వైఎస్సార్ జిల్లా: గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకాలు చేపడుతున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సభ్యులు సహా ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బుడ్డాయపల్లి గ్రామ చెరువులో గుప్త నిధులున్నాయనే నెపంతో కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. దీన్ని గమనించిన స్థానికులు తహశీల్దార్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ రవి చెరువులో అక్రమంగా గుంటలు తీస్తున్న ఇద్దరు వ్యక్తులతో సహా ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకున్నారు.