న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఈ ఏడాది 9 చీతాల మృతి విషయంలో కేంద్రం ఇచి్చన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో చీతాల సంతతిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అనుమానాలకు అవకాశం లేదని పేర్కొంది. 1952 తర్వాత దేశంలో చీతాల సంతతి అంతరించిపోయింది.
దీంతో, తిరిగి వాటి సంతతిని పెంచే ఉద్దేశంతో గత ఏడాది సెపె్టంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను కునోకు తీసుకువచి్చంది. ఇక్కడ మరో నాలుగు కూనలు జని్మంచాయి. వీటిలో మొత్తం 9 మృత్యువాతపడ్డాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం పిటిషన్ వేసింది. విదేశాల నుంచి తీసుకువచి్చన చీతాలను ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment