deaths
-
అంతుచిక్కని మరణాలపై దర్యాప్తు.. మెట్ల బావి మూసివేత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఒక మారుమూల గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది స్వల్ప వ్యవధిలో మృత్యువాత పడటం సంచలనంగా మారింది. ఈ మరణాలకు గల కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదు. దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అధికారులు మెట్ల బావి సమీప ప్రాంతాన్ని సీల్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావిలోని నీటిలో పురుగుమందుల ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపధ్యంలో మెట్ల బావి దగ్గర 24 గంటలూ భద్రతా సిబ్బందిని మోహరించారు.రాజౌరి జిల్లాలోని బాధల్ గ్రామంలోని మెట్ల బావికి కంచె ఏర్పాటు చేయాలని, ముగ్గురు భద్రతా సిబ్బందిని 24 గంటలూ అక్కడ మోహరించాలని అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్ మీర్ ఆదేశించారు. ఆయన ఒక ఉత్తర్వులో.. ‘బాధల్ గ్రామంలోని బావి నుండి సేకరించిన నీటి నమూనాలలో పురుగుమందుల ఉనికిని నిర్ధారించారు. దీంతో ఆ మెట్ల బావిని మూసివేయాలని నిర్ణయించాం. ఈ మెట్ల బావిలోని నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వినియోగించకూడదు’ అని పేర్కొన్నారు.బాధల్ గ్రామంలో మరణాలకు గల కారణాన్ని తెలుసుకునేందుకు అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ అస్లాం కుమార్తె యాస్మిన్ కౌసర్ కూడా అంతుచిక్కని వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 7-12 తేదీల మధ్య గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది మృతిచెందారు.ఇటీవల జేకే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖతో పాటు ఇతర విభాగాలు ఈ మరణాలపై దర్యాప్తు చేస్తున్నాయని, అయితే ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదన్నారు. బాధితులు తొలుత జ్వరం, తలనొప్పి, వికారం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారని, చికిత్స పొందుతూ కొద్ది రోజులకే మృతిచెందారని మనోజ్ సిన్హా వివరించారు.ఇది కూడా చదవండి: Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ -
మావోయిస్టుల ఘాతుకం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏడాదిన్నర కాలంగా మావోయిస్టుల ఏరివేతలో ఎదురన్నదే లేకుండా దూసుకెళ్తున్న భద్రతా బలగాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా కుట్రు సమీపంలో మావోయిస్టులు అమర్చిన శక్తిమంతమైన మందుపాతర పేలిన ఘటనలో 8 మంది జవాన్లు, డ్రైవర్ మృత్యువాత పడ్డారు. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోగా ఓ జవాన్ కూడా నేలకొరిగారు. ఎదురుకాల్పుల సమయంలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కూంబింగ్ అనంతరం సోమవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో క్యాంపునకు తిరిగి వస్తున్న డీఆర్జీ బలగాల స్కారి్పయో వాహనాన్ని బెదిరే –కుట్రు రోడ్డులో నక్సల్స్ ఐఈడీ ద్వారా పేల్చేశారు. పేలుడు తీవ్రతకు ఘటనాస్థలి భయానకంగా మారింది. పోలీసు వాహనం శకలాలుగా మారిపోగా, అందులో ఉన్న 8 మంది జవాన్లు, డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో సిమెంట్ రోడ్డు పెచ్చులుగా లేచి 10 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. జవాన్ల వాహనం భాగాలు పక్కనున్న ఎత్తయిన చెట్ల కొమ్మల చివర వరకు ఎగిరిపడ్డాయి. స్టీరింగ్ రాడ్ మొత్తం వంగిపోయింది. జవాన్ల శరీరాలు తల, మొండెం, కాళ్లు, చేతులు ఛిద్రమై రోడ్డు పక్కన పొలాల్లో పడ్డాయి. అక్కడికి చేరుకున్న బలగాలు సహచరుల శరీర భాగాలను పాలిథిన్ కవర్లలో సేకరించాల్సి వచ్చింది. నేలకొరిగిన జవాన్లంతా స్థానిక గిరిజనులు, లొంగిపోయిన మావోయిస్టులేనని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. ఘటన నేపథ్యంలో గాలింపు మరింత ముమ్మం చేశామన్నారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లను.. కోర్స బుధ్రం, సోమడు వెంటిల్, డుమ్మా మడకం, బోమన్ సోది, హరీష్ కొర్రమ్, పండరు పద్యం, సుదర్శన్ వీటి, శుభర్నాథ్ యాదవ్‌గా గుర్తించారు. డ్రైవర్ వివరాలు తెలియరాలేదు. ఫాక్స్‌హోల్ పద్ధతి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో మావోయిస్టులు పన్నిన ఉచ్చులో చిక్కకుండా భద్రతా దళాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాము ప్రయాణించే మార్గంలో ముందుగానే యాంటీ ల్యాండ్‌మైన్ వాహనాలతో తనిఖీలు చేస్తుంటాయి. అయితే వీటికి సైతం చిక్కని రీతిలో ఫాక్స్‌హోల్ పద్ధతిలో మావోయిస్టులు 70 కిలోల పేలుడు పదార్థాలను రోడ్డు మధ్యలో అమర్చినట్టు తెలుస్తోంది. 2023 ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లాలో చోటుచేసుకున్న పేలుడులో 10 మంది డీఆర్జీ జవాన్లు, డ్రైవర్ మరణించారు. అప్పుడు కూడా ఫాక్స్‌హోల్ పద్ధతినే మావోయిస్టులు ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు.ప్రొటోకాల్ తప్పారా? సాధారణంగా డీఆర్జీ జవాన్లు కాలినడక లేదా బైక్‌లపైనే ఎక్కువగా కూంబింగ్‌కు వెళ్తారు. సోమవారం ఘటనలో వారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు దూరంగా వాహనాన్ని ఉపయోగించారు. అది కూడా ల్యాండ్‌మైన్ ప్రూఫ్ కాకుండా సాధారణ వాహనం. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గతేడాది భద్రతా దళాల ప్రయాణించే వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోలు పేలుడు పదార్ధాలు ఉపయోగించారు. అయితే అది సరుకు రవాణా వాహనం కావడంతో మృతుల సంఖ్య రెండుకు పరిమితమైంది. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్టు హత్య..హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు -
కాలిఫోర్నియాలో కూలిన విమానం
కాలిఫోర్నియా: వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కాలిఫోర్ని యాలో విమాన ప్రమాదం జరిగింది. డిస్నీల్యాండ్‌కు సమీపంలోని ఆరెంజ్ కౌంటీలో ఉన్న ఫుల్లర్టన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన నిమిషంలోనే విమానం కుప్పకూలింది. ఓ వాణిజ్య భవనం పైకప్పుపై పడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2.09 గంటలకు ఈ ఘటన జరిగింది. సింగిల్ ఇంజన్ కలిగిన నాలుగు సీట్ల చిన్న విమానమే అయినప్పటికీ.. ఫర్నీచర్ గోదామ్పై కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విమానం కూలగానే గోదాములో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి సమీప భవనాలను ఖాళీ చేయించారు. గతేడాది నవంబర్‌లో మరో చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా విమానాశ్రయానికి అర మైలు దూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. విమానంలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన -
ఇథియోపియాలో ఘోర ప్రమాదం..
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో నదిలో ట్రక్కు పడిన దుర్ఘటనలో 71 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ ప్రాంత సిడామాలోని లెమ్మ లగిడెలో ఆదివారం దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా పెళ్లి బృందంలోని వారు. కిక్కిరిసిన ట్రక్కు గలానా నదిపైన వంతెన మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయింది. అక్కడి కక్కడే 60 మంది అసువులు బాశారు. మిగతా 11 మంది చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు చెప్పారు. పేద దేశం కావడంతో వివాహాలు వంటి వేడుకలకు వెళ్లే వారు ఎక్కువ ఖర్చయ్యే బస్సులకు బదులుగా తక్కువకే దొరికే ట్రక్కులనే జనం వాడుతుంటారు. రహదారుల నిర్వహణ లోపభూయిష్టంగా మా రడంతో ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
మొజాంబిక్‌లో హింస.. 21 మంది మృతి
మ్యాపుటు:తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘనటల్లో21మంది దాకా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 9న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రీలిమో పార్టీ అధ్యక్ష అభ్యర్థి డేనియల్ చాపో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నిక వివాదాస్పదమైంది. దీనిపై ఓటమి చెందిన అధ్యక్ష అభ్యర్థి వెనాన్సియో సుప్రీంకోర్టుకు వెళ్లారు.కోర్టు చాపో ఎన్నిక సరైనదేనంటూ తాజాగా తీర్పిచ్చింది. దీంతో వెనాన్సియో మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. మొత్తం 236 హింసాత్మక ఘటనలు జరిగాయి. మృతిచెందిన 21 మందిలో ఇద్దరు పోలీసులున్నారు. ఆందోళనకారులు చాలా వాహనాలకు నిప్పంటించారు. రాజధాని మ్యాపుటులో అల్లరిమూకలు షాపులు దోచుకున్నారు. హింసకు భయపడి రాజధాని నగరం నుంచి ప్రభుత్వ అధికారులు పారిపోయినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఆందోళనలతోపాటు దోపిడీలు జరుగుతున్నాయని మొజాంబిక్ తాత్కాలిక మంత్రి పాస్కోల్ రోండా ధృవీకరించారు. కాగా,అధ్యక్ష ఎన్నికల్లో చాపోకు 65 శాతం ఓట్లు రాగా వెనాన్సియోకు 24 శాతం ఓట్లు వచ్చాయి. -
ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది దుర్మరణం
అబుజాన్: ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్సులు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది దుర్మరణం పాలవ్వగా 28 మంది దాకా గాయపడ్డారు. బ్రొకోవా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దేశ రవాణాశాఖ మంత్రి స్పందించారు.రోడ్లపై ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఐవరీకోస్ట్‌లో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో ఏటా వెయ్యి మంది మరణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గత నెలలోనే దేశంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఇదీ చదవండి: స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి హత్య -
చట్టాలంటే ప్రజలకు గౌరవం లేదు, భయం లేదు
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆక్షేపించారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, తన కాలు నాలుగుచోట్ల విరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30 వేల మందిమృత్యువాత పడుతున్నారని తెలిపారు. జరిమానాలు పెంచినా... ఈ ఏడాది ఇప్పటివరకు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గడ్కరీ వివరించారు. మృతుల్లో 60 శాతం మంది యువతీ యువకులే ఉండడం బాధాకరమని చెప్పారు. జరిమానాలు పెంచుతున్నా ప్రజలు లెక్కచేయడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో తన కళ్లెదుటే ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి వెళ్లిందని అన్నారు. మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో చాలాచోట్ల రోడ్లపై బ్లాక్స్పాట్లు ఉన్నాయని, వీటిని సరి చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
విరుగుడు లేని విషం!
⇒కాగజ్‌నగర్‌కు చెందిన యువకుడు (35) కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి విషమించి నాలుగు రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. ⇒ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు (21) స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు. రెండు రోజులకే అతడి ప్రాణాలు పోయాయి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంట చేన్లలో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండు, మూడు చోట్ల ‘పారాక్వాట్’ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేక నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారీ చేసే సమయంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు సమస్యలు వస్తున్నాయి. అది పర్యావరణానికి, జీవజాతులకూ ప్రమాదకరమని వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్సకు లొంగని మందు! పారాక్వాట్ గడ్డి మందు కేవలం పది మిల్లీలీటర్లు (ఎంఎల్) శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని... గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. గత ఏడాది ఈ గడ్డిమందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మారి్పడి చేయాల్సి వచి్చందని గుర్తు చేస్తున్నారు. చాలా క్రిమిసంహాకర మందులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని.. వాటి తయారీ కంపెనీలే విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయని చెబుతున్నారు. కానీ ఈ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు చికిత్స లేక.. ఎన్నో పేద, మధ్య తరగతి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఏమిటీ పారాక్వాట్? పారాక్వాట్ డైక్లోరైడ్గా పిలిచే గడ్డిమందు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అత్యంత విషపూరితమైనా.. కూలీల కొరత ఓవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందనే ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును వాడుతున్నారు. కేవలం రూ.200 ఖర్చుతో ఎకరం చేనులో కలుపు నివారణ చేయవచ్చని.. అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయని అంటున్నారు. పిచికారీ చేసే సమయంలోనూ తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దుర్లు వస్తుంటాయని చెబుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సరైన చికిత్స లేని ఈ మందు దుష్ప్రభావాలపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన కొందరు వైద్యులు ప్రభుత్వానికి విన్నవించేందుకు ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంచిర్యాల పరిధిలోని ప్రతినిధులు పారాక్వాట్ తీవ్రతపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం ఇచ్చారు కూడా. పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారాక్వాట్ తీవ్రతపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆత్మహత్య నిరోధక కమిటీలు ఈ మందు విషయంలో అవగాహన కలి్పస్తున్నాయి. తయారు చేసే దేశంలోనే ఆంక్షలు పారాక్వాట్‌ను చాలా దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్‌లో, ఉత్పత్తి చేసే చైనాలోనూ ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్లా జిల్లాలో రెండేళ్లలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంతో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపేసే అధికారం ఉండటంతో.. శాశ్వతంగా నిషేధించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో కలుపు గడ్డి నివారణ కోసం మరో మందును ప్రత్యామ్నాయంగా చూపాలనే డిమాండ్లు వస్తున్నాయి. కిడ్నీలపై తీవ్ర ప్రభావం ఎవరైనా పారాక్వాట్ తాగిన వెంటనే ఆస్పత్రికి వస్తే బతికే చాన్స్ ఉంటుంది. కిడ్నీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక డయాలసిస్ చేస్తాం. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రాణాలు కోల్పోయినట్టే. అందుకే ఈ మందు తీవ్రతను సర్కారుకు తెలియజేయాలని అనుకుంటున్నాం. – రాకేశ్ చెన్నా, నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల నిషేధం విధించాలి గడ్డిమందుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిమోతాదులో శరీరంలోకి వెళ్లినా బతకడం కష్టమవుతోంది. చికిత్సకు కూడా లొంగకుండా ఉన్న ఈ మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాలి. సమాజ శ్రేయస్సు కోసం కొంతమంది వైద్యులం కలసి ప్రభుత్వానికి నివేదించనున్నాం. – సతీశ్ నారాయణ చౌదరి, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాక్టిషనర్, ఖమ్మంచాలా కేసుల్లో మరణాలే.. పారాక్వాట్‌కు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో మరణాలే సంభవిస్తున్నాయి. ఈ మందు రోగి పెదవులు మొదలు శరీరంలో అన్ని అవయవాలను వేగంగా దెబ్బతిస్తుంది. తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. – ఆవునూరి పుష్పలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
44 వేలు దాటిన మరణాలు
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్‌తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో సాధారణ పౌరులు ఎంతమంది, హమాస్‌కు చెందిన వారెందరు అనేది గాజా ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా లెక్కించదు. కాకపోతే మృతుల్లో సగం కంటే ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 44,056 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,04,268 గాయపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. వాస్తవ మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని, మెడికోలు చేరుకొలేని ప్రదేశాల్లో శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు 17 వేల మంది పైచిలుకు హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ జరిపిన ఈ మెరుపుదాడిలో 1,200 మరణించగా, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నారు. -
వెయ్యి రోజుల యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నేటికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణగా రూపుదిద్దుకుంది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక మిలియన్(10 లక్షలు)కు పైగా జనం మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.2022లో ప్రారంభమైన 21వ శతాబ్దపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి నిరంతరం హృదయాన్ని కదిలించే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఆ దేశం ఎంతో బలహీనంగామారింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో 80 వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారు. నాలుగు లక్షల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు, గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలుగా పేర్కొన్నారు. రెండు దేశాల జనాభా ఇప్పటికే క్షీణించింది. యుద్ధానికి ముందే ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా సంభవించిన భారీ మరణాల ప్రభావం ఇరు దేశాల జనాభా గణాంకాలపై కనిపిస్తోంది.మరణించిన సైనికుల డేటా గోప్యం?ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్‌లో ఆగస్టు 2024 నాటికి 11,743 మంది పౌరులు మరణించారు. 24,614 మంది గాయపడ్డారు. ముఖ్యంగా మారియుపోల్ వంటి రష్యన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయి. ఇదేకాకుండా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 589 మంది చిన్నారులు కూడా మరణించారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, గ్రౌండ్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. జాతీయ భద్రత కోసం యుద్ధంలో మరణించిన తమ సైనికుల డేటాను ఇరుపక్షాలు గోప్యంగా ఉంచాయని, పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇచ్చిన అంచనాలలో చాలా తేడా ఉందని ఒక ఈ మీడియా నివేదిక పేర్కొంది. సైనిక ప్రాణనష్టం విషయంలో కూడా రష్యాకు భారీ నష్టం వాటిల్లిందనే అంచనాలున్నాయి ఈ భీకర యుద్ధంలో ఒక్క రోజులో వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ 2024, ఫిబ్రవరిలో 31 వేలకు పైగా ఉక్రేనియన్ సైనికులు మృతిచెందారని తెలిపారు.ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం మృతియుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఉక్రెయిన్‌లో దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు మిలియన్లకు పైగా ఉక్రేనియన్ పౌరులు విదేశాల్లో ఆశ్రయం పొందారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభా 10 మిలియన్లకు పైగా తగ్గింది. ఇది అక్కడి జనాభాలో నాలుగింట ఒక వంతు. అంటే ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. యుక్రేనియన్ ప్రభుత్వం యుద్ధంలో రోజువారీ ఖర్చు 140 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ అని అంచనా వేసింది. ఉక్రెయిన్ 2025 ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ కోసం 26 శాతం అంటే 53.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంయుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33 శాతం క్షీణించింది. 2023లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడి నష్టం 22 శాతానికి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్‌లోని రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది.ఉక్రెయిన్‌లో కొంతభాగం రష్యా స్వాధీనంరాయిటర్స్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌లో ఐదవ వంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతాలను తన అదుపులో ఉంచుకుంది. ఈ భాగం గ్రీస్ దేశ పరిమాణంతో సమానం. రష్యన్ దళాలు 2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలలో దాడి చేసి, ఉత్తరాన కీవ్ శివార్లకు చేరుకుని, దక్షిణాన డ్నిప్రో నదిని దాటాయి. రష్యా దాదాపు ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని, దక్షిణాన అజోవ్ సముద్ర తీరాన్ని స్వాధీనం చేసుకుంది.పుతిన్‌కు గిట్టని ఉక్రేనియన్ గుర్తింపు ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగమైంది. ఉక్రెయిన్ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఇరు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి కూడా దారితీసింది. ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
యూపీ ఆస్పత్రి ఘటన.. దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం -
మణిపూర్‌లో భారీ ఎన్కౌంటర్..11 మంది ఉగ్రవాదులు హతం
ఇంఫాల్:మణిపూర్ జిరిబమ్‌లో సోమవారం(నవంబర్ 11) భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 11 మంది అనుమానిత కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది.కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు సోమవారం జిరిబమ్ పోలీస్‌స్టేషన్‌పై దాడికి ప్రయత్నించినప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న రిలీఫ్ క్యాంపును టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మణిపూర్‌లో గతేడాది జరిగిన అల్లర్లలో జిరిబమ్ పోలీస్‌స్టేషన్‌కు ఉగ్రవాదులు పలుమార్లు టార్గెట్ చేసి దాడి చేయడం గమనార్హం. -
గుల్బర్గాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం
గుల్బర్గా: కర్ణాటక గుల్బర్గా జిల్లాలోని కమలాపురం వద్ద శనివారం(నవంబర్ 9) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వేగంగా వెళుతున్న బొలేరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడ వాసులుగా గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పంజాగుట్టలో కారు బీభత్సం -
పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టిన రైలు.. అక్కడికక్కడే మృతి
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. షోర్నూర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై చెత్త శుభ్రం చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను వేగంగా వచ్చిన కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు కాగా ఇద్దరు మహిళలు. వీరిలో ముగ్గురి మృతదేహాలు ఘటనాస్థలంలో దొరికాయి. మరో మృతదేహం పక్కనే ఉన్న నదిలో పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ట్రాక్‌పై వస్తున్న రైలును కార్మికులు గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: వేడివేడి కిచిడీ పడి భక్తులకు తీవ్ర గాయాలు -
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి,కర్నూలుజిల్లా: కర్నూలు జిల్లాలోని నందవరం మండలం ధర్మపురం గ్రామం వద్ద ఎన్‌హెచ్-167పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(నవంబర్ 2) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంతో వెళుతున్న కారు ఆటోను ఢీకొట్టింది.ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీర నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరిని కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఇద్దరికి గాయలవగా గాయపడినవారిలో చాన్నిరి రిజియా పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ చదవండి: కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు -
ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు జర్నలిస్టులు మృతి
బీరుట్/ఖాన్ యూనిస్: గాజాతోపాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని బీరుట్ కేంద్రంగా పనిచేసేత అరబ్ టీవీ అల్ మయాదీన్ కెమెరామ్యాన్ ఘస్సన్ నాజర్, టెక్నీషియన్ మహ్మద్ రిడా, హెజ్బొల్లా గ్రూపునకు చెందిన అల్ మనార్ టీవీ కెమెరామ్యాన్ విస్సమ్ కస్సిమ్‌గా గుర్తించారు. ఘటన సమయంలో ఆ భవనంలో ఏడు వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన 18 మంది జర్నలిస్టులు ఉన్నారని లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకరీ చెప్పారు. ఇజ్రాయెల్ చర్యను ప్రణాళిక ప్రకారం చేపట్టిన హత్యాకాండగా అభివర్ణించారు. కుప్ప కూలిన భవనం ప్రాంగణంలో ప్రెస్ అనే స్టిక్కర్‌తో ధ్వంసమైన వాహనాలున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. ఆ సమయంలో తామంతా విశ్రాంతి తీసుకుంటున్నామని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన అల్ జజీరా ఇంగ్లిష్ చానెల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. గాజాపై యుద్ధం మొదలయ్యాక 128 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఒకే కుటుంబంలోని 36 మంది మృతిగాజాలోని ఖాన్‌యూనిస్ నగరంపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 38 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. -
టర్కీలో ఉగ్రదాడి.. భారీగా మృతులు..!
అంకారా: టర్కీ రాజధాని అంకారా శివార్లలోని ఓ ఏరోస్పేస్ సంస్థపై ఉగ్రవాదులు బుధవారం(అక్టోబర్ 23) దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందడంతో పాటు కొందరు గాయపడ్డట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక ట్వీట్ చేశారు. Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.Gelişmelerden kamuoyu…— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024 రాజధాని అంకారా శివారులో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు తొలుత బాంబులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఏరోస్పేస్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో దుండగులు ట్యాక్సీలో ప్రవేశించి తొలుత బాంబు వేసి తర్వాత తుపాకులతో కాల్చారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం -
రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 474 మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగటున రోజుకు 474 మంది చనిపోయారని, ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం డేటా సేకరణలో ఆందోళనకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. కాగా, గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తెలంగాణలో బాగా పెరిగిపోయింది.ఇదిలా ఉండగా..2023 ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షలకు పైగా మరణించారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించకపోవడం వల్ల 70% మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రాలు ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వానికి అందించాయి. రోడ్డు ప్రమాదాల కారణాలు, తీవ్రతను అర్థం చేసుకోవడానికి కేంద్రం డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాదే అత్యధిక మరణాలు సంభవించాయి. గతేడాది క్షతగాత్రులు 4.63 లక్షలు గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4.63 లక్షల మంది గాయపడ్డారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇది 2022 కంటే 4% ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది చనిపోయారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నివేదికలో పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ ప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.71 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రెండు ఏజెన్సీలు 2023కి సంబంధించిన గణాంకాలను విడుదల చేయలేదు. ప్రమాద మరణాల్లో తొలిస్థానంలో ఉత్తరప్రదేశ్.. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్, పంజాబ్, అస్సాం, తెలంగాణ సహా 21 రాష్ట్రాల్లో 2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, కేరళ, చండీగఢ్ వంటి రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కాగా గతేడాది రోడ్డు ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 23,652 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 18,347మంది, మహారాష్ట్రలో 15,366 మంది మరణించారు. క్షతగాత్రుల్లో తమిళనాడు తొలిస్థానం రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో 72,292 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 55,769 మంది, కేరళలో 54,320 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. కాగా, గతేడాది మరణించిన వారిలో 44% మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. అలాగే గతేడాది మరణించిన ద్విచక్ర వాహనదారుల్లో 70% మంది హెల్మెట్ ధరించని కారణంగా మృత్యువాతపడ్డారు. -
బొగ్గుగనిలో కాల్పులు..20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో కాల్పులు కలకలం రేపాయి. డుకి జిల్లాలో ఉన్న ఓ బొగ్గుగనిలో కార్మికులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గనిలో కార్మికుల షెల్టర్ వద్దకు దూసుకొచ్చిన దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 16,17 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ సదస్సు(ఎస్సీవో)జరగనున్న నేపథ్యంలో కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు.ఇదీ చదవండి: విమానం నడుపుతూ పైలట్ మృతి -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పది మంది మృతి
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో శుక్రవారం(అక్టోబర్4) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసి ప్రయాగ్‌రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో ట్రాక్టర్‌ను ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ట్రాలీ ఏకంగా పక్కనున్న కాలువలో ఎగిరిపడింది. దీంతో ట్రాలీలో ఉన్న 10 మంది కూలీలు మృతిచెందారు.ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వారణాసి ట్రామా సెంటర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసు ఉన్నతాధికారి అభినందన్ తెలిపారు.ట్రక్కు డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పారిపోయాడని చెప్పారు. ఇదీ చదవండి: వైవాహిక అత్యాచారం నేరం కాదు -
పుణెలో కూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి
పుణె: మహారాష్ట్రలోని పుణెలో బుధవారం(అక్టోబర్2) తెల్లవారుజామున హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు ఒక ఇంజినీర్ దుర్మరణం పాలయ్యారు. పుణెజిల్లాలోని బవ్ధాన్ కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బవ్ధాన్ పరిసర ప్రాంతంలోని గోల్ఫ్‌కోర్స్‌లో ఉన్న హెలిప్యాడ్ నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ముంబై వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ దట్టమైన పొగమంచు వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుప్పకూలిన హెలికాప్టర్ పుణెలోని హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందినదిగా తేల్చారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ హెలికాప్టర్ పుణె సమీపంలో ఇటీవలే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు గాయపడ్డారు.#WATCH | A #helicopter with three people onboard crashed in the Bavdhan area in #Pune. According to the police, two people have died in the incident.More details here: https://t.co/34QkwGCcvh pic.twitter.com/v6tQTKz2K1— Hindustan Times (@htTweets) October 2, 2024 ఇదీ చదవండి: పెరోల్‌పై డేరా బాబా విడుదల -
హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి
రాజస్థాన్‌లో ఓ చిరుత ప్రజలను హడలెత్తిస్తోంది. స్థానికులను వేటాడి చంపి తింటూ.. వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. తాజాగా ఉదయ్‌పూర్‌లోని ఓ గ్రామంలో పూజారి ప్రాణాన్ని బలిగొంది. సోమవారం తెల్లవారుజామున పూజారి విష్ణుగిరి(65) మృతదేహాన్ని స్థానిక అడివిలో గుర్తించారు. చిరుత అతనిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.మృతదేహాన్ని ఆలయానికి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.అయితే చిరుత దాడిలో గత 11 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. చిరుత దాడులు ఎక్కువవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని చెబుతున్న అధికారులు.. మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగడం లేదని పేర్కొంటున్నారు.చిరుతపులి భయంతో పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉచ్చులు బిగించారు. గత కొన్ని రోజులుగా కొన్ని పాంథర్లు పట్టుబడుతుండగా, చిరుతపులి దాడి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్థులను అధికారులు కోరారు. అయితే అందరిపై దాడి చేసింది ఒకే చిరుతనా అనేది తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయిఏ అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు. -
నేపాల్‌లో పోటెత్తిన వరదలు..50 మంది మృతి
కఠ్మాండు:నేపాల్‌లో వరదలు పోటెత్తాయి. గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎనిమిది జిల్లాల్లో దాదాపు 50మంది మరణించారు.సుమారు 11మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు 23 రాఫ్టింగ్ బోట్లు రంగంలోకి దిగాయి. వరదల బారిన చిక్కుకున్నవారిలో ఇప్పటి వరకు 760 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. -
పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి
పోర్ట్ అవ్ ప్రిన్స్:హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఇంధన ట్యాంకర్ పేలిపోయింది.తీర నగరం మిరాగానేలో శనివారం(సెప్టెంబర్14) ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా దుర్మరణం పాలవ్వగా 50 మందికిపైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ టైరు తొలుత పంక్చర్ అయింది. దీంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలుడు జరిగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో తరలించారు.ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘ఇది చాలా భయంకర ప్రమాదం. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి’అని తెలిపారు. హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగుల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి.. చమురు ట్యాంకర్‌కు మంటలు -
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి
అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇంధన ట్యాంకర్, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 48 మంది మృతి చెందారు. నైగర్‌లోని అగాయ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న పలువురితోపాటు పశువులు సజీవ దహనమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ పేలుడు కారణంగా రోడ్డుపై సమీపంలో ఉన్న ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇదీ చదవండి.. అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు