
అమెరికాలోని ఒక పురాతన చర్చి లోపల ఉన్న రహస్యగదిలో శతాబ్దాల నాటి బంగారు నిధిని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్చి లోపలి గోడల్లో చిన్న అల్మరాలా కనిపించే ఒక గదిలో సుమారు 500 సంవత్సరాల నాటి పోలండ్, లిథువేనియా చక్రవర్తుల కిరీటాలు బయటపడ్డాయి. ఈ గదిలో నాణేలు, గొలుసులు, కిరీటాలు, శవపేటిక ఫలకాలు, రాజదండం వంటి ఇతర అమూల్యమైన వస్తువులు కూడా ఉన్నాయి.
మొత్తం 59 పురాతన వస్తువులు, కళాఖండాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితోపాటు, వస్తువులను చుట్టిన ఒక వార్తాపత్రిక ఉంది. ఇది జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత, 1939 సెప్టెంబర్ 7వ తేదీ నాటిది. దీని ఆధారంగా ‘అప్పట్లో సైనిక దాడుల నుంచి రాజసంపదను కాపాడటానికి ఈ రహస్య గదిని నిర్మించి, ఇందులో వీటిని భద్రపరచి ఉండచ్చు’ అని పురావస్తు శాస్త్రవేత్త విద్మంతస్ బెజారస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment