MCX
-
ఎన్‌పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్‌లో కొత్త బాధ్యతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్‌లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలలో కూడా పనిచేశారు.ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూతఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCXClick here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024 -
డాలరు బలం: దిగొచ్చిన పసిడి, వెండి కూడా అదే బాటలో
Today Gold and Silver Prices: దేశీయ మార్కెట్లో వెండి బంగారం ధరలు మళ్లి దిగివస్తున్నాయి. గత కొన్ని సెషన్లుగా లాభ నష్టాల మధ్య బంగారం ధర బుధవారం మరింత పడింది. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న వడ్డీ రేట్లు, డాలర్ బలం కారణంగా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 280 రూపాయలు క్షీణించి రూ. 59,450 వద్ద ఉంది.అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పతనమై 54,500వద్ద ఉంది. కిలో వెండి ధర 600 రూపాయలు తగ్గి 74, 200 గా ఉంది.హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 59,450 గాను, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి 54, 500 గాను ఉంది. అలాగే కిలో వెండి రూ. 77వేలు పలుకుతోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.58,843 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో, ట్రాయ్ ఔన్స్‌కు 1,903.35 డాలర్లుగా ఉన్నాయి. వెండి కూడా 71,260 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్‌లో బలం పుంజుకోవడంతో బంగారం ధరలు నిన్న ఏకంగా 1.59 శాతం నష్టపోయాయి.మరోవైపు గత రెండు సెషన్లుగా బలహీనంగా ఉన్న దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం పాజిటివ్‌గా ఉన్నాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా కొనుగోళ్లు పుంజుకోవడం లాభాల్లోకి మళ్లాయి. నిఫ్టీ 19700 పైకి, సెన్సెక్స్ 66వేల ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి కూడా స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. -
పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!
Today Gold and Silver Prices: దేశంలో బంగారం , వెండి ధరలు పైపైకే చూస్తున్నాయి. గతరెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం మరింత ఎగిసింది. అటు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పరుగాపక పయనిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పెరుగుతున్న చమురు, డాలరు బలం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) (సెప్టెంబర్ 18, సోమవారం నా డు )లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 105 పెరిగి 10 గ్రాములకు రూ.59,098గా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 307 లేదా 0.43 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 72,461 వద్ద ట్రేడవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర 140 రూపాయిలు పెరిగి, 10గ్రాములకు 55,050 గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పుంజుకుని 60.050పలుకుతోంది. అటు వెండి కిలో స్వల్పంగా 200 రూపాయిలు తగ్గి కిలో వెండి 74,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు వరస లాభాలకుచెక్ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి జారుకున్నాయి.మరోవైపు పెరుగుతున్న చమురు ధరల కారణంగా భారత కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 83.22 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. -
షాకిస్తున్న బంగారం ధర: కొనగలమా? నవంబరు నాటికి..!
Today Gold and Silver prices రికార్డు స్థాయి నుంచి కిందికి దిగివచ్చినట్టే వచ్చిన పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రానున్న పండుగల సీజన్లో బంగారానికి డిమాండ్ పెరనున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలను పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో వెండి బంగారం మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. శనివారం నాడు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 55,000కి చేరుకున్నాయి .అలాగే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60వేల దిశగా కదులుతోంది.(జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగి రూ. 54,900 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 220పెరిగి రూ. 59,890 వద్ద ఉంది. అటే వెండి కూడా లాభాల్లోనే ఉంది. రూ. 700రూపాయలు ఎగిసి కిలోవెండి ధర రూ. 78,200 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ ఉండే బ్యాక్-టు-బ్యాక్ పండుగల నేపథ్యంలో సెప్టెంబరు- నవంబర్ త్రైమాసికంలో పసిడి మెరుస్తూనే ఉంటుందని,ఈ నవంబర్ 2023 చివరి నాటికి 62 వేలకు దాటవచ్చనేది అంచనా. యూఎస్ ఆర్థిక డేటా , డాలర్ , ముడి చమురు ధరలలో పెరుగుదలో అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఔన్సు 2,090డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ముగిసింది. ఏది ఏమైనా బంగారం ధరలు యూఎస్ ఫెడ్ ధోరణి, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కరెన్సీ డాలరు కదలికల ఆధారంగా మారుతూ ఉంటాయి అనేది గమనార్హం. (భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు) -
గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం
Today Gold and Silver Price పండుగల వేళ బంగారం ప్రియులకు తీపి కబురు. భారతీయ మార్కెట్లో రెండు రోజులు వరుసగా పెరిగిన వెండి బంగారం ధరలు (సెప్టెంబర్ 13, 2023 )బుధవారం దిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా వెండి బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి.22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.340 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.380లు తగ్గి 59,450 పలుకుతోంది. వెండి కిలో ఏకంగా వెయ్యి రూపాయిలు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 73,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 74 లేదా 0.13 శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ. 58,592 వద్ద ఉంది. క్రితం ముగింపు రూ.58,626గా నమోదైంది. అదేవిధంగా డిసెంబర్ 5, 2023న వెండి ఫ్యూచర్స్ రూ. 385 లేదా 0.54 శాతం పతనాన్ని చవిచూశాయి .మునుపటి ముగింపు రూ. 71,934తో పోలిస్తే కిలోకు రూ. 71,750 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బుధవారం నాడు బంగారం ధరలు పడిపోయాయి. అయితే మునుపటి సెషన్లో రెండు వారాల కనిష్ట స్థాయికి స్వల్పంగా అధిగమించాయి. . అమెరికా మార్కెట్, ద్రవ్యోల్బణ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందా అనే కీలక అంశాలకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 1,910.87 డాలర్లు వద్ద ఉంది. ఆగస్టు 25 తరువాత నిన్న(మంగళవారం) 1,906.50 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.8 శాతం తగ్గి 22.92 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి.సెన్సెక్స్ ఏకంగా 330 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 20090 వద్ద రికార్డు స్తాయిలో కొనసాగుతోంది. -
వామ్మో! హీటెక్కుతున్న బంగారం ధరలు
Today Gold and Silver prices: బంగారం, వెండి ధరలు మళ్లీ మండుతున్నాయి. ఆల్ టై హై నుంచి కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ, డాలర్ బలంతో మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు వేగం పుంజకున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.54,750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 270పెరిగి రూ. 59,670 పలుకుతోంది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలోకు రూ. 200 పెరిగిన వెండి ధర కిలోకు 77. 100గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. MCX మార్కెట్లో వరుసగా రెండో రోజు జంప్ ఆగస్టు 29, మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 90 లేదా 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.58,949గా ఉంది.అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న మెచ్యూరయ్యే వెండి ఫ్యూచర్లు కూడా రూ. 162 లేదా 0.22 శాతం పెరిగి కిలోకు రూ. 73,700 వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధర స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,924.84కి చేరుకుంది, ఆగస్టు 10 నుండి అత్యధికం. అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,952.90 డాలర్ల వద్ద ఉన్నాయి. వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 24.32 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడ్ సెప్టెంబర్ పాలసీ నిర్ణయం, ఆగస్ట్ లేబర్ మార్కెట్ డేటా ఆధారంగా బంగారం ధరలు కదలాడుతాయని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయింది. సోమవారం నాటి ముగింపు 82.62 తో పోలిస్తే మంగళవారం 82.70 వద్ద ముగిసింది. -
గుడ్ న్యూస్: అమెరికా షాక్, దిగొస్తున్న పసిడి
Today Gold and silver Price: దేశంలో పసిడి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం రూ. 250 తగ్గిన పసిడి ఈ రోజు మరింత దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 54,550 వద్ద ఉంది. గురువారం ఈ ధర రూ. 54,700గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.59, 510 గా ఉంది. దాదాపు ఉభయ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. స్వల్పంగా పడి కిలో వెండి ధర రూ.76200 వద్ద కొనసాగుతుంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?) అంతర్జాతీయంగానూ వెండి,బంగారం ధరలు వెనకడుగువస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో గురువారం పెరిగిన ధరలు నేడు దిగివ చ్చాయి. ఎంసీక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్ 5) చివరి లెక్కన 10 గ్రాములకు రూ. 58,810 వద్ద స్థిరంగా ఉంది. వెండి ఫ్యూచర్స్ (సెప్టెంబర్ 5) 0.12 శాతం లేదా రూ.86 తగ్గి కిలో రూ.69,895 వద్ద ఉంది.గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్‌ను రూ. 59,200 స్టాప్ లాస్‌తో రూ. 59,950 వద్ద విక్రయించాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. అయితే జూలై డేటా ప్రకారం అమెరికా వినియోగదారుల ధరలు మధ్యస్తంగా ఉన్నాయి. గురువారం బంగారం ధరలు పెరిగాయి. అలాగే ఫెడ్ వడ్డీ వడ్డనలో కాస్త ఉపశమనం లభిస్తుందనే అంచనాలున్నాయి. సీపీఐ నెమ్మదిగా తగ్గుతూ ఉండటంతో, ముఖ్యంగా సెప్టెంబర్ రివ్యూలో వడ్డీ రేట్లను పెంపు ఉండకపోవచ్చని హై రిడ్జ్ ఫ్యూచర్స్ మెటల్స్ ట్రేడింగ్ డైరెక్టర్ డేవిడ్ మెగర్ అన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 312 కుప్పకూలి 65, 365 వద్ద ఉండగా,నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 19,444 వద్ద కొనసాగుతోంది. -
శ్రావణ శుక్రవారం వచ్చేస్తోంది: దిగొస్తున్న బంగారం, వెండి ధరలు
Today Gold and Silver Price: దేశంలో వెండి, బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్మార్కెట్ పసిడి ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు 100 రూపాయలకుతగ్గి, 54,950వద్ద ఉంది. తద్వారా 55వేల దిగువకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10గాముల బంగారం ధర 110రూపాయలు క్షీణించి 59,950 వద్ద ఉంది. వెండి ధర కూడా అదే బాటలోఉంది. కిలో వెండి ధర రూ.600 క్షీణించి రూ. 76,700 వద్ద ఉంది. (HBDMaheshBabu: మహేష్‌బాబు నెట్‌వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వరుసగా రెండు రోజులు భారతీయ మార్కెట్లో దిగువన ఉన్న ధరలు (ఆగస్టు 9 బుధవారం) బంగారం వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 82 పెరిగి 10 గ్రాములకు రూ.59,347గా ఉంది. అదేవిధంగా, సెప్టెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 309 లేదా 0.44 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 70,538 వద్ద ట్రేడవుతున్నాయి. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ యూఎస్ వృద్ధ రేటును డౌన్‌గ్రేడ్ గ్లోబల్‌గా బంగారం ధరలు మునుపటి సెషన్‌లోని నెల కనిష్టంనుంచి తిరిగి పుంజుకున్నాయి. తాజా మెటల్ నివేదిక ప్రకారం, స్పాట్ బంగారం 0345 GMT నాటికి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,929.99 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,963.80 డాలర్ల వద్ద ఉన్నాయి. -
దిగొస్తున్న పసిడి, వెండి భారీ పతనం
Gold Price Today 28th July అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేటుపెంపుతో శుక్రవారం బంగారం ధరలు దిగి వచ్చాయి. శ్రావణ శుక్రవారం సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం శుభ సంకేతంగా మారింది. అటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. యూఎస్ ఫెడ్ రీసెంట్ రివ్యూలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేపు పెంపుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు దూసుకు పోతోందన్న అందోళన మొదలైంది. దీంతో అమెరికా కరెన్సీ డాలరు నష్టాల్లోకి జారుకుంది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలపై చూపుతోంది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) హైదరాబాదులో 22 క్యారట్ల బంగారం 10 గ్రాములకి 350 రూపాయలుదిగి వచ్చి ధర రూ. 55,100 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 380 పతనమై రూ. 60,110 గా ఉంది. వెండి ధర కూడా దిగి వచ్చి 80 వేల దిగువకు చేరింది. ఇటీవలి కాలంలో బాగా పెరుగుతూ వస్తున్న వెండి ధర శుక్రవారం ఏకంగా 2 వేల రూపాయలు పతనమైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 79,500 గాఉంది. (హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి కొద్దిగా పుంజుకుంది. ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 59,565 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కూడా రూ.128 లేదా 0.17శాతం పెరిగి కిలోకు రూ.73,875 వద్ద ట్రేడవుతున్నాయి. (ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) అంతర్జాతీయంగా బంగారం ధరలు వోలటైల్‌గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ 0.3శాతం పెరిగి ఔన్స్‌కు 1,951.19 డాలర్లుగా ఉంది. అంతకుముందు జూలై 12న కనిష్ట స్థాయిని తాకింది. అలాగే మునుపటి సెషన్లో 1.4 శాతం క్షీణించింది. ఈ వారంలో ఇప్పటివరకు బులియన్ 0.4శాతం పతనాన్ని నమోదుచేసింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 1,950డాలర్ల వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి! -
July 8th 2023: మూడు నెలల కనిష్టానికి బంగారం ధర,మరింత పెరగకముందే కొనేద్దామా?
రోజుకు రోజుకు దిగి వస్తున్న పసిడి ధరలు కొనుగోలు దారులను ఊరిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ పెంపు ఆందోళన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈప్రభావం బంగారం ధరలపై కూడా చూపిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో బంగారం ధరలు కూడా దిగి వస్తున్నప్పటికీ భారీ ఒడిదుడుకులు మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే జూన్ నెలలో బంగారం ధరలు ఏకంగా 3.3 శాతం మేర తగ్గాయి. బంగారం ధరలు జూలై నెల తొలి వారాన్ని పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారంతో ముగిసిన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రా. రూ.392 ఎగిసింది. అయితే ఎంసీఎక్స్‌లో బంగారం ధర దాదాపు రూ. 58,350 వద్ద మూడు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీ వచ్చింది. ధరల తగ్గుదల ఆగి పోయిందని భావిస్తున్నప్పటికీ రానున్న కాలంలో ఏ మాత్రం తగ్గినా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా కొనుగోళ్లకు ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు. అమెరికా జాబ్ డేటా ,అమెరికా డాలర్‌పై కూడా ఒత్తిడి తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ.400పెరిగి రూ. 54550 వద్ద ఉంది. అటు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రా. రూ. 59510 వద్ద ఉంది. అలాగే వెండి ధర కిలో వెయ్యి రూపాయలు ఎగిసి హైదరాబాద్‌లో రూ. 76700 పలుకుతోంది. -
Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్ న్యూసేనా?
సాక్షి,ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం బంగారం ధరలుభారీగా తగ్గాయి. రూ. 500కుపైగా క్షీణించి 10 గ్రాములకు రూ. 59,251స్థాయికి చేరింది. శుక్రవారం 10 గ్రాములు రూ. 59,751గా ఉంది. వెండి ధర కూడా కిలోకి రూ.409 తగ్గి రూ.71,173కి పడిపోయింది. (ఇదీ చదవండి: NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?) హైదరాబాద్మార్కెట్లో రూ. 300 క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి కూడా 500 తగ్గి 74000గా ఉంది. (NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే) ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 3, 2023) పది గ్రాములకు రూ. 59251 వద్ద ట్రేడవుతోంది. అలాగే శుక్రవారం రూ.1582 పెరిగిన కిలో వెండి ధర రూ.71173 వద్ద ట్రేడవుతోంది. (మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!) అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో కూడా బంగారం వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. ఏప్రిల్ 2023 ఫ్యూచర్స్ రూ. 342.00 పతనంతో రూ. 59,060.00 వద్ద, మే 5, 2023న వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రూ. 604.00 పతనంతో రూ.71,614.00 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4.33 డాలర్ల లాభంతో 1,953.72 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్స్‌కు 0.21 డాలర్లు తగ్గి 23.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారంలో తగ్గిన ఆదాయాలు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2022 లో బంగారం ఇన్వెస్టర్లకు రాబడులను ఇవ్వ లేకపోయింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితులు బంగారం ధరలకు కీలకంగా మారాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 వరకు నికరంగా బంగారం ధరలు 2 శాతం క్షీణించాయి. డాలర్‌తో రూపాయి సుమారు 11.5 శాతం క్షీణించడం వల్ల ఎంసీఎక్స్ గోల్డ్ ధరలు 13 శాతం పెరిగాయి. ఒక సాధనంగా బంగారంపై ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయని బంగారం ధరల్లో అస్థిరతలు తెలియజేస్తున్నాయి. ఈ అస్థిరతలకు దారితీసిన వివిద అంశాలు ఏంటి? 2023లో బంగారంలో పెట్టుబుడులు పెట్టే ఇన్వెస్టర్లకు రాబడుల అంచనాలను పరిశీలిస్తే.. ద్రవ్య విధాన కఠినతరం ప్రతికూలం యూఎస్ ఫెడ్ 2022లో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం మరింత సంక్లిష్టంగా మారింది. డాలర్ పరంగా బంగారం పనితీరు తగ్గడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకు దవ్య్ర పరపతి విధానాన్ని కఠినతరం చేయమే. అలాగే, బంగారం డిమాండ్‌ను ఆభరణాల డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోలు డిమాండ్, గోల్డ్ ఈటీఎఫ్ లు, బంగారం బార్లు, నాణేలు నిర్ణయిస్తుంటాయి. నిల్వలు పెంచుకోవడం.. సెంట్రల్ బ్యాంకులు ఏటా తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. 2022 కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2022 మూడో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 400 టన్నుల వరకు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా డేటా పేర్కొంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ సెంట్రల్ బ్యాంకులు నికరంగా కొనుగోళ్లు చేశాయి. దీంతో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 673 టన్నుల కొనుగోలుకు దారితీసింది. 1967 తర్వాత మరే సంవత్సంతో పోల్చినా ఈ ఏడాదే అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు 2022 నవంబర్‌లో వరుసగా ఏడో నెల నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి నికరంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి 83 టన్నులకు సమానమైన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. కాయిన్లు, ఆభరణాల డిమాండ్ కరోనా సమయంలో నిలిచిపోయిన డిమాండ్ కూడా డోడు కావడంతో, మొదటి మూడు నెలల కాలంలో బంగారం బార్లు, కాయిన్లు, ఆభరణాల స్థిరమైన కొనుగోళ్లకు దారితీసింది. ఒకవైపు ఈ కొనుగోళ్లు, మరోవైపు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని కొంత భర్తీ చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా నెలక్నొ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలకు సరైన ప్రోత్సాహం లేదు. 2023పై అంచనాలు అధిక వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రష్యా, చైనాల్లో తిరోగమన పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఐరోపాలో క్షీణిస్తున్న వృద్ధి నేపథ్యంలో మాంద్యంపై చర్చకు దారితీసింది. చైనా వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంటుందన్న జూన్ అంచనాలను ప్రపంచబ్యాంకు 2.7 శాతానికి తగ్గించేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో తగ్గడం అన్నది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోనూ క్షీణతకు కారణమవుతుంది. డాలర్‌కు, కమోడిటీల మధ్య విలోమ సహ సంబంధం ఉంటుంది. రెండేళ్ల పాటు వరుసగా పెరిగిన డాలర్ ఇండెక్స్ ఇటీవల కొంత వరకు తగ్గింది. 2023లోనూ డాలర్ క్షీణత కొనసాగితే.. సహ విలోమ సంబంధం వల్ల బంగారం, వెండి లాభపడనున్నాయి. మరోవైపు మాంద్యం సమయాల్లో సహజంగా బంగారం మంచి పనితీరు రూపంలో రక్షణనిస్తుంది. గత ఏడు మాంద్యం సమయాల్లో ఐదు సందర్భాల్లో బంగారం సానుకూల రాబడులను ఇచ్చింది. కనుక 2023లో బంగారం రెండంకెల రాబడులను ఇస్తుందని అంచనా వేస్తున్నాం. బంగారం ధరలు 10 గ్రాములు రూ.58,000 వరకు పెరగొచ్చు. రూ.48,000–50,000 మధ్య కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతి పతనంలోనూ బంగారాన్ని సమకూర్చుకోవచ్చన్నది మా సూచన. ప్రథమేష్ మాల్య, ఏవీపీ – రీసెర్చ్, ఏంజెల్ వన్ లిమిటెడ్ -
కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!
సాక్షి,ముంబై: బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధరలు దూసు కెడుతున్నాయి. ఇటీవల కాస్త స్తబ్దుగా ఉన్న పసిడి ధర భారీగా పెరిగింది. అటు వెండి ధర గణనీయంగా పుంజుకుంది. తాజాగా గ్రాము బంగారం రూ.54 వేల మార్క్‌ను దాటేసింది. దీంతో త్వరలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే సూచనలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో ఉంది. వెయ్యిరూపాయలకు పైగా జంప్ చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర 350 రూపాయలకు పైగా పెరిగింది. ఎంసీఎక్స్ ఫిబ్రవరి కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.362 లేదా 0.67 శాతం పెరిగి రూ. 54212కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కిలో వెండి ధర రూ.850-900 పెరిగింది. ఫిబ్రవరి డెలివరీ వెండి ధర ప్రస్తుతం రూ.851 లేదా 1.28 శాతం పెరిగి కిలో రూ.67300కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక డిమాండ్ పెరగడం ఈ గణనీయమైన పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత ఆరు నెలల్లో ఎంసీఎక్స్ బంగారం ధర రూ.54,000కి చేరడం ఇదే తొలిసారి. (StockMarketUpdate: కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి) దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.227 పెరిగి రూ.54,386కి చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ.1,166 పెరిగి రూ.67,270కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో సానుకూల సంకేతాల మధ్య డిసెంబర్ 5 సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లోరం 999 స్వచ్ఛత బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ.53,972గా ఉంది, శుక్రవారం ముగింపు ధర రూ.53,656 నుంచి రూ.316 పెరిగింది. అలాగే 999 స్వచ్ఛత వెండి కిలో రూ. 65,891గా ఉంది. (ఈ స్కీంలో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు) ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 11.15 డాలర్లు లేదా 0.62 శాతం పెరిగి 1,820.75 డాలర్ల వద్ద, వెండి ఔన్స్‌కు 0.245 డాలర్లు లేదా 1.01 శాతం బలంతో 23.485 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ట్రెండ్ బుల్లిష్‌గా ఉందని బులియన్ వర్తకులు చెబుతున్నారు. డాలర్ బలహీనత కారణంగా, చమురు ధరల సెగ కారణంగా బంగారం ధరలు పెరిగాయని ఎనలిస్టుల అంచనా. (అందాల ఐశ్వర్యమా, కింగ్ లాంటి కుర్రాడా? ఎవరు కావాలి?) -
షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధరలు..వెండి వెయ్యికి పైగా..!
అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, సిల్వర్ ధరలు సోమవారం రోజున భారీగా పెరిగాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశాలు, రష్యా-ఉక్రెయిన్ వార్, ప్రపంచ ద్రవ్యోల్భణ ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక సిల్వర్ ఒకరోజులోనే రూ. 1000కిపైగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .53, 148 వద్ద ట్రేడవుతోంది. ఇక సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్‌సీఎక్స్‌లో రూ.69, 976వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. హైదరాబాద్‌లో సోమవారం 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.320కి పైగా పెరిగి రూ. 54,380కి చేరుకుంది. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి, రూ.49,850కి పెరిగింది. సిల్వర్ ధరలు సోమవారం ఏకంగా రూ. 1000పైగా పెరిగి కిలో సిల్వర్ ధర రూ. 75,200కు చేరుకుంది. మంగళవారం సిల్వర్ ధరలు కాస్త తగ్గాయి. కేజీ సిల్వర్ ధర రూ. 300 తగ్గి రూ. 74,900 వద్ద ఉంది. చదవండి: ఆరు వారాల్లో అతిపెద్ద నష్టం -
బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్..! రెండు రోజుల్లో ఏకంగా...
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలో నే బంగారం ధరలు సుమారు రూ. 500 వరకు పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో అంతర్జాతియంగా గోల్డ్ ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .52,860 వద్ద ట్రేడవుతోంది. కాగా నేడు 10 గ్రాముల బంగారం ధర రూ. 18 తగ్గడం విశేషం. ఇక సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్‌సీఎక్స్‌లో కిలోకు రూ.147 పెరిగి రూ.68,937 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.440కి పైగా పెరిగి ₹53,460కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010కి పెరిగింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 గా వుంది.. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.53,020 నుంచి రూ.53,460కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. -
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!
బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో గోల్డ్ ధర 0.05 శాతం పెరిగి ₹51,840 వద్ద ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం రోజు రోజుకి మరింత తీవ్రతరం కావడంతో ఆ ప్రభావం ఇప్పుడు పెట్రోల్, బంగారం ధరల మీద భారీగా పడింది. దీంతో, అంతర్జాతీయంతో పాటు దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ క్షీణించడం కూడా పుత్తడి ధరలు పెరిగడానికి ఒక కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛతతో కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పైగా పెరిగి ₹51,567కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పైగా పెరిగి ₹47,235కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46700 నుంచి రూ.47,700కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.1000 పెరిగింది అన్నమాట. #Gold and #Silver Opening #Rates for 02/03/2022#IBJA pic.twitter.com/gFFu4Yu0wP — IBJA (@IBJA1919) March 2, 2022 ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.1090 పెరిగి రూ.52,040కి చేరుకుంది. అలాగే, ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1700కి పైగా పెరిగి రూ.₹67,030కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: యూజర్ల మతిపోగొడుతున్న జీప్ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు..!) -
బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు
ముంబై: కొద్ది నెలలుగా బుల్ ధోరణిలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా కమోడిటీలలో ట్రేడింగ్ క్షీణిస్తూ వస్తోంది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్)లో లావాదేవీల పరిమాణం నీరసిస్తోంది. ఎంసీఎక్స్‌లో ప్రధానమైన పసిడిలో లావాదేవీలు కొన్నేళ్ల కనిష్టానికి చేరాయి. వెరసి కమోడిటీ ఎక్ఛేంజీలో నిరుత్సాహకర పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇతర విభాగాలలోనూ ట్రేడింగ్ తగ్గుతూ వచ్చినట్లు తెలియజేశారు. 2011 గరిష్టంతో పోలిస్తే పరిమాణం తగినంతగా పుంజుకోలేదని వివరించారు. ఇదీ తీరు 2011లో రోజువారీగా ఎంసీఎక్స్‌లో సగటున రూ. 48,326 కోట్ల టర్నోవర్ నమోదైంది. ప్రస్తుతం రూ. 28,972 కోట్లకు పరిమితమవుతోంది. ఇది 40 శాతం క్షీణతకాగా.. పసిడి ఫ్యూచర్స్‌లో లావాదేవీలు మరింత అధికంగా 54 శాతం పతనమయ్యాయి. రోజువారీ సగటు టర్నోవర్ రూ. 5,723 కోట్లకు చేరింది. 2011లో రూ. 12,436 కోట్లు చొప్పున రోజువారీ సగటు టర్నోవర్ నమోదైంది. చమురు డీలా ఎంసీఎక్స్‌లో మరో ప్రధాన విభాగమైన చమురులో ట్రేడింగ్ సైతం ఇటీవల వెనుకంజ వేస్తోంది. చమురు ఫ్యూచర్స్‌లో రోజువారీ సగటు టర్నోవర్ 2012లో రూ. 9,421 కోట్లను తాకింది. మొత్తం ఎఫ్‌అండ్‌వోను పరిగణిస్తే రూ. 9,963 కోట్లుగా నమోదైంది. అయితే 2021లో రూ. 5,280 కోట్లకు ఈ పరిమాణం పడిపోయింది. 2014 నుంచీ ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్‌కు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), ఈటీఎఫ్‌లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు)ను అనుమతించినప్పటికీ లావాదేవీలు పుంజుకోకపోవడం గమనార్హం! చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! స్టాక్ ఎక్ఛేంజీల స్పీడ్ దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడర్లను భారీగా ఆకట్టుకోవడంతో ఎంసీఎక్స్ వెనుకబడుతూ వచ్చింది. ప్రస్తుతం బీఎస్ఈలో 7.8 కోట్ల మంది, ఎన్ఎస్ఈలో 4.5 కోట్లమంది ప్రత్యేకతరహా రిజస్టర్డ్ క్లయింట్లు(యూసీలు) నమోదై ఉన్నారు. 2003 నుంచి బులియన్, చమురు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పోటీయేలేని ఎంసీఎక్స్ 2021 జులైకల్లా 69.86 లక్షల మంది యూసీలను మాత్రమే కలిగి ఉంది. అయితే ఇదే కాలంలో ఎంసీఎక్స్ షేరు మాత్రం 2013 ఆగస్ట్‌లో నమోదైన రూ. 290 నుంచి 2020 అక్టోబర్‌కల్లా రూ. 1,875కు చేరింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 7,482 కోట్లను తాకింది. ప్రధానంగా సుప్రసిద్ధ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఎంసీఎక్స్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో షేరు ర్యాలీ చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కోటక్ వాటా 15శాతం.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం కోటక్ గ్రూప్ 15 శాతం వాటాను కలిగి ఉంది. 2021 మార్చికల్లా రూ. 685 కోట్ల నగదు నిల్వలను కలిగి ఉంది. ఇటీవల సాంకేతిక సేవల కోసం టీసీఎస్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఎంసీఎక్స్ ట్రేడింగ్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తోంది. కొంతకాలంగా పసిడిలో స్పాట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కు వీలైన టెక్నాలజీని సొంతం చేసుకోవడంలో ఎంసీఎక్స్ సమస్యలు ఎదుర్కొంటోంది. కాగా.. ఎక్సే్ఛంజీలలో 100 శాతం యాజమాన్యవాటాకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించనుందన్న వార్తలతో ఎంసీఎక్స్ షేరుకి మరింత బూస్ట్ లభించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
పెరుగుతున్న బంగారం ధర
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కొంతమేరకు ధరలు తగ్గగా.. ఈ సోమవారం (జూలై 26, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్కి సంబంధించి ప్రారంభ సెషన్లో రూ.94.00 పెరిగి రూ.47628.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 పెరిగి రూ.47902.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.48,000 పైకి చేరుకున్న పుత్తడి చివరి సెషన్లలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక వెండికి సంబంధించి సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 పెరిగి రూ.67213.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 పెరిగి రూ.68380.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. డెల్టా వేరియంట్ భయాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లు సేఫ్‌గా భావించడంతో ఆ ప్రభావం ధరలపై కనిపించింది. -
Gold Prices: మళ్లీ పెరుగుతున్న ధరలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో పుత్తడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. శుక్రవారం అంతర్జాతీయంగా యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి బంగారం ధరలు ఔన్స్ ధర 1,902.90 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 5 డెలివరీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో బంగారు ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 49,346 రూపాలు పలుకుతోంది. డాలరు బలహీనం, బ్లాండ దిగుమతి పుత్తడి ధరలను ఊతమిస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాల మధ్య ఫెడరల్ రిజర్వ్ సరళ ద్రవ్య విధానం సరిపోదని విశ్లషకులు భావిస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) అధికారిక ట్విటర్ సమాచారం ప్రకారం స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 48,750 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి పది గ్రాములకు రూ. 47,090, 18 క్యారెట్ల బంగారం రూ. 39,000 గాను ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 300 రూపాయలు ఎగిసిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 50,500 వద్ద, 22 క్యారెట్ల బంగారం 10 గ్రా ధర రూ.46,100గా ఉంది. 1000 రూపాయలు పెరిగిన కిలో వెండి ధర రాజధాని నగరంలో వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 71224 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా 1000 రూపాయలు ఎగిసింది. కిలో వెండి రూ. 77100 గా ఉంది. కాగా గత వారం 10 గ్రాముల బంగారం ధర 49,700 రూపాయల వద్ద ఐదు నెలల గరిష్ట స్థాయిని తాకిన తరువాత బంగారం ధరలు దిగొచ్చాయి. వరుసగా సెషన్లలో క్షీణించి రికార్డు స్థాయి నుంచి సుమారు 7వేల రూపాయలు మేర పడిపోయింది. అయితే 49500 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంచనాలకు అనుగుణంగానే పసిడి ధర మళ్లీ పుంజుకుంటోంది. చదవండి: Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ! stockmarkets: రికార్డుల మోత -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. అటు స్పాట్, ఇటు ఫ్యూచర్స్ మార్కెట్లో వరుసగా ఆరో రోజు క్షీణించాయి. ఈ బాటలో విదేశీ మార్కెట్లోనూ వెనకడుగులో కదులుతున్నాయి. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో బంగారం(24 క్యారట్స్) 10 గ్రాములు తాజాగా రూ. 239 నష్టపోయి రూ. 45,568కు చేరింది. ఎంసీఎక్స్‌లోనూ రాత్రి 8 గంటల ప్రాంతంలో రూ. 98 నీరసించి రూ. 46,028 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 45,861 వరకూ క్షీణించింది. ఇది 8 నెలల కనిష్టంకావడం గమనార్హం! ఇక న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం తక్కువగా 1,772 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి ఏప్రిల్ ఫ్యూచర్స్కాగా.. స్పాట్ మార్కెట్లో 1,773 డాలర్ల వద్ద కదులుతోంది. ఇవి మూడు నెలల కనిష్టం! దశాబ్ద కాలంలోనే అత్యధిక రాబడి... కొత్త ఏడాది(2021)లో బంగారం ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో 25 శాతంపైగా జంప్‌చేశాయి. ప్రపంచదేశాలను వణికించిన కోవిడ్–19 నేపథ్యంలో గతేడాది పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో లిక్విడిటీ పెరిగి పసిడిలోకి పెట్టుబడులు మళ్లినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావించే సంగతి తెలిసిందే. దీంతో పసిడిలో పెట్టుబడులకు వివిధ దేశాల కేంద్ర బ్యాం కులతోపాటు.. ఈటీఎఫ్ సంస్థలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం జోరుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా 2020లో దశాబ్ద కాలంలోనే అత్యధికంగా రాబడి ఇచ్చినట్లు తెలిపారు. గరిష్టం నుంచి రూ. 10,000 పతనం గత ఆగస్ట్‌లో 10 గ్రాముల పసిడి ఎంసీఎక్స్‌లో రూ. 56,200ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. తదుపరి ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగింది. అయితే ఇటీవల అమ్మకాలు పెరగడంతో డీలా పడుతూ వచ్చింది. దీంతో 2021లో ఇప్పటివరకూ 8 శాతం లేదా రూ. 4,000 క్షీణించింది. వెరసి రికార్డ్ గరిష్టం నుంచి చూస్తే ఆరు నెలల్లో 18 శాతం(రూ. 10,000) కోల్పోయింది. ఇక విదేశీ మార్కెట్లోనూ ఆగస్ట్ 7న ఔన్స్ 2072 డాలర్లను అధిగమించింది. ఆర్థిక వ్యవస్థకు దన్నునిచ్చే బాటలో యూఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లకుపైగా ప్యాకేజీకి సన్నాహాలు చేస్తుండటం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక సీఈవో నిష్ భట్ అభిప్రాయపడ్డారు. ఈల్డ్స్ పుంజుకుంటే పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరుగుతాయని, దీంతో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. ఆర్థిక రికవరీ సంకేతాలు... ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అంటే యూఎస్ ఆర్థిక రికవరీకి సంకేతంగా భావిస్తామని భట్ పేర్కొన్నారు. సాంకేతికంగా చూస్తే రూ. 46,000 ధర.. ఫిబోనకీ రీట్రేస్మెంట్ ప్రకారం 50 శాతానికి దగ్గరగా ఉన్నట్లు క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ నిపుణులు క్షితిజి పురోహిత్ పేర్కొన్నారు. రోజువారీ చార్టుల ప్రకారం చూస్తే 200 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే దిగువన కదులుతున్నట్లు వివరించారు. రూ. 46,000 స్థాయిలో పసిడిలో కొనుగోళ్లకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే వీలున్నట్లు అంచనా వేశారు. స్వల్పకాలిక ట్రెండ్ బలహీనంగా ఉన్నప్పటికీ రూ. 44,500 వద్ద పటిష్ట మద్దతు లభించగలదని అంచనా వేశారు. సహాయక ప్యాకేజీ కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టవచ్చన్న అంచనాలు పెరిగినట్లు కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే ఇటీవల పసిడి క్షీణత నేపథ్యంలో మరింత పతనంకావచ్చన్న అంచనాలు సరికాదని అభిప్రాయపడింది. వెరసి ఫ్రెష్ షార్ట్‌సెల్లింగ్‌ను చేపట్టకపోవడం మేలని ట్రేడర్లకు సూచించింది. ఇవీ కారణాలు.. ► పసిడి వెనకడుగుకు పలు కారణాలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో ఈల్డ్స్ పుంజుకుంటున్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు. ► యూఎస్ కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ భారీ ఉపశమన ప్యాకేజీకి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. జీడీపీ రికవరీ సాధిస్తే అధిక రిస్క్– అధిక రిటర్నుల సాధనాలకు పెట్టుబడులు మళ్లుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారంకంటే ఈక్విటీలు తదితరాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. ► ఇటీవల కోవిడ్–19 కట్టడికి గ్లోబల్ ఫార్మా కంపెనీలు పలు దేశాలలో వ్యాక్సిన్లను విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడిలో సెంటిమెంటు బలహీనపడిందని విశ్లేషకులు తెలియజేశారు. ► దేశీయంగా చూస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. వెరసి తాజాగా పసిడి ధరలు సాంకేతికంగా కీలకమైన రూ. 46,000 మార్క్ దిగువకు చేరినట్లు పేర్కొన్నారు. -
కుప్పకూలిన పసిడి- వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: డెమొక్రటిక్ నేత జో బైడెన్ యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. ఇందుకు ప్రధానంగా 10ఏళ్ల కాలపరిమితిగల అమెరికన్ ట్రెజరీ ఈల్డ్స్ 1 శాతానికిపైగా పుంజుకోవడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 90 ఎగువకు బలపడటం వంటి అంశాలు కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో పల్లాడియంసహా విలువైన లోహాల ధరలు ఉన్నట్టుండి పతనమయ్యాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 2,000(4 శాతం) క్షీణించగా.. వెండి కేజీ మరింత అధికంగా రూ. 6,000(9 శాతం)కుపైగా పడిపోయింది. ఇక న్యూయార్క్ కామెక్స్‌లోనూ ఔన్స్ పసిడి 78 డాలర్లు కోల్పోయింది. వెండి అయితే ఏకంగా 10 శాతం కుప్పకూలింది. ఔన్స్ 25 డాలర్ల దిగువకు చేరింది. వివరాలు చూద్దాం.. (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) వ్యాక్సిన్ల ఎఫెక్ట్ అమెరికా, బ్రిటన్‌సహా పలు దేశాలు కోవిడ్-19 కట్టడికి వీలుగా వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రారంభించాయి. ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు అత్యవసర ప్రాతిపదికన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు మార్చి తదుపరి ట్రెజరీ ఈల్డ్స్ గరిష్టానికి చేరడంతో పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరగనున్నట్లు తెలియజేశారు. మరోవైపు 8 నెలల తరువాత డిసెంబర్లో వ్యవసాయేతర రంగంలో నిరుద్యోగిత పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఫలితంగా కొత్త ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీలకు ఆమోదముద్ర వేయనున్న అంచనాలు బలపడ్డాయి. కాగా.. సాంకేతిక విశ్లేషణ ప్రకారం సమీప కాలంలో ఔన్స్ పసిడి 1705 డాలర్ల వరకూ వెనకడుగు వేయవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 1780-1767 డాలర్ల స్థాయిలో సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డాయి. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్ ) పతన బాటలో ఎంసీఎక్స్‌లో వారాంతాన 10 గ్రాముల బంగారం రూ. 2,086 క్షీణించి రూ. 48,818 వద్ద ముగిసింది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ప్రారంభంలో రూ. 50,799 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 48,818 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 6,112 దిగజారి రూ. 63,850 వద్ద నిలిచింది. రూ. 69,825 వద్ద హుషారుగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 63,719 వరకూ తిరోగమించింది. (బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు) కుప్పకూలాయ్ న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం పసిడి ఔన్స్ 4.1 శాతం పతనమై 1,835 డాలర్ల వద్ద స్థిరపడింది. స్పాట్ మార్కెట్లోనూ 3.5 శాతం నష్టంతో 1,849 డాలర్ల వద్ద నిలిచింది. వెండి మరింత అధికంగా ఔన్స్ దాదాపు 10 శాతం పడిపోయి 24.64 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్
న్యూయార్క్/ ముంబై: కరోనా కొత్త స్ట్ర్రెయిన్ కారణంగా మరోసారి బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 51,610కు చేరగా.. వెండి కేజీ రూ. 70,640 వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్ కామెక్స్‌లోనూ సోమవారం భారీగా బలపడటం ద్వారా పసిడి ఔన్స్ 1950 డాలర్లకు చేరగా.. వెండి 27.6 డాలర్లను తాకింది. వెరసి పసిడి ధరలు 8 వారాల గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం నవంబర్ 9న మాత్రమే పసిడి ఈ స్థాయిలో ట్రేడయినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. బ్రిటన్‌లో కఠిన లాక్‌డవున్ ఆంక్షలకు తెరతీయగా.. టోక్యోసహా పలు ప్రాంతాలలో జపాన్ ఎమర్జెన్సీ విధించనున్న వార్తలు పసిడికి డిమాండ్‌ను పెంచినట్లు తెలియజేశాయి. (స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్) గత వారం అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రూపు మార్చుకుని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మళ్లీ సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు నిపుణులు వివరించారు. హుషారుగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 186 బలపడి రూ. 51,610 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 51,333 వద్ద కనిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 51,649 వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 604 జంప్‌చేసి రూ. 70,640 వద్ద కదులుతోంది. రూ. 70,060 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 70,695 వరకూ దూసుకెళ్లింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.2 శాతం పెరిగి 1,950 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.15 శాతం బలపడి 1,945 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1 శాతం పుంజుకుని 27.61 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్
న్యూయార్క్/ ముంబై: కరోనా కొత్త స్ట్ర్రెయిన్ కారణంగా బ్రిటన్‌లో ఓవైపు కఠిన లాక్‌డవున్ ఆంక్షలను అమలు చేస్తుంటే.. మరోపక్క టోక్యోసహా పలు ప్రాంతాలలో జపాన్ సైతం ఎమర్జెన్సీ విధించనున్న వార్తలు పసిడికి ఒక్కసారిగా డిమాండ్‌ను పెంచాయి. దీంతో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1.6 శాతం పుంజుకుని 1926 డాలర్లకు ఎగసింది. ఇది 8 వారాల గరిష్టంకాగా.. ఈ బాటలో దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ రూ.565 బలపడింది. విదేశీ మార్కెట్లో వెండి మరింత అధికంగా 3 శాతం జంప్‌చేయగా.. దేశీయంగానూ రూ. 1,400 పెరిగింది. గత వారం అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రూపు మార్చుకుని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మళ్లీ సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు బులియన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడికి నేటి ట్రేడింగ్‌లో 1914-1928 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా 1884-1870 డాలర్ల వద్ద సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. చదవండి: (9వ రోజూ జోరు- సెన్సెక్స్@ 48,000) లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 565 బలపడి రూ. 50,809 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,300 వద్ద హుషారుగా ప్రారంభమైన పసిడి తదుపరి 50,892వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 1,394 జంప్‌చేసి రూ. 69,517 వద్ద కదులుతోంది. రూ. 68,499 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 70,259 వరకూ దూసుకెళ్లింది. (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్) హుషారుగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 31 డాలర్లు(1.35 శాతం) పెరిగి 1,926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1.3 శాతం బలపడి 1,923 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.1 శాతం జంప్‌చేసి 27.22 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
మెరుస్తున్న పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: కొత్త కరోనా స్ట్రెయిన్కుతోడు అమెరికా ప్రభుత్వ భారీ ప్యాకేజీ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు మెరుస్తున్నాయి. అయితే కోవిడ్-19 కట్టడికి అమెరికా, యూకేసహా పలు దేశాలు అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తుండటంతో కొంత ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడటం కూడా పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడికి నేటి ట్రేడింగ్‌లో 1896-1910 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా 1870-1855 డాలర్ల వద్ద సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. నేటి ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.82 బలపడి రూ. 50,121 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,179 వద్ద ప్రారంభమైన పసిడి తదుపరి 50,106 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 670 జంప్‌చేసి రూ. 68,767 వద్ద కదులుతోంది. రూ. 69,000 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 68,500 వరకూ బలహీనపడింది. హుషారుగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.35 శాతం పుంజుకుని 1,889 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలపడి 1,885 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.5 శాతం జంప్‌చేసి 26.59 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. మంగళవారం న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి 1883 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 26.22 డాలర్ల వద్ద ముగిసింది. -
పసిడి, వెండి- యూఎస్ ప్యాకేజీ జోష్
న్యూయార్క్/ ముంబై: కొత్త ఏడాదిలో పదవి నుంచి తప్పుకోనున్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యూటర్న్ తీసుకుంటూ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో పసిడి, వెండి ధరలు జోరందుకున్నాయి. నిరుద్యోగులకు తొలుత ప్రతిపాదించిన 600 డాలర్లను 2,000కు పెంచుతూ గత వారం యూఎస్ కాంగ్రెస్ ప్యాకేజీని ఆమోదించినప్పటికీ ట్రంప్ వ్యతిరేకించారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం సహాయక ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ భారీ ప్యాకేజీలో 1.4 ట్రిలియన్ డాలర్లు ప్రభుత్వ ఏజెన్సీలకు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, వెండి ధరలు బలపడ్డాయి. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1900 డాలర్లకు చేరగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో వెండి కేజీ రూ. 2,000కుపైగా జంప్‌చేసింది. ఇతర వివరాలు చూద్దాం.. (ఐపీవో బాటలో- ఫ్లిప్‌కార్ట్ బోర్డు రీజిగ్) లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 495 ఎగసి రూ. 50,568 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,200 వద్ద ప్రారంభమైన పసిడి తదుపరి 50,577 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 2,159 జంప్‌చేసి రూ. 69,668 వద్ద కదులుతోంది. రూ. 69,000 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 69,800 వరకూ దూసుకెళ్లింది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు) హుషారుగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.9 శాతం పుంజుకుని 1,899 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం బలపడి 1,895 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.6 శాతం జంప్‌చేసి 26.82 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. వారాంతాన న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి 1883 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 25.94 డాలర్ల వద్ద ముగిసింది.