Mali
-
ఈ సంగతి విన్నారా! ఒకే కాన్పులో.. 'నైన్ ఆల్ ఫైన్'..!!
సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు! -
నైన్ ఆల్ ఫైన్
ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం ఎప్పుడైనా చూశారా? లేదా.. ఇప్పుడు చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో.. ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుప్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే మొత్తం సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే, అబ్దెల్‌కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ప్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అర కిలో నుంచి కిలో మధ్యే ఉంది. దీంతో పిల్లలు 19 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. -
Bamako: మాలిలో ఘోర బస్సు ప్రమాదం
బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 31 మంది మరణించారు. మంగళవారం రాత్రి కెనీబా పట్టణంలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బుర్కినా ఫాసోకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారిలో మాలి పౌరులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రజా రవాణాలో ఏ మాత్రం ప్రమాణాలు ఉండవు. బస్సులు, రైళ్లు కిక్కిరిసి వెళుతుంటాయి. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఇదీ చదవండి.. రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు -
మాలిలో దుండగుల కాల్పులు
బమాకో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మాలిలోని మోప్తీ ప్రాంతంలో తాజాగా ఈ ఘోరం చోటుచేసుకుంది. బందీయాగార పట్టణం సమీపంలోని యారౌ అనే ఓ గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారని, జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కాల్పుల్లో 21 మంది ప్రజలు చనిపోయారని, మరో 30 మందికిపైగా గాయపడ్డారని తెలియజేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. మాలిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐసిస్ చురుగ్గా పనిచేస్తున్నాయి. ఉగ్రముఠాల అండతో తిరుగుబాటుదారులు కొన్ని భూభాగాలను ఆక్రమించారు. -
Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు
కోరాపుట్ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. ఒక్కతాటిపై నిలిచి... అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. కొసమెరుపు 30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!) -
భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం
సెంట్రల్ మాలీలో విషాద ఘటన జరిగింది. పేలుడు పరికరాన్ని బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడు ధాటికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. జిహాదీల హింసకు నిలయమైన మోప్టీ ప్రాంతంలో ఈ ఘోర పేలుడు ఘటన జరిగింది. జీహాదీలకు కేరాఫ్ అడ్రగ్ అయిన ఈ ప్రాంతంలో తరచూ రక్తపాతం జరుగుతోంది. హింసాత్మక ఘటనలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది మాలీని విడిచిపెట్టారు. చదవండి: బాప్రే!...ఆమె కంటిలో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్‌లు... -
ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు
ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా అనే రికార్డు సాధించారు ఈ కేరళ దంపతులు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు తిరిగి కశ్మీర్ నుంచి కన్యాకుమారికి మొత్తం 8,263 కిలోమీటర్లు నడిచారు. బెన్నీ కొట్టరత్తిల్, అతని భార్య మాలి కొట్టరత్తిల్ తమ స్వస్థలం అయిన కేరళ కొట్టాయం నుంచి ఈ సుదీర్ఘయాత్ర చేశారు. డిసెంబర్ 1, 2021 నాడు ‘చలో భారత్’ అని బయలుదేరి 216 రోజులలో 17 రాష్ట్రాలలో తిరిగి జూలై 3, 2022న ఇల్లు చేరారు. ఏడు నెలల మూడు రోజుల తమ పర్యటనలో వారు గడించిన అనుభవాలు మరొకరు పొందలేనివి. ఉదయం లేచి మార్నింగ్ వాక్ చేయడం కాదు. మణికట్టు మీదున్న వాచ్‌లో ‘ఓ... ఇవాళ ఐదు వేల అడుగులు నడిచాను’ అని లెక్క చూసుకోవడం కాదు. నడుస్తూ ఉండాలి. రోజంతా నడుస్తూ ఉండాలి. వారమంతా నడుస్తూ ఉండాలి. నెలంతా నడుస్తూ ఉండాలి. నడవగలరా? కొట్టాయం దంపతులు బెన్నీ, మాలి నడిచారు. దేశమంతా నడిచారు. పాదాలతోపాటు కనులు, మనసు, ఆత్మ ధన్యం చేసుకున్నారు. వారు ఇదంతా ఎలా చేశారు? ‘ప్లాన్ చేయకుండా. ప్లాన్ చేస్తే చాలా పనులు జరగవు. మీనమేషాలు లెక్కెట్టకండి... అనుకున్నదే తడవు చేసేయండి’ అనేది వీరి ఫిలాసఫీ. కోవిడ్ ‘రోడ్డున పడేసింది’ ప్రపంచంలో అందరి జీవితాలు గందరగోళం అయినట్టే బెన్ని, మాలి జీవితాలు కూడా గందరగోళం అయ్యాయి. 50 ఏళ్ల బెన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రయివేట్ స్కూల్లో టీచర్‌గా పని చేసేవాడు. కాని కోవిడ్ వల్ల 2019లో ఉద్యోగం పోయింది. భార్యాభర్తలు తమ సొంత ఊరు కొట్టాయం చేరుకున్నారు. చేయడానికి పని దొరకలేదు. చివరకు బెన్నీకి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది ఒక హాస్పిటల్లో. ఆ సమయంలో పోస్ట్ కోవిడ్ అనారోగ్యాలు, హార్ట్ స్ట్రోక్‌లు చాలా చూశాడు బెన్ని.‘తగినంత వ్యాయామం లేకనే ఇవన్నీ’ అని అర్థమైంది. మరి తానేం చేస్తున్నట్టు? అప్పటికే ఆ ఉద్యోగం బోర్ కొట్టింది. 2019 నవంబర్‌లో ఒక సైకిలెక్కి ‘అలా దేశం చూసి వస్తా’ అని భార్యకు చెప్పి బయలు దేరాడు. కేవలం 58 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్లి వచ్చాడు 13 రాష్ట్రాల మీదుగా. ఆ పని కిక్ ఇచ్చింది. మళ్లీ 2021 జూలైలో ఒక సైకిల్ యాత్ర చేశాడు భూటాన్, నేపాల్ వరకు. మూడోసారి కూడా ప్లాన్ చేస్తుంటే భార్య మాలి ‘నన్ను కూడా తీసుకెళతావా?’ అంది అతడు సైకిల్ తుడుస్తుంటే... ‘మనిద్దరం సైకిల్ మీద ఎక్కడెళ్లగలం. నడవాల్సిందే’ అన్నాడు బెన్నీ. ‘అయితే నడుద్దాం పద‘ అంది మాలి. యాత్ర మొదలైంది. డిసెంబర్లో యాత్ర మొదలు డిసెంబర్ 1, 2021న ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్’ వరకు సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు బెన్నీ, మాలి. ‘మాకు పిల్లలు లేరు, మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. స్నేహితులు సాయం చేసిన డబ్బు, ఒక టెంట్, నీళ్ల బాటిళ్లు, అవసరమైన మందులు, అన్నింటి కంటే ముఖ్యంగా పవర్ బ్యాంకులు... వీటిని తీసుకుని బయలుదేరాం. మాకు ఆధారం గూగుల్ మేప్సే’ అంటాడు బెన్నీ. ఈ యాత్రను వీళ్లు 17 రాష్ట్రాల మీదుగా ప్లాన్ చేశారు. అయితే ఇదంతా అంత సులభమా.. ఎండా గాలి చలి దుమ్ము... బాత్రూమ్ కష్టాలు... నిద్రకు చోటు... దొంగల భయం... ఇవన్నీ ఉంటాయి. ‘మేమిద్దరం పదే పదే ఒకటే మాట చెప్పుకున్నాం. ఏది ఏమైనా యాత్రను సగంలో ఆపి వెనక్కు పోయేది లేదు అని. ఏం జరిగినా సరే ముందుకే వెళ్లాలి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం’ అంటారు ఇద్దరూ. ఎన్నో అనుభవాలు మొత్తం 216 రోజుల యాత్రలో వారు చలికాలం, ఎండాకాలం చూశారు. చలికాలం టెంట్ సాయపడినా ఎండాకాలం టెంట్లో పడుకోవడం దుర్లభం అయ్యింది వేడికి. ‘టెంట్ బయట పడుకుంటే దోమలు నిర్దాక్షిణ్యం గా పీకి పెట్టేవి’ అన్నాడు బెన్నీ. అదొక్కటే కాదు.. భార్య భద్రత కోసం అతడు సరిగా నిద్రపోయేవాడు కాదు. ‘చీమ చిటుక్కుమన్నా లేచి కూచునేవాణ్ణి‘ అన్నాడు. వీళ్ల కాలకృత్యాల అవసరాలకు పెట్రోలు బంకులు ఉపయోగపడేవి. గుళ్లు, గురుద్వారాలు, పోలీస్ స్టేషన్ల వరండాలు, బడులు... ఇవన్నీ వారు రాత్రి పూట ఉండే చోటుగా మారేవి. బడ్జెట్ కోసం రొట్టెల మీదే ఎక్కువ ఆధారపడేవారు. ‘వెస్ట్ బెంగాల్ పురూలియాలో రాత్రి తాగుబోతుల బారిన పడి పారిపోయాం. తమిళనాడు విల్లుపురం గుడిలో పడుకుంటే దొంగలు వచ్చారు. అట్టపెట్టెల వెనుక ఉండటం వల్ల మమ్మల్ని చూడలేదు. కుక్క మొరగడంతో పారిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వేడి వేడి అన్నం, కూర తినడంతో మా ప్రాణం లేచి వచ్చింది. పంజాబ్‌లో జనం చాలా అతిథి మర్యాదలు చేస్తారు. ఒక ముసలాయన మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టి మరుసటి రోజుకి కట్టి ఇచ్చాడు’ అన్నారు వారు. ఎన్నెన్ని అందాలు అమృత్సర్, మురుడేశ్వర్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, కశ్మీర్, వాఘా బోర్డర్... ఇవన్నీ ఈ దంపతులు తమ కాళ్ల మీద నడుస్తూ చూసి సంతోషించారు. ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ఎందరికి ఉంటుంది ఈ తెగువ. వారు తమ యాత్రానుభవాలను వారి యూట్యూబ్ చానల్ ‘వికీస్ వండర్ వరల్డ్’లో వీడియోలుగా పోస్ట్ చేశారు. తిరిగి వచ్చాక ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నాడు బెన్నీ. కాసింత సంపాదన చేసుకుని భార్యతో ఈసారి బైక్ మీద రివ్వున దూసుకెళ్లాలని ఆశ. ఎందుకు నెరవేరదూ? (క్లిక్: పర్యాటకుల స్వర్గధామం.. కాస్ పీఠభూమి) -
మరో భారతీయ అమెరికన్‌కు కీలక హోదా
వాషింగ్టన్: భారతీయ మూలాలున్న మరో అమెరికన్‌కు అధ్యక్షుడు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. దౌత్యాధికారి రచనా సచ్దేవ కొర్హొనెన్‌ను మాలిలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆమె స్వస్థలం న్యూజెర్సీలోని ఫ్లెమింగ్టన్. నెల వ్యవధిలో భారతీయ మూలాలున్న పునీత్ తల్వార్‌ను మొరాకో రాయబారిగా, షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్ ప్రతినిధిగా అధ్యక్షుడు నియమించారని వైట్‌హౌస్ గుర్తు చేసింది. చదవండి: (లక్షన్నర డాలర్ల పన్ను కట్టిన బైడెన్) -
మాలిలో ఉగ్ర దాడి.. 31మంది పౌరులు మృతి
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయకపౌరులు బలయ్యారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!) -
మొసళ్ళని పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్న మాలి ప్రాంత ప్రజలు
-
ఆఫ్రికా దేశం మాలిల్లో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర ప్రమాదం: లారీ, బస్సు ఢీ 41 మంది దుర్మరణం
బమాకో: ఆఫ్రికాదేశం మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ మధ్య మాలి, సెగో పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో మంగళవారం లారీ బస్సు ఢీకొన్న ఘటనలో 41 మంది మరణించారు. మరో 33 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అదుపు తప్పిన ట్రక్కు బస్సు మీదికి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల రోదనలతో మిన్నంటింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యాయి. వస్తువులు మార్కెట్ కార్మికులతో వెళ్తున్న ట్రక్కు, ప్యాసింజర్ బస్సును ఢీకొట్టినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కు టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు మీదికి దూసుకెళ్లిందని తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. కాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఆఫ్రికాలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి లక్ష మంది జనాభాకు 26 మరణాలు నమోదవుతున్నాయి. -
కన్న తల్లికే షాక్.. ఒకే కాన్పులో 9 మంది సంతానం
మాలి: సాధారణంగా ఒకే కాన్పులో కవలలో , లేక ముగ్గురికి జన్మనిస్తేనే వింత అనుకుంటాం. అలాంటిది ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. దీంతో ఇది మామూలు వింత కాదు వింతలకే వింత అంటున్నారు చూసిన వారంతా. ఈ ఘటన మాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాలికి చెందిన హలీమా సిస్సి (25) మంగళవారం 9 మందికి సంతానానికి ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఆమెకు డెలివరీ చెయడానికి ఇద్దరు డాక్టర్లకు పైనే శ్రమించాల్సి వచ్చింది. ఇలా ఒకే డెలివరీలో తొమ్మిది మంది పుట్టడంతో ఈ వార్త ఆ దేశ నాయకుల వరకు వెళ్లింది. ’పుట్టిన 9 మంది సంతానంలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. తల్లి, తొమ్మిది పిల్లలు క్షేమంగానే ఉన్నారిని.. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సీబీ తెలిపారు. స్కానింగ్ సమయంలో ఎక్కువ మందికి సంతానం కలిగి ఉన్నానని డాక్టర్లు చెప్పారు. వారి అంచనా ప్రకారం బహుశా ఉంటే ఏడుగురు సంతానం ఉండొచ్చని ఆ మహిళ భావించిందట. కానీ ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చేసరికి ఆమెకే ఆశ్చర్యంగా ఉందని హలీమా తెలిపింది. ఈ డెలివరీ ప్రక్రియ మొత్తం సిజేరియన్ ద్వారానే చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ( చదవండి: గర్భవతని తెలియదు.. విమానంలో గాల్లో ఉండగానే డెలివరీ ) -
మాలిలో మూడేళ్ల పాటు సైనిక పాలనే : జుంటా
మాలి : అధికారాన్ని చేజిక్కించుకున్న జుంటా.. సైనిక నేతృత్వంలోనే మూడేళ్లపాటు పరిపాలన కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇందుకు బదులుగా అపహరణకు గురైన మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతాను విడుదల చేయడానికి అంగీకరించినట్లు ప్రతినిధుల బృందం తెలిపింది. మాలిలో మూడేళ్లపాటు సైనిక నేతృత్వంలోని ఒక సంస్థ నాయకత్వం వహిస్తుందని అతనే దేశాధినేతగా కొనసాగుతాడు అని జుంటా స్పష్టం చేసింది. గత కొన్నాళ్లుగా తిరుగుబాటు జండా ఎగరవేస్తున్న.. జుంటా పలువురు రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో కీతాను విడుదల చేస్తామని అంతేకాకుండా అతను చికిత్స నిమిత్తం విదేశాలకు కూడా వెళ్లవచ్చునని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (మూతి పగులగొడతా: బ్రెజిల్ అధ్యక్షుడు) ఇక దేశంలో నిరసనసెగలు వెల్లువెత్తుతున్న వేళ ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని బౌబౌ సిస్సేను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బౌబాకర్ కీతను అదుపులోకి తీసుకోవడంతో సిస్పేకు భయం పట్టుకుందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. జుంటా చర్యకు మద్ధతుగా ప్రతిపక్ష నేతలు సంబురాలు జరుపుకున్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో మాలిలో నాయకత్వంపై తిరుగుబాటు జరగడం ఇది రెండోసారి. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా ఏమీ చేయలేని అసమర్థ అధ్యక్షుడు కీత రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై తిరుగుబాటు పెరగడంతో ప్రజల కోసమే జుంటా పనిచేస్తుందని ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో తగిన సమయంలో ఎన్నికలను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేసింది. రాజ్యాంగ సంక్షేమమే లక్ష్యంగా జుంటా పనిచేస్తుందని తెలిపింది. అయితే కొందరు మద్దతుదారులు మాత్రం కీతానే తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. (కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్.. సోదరికి అధ్యక్ష బాధ్యతలు!) -
మాలీలో సైనిక తిరుగుబాటు
బమకో: ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మంగళవారం సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబు సిస్సే సైతం రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది. మాలీలో నివాసముంటున్న భారతీయులు ప్రస్తుతానికి ఇళ్లకే పరిమితం కావాలని ఆక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. అత్యవసర సాయం కావాల్సివస్తే ఎంబసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని ట్విటర్లో ప్రకటించింది. -
రగులుతున్న ‘మాలి'
-
'రగులుతున్న మాలి'
బొమాకో : సైనికుల తిరుగుబాటుతో మాలి దేశం అట్టుడుకుతుంది. దీంతో మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా బుధవారం తెల్లవారుజామున తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో గతకొతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాలిలో రక్తం పారవద్దనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కాగా ఆయన పదవీకాలం ఇంకా మూడేళ్ల పాటు ఉంది. అధ్యక్షుడి రాజీనామా అనంతరం మాలీ పార్లమెంట్ రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కీతా రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కానీ అవినీతి, ఆర్థికవ్యవస్థను చక్కదిద్దకపోవడం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మత హింసపై ప్రజల్లో ఆగ్రహం ఉంది.ఇస్లాం తిరుగుబాటును బౌబాకర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెండు నెలలుగా మాలిలో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.మితవాద మత పెద్ద మహమూద్ డికో నేతృత్వంలో ఏర్పడిన ఒక కొత్త ప్రతిపక్ష కూటమిని ప్రభుత్వంలో కలవాలంటూ కీతా చేసిన ప్రతిపాదనను ఆ కూటమి తిరస్కరించింది. దేశంలో సంస్కరణలకు పిలుపునిచ్చింది. కాగా తిరుగుబాటు చేసిన సైనికులు కీతా క్యాంపులో ఉన్న ఇబ్రహీం బౌబాకర్తో పాటు ప్రధాని బౌబౌ సిస్సేను తమ అధీనంలోకి తీసుకున్నారు. అంతకుముందు విజయ సూచకంగా అతని ఇంటి బయట గాలిలోకి కాల్పులు జరిపారు. తిరుగుబాటు సైనికులతోపాటు, ప్రజలు కూడా భారీగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ రాజధాని నగరం బొమాకోను తమ ఆధీనంలోకి తీసకున్నారు. -
రెండు హెలికాప్టర్లు ఢీ; 13 మంది మృతి
సాహెల్ : రెండు సైనిక హెలికాప్టర్లు గగనతలంలో ఒకదానికొకొటి ఢీకొనడంతో ఫ్రాన్స్ దేశానికి చెందిన 13 మంది సైనికులు మరణించారు. ఈ విషాద ఘటన మాలీ దేశంలోని సాహెల్‌లో చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మంగళవారం మాలీలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ దుర్ఘటన జరిగింది.ఇదే విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యూయేల్ మక్రాన్ చనిపోయిన సైనికుల కుటుంబలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారిలో ఆరుగురు ఆర్మీ అధికారులతో పాటు మరో ఏడుగురు నాన్ కమీషన్డ్ అధికారులు ఉన్నట్లు తేలింది. 1983లో బీరుట్ బ్యారక్స్ బాంబు దాడిలో 58 మంది ఫ్రెంచ్ పారాట్రూపర్స్ మరణం తర్వాత ఇప్పుడు 13మంది ఫ్రెంచ్ అధికారులను పోగొట్టుకోవడం బాధాకరమని ఫ్రాన్స్ రక్షణ విభాగం పేర్కొంది. అయితే దుర్ఘటనకు సంబంధించిన కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.ఇస్లామిక్ మిలిటెంట్లు మాలీలోని ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించడంతో 2013లో ఫ్రాన్స్ ప్రభుత్వం తన బలగాలను అక్కడ మోహరించింది. ప్రస్తుతం సుమారు 4500 ప్రాన్స్ బలగాలు మాలీ దేశ సైన్యానికి సహకరిస్తున్నాయి. -
6కే ఆలౌట్... ఇదీ క్రికెట్టే!
కిగలి సిటీ: ఓ వైపు పురుషుల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ 17 సిక్సర్లతో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేస్తే... మరోవైపు మహిళల అంతర్జాతీయ టి20లో 6 పరుగులకే ఆలౌటైన చెత్త రికార్డు మంగళవారం నమోదైంది. క్విబుక మహిళల టి20 టోర్నీలో మాలి జట్టు ఈ కొత్త చెత్త రికార్డును తమ పేర లిఖించుకుంది. రువాండతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన మాలి మహిళల జట్టు 9 ఓవర్లలో 6 పరుగులు చేసి ఆలౌటైంది. మరో ఆసక్తికర విషయమేంటంటే ఓపెనర్ సమకె (1) చేసిన పరుగే టాప్ స్కోర్! ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పది మంది ‘జీరో’లే! ఒక్కరు మినహా అందరు 6, 7 బంతులాడి ఖాతా తెరవకుండానే ఔటైతే... కౌలిబెలీ మాత్రం అత్యధికంగా 12 బంతులాడి డకౌటైంది. ఇక మిగతా 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. 2 బైస్, మరో 2 లెగ్‌బైస్, ఒకటేమో వైడ్... ఇది మాలి ఇన్నింగ్స్ కథకమామిషు! ఈ చెత్త రికార్డును ఛేదించేందుకు బరిలోకి దిగిన రువాండ జట్టు 4 బంతులాడి 8 పరుగులు చేసి గెలిచింది. ఇదే ఏడాది జనవరిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చైనా నెలకొల్పిన చెత్త రికార్డు (14 ఆలౌట్)ను మాలి సవరించింది. -
ప్రేరేపిత ఉగ్రవాదంతో ముప్పు
మాలి: ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారిందని, దీనిపై పోరాటం సాగించేందుకు అందరూ ఏకం కావాలని భారత ప్రధాని మోదీ ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాల్దీవుల పార్లమెంట్ మజ్లిస్నుద్దేశించి ప్రసంగించారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’అన్న ప్రభుత్వ విధానంలో భాగంగా మొట్టమొదటి పర్యటన మాల్దీవులతో ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాల్దీవుల రాజధాని మాలీకి చేరుకున్న మోదీకి విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు సోలిహ్ సాదర స్వాగతం పలికారు. మోదీ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ ఆయనకు విదేశీ ప్రముఖులకిచ్చే అత్యున్నత పురస్కారం రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్‌తో గౌరవించారు. మోదీ భారత క్రికెట్ జట్టు సభ్యుల సంతకాలతో కూడిన క్రికెట్ బ్యాట్‌ను సోలిహ్‌కి బహూకరించారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు క్రికెట్ దోహదపడుతుందని, మాల్దీవుల్లో క్రికెట్ అభివృద్ధికి సాయపడతామని తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించడం వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సదస్సు జరగాలి చరిత్రకు పూర్వం నుంచే భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. మాల్దీవుల పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తూ..స్పీకర్‌గా ఎన్నికైన మొహమ్మద్ నషీద్ మజ్లిస్మొదటి సమావేశానికి తనను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ప్రతి భారతీయుడిని కదిలించి, ఇక్కడి ప్రజల పట్ల గౌరవాన్ని పెంచిందన్నారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యం బలపడేందుకు ప్రతి భారతీయుడూ వెన్నంటి ఉంటారని భరోసా ఇచ్చారు. ‘ఉగ్రవాదం ఏదో ఒక దేశానికే పరిమితమైంది కాదు, అది నాగరికతకే పెనుముప్పు. ప్రపంచ దేశాలన్నీ కలిసి వాతావరణ మార్పులపై సమావేశాలు, చర్చలు జరిపిన విధంగానే ఉగ్రవాదం అంశంపైనా అంతర్జాతీయ సదస్సు జరపాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదుల్లో మంచి వారు, చెడ్డ వారు ఉన్నారంటూ కొందరు తేడా చూపుతూ పొరపాటు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల ప్రేరేపిత ఉగ్రవాదం ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని ఆయన పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ తరహా ఉగ్రవాదం తీవ్ర ప్రమాదకరంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రపంచ నేతలంతా ఏకం కావాలని ఆయన కోరారు. ఇద్దరు నేతల ఉమ్మడి ప్రకటన రెండు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ నిర్ణయించారు. ఈ మేరకు వారిద్దరూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘రెండు దేశాల ఉమ్మడి భద్రతా పరమైన అంశాల గుర్తించి, ఈ ప్రాంతంలో సుస్థిరత సాధించేందుకు పరస్పరం సహకరించుకోవాలి. రెండు దేశాల్లోనూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరగనివ్వరాదు. హిందూమహా సముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు సహకారం బలోపేతం చేసుకోవాలి. సమన్వయంతో కూడిన గస్తీ, నిఘా, సమాచార మార్పి, బలగాల పెంపు తదితర అంశాల ద్వారా సముద్ర ప్రాంత రక్షణను బలోపేతం చేసుకోవాలి. మెరుగవుతున్న సంబంధాలు గత ఏడాది నవంబర్‌లో సోలిహ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. భారత ప్రధాని మాల్దీవులు సందర్శించడం ఎనిమిదేళ్లలో అదే ప్రథమం. గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ చైనా పరోక్ష జోక్యం ప్రభావం ఫలితంగా దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడం వంటి పలు చర్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారిన విషయం తెలిసిందే. సోలిహ్ అధికారంలోకి వచ్చాక భారత్–మాల్దీవుల సంబంధాలు తిరిగి గాడినపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించిన సందర్భంగా బెంగళూరులో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ వీక్షించారు. అనంతరం ఆయన తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి భారత్ సాయం కోరారు. కేరళ నాకెంతో ప్రియమైనది తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో గెలచాక మోదీ తొలిసారిగా కేరళలో పర్యటించారు. కేరళ బీజేపీ విభాగం ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న ప్రధాని.. తన సొంత నియోజకవర్గం వారణాసి మాదిరిగానే కేరళ తనకెంతో ప్రియమైనదని చెప్పారు. బీజేపీకి అద్భుత విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ ఈ ఎన్నికలు వ్యతిరేక శక్తుల్ని తిరస్కరించాయి. చెడుపై మంచి విజయం సాధించింది. ఇదే స్ఫూర్తితో నవ భారత నిర్మాణానికి అందరం కలసికట్టుగా పనిచేయాలి‘‘ అని మోదీ పిలుపునిచ్చారు. కేరళలో మాకు ఒక్క సీటు రాకపోయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలపై ఎంతో గౌరవం ఉంది. ఇక్కడ ప్రజలు ఎంతో అద్భుతమైనవారు. వారితో బంధం మరింత దృఢపడాలని కోరుకుంటున్నాను‘‘ అని అన్నారు. గురువాయూర్‌లో మోదీ తులాభారం కేరళ పర్యటనలో భాగంగా మోదీ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శిం చుకున్నారు. స్వామివారి సమక్షంలో తామరపూలతో తులాభారం నిర్వహించారు. తామరపూలతో మోదీ శ్రీకృష్ణుడికి మొక్కును చెల్లించుకున్నారు. గురువాయూర్ ఆలయం పరమపవిత్రమైనది. కృష్ణ భగవానుడికి అరటిపళ్లు, తామరపూలు, నెయ్యి సమర్పించారు. ప్రధాని మోదీ శ్రీకృష్ణ ఆలయంలో దాదాపుగా 20 నిముషాల సేపు గడిపారు. కేరళ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభాలతో శ్రీకృష్ణ ఆలయ అధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ వస్త్రధారణ అయిన తెలుపు రంగు ముండు(ధోతీ), కుర్తాతో పాటు శాలువాను మోదీ ధరించారు. గురువాయూర్‌లో పంచెకట్టులో ప్రధాని అభివాదం. తామరపుష్పాలతో తులాభారం దృశ్యం -
మాలి జాతి ఘర్షణల్లో 50 మంది దుర్మరణం
బమాకో: ఆఫ్రికాదేశమైన మాలి మరోసారి నెత్తురోడింది. మాలిలోని ఫులానీ తెగకు చెందిన ఒగౌస్సగౌ గ్రామంపై శనివారం తెల్లవారుజామున 4 గంటలకు డోగోన్ జాతికి చెందిన వేటగాళ్లు దాడిచేశారు. విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరుపుతూ నివాసాలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 50 మంది ఫులానీ తెగప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పశువుల మేత, నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో చోటుచేసుకున్న ఘర్షణలో డోగోన్ వేటగాళ్లు 37 మంది ఫులానీ ప్రజలను చంపేశారన్నారు. ఈ ప్రాంతంలోని జాతివైరాన్ని అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రసంస్థలు పావుగా వాడుకుంటూ భారీగా చేరికలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. -
క్షణాల వ్యవధిలో స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి..
-
సెకన్ల వ్యవధిలో చిన్నారి ప్రాణాలను... వైరల్
పారిస్: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితి నెలకొనటం సహజం. కానీ, కొందరు మాత్రం సమయస్ఫూర్తిని, తెగువను ప్రదర్శిస్తుంటారు. మాలికి చెందిన 22 ఏళ్ల మమౌడూ గస్సామా కూడా అదే జాబితాలోకి వస్తాడు. ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడి సూపర్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆదివారం ఉత్తర ప్యారిస్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. నాలుగేళ్ల బాబు తాను ఉంటున్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు వేలాడటం కొందరు స్థానికులు గమనించారు. వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అంచుల నుంచి వేలాడుతున్న ఈ చిన్నారి ఎప్పుడైనా కిందపడి పోయేలా పరిస్థితి నెలకొంది. కింద జనం చేరి హాహాకారాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మమౌడూ గస్సామా క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకాడు. గబగబా పైకి భవనం ఎక్కడి ఆ పిల్లాడిని కాపాడే యత్నం చేశాడు. ఆ సమయంలో పక్క ప్లాట్లోని వ్యక్తి చిన్నారి జారకుండా ఒకచేత్తో అదిమి పట్టుకున్నాడు. నిమిషం వ్యవధిలోనే పైకి ఎక్కేసిన గస్సామా.. ఆ బాబును అమాంతం లాగేసి ప్రాణాలు కాపాడాడు. కాసేపటికి వచ్చిన అధికారులు చిన్నారి సురక్షితంగా ఉన్నాడని తెలిసి ఆ యువకుడిని అభినందించి వెళ్లిపోయారు. గస్సామా సాహసంపై పారిస్ మేయర్ ప్రశంసలు గుప్పించగా, సోషల్ మీడియాలో అతన్ని హీరోగా, స్పైడర్ మ్యాన్‌గా అభివర్ణిస్తున్నారు. మాలి నుంచి పారిస్‌లో స్థిరపడదామని వచ్చిన అతనికి అన్ని తోడ్పాట్లు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఒంటిరిగా ఉన్నాడు... ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు నిర్ధారించారు. పిల్లాడి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు అతని తల్లి ఊళ్లో లేదని తెలుస్తోంది. ‘ఆ క్షణంలో ఆ చిన్నారిని అలా చూసేసరికి భయం వేసింది. వణికిపోయా. ప్రజలంతా కేకలు పెడుతున్నారే తప్ప.. ఒక్కరూ కూడా తెగించే ధైర్యం చేయలేదు. ఫైర్ సిబ్బంది రావటానికి సమయం పడుతుందని అనిపించింది. ఇంతలోపే ఆ చిన్నారికి ఏమైనా జరిగితే ఎలా?.. మరో ఆలోచన రాలేదు. దుకే ఈ పని చేశా’ అని గస్సామా చెబుతున్నాడు. -
మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం
మాలే: మాల్దీవుల్లో మరోసారి రాజకీయ అనిశ్చితి తలెత్తింది. జైళ్లలో ఉన్న ప్రతిపక్ష నేతల శిక్షల్ని రద్దు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జైలు శిక్ష ఎదుర్కొంటోన్న మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రవాసంలో ఉండగా.. జైళ్లలో ఉన్న మిగిలిన రాజకీయ నేతల్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అధ్యక్షుడు వెంటనే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ నషీద్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళనలు చేపట్టడంతో రాజధాని మాలిలో ఉద్రిక్తత నెలకొంది. తీర్పు చెల్లుబాటవుతుందో? లేదో? పరిశీలిస్తున్నామని మాల్దీవుల సర్కారు పేర్కొంది. కాగా, ‘మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంటాం’ అని కొలంబోలో ఉన్న నషీ ద్ అన్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత్ తెలిపింది. యమీన్ నిరంకుశ పాలనతో పర్యాటక ప్రాంతమై న∙మాల్దీవుల ప్రతిష్ట దెబ్బతింది. అధికారంలోకొచ్చాక స్వపక్షంలోని అసంతృప్త నేతలు, ప్రతిపక్ష నేతలను యమీన్ జైల్లో పెట్టించారు. ప్రవాసంలో ఉన్న నషీద్ ఉగ్రవాదం ఆరోపణలపై జైలు శిక్ష ఎదుర్కొంటున్నారు. 12 మంది ఎంపీలపై అనర్హత ఎత్తివేత గురువారం కోర్టు తీర్పును వెలువరిస్తూ.. ‘రాజకీయ ఉద్దేశాలతో నషీద్, మరో ఎనిమిది మందిపై నేర విచారణ కొనసాగించారు. ఇది దేశ రాజ్యాంగంతో పాటు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించడమే’ అని స్పష్టం చేసింది. 12 మంది పార్లమెంటు సభ్యులపై అనర్హతను కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో 85 మంది సభ్యుల మాల్దీవుల పార్లమెంటులో యమీన్ వ్యతిరేక వర్గం ఆధిక్యత పెరిగింది. ‘కోర్టు ఉత్తర్వుల్ని పాటిస్తాం’ అని మాల్దీవుల పోలీసు విభాగం ట్వీటర్లో స్పందించడంతో ఆగ్రహించిన ప్రభుత్వం.. పోలీసు చీఫ్ అహ్మద్ అరీఫ్‌ను తొలగించింది. నషీద్‌కు చెందిన మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టించిన యమీన్ అధ్యక్ష పదవి నుంచి యమీన్‌ను తొలగించాలని, అతని అవినీతిపై దర్యాప్తు జరిపించాలని కోరతూ ప్రతిపక్ష నేతలు ఈ వారం మొదట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యమీన్‌తో పాటు, అతని కుటుంబ సభ్యులు, రాజకీయ అనుచరులు ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టారని ఆరోపించారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో యమీన్ సవతి సోదరుడితో పాటు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ తదితరులు ఉన్నారు. వివాదాస్పదమైన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నషీద్‌పై విజయం సాధించాక యమీన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్ష నేతల్ని, అధికార పక్షంలోని వ్యతిరేకుల్ని జైలులో పెట్టించగా.. మరికొందరు విదేశాల్లో తలదాచుకుంటున్నారు. స్కూల్లోనే కొట్టిచంపారు! న్యూఢిల్లీ: గతేడాది గురుగ్రామ్‌లోని ర్యాన్ పాఠశాలలో ప్రద్యుమ్న ఠాకూర్ హత్యోదంతం మర్చిపోకముందే ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని జీవన్‌జ్యోతి సీనియర్ సెకండరీ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న తుషార్ కుమార్(16)పై నలుగురు తోటి విద్యార్థులు దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పోలీసులు, ముగ్గురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల వాష్‌రూమ్ దగ్గర గురువారం సాయంత్రం తుషార్‌కు, నలుగురు తోటి విద్యార్థులకు గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. వారందరూ తుషార్‌పై పిడి గుద్దులు కురిపించడంతో స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికి అటుగా వచ్చిన కొందరు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తుషార్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తొమ్మిదో తరగతిలోని రెండు గ్రూపుల మధ్య గొడవలో జోక్యం చేసుకోవడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
ఆఫ్రికా దేశం మాలిలో మారణ హోమం