వారిని మాత్రం ఉగ్రవాదులు వదిలేశారు.. | accept muslims others captured as hostage in radison | Sakshi
Sakshi News home page

వారిని మాత్రం ఉగ్రవాదులు వదిలేశారు..

Published Fri, Nov 20 2015 5:09 PM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

వారిని మాత్రం ఉగ్రవాదులు వదిలేశారు..

వారిని మాత్రం ఉగ్రవాదులు వదిలేశారు..

*ఆసియా, యూరప్‌, అమెరికా .. ఆఫ్రికా..
*టార్గెట్ చేస్తే  ఎక్కడైనా  సరే...
*ఎవరినైనా చంపేస్తామన్న ఉగ్రవాదల హెచ్చరికలు నిజమవుతున్నాయి..
*తాజాగా పశ్చిమ ఆఫ్రికా దేశమైనా మాలీ రాజధాని బమాకాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
*బకామాలోని రాడిస్‌ బ్లూ హోటల్‌పై తెగబడ్డారు
*రాడిస్‌ బ్లూ హోటల్‌ను 10 మంది తీవ్రవాదులు దిగ్బంధించారు..
*తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు..
*హోటల్‌లో పెద్ద ఎత్తున అమెరికన్లు, ఫ్రెంచి - బెలిజన్ దేశస్తులు ఉన్నట్లు సమాచారం.
*తీవ్రవాదుల కాల్పుల్లో 9 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి..
*మృతుల్లో ఫ్రెంచి, బెలిజియన్ దేశస్తులుగా మీడియా కథనాలు..
*తీవ్రవాదుల దగ్గర 170 మంది బందీలుగా ఉన్నారు..
*వీరిలో 140 మంది అతిథులు కాగా, 30 మంది హోటల్ సిబ్బందిగా వార్తలు వస్తున్నాయి..
*ఉగ్రవాదులు  రాత్రంతా హోటల్‌లోనే గడిపినట్లు తెలుస్తోంది...
*వారి చెరనుంచి బందీలను విడిపించేందుకు భద్రతా దళాలు విశ్వయత్నం చేస్తున్నాయి.
*మరోవైపు మాలి  ప్రధాని అత్యవసర సమావేశం నిర్వహించారు...
*ఉగ్రవాదుల ఆధీనంలోనే రాడిసన్ బ్లూ హోటల్

* హోటల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ముందుగా అందులో ఉన్నటువంటి ముస్లింలను వెల్లిపోవాల్సిందిగా సూచించి మిగిలిన వారిని బందీలుగా తీసుకున్నారు.
*ఉగ్రవాదులు 190 గదులతో ఉన్నటువంటి హోటల్లోని ఒక్కో ఫ్లోరును తనిఖీ చేస్తూ బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
*సుమారు 20 మందిని ముస్లింలుగా నిర్థారించుకున్న అనంతరం ఉగ్రవాదులు విడిచిపెట్టారు.
*ఓ ఫ్రెంచి దేశీయుడితో సహా మరికొందరిని ఉగ్రవాదులు హతమార్చినట్లు సమాచారం.
*ఎయిర్ ఫ్రాన్స్ సిబ్బంది సాధారణంగా ఈ హోటల్‌లోనే బస చేస్తుంటారు. దీంతో వీరిని లక్ష్యంగా చేసుకొనే ఉగ్రవాదులు హోటల్పై దాడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
*మాలిలోని యూఎస్ ఎంబసీ బందీలను విడిపించడానికి అత్యవసర సహాయాన్ని కోరింది.
*7వ ఫ్లోరులో అత్యాధునిక ఆయుధాల పేలుళ్ల శబ్దం వినిపించడంతో ఉగ్రవాదులు పలువురు బందీలను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు.
*'రాడిసన్ హోటల్ బందీలలో భారత్కు చెందిన వారు 20 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement