Today Gold and silver Price: దేశంలో పసిడి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం రూ. 250 తగ్గిన పసిడి ఈ రోజు మరింత దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 54,550 వద్ద ఉంది. గురువారం ఈ ధర రూ. 54,700గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.59, 510 గా ఉంది. దాదాపు ఉభయ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. స్వల్పంగా పడి కిలో వెండి ధర రూ.76200 వద్ద కొనసాగుతుంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?)
అంతర్జాతీయంగానూ వెండి,బంగారం ధరలు వెనకడుగువస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో గురువారం పెరిగిన ధరలు నేడు దిగివ చ్చాయి. ఎంసీక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్ 5) చివరి లెక్కన 10 గ్రాములకు రూ. 58,810 వద్ద స్థిరంగా ఉంది. వెండి ఫ్యూచర్స్ (సెప్టెంబర్ 5) 0.12 శాతం లేదా రూ.86 తగ్గి కిలో రూ.69,895 వద్ద ఉంది.గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్‌ను రూ. 59,200 స్టాప్ లాస్‌తో రూ. 59,950 వద్ద విక్రయించాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు.
అయితే జూలై డేటా ప్రకారం అమెరికా వినియోగదారుల ధరలు మధ్యస్తంగా ఉన్నాయి. గురువారం బంగారం ధరలు పెరిగాయి. అలాగే ఫెడ్ వడ్డీ వడ్డనలో కాస్త ఉపశమనం లభిస్తుందనే అంచనాలున్నాయి. సీపీఐ నెమ్మదిగా తగ్గుతూ ఉండటంతో, ముఖ్యంగా సెప్టెంబర్ రివ్యూలో వడ్డీ రేట్లను పెంపు ఉండకపోవచ్చని హై రిడ్జ్ ఫ్యూచర్స్ మెటల్స్ ట్రేడింగ్ డైరెక్టర్ డేవిడ్ మెగర్ అన్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 312 కుప్పకూలి 65, 365 వద్ద ఉండగా,నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 19,444 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment