బంగారు గనిలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి | Landslide Accident At Gold Miners In Southern Mali | Sakshi
Sakshi News home page

బంగారు గనిలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి

Jan 31 2025 8:29 AM | Updated on Jan 31 2025 9:06 AM

Landslide Accident At Gold Miners In Southern Mali

బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో మరో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంగారు గనిలో కొండచరియలు విరిగిపడిన ‍‍ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, పలువురి ఆచూకీ గల్లంతు అయినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

వివరాల ప్రకారం.. మాలిలోని బంగారు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కౌలికోరో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. కాగా, మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. అయితే, బంగారం వెతుకులాటకు వెళ్లి వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారని కౌలికోరో గవర్నర్‌ కల్నల్‌ లామైన్‌ కపోరీ సనొగో తెలిపారు. ఒక్కసారిగా బురదనీరు ప్రవేశించి మహిళలను చుట్టుముట్టిందని వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇటీవలే మాలిలో బంగారు గనిలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 25వ తేదీన మాలిలోని బంగారు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 70 మందికిపైగా మృత్యువాత పడ్డారు. అనధికారికంగా తవ్వకాలు చేపట్టే ఓ బంగారు గని కుప్ప కూలి 70 మంది మరణించారు. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక, ఆఫ్రికా దేశాల్లో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా మాలి ఉంది. ఈ దేశంలో గనుల ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement