digging
-
Madhya Pradesh: తవ్వకాల్లో 35 కల్తీ మద్యం డ్రమ్ములు.. కంగుతిన్న పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఆశ్చర్యకర ఉదంతం చోటుచేసుకుంది. కరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో విషపూరిత మద్యాన్ని (ఓవర్ ప్రూఫ్ స్పిరిట్) స్వాధీనం చేసుకున్నారు.మద్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న కొందరు విషపూరితమైన మద్యాన్ని డ్రమ్ముల్లో దాచి ఉంచారు. పోలీసులు జేసీబీతో తవ్వకాలు జరపగా 35 కల్తీ మద్యం డ్రమ్ములు బయటపడ్డాయి. దీనిని చూసి పోలీసులు కంగుతిన్నారు. పోలీసులు రాకను గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ డ్రమ్ములకు పైపులైన్‌కు కనెక్షన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా కల్తీ మద్యాన్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. దీని గురించి పోలీసులకు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక పథకం ప్రకారం ఈ స్థావరంపై దాడి చేశారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపి 35 కల్తీ మద్యం డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. -
నాకు సమాధి తవ్వే పనిలో... విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
మండ్య/ధార్వాడ/హుబ్లీ: పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిని ఆయన ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తనను సమాధి చేయాలని కాంగ్రెస్ కలలు కంటోందని ఆక్షేపించారు. తనకు ఈ దేశ మాతృమూర్తులు, ఆడపిల్లలు, ప్రజలు రక్షణ కవచంగా ఉన్నారనే సంగతిని విపక్షాలు మరచిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. పేదల బతుకుల్లో మార్పు దేశంలో గడిచిన 9 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది పేదల బతుకుల్లో మార్పు వచ్చిందని మోదీ అన్నారు. పేదల కనీస అవసరాలైన సొంత ఇల్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి పనులను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 9 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద 40 లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించినట్లు చెప్పారు. 140 కోట్ల మందిని అవమానించారు విద్యార్థులు తమ చదువులు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. లండన్‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని జాతికి అంకితం చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా లండన్‌లో మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులను అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రపంచ దేశాలకు ఆశాకిరణం ప్రపంచ దేశాలకు ప్రస్తుతం భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయని తెలిపారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ కర్ణాటకలో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర న్యూఢిల్లీ: చరిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం మహాత్మా గాంధీకి, యాత్రలో పాల్గొన్న నేతలకు నివాళులర్పించారు. బ్రిటిష్ వారిపై ప్రజల పోరాటంగా దండి యాత్ర గుర్తుండిపోతుందన్నారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర అని ట్విట్టర్లో తెలిపారు. మన దేశ చరిత్రలో దండి యాత్ర కీలకమైన ఘట్టమని ఉద్ఘాటించారు. దండి యాత్రగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 5న ముగిసింది. పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని ఆదివారం జాతికి అంకితం ఇచ్చారు. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్‌ఘాట్ రైల్వే సెక్షన్‌ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మండ్య జిల్లాకేంద్రంలో ప్రధాని రోడ్డు షోలో పాల్గొన్నారు. -
ప్రాణాలు తీసిన బంగారం గని.. 21 మృతదేహాలు లభ్యం
జోహన్నెస్‌బర్గ్: అక్రమ మైనింగ్ కూలీల ప్రాణాలను బలి తీసుకుంది. బంగారం గనిలో అనుమతి లేకుండా తవ్వకాలు సాగిస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా 21 మృతదేహాలు లభ్యమయ్యాయి. దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ నగరానికి పశ్చిమాన ఉన్న క్రుగెర్స్‌డార్ప్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 19, గురువారం ఉదయం 2 మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలియజేశారు. గనిలో మరో చోట చనిపోయివారి మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు తాము అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఇది ప్రైవేట్ బంగారం గని, ఇక్కడ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని చెప్పారు. క్రుగెర్స్‌డార్ప్ ప్రాంతంలో గనులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ తరచుగా గనుల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది జూలైలో ఓ గనిలో సినిమా షూటింగ్ కోసం వచ్చిన 8 మంది మహిళలపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, వారివద్దనున్న సొత్తును దోచుకున్నారు. -
మహిళ, ఇద్దరు చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్..
సాక్షి, అలంపూర్(మహబూబ్‌నగర్): కార్తీకపౌర్ణమిని పురస్కరించుకు ని వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణానికి చెందిన ఓ మహిళ, తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రానికి శుక్రవారం ఉదయం వచ్చింది. ఈ సందర్భంగా పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో స్నానాలు ఆచరిస్తుండగా ఇద్దరు చిన్నారులు మెట్లపైనున్న పాకర వల్ల జారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు తల్లి లోపలికి వెళ్లగా ఈత రాకపోవడంతో ముగ్గురూ మునిగిపోయారు. ఇది గమనించిన భక్తులు కేకలు వేయగా అక్కడే ఉన్న వనపర్తి కానిస్టేబుల్ కృష్ణసాగర్ వెంటనే స్పందించారు. జాలరుల సాయంతో ముగ్గురినీ ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ కానిస్టేబుల్ అయ్యప్పమాలను ధరించి తోటి భక్తులతో కలిసి కార్తీకపౌర్ణమి సందర్భంగా బీచుపల్లిలోని ఆలయాలను దర్శించుకుని పూజలు చేయడం కోసం రాగా ఈ సంఘటన చోటు చేసుకుంది. -
తల్లిదండ్రులతో గొడవ.. సొరంగం తవ్విన యువకుడు
-
తల్లిదండ్రులతో గొడవ.. సొరంగం తవ్విన యువకుడు
మాడ్రిడ్: సాధారణంగా తల్లిదండ్రులు.. తమ పిల్లలు అల్లరి చేసినప్పుడు తిట్టడమో.. కొట్టడమో చేస్తూంటారు. దానికి.. పిల్లలు మహ అయితే, కాసేపు అలగడం, భోజనం మానేయడమో చేస్తుంటారు. మరికొంత మంది అల్లరి పిల్లలు ఇంట్లో చెప్పకుండా.. పక్కింట్లో లేదా తెలిసిన వారింటికో వెళ్లిపోతారు. అలాంటి వారంతా, కోపం తగ్గగానే తిరిగి తమ ఇంటికి చేరుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే, స్పెయిన్ కు చెందిన ఒక కుర్రాడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన 2015లో చోటుచేసుకుంది. స్పెయిన్ కు చెందిన 14 ఏళ్ల ఆండ్రెస్ కాంటోకు ట్రాస్ సూట్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో సూట్ ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని భావించాడు. కానీ, తల్లిదండ్రులు దీనికి అంగీకరించలేదు. బయటకు వెళ్లవద్దని కోప్పడ్డారు. దీంతో అలిగిన ఆ బాలుడు ఇంటి వెనకాల ఉన్న పేరడును తవ్వడం మొదలుపెట్టాడు. ప్రతి రోజు స్కూల్ నుంచి రావడం.. ఇంటి వెనుక వెళ్లి సొరంగం తవ్వడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఆ బాలుడు ప్రతిరోజు దాదాపు 14 గంటలపాటు పాటు నేలను తవ్వేవాడు. ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ఆరు సంవత్సరాలు పాటు తవ్వాడు. ఈ క్రమంలో 3 మీటర్ల లోతులో ఒక గుహలాగా ఏర్పడింది. ఈ సొరంగం తవ్వడంలో అతనికి ఒక మిత్రుడు కూడా సహకారం అందించాడు. ఈ గుహలో, ఉండటానికి గదిని.. దాంట్లో ఒక బెడ్, కుర్చీని ఏర్పాటు చేసుకున్నాడు. బాత్రూంను కూడా నిర్మించుకున్నాడు. అంతటితో ఆగకుండా వైఫైను సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సొరంగం పూర్తయ్యే నాటికి ఆండ్రెస్కు 20 ఏళ్లు. అయితే, ఈవీడియోను ఆండ్రెస్ కాంటో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ భలే.. ఉంది బాసు నీ ఐడియా ’, ‘ వర్ష కాలంలో జాగ్రత్త’, ‘ నీ అలకకు.. హ్యాట్సాఫ్.’ ‘ మేము చిన్నప్పుడు అలిగాం.. కానీ ఇలాంటి ఆలోచన మాకు రాలేదు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
కొడుకు శవం కోసం 8 నెలలుగా తవ్వకాలు..
శ్రీనగర్: ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను వదిలించుకునే సంతానం కోకొల్లలు.. బిడ్డలను వదిలేసే తల్లిదండ్రులు మాత్రం ఇంకా తయారు కాలేదు. తమ చివరి క్షణం వరకు బిడ్డల బాగోగుల గురించే ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో హత్యకు గురైన తన కొడుకు మృతదేహం కోసం ఓ తండ్రి గత ఎనిమిది నెలలుగా ప్రతి రోజు తవ్వకాలు జరుపుతూ గాలిస్తూనే ఉన్నాడు. ఈ తండ్రి కన్నీటి వ్యథ ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ఆ వివరాలు.. షకీర్ మంజూర్(25) అనే వ్యక్తి ప్రాదేశిక సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 2న అతడిని కొందరు ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకు రక్తంలో తడిసిన షకీర్ దుస్తులు లభించాయి. దాంతో అతడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు నిర్థరాణకు వచ్చారు. బిడ్డను పొగొట్టుకున్నారు.. కనీసం తనని కడసారిగా చూసుకుని.. ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలి అని షకీర్ తల్లిదండ్రులు భావించారు. కానీ నేటికి కూడా అతడి మృతదేహం వారికి లభించలేదు. ఈ సందర్భంగా షకీర్ తండ్రి మంజూర్ అహ్మద్ వాగే మాట్లాడుతూ.. ‘‘ఆగస్ట్ 2న ఈద్ సందర్భంగా నా కుమారుడు మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంటకు మాకు కాల్ చేశాడు. ‘‘నేను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాను. నా గురించి ఆర్మీ అధికారులు అడిగితే ఏం చెప్పకండి’’ అన్నాడు. అదే తన చివరి కాల్. అప్పటికే తను కిడ్నాప్ అయ్యాడని.. ఉగ్రవాదులే తనతో అలా మాట్లాడించారని ఆ తర్వాత మాకు అర్థం అయ్యింది’’ అన్నాడు వాగే. ‘‘మరుసటి రోజు షకీర్ వాడే వాహనం పూర్తిగా కాలిపోయి కనిపించింది. వారం రోజుల తర్వాత మాకు మా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాధురా ప్రాంతంలో రక్తంలో తడిసిన తన దుస్తులు లభించాయి. తన మృతదేహం కోసం వెదికాం.. కానీ దొరకలేదు. ఈ క్రమంలో ఓ రోజు మా బంధువుల అమ్మాయి రాత్రి తన కలలో షకీర్ కనిపించాడని.. అతడి బట్టలు దొరికన చోటే తనని పాతి పెట్టారని.. వెలికి తీయాల్సిందిగా కోరినట్లు మాకు తెలిపింది. దాంతో మరి కొందరితో కలిసి నేను ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాను. కానీ ఫలితం శూన్యం’’ అన్నాడు వాగే. ‘‘అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు ఇలా తవ్వకాలు జరుపుతూనే ఉన్నాను. ఏదో ఓ రోజు షకీర్ మృతదేహం దొరుకుతుందనే ఆశతో జీవిస్తున్నాను. ఈ విషయంలో గ్రామస్తులు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే వారందరికి తనంటే ఎంతో ప్రేమ. ఇక నా కొడుకును కిడ్నాప్ చేసిన నలుగురు ఉగ్రవాదులు ఎవరో కూడా నాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం వారిలో ఒక వ్యక్తి ఇక్కడి అధికారుల నుంచి ఏకే47 రైఫిల్స్ ఎత్తుకెళ్లి చిన్నపాటి గ్రూపును రన్ చేస్తున్నాడు. నా కుమారిడి శవాన్ని అప్పగించాల్సిందిగా మేం అన్ని మిలిటెంట్ సంస్థలను సంప్రదించాం. కానీ వారు తమకు ఏం తెలియదన్నారు’’ అన్నాడు వాగే. పోలీసు రికార్డుల్లో కిడ్నాప్‌గానే నమోదు... పోలీసు రికార్డుల్లో షకీర్ కిడ్నాప్ అయినట్లు నమోదు చేశారు. మరణించినట్లు ధ్రువీకరించలేదు. ఇక షకీర్‌ని ఎక్కడ సమాధి చేశారనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. స్థానిక పోలీసులు షకీర్ మృతదేహాం కోసం తీవ్రంగా గాలించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా వాగే ‘‘చెట్టంత ఎదిగిన కొడుకును దూరం చేసుకున్నాను. కడసారి చూపుకు నోచుకోలేదు.. తనకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా లేకపోయింది. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి వద్దు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఇక 2020 నుంచి ఉన్నతాధికారులు మిలిటెంట్ల దాడిలో మరణించిన సైనికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. కరోనా వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది అంటున్నారు అధికారులు. అధికారులపై వాగే ఆగ్రహం.. తన కొడుకును అమరవీరుడిగా ప్రకటించకపోవడం పట్ల వాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. "నా బిడ్డ ఒక సైనికుడు, భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. అధికారులు మొదట తన ప్రాణాలను కాపాడడంలో విఫలమయ్యారు. తరువాత అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమయ్యారు. అతన్ని అమరవీరుడిగా ప్రకటించాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. నా కొడుకును కిడ్నాప్ చేసి చంపారు. నా బిడ్డ వారి చేతిలో చిత్ర హింసలు భరించాడు.. కాని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తిని అమరవీరుడిగా ప్రకటించకపోవడం నాకు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది’’ అన్నాడు. కశ్మీర్లో, గత మూడు దశాబ్దాలలో సుమారు 8,000 మంది తప్పిపోయారు. వారిని భద్రతా దళాలు తీసుకుని వెళ్లారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అయితే ఒక సైనికుడు అదృశ్యం కావడం మాత్రం ఇదే ప్రథమం. చదవండి: నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ -
ఆలయం వద్ద బయటపడిన బంగారు నాణేలు
తిరుచిరాపల్లి : కేరళలోని పురాతన ఆలయంలో బంగారు నాణేలు లభ్యమయ్యాయి. తిరువనంతపురంలోని జంబూకేశ్వర్ ఆలయం వద్ద బుధవారం తవ్వకాలు చేపట్టగా ఏడడుగుల లోపల ఓ నౌకలో 1.7 కిలోల బరువున్న 505 బంగారు నాణేలు లభించాయి. వీటిలో 504 చిన్న నాణేలు కాగా, ఒక పెద్ద నాణెం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. అరబిక్ బాషలో ముద్రితమైన అక్షరాలున్న ఈ నాణేలు 100 నుంచి 1200 శతాబ్ధానికి చెందినవని భావిస్తున్నారు. నౌకలో దాచిన ఈ నాణేలను తాము గుర్తించామని అధికారులు చెబుతున్నారు. బంగారు నాణేలతో సహా నౌకను పోలీసులకు అప్పగించామని ఎండోమెంట్ అధికారులు తెలిపారు. చదవండి : రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..! -
నో చట్టం.. నో ఫారెస్ట్
ఖాకీ చిత్రం ఇటీవల విడుదలయింది. కార్తీ హీరో. ఓ సిన్సియర్ పోలీసు ఆఫీసరు కరుడుగట్టిన ముఠా ఆచూకీ తెలిసి పట్టుకోవడానికి ఓ రాష్ట్రానికి పోలీసు సిబ్బందితో జీపులో వెళతాడు. గ్రామంలో ఎదురుగా ముఠా సభ్యులు కనిపిస్తారు. అదుపులోకి తీసుకోవడానికి వెళితే ఊరంతా మూకుమ్మడిగా దాడి చేస్తుంది. దీంతో ప్రాణభయంతో అందరూ పరుగులు తీస్తారు. సేమ్ టూ సేమ్ ఇదే సన్నివేశం ఇప్పుడు కొల్లేరులో కనిపిస్తోంది. చేంజ్ ఏంటంటే పోలీసు స్థానంలో ఫారెస్టు సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కొల్లేరు ఓటు బ్యాంకు కోసం పచ్చనేతలు చట్టాలకు తూట్లు పడేలా అక్రమార్కులకు అభయమిస్తున్నారు. అభయారణ్యంలో అక్రమంగా చెరువుల తవ్వకాలు సాగిస్తున్నారు. కైకలూరు : కొల్లేరులో బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. యథేచ్ఛగా మంచినీటి చెరువుల పేరుతో అభయారణ్యాన్ని తవ్వేస్తున్నారు. టీడీపీ నాయకులు తెరవెనక ఉండి, మహిళలను ముందించి అటవీ చట్టాలకు పాతరేస్తున్నారు. సుప్రీం కోర్టు నిబంధనలు తుంగలో తొక్కుతున్నా ఫారెస్టు, రెవెన్యూ, పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కొల్లేరు ఆక్రమణల పర్వం కళ్లెదుట, కాగితాల్లో సర్వే నంబర్లతో సహా తేటతెల్లం అవుతున్నా అడ్డుకోవడంలో అటవీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. రాజకీయ చట్రంలో ఇరుసులా ఇరుక్కుని బిక్కుబిక్కుమంటూ వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఆక్రమణలు పునరావృతం ఎన్నికలు దగ్గరపడేకొద్ది కొల్లేరులో ఆక్రమణలపర్వం ఊపందుకుంది. 2016 జూలై నెలలో మండవల్లి మండలం పులపర్రు, చింతపాడు, దెయ్యంపాడు, కైకలూరు మండలం కొల్లేటికోట, కొట్టాడ గ్రామాల్లో పట్టపగలు చెరువులను తవ్వేశారు. అప్పట్లో పులపర్రులో అడ్డుకున్న ఫారెస్టు అధికారులను తరిమేశారు. జీపును సైతం పక్కకు తోసేశారు. ఇవే ఘటనలు పులపర్రులో తిరిగి పునరావృతమయ్యాయి. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నాలుగు పొక్లెయిన్లతో తాగునీటి చెరువు పేరుతో భారీ గట్లు వేశారు. యథావిధిగా మహిళలను ముందుంచి అటవీ అధికారులను అడ్డుకున్నారు. తవ్వకాల తెర వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారనే విషయం జగమెరిగిన సత్యం. పాత్రికేయులపై దాడులు పులపర్రు గ్రామంలో జరుగుతున్న ఆక్రమణను వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయులపై అక్రమార్కులు మహిళలతో దాడులు చేయిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తుంటే, తిరిగి మహిళలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్న అభయారణ్యంలో పొక్లెయిన్లతో తవ్వుతుంటే సీజ్ చేయలేని అటవీ సిబ్బంది, అంతా అయిపోయిన తర్వాత తూతూమంత్రగా కేసులు నమోదు చేసి సరిపెడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఫారెస్టు సిబ్బంది కోమటిలంక రోడ్డు నిర్మాణం అంశంలో కైకలూరు టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేసినా అది బుట్టదాఖలయ్యింది. ముందే హెచ్చరించిన ‘సాక్షి’.. కొల్లేరు గ్రామాల్లో ఆక్రమణలు జరిగే అవకాశముందని ఫిబ్రవరి 22న ‘దీపం ఉండగానే’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అటవీ సిబ్బంది ఈ కథనంపై కసరత్తు చేశారు. కలెక్టరు ఆరా తీశారు. అయినా ఆక్రమణల పర్వాన్ని అడ్డుకోవడంలో అటవీశాఖ హైడ్రామా నడిపించింది. ఇవే ఘటనలు పలు గ్రామాల్లో నెలకొని శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కేసులతో సరి పట్టపగలు పులపర్రు గ్రామంలో రెండోసారి కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు జరిగాయి. ఈ ఘటనపై యథావిధిగా అటవీ అధికారులు రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రతి ఏటా ఆక్రమణలు జరగడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారుతోంది. పులపర్రు గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘అంతా నేను చూసుకుంటాను మీరు కానిచ్చేయండి’ అంటూ ఆక్రమణదారులకు భరోసా ఇవ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు భావిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం మండవల్లి మండలం పులపర్రులో అభయారణ్యంలో చెరువు గట్లు ఏర్పాటు చేసిన ఘటన వాస్తవం. దీనిపై పూర్తి విచారణ చేయాలని సిబ్బంది ఆదేశించాను. అటవీ శాఖ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. గ్రామస్తులకు అభయారణ్య చట్టాలను వివరించి ఏర్పాటు చేసిన అక్రమ గట్లను తొలగిస్తాం. – సాయిబాబా, అటవీశాఖ, డీఎఫ్‌వో కొల్లేరు కాంటూరు కుదింపు జరగాలి కొల్లేరు అభయారణ్యాన్ని కుదింపు చేయాలని కొల్లేరు పరివాహక ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. కొల్లేరు సమస్యలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజలకు న్యాయం జరుగుతుంది. – దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, కైకలూరు అక్రమ తవ్వకాల్లో టీడీపీ నాయకుల హస్తం కొల్లేటిలో జరుగుతున్న అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉంది. కాంటూరు 5లో ధ్వంసం చేసిన చెరువుల స్థానంలో కొత్త చెరువుల తవ్వకాలకు ఊతం ఇస్తున్నారు. ఈ కారణంగా ఏదో ఒక నెపంతో కొల్లేటిలో చెరువుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. చెరువుల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. – మన్నేపల్లి ఆదాం, పీసీసీ సభ్యులు, మండవల్లి తాగునీటి చెరువులకు అవకాశం ఇవ్వాలి ప్రభుత్వాధికారులు కొల్లేరు గ్రామాల్లో తాగునీటి చెరువుల తవ్వకాలకు అవకాశం కల్పించాలి. ఆపరేషన్ కొల్లేరు కారణంగా కొల్లేరు ప్రజలకు నష్టం వాటిల్లింది. గ్రామాల్లో తాగునీటి చెరువుల విస్తీర్ణం, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా లేదు. కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. – ఘంటసాల వెంకటేశ్వరరావు, ఏపీ మత్స్యకారుల సంఘ ఉపాధ్యక్షుడు, కొవ్వాడలంక -
రాతిగుండు రహస్యం చెప్పేనా?
చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల వేట రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్న విషయం విదితమే. ఆదివారం.. ఎనిమిది రాతి గుండ్లు, గదుల ఆకారంలో రెండు గుంతలు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పట్టువదలకుండా ఇక్కడ తవ్వకాలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా, చెన్నంపల్లి (తుగ్గలి): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో 36 రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో ఆదివారం రాతి గుండ్లు బయటపడ్డాయి. గుప్త నిధులు, నిక్షేపాలంటూ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 13న కోటలో తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఇటుకలు, ఎముకలు, ఇనుప ముక్కలు బయటపడ్డాయి. తరువాత జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారుల సూచన మేరకు.. ఈనెల 3న తవ్వకాలు పునఃప్రారంభించారు. ఆదివారం ఎనిమిది గుండ్రటి రాతి గుండ్లు బయట పడ్డాయి. వీటిని ఫిరంగి గుండ్లుగా భావిస్తున్నారు. గదుల ఆకారంలో రెండు గుంతలు ఉండడం, రాతి గుండ్లు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికా రులు భావిస్తున్నారు. జీఎస్ఐ అధికారులు మూడు చోట్ల తవ్వకాలు జరపాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు అధికారులు తవ్వకాలు జరుపనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. -
తోడేస్తున్నారు
కొవ్వూరు : ఇసుక దందా కొత్త పుంతలు తొక్కుతోంది. గోదావరి నదీ గర్భంలోకి డ్రెడ్జింగ్ యంత్రాలను దింపి మరీ ఇసుకను తోడేస్తున్నారు. ర్యాంపుల్లో యంత్రాల వినియోగంపై నిషేధం ఉన్నా తూచ్ అంటున్నారు. తాళ్లపూడి మండలం తాడిపూడి ర్యాంపులో భారీ పడవలపై డ్రెడ్జింగ్ యంత్రాలను ఉంచి నది మధ్యలో పెద్దఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు. ఇలా తవ్విన ఇసుకను పొక్లెయిన్ల సాయంతోఒడ్డుకు చేర్చి లారీల్లో లోడు చేస్తున్నారు. నాలుగు రోజులుగా రేయింబవళ్లు నిరాటంకంగా ఈ తంతు సాగుతోంది. అబ్కారీ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. రోజుకు 500 యూనిట్ల సేకరణ తాడిపూడిలో నాలుగు పెద్ద పడవలను వినియోగించి ఇసుకను డ్రెడ్జింగ్ పద్ధతిలో తవ్వుతున్నారు. ఒక్కొక్క పడవలో.. ఒక్కొక్క ట్రిప్పునకు 25 నుంచి 30 యూనిట్లకు పైగా ఇసుకను సేకరిస్తున్నారు. ఇలా రోజుకు 500 యూనిట్ల ఇసుకను తోడేస్తున్నారు. యూనిట్‌ను రూ.800 వరకు విక్రయిస్తూ రోజుకు రూ.4 లక్షల్ని దోచుకుంటున్నారు. ఇక్కడ తవ్విన ఇసుకను విశాఖపట్నం, నూజివీడు, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు సైతం తరలిస్తున్నారు. టీడీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బల్లిపాడు ర్యాంపులోనూ గుట్టుచప్పుడుగా యంత్రాల సాయంతో తవ్వకాలు సాగుతున్నాయి. కార్మికులతోనే తవ్వకాలు చేయించాలి జిల్లా వ్యాప్తంగా 13 ఇసుక ర్యాంపులకు అనుమతులున్నాయి. వీటన్నిటిలో కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సి ఉంది. పొక్లెయిన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి, డ్రెడ్జింగ్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. తాడిపూడిలో డ్రెడ్జింగ్ చేస్తున్న విషయంపై పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం. – పి.మోహనరావు, అసిస్టెంట్ డైరెక్టర్, మైన్స్ -
బొర్రాలో జోరుగా రంగురాళ్ల తవ్వకాలు
అనంతగిరి:మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల సమీపంలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొర్రా పంచాయతీ పెద్దూరు, నిన్నిమామిడి, జీరుగెడ్డ, కొంట్యాసిమిడి, డెక్కాపురం తదితర గ్రామాల్లో మూడేళ్ల నుంచి రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ దొరికే రాళ్లు నాణ్యమైనవి కావడంతో మైదాన ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గ్రామాల్లో మధ్యవర్తుల సహకారంతో స్థానిక గిరిజనులకు రోజువారి కూలి చెల్లించి మరీ తవ్వకాలు చేపడతున్నారు. గతంలో పోలీసుల దాడుల్లో చేపట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు పడుతుండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతం కావడంతో ఎవరూ పట్టించుకోరనే ధీమాతో వ్యాపారులు స్థానికులతో తవ్వకాలు జరుపుతున్నారు. రంగురాళ్ల తవ్వకాలపై స్థానిక ఎస్ఐ పి.దామోదరనాయుడు వద్ద ప్రస్తావించగా రంగురాళ్లు తవ్వుతున్నట్టు గతంలో సమాచారం రావడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తవ్వకాలు జరగకుండా నిఘా ఉంచామన్నారు. ఎక్కడైనా రంగురాళ్ల తవ్వకాలు చేపడుతున్నట్టయితే 9440904224 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. -
బొర్రాలో జోరుగా రంగురాళ్ల తవ్వకాలు
అనంతగిరి:మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల సమీపంలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొర్రా పంచాయతీ పెద్దూరు, నిన్నిమామిడి, జీరుగెడ్డ, కొంట్యాసిమిడి, డెక్కాపురం తదితర గ్రామాల్లో మూడేళ్ల నుంచి రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ దొరికే రాళ్లు నాణ్యమైనవి కావడంతో మైదాన ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గ్రామాల్లో మధ్యవర్తుల సహకారంతో స్థానిక గిరిజనులకు రోజువారి కూలి చెల్లించి మరీ తవ్వకాలు చేపడతున్నారు. గతంలో పోలీసుల దాడుల్లో చేపట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు పడుతుండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతం కావడంతో ఎవరూ పట్టించుకోరనే ధీమాతో వ్యాపారులు స్థానికులతో తవ్వకాలు జరుపుతున్నారు. రంగురాళ్ల తవ్వకాలపై స్థానిక ఎస్ఐ పి.దామోదరనాయుడు వద్ద ప్రస్తావించగా రంగురాళ్లు తవ్వుతున్నట్టు గతంలో సమాచారం రావడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తవ్వకాలు జరగకుండా నిఘా ఉంచామన్నారు. ఎక్కడైనా రంగురాళ్ల తవ్వకాలు చేపడుతున్నట్టయితే 9440904224 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. -
ఇలాంటి ఇళ్లు కట్టడం ఎవరివల్ల కాదేమో!
కోస్టారికా: మంచి ఇళ్లు కట్టుకోవాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దానికోసం ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా శ్రమిస్తారు. సాధారణంగా ఎవరైన మంచి ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇళ్లు కట్టుకోవాలనుకుంటారు. కట్టేముందు ఇంటి చుట్టూ రణగొణ ధ్వనులు లేకపోయినా ఆ తర్వాత జమవుతాయి. అప్పుడు అంతకుముందు మనం ఎంతో ఇష్టపడే ఆ ఇంటిపై కొంచెం ప్రేమ తగ్గిపోతుంది. కానీ, ఏ మాత్రం రణగొణ ధ్వనులకు అవకాశం లేకుండా.. ఏ అంశానికి తమను ఇబ్బంది పెట్టే ఛాన్సే ఇవ్వకుండా ఇళ్లు కట్టుకోగలిగితే.. అది కూడా భూమిపైన కాకుండా భూమిలోపల అయితే.. మరీ ముఖ్యంగా ఓ భారీ అగ్నిశిలను తవ్వి నిర్మించుకుంటే.. కోస్టారికాలో ఇదే జరిగింది. మాన్యుయెల్ బారెంట్స్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నేండేళ్లు శ్రమించి 63 అడుగుల లోతు భూగర్భంలో ఓ విశాల నివాస సముదాయాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. మూడు బెడ్ రూములు, ఒక లివింగ్ రూమ్, యోగా చేసుకునే హాల్, ఇతర అవసరాలకు పనికొచ్చేలా పుష్కర కాలం కష్టపడి సొంత నివాసం నిర్మించుకున్నాడు. బయట నుంచి చూసేందుకు అదొక పెద్ద గుహలాగా కనిపించినా ఒక్కసారి లోపలికి అడుగుపెట్టారంటే అబ్బురపడిపోవాల్సిందే. అచ్చం టూరిస్టు ప్రాంతాల్లో ఏర్పాటుచేసినట్లే ఆ నివాసంలో ఏది ఎటువైపు, ఎక్కడ అనే వివరాలతో భాణం గుర్తులతో సూచిస్తూ రాసిపెట్టి ఉంచాడు. అంతేకాదు తన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఓ సీసీటీవీని కూడా ఏర్పాటుచేశాడు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు...
వైఎస్సార్ జిల్లా: గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకాలు చేపడుతున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సభ్యులు సహా ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బుడ్డాయపల్లి గ్రామ చెరువులో గుప్త నిధులున్నాయనే నెపంతో కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. దీన్ని గమనించిన స్థానికులు తహశీల్దార్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ రవి చెరువులో అక్రమంగా గుంటలు తీస్తున్న ఇద్దరు వ్యక్తులతో సహా ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకున్నారు.