
బమాకో:పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలోని ఓ బంగారు గని కుప్ప కూలి 42మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అనేకమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. చైనాకు చెందిన కంపెనీ నిర్వహిస్తున్న బంగారు గనిలో శనివారం(ఫిబ్రవరి 15) కొండచరియలు విరిగిపడ్డాయి.
ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 42మంది చనిపోయినట్టు ప్రాథమికంగా తేలింది. అయితే గనిని చట్టబద్ధంగా నడుపుతున్నారా లేదా అనేదానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇక్కడ ఈ తరహా ప్రమాదం ఇది రెండవది కావడం గమనార్హం. జనవరి 29న కౌలికోరో అనే ప్రాంతంలో బంగారు గని కూలడంతో చాలా మంది కార్మికులు దుర్మరణం చెందారు.
వీరిలో ఎక్కువ మంది మహిళలు కావడం విషాదం. మాలి జనాభాలో 20 లక్షల మంది(పది శాతం)కిపైనే మైనింగ్ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆఫ్రికాలో మూడో అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉన్న మాలిలో తరచు గని ప్రమాదాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment