silver
-
పసిడి ప్రియులకు చేదువార్త...! మళ్లీ రేటెక్కిన బంగారం..
-
6 శాతం తగ్గిన బంగారం ధరలు..
దసరా, దీపావళి సమయంలో బంగారం ధరలు తారాజువ్వలా పైకి లేసాయి. ఈ పండుగలు ముగియడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వడం జరిగిన తరువాత పసిడి ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. దీపావళి నుంచి గోల్డ్ రేట్లు దాదాపు 6 శాతం క్షీణించాయి.2024 నవంబర్ 1న 80,710 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 16) 75,650 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెల ప్రారంభంలో ఉన్న ధరలకు, ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమవుతోంది.బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా డిమాండ్ మాత్రం తగ్గే అవకాశం లేదు. ముఖ్యంగా భారతదేశంలో కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్ బంగారం విక్రయాలను గణనీయంగా పెంచాయని మల్హోత్రా జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ధృవ్ మల్హోత్రా పేర్కొన్నారు. అయితే బంగారం ధరల తగ్గుదల మరింత ఎక్కువ మందిని బంగారం కొనేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడుల కంటే కూడా.. బంగారం మీద పెట్టే పెట్టుబడులు చాలా సురక్షితమని చాలామంది భావిస్తున్నారు. ఈ కారణంగానే.. పెట్టుబడిదారులు కూడా బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడింది. ప్రస్తుత పరిస్థితి మాదిరిగానే.. బంగారం రేటు తగ్గుతూ పోతే మళ్ళీ పాత ధరలకు చేరుకునే అవకాశం ఉంది. -
నిన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క: నేటి బంగారం ధరలు ఇవే..
నవంబర్ నెల ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పసిడి రేటు మళ్ళీ పెరిగింది. ఈ కథనంలో నేడు (నవంబర్ 6) దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడా తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ) 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,350 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు పసిడి ధర వరుసగా రూ. 100, రూ. 110 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, వైజాగ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,350 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 పెరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. చెన్నైలో బంగారం ధరలు ఒకే మాదిరిగా ఉన్నాయి.దేశ రాజధానిలో బంగారం ధర రూ. 110 (10 గ్రా 24 క్యారెట్స్) & రూ. 100 (10 గ్రా 22 క్యారెట్స్) పెరిగింది. అయితే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేట్లు వరుసగా రూ. రూ. 80,500.. రూ. 73,800 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్న ప్రాంతం ఢిల్లీ అని స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 5) పసిడి రేటు గరిష్టంగా రూ.160 తగ్గింది. దీంతో గోల్డ్ ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. కాబట్టి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేటు ఎలా ఉందనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఆంధ్రప్రదేశ్ (విజయవాడ), తెలంగాణ (హైదరాబాద్) వంటి తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,240.. 22 క్యారెట్ల ధర రూ.73,550 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు రూ. 150 (10 గ్రా 24 క్యారెట్స్) & రూ. 160 (10 గ్రా 22 క్యారెట్స్) తగ్గింది. ధరలు ఎంత తగ్గినప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధానిలో బంగారు ధరలు ఈ రోజు రూ. 80,390, రూ. 73,700 వద్ద నిలిచాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,240 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,550 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా రూ.1,000 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ. 1,05,000 వద్ద నిలిచింది. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా బంగారం, వెండి ధరలు ఏ మాత్రం పెరగలేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మారని ధరలు: బంగారం కొనడానికి ఇదో మంచి ఛాన్స్!
అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. నవంబర్ ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టాయి. అయితే గత రెండు రోజులుగా ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు (నవంబర్ 4) దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి?.. ఏ రాష్ట్రంలో గోల్డ్ రేటు ఎక్కువగా ఉందనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే గత మూడు రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?ఢిల్లీలో గోల్డ్ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధానిలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.చెన్నైలో కూడా పసిడి ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు
దీపావళి ముగియగానే బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర రెండో రోజు గరిష్టంగా రూ. 160 తగ్గింది. దీంతో ఈ రోజు (నవంబర్ 2) మళ్ళీ గోల్డ్ రేటు పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ.150, రూ.160 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 160 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న రూ. 3000 తగ్గిన వెండి ఈ రోజు ఎలాంటి పెరుగుదలను, తగ్గుదలను నమోదు చేయలేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పండగ పోయింది: బంగారం ధర తగ్గింది
ధన త్రయోదశి, దీపావళికి భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 1) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 770 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,560, 22 క్యారెట్ల ధర రూ. 73,850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ. 700, రూ. 770 తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 770 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,710 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 74,000 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుదముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ. 700, రూ. 770 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,560 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,850 వద్ద ఉంది.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న స్థిరంగా ఉన్న సిల్వర్ రేటు ఈ రోజు రూ. 3000 తగ్గింది. దాదాపు వారం రోజుల తరువాత ఇంత పెద్ద మొత్తం వెండి ధర తగ్గడం ఇదే మొదటిసారి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బాంబుల్లా పేలుతున్న బంగారం ధరలు: తారాజువ్వలా మరింత పైకి..
రోజు రోజుకి బంగారం ధరలు తారాజువ్వలా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు (30 అక్టోబర్) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 710 పెరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 81,160 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 74,400 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేడు ధరలు రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధర రూ. 650, రూ. 710 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 81,160 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 74,400 వద్ద ఉంది.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ధరలు కొంత ఎక్కువ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,550 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 81,310 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్ద నిలిచింది. నిన్న రూ. 100 తగ్గిన సిల్వర్ రేటు ఈ ఒక్క రోజే రూ. 2100 పెరిగింది. ధరలు ఇలాగే కొనసాగితే.. వెండి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
అప్పటికి బంగారం ధర రూ. లక్ష: కారణం ఇదే..
బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి రూ.80,000, కేజీ సిల్వర్ రూ. 1 లక్ష దాటేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ.. గోల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ధన త్రయోదశి సందర్భంగా బంగారం ఎక్కువగానే అమ్ముడైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.పరిస్థితులను బట్టి చూస్తుంటే.. ధరలు ఎంత పెరిగినా కొనుగోలుచేసి వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదని స్పష్టమైపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది దసరా, దీపావళి నాటికి గోల్డ్ రేటు రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వెండి కూడా రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకారం.. గత కొన్నేళ్లుగా వెండి మంచి లాభాలను ఇవ్వడంతో ధరల విషయంలో బంగారాన్నే మించిపోయింది. రాబోయే రోజుల్లో బంగారం కంటే వెండి అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.2014లో రూ.28,006.50 వద్ద ఉన్న బంగారం ధర ప్రస్తుతం రూ. 81000 వరకు ఉంది. దీన్ని బట్టి చూస్తే.. పదేళ్లలో బంగారం ధర ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టమవుతోంది.బంగారం ధరలు పెరగటానికి కారణంబంగారం ధరలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల సంఖ్య పెరగడం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల రేట్లు పెరగడం వంటివి ప్రధాన కారణం అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు పతనమైన సమయంలో.. ఎక్కువమంది ఇన్వెస్టర్లు నష్టాల నుంచి తప్పించుకోవడానికి బంగారం మీద పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. ఓ వైపు పండుగలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం అమ్మకాల పెరగటానికి కారణమయ్యాయి. -
బంగారాన్ని మించి.. దడ పుట్టిస్తున్న వెండి!
బంగారం తర్వాత భారతీయులు వినియోగించే అత్యంత విలువైన లోహం వెండి. ఓ వైపు చుక్కలనంటుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతుండగా వెండి అంతకు మించిన వేగంతో కొండలా పెరుగుతోంది.రానున్న 12 నుండి 15 నెలల్లో వెండి ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కేజీకి రూ. 1,25,000, కమోడిటీ ఎక్స్చేంజ్ (COMEX)లో ఔన్సుకు 40 డాలర్లకుచేరుకునే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తెలిపింది.2024లో వెండి ఆకట్టుకునే వృద్ధిని కనబరిచింది. సంవత్సరానికి 40 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది . దేశీయంగా రూ. 100,000 మార్కును అధిగమించింది. వినియోగం, డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక బంగారం ధరలు 10 గ్రాములకు స్వల్ప కాలంలో రూ. 81,000 లకు, దీర్ఘకాలికంగా రూ.86,000కి చేరుకుంటాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. అలాగే కమెక్స్లో బంగారం మీడియం టర్మ్‌లో 2,830 డాలర్లు, దీర్ఘకాలికంగా 3,000 డాలర్లను తాకుతుందని అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: బంగారమంటే అంత నమ్మకం!ఇటీవలి సంవత్సరాలలో బంగారం స్థిరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆస్తులలో ఒకటిగా ఉంది. 2021 మినహా 2016 నుండి పసిడి దేశీయంగా మంచి పనితీరు కనబరుస్తూ వస్తోంది. ఈ సంవత్సరం బంగారం ధరలు కమెక్స్‌తోపాటు దేశీయ మార్కెట్లలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సంవత్సరానికి 30 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. -
గరిష్ఠాలను చేరిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల రికార్డులు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో కేజీ వెండి ధర మంగళవారం రూ.1,500 పెరిగి రూ.1,01,000కు చేరింది. వెండి రూ.లక్ష దాటడం ఇదే తొలిసారి. గత ఐదు రోజులుగా వెండి లాభాల బాటన పయనిస్తోంది.బంగారం 99.9 పూర్తి స్వచ్ఛత ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.350 పెరిగి రూ.81,000కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.80,600కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లలో బంగారం, వెండి పటిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీనత విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ పెరగటమే వెండి ధర పరుగుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల భారీగా పడుతున్నాయి. దాంతో మదుపర్లు కొంత సేఫ్‌గా ఉండే బంగారంపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర పెరుగుతోంది. -
‘బంగారానికి వెండి ఉచితం’
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దీపావళికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాల బరువుకు సమానమైన వెండిని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై ప్రతి క్యారెట్‌కు 25 గ్రాముల వెండి, అన్‌కట్ డైమండ్స్‌పై క్యారెట్‌కు 2 గ్రాముల వెండి, ప్లాటినం ఆభరణాల బరువుకు సమానమైన వెండి ఉచితంగా పొందవచ్చు. అలాగే వెండి వస్తువుల మేకింగ్ చార్జీలపై 25% తగ్గింపు, వెండి ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ గరిష్ట విక్రయ ధరపై 10 శాతం తగ్గింపు ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని షోరూమ్‌ల్లో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పండుగ సీజన్లో ‘బంగారానికి వెండి ఉచితం’ ఆఫర్ కస్టమర్లకు మరింత ఆనందాన్ని అందిస్తుందని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
బంగారం, వెండికి పండుగ డిమాండ్
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలకు పండుగల డిమాండ్ తోడయ్యింది. ఢిల్లీలో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.200 పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.78,300కు చేరింది. స్టాకిస్టులు, రిటైల్ కస్టమర్ల నుంచి పసిడికి డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ పేర్కొంది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ ధర రూ.665 ఎగసి రూ.93,165కు చేరింది.మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కమోడిటీ మార్కెట్లు బుధవారం పనిచేయని సంగతి తెలిసిందే. నవరాత్రి ప్రారంభంలో డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ మెరుగ్గా మారిందని, హిందూ పురాణాల ప్రకారం కొత్త వస్తువులను ముఖ్యంగా విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి ఇది శుభప్రదమైన వారమని వ్యాపారులు తెలిపారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో రూ.200కుపైగా లాభంతో రూ.45,500 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ధర రూ.400కుపైగా పెరిగింది. వెండి సైతం రూ.1,000కిపైగా లాభంతో రూ. 92,453 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు
అక్టోబర్ ప్రారంభంలో తగ్గినట్లే తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా ఎగిసి పడింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 77560వద్దకు చేరింది. ఈ రోజు గోల్డ్ రేట్లు.. ఏ నగరం ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 71,100 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.77,560 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 660 పెరిగింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేటు అమాంతం పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71100 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,560గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 100, రూ. 110 పెరిగింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 71,250 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,710 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. బంగారం ధర ఈ రోజు రూ. 100, రూ. 110 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.ఇదీ చదవండి: ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..వెండి ధరలుబంగారం ధరల భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రమే గత ఐదు రోజులుగా స్థిరంగానే ఉంది. దీంతో నేడు (గురువారం) కేజీ వెండి ధర రూ. 1,01,000 వద్దనే నిలిచింది. బంగారం ధర దూసుకెళ్తుంటే.. వెండి మాత్రం శాంతించినట్లు అర్థమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తగ్గిన బంగారం, వెండి ధరలు
రూ.70,000 దాటేసిన తులం బంగారం ధర మెల్లగా తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా చుక్కలుతాకిన పసిడి.. రెండూ రోజు స్వల్పంగా తగ్గింది. దీంతో ధరల్లో మార్పులు జరిగాయి. కాబట్టి నేడు (సెప్టెంబర్ 30) దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా సోమవారం పసిడి ధరలు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 160 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 70,800 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.77,240 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,800 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,240గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 150, రూ. 160 తగ్గినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 70,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,390 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.ఇదీ చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయివెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గింది. నిన్న రూ. 1,01,000 వద్ద ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 తగ్గింది. దీంతో సిల్వర్ రేటు రూ. 1,09,000 వద్దకు చేరింది. ఇదే ధరలు దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉండే అవకాశం ఉంటుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఈ గణేశుడికి రూ.5.65 కోట్ల ఆదాయం.. ఘనంగా వెండి, బంగారం
ప్రసిద్ధ ముంబై లాల్బాగ్చా గణేశుడికి ఈ ఏడాది ఉత్సవాల్లో భక్తుల నుండి కానుకల రూపంలో భారీగా ఆదాయం వచ్చింది. పది రోజులలో రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64.32 కిలోల వెండి వస్తువులను భక్తులు సమర్పించారు.గణేశ్ చతుర్థి ఉత్సవాలు ముగియడంతో గణపతి బప్పాకు వీడ్కోలు పలుకుతూ లాల్బాగ్చా రాజాకు పది రోజులలో వచ్చిన కానుకలను వేలం వేశారు. లాల్బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ వారు ప్రతి సంవత్సరం భక్తుల నుంచి వచ్చిన బంగారం, వెండిని బహిరంగ వేలం ద్వారా భక్తులకే అందిస్తారు. భక్తులు వీటిని ఆ లంబోదరుడి ప్రసాదంగా భావించి వేలంపాటలో దక్కించుకుంటారు.ఈ ఏడాది లాల్బాగ్చా రాజాకు రూ. 5,65,90,000 నగదుతో పాటు 4,151 గ్రాముల బంగారం, 64,321 గ్రాముల వెండి భక్తుల నుంచి వచ్చాయి. ఆనవాయితీ ప్రకారం గణేశోత్సవ్ మండల్ వారు అన్ని వస్తువులను వేలం వేశారు. లాల్బాగ్చా రాజాకు వచ్చిన అన్ని ఆభరణాలలో 990.600 గ్రాముల బంగారు గొలుసును వేలం వేయగా రూ. 69.31 లక్షలు పలికింది. -
ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్
భారతదేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు బంగారం దిగుమతులు 22.70 బిలియన్ డాలర్లు పెరిగాయి. దేశంలో పసిడికి డిమాండ్ పెరగటం వల్ల దిగుమతులు గతంలో కంటే కూడా గణనీయంగా పెరిగాయి.బంగారం దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, పండుగ సీజన్లో పెరిగిన డిమాండ్‌తో నగల వ్యాపారులు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా యూనియన్ బడ్జెట్లో గోల్డ్ ట్యాక్స్ తగ్గించడం అని తెలుస్తోంది. అయితే రత్నాలు, రత్నాలకు సంబంధించిన ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.2024 మొదటి త్రైమాసికం కంటే.. రెండో త్రైమాసికంలోనే బంగారం దిగుమతులు పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్ కూడా పెరిగింది. పండుగ సీజన్ కోసం దేశం సిద్ధమవుతున్నందున, పెరుగుతున్న బంగారం డిమాండ్‌ను తీర్చడానికి రిటైలర్లు తమ స్టోర్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నారు.జులై యూనియన్ బడ్జెట్లో బంగారం మీద ట్యాక్ తగ్గించడం కూడా బంగారం కొనుగోళ్లను బాగా పెంచింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చింది. మొత్తం మీద 2024లో భారతదేశంలో బంగారం డిమాండ్ 850 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 12 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐకు అదో పెద్ద సవాలు: తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చుపెరుగుతున్న ధరలుదేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నెలలోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. ఈ రోజు (సెప్టెంబర్ 17)న గోల్డ్ రేటు రూ. 74890 (తులం 24 క్యారెట్స్) వద్ద ఉంది. ఈ ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే..
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కేవలం రెండు రోజుల్లోనే తులం గోల్డ్ రేటు ఏకంగా రూ. 1740 పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనూ ఇదే వరుస కొనసాగుతోంది. ఈ రోజు (సెప్టెంబర్ 14) బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా శనివారం పసిడి ధరలు వరుసగా రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68650 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.74890 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68650 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 74890గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 400, రూ. 440 పెరిగినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 68800 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75040 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 1200, రూ. 1300 పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న రూ. 89,500 వద్ద ఉన్న వెండి.. ఈ రోజు రూ. 2500 పెరుగుదలతో రూ. 92000 (కేజీ) వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
కంజీవరం-వెండి సీక్విన్ చీరలలో ఊర్మిళ స్టన్నింగ్ లుక్స్..!(ఫొటోలు)
-
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం కొనేవారికి సెప్టెంబర్ కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో ఇప్పటి వరకు పసిడి ధరలు ఒకసారి మాత్రమే పెరిగాయి. కాగా ఈ రోజు (ఆదివారం) కూడా ధరల పెరుగుదల జరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఆదివారం బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 66800 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.72870 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటులో ఈ రోజు ఎలాంటి కదలికలు లేదని తెలుస్తోంది.చెన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు ఈ రోజు స్థిరంగా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నిన్న రూ. 2500 తగ్గిన వెండి.. ఈ రోజు నిశ్చలంగా ఉంది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 89500 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తగ్గిన బంగారం, వెండి ధరలు: ఎంతంటే?
సెప్టెంబర్ నెలలో మొదటిసారి పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తులం బంగారం రేటు రూ. 440 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.72870 వద్ద నిలిచింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో శనివారం బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 400 తగ్గి రూ. 66800 వద్దకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 440 తగ్గి రూ.72870 వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న కొంత పెరిగిన పసిడి ధరలు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధర రూ. 2500 తగ్గింది. నిన్న రూ. 2000 పెరిగిన కేజీ వెండి ధర ఈ రోజు రూ. 2500 తగ్గింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 84500 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.ఇదీ చదవండి: అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం బాటలోనే వెండి: స్థిరంగా ధరలు
సెప్టెంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈ రోజు (గురువారం) మాత్రం ఉలుకుపలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ కథనంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయని వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో సెప్టెంబర్ 5న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో తులం పసిడి ధరలు రూ. 66690 & రూ. 72760 వద్ద ఉన్నాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉంటాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66690, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72760గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు రూ.66840 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.72910 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఈ రోజు స్థిరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా గురువారం (సెప్టెంబర్ 5) స్థిరంగా ఉన్నాయి. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 90000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. వెండి రేటు నిన్న మాదిరిగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
సెప్టెంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు (మంగళవారం) ఉలుకుపలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ కథనంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయని వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో సెప్టెంబర్ 3న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో తులం బంగారం ధర రూ. 66700 & రూ. 72770 వద్ద ఉన్నాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉంటాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66700, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72770గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు రూ.66850 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.72920 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఈ రోజు స్థిరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం కొంత తగ్గాయి. కాబట్టి నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 90900 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. వెండి రేటు నిన్నటి కంటే ఈ రోజు రూ. 100 తగ్గింది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
భారీగా పడిపోయిన బంగారం..
-
భారీగా పెరుగుతున్న డిమాండ్.. బంగారం కంటే ప్రియం!
సోలార్ ప్యానెల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం భారతదేశపు వెండి దిగుమతులు దాదాపు రెండింతలకు చేరుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే బంగారం కంటే వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.బంగారం, వెండి వినియోగంలో భారత్ ప్రధానంగా చెప్పుకోదగ్గ దేశం. భారత్ గతేడాది 3,625 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం వెండి దిగుమతి 6500 నుంచి 7000 టన్నుల వరకు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2024 ప్రథమార్థంలోనే భారతదేశపు వెండి దిగుమతులు 560 టన్నుల నుంచి 4,554 టన్నులకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ దిగుమతులు పెరగటానికి మరో కారణం ట్యాక్స్ తగ్గించడం కూడా. స్మగ్లింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంని ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం జరిగింది.భారత్ ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటుంది. ఈ రోజు దేశీయ మార్కెట్లో రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 91700 రూపాయలకు చేరింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేజీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉంది.