా ఏడాదిన్నర క్రితం కూడా పెనుకొండ నియోజకవర్గంలో రెండు చిరుతలు మృతి చెందాయి. ఆరు నెలల క్రితం బెంగుళూరు జాతీయ రహదారిపై సోమందే పల్లి వద్ద వాహనం ఢీకొనడంతో ఒకటి ప్రాణాలు కోల్పోయింది. వరుసగా ఇలా అరుదైన వన్య సంపదను నష్టపోతుండడంతో ఫారెస్టు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. కాటేస్తున్న కాలం! సాధారణంగా చిరుతకు పరిధి ఉంటుంది. ఆ ప్రాంతంలోకి మరొక చిరుతను రానివ్వదు. అయితే, ఆగస్ట్ నుంచి నవంబర్ మాసాల మధ్య కాలంలో కలయిక కోసం అవి పరిధి దాటుతూ ఉంటాయి. ఈ సమయంలోనే వాటి మధ్య తీవ్ర ఘర్షణ జరుగు తుంది. ఒక్కోసారి ఆడ, మగ చిరుతలు కూడా ఘర్షణ పడుతూ ఉంటాయి. ఈ కారణంగా చిరుతలు ప్రాణాలు కోల్పోతాయని అధికారుల చెబుతున్నారు. ఒక్కోసారి బలమైన దుప్పులను వేటాడుతున్నప్పుడు వాటి కొమ్ములు తగిలి గాయాలపాలై కన్నుమూస్తామని పేర్కొంటున్నారు. మరోవైపు చిరుతలు రాత్రిళ్లలో రహదారులపైకి వచ్చినప్పుడు వాహనాల హెడ్‌లైట్ ఫోకస్‌కు ఆగిన సమయంలో అవి ఢీకొట్టి చనిపోతున్నాయి. చిరుతలకు అనుకూలంగా ఉమ్మడి జిల్లా .. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో చిరుతల సంతానోత్పత్తి బాగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటు జింకలు, నెమళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్టు ఫారెస్టు పరిశీలనలో వెల్లడైంది. రాయలసీమలోనే చిరుతలకు అనుకూలమైన ప్రాంతంగా ఉమ్మడి జిల్లా అడవులు పేరుపొందాయి. దీంతో వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని భావిస్తున్న తరుణంలో ఒక్కో వన్యమృగం మృతి చెందుతూ ఉండడం కలవరం కలిగిస్తోంది. విషం ఆనవాళ్లు.. మృతి చెందిన రెండు చిరుతలకు మడకశిరలోని వెటర్నరీ ఆస్పత్రిలో డాక్టర్లు పోస్ట్‌మార్టం నిర్వహించారు. రెండు చిరుతల శరీరంలో విషం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ చిరుతలకు శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని డాక్టర్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో విషాహారం తినడంతోనే చిరుతలు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. అయితే పూర్తిస్థాయిలో చిరుతల మృతిని నిర్ధారించడానికి వాటి శరీర నమూనాలను బెంగళూరు ల్యాబ్‌కు పంపారు. చిరుతలు పరిధి దాటే కాలమిది సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలంలో చిరుతలు ఒకదానితో ఒకటి కలుస్తుంటాయి. దీని కోసం తమ పరిధి దాటి వెళతాయి. ఈ క్రమంలో వేరొక చిరుతతో బాగా గొడవ పడి వాటికవే శత్రువులుగా మారి చంపేసుకుంటాయి. అందుకే ఈ సమయంలో అటవీ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అడవుల్లోకి వెళ్లకూడదని హెచ్చరిస్తుంటాం. – సందీప్ కృపాకర్,జిల్లా ఫారెస్టు అధికారి, అనంతపురం బెంగుళూరు లేబొరేటరీకి నమూనాలు మృతిచెందిన రెండు చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించాం. రెండింటి శరీరాలపై ఎలాంటి గాయాలూ లేవు. అందుకే నమూనాలు బెంగుళూరులోని వెటర్నరీ లేబొరేటరీకి పంపిస్తున్నాం. ఆ ప్రక్రియ పూర్తయితే గానీ మృతికి కారణమేమనేది చెప్పలేం. –డా.అమర్, పశువైద్యాధికారి, మడకశిర -
జనారణ్యంలో వన్యమృగాల హల్ చల్
-
తిరుమల: ‘చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లోనే ఉంచుతాం’
సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే చిరుత బోనులో చిక్కింది. ఇక, మూడు రోజుల క్రితమే ఇక్కడ మరో చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించారు. పట్టుబడిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం: భూమన ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి 1.30 గంటలకు చిరుత బోనులో చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను మగ చిరుతగా అధికారులు నిర్ధారించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అటవీశాఖ అధికారుల సూచనలతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తాం’ అని స్పష్టం చేశారు. టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు: ధర్మారెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘చిరుతలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నాం. శ్రీశైలం నుంచి నిపుణుల బృందాన్ని తిరుమలకు పిలిపించాం. భక్తులకు కర్రలు ఇవ్వడంతో వారికి సహాయంగా ఉంటుంది. వందలాది మంది భక్తులు కర్రలతో పాదయాత్ర చేయడంతో జంతువులు దరిచేరవు. సోషల్ మీడియాలో టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు’ అని అన్నారు. చిరుతల కోసం మరో ఆరు బోన్లు.. ఈ సందర్బంగా సీసీఎఫ్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టుబడ్డ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుంది. చిరుతకు జూపార్క్‌లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తాం. చిక్కిన చిరుతల్లో చిన్నారిపై దాడి చేసిన చిరుతను గుర్తించాలి. చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లో ఉంచుతాం. మరో చిరుతను ఎక్కడ ఉంచాలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చిరుతలను ట్రాప్ చేయడానికి మరో ఆరు నూతన బోన్లు కొనుగోలు చేస్తున్నాం. నడక దారిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రతీరోజు పరిశీలిస్తున్నాం. క్రూర మృగాలు సంచారం ఉన్న ప్రదేశాల్లో ట్రాప్ కేజ్ ఏర్పాటు చేస్తాం. ఎలుగుబంటి కదలికలు కూడా గుర్తించాం. ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: భక్తులకు కర్రలు కాకుండా.. తుపాకులివ్వాలా!.. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవు! -
తిరుమల: బోనులో చిక్కిన మరో చిరుత..
సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. గురువారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కినట్టు తెలుస్తోంది. నడకదారిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చిరుత బోనులో చిక్కింది. ఇక, 50 రోజుల వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించడం విశేషం. వివరాల ప్రకారం.. ఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాడి చేసిన ప్రాంతంలోనే అధికారులు బోన్లు పెట్టడంతో మూడు రోజుల క్రితమే ఓ చిరుత బోనులో చిక్కింది. ఇక, ఆ ప్రాంతానికి సమీపంలోనే అధికారులు చిరుతల కోసం మూడు చోట్ల బోన్ల ఏర్పాటు చేశారు. మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లను పెట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బోనులో చిక్కింది. ఇదిలా ఉండగా.. 50 రోజుల వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించారు. ఇది కూడా చదవండి: ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ -
తిరుమలకు ప్రత్యేక బృందాలు.. కొనసాగుతున్న చిరుతల వేట
సాక్షి, తిరుమల: ఇటీవల తిరుమల నడకమార్గంలో బాలిక లక్షిత.. చిరుత దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ భక్తుల భద్రతపై అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తిరుమలలో చిరుతల వేట కొనసాగుతోంది. కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తిరుమలకు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. తిరుమలకు నడకదారిలో జంతువుల సంచారం కోసం 500 కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటుచేస్తోంది. అలాగే, వివిధ ప్రాంతాల్లో చిరుతల కోసం బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మోకాళ్ల మెట్టు, 36వ మలుపు వద్ద బోన్లును అమర్చారు. అంతేకాకుండా నడకదారిలో అదనపు ఎల్ఈడీ లైటను అధికారులు ఏర్పాటుచేశారు. ఇది కూడా చదవండి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ప్రత్యేక దర్శనం ఎన్ని గంటలంటే? -
భక్తుల రక్షణే ప్రధాన ధ్యేయం
తిరుపతి సిటీ: తిరుమల వచ్చే శ్రీవారి భక్తుల ప్రాణరక్షణే తమ ప్రధాన ధ్యేయమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గతంలో కౌషిక్ గాయపడటం, ఇటీవల చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు, పోలీసులతో కలసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 12 ఏళ్ల వయసులోపు పిల్లలతో వచ్చే భక్తులకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పెద్దలను మాత్రం రాత్రి 10 వరకు అనుమతిస్తామని తెలిపారు. నడక దారిలో వెళ్లే ప్రతి భక్తునికి సహకారం కోసం ఊత కర్ర అందిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. భక్తులను గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తూ.. ముందు వెనుక అటవీశాఖ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తామన్నారు.. అటవీశాఖ అధికారులు నిపుణులైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని సూచించామని.. వారి వేతనాలు టీటీడీయే భరిస్తుందన్నారు. జంతువులకు ఆహారం అందించడం నిషేధం నడక దారిలో వెళ్లే భక్తులు సాధు జంతువులకు ఆహారం అందించడం నిషేదించామని, అలా అందించే వారిపై చర్యలు తప్పవని కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నడక దారిలోని దుకాణదారులు, హాటళ్ల యజమానులు వ్యర్థాలను బయట వేయరాదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి నుంచి తిరుమల వరకు నడకమార్గంలో సుమారు 500 కెమెరాలను అమర్చనున్నామని, అవసరమైతే డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. వైల్డ్‌లైఫ్ అవుట్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయని, డాక్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దారి పొడవునా సుమారు 30 అడుగుల వరకు వెలుతురు ఉండేలా ఫోకస్ లైట్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద 15వేల దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గాన సైతం వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ అధికారులతో చర్చించామని.. కేంద్ర అటవీశాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయం చేసిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. -
చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్ఓ శ్రీనివాసులు
సాక్షి, తిరుపతి: తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, టీటీడీ ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా.. కాదా అన్నది పరిశీలిస్తాం. చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్నది తెలుసుకుంటాం. అనంతరం ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా? లేక ఫారెస్ట్‌లో వదలాలా అన్నది నిర్ణయిస్తాం. బోనులో చిక్కిన చిరుత ఆడ చిరుత.. నాలుగేళ్లు ఉంటాయని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇది కూడా చదవండి: వీడియో: చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది -
తిరుమల: బోనులో చిక్కిన చిరుత
సాక్షి, తిరుమల: తిరుమలలో బాలికపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలంతో పాటు చుట్టుపక్కల బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత బోనులో చిక్కింది. బాలికపై దాడిచేసిన రెండురోజుల వ్యవధిలోనే చిరుతను అధికారులు పట్టుకున్నారు. బోనులో పడిన చిరుత పెద్దదిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో చిరుతను బంధించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. అనంతరం, చిరుతను అటవీశాఖ అధికారులు జూపార్క్‌కు తరలించారు. ఈ సందర్బంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలి. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి -
చిరుత కోసం గాలింపు
సాక్షి, తిరుపతి: తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారి లక్షితను ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసిన చిరుతను పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటవీ, టీటీడీ, పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు, 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. వాహనం శబ్దం వినడంతో చిరుత అడవిలోకి పారిపోయినట్టు తెలిసింది. చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. పండ్లు.. కూరగాయల కోసమే! కాలినడక మార్గంలో వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. కొందరు భక్తులు నడిచి వెళ్తున్నప్పుడు తినడానికి పండ్లు వెంట తెచ్చుకుంటున్నారు. ఆ పండ్లు, కూరగాయలను కొందరు భక్తులు నడక మార్గంలో కనిపించే దుప్పి, జింకలకు తినిపిస్తుంటారు. భక్తులు ఇచ్చే వాటి కోసం అవి కాలినడక మార్గానికి చేరుకుంటున్నాయి. దీంతో దుప్పి, జింకల కోసం చిరుతలు ఆ ప్రాంతానికి వస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. అక్కడికి వచ్చే చిరుతలు దుప్పి, జింకలు దొరకని సమయంలో చిన్నారులపై దాడికి పాల్పడుతున్నాయంటున్నారు. కాగా, చిన్నారి లక్షిత బంతితో ఆడుకుంటుండగా.. గాలి వాటానికి ఆ బంతి దూరంగా పడటంతో దానిని తీసుకునేందుకు మెట్లు దాటి అడవిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరుత అమాంతం లక్షిత గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆపదను తప్పించే ‘ఆలోచన’ తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ భక్తుడు ఆదివారం అందరినీ ఆకట్టుకున్నాడు. నడక మార్గంలో వన్య ప్రాణులు సంచరిస్తోన్న నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ భక్తుడు తన కుమారుడి చేతికి రబ్బర్ ఎలాస్టిక్ తాడు తగిలించి..ఆ తాడును ఆయన చేతికి ఇలా కట్టుకున్నాడు. దీనిపై ఆ భక్తుడిని ప్రశ్నించగా తమ జాగ్రత్త కోసమే తాడు కట్టినట్లు చెప్పాడు. – తిరుమల ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే లక్షిత మరణంపై కారణాలు తెలుస్తాయి. చిరుత కోసం గాలిస్తున్నాం. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశాం. కాలినడకన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లడం మంచిది. పండ్లు, కాయగూరలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఉంటే బాగుంటుంది. – సతీష్‌రెడ్డి, డీఎఫ్ఓ, తిరుపతి -
తిరుమల కాలినడక.. ఘాట్ మార్గాల్లో జాగ్రత్తలు
తిరుమల: ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలినడక.. ఘాట్ మార్గాల్లో జాగ్రత్తలు చేపట్టింది. సాయంత్రం 6 గంటల తర్వాత నడక దారిలో భక్తులను అనుమతించకూడదని నిర్ణయించింది. అదే విధంగా ఘాట్ రోడ్డులో సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాలను అనుమతించరు. మధ్యాహ్నం 2 గంటల తరువాత చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులను నడక దారిలో అనుమతించరు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలినడక మార్గాలు, ఘాట్ రోడ్లో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 సంవత్సరాలలోపు చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులతో అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెద్దలకు మాత్రమే అలిపిరి కాలినడక మార్గంలో అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు వైపు కాలినడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 సంవత్సరాలలోపు చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులతో అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్దలను మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. శనివారం నుంచి రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల తరువాత ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం నడక మార్గం, ఘాట్ రోడ్లలో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ చిరుతలు పెరిగినట్టు అటవీ అధికారులకు సమాచారం అందుతోంది. శనివారం కూడా నడక మార్గం, ఘాట్ రోడ్లలోని చిరుతల సంచారం గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలు, గాలి గోపురం నుంచి ఏడో మైలు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించారు. రెండో ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో భక్తులను అప్రమత్తం చేశారు. 13టీఎమ్ఎల్50: నడక మార్గంలోని 7వ మైలు వద్ద చిన్నారులకు ట్యాగ్లు వేస్తున్న పోలీసులు చిన్నారుల రక్షణకు ట్యాగ్లు అలిపిరి నుంచి తిరుమల నడక దారిలోని అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెర గడం, దాడుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు రక్షణ చర్యలను చేపట్టారు. ఆదివారం నుంచి అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలు వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు ట్యాగ్లు వేస్తున్నారు. ట్యాగ్లు వేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోయినా సులభంగా కనిపెట్టేందుకు వీలవుతుంది. ట్యాగ్‌పై చిన్నారి పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ నమోదు చేసి ఉంటాయి. -
కేంద్రం ప్రయత్నాలను ప్రశ్నించలేం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఈ ఏడాది 9 చీతాల మృతి విషయంలో కేంద్రం ఇచి్చన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో చీతాల సంతతిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అనుమానాలకు అవకాశం లేదని పేర్కొంది. 1952 తర్వాత దేశంలో చీతాల సంతతి అంతరించిపోయింది. దీంతో, తిరిగి వాటి సంతతిని పెంచే ఉద్దేశంతో గత ఏడాది సెపె్టంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను కునోకు తీసుకువచి్చంది. ఇక్కడ మరో నాలుగు కూనలు జని్మంచాయి. వీటిలో మొత్తం 9 మృత్యువాతపడ్డాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం పిటిషన్ వేసింది. విదేశాల నుంచి తీసుకువచి్చన చీతాలను ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. -
కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృత్యువాత..
-
కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది..
భోపాల్: 'ప్రాజెక్టు చీతా'లో భాగంగా తీసుకువచ్చిన చీతాల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో ఆడ చీతా ప్రాణాలు విడిచింది. ఐదు నెలల్లోనే తొమ్మిది చీతాలు మరణించడం గమనార్హం. తాజాగా మరణించిన చీతాను 'దాత్రి'గా గుర్తించారు. దీని మరణానికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు. పోస్టుమార్టం తర్వాత వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. కునో నేషనల్ పార్కులోని బోమాస్ ఎన్‌క్లోజర్‌లో ఏడు మగ, ఆరు ఆడ, ఓ ఆడ చితాపిల్లతో కలిపి మొత్తం 14 చీతాలను సంరక్షిస్తున్నారు. వీటి బాధ్యతల కోసం పార్కు జంతు సంరక్షకులతో సహా ఓ నమీబియాకు చెందిన నిపుణుడు కూడా ఉన్నారు. ఈ చీతాల్లో రెండింటిని ఇటీవల బయటకు వదిలారు. ఇందులో ఓ చితా చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. కునో నేషనల్ పార్కులో మూడు చీతా పిల్లలతో కలిపి మొత్తం ఐదు నెలల్లోనే తొమ్మది చీతాలు మరణించాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రాజెక్టు చీతాలో భాగంగా 20 చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వాటికి నాలుగు పిల్లలు కూడా జన్మించాయి. తీసుకువచ్చిన చీతాల్లో ఒక్కొక్కటిగా మరణించడం.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన చీతాల సంరక్షణ కార్యక్రమానికి పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు. చీతాలను గుర్తించడానికి వాటకి రేడియా కాలర్‌ను తగిలించారు. వాటి కారణంగానే చీతాలు అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు గుర్తించారు. చివరికి వాటిని తొలగించాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: ఎన్సీఆర్కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్.. ఢిల్లీ హై అలర్ట్ -
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం
-
Kuno cheetah deaths: రేడియో కాలర్ మృత్యుపాశమై!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటి ప్రాణాలు కోల్పోతున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది చీతాలు మరణించాయి. భారత్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు నాడు నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్క్‌లో ప్రవేశపెట్టారు. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు తీసుకువచ్చారు. మార్చిలో జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది తిరక్కుండానే ఎనిమిది చీతాలు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తేజస్, సూరజ్ అనే రెండు చీతాలు మరణించాయి. ఆ చిరుతల రేడియో కాలర్ల కింద గాయాలన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ గాయాల్లో పురుగులు కూడా ఉన్నట్టు వారు నిర్ధారించారు. ఇదే తరహా గాయాలు మరో రెండు చీతాల్లో కూడా ఉండడంతో వాటికి రేడియో కాలర్లు తొలగించి చికిత్స అందిస్తున్నారు. వాటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రేడియో కాలర్లే చీతాల మృతికి కారణం కావచ్చునన్న అనుమానాలు బలపడ్డాయి. రేడియో కాలర్లలో ఉండే చిప్ ఉపగ్రహాల ద్వారా జంతువులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. చీతాల భద్రత, సంరక్షణ కోసం వీటి అవసరం చాలా ఉంది. రేడియో కాలర్స్ ఎలా కబళించాయి? ► చీతాల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం వాటి మెడకి రేడియో కాలర్స్ కట్టారు. వేసవి కాలంలో చెమట, దురద వల్ల చీతాలు తరచుగా మెడపై గీరుకోవడం వల్ల చీతాలకు గాయాలై అది చర్మ సంబంధితమైన ఇన్ఫెక్షన్కు దారితీసి ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశాలున్నట్టు మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణ మాజీ అధికారి అలోక్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ► వర్షాకాలం వచ్చాక వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రేడియో కాలర్స్ కట్టిన మెడ చుట్టూ ఒరుసుకొని పోయి చీతాలకు గాయాలయ్యాయి. ఆ గాయాల మీద క్రిమి కీటకాదులు ముసిరి ఇన్ఫెక్షన్గా మారుతోంది. దీనివల్ల రక్త ప్రసరణకు సంబంధించిన సెప్టిసీమియా అనే పరిస్థితి తలెత్తి చీతాల మరణానికి దారితీసింది. ► ఏదైనా ఒక వస్తువుని సుదీర్ఘకాలం శరీరంపై ఉంచడం వల్ల బ్యాక్టీరీయా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ క్లినికల్ డయాగ్నస్టిక్ రీసెర్చ్‌లో తేలింది. ముఖ్యంగా చీతాల మెడ చుట్టూ ఉండే జుట్టు మృదువుగా ఉండడం వల్ల రేడియో కాలర్‌తో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► జంతువులకి వాడే రేడియో కాలర్ బరువు ఆ జంతువు అసలు బరువులో 3% మాత్రమే ఉండాలి. సాధారణంగా రేడియో కాలర్ల బరువు 400 గ్రాముల వరకు ఉంటుంది. 20 నుంచి 60 కేజీల బరువు ఉండే చీతాలకు ఇది సరిపోతుంది. అయితే చీతా మెడ కంటే తల పెద్దది కాదు. దీని వల్ల రేడియో కాలర్ వాటికి అత్యంత బరువుగా అనిపిస్తాయి. చిన్న జంతువులన్నింటిలోనూ ఈ సమస్య ఉంటుంది. రేడియో కాలర్ కట్టడం వల్ల సమస్యలు ఎక్కవయిపోతాయని లండన్‌లోని రాయల్ వెటర్నరీ కాలేజీ ప్రొఫెసర్ అలన్ విల్సన్ చెప్పారు. ► చీతాలకు గత కొన్ని నెలలుగా రేడియో కాలర్ కట్టే ఉంచారు. కానీ వేసవిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. వానలు కురవడం ప్రారంభమయ్యాక చర్మం నిరంతరం తడిగా ఉండడం వల్ల రేడియో కాలర్ గాయాలు మరింత పెద్దవై చీతాలు మృత్యువాత పడ్డాయి. అన్నీ ఒక్క చోటే ఎందుకు ? : సుప్రీం దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో 40% మృత్యువాత పడడం ఆందోళనకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. చీతాల ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్కచోటే ఎందుకు ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ కునో నుంచి వేరే రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు చీతాలను తరలించే మార్గాలను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయ్. జె.బి. పర్దివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పింది. ‘‘చీతాలు మరణించడానికి కారణాలేంటి ? అసలు ఏమిటి సమస్య ? వాతావరణం చీతాలకు అనుకూలంగా లేదా ? ఇంకా ఏమైనా కారణాలున్నాయా ? గత వారంలో రెండు చీతాలు మరణించాయి ? అలాంటప్పుడు అన్ని చీతాలను మధ్యప్రదేశ్ కునోలో ఎందుకు ఉంచాలి ? వాటిని వేరే కేంద్రాలకు ఎందుకు తరలించకూడదు ? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్రం తరఫున కోర్టుకి హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి త్వరలోనే చీతాల మృతికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. జులై 29లోగా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాలు: 8 దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలు: 12 మార్చిలో పుట్టిన చీతాలు : 4 మృతి చెందిన చీతాలు: 3 కూనలు సహా 8 మిగిలిన చీతాలు :16 – సాక్షి, నేషనల్ డెస్క్ -
చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్కులో చీతాల వరుస మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుండటంతో వాటి పరిరక్షణకు సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జీలు.. బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్రంపై న్యాయస్తానం పలు ప్రశ్నలు సంధించింది. కాగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి రెండు విడతల్లో మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఓ చీత నాలుగు పిల్లలకుజన్మనివ్వడంతో వీటి సంఖ్య 24కు చేరింది. వీటిలో గత నాలుగు నెల్లలో మూడు కూన చీతాలు సహా 8 మరణించాయి. ప్రస్తుతం 18 చీతాలు ఉండగా వీటిలో మరో రెండిటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గత వారం రోజుల్లో రెండు చీతాలు మరణించడంపై ధర్మాసనం స్పందిస్తూ.. దీన్ని ఎందుకు ప్రతిష్టాత్మక అంశంగా మారుస్తున్నారని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. అయితే చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని ఇంకా కునో నేషనల్ పార్క్‌లోనే ఎందుకు ఉంచారని.. వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. చదవండి: వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి 20 చీతాల్లో 8 మరణించాయి.. అంటే ఏడాదిలో 40శాతం చీతాలు మృత్యువాత పడ్డాయి. ఇది మంచి సంకేతం కాదు. ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించింది. వాటిని రాజస్థాన్‌కు తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించింది. అయితే వాతావరణ పరిస్థితులు (ట్రాన్స్‌లోకేషన్) కారణంగా 50 శాతం మరణాలు సాధారణమేనని కేంద్రం ముందుగానే ఊహించిందని కేంద్రం తరఫున ఏసీజీ వాదనలు వినిపించారు. దీనిపై జస్టిస్ పార్దివాలా స్పందిస్తూ.. మరి సమస్య ఏంటి? ఇక్కడి వాతావరణం వాటికి అనుకూలంగా లేదా? కిడ్నీ,శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయా అని ప్రశ్నించారు. అయితే ఇన్ఫెక్షన్లు చీతాల మణాలకు దారి తీస్తున్నాన్నాయని ASG ధర్మాసనానికి తెలియజేశారు. లాగే ప్రతీ చీతా మరణంపై వివరణాత్మక విశ్లేషణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే రాజస్థాన్‌లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కు వాయిదా వేసింది. -
జవాబివ్వాల్సిన చిరుత ప్రశ్నలు!
దాదాపు ఏడు దశాబ్దాల క్రితం దేశంలో అంతరించిపోయిన వన్యప్రాణుల్ని మళ్ళీ పెంచిపోషించే ప్రయత్నం. పదినెలల క్రితం ఆర్భాటంగా మొదలైన ప్రాజెక్ట్. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకువచ్చారు. గత సెప్టెంబర్ నుంచి ‘ప్రాజెక్ట్ చీతా’కు జరిగినంత హంగామా అంతా ఇంతా కాదు. కానీ, మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానంలో విడిచి పెట్టాక 4 నెలల్లో 8 చీతాలు మరణించడం ఈ యత్నంలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న ‘జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ మాత్రం ప్రకృతి సహజ కారణాలతోనే ఈ చీతాలన్నీ చనిపోయాయంటోంది. ఆ మాట శాస్త్రీయంగా లేదు. నిపుణులు లేవనెత్తిన ప్రశ్నలే అందుకు సాక్ష్యం. చీతాల కదలికలు తెలుసుకొనేందుకు మెడకు బిగించిన రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ల వల్ల వాటికి గాయమై, అక్కడ క్రిములు చేరాయనీ, అదే తాజా మరణానికి దారి తీసిందన్న మాటలు ఆందోళన రేపుతున్నాయి. ప్రాజెక్ట్ చీతా భవితవ్యం, శాస్త్రీయత సందేహాస్పదమవుతున్నాయి. నిజానికి 2009లో జైరామ్ రమేశ్ పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడే ఈ చీతాల పునరావాస ఆలోచన జరిగింది. గత ఏడాది అది ఆచరణలోకి వచ్చింది. ఈ సెప్టెంబర్‌తో ప్రాజెక్ట్ చీతాకు ఏడాది పూర్తి కానుంది. నిరుడు సరిగ్గా ఆ సమయంలోనే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు చేరాయి. ఆ పైన ఈ ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ప్రభుత్వం రప్పించింది. దాదాపు 35 చీతాలతో అవి స్వయం సమృద్ధమయ్యే దాకా రానున్న దశాబ్దకాలంలో ఏటా 5 నుంచి 10 చీతాల్ని తేవాలన్నది యోచన. తొలి ఏళ్ళలో ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించకపోవచ్చని ఆది నుంచీ అనుకుంటున్నదే. అది కాక అసలీ ప్రాజెక్ట్ ఏర్పాటులోనే ప్రాథమిక లోపాలున్నాయని విమర్శకుల వాదన. వేగంగా పరుగులు తీసే చీతాలకు కూనో ప్రాంతం సరిపోదన్నది ఒకటైతే, వాటిని దీర్ఘకాలం క్వారంటైన్లో ఉంచడం వల్ల ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధపడే సామర్థ్యం దెబ్బతింది. మానసికంగా సర్దుకుపోవడమూ సమస్య అయింది. అలా అవి సులభంగా బలి అవుతున్నాయి. తెచ్చిన చీతాలకు తోడు కొత్తగా ఇక్కడ పుట్టిన నాలుగింటిలో 3 కూనలు చనిపోయాయి. గాయం కథలో శాస్త్రీయత లేదని ప్రభుత్వం అంటున్నా, ఈ అంశాలపై విచారించి, మిగిలిన చీతాలన్నిటికీ పూర్తిస్థాయి శారీరక పరీక్షలు చేయాలని నిపుణుల సంఘం సిఫార్సు చేయడం గమ నార్హం. స్వేచ్ఛగా తిరిగేవాటిని పట్టి, కాలర్లు తీసేసి, ఈ పరీక్షలు చేయడం శ్రమతో కూడిన పని. సమ యమూ చాలానే పడుతుంది. అప్పుడు కానీ, ప్రాజెక్ట్ చీతా భవితవ్యం తేలదు. చీతాల కోసం అసలు మనం ఎంచుకున్న కూనో ఉద్యానమే చిన్నదని నమీబియా నిపుణులు కుండబద్దలు కొట్టారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఒక్కొక్క చీతా వేటాడి తినడానికీ, తిరగడానికీ సగటున 100 చదరపు కి.మీ.ల విశాల ప్రాంతం ఉంటుంది. కానీ, మన ‘కూనో జాతీయోద్యానం’లో సగటున మూడు చీతాలకు కలిపి 100 చదరపు కి.మీ.ల జాగాయే ఉంది. అలాగే, చీతా స్వేచ్ఛగా సంచరించడానికీ, ఆహార సేకరణ, పునరుత్పత్తికీ నిర్నిరోధమైన 1600 చదరపు కి.మీ.ల పైగా విస్తీర్ణం కావాలి. కూనో జాతీయోద్యానం మొత్తం వైశాల్యం చూసినా 750 చదరపు కి.మీ.లే! ఎలా చూసినా దేశంలో చీతాల పునఃప్రవేశానికి విస్తీర్ణం సరిపోని ఈ ఉద్యానాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది బేతాళ ప్రశ్న. నమీబియా, దక్షిణాఫ్రికాల్లో చీతాలు చుట్టూ కంచె ఉన్న రిజర్వుల్లో ఉంటే, మన దగ్గర వాటిని కంచెలేని సహజమైన, అరణ్య వాతావరణంలో పెరగనివ్వాలని యోచన. కూనో జాతీయోద్యానంలోకి వదిలిన చిరుతలు కొన్ని ఆ పరిధిని దాటి, జనావాసాల్లోకి జొరబడిన వార్తలొచ్చాయి. ఇది పోనుపోనూ మనిషికీ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీయవచ్చు. ప్రాజెక్ట్ చీతాకు రూపకల్పన చేస్తున్నప్పుడు ఈ సంగతులేవీ లెక్కలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే! అధికారులు మాత్రం కూనో రిజర్వ్‌లో కావాల్సినంత స్థలం, చీతాలకు తగినంత ఆహారం ఉన్నాయంటున్నారు. మధ్యప్రదేశ్‌లోనే గాంధీసాగర్లో రెండో రిజర్వ్‌ను అభివృద్ధి చేసి, చీతా పునరావాస కేంద్రం స్థాపిస్థామని చెబుతున్నారు. అవన్నీ నిజమైతే మంచిదే. కానీ, పెద్ద పులులు, చిరుతలతో పోలిస్తే చీతాలు మహా సున్నితం. అడవిలో అవి తీవ్రంగా గాయపడే ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతానికి మన దగ్గర వీటికి సింహాలు, చిరుత పులుల నుంచి పోటీ లేదు గనక కొంత నయం. కాలగతిలో ఇవి మన పరిస్థితులకు అలవాటు పడి భారత్‌ను తమ కొత్త ఆవాసంగా మారుస్తాయేమో చూడాలి. అరణ్యాల్లో చీతా కూనలు బతికేరేటు 10 శాతమేనట! అంతే శాతం పెరిగిపెద్దవుతాయి. కాబట్టి మరణాలు సహజమేనని ప్రభుత్వ వాదన. కానీ ఇప్పటిదాకా కూనోలో చనిపోయిన చీతాల్లో ఒక్కటి మినహా అన్నీ పూర్తి అరణ్యంలో కాక ఒక చ.కి.మీ. విస్తీర్ణంలో పెట్టిన ‘బోమస్’ అనే ప్రత్యేక ఎన్క్లో జర్లలో ఉన్నవే. కాబట్టి, లోతుగా పరిశీలన చేయాలి. తక్షణమే ప్రాజెక్ట్ చీతా నుంచి పాఠాలు నేర్చు కోవాలి. జరిగిన పొరపాట్లను గుర్తించి, వాస్తవాలను ప్రజాక్షేత్రంలో పంచుకోవడం మరీ అవసరం. తద్వారా సంబంధిత నిపుణులతో పరిష్కారాలు కనుగొనవచ్చు. చీతాల నిర్వహణలో స్థానిక నైపుణ్యం లేదు గనక నిర్ణీత నిపుణుల అనుభవాన్ని ఆసరా చేసుకోవాలి. అలా కాక రోగాన్ని దాచిపెట్టి, వైద్యం చేస్తే ఫలితం లేకపోగా, వికటించే ప్రమాదం ఉంది. చీతాల పునరావాసం, పునరు త్పత్తి సవ్యంగా సాగాలంటే అధికారులు భేషజాలు వదలాలి. లేదంటే, మొదటికే మోసం వస్తుంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన తొలి ఖండాంతర చీతా పునరావాస ప్రాజెక్ట్ అర్ధంతరంగా అంతిమ అధ్యాయానికి చేరుకుంటుంది. అలా జరగరాదంటే చిరుత ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు కావాలి! -
మరో చీతా మృత్యువాత.. నాలుగు నెలల్లో ఏడో మరణం
భోపాల్: ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌లో అడుగుపెట్టిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యుదేవత దిశగా అడుగులేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయవనంలో ఉన్న మగ చీతా తేజస్ మంగళవారం కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. దీంతో గత నాలుగు నెలల్లో మరణించిన చీతాల సంఖ్య ఏడుకు పెరిగింది. నాలుగేళ్ల వయసు ఉన్న తేజస్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. మరణించిన ఏడు చీతాల్లో నమీబియా చీతా జ్వాలకు జన్మించిన మూడు చీతా కూనలూ ఉన్నాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చీతాల పునర్‌ఆగమన కార్యక్రమం నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ‘వాటిల్లో అవి ఆధిపత్యం కోసం చేసుకున్న ఘర్షణల్లో గాయపడటం వల్లే తేజస్ మరణించి ఉంటుంది. మరణించేనాటికి ఇది ఇంకా ఎన్‌క్లోజర్‌లోనే ఉంది’ అని వైల్డ్‌లైఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ అంచనావేశారు. రెండు మగ చీతాలను అడవిలోకి వదిలేసిన మరుసటి రోజే ఇలా ఒకటి మరణించడంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు. చదవండి: ప్రాజెక్ట్ చీతా.. కొత్త పరేషాన్ -
బాలుడిపై చిరుత దాడి: ఏడుకొండల స్వామి దయతో పునర్జన్మ
చిరుత నోట్లో చిక్కుకొని ఏడుకొండల స్వామి దయతో ప్రాణాలతో బయటపడిన చిన్నారి 18 రోజుల అనంతరం తిరిగి సొంత ఊరికి చేరుకున్నాడు. తిరుమలలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన బాలుడిపై చిరుత దాడి ఘటన ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. కళ్లెదుటే పిల్లాడి గొంతు కరుచుకొని క్షణాల్లో ఓ చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లడం కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న భక్తులను భయకంపితులను చేసింది. దేవుని దయ వల్ల బాలుడు మృత్యుంజయుడిగా సోమవారం ఆదోనిలోని తమ ఇంటికి చేరుకోగా స్థానికుల్లో సంతోషం వ్యక్తమైంది. ఆ వివరాలు చిన్నారి తల్లిదండ్రులు శిరీష, కొండానాయక్ల మాటల్లోనే.. ఆదోని అర్బన్: ‘‘పట్టణంలోని రాజరాజేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నాం. చక్లీల వ్యాపారంతో జీవనం సాగిస్తున్న మాకు ఇద్దరు కుమారులు(ప్రేమ్నాయక్, కౌశిక్ నాయక్) సంతానం. గత జూన్ 22న ఉదయం 7 గంటలకు ఆదోని నుంచి రైలులో తిరుపతికి బయలుదేరాం. మధ్యాహా్ననికి అక్కడికి చేరుకోగా.. సాయంత్రం అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు పయనమయ్యాం. మాతో పాటు తాత తిమ్మయ్య, అత్త సుజాత ఉన్నారు. మూడేళ్ల కౌశిక్ తన తాతతో పాటు ముందు వెళ్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఓ చిరుత మీదకు దూకి బాలుడిని గొంత వద్ద పట్టుకొని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అందరం దాని వెంటపడ్డాం, మాతో పాటు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అరుపులు, కేకలు వేస్తూ అడవిలోకి పరుగు తీశాం. కారు చీకట్లో రోదిస్తూ ఎదురొచ్చాడు.. పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో భయాందోళనకు లోనైన c కారు చీకట్లో ఎక్కడెక్కడో వెతికాం. ఎత్తుకెళ్లి అరగంట గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఇక దక్కడనే అనుకున్నాం. ఆ సమయంలో పిల్లాడి ఏడుపు వినిపించడంతో ఆ దిశగా వెళ్లాం. రాళ్లు రప్పలను దాటుకుంటూ చెట్ల మధ్య నుంచి ఏడ్చుకుంటూ వస్తున్న మా కుమారుడిని చూడగానే ప్రాణం లేచివచ్చింది. ఏడుకొండల స్వామిని మనసులోనే తలుచుకొని పిల్లాడిని హత్తుకున్నాం. రక్తగాయాలను చూసి గుండె ఆగినంత పనైంది. ఏమైందో ఏమోనని కంగారుపడ్డాం. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే 108లో తిరుపతిలోని పద్మావతి చి్రల్డన్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాగా చూసుకున్నారు.. తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్ ఆస్పత్రిలో మా కుమారునితో పాటు మాకందరికీ ఏ లోటు లేకుండా చూసుకున్నారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఇతర అధికారులు అందరూ అప్పటికప్పుడు స్పందించారు. ఆసుపత్రిలో కూడా ఎంతో ధైర్యం చెప్పారు. పిల్లానికి ఏమీ కాదని, ప్రాణహాని లేదని చెబుతూనే మెరుగైన వైద్యం అందించారు. 18 రోజుల చికిత్స అనంతరం గత శుక్రవారం డిశ్చార్జి చేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మా పిల్లాడిని మాకు పూర్తి ఆరోగ్యంతో అప్పగించారు. ఆ దేవునితో పాటు అధికారులందరికీ రుణపడి ఉంటాం. తల్లిదండ్రులు శిరీష, కొండాలతో బాలుడు కౌశిక్నాయక్ ఉచితంగానే దర్శనం డిశ్చార్జి అయిన వెంటనే పిల్లాడితో పాటు మమ్మల్ని ప్రత్యేక వాహనంలో తిరుమలకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా రూములు కేటాయించి స్వామి వారి బ్రేక్ దర్శనభాగ్యం కలి్పంచారు. అరగంటలోపు దర్శనం పూర్తి కాగా.. లడ్డూలను కూడా అందించారు. మా జీవితంలో ఈ దర్శనం మర్చిపోలేని అనుభూతి. ఆ తర్వాత తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో ఆదివారం మధ్యాహ్నం తిరుపతి రైల్వేస్టేషన్లో వదిలారు. సోమవారం ఇంటికి చేరుకున్నాం. బాబుకు పునర్జన్మ లభించిందంటే అంతా స్వామి దయ. -
ప్రాజెక్ట్ చీతా.. కొత్త పరేషాన్
మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లోని కూనో నేషనల్ పార్క్‌కు సంబంధించిన ఒక వార్త కలకలం రేపుతోంది. కూనో అభయారణ్యంలో చీతాలను స్వేచ్ఛగా విడిచిపెట్టిన తరువాత.. ఆధిపత్యం కోసం, అవి ఉండే స్థల నిర్థారణ కోసం వాటి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అభయారణ్యంలోని పాల్పుర్ బీట్ సమీపంలో నమీబియా, సౌతాఫ్రికా చీతాల మధ్య పోరాటం జరిగింది. ఈ దాడులలో ‘అగ్ని’ అనే చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. దానికి కూనో పాల్పుర్ పశువైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది. కూనో నేషనల్ పార్కులో సౌత్ ఆఫ్రికా,నమీబియాకు చెందిన చిరుతలు ఉన్నాయి. వీటిని ఈ అభయారణ్యంలో విడిచిపెట్టారు. వీటిని వేర్వేరు దిశలలో రిలీజ్ చేశారు. అయితే ఈ విశాల అరణ్యంలో ఉంటున్న ఈ చీతాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు పరస్పరం తలపడుతున్నాయి. ‘అగ్ని’కి ప్రత్యేక వైద్యం.. తాజాగా ఇటువంటి ఘటనే జరిగింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలతో నమీబియాకు చెందిన ‘శౌర్య’, ‘గౌరవ్’లకు మధ్య పోరాటం జరిగింది. ఈ భీకర పోరాటంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘అగ్ని’ తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ చిరుతను మానిటరింగ్ చేస్తున్న టీమ్ దీనిని గమనించి వాటిని వేరుచేసి, వాటిని పాల్పుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాటికి చికిత్స కొనసాగుతోంది. ఈ చిరుతలో తీవ్రంగా గాయపడిన ‘అగ్ని’కి పశువైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఆగని పోరాటాలు.. కూనో నేషనల్ పార్క్ డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అభయారణ్యంలోని ‘అగ్ని’ అనే ఆడ చీతా గాయపడిందని, దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దాని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కాగా నమీబియా నుంచి కూనో పార్కుకు తీసుకు వచ్చిన ‘శౌర్య’, ‘గౌరవ్’ చిరుతలు కవలలు. అవి భారత్‌కు వచ్చినప్పటి నుంచి కలివిడిగానే ఉంటున్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలు వేర్వేరుగా మసలుతున్నాయి. ఇరుప్రాంతాలకు చెందిన ఈ చీతాల మధ్య అస్థిత్వం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: అమ్మో..! కుంభకర్ణుడిలా ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు.. -
తిరుమల నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి
తిరుమల: తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించినట్టు సమాచారం. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తింపు. జరిగిన విషయం తెలియడంతో టిటిడి ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ధర్మారెడ్డి సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. స్విమ్స్‌కు చెందిన న్యూరో స్పెషలిస్ట్‌లు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారని ధర్మారెడ్డి పేర్కొన్నారు. -
చితికి చేరుతున్న చీతాలు.. ‘ప్రాజెక్ట్ చీతా’పై కొత్త కమిటీ
భోపాల్: భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంతతిని పెంచేందుకు నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి చీతాలను తీసుకొచ్చిన కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ వనంలో చీతాలు వరసబెట్టి మృత్యుబాట పడుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి భారత్‌కు చీతాల తరలింపు ప్రాజెక్ట్ చేపట్టిననాటి నుంచి మూడు చీతాలు, మూడు చీతా కూనలు ప్రాణాలు కోల్పోయాయి. కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే మొత్తం మరణాల సంఖ్య ఆరుకు పెరిగింది. చీతాల మరణాలు ఆందోళకరంగా మారడంతో.. ప్రాజెక్ట్ చీతా అమలును పర్యవేక్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన కొత్త స్టీరింగ్ కమిటీని కేంద్రం నియమించింది. 11 మంది సభ్యులతో కూడిన చిరుత ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసింది. దీనికి గ్లోబల్ టైగర్ ఫోరమ్ సెక్రటరీ జనరల్ రాజేష్ గోపాల్ చైర్మన్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శితో సమావేశం అనంతరం దీనిని ఏర్పాటు చేశారు. చదవండి: తప్పిపోయిన 'ఆశ'.. ప్రాజెక్టు చీతా బృందంపై గ్రామస్థుల దాడి కొత్తగా ఏర్పడిన కమిటీ మధ్యప్రదేశ్‌ల్లో ప్రవేశ పెట్టిన చీతాల పురోగతిని అంచనా వేసి పర్యవేక్షిస్తుంది. వాటి మనుగడపై ఎన్టీసీఏకు పలు సూచనలు అందించనుంది. అలాగే ఎకో టూరిజం కోసం చిరుత ఆవాసాలను తెరవడంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. సంబంధిత నిబంధనలను సిఫారసు చేయనుంది. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్ ప్రస్తుతం 18 చిరులు, ఒక కూన చిత ఉంది. కాగా నమీబియా నుంచి తీసుకొచ్చేటపుడే మూత్రపిండ సంబంధ వ్యాధితో బాధపడుతున్న సాశా అనే చీతా మార్చి 27న చనిపోయింది. తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే చీతా ఏప్రిల్ 13న మరణించింది. దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన దక్ష అనే మరో చీతా కలయిక కోసం మరో మగ చీతాతో జరిగిన పోరాటంలో తీవ్ర గాయాలపాలై ఈనెల తొమ్మిదో తేదీన తుదిశ్వాస విడిచింది. డీహైడ్రేషన్.. గత ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన సియాయా అనే ఆడ చీతాకు జ్వాల అని నామకరణం చేసి కూనో నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టారు. అది మార్చి నెలలో నాలుగు కూనలకు జన్మనిచ్చింది. కాగా సూర్యప్రతాపం కారణంగా కూనో వనంలో పగటిపూట వేడి దాదాపు 47 డిగ్రీల సెల్సియస్‌గా ఉండటంతో డీహైడ్రేషన్ కారణంగా మే 23న తొలి కూన మృత్యువాత పడింది. దీంతో వాటిని వేరే చోటుకు తరలించాలని అధికారులు భావించారు. ఆలోపే గురువారం మరో రెండు కూనలు మరణించాయి. వాస్తవానికి ఆ రెండింటినీ ప్రత్యేక సంరక్షణలో ఉంచామని అయినా కాపాడలేకపోయామని, నాలుగో కూనను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నామని పర్యవేక్షక బృందం గురువారం ప్రకటించింది. -
కునో నేషనల్ పార్క్: చీతా కూన మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో రెండు నెలల క్రితం జన్మించిన చీతా కూన మంగళవారం చనిపోయిందని అటవీ శాఖ తెలిపింది. దీంతో, ఆఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చిన వాటితో కలిపి రెండు నెలల కాలంలో మృతి చెందిన చీతాల సంఖ్య నాలుగుకు చేరింది. నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటైన ‘జ్వాల’కు మార్చిలో నాలుగు కూనలు పుట్టాయి. మంగళవారం తల్లితోపాటు మూడు కూనలు అటవీ ప్రాంతంలో తిరుగాడుతుండగా, నాలుగో కూన మాత్రం కదలకుండా ఉంది. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కొద్ది సేపటికే చనిపోయింది’ అని అటవీ శాఖ వివరించింది. ఈ కూన పుట్టినప్పటి నుంచి బలహీనంగానే ఉందని తెలిపింది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకువచ్చిన చీతాల్లో మూడు గత రెండు నెలల్లో చనిపోవడం తెలిసిందే. ఇది కూడా చదవండి: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు.. -
చీతాలు.. చింతలు.. కాపాడుకోవడం ఎలా? మూడు నెలల్లో మూడు..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోనే అంతరించిపోయిన జాబితాలో చేరిపోయిన చీతాల సంతతిని తిరిగి భారత్‌లో పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీతాల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మొత్తం 20 చీతాలను తీసుకువచ్చాము. గత మూడు నెలల్లోనే మూడు చీతాలు మరణించడంపై జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. మూడు చీతాలను మనం కోల్పోయినప్పటికీ మార్చి నెలలో సియాయా అనే చీతా నాలుగు పిల్లలకి జన్మనివ్వడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకెళుతుందన్న ఆశలు ఇంకా అందరిలోనూ ఉన్నాయి. చీతాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందనే చర్చ మొదలైంది. చీతాలను కాపాడుకోవడం ఎలా? ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాల సంతతి పెరగడానికి చాలా ఏళ్లు ఎదురు చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. చీతాలకు రేడియో కాలర్ ఏర్పాటు చేసి శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ప్రతీ క్షణం వాటి భద్రతని పర్యవేక్షించడం సంక్లిష్టంగా మారింది. అందుకే వాటిని ఎన్క్లోజర్లకే పరిమితం చేయడంపై వన్యప్రాణుల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిమితమైన స్థలంలో వాటిని బంధించి ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని వరల్డ్‌లైఫ్ బయోలజిస్ట్ రవి చెల్లం అభిప్రాయపడ్డారు. మగ, ఆడ చీతాలను ఎన్క్లోజర్ల నుంచి బయటకి తరచూ వదులుతూ ఉండాలని అప్పుడే వాటి సంతతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక వాతావరణపరమైన అడ్డంకుల్ని అధిగమించాలంటే మరిన్ని ఏళ్లు గడవడం తప్ప మరో మార్గం లేదన్నది వన్యప్రాణ నిపుణుల అభిప్రాయంగా ఉంది. రుతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత చీతాలను వేరే అడవులకి కూడా తరలించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఎదురవుతున్న సవాళ్లు ► చీతాల మనుగడుకు ఎదురవుతున్న అతి పెద్ద సవాల్ వాతావరణం. మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో వాతావరణం ఆఫ్రికా వాతావరణం కంటే చాలా విభిన్నమైనది. కునోలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకు రాల్చే అడవులుంటాయి. ఆఫ్రికాలో గడ్డి మైదానాలు, దట్టమైన వృక్షాలు ఎక్కువ. ఇన్నాళ్లూ అక్కడ వాతావరణానికి అలవాటు పడిన చీతాలకు ఒకేసారి మార్పు రావడం తట్టుకోలేకుండా ఉన్నాయి. మన దేశంలో ఉద్యానవనాలు చీతాలకు నివాసయోగ్యాలుగా మారగలవో లేదోనన్న సందేహాలు కూడా నిపుణుల్లో ఉన్నాయి. ప్రభుత్వం చీతాల ప్రాజెక్టు ప్రారంభించడానికే ముందే జంతు పరిరక్షణ నిపుణులు భారత పర్యావరణ వ్యవస్థకి చీతాలు అలవాటు పడడానికి చాలా ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. ► ఇక రెండో పెద్ద సవాల్ స్థలం. కునో జాతీయ పార్క్‌లో చీతాలు ఉంచిన వాటికి ఎన్‌క్లోజర్ సరిపోదు. అవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత దట్టమైన అటవీ ప్రాంతం అవసరముంది. వచ్చే అయిదేళ్లలో మరో 30 చీతాలను తెచ్చే ప్రణాళికలు ఉండడంతో వాటిని ఎక్కడ ఉంచుతారో కూడా ముందుగానే చూడాల్సిన అవసరం ఉంది. ► కునోలో జంతువుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉండడం అధికమే. చీతా కంటే దూకుడుగా వ్యవహరించే పులులు, చిరుతుపులులు పోటాపోటీగా కొట్టుకుంటాయి. ఒక్కోసారి చీతాలను ఉద్యానవనం గేటు వరకు తీసుకొస్తూ ఉంటాయి. అక్కడ మనుషులే వాటికి శత్రువులుగా మారుతుంటారు. ఇక మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణలతో ఎంతో విలువైన జంతు సంపదని కోల్పోతున్నాం. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు కలుగుతోంది. ► చీతాల సంరక్షణకి నియమించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికాకి పంపించి శిక్షణ ఇచ్చింది. కానీ ఆ శిక్షణ సరిపోలేదు. రెండు చీతాలు అనారోగ్య కారణాలతో మరణించాయంటేనే సంరక్షకులకు వాటిపై పూర్తి స్థాయి అవగాహన లేదన్న విషయం తెలుస్తోంది. ► భారత్‌లో చీతాలు ప్రధానంగా కృష్ణజింకలు, చింకారాలను వేటాడి తింటాయి. ప్రస్తుతం కునో జాతీయ ఉద్యానవనంలో ఈ జంతువులు అంతగా లేవు. దీంతో చీతాల కడుపు నిండడం కూడా సమస్యగానే మారింది. మార్చి 27: నమీబియా నుంచి తీసుకువచ్చిన శష అనే చీతా కిడ్నీపరమైన వ్యాధితో మరణించింది. ఏప్రిల్ 13: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఉదయ్ అనే చీతా అనారోగ్య కారణాలతో మృతి చెందింది మే 9: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాల్లో దక్ష అనే ఆడ చీతాను మేటింగ్ సమయంలో మగ చీతాలు క్రూరంగా వ్యవహరించి మీద పడి చంపేశాయి. -
మరో చీతా కన్నుమూత! జతకట్టే సమయంలో గాయపడటంతో..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో దక్ష అనే మరో ఆడ చీతా కన్నుమూసింది. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ అన్నారు. తాము ఆ ఆడ చీతాకు అవసరమైన అన్ని మందులు, చికిత్స తక్షణమే అందించామని, కానీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణాలు విడిచిందని తెలిపారు. వాయు, అగ్ని అనే మగ చీతాలతో సంభోగ సమయంలో అవి పరస్పరం హింసాత్మక దాడులు చేసుకున్నాయని, అందువల్లే దక్ష అనే చీతా మరణించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఎన్‌క్లోజర్ నెంబర్ 1లో ఉన్న దక్షను బోమా 7 ఎన్‌క్లోజర్‌లో ఉన్న వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు. అయితే ఈ ప్రక్రియలో మగ చిరుతలు హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. కానీ ఇది చాలా సర్వ సాధారణ విషయమని చౌహాన్ చెబుతున్నారు. మగ చిరుతలు జత కట్టే సమయంలో తమకు సంబంధంలేని మగ చిరుతలతో దాడులకు దిగుతాయని, గెలిచిన మగ చిరుత ఆడ చిరుతతో జత కడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, గతేడాది ప్రాజెక్టు చీతా కింద దక్షిణాఫ్రికా నుంచి దాదాపు ఇరువై చీతాలను జాతీయ పార్కుకి తీసుకురాగా వాటిలో సాషా, ఉదయ్ అనే రెండు చిరుతలు మార్చి, ఏప్రిల్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఆ రెండు చిరుతలను సెప్టంబర్ 2022లో వేర్వేరు బ్యాచ్‌లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో వద్ద ఉన్న క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి నమీబియా నుంచి ఐదు ఆడ చీతా పిల్లలు, మూడు మగ చీతా పిల్లలతో కూడిన ఎనిమిది చీతా పిల్లలను విడుదల చేశారు. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రధాని మోదీ బహిరంగ లేఖ! ఆ లేఖలో ఏముందంటే..) -
Project Cheetah: చీతాల మరణం ఊహించిందే!
న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్క్‌లో చీతాల మనుగడ సాధ్యమేనా?.. ప్రాజెక్ట్ చీతాను కేంద్రం ప్రారంభించినప్పుడు చాలామంది మేధావులు వ్యక్తం వేసిన ప్రశ్న ఇది. అయితే.. కేంద్రం ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. సౌతాఫ్రికా, నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన 20 చీతాలను నెలల పాటు పర్యవేక్షించి.. కునోలోకి వదిలింది. కానీ, అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. నెల వ్యవధిలోనే రెండు చీతాలు కన్నుమూశాయి. ఆ రెండూ ఇన్ఫెక్షన్లతోనే కన్నుమూశాయన్న అటవీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరిస్థితిపై సౌతాఫ్రికా అటవీ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపైనే కునో అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సౌతాఫ్రికా ఫారెస్ట్, ఫిషరీస్, ఎన్విరాన్మెంట్ విభాగం(DFFE).. మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో సంభవించిన చీతాల మరణంపై స్పందించారు. ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే.. మరణాలను తాము ఊహించామని వారంటున్నారు. అందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణంగా భావించవచ్చని చెబుతున్నారు. ► ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. నమీబియా, సౌతాఫ్రికా నుంచి భారత్ చీతాలను తెప్పించుకుంది. ఆ రీలొకేటింగ్ టైంలోనే మేం ఈ పరిస్థితిని అంచనా వేశాం. సాధారణంగా వాతావరణ మార్పులను ఒక్కోసారి అవి తట్టుకోలేవు. విపరీతమైన మార్పుల కారణంగానే అవి చనిపోవచ్చు. అలా కునోలో చీతాల మరణాలు మేం ఊహించినవే అని తెలిపారు. అయితే ఏదైనా జబ్బు పడి అవి చనిపోతున్నాయా?, సాధారణ ఇన్ఫెక్షన్లతోనే చనిపోతున్నాయా? అనేద ఇంకా తేలాల్సి ఉంది. ► భారత్ చేపట్టిన ప్రాజెక్ట్ చీతా.. ఒక రిస్కీ ఆపరేషన్. పైగా ప్రస్తుతం అది ఇంకా క్రిటికల్ ఫేజ్‌కు చేరుకుంది. ఎందుకంటే చీతాలు ఇప్పుడు పరిమిత ప్రాంతంలో లేవు. అవి సంచరించే సరిహద్దులు పెరిగిపోయాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యం గురించి పర్యవేక్షించడం వాటి సంరక్షకులకు కష్టతరంగా మారొచ్చు. అదే విధంగా వాటికి అయ్యే గాయాల్ని కూడా పర్యవేక్షించడం కష్టమే అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ► సౌతాఫ్రికాలో చీతాలను భారీ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. రోజుకు రెండుసార్లు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ అడవిలో ఉంటే.. బృందాలు వాటిని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తుంటాయి. కానీ, కునో ప్రాంతం ఫెన్సింగ్ రక్షిత ప్రాంతం కాదు. అంతేకాదు.. చీతాలకు పోటీగా చిరుతలు, తోడేళ్లు, ఎలుగు బంట్లు, హైనాలు సంచరిస్తుంటాయి. వాటి నుంచి కూడా ముప్పు పొంచి ఉండొచ్చు. ► వివిధ రకాల వాతావరణాల్లో వివిధ రకాల జంతువులను పరిరక్షించడం అతి పెద్ద సవాల్. చీతాల సంరక్షణ మరింత సంక్లిష్టంతో కూడుకున్నది. ఆవాసానికి అలవాటుపడితేనే అవి మనుగడ సాగించగలవని, అప్పటి వరకు వాటిని దగ్గరగా పర్యవేక్షించడమే మంచిదని కునో అధికారులకు సౌతాఫ్రికా అటవీ అధికారులు సూచిస్తున్నారు. ► అయితే ఈ ప్రకటనపై కునో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ► ప్రాజెక్ట్ చీతా చేపట్టిన టైంలోనే.. కునో పార్క్ చీతాల సంచారం, వేటకు సరిపోదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. చీతాలకు బదులు త్వరగా, ఎక్కువగా అంతరించి పోయే ప్రమాదం ఉన్న జంతువులను పరిరక్షించే ప్రాజెక్టును చేపట్టడం మేలని సూచిస్తున్నారు. గిర్ జాతీయ పార్కు నుంచి కొన్ని సింహాలను.. కునో పార్కులో ప్రవేశపెడితే బాగుంటుందని కొందరు సూచించారు కూడా. ఇదీ చదవండి: భారత్ శాంతి మంత్ర -
Kuno: మరో చీతా కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా కన్నుమూసింది. ఆదివారం ఉదయం అస్వస్థతకు గురైన చీతా.. సాయంత్రం కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. నెల వ్యవధిలో ఇది రెండో చీతా మరణం. సౌతాఫ్రికా నుంచి ఫిబ్రవరిలో 12 చీతాలను భారత్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరేళ్ల వయసున్న ఉదయ్ అనే చీతా ఆదివారం కన్నుమూసింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా అది అస్వస్థతతో కనిపించిందని, మత్తు మందు ఇచ్చి బంధించి చికిత్స అందిస్తుండగా అది సాయంత్రం మరణించింది అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే అది ఎందుకు మరణించిందో తెలుస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలలో కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఐదేళ్ల వయసున్న నమీబియన్ చీతా షాషా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ చీతా కోసం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను కేంద్ర ప్రభుత్వం రప్పించింది. ఇందులో రెండు మరణించగా.. 18 మిగిలాయి ఇప్పుడు. -
అడవి దాటి గ్రామంలో చొరబడ్డ నమీబియా చీతా.. స్థానికులు హడల్..
భోపాల్: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో ఉన్న నమీబియాలో చీతాల్లో ఒకటి అడవి దాటి బయటకు వెళ్లింది. ఫారెస్ట్ ఏరియా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్ బరోడా గ్రామంలో చొరబడింది. దీంతో చీతాను చూసి గ్రామస్థులు హడలిపోతున్నారు. ఈ చీతా పేరు ఒబాన్. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు వెంటనే ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగారు. చీతా జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని తిరిగి అడవికి తరలించేందుకు శ్రమిస్తున్నారు. అయితే చీతా తమ ఊర్లోకి చొరబడిన దృశ్యాలను గ్రామస్థుడు ఒకరు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. Sheopur, Madhya Pradesh | Cheetah Oban, one of the cheetahs brought from Namibia, entered Jhar Baroda village of Vijaypur which is 20 kms away from Kuno National Park. Monitoring team has also reached the village. Efforts are underway to bring the cheetah back: DFO (Video… pic.twitter.com/4iQAoB6tcz — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 2, 2023 కాగా.. భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికాతో భారత్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే గతేడాది ప్రధాని మోదీ జన్మదినం సందర్బంగా 8 చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడుదల చేశారు. అయితే వీటిలో ఒకటి ఇటీవలే కిడ్నీ సమస్యతో చనిపోయింది. ఆ తర్వాత రెండు మూడు రోజులకే మరో చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను కూడా భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి కూడా అడవిలోనే క్వారంటైన్ కేంద్రంలో ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత వీటిని స్వేచ్ఛగా విడిచిపెడతారు. చదవండి: రెండో పెళ్లి కావలి అంటూ పోలీస్టేషన్లో వధువు హల్చల్! మద్యంమత్తులో ఊగిపోయి.. -
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. ఫొటోలు వైరల్..
భోపాల్: గతేడాది నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కీడ్ని సమస్యతో ఈ పార్కులోని సషా అనే చీతా చనిపోయిన మూడు రోజులకే మరో చీతా ప్రసవించడం గమనార్హం. తల్లి, నాలుగు చీతా కూనలకు సంబంధించిన ఫోటో, వీడియోను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్లో షేర్ చేశారు. Congratulations 🇮🇳 A momentous event in our wildlife conservation history during Amrit Kaal! I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt — Bhupender Yadav (@byadavbjp) March 29, 2023 దేశంలో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి 8 చీతాలను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చారు. వీటీలోనే ఒకటి చనిపోయింది. మిగతావి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ 8 చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కూడా భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి క్వారంటైన్లో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు. చదవండి: రాజస్థాన్ హై కోర్టు కీలక తీర్పు.. 71 మంది చనిపోయిన పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులుగా విడుదల.. -
అయ్యో సాషా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటి మృతి
నమీబియా నుంచి తీసుకువచ్చి గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉంచిన 8 చీతాల్లో ఒక చీతా మృతి చెందింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సాషా అనే చీతా సోమవారం మరణించినట్లు అధికారులు తెలిపారు. సాషా భారత్‌కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి 23న ఈ చీతాలో అలసట, బలహీనత వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయని, దీంతో చికిత్స కోసం క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌కు తరలించామని తెలిపారు. కాగా సాషా వయసు మూడేళ్లు. ఇది క్యాప్టివ్ బ్రీడ్ జాతికి చెందినది భారత్‌లో అంతరించిపోతున్న చీతాలను తిరిగి పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా (సెప్టెంబర్ 17) 8 ఆఫ్రీకన్ చీతాలను కునో నేషనల్ పార్కు క్వారంటైన్ జోన్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో మూడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. నమీబియా నుంచి భారత్‌లో అడుగుపెట్టిన చీతాలను కొన్ని నెలల పాటు గడ్డి మైదానంతో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్ చేశారు. భారతీయ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడిన తర్వాత నవంబర్‌లో పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షించారు తరువాత స్వేచ్ఛగా జాతీయ పార్కులో విడిచిపెట్టారు. అంతేగాక త్వరలోనే భారత్‌కు మరో 12 చీతాలు కూడా రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. -
Cheetah Crash: లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి వీరమరణం
సాక్షి, యాదాద్రి: అరుణాచల్ ప్రదేశ్‌లో ఇవాళ భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ‘చీతా’ కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి తెలంగాణవాసి కావడం గమనార్హం. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్నల్ వీవీబీ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి. తల్లిదండ్రులు నర్సింహ్మారెడ్డి, విజయలక్ష్మీలు. అయితే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సతీమణి స్పందన కూడా ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, కో పైలట్ మేజర్ జయంత్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. చివరకు వాళ్లు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. -
కుప్పకూలిన చీతా.. విషాదాంతం
భారత ఆర్మీ ఛాపర్ చీతా ప్రమాదం.. విషాదంగా ముగిసింది. పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డితో పాటు కో పైలట్ మేజర్ జయంత్ కూడా మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యంతో పాటు ఐటీబీపీ మరో రక్షణ విభాగ సాయంతో మొత్తం ఐదు బృందాలు కూలిపోయిన పైలట్ల ఆచూకీ కోసం గాలించాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్ ప్రాంతం బంగ్లాజాప్ వద్ద గ్రామస్తులు కాలిపోతున్న ఛాపర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న బలగాలు.. ఆపై పైలట్, కోపైలట్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించారు. ఛాపర్ క్రాష్‌కు గురైన ప్రాంతంలో పొగమంచు దట్టంగా నిండిపోయి ఉండడం, కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థకు ఆటంకం కలుగుతోందని గుర్తించారు. మరోవైపు ప్రమాదానికి కారణాల గుర్తించేందుకు దర్యాప్తునకు ఆదేశించింది భారత ఆర్మీ. చీతా ఐదుగురు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న హెలికాఫ్టర్. అనేక రకాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలోనూ.. మిషన్ల సమయంలో అత్యంత ఎత్తులో(ప్రపంచ రికార్డు సైతం ఉంది దీనిపేరిట) అయినా ప్రయాణించగలిగే సత్తా ఉందన్న పేరుంది. హాల్(HAL) 1976-77 నడుమ తొలి ఛాపర్‌ను భారత సైన్యానికి అందించింది. ఇప్పటిదాకా 279 హెలికాఫ్టర్లను హాల్.. భారత్‌తో పాటు విదేశాల్లోనూ అందించింది. -
అడవిలోకి రెండు చీతాలు విడుదల
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉన్న చీతాల్లో రెండింటిని అటవీ ప్రాంతంలోకి వదిలినట్లు అధికారులు వెల్లడించారు. 2022 సెప్టెంబర్‌లో ఇక్కడికి చేరుకున్న 8 చీతాలను మొదటగా ప్రత్యేకమైన ఎన్క్లోజర్లలోకి, అనంతరం హంటింగ్ ఎన్క్లోజర్లలోకి తరలించారు. శనివారం మొదట మగ చీతా ఒబన్ను, కొన్ని గంటల తర్వాత ఆషా అనే ఆడ చీతాను అడవిలోకి వదిలామని ఫారెస్ట్స్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ చెప్పారు. మిగిలిన వాటిని కూడా నిర్ణీత సమయాల్లో అడవిలోకి విడిచిపెడతామన్నారు. మొన్న ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీని కలిసిన కెవిన్ పీటర్సన్
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. కాగా పీటర్సన్ ఢిల్లీలో నిర్వహించిన రైసీనా డైలాగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా మొదట హోంమంత్రి అమిత్ షాతో పీటర్సన్ మాటామంతీ చేశాడు. అనంతరం ప్రధాని మోదీని కలిసిన పీటర్సన్.. ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ప్రధాని తన పుట్టిన రోజున చీతాలను తీసుకురావడం హర్షించదగిన విషయమన్నాడు. మోదీని కలవడాన్ని గొప్పగా భావిస్తున్నట్లు చెబుతూ పీటర్సన్ పోస్టు పెట్టారు. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. ఈ 12 చీతాల్లో ఐదు మగవి కాగా.. ఏడు ఆడవి. భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది. చదవండి: IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్ An honor to speak so passionately and warmly about the release of cheetahs on your birthday, Sir @narendramodi. Thank you for your infectious smile and firm handshake. I really look forward to seeing you again, Sir! 🙏🏽 pic.twitter.com/9gEe3e1wwV — Kevin Pietersen🦏 (@KP24) March 3, 2023 Met @KP24, former captain of the England cricket team. Had an engaging conversation with him on a wide range of topics. pic.twitter.com/gZzwJEWwrw — Amit Shah (@AmitShah) March 2, 2023 -
వన్యప్రాణుల వైవిధ్యానికి ఊతం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల రాకతో మన దేశంలో వన్యప్రాణుల వైవిధ్యానికి మరింత ఊతం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చీతాల రాకపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేసిన ట్వీట్‌ను మోదీ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో ట్యాగ్ చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ప్రాజెక్టు చీతా’ మరో మైలురాయికి చేరుకుందని భూపేంద్ర యాదవ్ తన ట్వీట్లో వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో రప్పించిన 12 చీతాలను శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. లద్ధాఖ్‌లో జీవనం మరింత సులభతరం కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లో ప్రజల జీవనాన్ని మరింత సులభతరంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 4.1 కిలోమీటర్ల పొడవైన షిన్‌కున్ లా సొరంగం నిర్మాణానికి రూ.1,681.51 కోట్లు కేటాయించడానికి కేంద్రం అంగీకరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ లద్ధాఖ్ ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ చేసిన ట్వీట్‌ను మోదీ ట్యాగ్ చేశారు. ఛత్రపతి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజలకు అందించిన సుపరిపాలన మనకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. శివాజీ జయంతి సందర్భంగా మోదీ ఘనంగా నివాళులరి్పంచారు. -
దక్షిణాఫ్రికా నుంచి యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు..
భోపాల్: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. ఈ 12 చీతాల్లో ఐదు మగవి కాగా.. ఏడు ఆడవి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యావద్ ఈ చీతాలను కునో నేషనల్ పార్క్ క్వారంటైన్ ఎన్క్లోజర్లలో విడుదల చేశారు. భారత వన్యప్రాణుల చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన జంతువులు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. #WelcomeHome An #IAF C-17 aircraft carrying the second batch of 12 #Cheetahs landed at AF Station Gwalior today, after a 10 hour flight from Johannesburg, South Africa. These Cheetahs will now be airlifted in IAF helicopters and released in the #KunoNationalPark. pic.twitter.com/Pk0YXcDtAV — Indian Air Force (@IAF_MCC) February 18, 2023 భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది. చదవండి: బ్రెడ్ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు ఏకంగా రూ.800 వరకు ఖర్చు! -
Viral Video: చిరుతపై మొసలి బీకర దాడి
-
నమీబియా నుంచి మరో 12 చీతాలు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: భారత్‌లో చీతాల సంఖ్యను పెంచే లక్ష్యంతో వాటిని దక్షిణాఫ్రికా ఖండం నుంచి రప్పిస్తున్న మోదీ సర్కార్ ఈ దఫాలో 12 చీతాలను వాయుమార్గంలో తీసుకొస్తోంది. నమీబియా దేశం నుంచి 12 చీతాలను ఫిబ్రవరి 18వ తేదీన తీసుకొస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం చెప్పారు. ‘ నమీబియా నుంచి వాటిని తెచ్చేందుకు సీ–17 విమానం గురువారం బయల్దేరింది. భారత్‌కు తెచ్చాక వాటిని ఉంచేందుకు మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కులో 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధంచేశాం’ అని మంత్రి చెప్పారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ తన పుట్టినరోజున కూనో పార్కులోకి ఐదు ఆడ, మూడు మగ చీతాలను విడిచిపెట్టిన విషయం విదితమే. భారత్‌లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు భారత సర్కార్ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తున్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు నిజర్వ్.. -
భారత్‌కు రానున్న మరో 12 చీతాలు
-
'కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ చీతాలను తెచ్చింది'
భోపాల్: బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి భారత్‌కు చీతాలను తీసుకురావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగిలాల్ జాతవ్. కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ వీటిని తీసుకొచ్చిందని అన్నారు. సోమవారం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా నుంచి భారత్ వచ్చిన చీతాలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కరేరా నియోజకవర్గం నుంచే జాతవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో మాజీ సీఎం కమల్‌నాథ్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసి జాతవ్ మాట్లాడారు. 'కుట్రలో భాగంగానే చీతాలను కునో నేషనల్ పార్కులో ఉంచారు. ఇవి ఇప్పుడు చిన్నాగానే ఉన్నాయి. కానీ పెరిగి పెద్దయ్యాక మిమల్ని తినేస్తాయి. ఫలితంగా కాంగ్రెస్ ఓటర్ల సంఖ్యను తగ్గిస్తాయి. బీజేపీ కావాలనే పథకం ప్రకారం చీతాలను ఇక్కడకు తెచ్చింది. దీని కోసం రూ.117 కోట్లు ఖర్చుపెట్టింది.' అని జాతవ్ అన్నారు. జాదవ్ మాటలకు కాంగ్రెస్ శ్రేణులు చప్పట్లు, ఈలలతో హోరెత్తాయి. దీంతో ఆయన మొహంలో చిరునవ్వుతో వెలిగిపోయింది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అణగారిన వర్గాలకు చెందిన ఎంతో మంది నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని జాతవ్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమని, జంతువుల ప్రయోజనాల కోసమే ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోందని సెటైర్లు వేశారు. 2020లో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై జాతవ్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా.. దేశంలో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి కేంద్రం చీతాలను తెప్పించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో వీటిని కునో నేషనల్ పార్కురు తరలించింది. చదవండి: కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్.. అదానీ వ్యవహారంపై ప్రశ్నల వర్షం.. -
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు
జోహన్నెస్‌బర్/న్యూఢిల్లీ: భారత్‌కు మరో డజను చీతాలు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చే చీతాలను మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో ఉంచుతారు. దేశంలో అంతరించిపోయిన చీతాల సంతతిని మళ్లీ పెంచేందుకు కొద్ది నెలల క్రితం నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పడు వాటికి తోడుగా ఫిబ్రవరిలో 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి వస్తాయని అటవీ, మత్స్య సంపద సంరక్షణ, పర్యావరణ (డీఎఫ్ఎఫ్ఈ) శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలి దశలో 12 చీతాలు వస్తే, ఆ తర్వాత ఎనిమిది నుంచి పదేళ్ల పాటు ఏడాదికి 12 చీతాలు చొప్పున వస్తాయి. ప్రపంచంలోనున్న 7 వేల చీతాల్లో అత్యధికం దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో ఉన్నాయి. -
చిరుత దాడిలో తప్పించుకుని.. చెట్టెక్కి..
యశవంతపుర(కర్ణాటక): చిరుత దాడిలో తప్పించుకుని చెట్టు ఎక్కిన యువతి జారి కింద పడి గాయపడిన ఘటన రామనగర జిల్లా మాగడి తాలూకా మరళుదేవనపురలో జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన విజయలక్ష్మీ బుధవారం గొర్రెలు మేపుతుండగా గొర్రెలపై చిరుత దాడి చేసింది. భయంతో విజయలక్ష్మీ చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకుంది. చిరుత వెళ్లి పోయిన తరువాత చెట్టు దిగే క్రమంలో జారికిందపడింది. దీంతో ఆమెకు నడుం విరిగింది. బాధితురాలిని కుటుంబసభ్యులు మాగడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చదవండి: గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు..