treasure
-
‘గోల్డెన్’ హీరోనా రాబరీ విలనా?
సినిమాల్లో, కథల్లో రాజుల కాలం నాటి గుప్త నిధుల కోసం అన్వేషిస్తుంటారు. ఎన్నో కష్టాలు అనుభవించి నిధిని కనుగొంటారు. ఆ సంపదతో గొప్పవాళ్లుగా మారిపోతుంటారు. ఇదీ అలాంటిదే. కానీ నిజంగా జరిగిన కథ. సముద్రంలో టన్నులకొద్దీ బంగారంతో మునిగిపోయిన ఓడను కనిపెట్టినా.. జైలులో మగ్గుతున్న ఓ ఆధునిక ‘ట్రెజర్ హంటర్’వ్యథ. చివరికి ఓ న్యాయమూర్తి తీర్పుతో త్వరలో విడుదల కాబోతున్న బంగారం నిధి వేటగాడు, శాస్త్రవేత్త ‘టామీ గ్రగరీ థాంప్సన్’గాథ. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఓ నిధి వేటగాడి నిజమైన కథ..అది 1857వ సంవత్సరం.. సుమారు 21 టన్నుల బంగారం తీసుకుని ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా అనే ఓడ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ తుఫానుతో సముద్రం మధ్యలోనే ఓడ మునిగిపోయింది. ‘షిప్ ఆఫ్ గోల్డ్’గా పేరుపొందిన ఆ ఓడ, దానిలోని బంగారం కోసం ఎందరో అన్వేషిoచినా జాడ దొరకలేదు. అలా బంగారం వేటకు దిగినవారిలో శాస్త్రవేత్త టామీ గ్రెగరీ థాంప్సన్ నేతృత్వంలోని బృందం ఒకటి. అప్పటికే కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న థాంప్సన్.. 1988లో సోనార్ సాయంతో సముద్రం అడుగున జల్లెడ పడుతుండగా ‘షిప్ ఆఫ్ గోల్డ్’జాడ పట్టేసుకున్నాడు. బంగారం కరిగించి నాణాలుగా మార్చి..అమెరికాలోని కొందరు ధనికులు థాంప్సన్ పరిశోధనకు స్పాన్సర్ చేశారు. నిధి దొరికితే ఎవరి వాటా ఎంతెంత అని ముందే ఓ మాట అనుకున్నారు. 1988లో ఓడ జాడ దొరికినా.. బంగారం నిధిని రూఢీ చేసుకుని, వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టింది. బయటికి తీసిన బంగారాన్ని కరిగించి నాణాలుగా మార్చారు. అలా మార్చిన బంగారు నాణాల్లో 500 నాణాలు మాయమయ్యాయి. అది చేసినది థాంప్సన్. వాటిని ఏం చేశాడు? తీసుకెళ్లి.. రెండు అమెరికా ఖండాల మధ్య ఉండే ‘బెలిజ్’అనే చిన్న దేశంలో ఓ ట్రస్టుకు దానమిచ్చాడు. అంతే అంతకన్నా ఒక్కముక్క కూడా బయటపెట్టలేదు. పదేళ్లుగా జైల్లోనే.. త్వరలోనే విడుదల.. అధికారులు 2015లో థాంప్సన్‌ను జైల్లో పెట్టారు. నాణాల జాడ చెప్పనంత కాలం.. రోజుకు వెయ్యి డాలర్లు (సుమారు రూ.87 వేలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సుమారు పదేళ్లుగా థాంప్సన్ జైల్లోనే ఉన్నారు. ఆయన చెల్లించాల్సిన జరిమానా.. 33,35,000 డాలర్లకు (మన కరెన్సీలో రూ.29 కోట్లకు) చేరింది. ఆయన మాయం చేసిన బంగారు కాయిన్ల విలువ 2.5 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.22 కోట్లు)గా అంచనా వేశారు. థాంప్సన్ పదేళ్లుగా జైల్లోనే ఉన్నారు. వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఆయన మాయం చేసిన బంగారం విలువ కంటే.. చెల్లించాలన్న జరిమానానే చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఓ న్యాయమూర్తి థాంప్సన్‌ను విడుదల చేయాలని తాజాగా తీర్పు ఇచ్చారు. కానీ తన పరిశోధనకు స్పాన్సర్ చేసిన ధనికులు పెట్టిన ఓ క్రిమినల్ కేసులో థాంప్సన్ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. ఆ తర్వాతే బయటికొస్తాడన్నమాట. ఆ బంగారం ఎవరికి ఇచ్చినదీ ఇప్పటికీ థాంప్సన్ బయటపెట్టలేదు. ట్రస్టు ద్వారా పేదలకు సాయం కోసం ఇచ్చిన ‘గోల్డెన్’ హీరోనా? సొమ్ము దోచేసుకున్న విలనా? -
1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!
మరో పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు దక్షిణ అమెరికా దేశంలోని పనామా సిటిలో బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధి తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్‌కి గురయ్యారు. ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చింది. సమాధిలో పెద్ద ఎత్తున బంగారు నిధి తోపాటు చాలా మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. ఇది అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. ఆ సమాధిలో బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువు ఉన్నాయని పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో వివరించారు. అందులో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అప్పటి ఆచారం ప్రకారం..ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతి పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఆ వ్యక్తుల సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పురావస్తు శాఖ డైరెక్ట్ డాక్టర్ జూలియా. కాగా, సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైనదని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లినెట్ మెంటోనెగ్రో చెబుతున్నారు. View this post on Instagram A post shared by Fundación Ciudad del Saber (@ciudaddelsaber) (చదవండి: ప్రపంచంలోనే తొలి బంగారు నౌక..ప్రయాణించాలంటే కోట్లు వెచ్చించాల్సిందే..!) -
బొగ్గు గని తవ్వకాల్లో అద్భుత ఖజానా..
అప్పుడప్పుడు తవ్వకాల్లో లభ్యమయ్యే పురాతన వస్తువులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అమెరికాలోని నార్త్ డకోటాలో జరిపిన తవ్వకాల్లో ఒక కార్మికుడు అత్యంత పురాతన కాలానికి చెందిన అతిపెద్ద ఏనుగు దంతాన్ని కనుగొన్నాడు. పూర్వీకులు దీనిని మముత్ అని పిలిచేవారు. ఈ దంతం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. ఉత్తర డకోటా నగరంలోని ఒక గనిలో జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన ఏనుగు దంతం బయటపడింది. గనిలో జరుగుతున్న పనుల్లో పాల్గొన్న ఒక కార్మికుడు దాదాపు రెండు మీటర్ల పొడవైన తవ్వకం జరిపినప్పుడు ఈ అతిపెద్ద దంతం బయటపడింది. ఇది 10 వేల నుంచి లక్ష ఏళ్ల క్రితం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. యూఎస్‌లోని ఉత్తర డకోటా గనులలో కొన్ని మిలియన్ టన్నుల లిగ్నైట్ బొగ్గును వెలికితీస్తారు. ఈ బొగ్గు గనిలోనే ఈ అమూల్యమైన నిధి దొరికింది. ఈ బొగ్గు గనుల్లో ఇంతకాలం భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్పుడు ఇంత విలువైన ఏనుగు దంతం దొరకడంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్లు మనుగడ సాగించిన కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగులు భూమిపై ఉండేవని పరిశోధకులు కనుగొన్నారు. ఆ ఏనుగులను మముత్లు అని పిలిచేవారు. ఇప్పుడు నాటికాలపు ఏనుగు దంతం బయల్పడటం విశేషం. దీనిని అద్భుతమైన ఆవిష్కరణగా నిపుణులు పరిగణిస్తున్నారు. అమెరికాలోని ఉత్తర డకోటాలోని బొగ్గు గనిలో దొరికిన మముత్ ఏనుగు దంతం బరువు 22 కిలోలకు మించి ఉంది. శాస్త్రవేత్తలు మముత్ ఏనుగు దంతాన్ని తదుపరి పరిశోధన కోసం సురక్షితంగా భద్రపరిచారు. కాగా ఈ ఏనుగుదంతాన్ని వెలికితీసిన బొగ్గు గని కార్మికుడు భారీ మొత్తంలో సొమ్ము అందుకోనున్నాడనే ప్రచారం జరుగుతోంది. -
136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధి..పోలీసులకు అప్పగించిన కూలీ
ఒక దినసరి కూలీ 136 ఏళ్ల బ్రిటీస్ కాలం నిధిని పోలీసులకు అప్పగించాడు ఓ కార్మికుడు. అయితే అతను తన స్థలం నుంచి చెప్పకుండా పట్టుకెళ్లాడని ఆరోపించింది ఆ భూ యజమాని. విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లితే మరో విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రధేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలీ కి ఓ ఇంటి కింద 136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధిని కనుగొన్నాడు. ఆ కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హలీ అహిర్వార్లోని దామోహ్ జిల్లాలోని ఇంటి తవ్వకంలో ఈ నిధిని గుర్తించాడు. అందులో సుమారు 240 వెండి నాణేలను కనుగొన్నాడు. వాటి విలు సుమారు రూ. 1.92 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆ కూలీ తొలుత తన ఇంటికి తీసుకెళ్లి.. చివరికి బాగా ఆలోచించి పోలీసులకు అప్పగించేశాడు. ఐతే ఆ స్థలం యజమానురాలు మీనాక్షి ఉపాధ్యాయ్ మాత్రం ఆ నిధిని తన స్థలంలోనే బయటపడిందని, ఆ కూలి తనకు చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు చేసింది. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపి వేయించారు. పురావస్తు శాఖకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ నాణేలను అప్పగించారు. అంతేగాదు ఆ స్థలంలో తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ..అక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు గుర్తించింది. అక్కడ ఇంకా తవ్వకాలు జరిపి నిశితంగా దర్యాప్తు చేస్తే.. విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉందంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, ఎవరైనా పురాతన వస్తువు లేదా నిధిని కనుగొన్న వ్యక్తి దానిని 24 గంటలలోపు భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ లేదా అధీకృత అధికారికి నివేదించాలి. అలా చేయనట్లయితే ఆ వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. (చదవండి: దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్‌గేమ్': న్యాయశాఖ మంత్రి) -
రెండోసారి డీఎంకే చీఫ్‌గా స్టాలిన్!...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ జరిగింది. ఇటీవలే కొత్తగా ఏర్పడిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే స్థాలిన్‌ని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. అలాగే పార్టీ నేతలు దురైమరుగన్, టీఆర్ బాలులు కూడా జనరల్ సెక్రటరీ, ట్రెజరీ అధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు నేతలు కూడా వరసగా రెండోసారి పార్టీ అత్యున్నత పదవులను చేపట్టడం విశేషం. అంతేగాదు కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన స్టాలిన్‌కి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డీఎంకే పార్టీ 15వ సంస్థగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీ పదవులకు ఎన్నికలు జరిపిన తర్వాత ఆ ముగ్గురు నేతలని పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అంతేగాదు డీఎంకే పార్టీ పితామహుడు, దివగంత ఎం కరుణానిధిన్ హయాంలో స్టాలిన్ కోశాధికారిగా, యువజన కార్యదర్శిగా పలు పదవులను చేపట్టారు. 2018లో కరుణానిధి మరణాంతరం స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యారు. అంతేగాదు 1969లో తొలిసారిగా సృష్టించిన పార్టీ అధ్యక్షుడి పదవికి కరుణానిధే తొలి అధ్యక్షుడయ్యారు. అంతకు ముందు వరకు పార్టీ కార్యదర్శి పదవే అత్యున్నత పదవి. 1949లో ఏర్పాటైన డిఎంకే పార్టీకి అన్నాదురై పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చనిపోయేంత వరకు ఈ అత్యున్నత పదవిలోనే కొనసాగారు. (చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్) -
శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా...బయటపడ్డ నిధి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా కోటి రూపాయాలు విలువ చేసే నిధి బయటపడింది. ఐతే ఆ నిధిని సదరు ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలే పంచుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ధార్ సమపంలోని నల్చా దర్వాజా చిట్నీస్ చౌక్‌లోని ఇంట్లో ఎనిమిది మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు ఆ ఇంటిలో పని నిమిత్తం తవ్వకాలు జరుపుతుండగా ఒక గోడ నుంచి కోటీరూపాయల పైనే విలువ చేసే నిధి బయటపడింది. ఆ నిధిలో సుమారు 103 పురాతన నాణేలు, పాత బంగారు ఆభరణాలను సదరు కార్మికులు పంచుకున్నారు. ఐతే అందులో ఒక కార్మికుడు తన వాటా నిధిలోని బంగారు నాణాలను ఉపయోగించి తన అప్పులను తీర్చకోవడమే కాకుండా బైక్‌ని కొనుగోలు చేయండం వంటివి చేశాడు. దీంతో పోలీసులు అనుమానించి ఆ కార్మికుడుని విచారించగా అసలు విషయం బయటపడింది. వాస్తవానికి ఆ ఇల్లు శివనారాయణ రాథోడ్‌కి చెందినది. అతని ఇల్లు రెండు భాగాలు నిర్మించబడి ఉంది. అందులో ఒక భాగంలో సదరు యజమాని కుటుంబం ఉంటుంది. మరోక భాగంలో ఇంటి పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ఇంటిలోనే ఈ నిధి బయటపడింది. కానీ వారు ఈ విషయాన్ని యజమానికి చెప్పకుండా చాలా జాగ్రత్తపడ్డారు. దీంతో పోలీసులు సదరు కూలీల నుంచి ఆ నిధిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: బెలూన్‌లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి) -
నిధి అంటూ దంపతులకు బురిడీ
యశవంతపుర: నిధి ఆశ చూపి దంపతులకు రూ. 5 లక్షలు మోసం చేసి దొంగస్వామి అదృశ్యమైన ఘటన హాసన్ జిల్లాలో చోటు చేసుకుంది. తాలూకాలోని దొడ్డహళ్లి గ్రామానికి చెందిన గౌడకు గ్రామంలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో నిధి ఉందంటూ మంజేగౌడ అనే దొంగస్వామి నమ్మించాడు. దైవశక్తితో బయటకు తీస్తానంటూ ముందుగానే మూడు కేజీల బంగారు పూత పూసిన బంగారు విగ్రహాన్ని పాతి పెట్టాడు. మొదట భూమి యజమాని గౌడ–లీలావతి దంపతులు పూజ చేస్తే బయటకు తీస్తానని చెప్పి వారి భూమిలో పాతి పెట్టిన నకిలీ పసిడి విగ్రహాన్ని బయటకు తీసి దంపతులకు ఇచ్చాడు. విగ్రహానికి రక్తాభిషేకం చేయాలని చెప్పి లీలావతి వేలును కోశాడు. దీంతో వేలు తెగిపోయింది. వారం రోజుల తరువాత గౌడ దంపతులు విగ్రహాన్ని తీసుకుని బంగారు షాపులో పరీక్షించగా అది వెండిదిగా తేలింది. అంతకు ముందే స్వామీజీ రూ. 5 లక్షల తీసుకుని పరారయ్యాడు. వేలు తెగిపోవడంతో లీలావతి ఆస్పత్రి పాలైంది. అయితే ఈ ఘటనపై ఇంత వరకు కేసు నమోదు కాలేదు. (చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్లో మాట్లాడుతుంటే చూసి..) -
34 ఏళ్లు.. లక్షన్నర కోట్ల నిధి!
జానపద కథల నుంచి మొన్నటి కేజీఎఫ్దాకా గుప్తనిధుల సినిమాలంటే జనంలో క్రేజ్ అంతాఇంతా కాదు. దాన్ని దక్కించుకోవడం కోసం జరిగే పోరును ఆసక్తికరంగా చూస్తారు. నిధుల గురించిన సమాచారం అంటే ఆత్రుతగా ఉంటుంది. ఆసక్తి, ఆత్రుత ఓకే. కానీ ఆ నిధులను గుర్తించడం కోసం జీవితంలో విలువైన 34 ఏళ్లు కేటాయించడమంటే.. ఊహించడానికే కష్టంగా ఉంది కదా! ఆ కష్టమైన పనిని ఇష్టంగా చేయడానికి కారణం ఆ నిధి విలువ అక్షరాలా లక్షన్నర కోట్లు. అన్వేషణ కొనసాగిస్తున్న టీమ్ ‘టెంపుల్‌ట్వెల్వ్’. మూడు దశాబ్దాలుగా ఈ ‘లెమ్మిన్‌కినెన్ హోర్డ్’ కోసం వేటను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఆ రహస్య నిధికి దగ్గర్లోనే ఉన్నామని తాజాగా వెల్లడించిందీ బృందం. ఎవరీ లెమ్మిన్‌కినెన్? ఫిన్నిష్ పురాణాల్లో ప్రముఖ వ్యక్తి లెమ్మిన్‌కినెన్. ఆయన మీద అనేక పురాణగాథలు, కావ్యాలున్నాయి. ఫిన్లాండ్ రాజధాని హేల్సింకికి 20 మైళ్ల దూరంలో ఉన్న సిబ్బోస్బర్గ్ గుహల్లో ఆయన పేరుతో దేవాలయం ఉందట. అందులోనే లెమ్మిన్కినెన్కు సంబంధించిన నిధులు ఉన్నాయట. అయితే, ఆ నిధులకు సంబంధించిన ఆనవాళ్లను లెమ్మిన్‌కినెన్ వారసుడు యోగి ఓర్బాక్ 1987లో తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించాడు. ఆ భూమి వారసత్వంగా తమ పూర్వీకుల నుంచి తనకు వచ్చిందని ఆ ప్రాంతంలో గుప్త నిధులున్నాయని తెలిపాడు. గుడి ద్వారానికి అడ్డుగా పెద్దపెద్ద బండరాళ్లుపెట్టారని, నాటినుంచి ఆ నిధులకు రక్షకులం తామేనని చెప్పాడు. ఈ నేపథ్యంలో పై వివరాలతో కార్ల్ బోగన్ రాసిన పుస్తకంలోని సమాచారం ఆధారంగా అన్వేషణ మొదలైంది. లక్షల కోట్ల సంపద!? నిజానికి అక్కడ నిధులున్నాయని ఆధారాలేం లేవు. అయినా ‘ప్రపంచంలోనే అతిపెద్ద నిధి’గా పిలువబడే దీని విలువ లక్షన్నర కోట్లకుపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. నిధుల్లో 50వేల దాకా కెంపులు, పగడాలు, నీలమణులు, వజ్రాలు, మరో వెయ్యి అద్భుత కళాఖండాలు ఉంటాయని వారి నమ్మకం. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన మానవ విగ్రహాలు కూడా ఉన్నాయని విశ్వాసం. బాక్తోపాటు 1987లో ‘టెంపుల్‌ట్వెల్వ్’ బృందం ఆ నిధుల కోసం వేట మొదలుపెట్టింది. దాతల సహాయంతో తవ్వకాలు జరుపుతోంది. ట్యునెలా నది తీరాన ఉన్న ఈ పర్వత ప్రాంతంలో చలికాలంలో మంచు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. వేసవిలో కరిగి ఆ నీరు గుహ అంతా నిండిపోతుంది. వేసవి దాకా ఎదురుచూసి పదిహేను లక్షల లీటర్ల నీటిని తోడేసి... తవ్వకాలు జరుపుతున్నారు. ముప్పై ఏళ్లుగా.. ఏటా ఇదే తంతు. ‘టెంపుల్ ట్వెల్వ్’ అంటే ఏమిటి? ఒకే భావజాలాలు కలిగిన పన్నెండుమంది మహిళలు, పన్నెండు మంది పురుషులతో మొదలైందీ ‘టెంపుల్ ట్వెల్వ్’ బృందం. ఈ మూడు దశాబ్దాల్లో కొందరు చనిపోయారు. కొందరు రిటైర్ అయ్యారు. పాతవాళ్లు ఇద్దరే మిగిలారా బృందంలో. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు చేరుతున్నారు. ఇదిలా ఉండగా లెమ్మిన్‌కినెన్ యజమాని ఓర్ బాక్ 2010లో తన వ్యక్తిగత సహాయకుని చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సంబంధం ఉందని ఇద్దరు భారతీయులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ఇద్దరూ విడుదలయ్యారు. అయితే ఈ హత్యకు కారణాలేమీ తెలియలేదు. దానికంటే ముందు పెనుగులాట జరిగిందని వైద్య నివేదిక తెలిపింది. కొన్ని నెలల్లో ముగింపు.. 34 ఏళ్ల ప్రయత్నాలు ఫలించాయని, ఆ నిధికి ఇంకా కొన్ని నెలల దూరంలోనే ఉన్నామని చెబుతోంది బృందం. గుడి ద్వారానికి అడ్డంగా ఉన్న పెద్ద బండరాయిని తొలగిస్తే అందులో ఉన్న నిధులు తమ చేతికొస్తాయని ఈ బృందం చెబుతోంది. ‘34 ఏళ్ల అన్వేషణకు ఇంకొన్ని నెలల్లో ముగింపు వస్తుంద’ని బృందానికి నేతృత్వం వహిస్తున్న బోరెన్ తెలిపారు. -
అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!
ఫిన్ల్యాడ్: మనం చాలా నిధుల గురించి విని ఉంటాం అయితే ఈ ఫిన్ల్యాండ్లోని లెమ్మిన్కైనెన్ అనే నిధి నిక్షేపం కోసం 30 ఏళ్లుగా పరిశోధిస్తునే ఉన్నారంటా. అంతేకాదు ఈ లెమ్మిన్కైనెన్ అనే నిధి కోసం "ట్వెల్వ్ టెంపుల్" పేరుతో పన్నెండు మంది బృందం 1987 నుండి అన్వేషిస్తోందట. (చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !) పైగా ఈ నిధిలో 1500 కోట్లు పైన ఉండచ్చని భావిస్తున్నారు. అంతేకాదు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వజ్రాలు, నీలమణులు, పురాతన కళాఖండాలు వంటివి 50వేలుకు పై చిలుకే ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వెయ్యేళ్లనాటి నిధిని చేధించేందకు ఈ పన్నెండు బృందాలు 30 ఏళ్లుగా అన్వేషిస్తునే ఉంది. ఈపరిశోధనల్లో భాగంగా వాళ్ల చాలా కష్ట నష్టాలను చవిచూశారు. అయితే ఇంతవరకు ఎవరు ఈ నిధిని కనుగొన లేకపోయారు. ఈ మేరకు ఆ పన్నెండు మంది బృందం తాము కొద్ది దూరంలో ఉన్నామని త్వరలోనే ఈ నిధిని కనుగొన గలమంటూ విశ్వాసం వ్యక్తం చేసింది. లెమ్మిన్కైనెన్ నిధి అన్వేషణాధికారి మాట్లాడుతూ...గణనీయమైన పురోగతి సాధించాం. త్వరలోనే మా బృందం ఆ నిధిని గుర్తించ గలదు" అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు) -
గుప్త నిధులు దొరికితే.. అవి ఎవరికి చెందుతాయి
ఒకొక్కసారి తవ్వకాల్లో గత చరిత్ర తాలూకు గుప్త నిధులు బయటపడుతుంటాయి. అలా దొరికిన గుప్త నిదులపై ఎవరికీ అధికారం ఉంటుంది అనే దానిపై ఎక్కువ చర్చ జరుగుతుంది. తాజాగా తెలంగాణలోని జనగామ మండలం పెంబర్తి శివారు టంగుటూరు క్రాస్ రోడ్డు 399, 409 సర్వే నంబర్లోని 11.06 గుంటల భూమిలో నిన్న లంకెబిందెలు బయటపడ్డాయి. ఈ లంకె బిందెలో 18.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి ఆభరణాలు, ఏడు గ్రాముల పగడాలు ఉండడంతో ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి కలెక్టరేట్‌కు తరలించారు. ఇలా బయటపడిన గుప్త నిధులు ఎవరికి చెందుతాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చేనీయాంశమైంది. అసలు ఇలా గుప్త నిధులు దొరికితే ఎవరికీ చెందుతాయి అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..! భూమిలోపల దొరికిన ఎలాంటి నిధిపైన అయిన సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి జాతి వారసత్వ సంపద అయితే ప్రభుత్వానికే చెందుతుంది. అటువంటి దానిపై ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దీనికి సంబందించి 1878లో ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ని స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఈ చట్టాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అమలు చేస్తుంది. భూమిలో లభ్యమైన గుప్తనిధులు చారిత్రక వారసత్వ సంపదకు చెందితే రాయి నుంచి రత్నాల దాకా ఏది దొరికినా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాటిని స్వాధీనం చేసుకుంటుంది. ఎక్కడైనా నిధి దొరికిందని సమాచారం తెలియగానే స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్‌కు అధికారులు అప్పగిస్తారు. అప్పుడు ఆ నిధి వారసత్వ సంపదా? లేదా వారి పూర్వీకులు దాచారా? అనేదానిపై కలెక్టర్ విచారణ జరుపుతారు. ఆ సంపద భూ యజమానులు పూర్వీకులదైతే దాని వారసులెవరన్న దానిపై విచారణ చేసి సంపదను వాటాలుగా విభజించి కలెక్టర్ ఆ సంపదను పంచుతారు. ఒకవేల దొరికిన నిది జాతీయ సంపద అయితే, దొరికిన గుప్త నిధిలో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు. ఆ భూమిని యజమాని కాకుండా వేరొకరు సాగుచేస్తుంటే ప్రత్యేక నిబంధన ప్రకారం కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా ఇస్తారు. గుప్తనిధి లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయకపోతే సదరు వ్యక్తులు శిక్షార్హులు. నిధి ఇవ్వకుండా తీసుకోవాలని చూస్తే సదరు వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా రెండు విధిస్తారు. పెంబర్తిలో దొరికింది జాతీయ సంపద కనుక ప్రభుత్వానికి ఆ నిధి చెందుతుంది. చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. 5 కిలోల బంగారం!? -
జనగామ: బయటపడ్డ లంకె బిందె.. 5 కిలోల బంగారం!?
సాక్షి, జనగామ: వెంచర్ ఏర్పాటు కోసం భూమిని చదును చేస్తుండగా బంగారు, వెండి ఆభరణాలతో కూడిన లంకె బిందె బయటపడింది. ఐదు కిలోల బరువైన బిందె బయటపడగా, అందులో మూడు కిలోలకుపైగా మట్టి ఉంది. మిగతా బంగారు, వెండి ఆభరణాలు ఉండగా, అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ట్రెజరీకి తరలించారు. శుక్రవారం నుంచి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాక, హైదరాబాద్‌లో పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తొలుత ఇవి నిజాం కాలం నాటి ఆలయాల్లోని ఆభరణాలుగా ప్రచారం జరిగినా, పురావస్తు శాఖ అధికారులు మాత్రం 50 ఏళ్ల క్రితం నాటివేననే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. వెంచర్ కోసం భూమి కొనుగోలు జనగామ మండలం పెంబర్తి శివారు టంగుటూరు క్రాస్ రోడ్డు 399, 409 సర్వే నంబర్లోని 11.06 గుంటల భూమిని సంకటి ఎల్లయ్య, ప్రవీణ్, నర్సయ్య. పర్శరాములు, దేవరబోయిన యాదగిరి, రాంచందర్, సత్తెయ్య తదితరులు ఇటీవల అమ్మారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామానికి చెందిన మెట్టు నర్సింహ, దుర్గాప్రసాద్, నాగరాజులు ఈ భూమిని కొనుగోలు చేయగా, కొంతమొత్తంలో నగదు అందజేసి వెంచర్ కోసం బుధవారం పనులు ప్రాంభించారు. తొలుత జేసీబీ సాయంతో భూమిలో ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా చిన్న బిందె కనపడటంతో పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ గురువారం ఉదయం పనులు ప్రారంభించగానే ఆ బిందె పగిలి అందులో నుంచి ఆభరణాలు బయటపడడంతో గుప్త నిధులుగా భావించి పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అదనపు కలెక్టర్ ఎ.భాస్కరరావు, ఏసీపీ వినోద్ కుమార్, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు అమ్మవారి అలంకరణ నగలని కొందరు.. రాగి బిందెలో బయటపడిన బంగారం, వెండి ఆభరణాలు అమ్మ వారికి అలంకరణ కోసం ఉపయోగించిన నగలుగా, మొత్తంగా 5 కిలోల బంగారం బయల్పడినట్లుగా తొలుత ప్రచారం జరిగింది. నిజాం కాలం నాటి ఆభరణాలుగా మరికొందరు చెప్పుకొచ్చారు. స్వర్ణకారుడు మాచర్ల బాలకృష్ణను పిలిపించి పంచనామా చేయించగా.. 18.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి ఆభరణాలు, ఏడు గ్రాముల పగడాలు ఉండడంతో ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి కలెక్టరేట్‌కు తరలించారు. హారాలు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు, నాగపడిగెలు, పూజలు చేసే సమయంలో చేతి వేళ్లకు పెట్టుకునే శివలింగంతో కూడిన ఉంగరాలు ఈ ఆభరణాల్లో ఉన్నాయి. వీటిని చూసేందుకు అనేక గ్రామాల నుంచి వందలాది మంది తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు జిల్లా కలెక్టర్ కె.నిఖిల వాటిని పరిశీలించిన అనంతరం, వరంగల్ అర్బన్ జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేందుకు పోలీసు బందోబస్తు మధ్య పంపించారు. అంతకుముందే హైదరాబాద్ నుంచి పురావస్తు శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్ తదితరులు తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలింన అనంతరం కలెక్టర్‌తో సమావేశమయ్యారు. అక్కడ ఆభరణాలను పరిశీలించి ఇవి యాభై ఏళ్ల క్రితం నాటివేనని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. స్థానికుల్లో స్థితిమంతులెవరైనా వీటిని తమ పిల్లల కోసం దాచి పెట్టి ఉంటారనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చదవండి: బయటపడ్డ 1100 ఏళ్ల నాటి బంగారు నాణేలు -
బాధితుడే నిందితుడిగా మారిన వైనం
సాక్షి, గచ్చిబౌలి: ఇంట్లో ఉన్న బంగారు నిధిని తంత్ర పూజలతో బయటకు తీస్తామని నమ్మించి, ఇత్తడిని పుత్తడిగా చూపించి అందినకాడికి దండుకున్న ఓ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కాగా, ఈ ముఠా చేతిలో మోసపోయిన ఓ బాధితుడు కూడా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి మరో వ్యక్తిని దగా చేసి పోలీసులకు చిక్కాడు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో గురువారం కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం... ⇔ ఓల్డ్ మల్లేపల్లి నివాసి సయ్యద్ దస్తగిరి అహ్మద్(65) ఆర్ఎంపీ డాక్టర్. తన క్లినిక్‌కు వచ్చేవారి తో తనకు బ్లాక్ మ్యాజిక్ పవర్ ఉందని నమ్మబలికి 15 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. ⇔ మిరాలం మండికి చెందిన మిర్జా అబ్బాస్ అలీ సాజద్ రియల్టర్. తమ ఇంట్లో నిధి ఉందని, బయటకు తీయకపోతే ఇంట్లోవారు చనిపోతారని రోజూ తన తల్లి కల కంటోందని సాజద్ ఛత్తాబజార్‌కు చెందిన తన స్నేహితుడు అలీ అక్బర్ తయాబికి చెప్పాడు. ⇔ అతను చార్మినార్ ఇరాన్‌గల్లీకి చెందిన షేక్ హఫీజ్, యాకుత్‌పురాకు చెందిన అబ్దుల్ ఫయీమ్‌ను పరిచయం చేయగా, వారు ఓల్డ్ మల్లోపల్లిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దస్తగిరి వద్దకు తీసుకెళ్లారు. ⇔ సాజద్ ఇంటికి వెళ్లిన డాక్టర్ దస్తగిరి మీ తల్లికి వచ్చే కల నిజమేనని, శాంతిపూజలు చేస్తే నిధి బయటకు వస్తుందని, పూజకు రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు. ⇔ ఇంట్లో ఐదుచోట్ల గుంతలు తవ్వించాడు. ఇంటి యజమాని సాజద్ కళ్లుగప్పి బంగారు పూత పూసిన ఇత్తడి బిస్కెట్లను గంతుల్లో వేసి మట్టితో కప్పేశాడు. ⇔ ఆ తర్వాత ఒక రోజు హఫీజ్, అక్బర్ తయాబ్, అబ్దుల్ ఫయూమ్‌లతో కలిసి సయ్యద్ దస్తగిరి పూజ చేసేందుకు సాజద్ ఇంటికి వెళ్లాడు. ⇔ పూజ చేసిన అనంతరం ముగ్గురూ గుంతలో వెతికినట్టు నటించి బంగారం కనిపించిందని చెప్పారు. తాము చెప్పినప్పుడే మూట విప్పాలని, లేకపోతే బంగారం మీకు దక్కదని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. ⇔ కొద్ది రోజుల తర్వాత గుంతలో చూడగా బంగారు బిస్కెట్లు కనిపించాయి. వాటిని పరిశీలించగా నకిలీవి అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన సాజద్ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. మోసపోయి... ⇔ రూ. 3 లక్షలు ఖర్చు చేసి మోసపోయానని గ్రహించిన సాజద్ తన స్నేహితుడు అలీ అక్బర్ తయాబితో కలిసి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని చెప్పి ఇత్తడి బిస్కెట్లను అమ్మాలని నిర్ణయించాడు. ⇔ తమ వద్ద ఆరు కిలోల బంగారం ఉందని, రూ. 40 వేలకే తులం ఇచ్చేస్తామని ఓ వ్యక్తికి చెప్పారు. ⇔ అతడి వద్ద రూ. 50 వేలు అడ్వాన్స్‌గా తీసుకొన్న వీరు కావాలంటే పరీక్షించుకోవాలని 200 గ్రాములున్న ఇత్తడి బిస్కెట్‌ను ఇచ్చారు. అతడు దానిని పరీక్ష చేయించుకోగా, ఇత్తడిదని తేలింది. ⇔ దీంతో బాధితుడు రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈకేసులో నిందితుడు సాజద్ కూడా బాధితుడేని తేలింది. ⇔ సాజద్‌తో పాటు సయ్యద్ దస్తగిరి అహ్మద్, షేక్ హఫీజ్, అలీ అక్బర్ తయాబిలను అరెస్టు చేయగా అబ్దుల్ ఫయీమ్ పరారీలో ఉన్నాడు. ⇔ నిందితుల నుంచి 5.85 కిలోల బంగారు పూత పూసిన 11 ఇత్తడి బస్కెట్లు, 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ⇔ తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెబితే నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ సూచించారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్, ఏసీపీ సంజీవరావు, సీఐ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..
సాక్షి, చెన్నై: ఆలయ పునరుద్ధరణ పనుల్లో లభించిన నిధి తమకే సొంతం అని ఉత్తర మేరు గ్రామస్తులు తేల్చారు. ఆ నిధిని అప్పగించాలని అధికారులు పట్టుబట్టినా, గ్రామస్తులు ఏ మాత్రం తగ్గలేదు. కాంచీపురం జిల్లా ఉత్తర మేరు గ్రామంలో పురాతన కులంబేశ్వరర్ ఆలయం ఉంది. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులపై గ్రామస్తులు దృష్టి పెట్టారు. గర్భగుడిలో శనివారం తవ్వకాల సమయంలో సాయంత్రం 561 గ్రాములతో కూడిన ఈ బంగారు నగలు బయట పడ్డాయి. బంగారాన్ని ట్రెజరీకి అప్పగించాలని గ్రామస్తులకు కాంచీపురం జిల్లా కలెక్టర్ మహేశ్వరి ఆదేశాలు జారీ చేశారు. ఆ నిధి తమకే సొంతం అని గ్రామస్తులు ప్రకటించారు. దీంతో ఆదివారం కాంచీపురం ఆర్డీఓ దివ్య నేతృత్వంలో బృందం ఆ గ్రామానికి వెళ్లింది. చదవండి: (సీళ్లు సేఫ్.. బంగారం ‘ఉఫ్’) గ్రామస్తులను బుజ్జగించి ఆ నిధిని ట్రెజరీకి తరలించేందుకు తగ్గ ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్తులు ఏమాత్రం తగ్గ లేదు. ఆ నిధి తమ గ్రామ ఆలయానికి చెందింది అని, దీనిని ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చారు. వందేళ్లకు పైగా చరిత్ర కల్గిన ఈ ఆలయం చోళుల హయాంలో నిర్మించినట్టు, అయితే, ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో లేదని, వంశపారంపర్యంగా గ్రామ పెద్దలే నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు గ్రామస్తులు తేల్చారు. ఈ నిధి తమ ఆలయానికి సొంతమని, తమ ఆలయానికే ఉపయోగిస్తామని తేల్చడంతో పోలీసుల్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఒత్తిడితో వెనక్కి... పోలీసుల్ని రంగంలోకి దించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. తమపై ఒత్తిడి పెరగడంతో గ్రామ పెద్దలు వెనక్కి తగ్గారు. కొందరు అప్పగింతకు వ్యతిరేకించినా, పెద్దలు దిగిరాక తప్పలేదు. అధికారులకు ఓ మెలిక పెట్టారు. నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు ముగిసినానంతరం ఆభరణాలు ఆలయానికే అప్పగించాలని, అంత వరకు ట్రెజరీలో ఉండేలా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం అప్పగించారు. చదవండి: (రజనీ కోసం 28 ఏళ్లుగా ఓటు భద్రం..) -
బయటపడ్డ 1100 ఏళ్ల నాటి బంగారు నాణేలు
జెరూసలేం : వేయి సంవత్సరాల కిందట మట్టి పాత్రలో దాచిన వందలకొద్దీ బంగారు నాణేలను ఇజ్రాయెల్ యువకులు గుర్తించారు. ఈనెల 18న ఈ నిధిని కనుగొన్నారని ఇజ్రాయెల్ పురాతన సంపద అథారిటీ సోమవారం వెల్లడించింది. మధ్య ఇజ్రాయెల్‌లో జరుగుతున్న తవ్వకాల వద్ద ఈ నిధి టీనేజ్ వాలంటీర్ల కంటపడిందని అధికారులు తెలిపారు. దాదాపు 1100 సంవత్సరాల కిందట ఈ బంగారు నాణేలను భూమిలో పాతిపెట్టిన వ్యక్తి వాటిని తిరిగి తీసుకువెళ్లాలని ఆశించాడని, అందుకు ఆ ప్రాంతంలో ఓడను కూడా సిద్ధం చేశాడని ఇజ్రాయెల్ అధికారి లియత్ నదవ్‌జివ్ వెల్లడించారు. ఈ సంపదను తిరిగి తీసుకువెళ్లకుండా అతడిని నిరోధించింది ఏమటనేదే మనం అంచనా వేయగలిగిందని చెప్పారు. అమూల్య సంపదను దాచిన సమయంలో ఆ ప్రాంతంలో వర్క్‌షాపులు ఉండేవని, వాటి యజమాని ఎవరనేది ఇప్పటికీ అంతుబట్టని విషయమని అన్నారు. పురాతన బంగారు నాణేలను కనుగొన్న వాలంటీర్లలో ఒకరైన ఒజ్ కొహెన్ ఇవి అద్భుతంగా ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తవ్వకాల్లో భాగంగా భూమిని తవ్వుతున్న క్రమంలో తాను ఈ బంగారు నాణేలను చూశానని, ఇలాంటి ప్రత్యేక పురాతన సంపదను కనుగొనడం ఉద్వేగంతో కూడిన అనుభవమని చెప్పారు. తొమ్మిదో శతాబ్ధంలో అబ్బాసిద్ కాలిఫేట్ హయాంకు చెందిన 425 నాణ్యమైన 24 క్యారెట్ బంగారు నాణేలు అప్పట్లో చాలా విలువైనవని పురాతన సంపద అథారిటీకి చెందిన నాణేల నిపుణులు రాబర్ట్ కూల్ అన్నారు. ఆ నాణేల విలువతో అప్పట్లో ఓ వ్యక్తి ఈజిప్ట్‌లో అత్యంత విలాసవంతమైన నగరంలో లగ్జరీ హౌస్‌ను కొనుగోలు చేయవచ్చని కూల్ అంచనా వేశారు. చదవండి : ఇజ్రాయెల్‌లో చైనా రాయబారి అనుమానాస్పద మృతి -
చిల్లిగవ్వ లేదు..ఏపీ ఖజానా ఖాళీ!
-
ఎవరూ విప్పని ఓ పొడుపు కథ!
చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు.. ఏమిటది? కన్నీళ్లు.. కిటకిట బండి కిటారి బండి.. ఎందరు కూర్చున్నా విరగని బండి. ఏమిటది? రైలు బండి.. మరి ఇది.. 71, 194, 38, 1701, 89, 76, 11, 83, 1629, 48, 94, 63, 132, 16, 111, 95, 84, 341, 975.............. అర్థం కాలేదా.. 400 కోట్ల ఖజానా తాలూకు తాళం చెవి ఇది.. 200 ఏళ్లుగా వేల మంది ప్రయత్నించినా.. విప్పలేని ఓ పొడుపు కథ ఇది.. ...అనగనగా ఓ గుప్త నిధి.. ఎక్కడో దాస్తారు.. ఎవరికి పడితే వారికి చిక్కకుండా దాని చిరునామా, నిధి వివరాల గురించి సంకేత భాషలో వివరణ.. ఇలాంటి స్టోరీ లైన్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ సహా ఎన్నో చిత్రాలు వచ్చాయి.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా అలాంటి నిధి గురించే.. వందల కిలోల బంగారం, వెండి, వజ్రాలతో కూడిన ఆ నిధి ప్రస్తుత విలువ రూ.400 కోట్లట.. మరి ఆ నిధి.. దానివెనకున్న కథ గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమైనా ఓ 200 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.. మరి వెళ్దాం పదండి.. ...కరెక్టుగా తెలియదు గానీ.. 1800 ఆ మధ్య కాలం.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన సాహసి థామస్ జె బియల్, మరికొందరు వేట కోసమని వెళ్లినప్పుడు మెక్సికో–కొలరాడో సరిహద్దు వద్ద ఉన్న ఓ గనిలో ఈ నిధిని కనుగొన్నారు. తర్వాతి కాలంలో వర్జీనియాకు తెచ్చి..1820 ఆ టైములో బియల్ దాన్ని జాగ్రత్తగా ఓ రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. దాని జాడను కనుగొనేందుకు వీలుగా పలు సంఖ్యలతో కూడిన మూడు సంకేత పత్రాలను రూపొందించాడు. ఆ సంఖ్యల వెనకున్న గుట్టును ఛేదించడానికి ఎంతో మంది ప్రయత్నించారు. ప్రతి సంఖ్య ఓ అక్షరాన్ని లేదా పదాన్ని సూచిస్తుందన్న భావనతో అమెరికా రాజ్యాంగం, మాగ్నా కార్టా, షేక్స్ పియర్ రాసిన పలు నాటకాలతో పోల్చి చూశారు. లాభం లేకుండా పోయింది. తర్వాత అందరూ దాన్ని మరిచిపోయారు. అయితే.. 19వ శతాబ్దంలో ఓ వ్యక్తి అనుకోకుండా బియల్ రెండో సంకేత పత్ర రహస్యాన్ని ఛేదించాడు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనతో దాన్ని పోల్చి చూసినప్పుడు ఈ కోడ్ గుట్టు రట్టయింది. ...అందులో ఏముందంటే.. బెడ్ఫోర్డ్ కౌంటీలో నేను ఆ నిధిని దాచిపెట్టాను. మూడవ పత్రంలో ఇవి ఎవరికి చెందాలన్న వివరాలు ఉన్నాయి. నిధి దాచిపెట్టిన ప్రదేశం బుఫోర్డ్‌కు నాలుగు మైళ్ల దూరంలో ఉంది. కిలోలకొద్దీ బంగారం, వెండి, వజ్రాలు ఉన్నాయి. భూమికి ఆరడుగుల లోతులో భద్రంగా ఇనుప పెట్టెల్లో ఉంచి పాతిపెట్టాను. మొదటి సంకేత పత్రంలో ఈ నిధి కరెక్టుగా ఎక్కడున్నదన్న విషయం ఉంది. కాబట్టి.. దాన్ని కనుగొనడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ...దీంతో మళ్లీ వేట మొదలైంది. మిగతా పత్రాల రహస్యాన్ని ఛేదించాలని చాలా మంది ప్రయత్నించారు. దీనికితోడు వర్జీనియా చట్టాల ప్రకారం భూమిలో నిధులు వంటివి దొరికితే.. కనుగొన్నవారికే అవి సొంతం. దీంతో బెడ్ఫోర్డ్ ఏరియాను జల్లెడ పట్టారు. కొందరైతే.. నిధి జాడ కోసం మంత్రగాళ్లను, ఆధ్మాత్మిక గురువులనూ ఆశ్రయించారు. అర్ధరాత్రి సమయాల్లో వేరేవారి భూముల్లోకి ప్రవేశించి మరీ తవ్వకాలు మొదలుపెట్టారు. కొందరు శ్మశానాలను తవ్వేశారు. అరెస్టులు జరిగాయి. కోట్లలో ఖర్చు చేసి.. అప్పులు పాలైన వారూ ఉన్నారు. అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగింది. సిగ్నల్ ఇంటెలిజెన్సీ సర్వీసు వాళ్లు.. తమ శిక్షణలో భాగంగా బియల్ నిధి జాడను కనుగొనాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించేవారు. దీనిపై పుస్తకాలు వచ్చాయి.. తీసిన షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు అవార్డులూ గెలుచుకున్నాయి. కానీ ఆ నిధిని మాత్రం ఎవరూ గెలుచుకోలేకపోయారు. ...అందరికీ అనుమానాలు మొదలయ్యాయి.. అసలు నిధి ఉందా.. బియల్ అనేవాడు అసలు ఒకడున్నాడా అని.. ఎందుకంటే.. ఈ బియల్ రహస్య సంకేతాల పత్రాలు 1885లో బియల్ పేపర్స్ అంటూ ముద్రించిన ఓ పాంప్లెట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం 1822లో బియల్ ఈ సంకేత పత్రాలు ఉన్న పెట్టెను రాబర్ట్ మారిస్ అనే వ్యక్తికి ఇచ్చాడు. తమ బృందం మరో సాహస యాత్రకు బయల్దేరుతోందని.. 10 ఏళ్ల వ్యవధిలో తాను లేదా తన బృందంలోని ఎవరూ తిరిగి రాకపోతే.. దాన్ని తెరవమని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత సెయింట్ లూయిస్ నుంచి బియల్ మారిస్కు ఓ ఉత్తరం రాశాడు. ఓ వ్యక్తి ఆ పత్రాలకు సంబంధించిన కీని పంపుతాడని బియల్ ఆ ఉత్తరంలో చెప్పాడు. అయితే.. అది ఎప్పటికీ రాలేదు. బియల్ కూడా రాలేదు. దీంతో 1945లో మారిస్ పెట్టెను తెరిచాడు. ఆ పొడుపు కథలను విప్పడానికి ప్రయత్నించాడు.. సాధ్యం కాలేదు.. తర్వాత ఆ పత్రాలు చేతులు మారి.. బియల్ పేపర్స్ పాంప్లెట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. కొందరు చరిత్రకారులు పరిశోధించగా.. 1822లో సెయింట్ లూయిస్ పోస్టల్ డిపార్టుమెంట్ వినియోగదారుల జాబితాలో బియల్ పేరు ఉంది. దీంతో బియల్ పత్రాలను నమ్మేవారి సంఖ్య పెరిగింది.. ఆ నిధి అక్కడే బెడ్ఫోర్డ్ కౌంటీలోనే ఉంది.. మరి.. మీరు ప్రయత్నిస్తారా? వందల కోట్లకు వారసులవుతారా? – సాక్షి, తెలంగాణ డెస్క్ -
క్షుద్ర పూజల్లో కొత్తకోణం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని కంచిక చర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో జరిగిన క్షుద్ర పూజల్లో కొత్తకోణం వెలుగు చూసింది. గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిధులు ఉన్నాయంటూ పాస్టరే క్షుద్ర పూజలకు పురిగొల్పినట్లు విచారణలో తేలింది. ప్రస్తుం పూజలు నిర్వహించటానికి కారకుడైన పాస్టర్ పరారిలో ఉన్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోవటానికి గాలింపు చర్యలు వేగవంతం చేశారు -
ఆ 11 లక్షల కోట్ల రూపాయల సంపద...ఎవరిది ?
-
వ్యవసాయ పొలంలో వెండి నాణేలు
ఆత్మకూర్: ఓ రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్తులు గుంపులుగుంపులుగా చేరి తవ్వకాలు జరిపారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని కత్తెపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండారెడ్డికి చెందిన పొలాన్ని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, ఆయన ద్వారా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారం క్యాంపు గ్రామానికి చెందిన నారాయణరావు 22 ఎకరాల పొలాన్ని నెల క్రితం కొనుగోలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం సర్వే 123/ ఈలో ని పిల్లిగుట్ట వద్ద పొలాన్ని సాగు కోసం చదును చేస్తున్నాడు. ఈ సందర్భంగా తవ్వకాల్లో వెండి నాణేలు లభ్యం కావడంతో వ్యవసాయ కూలీల ద్వారా గ్రామస్తులకు సమాచారం చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో పొలం వద్దకు చేరుకుని తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు దొరికినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఆత్మకూర్ సీఐ బండారి శంకర్ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, రైతుకు దొరికిన 17 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణేలు నిజాం కాలం నాటివిగా గుర్తించారు. అనంతరం తహసీల్దార్ జెకె.మోహన్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించగా. నాణేలను కలెక్టర్‌కు అందచేయనున్నట్లు తెలిపారు. కాగా, తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు బయటపడ్డాయనే ప్రచారం సాగుతోంది. -
వజ్రాలు, బంగారు నిక్షేపాల కోసం...
సాక్షి, తుగ్గలి : గుప్త నిధుల కోసం అన్వేషణలో ప్రభుత్వం పట్టు వీడటం లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. తన పని తాను చేసుకుపోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గత ఏడాది డిసెంబర్ 13న గుప్త నిధుల కోసం వేట ప్రారంభించిన విషయం విదితమే. శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో వజ్రాలు, బంగారం పెద్దఎత్తున ఉందంటూ ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ అభివృద్ధి కమిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా తవ్వకాలు జరగ్గా ఏనుగు దంతాలు, జంతు కళేబరాల అవశేషాలు లభ్యమయ్యాయి. కోటలోని బండరాళ్ల కింద, బురుజులో తవ్వకాలు చేశారు. నిధి ఆచూకీ కోసం ఎన్నెన్నో పూజలు, మంత్రాలు, స్కానర్లు, జియాలజిస్టులతో సర్వేలు.. ఇలా అన్నీ చేశారు. కోటలో అనుమానం వచ్చిన చోట, స్వామీజీలు గానీ, ఇంకా ఎవరైనా గానీ చెప్పిన చోటల్లా తవ్వకాలు చేస్తూ పోతున్నారు. మొదట్లో బండరాయి కింద 18 రోజుల పాటు తవ్వకాలు చేపట్టిన తరువాత కోట బురుజులోకి మార్చారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు తవ్వకాలు చేశారు. బండ రాళ్లు పడడంతో వాటిని కూలీలతో పగులగొట్టి తొలగిస్తున్నారు. అలాగే రెండు రోజులుగా కోట ప్రధాన ద్వారం ఊరు వాకిలి పక్కనున్న పాతాళ గంగ బావిలోనూ తవ్వకాలు చేపట్టారు. ఇందులో భాగంగా బావిలోని నీటిని మోటారు సాయంతో బయటకు తోడేశారు. బావిలో మూడు తలల నాగపడగ, ప్రాచీన కాలంనాటి వస్తువులు బయటపడ్డాయి. తహసీల్దార్ గోపాలరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి, పత్తికొండ సీఐ విక్రమసింహ, జొన్నగిరి ఎస్ఐ నజీర్అహ్మద్ తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. -
గుప్తనిధుల కోసం కోటలో వేట
-
ఆ కలతో..అపార నిధికి అన్వేషణ!
► చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ ప్రాచీన భవనాల్లో నిక్షేపాలు ► తుమకూరు యువకునికి కల ► సీఎంకు లేఖతో కార్యాచరణ శివాజీనగర(కర్ణాటక): ప్రాచీన భవనాలలో అపార స్థాయిలో నిధి ఉందని తుమకూరుకు చెందిన ఓ యువకుడు కన్న కల నిధి వేటకు దారితీసింది. అది కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యదర్శి ఎల్.కే.అతీక్, పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి, రహస్య నిధి కోసం గాలించాలని సూచించారు. చిత్రదుర్గ జిల్లా ఇన్చార్జి మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ కూడా దీనిపై కన్నడ సంస్కృతి శాఖకు లేఖ రాసినట్లు వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే... ‘చిత్రదుర్గ జిల్లాలోని హొసదుర్గ తాలూకాలో ప్రాచీన భవనాల్లో అపారమైన నిధి ఉంది. 2 బంగ్లాల్లో ఆరు గదుల్లో అపారమైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు’ నాకు కలలో వచ్చింది. ఈ రహస్య బంగ్లాలో శోధిస్తే లభించే అపారమైన నిధిని రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగించుకోవచ్చు’ అని తుమకూరుకు చెందిన 29 ఏళ్ల ప్రద్యుమ్న యాదవ్ అనే యువకుడు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొంతకాలం కిందట లేఖ రాశాడు. దాని ఆధారంగా జరుగుతోంది. 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన యదునందనా చిత్ర భూపాల సామ్రాట్ తన సామ్రాజ్యంపై శత్రువుల దాడి జరగడానికి ముందు అపారమైన బంగారు ఆభరణాలను ఈ భవనాల్లో దాచిపెట్టినట్లు కల వచ్చిందని యాదవ్ చెబుతున్నాడు. యువకుడు చెప్పిన కలలో నిజమెంతో తెలుసుకోవాలనుకున్న ప్రభుత్వం ప్రాచీన బంగ్లాల్లో పరిశీలనలను జరపాలని ఆదేశించినట్లు సమాచారం. -
వేల కోట్ల నాజీ సొత్తును వెలికితీస్తారా?
ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన నాజీల ఓడను వెలికితీయాలని ట్రెజర్ హంటర్లు భావిస్తున్నారు. ఇందుకోసం ఐలాండ్ ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ అమెరికా నుంచి జర్మనీకి తరలిస్తున్న టన్నుల కొద్దీ బంగారం మునిగిపోయిన ఓడలో ఉందని ట్రెజర్ హంటర్ల నమ్మకం. 1939 రెండో ప్రపంచ యుద్ధం జరగుతున్న నేపథ్యంలో దక్షిణ అమెరికా నుంచి జర్మనీకి బయల్దేరిన ఈ ఓడను ఇంగ్లండ్ తన సముద్రజలాల్లో అడ్డుకుని దాడి చేసింది. దాంతో ఓడతో పాటు దక్షిణ అమెరికా నుంచి వస్తున్న విలువైన వస్తువులు సముద్ర అంతర్భాగంలో కలసిపోయాయి. దాదాపు నాలుగు టన్నుల బంగారం మునిగిపోయిన ఓడలో దాడి ఉందని పలువురి అభిప్రాయం. బంగారం విలువ దాదాపు 100 మిలియన్ పౌండ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓడలో ఉన్న బాక్సును వెలికితీసేందుకు బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఐలాండ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి పరిశోధనలు చేయాలని భావించినా ఆ దేశ ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో నేవీ ఒప్పుకోలేదు. దీంతో ఐలాండ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం బ్రిటన్ కంపెనీ వేచి చూస్తోంది. -
ఘంటా మఠం.. ధనరాశుల గని
- స్కంద పురాణంలో ఘంటా మఠం ప్రస్తావన - రూ. కోట్ల విలువ చేసే గుప్తనిధులు ఉన్నాయని నమ్మకం - శిఖర రాయి కింద నిధుల అదృశ్యంపై అంతటా చర్చ శ్రీశైలం: శ్రీశైల దేవస్ధానం పరిధిలోని పంచ మఠాలలో ఒకటైన ఘంటామఠంలో జరుగుతున్న జీర్ణోధ్ధరణ పనుల్లో విలువైన గుప్త నిధులు బయటపడటంతో అత్యంత ప్రాచీనత ఈ మఠం విశిష్టిత మరో సారి వెలుగులోకి వచ్చింది. ఘంటా మఠం ప్రాధాన్యత దృష్ట్యా ఈ మఠంలో ఉన్న లింగస్వరూపాన్ని ఘంటా సిద్దేశ్వరుడిగా పిలుస్తారు. ఇక్కడ ఒక భారీ కంచు గంట కూడా ఉంది. దీన పక్కనే నీటిగుండాన్ని ఘంటా గుండంగా పిలుస్తారు. ఇందులో ఉన్న నీటితో ఘంటా సిద్దేశ్వరస్వామిని ప్రదోష కాలం పూర్తయిన తరువాత నుంచి నాలుగు జాములు ఏకధాటిగా గంట మోగిస్తూ ఘంటా గుండంలోని నీటితో అభిషేకించడం ద్వారా ఖేచరత్వం (ఆకాశగమనం) సిద్ధిస్తుందని స్కందపురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే రసరత్నాకారంలో ఈ ఘంటామఠంలో అనేక నిధులున్నట్లు రాయబడిందని కొందరు చెబుతున్నారు. అందుకే గుప్తనిధుల వేటగాళ్ల చూపులన్ని ఎప్పటి నుంచో ఈ గంటా మఠం వైపే ఉంటాయి. శ్రీమల్లికార్జునస్వామివార్ల ఆలయం ముందు భాగంలోని అంతరాలయంలో ఎలాంటి గుండ్రటి రాతి బండ ఉందో అలాంటిదే ఘంటా సిద్ధేశ్వరస్వామి ముందు ఉన్న అంతరాలయంలో కూడా ఉంది. ఈ బండ కిందనే కోట్ల విలువ చేసే నిధులు ఉన్నాయని అభిప్రాయం అనేక మందిలో నెలకొంది. మూడు రోజుల క్రితం తవ్వకాల్లో సుమారు 140 వెండి నాణాలు, 14 బంగారు నాణాలు, 3 బంగారు కడియాలు, ఉంగరాలు, 2 వెండి చెంబులు ఈ తవ్వకాలలో లభించాయి, ఇందులో మూడు బంగారు కడియాలు ఉంగరాల బరువు.మోత్తం 699 గ్రాముల 930 మిలీగ్రాములు కాగా వెండి నాణేలు ఇతర వస్తువులు కాలిపి 2కేజీల 500 గ్రాములు ఉన్నాయి. గతంలోనే వేటగాళ్ల తవ్వకాలు శ్రీశైల ఆలయ ప్రాకార కుడ్యానికి వాయువ్య దిశలో పంచమఠాలు ఉన్నాయి. ఇందులో ఘంటామఠం, విభూది మఠాలలో గుప్తనిధులు ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా ప్రచారంతో ఉంది. అయితే దాదాపు 20 ఏళ్ల క్రితం కొందరు దుండగులు విభూది మఠంలో వున్న విగ్రహాలను ధ్వంసం చేసి మఠం మధ్య భాగంలో ఉన్న బీజాక్షరాలు కలిగిన గ్రానైట్ శిలా ఫలకాన్ని పగలగొట్టారు. దాని కింద ఉన్న లక్షల విలువైన నిధులను దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే సారంగధర మఠంలో కుడా లక్షల విలువైన గుప్త నిధులను కొందరు స్వాహా చేశారు. ఘంటా మఠం పరిసర ప్రాంతాలో తవ్వకాలు జరిగాయి. కానీ మఠంలో ఉన్న ఘంటాసిద్ధేశ్వర స్వామి మూల విరాట్, అంతర ఆలయంలో వున్న గుండ్రటి శిలా ఫలకం , దాని కింద ఉన్న కోట్లాది విలువ చేసే ధన రాశుల కోసం గుప్తనిధుల వేటగాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానికులు తిప్పికొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో అనుమానాలు సాధరాణంగా గర్భాలయ కలశం ప్రతిష్ట చేసేటపుడు అ కలశం కింద నవరత్నాలు బంగారు వెండి రాగి వస్తువులు బీజ అక్షరాలలో ఉన్న రేకులను పెట్టి కలశ ప్రతిష్ట చేయడం ప్రాచీన కాలం నుంచి నేటి వరకు జరిగే శాస్రోక్తంగా చేసే క్రతువు. దీని బట్టి చూస్తే ఘంటామఠం గర్బాలయ కలశం ప్రతిష్ట చేసేటపుడు కుడా ఇదే విధంగా చేసి ఉంటారు. అయితే గర్భలయ శిఖర కలశాన్ని రాతితో నిర్మించినందువల్ల ఆ రాయి కిందే ఈ క్రతువు జరిగి ఉంటుంది. కొంతకాలం క్రితం కొందరు దుండగులు కలశాన్ని ధ్వంసం చేసినా వారికి ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. ఎందుకంటే కలశంతో సహా పైరాయి నిర్మాణం ఉంటుంది. జీర్ణోద్ధరణలో బాగంగా ఘంటామఠ ఆలయ కలశరాయిని తొలగించినప్పుడు దాని కింద కచ్ఛితంగా కాసులు ఉంటాయని అభిప్రాయం ఉంది. పునఃరుద్ధరణ లో భాగంగా ఆ రాయిని తొలగించినపుడు అక్కడ ఉన్న కాసులు ఏమైన్నట్లుని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా ఆ కలశం కింద దొరికిన వాటిని కొందరు ఒక వాహనంలో వచ్చి తీసుకువెళ్లిన్నట్లుగా అక్కడ స్థానికులు చర్చించుకుంటున్నారు. నిఘా నామమాత్రం: శిథిలావస్థలో ఉన్న ఘంఠామఠం, వీరభద్ర మఠాలను శ్రీశైల దేవస్థానం జీర్ణోద్ధరణ చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా కొన్ని నెలలుగా తవ్వకాలను చేపట్టింది. కాగా గుప్తనిధులు ఉన్నాయని ప్రచారం ఉన్న ఘంటామఠం వద్ద దేవస్థానం నిఘా కెమెరాలను, ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అయితే అక్కడ నామమాత్రాంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆలాగే జీర్ణోధ్ధరణ పనులను పరిశీలిచడానికి ప్రత్యేకంగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయలేదు. ఘంటామఠం వద్ద పురాతన గుప్త నిధులు బయట పడడంతో రెండురోజుల క్రితం పురావస్తు అధికారులు శ్రీశైలం చేరుకొని తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. వారి సూచన మేరకు నిఘా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. -
చైనాలో భారీ నిధి గుర్తింపు
-
చైనాలో భారీ నిధి గుర్తింపు
బీజింగ్: దాదాపు 300 సంవత్సరాల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని చెప్పారు. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావియెన్స్ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించామన్నారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితోపాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు. మిన్‌జియాంగ్ నదికి ఉపనదిగా పిలిచే జిన్జియాంగ్ నది గర్భంలో ఈ సంపద బయటపడిందని సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రెలిక్స్ అండ్ అర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ తెలిపారు. 1646లో ఈ ప్రాంతాన్ని పాలించిన ఝాంగ్ జియాంఝాంగ్... మింగ్ సైన్యానికి భయపడి సంపదను వెయ్యి పడవల్లో మరోచోటుకు తరలిస్తుండగా అందులో కొన్ని పడవలు నీటిలో మునిగిపోయాయని, ఆ సంపదే ఇప్పుడు బయట పడిందన్నారు. సాధారణంగా వేసవి సమీపించడంతో నదీ పరిసర ప్రాంతాల్లో పురాతత్వశాస్త్రవేత్తలు తవ్వకాలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది కూడా మొదలు పెట్టడడంతో ఈ నిధి బయటపడింది. -
గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్
ఆత్మకూరు: నాగలూటి రేంజ్ పరిధిలోని బైర్లూటీ చెక్‌పోస్టు సమీపంలో నల్లమల జంగిల్ క్యాంప్ రహదారి వెంట అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను నాగలూటి రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దోర్నాలకు చెందిన శ్రీనివాసులు, ఒంగోల్‌కు చెందిన రమేష్, నరసింహులు అడవిలో వెళ్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకుని వివరాలు తెలుసుకున్నారు. తాము శ్రీశైలానికి కాలినడక వెళ్తున్నామని మొదట నమ్మించే ప్రయత్నం చేశారు. ఫారెస్ట్ రేంజ్ర్ గట్టిగా మందలించడంతో ముగ్గురు వ్యక్తులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పూర్తిస్థాయిలో విచారించారు. తాము ఒంగోలు ప్రాంతానికి చెందిన వారమని కారులో వచ్చామని చెప్పారు. కారు ఉన్న ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లగా, అందులో మెటల్ డిటెక్టర్ ఉండడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను నందికొట్కూరు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించారు. శ్రీనివాసులు కుటుంబీకులకు సమాచారం అందించగా ఆయన తల్లి కోర్టుకు వద్దకు చేరుకుని, తమ కుమారుడని అన్యాయంగా అరెస్ట్ చేశారని విలపించింది. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
కురవి: వరంగల్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామ శివారులోని ఓ పాడుబడ్డ శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు శివాలయంలోని శివలింగాన్నిపెకలించి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని స్కూలుకు వెళ్తున్న బాలురు గమనించి గ్రామస్తులకు తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుప్తనిధుల ముఠా అరెస్ట్
– పోలీసులు అదుపులో ఏడుగురు – ఆటోతో పాటు గడ్డపారలు స్వాధీనం – పరారీలో ప్రధాన సూత్రధారి డోన్: పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలకు పాల్పడే ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వెల్దుర్తి మండలంలోని బ్రహ్మగుండం, సమీపంలోని పురాతన ఆలయాలను టార్గెట్ చేసిన ముఠాను హోంగార్డ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ముఠా వివరాలను డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ తులసీనాగప్రసాద్ మీడియాకు వివరించారు. హŸళగుంద మండలం గజ్జనహళ్లి గ్రామానికి చెందిన గొల్లరాముడు గుప్తనిధుల అన్వేషణ పేరుతో ముఠాను తయారు చేశాడు. ఇందులో ఆస్పరి మండలం గార్లపెంట గ్రామానికి చెందిన వడ్డె నరేష్, ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన బోయ తుగ్గలి చెన్నకేశవ్, ఎమ్మిగనూరు మండలం దేవరగట్ట గ్రామానికి చెందినన మాదిగ ఆంజనేయులు, మాదిగ రవికుమార్, గొల్లచంద్ర, వెల్దుర్తి మండలం చెర్లకొత్తూరుకు చెందిన మాదిగ కర్లకుంట తిరుమలేసు, క్రిష్ణగిరి మండలం మాదాపురం గ్రామానికి చెందిన మాదిగ మణీంద్ర ముఠాలో సభ్యులుగా చేరారు. ఇలా పట్టుబడ్డారు: దేవాలయాల్లో ఉండే శాసనాల ద్వారా గుప్తనిధులు ఉన్నట్లు తెలుసుకుని తవ్వకాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వెల్దుర్తి పరిసర ప్రాంతాల్లోని బ్రహ్మగుండం, రామళ్లకోటలోని వనమా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆలయాల ఆవరణలో పచ్చలబండ కింద గుప్తు నిధులు ఉన్నాయని టార్గెట్ చేశారు. ఈ మేరకు గొల్లరాముడుతో పాటు మరో ఏడుగురు సభ్యులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరు నుంచి ఆటోలో బయల్దేరారు. బ్రహ్మగుండం ఆలయ ఆవరణలో తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా బీట్‌కు వెళ్లిన హోంగార్డ్ జనార్దన్ గమనించి పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి గొల్లరాముడు పరారయ్యాడు. ఏడుగురు సభ్యులను స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. వీరి వద్ద నుంచి ఆటో, గడ్డపారలు, పారలు స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డుకు రివార్డు: గుప్త నిధుల ముఠా పథకాన్ని భగ్నం చేసి, వారిని సమాచారాన్ని చేరవేసిన వెల్దుర్తి పోలీసుస్టేషన్ హోంగార్డ్ జనార్దన్‌కు రివార్డు ప్రకటిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు పోలీసుల అ«భినందించి పారితోషికాన్ని అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ పురాతన ఆలయాలతో పాటు దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలయ ధర్మకర్తలు, ఇతర పాలక మండల చైర్మన్లు, సభ్యులకు డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల గస్తీ నిరంతరం ఉన్నప్పటికీ భక్తులు, ఆలయ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత తప్పనిసరి అన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఐ శ్రీనివాసులును ఆదేశించారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
నంది విగ్రహం అపహరణకు యత్నం? కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని పోచమ్మ ఆలయ ఆవరణలోని నంది విగ్రహాన్ని అపహరించేందుకు బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. స్థానికుల కథనం ప్రకారం.. పాపన్నగానిపల్లె శివారులోని పోచమ్మ ఆలయం ఎదుట ఉన్న పురాతనమైన నంది విగ్రహం కింద గుప్త నిధులున్నాయన్న అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు సాగించారు. బుధవారం రాత్రి ట్రాలీలో వచ్చిన ముఠా సభ్యులు క్షుద్రపూజలు చేసి విగ్రహాన్ని కొంతదూరం తరలించారు. విగ్రహం జరిపిన చోట పసుపు, కుంకుమ చల్లి క్షుద్రపూజలు చేసి తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించగా.. సాధ్యంకాక వెళ్లిపోయారు. ఉదయం పొలాలకు వెళ్తున్న కొందరు రైతులు నంది విగ్రహం వేరేచోట ఉండడాన్ని గమనించి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. అయితే విగ్రహాన్నే తరలించే ప్రయత్నం చేశారని కొందరు భావిస్తున్నారు. -
గుంతకల్లులో దళితుల ఆందోళన
దళిత యువతిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించారంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన జరిగింది. పట్టణానికి చెందిన కాంచన అనే యువతి షేక్షావలి యువకుడిని ప్రేమించి ఇటీవల పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆమెను భర్త నుంచి వేరు చేసి తమతో ఇంటికి తీసుకెళ్లారు. అయితే, ఆమె బుధవారం అక్కడి నుంచి గుంతకల్లు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. తమను వేరు చేసేందుకు కుటుంబసభ్యులు యత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సై తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆమె పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. ఆమె తరఫు వారు అక్కడికి చేరుకుని మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు వారితో చర్చలు జరిపారు. షేక్షావలి, కాంచన వివాహంపై రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ జరిపి వారిని ఇళ్లకు పంపించివేయటంతో కథ సుఖాంతమైంది. -
రా‘బంధువు’!
గుప్తనిధుల పేరుతో పెదనాన్న కుమారుడికి ఎర రూ.15 లక్షల లాభమంటూ రూ.1.5 లక్షలు స్వాహా డబ్బు కోసం నిలదీయడంతో దారుణ హత్య ప్రధాన నిందితుడి అరెస్టు, పరారీలో ఇద్దరు నాగపూర్ వాసులు సనత్‌నగర్: గుప్తనిధులపై అతడికున్న బలహీనతను క్యాష్ చేసుకున్న బంధువే రాబందువయ్యాడు... ‘పెట్టుబడిగా’ పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమన్నందుకు కర్కశంగా హతమార్చాడు... ఎస్సార్‌నగర్ ఠాణాలో మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ మర్డర్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఇద్దరు నాగ్‌పూర్ వాసుల కోసం గాలిస్తున్నారు. పశ్చిమ మండల డీసీపీ ఎం.వెంకటేశ్వరరావు బుధవారం పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్సార్‌నగర్ ఠాణాలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... నాగ్‌పూర్ వాసులతో ‘గుప్త’ పరిచయం... మెదక్ జిల్లా మునిపల్లి మండలం మున్సానిపల్లెకు చెందిన చిన్నోళ్ల చంద్రారెడ్డి కుమారుడు చిన్నోళ్ల మాణిక్యరెడ్డి జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మియాపూర్‌లో ఉంటున్నాడు. ఐదేళ్ల క్రితం మహారాష్ట్రకు వెళ్లినప్పుడు నాగ్‌పూర్ కాచునానికి చెందిన శైలేష్, పదమ్లతో ఇతడికి పరిచయమైంది. వీరు కొన్నాళ్ల క్రితం మాణిక్యరెడ్డికి 1818 ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కాయిన్ (నాణెం) చూపించి తమ వద్ద గుప్తనిధులు ఉన్నాయని, వాటిని వెలికితీయడానికి కొంతపెట్టుబడి అవసరమని చెప్పారు. దీంతో అతడు తన వద్ద ఉన్న రూ.2 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు శైలేష్, పదమ్లను గుప్తనిధుల విషయం అడగ్గా... వెలికి తీసేందుకు ఇంకా పెట్టుబడి అవసరమని మరో రూ.2.5 లక్షలు ఇస్తే పని పూర్తవుతుందన్నారు. ఆ నిధులు అమ్మగా వచ్చిన డబ్బులో రూ.15 లక్షలు ఇస్తామని నమ్మబలికారు. గుప్తనిధుల పేరుతో డబ్బు కాజేసి... దీంతో మాణిక్యరెడ్డి తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఎర్రగడ్డలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న చిన్నాన్న కుమారుడు చిన్నోళ్ల సంతోష్‌రెడ్డి (28)కి ఫోన్ చేశాడు. మహారాష్ట్రలో గుప్తనిధులు ఉన్నాయని, నీవు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే 15 రోజుల్లో నీకు రూ.15 లక్షలు లాభంగా వస్తుందని చెప్పాడు. మాణిక్యరెడ్డి మాటలు నమ్మిన సంతోష్ రూ.1.5 లక్షలు ఇచ్చాడు. 15 రోజులు గడిచినా తన వాటా డబ్బు రాకపోవడంతో సంతోష్ మాణిక్యరెడ్డిని నిలదీశాడు. దీంతో జనవరి 28న గుప్తనిధులు చూపిస్తానంటూ సంతోష్‌ని నాగ్‌పూర్ తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లాక... ఆ నిధులు అమ్మేవారిని తానే హైదరాబాద్‌కు తీసుకొస్తానని చెప్పి మరుసటి రోజు బస్సులో వెనక్కి పంపించాడు. చందానగర్ లాడ్జిలో హత్యకు కుట్ర... డబ్బు కోసం సంతోష్ ఒత్తిడి పెంచడంతో జనవరి 30న మాణిక్యరెడ్డి, నాగ్‌పూర్‌కు చెందిన శైలేష్, పదమ్లు చం దానగర్లోని ఓ లాడ్డిలో సమావేశమయ్యారు. రూ.15 లక్షలు సంతోష్‌కు ఎందుకివ్వాలి? అతన్ని చంపిస్తే మనమే వాటిని పంచుకుందామంటూ కుట్ర పన్నారు. దీన్ని అమలు చేయడంలో భాగంగా 31న సంతోష్‌కు ఫోన్ చేసిన మాణిక్యరెడ్డి మియాపూర్‌కు పిలిపించి తన ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని నర్సాపూర్ రహదారిలో బయలుదేరాడు. గాగిల్లాపూర్ వద్ద స్వప్న వైన్‌షాపులో మద్యం ఖరీదు చేశాడు. గుప్త నిధుల గురించి మాట్లాడుకుందామని నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని మేడాలమ్మ గుడి వద్దకు తీసుకెళ్లాడు. చంపి, కాల్చేశారు... ఆ ఆలయం వద్ద బైక్ పార్క్ చేసిన మాణిక్యరెడ్డి... సంతోష్‌ను అడవి లోపలికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న శైలేష్, పదమ్లతో కలిసి నలుగురూ మద్యం తాగారు. సంతోష్ మద్యం మత్తులోకి జారుకోగానే... అందరూ నిద్రించినట్లుగా నటించారు. సంతోష్ పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై మోది అతడిని హత్య చేశారు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహంపై ఉన్న దుస్తులు విప్పి, బైక్ నుంచి తీసిన పెట్రోల్ పోసి కాల్చేశారు. ఫిబ్రవరి 5న సంతోష్ ఫోన్ నుంచి ‘నేను పనిపై బయటకు వచ్చా.. త్వరలోనే తిరిగి వస్తా’నంటూ కుటుంబీకులకు ఎస్సెమ్మెస్ పంపారు. ఆపై సంతోష్‌కు చెందిన రెండు సెల్ఫోన్లు మియాపూర్ నాలాలో పడేశారు. మిస్సింగ్ మిస్టరీ వీడిందిలా... సంతోష్ ఆచూకీ లభించకపోవడంతో తండ్రి నర్సింహ్మారెడ్డి పలుచోట్ల గాలించాడు. ఫలితం లేకపోవడంతో ఫిబ్రవరి 10న ఎస్సార్‌నగర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సంతోష్ ఫోన్ల కాల్ డేటాను అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అతడికి వచ్చిన కాల్స్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఓ నెంబర్‌ను గుర్తించారు. ఆ నెంబర్ సోదరుడు మాణిక్యరెడ్డిదిగా తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్సైలు శ్రీనివాస్, నగేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మరోపక్క సంతోష్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ అతడి బంధువులు బుధవారం ఠాణా వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు. -
నౌకలు.. నిధుల జాడలు..
చరిత్రలో నౌకా ప్రమాదాలు చాలానే జరిగాయి. గమ్యం చేరకుండానే సముద్ర గర్భంలో కలిసిపోయిన పడవలు ఎన్నో. ప్రమాదాలు, వేరే పడవలు ఢీకొనడం, సముద్రపు దొంగల దాడులు.. ఇలా అనేక కారణాలతో పడవలు మునిగిపోతాయి. అలా సముద్రం ఒడి చేరిన చాలా నౌకల్లో కోట్ల విలువ చేసే సంపద కలిగినవి ఎన్నో ఉన్నాయి. సముద్ర గర్భంలో దాగిన సంపదను కనుక్కోవడం ఒకప్పుడుసాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని నౌకల జాడలను కనుగొని వాటిలోని విలువైన నిధుల్ని వెలికి తీస్తున్నారు. అనేక సంస్థలు, దేశాలు సాగిస్తున్న అన్వేషణ ద్వారా మునిగిపోయిన నౌకల నుంచి భారీ సంపద వెలుగులోకొచ్చింది. అలా ఓడల నుంచి వెలికి తీసిన సంపద గురించి తెలుసుకుందాం... ద డైమండ్.. నౌకల ద్వారా లభించిన నిధుల్లో మరో చెప్పుకోదగ్గ సంపద కలిగిన పడవ ద డైమండ్. పోర్చుగీసుకు చెందిన ఈ నౌక 1533లో మునిగిపోయినట్లు అంచనా. ఈ పడవలో వివిధ లోహపు కడ్డీలు, ఫిరంగులు, కత్తులు, 50కి పైగా ఏనుగు దంతాలు, బంగారు నాణేలు వంటి ఇతర సంపద ఉంది. ఇన్ని నిధులతో మునిగిపోయిన ఈ నౌకను కనుగొనేందుకు సముద్రాల్లో పెద్దగా అన్వేషణ ఏమీ జరగలేదు. ఎందుకంటే దీని గురించి బయటివారికి తెలిసింది తక్కువే. మరి ఈ పడవ ఎలా లభించిందీ అనుకుంటున్నారా? 16వ శతాబ్దంలో మునిగిపోయిన ఈ పడవ ఆఫ్రికాలో సముద్రపు ఒడ్డున ఓ బీచ్‌కి ఎప్పుడో కొట్టుకువచ్చింది. అనంతరం ఇసుకలో కూరుకుపోయి అలాగే ఉండిపోయింది. దీన్ని స్థానికులు కూడా సాధారణ పడవే అయి ఉండొచ్చని ఎవరూ పట్టించుకోలేదు. కానీ డీబీర్స్ అనే వజ్రాల సంస్థ తరపున కొందరు నిపుణులు బీచ్‌లోని ఇసుకలో అన్వేషణ సాగిస్తుండగా ఈ నిధి లభ్యమైంది. ఇలా అనుకోకుండా భారీ సంపద కలిగిన నౌక గురించి ప్రపంచానికి తెలిసింది. ది ఆటోకా మదర్లోడ్.. అత్యంత భారీ సంపదతో మునిగిపోయిన పడవల్లో ఆటోకా మదర్లోడ్ ఒకటి. బంగారం, వెండి, నీలిమందు, రాగి, ఇతర ఆభరణాలతో కలిపి ఈ కార్గోషిప్‌ను నింపారు. ఇది ఎంత పెద్దదంటే ఈ మొత్తం నిధులతో కలిపి కార్గోను నింపేందుకే దాదాపు రెండు నెలల సమయం పట్టింది. 1622లో ఈ పడవ ఫ్లోరిడా తీరాన అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. అప్పటినుంచి సముద్రగర్భంలో కలిసిన ఈ పడవను కనుగొనేందుకు చాలా అన్వేషణలే జరిగాయి. ఈ విషయంలో స్పెయిన్ తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే సముద్రంలో అన్వేషణ సాగించడం అంత సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ మెల్ ఫిషర్ అనే ఓ అన్వేషకుడు మాత్రం దాదాపు పదిహేడేళ్లు శ్రమించి ఈ నౌక జాడను కనుగొన్నాడు. అతడి శ్రమ ఫలితంగా 1985 జూలైలో ఈ నౌక వెలుగులోకొచ్చింది. నౌకలో మునిగిపోయినట్లు భావిస్తున్న పూర్తి సంపదమాత్రం ఇంకా దొరకలేదు. కానీ ఈ నౌకలో ఉన్న మొత్తం సంపద విలువ నేటి కాలమానం ప్రకారం మూడు వేల కోట్లకుపైగా ఉంటుంది. పడవలోని కొద్దిపాటి నిధి మాత్రమే దొరకడంతో ఇంకా దీనిపై అన్వేషణ కొనసాగుతోంది. ఎస్.ఎస్. రిపబ్లిక్.. అమెరికాకు చెందిన ఈ నౌక 1865లో జార్జియా తీరంలో భారీ తుపాను కారణంగా మునిగిపోయింది. ఈ పడవలో 14,000 వరకు వివిధ కళాఖండాలు, 51,000కు పైగా అమెరికాకు చెందిన వెండి, బంగారు నాణేలు, ఖరీదైన గ్లాసులు, బాటిళ్లు సహా భారీ సంపద ఉండేది. విలువైన నిధులతో ముగినిపోయిన దీన్ని కనుగొనేందుకు ఒడిస్సీ సంస్థ రంగంలోకి దిగింది. చివరకు ఈ నిధిని ఆ సంస్థ కనుగొంది. కానీ ఆ పడవ ఎక్కడుందో కనుగొన్నది తన దగ్గరున్న సమాచారం ఆధారంగానే అని, అందుకే ఆ నిధి తనకే దక్కాలని ఓ వ్యక్తి ఒడిస్సీ సంస్థపై కేసు దాఖలు చేశాడు. కానీ 2004లో ఈ నిధి మొత్తం ఒడిస్సీకే దక్కేలా కోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్.ఎస్. గారిసోపా.. దాదాపు రెండు లక్షల కిలోలకు పైగా వెండి కలిగిన ఎస్.ఎస్.గారిసోపా నౌక 1941లో సముద్రంలో మునిగిపోయింది. జర్మన్‌కు చెందిన మరో నౌక జరిపిన దాడిలో గారిసోపా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇందులో ఉన్న మొత్తం వెండి విలువ దాదాపు పదమూడు వేలకోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. సముద్రాల్లో నిధుల కోసం అన్వేషణ సాగించే ఒడిస్సీ మెరైన్ అనే సంస్థ దీన్ని కనుగొంది. సముద్రంలో లభించిన వాటిలో అతిపెద్ద లోహపు సంపద కలిగిన పడవ ఇదే. అయితే ఈ సంపద ఎవరికి దక్కాలనే విషయంలో ఒడిస్సీ సంస్థకూ, బ్రిటన్‌కు మధ్య కొంతకాలం వివాదం తలెత్తింది. చివరకు ఒప్పందం ప్రకారం ఒడిస్సీ సంస్థ 80 శాతం, బ్రిటన్ 20 శాతం నిధిని పంచుకున్నాయి. బెలిటంగ్.. భారీ సంపదతో లభించిన తొలి అరేబియన్ ఓడ ఇదే. దీన్ని 1998లో ఇండోనేషియా సముద్ర తీరంలో కనుగొన్నారు. ఈ నౌకలో విలువైన సామగ్రిని అన్వేషకులు గుర్తించారు. ఇందులో వెండి జాడులు, బంగారు కప్పులు, వెండితో తయారైన గిఫ్ట్ బాక్సులు, గిన్నెలు, వివిధ రత్నాలు, కెంపులువంటి అరుదైన ఆభరణలు ఎన్నో లభించాయి. వీటి మొత్తం విలువ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఈ ఓడను సింగపూర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. -
'గుప్త నిధుల'తవ్వకాలు - పది మంది అరెస్ట్
గుప్త నిధుల కోసం తవ్వకాలకు ప్రయత్నించిన పది మందిని అనంతపురం జిల్లా పెనుకొండ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో టీడీపీ మాజీ నాయకుడు వేపకుంట రాజన్న, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పట్టణంలోని బసవన్న బావి వద్ద వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. -
ఆలయాల్లో తవ్వకాలు: నలుగురి అరెస్టు
హుస్నాబాద్: శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ సమీపంలోని బయ్యన్నగుట్టలో మంగళవారం అర్ధరాత్రి కొందరు తవ్వకాలు జరుపుతుండగా చప్పుళ్లు వస్తుండటంతో.. పంట కాపలా కోసం వచ్చిన రైతులు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
గుప్త నిధుల తవ్వకాలు: 9 మంది అరెస్టు
తుర్కయాంజల్: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ ఏవీనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో కొందరు వ్యక్తులు ముప్పై అడుగుల లోతైన గుంతను తవ్వారు. అక్కడ పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు తవ్వకాలు జరుపుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అయితే, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకే గుంతను తవ్వుతున్నట్టు నిందితులు చెబుతున్నారు. -
మరి బంగారం అంటే మాటలా...!
వార్సా: పోలండ్‌లోని వాల్‌బ్రిజిక్ నగరంలో పక్షం రోజులుగా వ్యాపారం జోరుగా సాగుతోంది. తినుబండారాల నుంచి టీ షర్టులు, మగ్గులు, ప్లేట్ల వరకు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వాల్‌బ్రిజిక్ నగరం పేరు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పోవడమే అందుకు కారణం. నాజీల కాలంలో అపార బంగారు రాశులతో కూడిన రైలును దాచిన సొరంగ మార్గాన్ని కనుగొన్నామంటూ జర్మన్‌కు చెందిన ఆండ్రియాస్ రిచ్టర్, పోల్ పాయిటర్ కోపర్ ప్రకటించడం, ఆ వార్తా దావానంలా ప్రపంచాన్నంతా చుట్టేసిన విషయం తెల్సిందే. ఈ వార్తను ఎలా సొమ్ము చేసుకోవాలా ? అన్న అలోచన వచ్చిన ఓ వ్యాపారి ‘ఇండియానా జోన్స్’ తరహాలో సొరంగ మార్గం గుండా బంగారు రాశులతో దూసుకొస్తున్న రైలు బొమ్మను టీ షర్టులపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. వాటి అమ్మకాలు హఠాత్తుగా పెరిగిపోవడంతో ఆయన్నే ఇతర వ్యాపారులు అనుసరించారు. అలాంటి బొమ్మలనే టీ మగ్గులపై, ప్లేట్లపై ముద్రించడంతో వాటి అమ్మకాలు కూడా పెరిగాయి. తామేమి తక్కువ తినలేదంటూ తినుబండారాల తయారీదారులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. చాకోబార్లకు ‘గోల్డ్ బార్స్ ఫ్రమ్ ది ఆర్మర్డ్ ట్రెయిన్’ అనే టైటిల్స్ కూడా వాటికి తగిలించేశారు. సొరంగంలో నాజీలు దాచిన బంగారం రైలును తాము కనుగొన్నామని, తమకు అందులో కొంత వాటా ఇస్తామంటే చెబుతామంటూ పోలాండ్ పోలీసు అధికారుల ముందుకు వచ్చిన ఆండ్రియాస్, పోల్ పాయిటర్లు మాత్రం జైలు కూడు తింటున్నారు. ఫలానా చోట రైలుందంటూ వారు చూపించిన శాటిలైట్ ఛాయా చిత్రాలు కంప్యూటర్ గ్రాఫిక్స్‌గా అనుమానించి వారిని పోలీసు అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే వారి మాటల్లో నిజం లేకపోలేదని, వారు చెబుతున్న వాల్‌బ్రిజిక్ నగరానికి సరిగ్గా 12 మైళ్ల దూరంలోని వాలిమ్ అనే గ్రామం వద్ద బంగారు రైలు దాచినట్టుగా భావిస్తున్న సొరంగాన్ని 1926 నాటి రైల్వే మ్యాప్ ద్వారా పోలండ్అధికారులు కనుగొన్నారని స్థానిక ‘గజెటా రొక్లావస్కా’ అనే పత్రిక మంగళవారం సాయంత్రం వెల్లడించింది. ప్రస్తుతం ఉపయోగంలో లేని ఆ రైలు సొరంగంలో తవ్వకాలు జరుపుతారా? అని పోలండ్ పురావస్తు శాఖాధికారులను ప్రశ్నించగా, ప్రభుత్వం నుంచి తమకు అధికారికంగా ఉత్తర్వులు వస్తే ముందుగా అక్కడ అధ్యయనం జరుపుతామని, అవసరమైతే తవ్వకాలు జరుపుతామని వారు చెప్పారు. ఇలాంటి వార్తల కారణంగా వాల్‌బ్రిజిక్ నగర పరిసరాల్లో జన సంచారం కూడా పెరుగుతోందని, వారి కారణంగా తమ వ్యాపారం మాత్రం బంగారంలా మెరిసిపోతోందని వ్యాపార వర్గాలు ఆనందంతో మురిసి పోతున్నారు. మరి, బంగారం అంటే మాటలా! -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
లక్సెట్టిపేట: అదిలాబాద్ జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక గోదారి రోడ్డులోని మసీదు వెనక భాగంలో నివాస ముంటున్న ఎం.డీ. సలీం ఇంట్లో గత రెండు రోజులు గా రాత్రి పూట చప్పుడు వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులకు రంగంలోకి దిగారు. సలీం ఇంట్లో పరిశీలించగా.. ఇంటి మధ్య భాగంలో పెద్ద గొయ్యి కనిపించింది. గొయ్యి ఎందుకు తీసారో పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో సలీం కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లలో గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఓ పాడబడ్డ ఇంట్లో 9 మంది గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. స్థానికులు సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా స్థానికులుగా పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
ఉరవకొండ: విలువైన వస్తువులు లభిస్తాయని కొందరు దుండగులు ఆలయంలోని గోపురంపైన ఉన్న కలశాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామ శివారులోని పర్వతేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వెళ్లిన అర్చకుడు ఈ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకురావడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. పురాతన ఆలయం కావడంతో గుప్తనిధులు లభిస్తాయనే అనుమానంతోనే ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో గుప్తనిధుల వేట
-
‘లెక్కలు’ సరిచూడకపోతే జీతం కట్
సాక్షి, హైదరాబాద్: ప్రతీ నెల 4వ తేదీలోగా రాబడి, వ్యయాలకు సంబంధించిన లెక్కలను సరిచూసి, సర్టిఫై చేయకపోతే ఖజానా అధికారికి తదుపరి నెల వేతనం ఇవ్వకుండా నిలుపుదల చేస్తారు. ఈ మేరకు నిబంధన విధిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
రంగారెడ్డి: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన జెట్టని కుమార్ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఓ వృద్ధురాలిని బలి ఇచ్చినట్లు తెలిసింది. అయితే రెండు రోజులుగా ఇంట్లో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు కొట్టి జరిపినట్లు తెలిసింది. గుర్తుతెలియని ఓ వృద్ధురాలిని బలి ఇచ్చి అందులో పాతిపెట్టినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. జెట్టని కుమార్‌తోపాటు ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐలు శ్రీధర్‌రెడ్డి, చంద్రకాంత్ తెలిపారు. శనివారం ఉదయం గ్రామానికి వెళ్లి తవ్వకాలు జరుపుతామని చెప్పారు. (షాబాద్) -
గుప్తనిధుల కోసం తవ్వకాలు...
వైఎస్సార్ జిల్లా: గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకాలు చేపడుతున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సభ్యులు సహా ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బుడ్డాయపల్లి గ్రామ చెరువులో గుప్త నిధులున్నాయనే నెపంతో కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. దీన్ని గమనించిన స్థానికులు తహశీల్దార్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ రవి చెరువులో అక్రమంగా గుంటలు తీస్తున్న ఇద్దరు వ్యక్తులతో సహా ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
గుప్తనిధుల కోసం చిన్నారి హత్య
* తల్లిని బంధించి, పాప గొంతునులిమి * చంపిన దుండగులు * మృతదేహం వద్ద నిమ్మకాయలతో పూజలు యాలాల: గుప్త నిధుల కోసం ఓ చిన్నారిని బలిచ్చారు. తల్లిని తాళ్లతో బంధించి పాప గొంతు నులిమి ఈ దారుణానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పల లక్ష్మి, భీములు దంపతులకు పూజ(1) అనే కుమార్తె ఉంది. అదే గ్రామానికి చెందిననర్సింహులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టేవాడు. గ్రామంలో పశువులను కూడా అపహరించేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి సమయంలో నర్సింహులు మరో వ్యక్తితో కలసి లక్షి్ష్మ ఇంట్లోకి చొరబడి ఆమెను తాళ్లతో బందించారు. ఆ తర్వాత లక్షి్ష్మ తలపై రాయితో గట్టిగా మోదారు. అనంతరం నిద్రిస్తున్న పూజను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి మెడలో ఉన్న దిష్టిదారంను గొంతుకు బిగించి చంపేశారు. పాప మృతదేహంపై నిమ్మకాయలు, పసుపు, బియ్యాన్ని మంత్రించి పూజలు చేశారు. లక్ష్మిని కూడా బయటకు తీసుకొచ్చి వాకిట్లో పడుకోబెట్టారు. ఇంటికి దాదాపు పది అడుగుల దూరంలో మంటపెట్టి కొన్ని నిమ్మకాయలను కాల్చేసి పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఇరుగుపొరుగు గమనించి లక్షి్ష్మని లేపారు. రాత్రి జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్న ఆమె గ్రామస్తులకు వివరిం చింది. గుప్తనిధుల కోసమే చిన్నారిని బలిఇచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
తల్లిని కట్టేసి... చిన్నారిని బలిగొన్నాడు
-
గుప్తనిధుల కోసం తవ్వకాలు
చ్రందధన (తలకొండపల్లి) : గుప్తనిధుల కోసం దుండగులు ఓ ఆలయంలోని విగ్రహాన్ని తొలగించి తవ్వకాలు జరిపారు. వివరాల్లోకి వెళితే... తలకొండపల్లి మండలం చంద్రధన శివారులోని క్యారమ్ బావి వద్ద పురాతన కాళికాదేవి ఆలయం ఉంది. అందులో గుప్తనిధుల ఉంటాయని భావించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి దాని పైకప్పును కూలగొట్టి లోపల ఉన్న విగ్రహాన్ని పెకిలించి బయటకు పడేసి కింద భాగంలో గజంలోతు తవ్వారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం అక్కడికి పూజలు చేయడానికి వచ్చిన గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను గుర్తించి శిక్షించాలని సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యుడు రాములు డిమాండ్ చేశారు. -
గుప్తనిధుల కోసం నరబలికి యత్నం
వెల్దుర్తి : గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ మేక పిల్లను బలిచ్చి, నరబలి కోసం యువకుడిని సన్నద్ధం చేస్తున్న తరుణంలో ప్రజలు అడ్డుకుని మంత్రగాళ్లను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని నెల్లూర్ గ్రామ శివారు హల్దీవాగు ఒడ్డున ఉన్న చెట్ల పొదల్లో గురువారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి హల్దీవాగు ఒడ్డున గ్రామానికి చెందిన పిట్ల కిషన్, ఆయన భార్య లక్ష్మి, అతడి సోదరులైన శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన పిట్ల రామ్మోహన్, పిట్ల నరేందర్, అదే గ్రామానికి చెందిన పుల్లెర అశోక్, వెల్దుర్తి పంచాయతీ ఎలుకపల్లి గ్రామానికి చెందిన మంద సత్తయ్య, మెదక్‌కు చెందిన భార్యాభర్తలు కుంట నరసింహులు, సువర్ణ, వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్, చిన్నశంకరంపేట మండలం సూరారానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు క్షద్రపూజలు చేస్తూ జంతుబలినిచ్చారు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన రైతులు పలువురు తమ పొలాలకు నీరు కట్టేందుకు అటు వెళుతూ ఈ విషయాన్ని పసిగట్టారు. సమీపంలోకి వెళ్లి చూడగా బలి ఇచ్చిన మేక పిల్ల, పసుపు, కుంకుమ, కారం, నూనె, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అగరొత్తులు చూసి క్షుద్రపూజలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే నరబలికి కూడా సిద్ధం చేస్తున్నట్లు గుర్తించిన వారు విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించారు. ప్రజలు అక్కడికి చేరుకునే లోపు మెదక్‌కు చెందిన నరసింహులు, ఉప్పులింగాపూర్, సూరారం గ్రామాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మిగిలిన వారిని గ్రామస్తులు పట్టుకుని వచ్చి పాత పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అయితే అప్పటికే పరారై కిషన్ ఇంట్లో దాగి ఉన్న మంద సత్తయ్యను గ్రామస్తులు బయటకు తీసుకువచ్చి చితకబాదుతూ పంచాయతీ గదికి తీసుకువచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందిచడంతో వారు వచ్చి వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితులను ఇక్కడ శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారికి నచ్చజెప్పి నిందితులను స్టేషన్‌కు తరలించారు. అయితే గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్న వారికి తీవ్రగాయాలు కావడంతో వారికి మెదక్ ఆస్పత్రికి తరలించారు. విచారణ చేపడుతున్నామని ఏఎస్ఐ మహ్మద్ పాషా తెలిపారు. -
నిధి కోసం కన్నబిడ్డను హతమార్చిన దుర్మార్గుడు
స్నేహితులతో కలిసి దారుణం ఆరుగురి అరెస్ట్ గుండెపోటుతో ప్రధాన నిందితుడి మృతి చిన్నారి మొండెం, తల నరికి హత్య బెంగళూరు, న్యూస్‌లైన్ : నిధి కోసం కన్న బిడ్డను స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన గుల్బర్గా జిల్లా ఫిరోజ్‌బాద్ గ్రామంలో జరిగింది. షాజియా (18 నెలలు) అనే చిన్నారి మొండెం, తల, చేతులు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుల్బర్గాకు చెందిన ముషాక్ (39)ను పోలీసులు విచారణ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. గత నెల 19న జరిగిన సంఘటన వివరాలు... ఫిరోజ్‌బాద్‌లో నివాసముంటున్న శంషాద్‌కు షాజియా అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే శంషాద్ స్నేహితుడు ముషాక్. గుల్బర్గాకు చెందిన ముషాక్ నిధులు ఉన్నాయంటూ పలువురిని మోసగిస్తూ ఉంటాడు. గతనెల ముషాక్, శంషాద్ ఇంటికి వెళ్లాడు. ఓ చిన్నారిని బలి ఇస్తే రూ. కోట్ల విలువైన నిధి లభిస్తుందని శంషాద్‌ను నమ్మించాడు. దీంతో శంషాద్ అతని మాయమాటలు విని గతనెల 19న కుమారుడు షాజియాను తీసుకుని స్నేహితులతో కలిసి ఓ నిర్జన ప్రదేశంలోకి వెళ్లి దారుణంగా హత్య చేశారు. అదే నెల 21న షాజియా కనపడటం లేదని శంషాద్ సహ కుటుంబ సభ్యులు పరహతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేశారు. అదే నెల 26న గ్రామ సమీపంలో బాలుడి చేతులు, మొడం పోలీసులు గుర్తించారు. కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి షాజియా తండ్రి శంషాద్, ముషాక్ సహ ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముషాక్ను విచారణ చేస్తుండగా అతను పోలీసుల ఎదుటే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన గుల్బర్గాలోని బసవేశ్వర ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారని శనివారం పోలీసులు తెలిపారు. నిధుల ఆశతో చిన్నారిని హత్య చేసినట్లు శంషాద్ (బాలుడి తండ్రి)తో సహ ఐదుగురు నేరం అంగీకరించారని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
ఇంటి పెరట్లో కోట్ల విలువజేసే ఖజానా