న్యూయార్క్/ ముంబై: ఈ నెల తొలి వారంలో ఆన్‌లైన్ సైట్స్ ద్వారా సగటున 10.7 మిలియన్ ఉద్యోగాల కోసం ఆఫర్లు నమోదైనట్లు యూఎస్ సంస్థ జిప్‌రిక్రూటర్ వెల్లడించింది. నవంబర్‌లో నమోదైన 10.9 మిలియన్లతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ కోవిడ్-19 సెకండ్ వేవ్‌లోనూ ఉపాధి కల్పన బలపడటం ఆర్థిక రికవరీని సంకేతిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 91 ఎగువకు బలపడింది. దీంతో బుధవారం న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి. ఔన్స్ పసిడి 1840 డాలర్లకు చేరింది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 49,000 సమీపానికి నీరసించింది. ఈ బాటలో వెండి కేజీ రూ. 63,000 మార్క్ సమీపంలో ట్రేడవుతోంది. దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం)
నష్టాలతో..
ఎంసీఎక్స్‌లో బుధవారం పతనమైన బంగారం, వెండి ధరలు మరోసారి డీలాపడ్డాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 221 క్షీణించి రూ. 49,039 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 49,313 వద్ద గరిష్టాన్నీ, ఆపై రూ. 48,935 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 350 నష్టంతో రూ. 63,149 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 63,747 వద్ద గరిష్టానికీ, రూ. 62,931 వద్ద కనిష్టానికీ చేరింది. (ఫేస్‌బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్?)
అక్కడక్కడే..
న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) నామమాత్ర లాభంతో 1,840 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.4 శాతం నష్టంతో 1,833 డాలర్లకు చేరింది. వెండి సైతం స్వల్ప వెనకడుగుతో ఔన్స్ 23.97 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు.
Comments
Please login to add a commentAdd a comment