యూనియన్ బడ్జెట్ 2024-25 ప్రకటన తరువాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్, సిల్వర్ వస్తువులు, కడ్డీలపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఇరీడియం వంటి వాటిపై కూడా సుంకం 15.4 శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది.
బంగారం, వెండి ధరలు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్ల తులం ధర రూ. 2750 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ మీద రూ. 2999 తగ్గింది. ధరల తగ్గుదలతో పసిడి ధరలు వరుసగా రూ. 64950 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 70860 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచాయి.
ఇక చైన్నె, ఢిల్లీలలో కూడా 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 2750, రూ. 2990 తగ్గింది. దీంతో అక్కడ రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. వెండి ధర కూడా గరిష్టంగా రూ. 3500 తగ్గింది. దీంతో కేజీ వెండి రూ. 88000లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment