పనామా సిటీలో బయటపడ్డ 1200 ఏళ్ల నాటి సమాది
వెలుగులోకి భారీ ఎత్తున బంగారు నిధి
మరో పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు దక్షిణ అమెరికా దేశంలోని పనామా సిటిలో బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధి తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్‌కి గురయ్యారు. ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చింది. సమాధిలో పెద్ద ఎత్తున బంగారు నిధి తోపాటు చాలా మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి.
ఇది అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. ఆ సమాధిలో బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువు ఉన్నాయని పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో వివరించారు. అందులో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.
అప్పటి ఆచారం ప్రకారం..ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతి పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఆ వ్యక్తుల సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పురావస్తు శాఖ డైరెక్ట్ డాక్టర్ జూలియా. కాగా, సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైనదని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లినెట్ మెంటోనెగ్రో చెబుతున్నారు.
(చదవండి: ప్రపంచంలోనే తొలి బంగారు నౌక..ప్రయాణించాలంటే కోట్లు వెచ్చించాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment