
ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం పసిడి ధరలు దిగివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై స్ప్షష్టత కోసం ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో వ్యవహరించడంతో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయని బులియన్ నిపుణులు పేర్కొన్నారు. పసిడిలో తాజా కొనుగోళ్లు మందగించడంతో ధరలు దిగివచ్చాయి. చదవండి : ఆల్‌టైం హై నుంచి రూ . 7000 తగ్గిన బంగారం
ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం 140 రూపాయలు దిగివచ్చి 50,430 రూపాయలు పలికింది. కిలో వెండి 33 రూపాయలు తగ్గి 61,112 రూపాయలుగా నమోదైంది. అమెరికా డాలర్ ఒడిదుడుకులకు లోనవడం, తాజా ఆర్థిక ఉద్దీపన చర్యలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలతో పసిడి ధరల్లో అనిశ్చితి నెలకొందని జియోజిత్ కమోడిటీ హెడ్ హరీష్ వీ పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1900 డాలర్లకు తగ్గింది.