దాదాపు 300 సంవత్సరాల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని చెప్పారు. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావియెన్స్ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించామన్నారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితోపాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు. మిన్‌జియాంగ్ నదికి ఉపనదిగా పిలిచే జిన్‌జియాంగ్ నది గర్భంలో ఈ సంపద బయటపడిందని సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రెలిక్స్ అండ్ అర్కియాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ తెలిపారు.
Published Tue, Mar 21 2017 3:42 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement