జోహన్నెస్‌బర్గ్: అక్రమ మైనింగ్ కూలీల ప్రాణాలను బలి తీసుకుంది. బంగారం గనిలో అనుమతి లేకుండా తవ్వకాలు సాగిస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా 21 మృతదేహాలు లభ్యమయ్యాయి. దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ నగరానికి పశ్చిమాన ఉన్న క్రుగెర్స్‌డార్ప్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 19, గురువారం ఉదయం 2 మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలియజేశారు.
గనిలో మరో చోట చనిపోయివారి మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు తాము అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఇది ప్రైవేట్ బంగారం గని, ఇక్కడ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని చెప్పారు. క్రుగెర్స్‌డార్ప్ ప్రాంతంలో గనులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ తరచుగా గనుల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది జూలైలో ఓ గనిలో సినిమా షూటింగ్ కోసం వచ్చిన 8 మంది మహిళలపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, వారివద్దనున్న సొత్తును దోచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment