breaking news
Gold Price
-
ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు!
రెండు రోజులుగా బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇది పసిడి ప్రియులకు తప్పకుండా ఊరటను ఇస్తుంది. ఈ కథనంలో గోల్డ్ రేటు ఎంత తగ్గింది?, రానున్న రోజుల్లో పసిడి ధరలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.3880 తగ్గి రూ.1,48,800 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.3550 తగ్గి రూ.1,36,400 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉంటాయి.చెన్నైలో కూడా బంగారం ధర భారీగానే తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రెండు రోజుల్లో రూ.3930 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3600 తగ్గింది. ప్రస్తుతం ధరలు రూ.1,48,800 (24 క్యారెట్స్), రూ.1,36,400 (22 క్యారెట్స్) వద్ద నిలిచాయి.దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3880 తగ్గి రూ.148950 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ.3550 తగ్గి రూ.136550 వద్దకు చేరింది.వెండి ధరలువెండి ధరలు కూడా హైదరాబాద్, విజయవాడలలో రూ.10వేలు (రెండు రోజుల్లో) తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్దకు చేరింది. చెన్నై, ఢిల్లీలలో కూడా కేజీ వెండి రేటు రూ.2.40 లక్షల వద్దనే ఉంది.ధరలు తగ్గుతాయా?ప్రస్తుతం బంగారం రేట్లు తగ్గి.. కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, రానున్నది పండుగ సీజన్. ఈ సమయంలో పసిడికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ధరలు కూడా మళ్లీ పెరిగవచ్చని నిపుణులు అంచనా.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రోజుల్లో అంటే? -
పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?
-
గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి
-
బంగారం ధరల్లో భారీ కుదుపు! తులం ఒక్కసారిగా..
దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీ కుదుపు వచ్చింది. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా పడిపోయాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు అమాంతం క్షీణించాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు భారీ ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం ధరల్లో భారీ మార్పు.. రూ.3000 తగ్గిన రేటు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ.. అదే స్థాయిలో పెరుగుతూ నేడు (ఆదివారం) స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో (సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు) పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో సెప్టెంబర్ 20న రూ.1,55,840 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,680 వద్దకు (రూ.3160 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 నుంచి రూ.1,39,950 వద్దకు (రూ.2900 తగ్గింది) చేరింది.చెన్నైలో సెప్టెంబర్ 20న రూ.1,55,840 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,730 వద్దకు (రూ.3110 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 నుంచి రూ.1,40,000 వద్దకు (రూ.2850 తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ సెప్టెంబర్ 20న రూ.1,55,990 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,830 వద్దకు (రూ.3160 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,43,000 నుంచి రూ.1,40,100 వద్దకు (రూ.2900 తగ్గింది) చేరింది. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
పుత్తడి తడబడి.. బంగారం ధరలు రివర్స్!
దేశంలో బంగారం ధరలు తడబడ్డాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు స్పల్పంగా క్షీణించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
అందుకే.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్!
బంగారం ధరల్లో ప్రస్తుతం కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఈ వారం ఇప్పటి వరకు పసిడి రేటు దాదాపు 1.7 శాతం తగ్గింది. అయితే.. శుక్రవారం మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.6 శాతం పెరిగి ఔన్సుకు 4,304.71 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1 శాతం పెరిగి 4,340 డాలర్లకు చేరాయి. ఈ కథనంలో.. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయం తెలుసుకుందాం.వడ్డీ రేట్ల ప్రభావంబంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా వడ్డీ రేట్లు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో.. పెట్టుబడిదారులు బాండ్లు వంటి వడ్డీ వచ్చే పెట్టుబడుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే.. బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు. కాబట్టి వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే, వడ్డీ వచ్చే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. దీంతో బంగారం ధరల్లో మార్పులు సంభవిస్తాయి.అమెరికా-ఇరాన్ చర్చలుఅమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయనే వార్తలతో చమురు ధరలు కొంత తగ్గాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ప్రజలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. పరిస్థితులు కొంత మెరుగుపడే సూచనలు కనిపిస్తే.. బంగారంపై ఆ డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది.ఫెడ్ నిర్ణయాలపై మార్కెట్ దృష్టిఅమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల 0.25 శాతం వడ్డీ రేటు పెంచింది. భవిష్యత్తులో కూడా వడ్డీ రేట్లు పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో బంగారం ధరలు మరింత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. వడ్డీ రేట్లు మాత్రమే బంగారం ధరను నిర్ణయించవు. డాలర్ విలువ, చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ముఖ్యమైనవి.డాలర్, చమురు ధరలుడాలర్ విలువ కొంత తగ్గడం కూడా బంగారం ధరల పతనానికి కారణం అవుతోంది. డాలర్ బలహీనపడితే.. ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేయడం కొంత సులభమవుతుంది. అలాగే.. చమురు ధరలు తగ్గడం వల్ల కూడా మార్కెట్లో పరిస్థితులు కొంత మారుతాయి. అయితే భవిష్యత్తులో ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి పెరిగితే.. పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు వెళ్లే అవకాశం ఉంటుంది.రాబోయే రోజుల్లో.. బంగారం ధర ఎలా ఉంటుందని ఖచ్చితంగా చెప్పడం కష్టం. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువ, చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగితే బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ కొత్త రూల్స్ తెలుసా? -
ట్విస్టుల మీద ట్విస్టులు..! బంగారం ధరలు తులం ఎంతంటే?
-
బలపడిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు బలపడ్డాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు క్రితం రోజున భారీగా క్షీణించగా నేడు మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం.. దేశ ఆర్థిక వ్యవస్థపై భారం!
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. పండుగలు, పెళ్లిళ్లు, పెట్టుబడులు.. ఇలా ఏ సందర్భం చూసినా బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా.. మన దేశంలో బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా, భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఆస్తిగా భావిస్తారు. అయితే.. ఇదే బంగారం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారే అవకాశం ఉందని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు.. రూపాయి విలువ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో బంగారం దిగుమతుల కోసం భారత్ భారీగా ఖర్చు చేయాల్సి వస్తే.. దేశ ఆర్థిక పరిస్థితిపై మరింత భారం పడుతుందని కోటక్ హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన భారతదేశం వికసిత్ భారత్ ప్రయాణానికి ఆర్థిక సహకారం అనే సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఏడాదికి రూ.90 బిలియన్ డాలర్ల దిగుమతులుఉదయ్ కోటక్ ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం బంగారం దిగుమతుల కోసం చేసే మొత్తం ఖర్చు 88 నుంచి 90 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే.. మన దేశం బంగారం కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే మొత్తం మరింత పెరగొచ్చన్నమాట.చమురు ధరలు పెరుగుతున్న కారణంగా.. భారత్‌కు దిగుమతుల ఖర్చు అధికమవుతోంది. మన దేశం చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు, బంగారం రెండింటికీ ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే, దేశ విదేశీ చెల్లింపులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.2026 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు సుమారు 25 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో, బంగారం దిగుమతుల విలువ 72 బిలియన్ డాలర్లుగా ఉందని ఉదయ్ కోటక్ తెలిపారు. బంగారం దిగుమతులను మినహాయిస్తే.. భారత్‌కు కరెంట్ అకౌంట్ మిగులు ఉండేదని ఆయన వివరించారు. అయితే.. బంగారం దిగుమతుల విలువ, కరెంట్ అకౌంట్ లోటు రెండూ ఒకే అంశాలు కావు. మనదేశం.. విదేశాల నుంచి కొనుగోలు చేసే వస్తువులు, సేవలు, ఆదాయాలు, ఇతర లావాదేవీలు అన్నీ కరెంట్ అకౌంట్ లెక్కల్లో భాగమవుతాయి.చమురు ధరలు పెరిగితే..భారతదేశం తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరిగితే, అదే పరిమాణంలో చమురు కొనడానికి భారత్ మరింత విదేశీ కరెన్సీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. చమురు ధరలు సగటున బ్యారెల్‌కు 90 డాలర్ల స్థాయిలో ఉంటే, భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు సుమారు 60 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఉదయ్ కోటక్ అంచనా వేశారు.ఇదే సమయంలో.. బంగారం దిగుమతుల బిల్లు కూడా పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత ఎక్కువ కావచ్చు. అయితే, ఇవన్నీ ఆయన పేర్కొన్న అంచనాలు మాత్రమే. వాస్తవ పరిస్థితి చమురు ధరలు, బంగారం ధరలు, దిగుమతి పరిమాణం, రూపాయి మారకం విలువ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.బంగారంపై మోజు.. దేశానికి సమస్యేనా?భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం చాలా పెద్ద మొత్తంలో వ్యక్తిగత సంపదగా ఉందని ఉదయ్ కోటక్ అన్నారు. ప్రజలకు బంగారం ఒక ఆస్తి అయినప్పటికీ, అది దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక పెట్టుబడులుగా పూర్తిగా ఉపయోగపడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.సాధారణంగా.. చాలామంది బంగారాన్ని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటారు. కొందరు వివాహాలు, కుటుంబ అవసరాల కోసం కొనుగోలు చేస్తారు. మరికొందరు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావించి బంగారంలో పెట్టుబడి పెడతారు. అయితే, దేశంలో బంగారం డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల దిగుమతులు కూడా భారీగా ఉంటాయి. అందుకే.. బంగారం విషయంలో ప్రజల అవసరాలను గౌరవిస్తూనే, దేశ ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని కోటక్ సూచించారు.ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చని కూడా ఆయన అన్నారు. ప్రజల అవసరాలకు ఇబ్బంది కలగకుండా, దేశ మూలధనం, కరెంట్ అకౌంట్‌పై ఉన్న సవాళ్లను పరిష్కరించే మార్గాలను ఆ కమిటీ పరిశీలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఆర్థిక లోటు తగ్గించాలిదేశ ఆర్థిక లోటు గురించి ప్రస్తావిస్తూ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లోటును కలిపి చూస్తే అది 7 శాతానికి పైగా ఉందని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక లోటు ఏర్పడుతుంది. ఈ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల.. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ఆదాయాలు, ఖర్చులు, రుణాల నిర్వహణలో సమతుల్యత అవసరం. అయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లను కూడా అర్థం చేసుకోవాలని కోటక్ అన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు ప్రజా అవసరాలకు సంబంధించిన ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.పెట్టుబడులు పెరగాలిభారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని కోటక్ పేర్కొన్నారు. ఒకప్పుడు పొదుపు చేసే వ్యక్తుల నుంచి రుణాలు తీసుకునే వ్యక్తులు, సంస్థలకు నిధులు వెళ్లే విధానం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ల ద్వారా పెట్టుబడిదారుల నుంచి కంపెనీలకు నిధులు సమకూరే విధానం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.అయితే.. షేర్ మార్కెట్లో ట్రేడింగ్, లావాదేవీల పరిమాణం పెరగడమే ఆర్థిక అభివృద్ధి కాదని ఆయన హెచ్చరించారు. ఆర్థిక మార్కెట్ల ప్రధాన ఉద్దేశం కంపెనీలకు మూలధనం అందించడం, పరిశ్రమలు అభివృద్ధి చెందడం, కొత్త పెట్టుబడులు రావడం కావాలని ఆయన సూచించారు. సులభంగా చెప్పాలంటే.. మార్కెట్లో డబ్బు చేతులు మారడమే కాకుండా, ఆ డబ్బు కొత్త వ్యాపారాలు, ఉత్పత్తి, ఉపాధి వంటి రంగాలకు ఉపయోగపడాలి.ఇదీ చదవండి: రూ.కోటి కడుతున్నా, ప్రయోజనం లేదు.. భారత పాస్‌పోర్ట్‌పై వ్యాపారవేత్త ఫైర్! -
భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?
-
బంగారం, వెండి భారీ పతనం.. పడిపోయిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు క్రితం రోజున పుంజుకుని నేడు మళ్లీ పడిపోయాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు కూడా నేడు గణనీయమైన తగ్గుదలను నమోదు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం.. వెండి ధరల మోత! ఆల్ టైం హైకు గోల్డ్ రేటు?
-
శుభవార్త.. బంగారం కొనేందుకు ఇది మంచి సమయం!
బంగారం ధరల్లో మరోసారి భారీ మార్పు చోటు చేసుకుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం పెరిగిన గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీ పతనాన్ని చవిచూసింది. దీంతో పసిడి ధరలలో గణనీయమైన మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మంగళవారం ఉదయం రూ.1,41,850 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి రూ.1,40,550 వద్దకు (రూ.1300 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,54,750 నుంచి రూ.1,53,330 వద్దకు (రూ.1420 తగ్గింద) చేరింది.ఇదీ చదవండి: ఇలా చేస్తే.. డబ్బు అదే వస్తుంది: కియోసాకిఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,40,550 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.153330 వద్ద ఉంది. అయితే చెన్నైలో మాత్రం గోల్డ్ రేటు ఉదయం ఎక్కడ ఉందో.. సాయంత్రానికి కూడా అక్కడే ఉంది. వెండి ధరల్లో కూడా గంటల వ్యవధిలో ఊహకందని మార్పులేమీ జరగలేదు. -
గోల్డ్ రేట్ కు బ్రేకులు లేవు.. మళ్లీ పెరిగిన బంగారం
-
బంగారం కొనాలా? ఆగాలా?.. ఈరోజు కొత్త రేట్లు ఇవే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గోల్డ్ @ రూ.25 లక్షలు కియోసాకి షాకింగ్ అంచనా!
-
ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటుకు మారిపోతోంది. ఈ రోజు (సోమవారం) ఉదయం రూ.1,55,680 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర, సాయంత్రానికి రూ.1,54,580 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బంగారం ధరలు గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఉదయం రూ.142700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు, సాయంత్రానికి రూ.141700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ. 1,55,680 వద్ద నుంచి రూ.1,54,580 వద్దకు చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగుతాయి.ఇదీ చదవండి: ముఖంతో సంపాదన.. ఏకంగా రూ.14 లక్షల వరకు!ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో కూడా పసిడి ధరలో మార్పులు కనిపించాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 నుంచి రూ.1,41,850 వద్దకు, 24 క్యారెట్ల రేటు 1,55,830 రూపాయల నుంచి రూ.1,54,730 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే.. 22 క్యారెట్ల రేటు, 24 క్యారెట్ల రేట్లు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రం కూడా అక్కడే ఉన్నాయి. -
భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?
-
బంగారం ధరలకు బ్రేక్.. కొనేవాళ్లకు ఊరట!
దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరట కలిగించాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మూడు రోజుల తర్వాత నేడు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం మిశ్రమ కదలికలను నమోదు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. వచ్చే వారంలో ఒడిదుడుకులతో, ఒక పరిమిత శ్రేణిలో కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల కదలికలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల ద్రవ్య విధానం, భౌగోళిక రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టిన మార్కెట్లు.. ఇప్పుడు కొత్తగా వెలువడే ఆర్థిక గణాంకాలపై దృష్టి సారించనున్నాయి.ఆర్థిక గణాంకాలపై దృష్టిఅమెరికాతో పాటు ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ గణాంకాలు కీలకంగా మారనున్నాయి. అంతే కాకుండా.. అమెరికా హౌసింగ్ మార్కెట్ గణాంకాలు, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు, వినియోగదారుల సెంటిమెంట్‌కు సంబంధించిన డేటా కూడా మార్కెట్‌కు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ గణాంకాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై అంచనాలను ప్రభావితం చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రభావం బంగారంపై కూడా పడవచ్చు.దేశీయ మార్కెట్లో బంగారం, వెండిమల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, అక్టోబర్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ. 1,597 లేదా 1.04 శాతం పెరిగి, 10 గ్రాములకు రూ. 1.54 లక్షల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ. 6,629 లేదా దాదాపు 3 శాతం పెరిగి, కేజీకి రూ. 2.41 లక్షల వద్ద ముగిసింది.గత వారం MCX బంగారం 10 గ్రాములకు రూ. 1.5 లక్షల వద్ద బలహీనంగా ప్రారంభమైనప్పటికీ, తక్కువ స్థాయిలలో కొనుగోలు ఆసక్తి పెరగడంతో 10 గ్రాములకు రూ. 1.54 లక్షల వైపు బలంగా పుంజుకుందని LKP సెక్యూరిటీస్, కమోడిటీ అండ్ కరెన్సీ విపి రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ బంగారం డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగి ఔన్సుకు 4,424.9 డాలర్ల వద్ద ముగిశాయి. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు ఒక పరిమిత పరిధిలోనే కదులుతున్నప్పటికీ, ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు గోల్డ్ ETFలలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం కూడా బంగారానికి మద్దతుగా నిలుస్తోంది. ఇక వెండి ధరలు పారిశ్రామిక లోహాల కదలికలకు అనుగుణంగా పుంజుకుని వారాన్ని లాభాలతో ముగించాయి.వచ్చేవారంలో ఇలా..ప్రధాన కేంద్ర బ్యాంకుల కీలక నిర్ణయాలు పూర్తవడంతో.. ఇప్పుడు మార్కెట్ దృష్టి చైనా పీపుల్స్ బ్యాంక్ తదుపరి ద్రవ్య విధాన నిర్ణయంపై ఉండనుంది. సోమవారం వెలువడే ఈ నిర్ణయంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉండొచ్చని అంచనా. మొత్తం మీద.. వచ్చే వారం బంగారం ధరల దిశను అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్, చమురు ధరలు, పశ్చిమాసియా పరిణామాలు, కొత్త ఆర్థిక గణాంకాలు నిర్ణయించే అవకాశం ఉంది. అందువల్ల బంగారం మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతూ, ధరలు పరిమిత శ్రేణిలో కదిలే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.ఇదీ చదవండి: సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సూత్రాలు! -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
ఫెడ్ రేట్ల పెంపు.. పసిడి అంచనాలు తారుతారు!
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచినప్పటికీ బంగారంపై గోల్డ్‌మన్ శాక్స్ దీర్ఘకాలిక సానుకూల అంచనాను కొనసాగించింది. అయితే సమీప కాలంలో ధరల పెరుగుదల వేగం తగ్గొచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 18న విడుదల చేసిన విశ్లేషణలో బ్యాంక్ విశ్లేషకురాలు లీనా థామస్.. 2027 చివరినాటికి బంగారం ఔన్సు ధర 4,400 డాలర్లకు చేరుతుందన్న అంచనాను కాకుండా, 5,400 డాలర్ల లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.అదే సమయంలో 2026 ఏడాది చివరి లక్ష్యాన్ని మాత్రం తగ్గించారు. గతంలో 4,900 డాలర్లుగా ఉన్న అంచనాను తాజాగా 4,650 డాలర్లకు సవరించారు. అంటే సమీప కాలంలో అమెరికా ద్రవ్య విధానం బంగారంపై కొంత ఒత్తిడి చూపుతుందని గోల్డ్‌మన్ భావిస్తోంది. సెప్టెంబర్ 18 నాటికి అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర సుమారు 4,350 డాలర్ల ప్రాంతంలో ఉండగా, కొత్త 2026 లక్ష్యం దానికంటే ఇంకా పై స్థాయిలోనే ఉంది.మరోసారి రేట్ల పెంపునకు అవకాశంసెప్టెంబర్ 16న ఫెడ్ కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 3.75–4 శాతం శ్రేణికి తీసుకెళ్లింది. 2023 తర్వాత అమెరికా కేంద్ర బ్యాంక్ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉండటంతో ధరల స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడ్ తెలిపింది.ఈ పరిణామం తర్వాత గోల్డ్‌మన్ శాచ్స్ ఆర్థికవేత్తలు అక్టోబర్‌లో మరో 25 బేసిస్ పాయింట్ల పెంపు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో అధిక వడ్డీ రేట్లు, పెరిగే బాండ్ ఈల్డ్స్, బలపడే డాలర్ వంటి అంశాలు తక్కువ కాలంలో బంగారంపై ఒత్తిడి తీసుకురావచ్చు.సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లే కీలకంఅయితే గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం బంగారం దీర్ఘకాలిక కథ మారలేదు. అధిక వడ్డీ రేట్ల ప్రభావాన్ని కేంద్ర బ్యాంకుల బలమైన బంగారం కొనుగోళ్లు కొంతవరకు భర్తీ చేయగలవని బ్యాంక్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు నెలకు సుమారు 91 టన్నుల స్థాయిలో ఉన్నాయని, 2022కు ముందు ఉన్న సగటు నెలవారీ కొనుగోళ్లతో పోలిస్తే ఇది గణనీయంగా ఎక్కువని పేర్కొంది. 2027 చివరి వరకు బంగారం ధరలో గోల్డ్‌మన్ అంచనా వేస్తున్న పెరుగుదలలో దాదాపు మొత్తం ఈ నిర్మాణాత్మక డిమాండ్ నుంచే వస్తుందని తెలిపింది.ఈటీఎఫ్‌ల (ETF) డిమాండ్ కూడా కీలకమే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఆగస్టులో ప్రపంచ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం ఆస్తులు 16 శాతం పెరిగి 615 బిలియన్ డాలర్లకు, వాటి వద్ద ఉన్న బంగారం 4,189 టన్నుల రికార్డు స్థాయికి చేరింది.ముందున్న దారి..గోల్డ్‌మన్ అంచనా ప్రకారం రేట్ల పెంపు బంగారం ర్యాలీని పూర్తిగా ముగించకపోవచ్చు. బదులుగా ర్యాలీ వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2027 నుంచి మార్చి 2028 మధ్య ఫెడ్ మూడు సార్లు రేట్లు తగ్గించే అవకాశం ఉందని థామస్ పేర్కొన్నారు. అయితే ఫెడ్ అంచనాల కంటే మరింత కఠినమైన ద్రవ్య విధానాన్ని అవలంబిస్తే బంగారంలో సాధారణం కంటే తీవ్ర దిద్దుబాటు వచ్చే ప్రమాదం కూడా ఉందని గోల్డ్‌మన్ హెచ్చరించింది.ఇక గోల్డ్‌మన్ ఆగస్టు 28న విడుదల చేసిన తన గత విశ్లేషణలో 2026 చివరి బంగారం లక్ష్యాన్ని 4,900 డాలర్లుగా ఉంచింది. తాజా ఫెడ్ పరిణామాల నేపథ్యంలో దాన్ని 4,650 డాలర్లకు తగ్గించినప్పటికీ, 2027 లక్ష్యాన్ని 5,400 డాలర్ల వద్ద కొనసాగించడం ద్వారా దీర్ఘకాలికంగా బంగారంపై తన సానుకూల దృక్పథాన్ని మాత్రం మార్చలేదని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు యూపీఐ చార్జీల ఎఫెక్ట్.. ఎంత? -
బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!
ఒకరోజు భారీగా పెరుగుతూ.. మరోరోజు అదే స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరల్లో గడిచిన వారం రోజుల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. ఈ కథనంలో సెప్టెంబర్ 13 నుంచి 19 వరకు గోల్డ్ రేటులో ఎంత తేడా వచ్చింది?, ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో సెప్టెంబర్ 13న రూ.1,41,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సెప్టెంబర్ 19 నాటికి రూ.1,42,850 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వారం రోజుల్లో బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ రూ.1150 పెరిగింది తెలుస్తోంది. 24 క్యారెట్ల రేటు రూ.1,54,850 నుంచి రూ.1,55,840 (రూ.990 తగ్గింది) వద్దకు చేరింది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు ఏడు రోజుల్లో రూ.1,41,700 నుంచి రూ.1,42,850 వద్దకు (రూ.1150 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 నుంచి రూ.1,55,840 (రూ.1260 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా వారం రోజుల్లో బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇక్కడ సెప్టెంబర్ 13న రూ.1,41,850 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సెప్టెంబర్ 19 నాటికి రూ.1,43,000 వద్దకు (రూ.1150 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,54,730 నుంచి రూ.1,55,990 వద్దకు (రూ.1296 పెరిగింది) చేరింది. -
బంగారంపై AI ఎఫెక్ట్.. 10 గ్రాములు రూ.3 లక్షలు?
-
దూసుకెళ్లిన బంగారం, వెండి.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు వరుసగా రెండో రోజూ భారీగా ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
తారుమారైన బంగారం ధరలు తులం ఎంతంటే?
-
పసిడి ప్రియులకు అలర్ట్: భారీగా మారిన ధరలు.. ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు క్రితం రోజున స్వల్పంగా తగ్గి నేడు భారీగా ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం ధర ఢమాల్..! తులం పై ఎంత తగ్గిందంటే.?
-
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు క్రితం రోజున స్వల్పంగా పెరిగి నేడు తిరిగి దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి ధరలు.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక అనూహ్యమైన మార్పు వైపు ప్రయాణిస్తోంది. బంగారానికి ఉన్న డిమాండ్‌ను, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ టి.కియోసాకి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం పరుగు ఇంకా పూర్తికాలేదని, అసలు ఘట్టం ఇప్పుడే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేస్తున్నారు.మానిటరీ పారిటీ ఫార్ములా విశ్లేషణఆర్థిక నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘మానిటరీ పారిటీ ఫార్ములా’ను వివరిస్తూ.. బంగారం భవిష్యత్తు ధరపై అంచనాలను విశ్లేషించారు. తాను చెప్పిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ఇదివరకెన్నడూ లేని విధంగా తమ మునుపటి రికార్డు కంటే మూడింతల వేగంతో భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త పసిడి గనులు లేదా నిల్వలు కనుగొనలేదు. ఒకవైపు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే సరఫరా మాత్రం స్తంభించిపోయింది.ప్రపంచ ద్రవ్య సరఫరా, వివిధ దేశాల వద్ద ఉన్న భౌతిక పసిడి నిల్వలను లెక్కించి అందులో కనీసం 40 శాతం ద్రవ్యానికి బంగారం మద్దతు ఇస్తే.. గణాంకాల ప్రకారం ఔన్స్(సుమారు 30 గ్రాములు) బంగారం అసలు విలువ రూ.25,89,000 (27,000 డాలర్లు)కు చేరాల్సి ఉంటుందని ఈ ఫార్ములా తేల్చిచెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ధరల సవరణ కేవలం ప్రారంభ దశలోనే ఉందని, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఇది రెండో ఇన్నింగ్స్ మాత్రమేనని జిమ్ రిక్కార్డ్స్ పేర్కొన్నారు.పెట్టుబడిదారుల అపోహలు.. అవకాశాలుసాధారణ పెట్టుబడిదారులు బంగారం ధరలు తగ్గుతాయని వేచి చూడటం పెద్ద పొరపాటని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2010లో టెస్లా షేర్లు లేదా 2013లో బిట్‌కాయిన్ ధరలు తగ్గుతాయని వేచి చూసిన వారితో ప్రస్తుత పసిడి ఇన్వెస్టర్లను పోలుస్తున్నారు. వేచి చూసే ధోరణితో చివరకు మిగిలిన దాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
పెరిగిన బంగారం ధరలు నేడు తులం ఎంతంటే?
-
పసిడి ధరల్లో మార్పు.. హ్యాట్రిక్ మిస్!
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాటపట్టాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు నేడు పుంజుకున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
భారీగా పడిపోయిన బంగారం ధరలు
-
గోల్డ్ లవర్స్‌కి శుభవార్త.. ధరల పతనం
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై కనిపించింది. సోమవారం (సెప్టెంబర్ 14) సాయంత్రం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉండటం, ఈ వారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచొచ్చన్న అంచనాలు, మరోవైపు ముడి చమురు ధరలు భారీగా పెరగడం విలువైన లోహాలపై ఒత్తిడి పెంచాయి.గణేశ్ చతుర్థి కారణంగా కమోడిటీ మార్కెట్ తొలి భాగంలో ట్రేడింగ్‌కు సెలవు ఇచ్చారు. మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఎంసీఎక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సాయంత్రం 5:15 గంటల సమయంలో ఎంసీఎక్స్ గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.19 శాతం తగ్గి రూ.1,50,973 వద్ద ట్రేడయ్యాయి. అదే సమయంలో ఎంసీఎక్స్ సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలోకు 1.70 శాతం క్షీణించి రూ.2,31,000 వద్ద ఉన్నాయి.అమెరికా ద్రవ్యోల్బణం సెగబంగారం ధరల పతనానికి ప్రధాన కారణాల్లో అమెరికా ద్రవ్యోల్బణం కీలకంగా మారింది. అమెరికా ఆగస్టు వినియోగదారు ధరల సూచీ (CPI) ఏడాది ప్రాతిపదికన 3.4 శాతం పెరిగింది. నెలవారీగా 0.4 శాతం పెరిగింది. ఆహారం, ఇంధనేతర వినియోగదారు ధరల సూచీ కూడా ఆగస్టులో నెలవారీగా 0.3 శాతం పెరిగింది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల మొత్తం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది.దీంతో సెప్టెంబర్ 16న జరిగే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేటు పెంపు అవకాశాలపై మార్కెట్లలో అంచనాలు బలపడ్డాయి. రాయిటర్స్ ప్రకారం, సోమవారం నాటికి ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల రేటు పెంచే అవకాశాన్ని మార్కెట్లు దాదాపు 90 శాతం వరకు ధరలోకి తీసుకున్నాయి. ఇది గత వారం కంటే గణనీయమైన మార్పు.వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌కు మద్దతు లభిస్తుంది. మరోవైపు వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశం బులియన్ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతోంది.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్.. సెబీ కొత్త ప్రతిపాదనలు -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
కొత్త బంగారంగా రాగి.. పెట్టుబడిదారుల చూపంతా దీనిపైనే!
విలువైన లోహాలు అంటే.. ముందుగా మనకు గుర్తొచ్చేది బంగారం, వెండి మాత్రమే. పెట్టుబడిదారులు కూడా చాలాకాలంగా వీటినే సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి కొంత మారుతోంది. రాగి ధరలు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. కొందరు దీనిని కూడా కొత్త బంగారంగా అభివర్ణిస్తున్నారు.గత ఏడాది బంగారం ధర దాదాపు 70 శాతం, వెండి ధర ఏకంగా 150 శాతం వరకు పెరిగాయి. ఇదే సమయంలో అల్యూమినియం, పల్లాడియం, ప్లాటినమ్‌తో పాటు రాగి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.భారీగా పెరిగిన రాగి ధరలులండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో రాగి ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఒక దశలో మెట్రిక్ టన్ను రాగి ధర 14,737 డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.14 లక్షలకు సమానం. తవ్వకం, శుద్ధి సామర్థ్యాలకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌కు మధ్య అంతరం పెరుగుతుండటంతో.. రాగి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.రాగి ధరలు పెరగడానికి అమెరికా సుంకాల ప్రభావం కూడా ఒక ముఖ్యమైన కారణం. శుద్ధి చేసిన రాగి దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచే అవకాశం ఉందన్న వార్తలతో కొనుగోలుదారులు ముందుగానే పెద్ద మొత్తంలో రాగిని కొనుగోలు చేస్తున్నారు. 2026 తొలి అర్ధభాగంలో అమెరికా సుమారు 8.85 లక్షల టన్నుల రాగిని దిగుమతి చేసుకుంది. దీంతో ప్రపంచంలోని రాగి నిల్వల్లో గణనీయమైన భాగం అమెరికాకు తరలిపోయింది. ఫలితంగా లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో అందుబాటులో ఉన్న నిల్వలు తగ్గాయి. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.ప్రధాన కారణాలుమార్కెట్లో రాగికి చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే డిమాండుకు తగిన సరఫరా లేదు. ప్రపంచంలో ఉన్న పాత రాగి గనులు తమ ఉత్పత్తిని పెంచడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రధాన రాగి ఉత్పత్తి దేశాల్లో కూడా ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి.రాగికి డిమాండ్ పెరగడానికి మరో ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్లు భారీగా నిర్మిస్తున్నారు. ఈ డేటా సెంటర్లలో విద్యుత్ వ్యవస్థలు, కేబుల్స్, నెట్వర్క్ పరికరాలు వంటి వాటిలో రాగిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల విస్తరణ కూడా రాగికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. అంటే.. భవిష్యత్తులో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలు పెరిగే కొద్దీ రాగి అవసరం కూడా పెరిగే అవకాశం ఉంది.భారీ డిమాండ్ఈ ఏడాది ఇప్పటి వరకు రాగి ధరలు సుమారు 16 శాతం పెరిగాయి. ముఖ్యంగా.. ఇటీవల నమోదైన రికార్డు ధరలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కూడా మించిపోయాయి. కొన్ని ప్రముఖ బ్రోకరేజీలు 2026లో రాగి ధరలు టన్నుకు 11,000-12,000 డాలర్ల స్థాయిలో ఉంటాయని అంచనా వేసినప్పటికీ, మార్కెట్ ధరలు ఇప్పటికే ఆ స్థాయిని దాటిపోయాయి. దీంతో రాగి మార్కెట్‌పై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరిగింది. -
భారీగా పెరిగిన బంగారం ధరలు
-
ఊహకందని బంగారం ధరలు.. వారం రోజుల్లో ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. ఉదయం భారీగా తగ్గిన రేటు, సాయంత్రానికి పెరిగిపోతోంది. దీంతో పసిడి ప్రియులలో ఒకింత ఆందోళన మొదలైపోయింది. ఈ కథనంలో వారం (సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు) రోజుల్లో బంగారం ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సెప్టెంబర్ 06న హైదరాబాద్, విజయవాడలలో రూ.1,54,800 వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రేటు, సెప్టెంబర్ 12న రూ.1,54,580 వద్దకు చేరింది. అంటే.. వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ తగ్గుతూ రూ.16 వేలకు చేరువవుతోందని తెలుస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 నుంచి రూ.1,41,700 వద్దకు చేరింది.చెన్నైలో గత ఆదివారం (సెప్టెంబర్ 06) రూ.1,54,800 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, శనివారం (సెప్టెంబర్ 12) నాటికి 1,54,580 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 1,41,900 నుంచి రూ.141700 వద్దకు చేరింది. వారం మధ్యలో ధరల్లో చాలా మార్పు వచ్చినప్పటికీ.. వారాంతం నాటికి కొంత పెరిగినట్లు తెలుస్తోంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు వచ్చాయి. వారం ప్రారంభంలో రూ.1,54,950 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, వారాంతానికి 1,54,730 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 నుంచి రూ.1,41,850 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఒకేరోజు 20 లక్షల ట్రైన్ టికెట్స్ బుకింగ్! -
ఒడిదొడుకుల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరల ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు కాస్త పెరుగుదలను నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలుదారులకు స్పల్ప నిరాశ తప్పలేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు!
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. ఇందులో పెట్టుబడులు పెట్టినవారు భారీ లాభాలను పొందుతున్నారు. కేవలం ఫిజికల్ గోల్డ్ కొన్నవాళ్లు మాత్రమే కాకుండా.. గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి రాబడి వచ్చింది. ముఖ్యంగా 2020లో సావెరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు పెట్టుబడిపై భారీ లాభం కనిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే సావెరిన్ గోల్డ్ బాండ్లు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం. ఇందులో.. మనం నేరుగా బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఎన్ని గ్రాముల బంగారానికి పెట్టుబడి పెడతామో, దానికి అనుగుణంగా బాండ్లు మనకు లభిస్తాయి. బంగారం ధర పెరిగితే ఈ బాండ్ల విలువ కూడా పెరుగుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది.గ్రాముపై రూ.11,118 లాభం2020 మార్చి 11న జారీ చేసిన సావెరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ Xలో.. ఒక గ్రాము బంగారం ధర రూ.4,210గా ఉంది. ఇప్పుడు 2026 సెప్టెంబర్ 11న ముందస్తుగా రిడీమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో ఒక గ్రాము బంగారం విలువ రూ.15,328గా నిర్ణయించారు. అంటే 4,210 రూపాయలతో కొనుగోలు చేసిన ఈ బాండ్ విలువ.. ఇప్పుడు రూ.15,328కు చేరింది. అంటే ఒక్క గ్రాముపై రూ.11,118 లాభం (దాదాపు 264 శాతం వరకు రాబడి) అన్నమాట.ఉదాహరణకు 2020లో ఒక వ్యక్తి రూ.1 లక్షను ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అప్పుడు అతనికి సుమారు 23.75 గ్రాముల విలువైన SGB యూనిట్లు లభించేవి. ఇప్పుడు ఒక్క గ్రాము రూ.15,328 చొప్పున లెక్కిస్తే వాటి విలువ సుమారు రూ.3.64 లక్షలకు చేరుతుంది. అంటే రూ.1 లక్ష పెట్టుబడి దాదాపు రూ.3.64 లక్షలుగా మారినట్లు అర్థం.వడ్డీ కూడా..ఇక్కడ మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. సావెరిన్ గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని కూడా చెల్లిస్తుంది. ఈ వడ్డీని సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. అంటే.. పెట్టుబడిదారుడికి బంగారం ధర పెరగడం ద్వారా ఒకవైపు లాభం వస్తే, మరోవైపు వడ్డీ రూపంలో కూడా ఆదాయం లభిస్తుంది.సాధారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం ఎనిమిది సంవత్సరాలు. అయితే.. ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొన్ని నిర్ణీత తేదీల్లో ముందుగానే రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 2020లో జారీ చేసిన ఈ బాండ్లకు ఇప్పుడు ప్రీమెచ్యూర్ రిడంప్షన్ అవకాశం వచ్చింది. -
భారీగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు కొనకపోతే.. తులం ఎంతంటే?
-
కుప్పకూలిన బంగారు, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా పడిపోయాయి. మరో వైపు స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు సైతం భారీగా క్షీణించాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట దక్కింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారానికి క్రూడ్ ‘షాక్’!
ముంబై: బాండ్లపై రాబడులు పెరగడం, అమెరికా కరెన్సీ డాలర్ బలోపేతంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 1.68 శాతం క్షీణించి 4,400 డాలర్ల దిగువన 4,386 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధర ఔన్స్ 5.37 శాతం పతనమై 65 డాలర్ల స్థాయిని కోల్పోయి 64.92 డాలర్ల వద్ద కదలాడుతోంది.బ్రెంట్ క్రూడాయిల్ ధర 102 డాలర్ల మార్కును దాటడంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో అమెరికా కేంద్ర బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందనే అంచనాలు తీవ్ర ఒత్తిడి పెంచాయి. ‘‘రాబోయే అమెరికా పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాలు, వచ్చే వారం జరగనున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు పసిడి తదుపరి గమనాన్ని నిర్దేశిస్తాయి.’’ అని ఆనంద్ రాఠీ రీసెర్చ్ విశ్లేషకురాలు వేదికా నర్వేకర్ తెలిపారు.ఎంసీఎక్స్‌లోనూ నేల చూపులే అంతర్జాతీయ ప్రభావానికి తోడు డాలర్ మారకంలో రూపాయి విలువ 44 పైసలు క్షీణించడంతో ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు నేలచూపు లు చూశాయి. అక్టోబర్ కాంట్రాక్టు పది గ్రాము ల పసిడి ధర దాదాపు 1% క్షీణించి రూ. 1,52,249 వద్ద ట్రేడవుతుండగా, కిలో వెండి ధర 3.63 శాతం పతనమై రూ. 2,35,347 వద్ద ట్రేడవుతోంది. ‘‘స్వల్పకాలంలో దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ. 1,51,500 – రూ. 1,55,000 శ్రేణి మధ్య కదలాడొచ్చు’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు జతీన్ త్రివేది విశ్లేషించారు. -
రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!
-
Gold: మళ్లీ పెరిగిన బంగారం తులం ఎంతంటే..?
-
అదరగొట్టిన బంగారం! 25 ఏళ్లలో ఇది మూడోది..
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆగస్టులో భారీగా పుంజుకున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం.. 2026 ఆగస్టులో బంగారం ధర 13 శాతం పెరిగి ఔన్స్‌కు 4,563 డాలర్ల వద్ద నెలను ముగించింది. గత 25 ఏళ్లలో నమోదైన మూడో అత్యధిక నెలవారీ రాబడి ఇదేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.ఈ పెరుగుదలకు ప్రధాన కారణం విస్తృతంగా జరిగిన గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) కొనుగోళ్లేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన 'గోల్డ్ మార్కెట్ కామెంటరీ'లో పేర్కొంది. బలహీనపడిన అమెరికా డాలర్ కూడా బంగారం ధరలకు మద్దతుగా నిలిచిందని తెలిపింది. ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు, బంగారం ఆప్షన్లలో కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేసినట్లు గోల్డ్ కౌన్సిల్ వివరించింది.ఆగస్టులో యూరప్ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి 7.9 బిలియన్ డాలర్లు, ఉత్తర అమెరికా ఈటీఎఫ్‌ల్లోకి 7.8 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఆసియా ఈటీఎఫ్‌లు మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇదే సమయంలో COMEXలో నెట్ మేనేజ్డ్ మనీ పొజిషనింగ్ 13 బిలియన్ డాలర్లు పెరిగినట్లు గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.సెప్టెంబర్‌లో ఏం జరగొచ్చు?ప్రస్తుతం మార్కెట్ దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో తీసుకునే వడ్డీ రేటు నిర్ణయంపై ఉంది. అమెరికా ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఫెడ్ చైర్ వార్ష్ హాకిష్ వ్యాఖ్యలు, జాక్సన్ హోల్ సింపోజియం పరిణామాలు కూడా మార్కెట్ అంచనాలను ప్రభావితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఆధార్‌కు భారీ అప్‌గ్రేడ్.. ఇక మూడింతలు! -
భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?
-
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..
-
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?
-
కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన పసిడి..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం, వెండి ధరల్లో ఈ వారం భారీ ఊగిసలాట?
బంగారం, వెండి ధరలు ఈ వారం కూడా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, ముడిచమురు ధరల కదలికలు, ఇరాన్-మధ్యప్రాచ్య పరిణామాలు బులియన్ మార్కెట్‌కు కీలక దిశానిర్దేశం చేయనున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 11న వెలువడనున్న అమెరికా ఆగస్టు వినియోగదారుల ధరల సూచీ (CPI)గణాంకాలపై ప్రపంచ మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది.అమెరికా ధరల సూచీపైనే ప్రధాన దృష్టిఆగస్టు వినియోగదారుల ధరల సూచీ (CPI)ని అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సెప్టెంబర్ 11న విడుదల చేయనుంది. జూలైలో అమెరికా ధరల సూచీ వార్షిక ప్రాతిపదికన 3.4 శాతం పెరగగా, ఆహారం, ఇంధన ధరలను మినహాయించిన కోర్ సూచీ 2.5 శాతంగా నమోదైంది. రానున్న సీపీఐ గణాంకాలు సెప్టెంబర్ 15-16న జరిగే ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశంగా మారనున్నాయి.ఇటీవల ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ ద్రవ్యోల్బణం మరింత తగ్గితే సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో రేటు పెంపు అంచనాలు కొంత తగ్గి బంగారం, వెండికి స్వల్పంగా మద్దతు లభించింది. అయితే ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉంటే రేట్ల పెంపు అవకాశాలు మళ్లీ పెరగవచ్చు.ముడిచమురు.. ఇరాన్ ఉద్రిక్తతలు కూడా కీలకమేమధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముడిచమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చమురు ధరలు పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత పెరగవచ్చన్న ఆందోళన ఉంది. అదే జరిగితే ఫెడ్ మరింత కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశం ఉండటంతో బంగారం ధరలపై ఒత్తిడి రావచ్చు. మరోవైపు భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగితే సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరగడం ధరలకు మద్దతు ఇవ్వవచ్చు. అందుకే ప్రస్తుతం ఇరాన్ పరిణామాలు బంగారానికి నేరుగా ‘సేఫ్ హెవెన్’ డిమాండ్ కంటే ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ద్వారా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.దేశీయ మార్కెట్లో కీలక స్థాయిలుగత వారం ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీగా ఊగిసలాడాయి. సెప్టెంబర్ 5న అక్టోబర్ డెలివరీ ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ సుమారు రూ.1,52,815 వద్ద ముగిశాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ కామెక్స్ బంగారం వారాంతానికి సుమారు 1.2 శాతం తగ్గి ఔన్సుకు 4,476.6 డాలర్ల వద్ద నిలిచింది. న్యూయార్క్‌లో వెండి ఔన్సుకు 66.75 డాలర్లకు పడిపోయింది.స్వల్పకాలంలో ఎంసీఎక్స్ బంగారానికి రూ.1.52 లక్షల ప్రాంతం కీలక మద్దతుగా, రూ.1.57 లక్షల ప్రాంతం కీలక నిరోధంగా మారే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. వెండిలోనూ రూ.2.31 లక్షల స్థాయి దిగువకు వెళ్లకుండా ఉంటే సానుకూల ధోరణి కొనసాగే అవకాశముంది.చైనా కొనుగోళ్లు బంగారానికి దీర్ఘకాలిక బలంఇక దీర్ఘకాలంలో బంగారానికి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కీలక మద్దతుగా కొనసాగుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, చైనా పీపుల్స్ బ్యాంక్ జూలైలో మరో 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో వరుసగా 21 నెలల పాటు బంగారం నిల్వలను పెంచుకుంటూ వచ్చిన చైనా మొత్తం అధికారిక బంగారం నిల్వలు సుమారు 2,366 టన్నులకు చేరాయి. 2026లో ఇప్పటివరకు చైనా కేంద్ర బ్యాంక్ కొనుగోళ్లు 60 టన్నులకు చేరుకున్నాయి.వెండికి మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. విలువైన లోహంతో పాటు పారిశ్రామిక లోహంగా కూడా ఉపయోగించే వెండి.. ప్రపంచ ఆర్థిక వృద్ధి, పరిశ్రమల డిమాండ్, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులకు మరింత వేగంగా స్పందించే అవకాశం ఉంది. అందువల్ల బంగారంతో పోలిస్తే వెండిలో ధరల ఊగిసలాట మరింత తీవ్రంగా ఉండొచ్చు. -
భారీగా తగ్గిన బంగారం ధర
-
పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం!
తగ్గేదేలే అన్నట్లు.. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో రెండు రోజుల్లోనే గోల్డ్ రేటు గరిష్టంగా 4640 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో పసిడి ధరల్లో ఊహకందని మార్పు కనిపించింది.హైదరాబాద్, విజయవాడలలో సెప్టెంబర్ 2న రూ.1,52,020 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఈ రోజుకు 1,56,660 రూపాయల (రూ.4640 పెరిగింది) వద్ద నిలిచింది. 22 క్యారెట్ల రేటు 1,39,350 రూపాయల నుంచి రూ.1,43,600 వద్దకు (రూ.4250 పెరిగింది) చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగాయి.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రెండు రోజుల్లో రూ. 4640 పెరిగి రూ. 1,56,660 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 4250 పెరిగి రూ.1,43,600 వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది.ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ పెరగడమే. డిమాండుకు తగిన గోల్డ్ అందుబాటులో లేనప్పుడు, కొనుగోలుదారులు ఎక్కువైనప్పుడు తప్పకుండా ధరల్లో గణనీయమైన మార్పు జరుగుతాయి. రాజకీయ, భౌగోళిక కారణాలు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. -
గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు
-
బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?
-
అందుకే.. బంగారం, వెండికి ఇంకా డిమాండ్!
పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి ఎప్పుడూ మంచి ఎంపిక. అయితే.. ఇటీవలి కాలంలో వీటి ధరలు బాగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ లాభాలను తీసుకున్నారు. దీంతో కొంతకాలంగా ధరలు తగ్గడం, పెరగడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ.. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు వంటి కారణాల వల్ల బంగారం, వెండికి డిమాండ్ భారీగానే ఉందని ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ చెబుతోంది.గత ఆరు వారాలుగా బంగారం 4,060 డాలర్ల వద్ద, వెండి 58 డాలర్ల దగ్గర సాగుతున్నాయి. పసిడి ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఒకటి. చాలా దేశాలు తమ విదేశీ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం నుంచి వడ్డీ ఆదాయం రాదు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం వంటివి.. పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఈ కారణంగానే గోల్డ్ రేటు ఇటీవల కొంత తగ్గడం జరిగింది.వెండికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే.. బంగారంతో పోలిస్తే వెండిలో ధరలు ఎక్కువగా మారుతుంటాయి. ఎందుకంటే వెండిని పెట్టుబడి కోసం మాత్రమే కాకుండా పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. జూలై 31, 2026 నాటికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఒక సంవత్సరంలో 95.24% రిటర్న్స్ ఇవ్వగా, నిప్పన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ 94.55% రిటర్న్స్ ఇచ్చాయి. ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఒక సంవత్సరంలో 43% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి.ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ అంచనా ప్రకారం.. బంగారంలో ఇంకా సుమారు 12% వరకు పెరిగే అవకాశం ఉంది. వెండి ధరలు కూడా ఇదే విధంగా ముందుగా సాగనున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. మధ్యలో కొంత తగ్గడం, మళ్లీ పెరగడం సాధారణమే. ముఖ్యంగా వెండిలో ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. -
మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!
-
ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి
-
కుప్పకూలిన బంగారు కొండ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఈ రోజు బంగారం వెండి ధరలు ఇలా..
రెండు రోజుల వరుస తగ్గుదల తరువాత గోల్డ్ రేటు మరోమారు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో గణనీయమైన మార్పులు జరిగాయి. ఈ కథనంలో బంగారం ధర హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలలో ఎలా ఉందో తెలుసుకుందాం. -
పసిడి ప్రియులకు షాక్.. రూ.12,500 పెరిగిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఊహకందని రీతిలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఆగస్టు 01న రూ.1,44,220 వద్ద ఉన్న గోల్డ్ రేటు, ఈ రోజుకు (ఆగస్టు 31) రూ.1,56,770 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. నెల రోజుల్లో పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఈ నెల (ఆగస్టు) ప్రారంభంలో హైదరాబాద్, విజయవాడలలో రూ.1,44,220 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఆగస్టు 31కి రూ.1,56,770 వద్దకు చేరింది. అంటే నెల రోజుల్లో రూ.12550 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల రేటు రూ.1,32,200 నుంచి రూ.1,43,700 (రూ.11,500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీ కూడా బంగారం ధరలలో చాలా మార్పులు జరిగాయి. ఇక్కడ నెల ప్రారంభంలో రూ.1,32,350 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు నేటికి రూ.1,43,700 (రూ.11350 పెరిగింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,44,370 నుంచి రూ.1,56,770 (రూ.12400 పెరిగింది) వద్దకు చేరింది.ఇక వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ సిల్వర్ రేటు 30 రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది. అంటే నెల రోజుల్లో 25000 రూపాయలు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమైపోతుంది. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుస పతనాలతో తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం కొంటున్నారా..? బిగ్ అలర్ట్
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
తారుమారు బంగారం! గంటల్లో మారిపోయిన ధరలు
దేశంలో బంగారం ధరలు నేడు (Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఉదయం భారీగా పడిపోయిన పసిడి ధరలు గంటల వ్యవధిలో తారుమారయ్యాయి. సాయంత్రానికే పెరుగుదల బాట పట్టాయి. దీంతో పుత్తడి ప్రియులకు అంతలనే తీవ్ర నిరాశ తప్పలేదు.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు సహా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం తులం (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం రూ.2900 తగ్గి రూ.1,46,500 వద్ద ఉండగా సాయంత్రం తిరిగే సరికి రూ.1,47,700 వద్దకు చేరింది. అంటే రూ.3350 పెరిగింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ఉదయం రూ.3160 తగ్గి రూ.1,59,820 వద్ద ఉండగా సాయంత్రానికే రూ.3650 ఎగిసి రూ.1,61,130 లను తాకింది.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.1,61,460 వద్దకు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.1,47,850, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,61,280 పలుకుతున్నాయి.ఇక వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం వెండి ధర కేజీకి రూ.5000 తగ్గి రూ.2,60,000 వద్దకు చేరగా సాయంత్రానికి రూ.5000 పెరిగి మళ్లీ రూ.2,65,000 వద్దకే ఎగిసింది. ఢిల్లీలో వెండి ధర మాత్రం మారలేదు. ఈరోజు ఉదయం రూ.5000 తగ్గి రూ.2,55,000 వద్దకు వచ్చిన కేజీ వెండి సాయంత్రానికీ అదే ధర కొనసాగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం ధరలు తగ్గే ఛాన్స్.. కేంద్రం కీలక ఆలోచన
-
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గోల్డ్, సిల్వర్‌పై పన్ను తగ్గే ఛాన్స్.. కారణం ఇదే!
బంగారం, వెండిపై భారీగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అధిక పన్నుల కారణంగా.. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం కంటే, అక్రమ మార్గాల్లో వచ్చే బంగారం చౌకగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. సుంకం తగ్గిస్తే స్మగ్లింగ్‌ను అడ్డుకోవచ్చా?, అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ రంగం మాత్రం ప్రస్తుత 15 శాతం సుంకాన్ని.. 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదే జరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.సుంకం ఎందుకు పెంచారు?బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనతో ప్రభుత్వం మే 13, 2026న దిగుమతి సుంకాన్ని పెంచింది. భారత్ ప్రతి ఏడాది సుమారు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. సుంకం పెంచడానికి ముందు ఏప్రిల్‌లో బంగారం దిగుమతులు ఏకంగా 82 శాతం పెరిగాయి. ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటే డాలర్లకు డిమాండ్ పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.పన్ను పెంచినా దిగుమతులు తగ్గలేదే?ప్రభుత్వం సుంకాన్ని పెంచినప్పటికీ బంగారం దిగుమతులు పూర్తిగా తగ్గలేదు. మేలో దిగుమతులు దాదాపు 34 శాతం పెరిగాయి. ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో కలిపి బంగారం దిగుమతుల విలువ 5.5 శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో అధిక సుంకం విధించడం ద్వారా దిగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందనే ప్రశ్నలు వస్తున్నాయి.స్మగ్లింగ్ ఎందుకు పెరుగుతోంది?పరిశ్రమ వర్గాల వాదన ప్రకారం.. అధిక పన్ను కారణంగా చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం ఖరీదుగా మారుతుంది. అదే సమయంలో అక్రమ మార్గంలో వచ్చే బంగారంపై ఇలాంటి పన్ను ఉండదు. దీంతో రెండు మార్గాల మధ్య ధర వ్యత్యాసం పెరుగుతుంది. ఈ పరిస్థితి స్మగ్లింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సుంకాన్ని తగ్గిస్తే చట్టబద్ధమైన దిగుమతులు పెరగడంతో పాటు అక్రమ మార్గాల్లో బంగారం వచ్చే ప్రోత్సాహం కూడా తగ్గవచ్చని వారు భావిస్తున్నారు.వెండి, ప్లాటినంపైనా ప్రభావంకేంద్రం కేవలం బంగారం గురించే కాకుండా వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి ఆభరణాల రంగంతో పాటు పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. వెండిని సౌర విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఆటోమొబైల్, వైద్య రంగాల్లో కీలకంగా ఉంటుంది. కాబట్టి వీటిపై అధిక సుంకాలు విధించడం వల్ల పరిశ్రమలకు ముడి పదార్థాల ఖర్చులు పెరిగి, చివరకు ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు అధిక పన్నుల వల్ల స్మగ్లింగ్ పెరగడం, పరిశ్రమల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే.. సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 15 శాతం నుంచి 6 శాతానికి సుంకం తగ్గిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ సుంకం తగ్గిస్తే అధికారిక మార్గంలో బంగారం దిగుమతులు పెరగవచ్చు. అదే సమయంలో స్మగ్లింగ్ తగ్గుతుందా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం! -
బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం!
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. పసిడి ధరలు భారీగా పెరిగి మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నప్పటికీ, బుధవారం మాత్రం ధరల తగ్గుదల నమోదైంది. దీనికి తోడు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలపడటం వంటి అంశాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపాయి.అమెరికా ద్రవ్యోల్బణంఅమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితిని అంచనా వేయడానికి ఫెడరల్ రిజర్వ్ ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో పీసీఈ ప్రైస్ ఇండెక్స్ ఒకటి. జూలై వరకు 12 నెలల్లో పీసీఈ ద్రవ్యోల్బణం 3.7 శాతంగా నమోదైంది. అయితే.. మార్కెట్ నిపుణులు దీనిని 3.6 శాతంగా అంచనా వేశారు. అంటే.. ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కొంత బలపడ్డాయి.వడ్డీ రేట్లు పెరిగితేబంగారం ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. అందువల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ వచ్చే బాండ్లు, ఇతర ఆర్థిక సాధనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. అయితే వచ్చే నెలలో రేట్లు పెరిగే అవకాశం 38 శాతంగా ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది.డాలర్ బలపడటంబంగారం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలోనే ధర నిర్ణయించబడుతుంది. బుధవారం డాలర్ విలువ 0.3 శాతం పెరిగింది. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలు ఉపయోగించే వారికి బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో బంగారం కొనుగోళ్లపై కొంత ప్రభావం పడుతుంది. అందుకే డాలర్ పెరుగుదల కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణం అని తెలుస్తోంది.బంగారం ధర ఎంత తగ్గింది?బుధవారం స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం తగ్గి ఔన్సుకు 4,594.84 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.9 శాతం తగ్గి 4,650.90 డాలర్లకు చేరాయి. అయితే దీనిని చూసి బంగారం భారీగా పతనమవుతోందని భావించాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ధరలు బాగా పెరగడంతో పెట్టుబడిదారులు తమ లాభాలను కొంతవరకు తీసుకోవడం కూడా ఈ తగ్గుదలకు కారణం.మళ్లీ 5,000 డాలర్లకు బంగారంధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ, బంగారం దీర్ఘకాలికంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.పీటర్ గ్రాంట్ ప్రకారం.. ప్రస్తుత తగ్గుదల ఒక తాత్కాలిక స్థిరీకరణ మాత్రమే కావచ్చు. బంగారం మళ్లీ 5,000 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఈ ఏడాదిలోనే ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే 2027 రెండో త్రైమాసికం నాటికి బంగారం కొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు.ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంబంగారం ధరను కేవలం అమెరికా వడ్డీ రేట్లు మాత్రమే నిర్ణయించవు. ప్రపంచంలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా ప్రభావం చూపుతాయి. ఇరాన్, ఒమన్ మధ్య 'హర్ముజ్'కు సంబంధించిన ఆదాయ పంపకంపై ఒప్పందం కుదిరినప్పటికీ, అమెరికా తమ షరతులను అంగీకరించకపోతే ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి తెరవబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొన్నాయి.ఇలాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. కాబట్టి ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో బంగారం ధరకు మద్దతు ఇవ్వవచ్చు.ఇతర లోహాల పరిస్థితివెండి: 1.1 శాతం తగ్గి 67.91 డాలర్లకు చేరిందిప్లాటినం: 1.2 శాతం తగ్గి 1,837.78 డాలర్లకు చేరిందిపల్లాడియం: 0.1 శాతం తగ్గి 1,325.10 డాలర్లకు చేరింది -
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు
-
పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి పరుగు.. వెండి వెనకడుగు!
పసిడి పరుగు నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. వరుసగా నాలుగో సెషన్లోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో రూ. 2,700 పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 1,67,100కి చేరింది.మరోవైపు, మూడు రోజుల ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి జోరు కాస్త ఆగింది. కేజీ ధర రూ. 3,500 తగ్గి రూ. 2,50,000కి పరిమితమైంది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 11.87 డాలర్లు (సుమారు 0.26 శాతం) క్షీణించి 4,639.51 డాలర్లకు, వెండి 1.04 శాతం తగ్గి 67.88 డాలర్లకు దిగి వచ్చాయి. -
రాసిపెట్టుకోండి.. తులం రెండు లక్షలు..!
-
ఐదు నెలల గరిష్ఠానికి బంగారం ధర!
అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్స్, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత వల్ల డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర మరో రూ. 900 పెరిగి రూ. 1,64,400కి చేరింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి.చివరిసారిగా మార్చి 9న పుత్తడి రేటు రూ. 1,64,300 పలికింది. అటు వెండికూడా వరుసగా మూడో సెషన్లోనూ పెరిగింది. కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 2,53,500కి చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 42.45 డాలర్లు (1 శాతం) పెరిగి 4,646.54 డాలర్లు పలికినట్లు కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కైనాత్ చైన్వాలా తెలిపారు.వెండి ధర ఫ్లాట్‌గా 69 డాలర్ల వద్ద ట్రేడయినట్లు పేర్కొన్నారు. బంగారం కీలకమైన 4,650 డాలర్ల చేరువకు వచ్చిన నేపథ్యంలో తదుపరి కదలికలు భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కన్నా ద్రవ్యోల్బణంపైనే ఆధారపడి ఉంటాయని వివరించారు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్‌కాయిన్.. కారణాలివే! -
బంగారం కొనాలంటే జేబు ఖాళీ..! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
దూసుకెళ్తున్న రేటు.. వచ్చేవారం బంగారం ధరలు ఇలా!
బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్న వేళ.. నిపుణులు కొత్త అంచనాలు వెల్లడించారు. వచ్చే వారం కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే.. ఇప్పటికే ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను తీసుకునే అవకాశం ఉంది.దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్క వారంలోనే సుమారు రూ.7,900 పెరిగి 10 గ్రాములకు రూ.1.63 లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు 5.13 శాతం పెరిగింది. వెండి కూడా అంతే జోరుగా పెరిగింది. కేజీ రేటు రూ.2.70 లక్షలకు చేరుకుంది.బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, అమెరికా బాండ్ యీల్డ్స్ తగ్గడం, మార్కెట్లో నగదు లభ్యత మెరుగుపడటం వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికా మార్కెట్లో బంగారం ధర సుమారు 5.5 శాతం, వెండి ధర దాదాపు 7 శాతం పెరిగాయి.అయితే.. వచ్చే వారం బంగారం ధరల దిశను నిర్ణయించడంలో అమెరికా ఆర్థిక గణాంకాలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యంగా అమెరికా కోర్ పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్, జీడీపీ డేటాపై మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఆధారంగా.. వడ్డీ రేట్లపై పెట్టుబడిదారులు తమ అంచనాలను మార్చుకోవచ్చు. దీని ప్రభావం డాలర్, బాండ్ యీల్డ్స్తో పాటు బంగారం ధరలపైనా పడుతుంది.పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు, హర్ముజ్ పరిస్థితి మార్కెట్లకు చాలా కీలకం. ప్రపంచంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి పసిడి ధరలు పెరిగే అవకాలు మెండుగా ఉన్నాయి.ఇక ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగే జాక్సన్ హోల్ సమావేశంపైనా మార్కెట్ దృష్టి ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ అక్కడ చేసే ప్రసంగంలో అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ఏమైనా సంకేతాలు ఇస్తే.. వాటిని పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇది బంగారం ధరలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన -
పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం!
బంగారం ధరలకు రెక్కలొచ్చాయా అన్నట్లుగా.. గోల్డ్ రేటు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా గరిష్టంగా రూ.1520 పెరిగిన పసిడి ధర.. వారం రోజుల్లో ఏకంగా రూ.7,960 పెరిగి, జీవితకాల గరిష్టాలను తాకింది. ఈ కథనంలో ఏడు (ఆగస్టు 16 నుంచి 22 వరకు) రోజుల్లో బంగారం ధర ఏ నగరంలో ఎంత పెరిగిందనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆగస్టు 16న రూ.1,55,130 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఆగస్టు 22 నాటికి 1,63,090 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో పెరిగిన గోల్డ్ రేటు రూ. 7960 అన్నమాట. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఏడురోజుల్లో 1,42,200 రూపాయల నుంచి రూ.1,49,500 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 నుంచి రూ. 1,63,090 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ. 7960 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,200 నుంచి రూ.1,49,500 (రూ.7300 పెరిగింది) వద్దకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ రూ.1,55,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,240 వద్దకు (రూ.7960 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 నుంచి రూ.1,49,650 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! -
తగ్గేదే లేదా? ఈ వారం బంగారం ధరలు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌ను అనూహ్యంగా పెంచడం, డాలర్ బలహీనపడటం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం వంటి పరిణామాలు పసిడి ధరలకు మద్దతుగా నిలిచాయి. దీంతో వరుసగా మూడో వారంలోనూ బంగారం లాభాలతో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి సుమారు 4,537 డాలర్ల వద్ద ట్రేడైంది. వారానికి దాదాపు 3.6 శాతం లాభపడింది.బైబ్యాక్ పెంపుతో మార్కెట్లలో కలకలంఅమెరికా ట్రెజరీ ఆగస్టు 19న 10 నుంచి 30 ఏళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్ కార్యకలాపాల పరిమాణాన్ని ఒక్కో ఆపరేషన్‌కు 2 బిలియన్ డాలర్ల నుంచి కనీసం 4 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక బాండ్ మార్కెట్లో లిక్విడిటీని మెరుగుపరచడం, ఇటీవల పెరిగిన ఈల్డ్స్‌ను అదుపులోకి తీసుకురావడం ఈ చర్య లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రకటన అనంతరం అమెరికా బాండ్ ఈల్డ్స్ గణనీయంగా తగ్గడంతోపాటు డాలర్ కూడా బలహీనపడింది. ఈ రెండు పరిణామాలు డాలర్లలో ధర నిర్ణయించే బంగారానికి అనుకూలంగా మారాయి.ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాత్రం ఈ స్థాయితో ఆగబోమన్న సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే బాండ్ బైబ్యాక్‌లను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వ రుణం 40 ట్రిలియన్ డాలర్లను దాటడం, వడ్డీ చెల్లింపులు భారీగా పెరుగుతుండటం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతున్నాయి.చమురు ధరలూ కీలకమే..మరోవైపు ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం బంగారం ర్యాలీకి మరో ముఖ్యమైన అంశంగా మారింది. ఇంధన ధరలు ఎక్కువకాలం అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగవచ్చు. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో వెనుకడుగు వేసే అవకాశం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా అధిక వడ్డీ రేట్లు బంగారానికి ప్రతికూలం. అయితే ప్రస్తుతం బలహీనమైన డాలర్, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర అధిగమిస్తున్నాయి.ఈ నెలలో 11 శాతానికి పైగా..ఆగస్టులో ఇప్పటివరకు అంతర్జాతీయ బంగారం ధర దాదాపు 11 శాతానికి పైగా పెరిగింది. ఆగస్టు 19న ఒక్కరోజే స్పాట్ గోల్డ్ 3 శాతానికి పైగా దూసుకెళ్లి 4,500 డాలర్ల స్థాయికి చేరువైంది. ఆ సమయంలో అమెరికా ట్రెజరీ చర్యతో ఈల్డ్స్, డాలర్ రెండూ తగ్గడం ప్రధాన కారణంగా నిలిచింది.అయితే బంగారం జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయి 5,318.40 డాలర్లతో పోలిస్తే ఇంకా సుమారు 15 శాతం దిగువనే ఉంది. దీంతో ప్రస్తుత ర్యాలీ బలమైనదే అయినప్పటికీ, రికార్డు స్థాయిని తిరిగి అందుకోవడానికి మరింత ఊతం అవసరమని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు.దేశీయంగానూ ధరలకు జోష్అంతర్జాతీయ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు 21న ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ 0.36 శాతం పెరిగి 10 గ్రాములకు సుమారు రూ.1.60 లక్షల వద్ద కదిలాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,59,280గా నమోదైంది. వెండి ధర కూడా కిలోకు రూ.2.45 లక్షల స్థాయిని దాటింది.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
ఒక్కసారిగా తారుమారు అయినా బంగారం, వెండి ధరలు తులం ఎంతంటే?
-
3 నెలల గరిష్టానికి పసిడి
న్యూఢిల్లీ: డాలరు బలహీనపడి, ఇన్వెస్టర్లు ఇతరత్రా కమోడిటీలవైపు మళ్లుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 4,300 ఎగసి రూ. 1,62,300కి చేరుకుంది. ఇది మూడు నెలల గరిష్టం కావడం గమనార్హం. చివరిసారిగా మే 26న బంగారం ధర రూ. 1,62,400 వద్ద ట్రేడయ్యింది.అటు వెండి కూడా ర్యాలీ చేసి, ఏడు వారాల గరిష్టానికి ఎగసింది. కేజీకి రూ. 10,000 పెరిగి రూ. 2,45,000 వద్ద ముగిసింది. వెండి చివరిసారిగా జూలై 3న ఈ స్థాయిలో ట్రేడయ్యింది. డాలరు, ట్రెజరీ ఈల్డ్‌లు గణనీయంగా క్షీణించడంతో పసిడి రెండు నెలల గరిష్టానికి ఎగసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.డాలర్ ఇండెక్స్ మూడు నెలల కనిష్టానికి పడిపోగా, ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు కూడా తగ్గుతుండటం వల్ల బంగారానికి ఆకర్షణీయత పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 1.47 శాతం క్షీణించి 4,456.72 డాలర్లకు, వెండి ధర 65.82 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ భారీగా పుంజుకుని ఔన్సుకు 4,400 డాలర్ల స్థాయిని దాటడంపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి స్పందించారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలని తాను ఏళ్లుగా చెబుతున్నానని పేర్కొంటూ తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేశారు.ప్రస్తుతం బంగారం ధర 4,400 డాలర్ల స్థాయిలో ఉండటాన్ని ప్రస్తావించిన కియోసాకి.. ఈ సంఖ్య వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఇటీవల భారీ పతనం తర్వాత బంగారం మళ్లీ పుంజుకుందని, ఆగస్టులోనే ధర సుమారు 9 శాతం పెరిగిందని రాయిటర్స్ నివేదించింది. ఆగస్టు 19న స్పాట్ గోల్డ్ 4,487.91 డాలర్లకు చేరగా, 20న లాభాల స్వీకరణతో 4,484.95 డాలర్లకు తగ్గింది.యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి కీలకంబంగారం పెరుగుదలకు ప్రధాన కారణాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒకటని కియోసాకి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న పరిస్థితులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు వంటి పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయని తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెట్టుబడులు సాధారణంగా సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మళ్లుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాయిటర్స్ కూడా ఇరాన్ యుద్ధం, చమురు సరఫరా ఆందోళనలు బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావంఅమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని కియోసాకి వివరించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గితే ఫెడ్ వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం తగ్గుతుందన్న అంచనాలు బంగారానికి మద్దతు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆగస్టులో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో సెప్టెంబరులో రేట్ల పెంపు అవకాశాలు తగ్గుతాయన్న అంచనాలు పెరిగి బంగారం 4,400 డాలర్లకు పైగా వెళ్లింది.అప్పులు కూడా కారణమే..అమెరికా ప్రభుత్వ రుణభారం, భారీగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం కూడా బంగారానికి అనుకూలంగా మారుతున్నాయని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలు తమ ఖర్చులను నియంత్రించలేనప్పుడు, కరెన్సీ విలువపై ఆందోళనలు పెరిగినప్పుడు బంగారం ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక రుణాల బైబ్యాక్ కార్యక్రమాన్ని పెంచనున్నట్లు ప్రకటించిన తర్వాత బాండ్ ఈల్డ్స్, డాలర్‌పై ప్రభావం పడటంతో బంగారం ధర ఒక్క రోజులో 4 శాతానికి పైగా పెరిగింది.కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లను ప్రస్తావించిన కియోసాకిప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం తన వాదనకు కీలక ఆధారమని కియోసాకి పేర్కొన్నారు. చైనా, భారత్, పోలాండ్, టర్కీ, సింగపూర్ వంటి దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని ఆయన తెలిపారు. రాయిటర్స్ ప్రకారం, తాజా దశలో కేంద్ర బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి బంగారంపై డిమాండ్ తిరిగి పెరుగుతోంది.‘బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు’తాను ఔన్సు బంగారం 300 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేశానని కియోసాకి తెలిపారు. అలాగే చౌకగా ఉన్నప్పుడు వెండిని, బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్ల వద్ద కొనుగోలు చేశానని చెప్పారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పరిమిత సరఫరా ఉన్న ఆస్తులపై తనకు దీర్ఘకాలిక నమ్మకం ఉందన్నారు.“బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు. నిజమైన డబ్బు” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కియోసాకి.. పేపర్ కరెన్సీల విలువ కాలక్రమంలో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గింపు వంటి కారణాలతో దెబ్బతింటుందని అన్నారు. బంగారం మాత్రం వేల సంవత్సరాలుగా విలువను నిలబెట్టుకుంటూ వస్తోందని పేర్కొన్నారు. -
బంగారానికి ఏమైంది? ఒక్కరోజే ఇంత జంప్ ఎందుకు?
బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం (ఆగస్టు 20) 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.4,300 పెరిగి రూ.1,59,270కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.3,950 పెరిగి రూ.1,46,000 పలికింది.అంటే ఒక్కరోజులోనే 24 క్యారెట్ల బంగారం దాదాపు 2.8 శాతం పెరిగింది.ఇంత భారీ పెరుగుదలకు కారణమేంటి?అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో ఇటీవల చోటుచేసుకున్న భారీ కదలికలు దేశీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్ విలువ, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు, ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు వంటి అంశాలు పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌ను పెంచుతుందన్న వార్తల నేపథ్యంలో డాలర్, బాండ్ ఈల్డ్స్ బలహీనపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధర ఒక్క సెషన్లో 4 శాతానికి పైగా ఎగిసింది.దీనికి తోడు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ పరిణామాలు వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. అనిశ్చితి పెరిగినప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే బంగారానికి డిమాండ్ పెరగడం సహజం.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
బంగారం, వెండి ధరల్లో భారీ జంప్.. తులం ఎంతంటే?
-
ఆకాశమే హద్దుగా బంగారం ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
శ్రావణమాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
-
బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఇలా అయితే బంగారం కొనేదెలా?: పెరిగిన ధరలు..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఇలా అయితే కొనేదెలా అంటూ.. పసిడి కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం ధరలో సడన్ మార్పు.. తులం ఎంతంటే?
-
మారిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూ.. ఈ రోజు కూడా పెరుగుదల దిశగానే అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటులో మార్పులు జరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలకు సంబంధించిన వివరాలు చూసేద్దాం. -
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..
భారతదేశంలో కొన్నాళ్లుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (ఆదివారం) గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి ఈ కథనంలో తాజా ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200చెన్నైలో 10 గ్రాముల బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో తులం బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200దేశ రాజధాని నగరం దిల్లీలో24 క్యారెట్స్: రూ.1,55,28022 క్యారెట్స్: రూ.1,42,350ఢిల్లీలో కేజీ వెండి ధర: రూ.2,50,000హైదరాబాద్‌లో కేజీ వెండి ధర: రూ.2,55,000(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని, అందుకే బంగారం, వెండి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.అమెరికా అప్పులుఅమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని కియోసాకి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే.. చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.బంగారం, వెండి భారీగా పెరుగుతాయా?కియోసాకి తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని చెప్పారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు చేరొచ్చన్న అంచనాలను ఆయన ప్రస్తావించారు. అయితే.. ఇవి ఖచ్చితమైన ధరలు కావు. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారవచ్చు.కియోసాకి బంగారం, వెండి రెండింటినీ ప్రస్తావించినప్పటికీ.. 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని కియోసాకి చెప్పారు. వెండికి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.$40 TRILLION US NATIONAL soon!!Q: What are you doing about it?Friends who are much smarter than me, such as Jim Rickards are predicting $200 an ounce for silver and $10,000 an ounce gold soon.Of the two…. I think silver is the best choice in August 2026.Q: What do you…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 15, 2026 -
80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం!
భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే ధరలు మెల్లగా పెరుగుతూ.. ఇప్పుడు రూ.1.50 లక్షలకు (10 గ్రాములు) చేరింది. అయితే.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గోల్డ్ రేటు ఎలా ఉండేది?, ఆ తరువాత జరిగిన పరిణామం ఏమిటి?, అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు(1947లో) 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే. కానీ అదే 10 గ్రాముల గోల్డ్ రేటు ఇప్పుడు 2026 ఆగస్టు రూ.1,55,130 వద్దకు చేరింది. అంటే 80 ఏళ్లలో పసిడి ధర ఏకంగా 1711 రెట్లు పెరిగిందన్నమాట.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బంగారం ధర ఇంతగా పెరగడం ఒక్కసారిగా జరగలేదు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు నెమ్మదిగా, మధ్య మధ్యలో హెచ్చుతగ్గులతో ఈ ప్రయాణం సాగింది. 1950లో 10 గ్రాముల గోల్డ్ రేటు 99.18 రూపాయలుగా ఉండేది. ఆ తరువాత 1964లో రూ.63.25కు చేరింది. అంటే.. బంగారం ధర కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు ధరలు తగ్గడం, మరికొన్ని సంవత్సరాలు పెద్దగా మార్పు లేకపోవడం జరిగింది.ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. 1970-71లో ఒక కిలో వెండి సగటు ధర రూ.536.08 మాత్రమే. 2026 ఆగస్టు 15 నాటికి అది రూ.2.55 లక్షలకు చేరింది. అంటే దాదాపు 56 ఏళ్లలో వెండి ధర సుమారు 390 రెట్లు పెరిగింది. అయితే.. వెండి ధర కూడా ఎప్పుడూ ఒకే విధంగా పెరగలేదు. 2011-12లో కేజీ వెండి ధర రూ.57,315.87కు చేరిన తర్వాత, 2015-16లో రూ.36,318.10కు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ధర పెరుగుతూ వచ్చింది.బంగారం, వెండిని ధరలను పోల్చి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 1984-85 నుంచి లెక్కిస్తే బంగారం ధర సుమారు 76 రెట్లు పెరిగింది. అదే సమయంలో వెండి ధర సుమారు 55 రెట్లు పెరిగింది. అంటే ఆ కాలంలో వెండితో పోలిస్తే బంగారం ధర పెరుగుదల ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది.ఈ రోజు ధరలుభారతదేశంలో ఈ రోజు గోల్డ్ రేటు రూ.1,55,130 (10 గ్రాముల 24 క్యారెట్స్ ధర) వద్ద ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ రేటు రూ.142200 వద్ద ఉంది. వెండి ధర రూ.2.55 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే గోల్డ్ రేటు ఎంత పెరుగుతుందనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: 79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు! -
అది పసిడి మెరుపు కాదు.. డాలర్ పతనమే..
అమెరికా డాలర్ విలువ, బంగారం ధరలపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేసిన ఆయన.. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారం ప్రమాణాన్ని (గోల్డ్ స్టాండర్డ్) నిలిపివేసిన పరిణామాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి డాలర్ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.1971లో ఒక ఔన్స్ బంగారం విలువ 35 డాలర్లు ఉండేదని, ప్రస్తుతం అది 4,342 డాలర్లకు చేరిందని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అంటే బంగారం ధర 124 రెట్లు పెరిగిందని చెప్పారు. అయితే ఇది బంగారం విలువ పెరగడం కంటే.. డాలర్ కొనుగోలు శక్తి భారీగా క్షీణించడాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.‘రిచ్ డాడ్’ తనకు 21 ఏళ్ల వయసులో డాలర్ గురించి చెప్పిన విషయాన్ని కూడా కియోసాకి గుర్తు చేసుకున్నారు. నిక్సన్ ఒక్క రాత్రిలో డాలర్‌ను విలువ తగ్గించలేదని, అప్పటికే దాని విలువ తగ్గిపోయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ పరిణామాలను గమనించిన వారు భూములు, చమురు, గనులు వంటి హార్డ్ అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టారని, ఇతరులు బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేసి కొనుగోలు శక్తిని కోల్పోయారని వ్యాఖ్యానించారు.బంగారం కొనుగోలు గురించి అందరూ మాట్లాడుతున్నప్పటికీ, వాస్తవంగా కొద్దిమందే పెట్టుబడి పెడుతున్నారని కియోసాకి అన్నారు. నాణేలు లేదా గోల్డ్ ఆధారిత పెట్టుబడి సాధనాల కంటే బంగారం ఉత్పత్తి చేసే గనుల్లో యాజమాన్య వాటా కలిగి ఉండటమే మెరుగైన వ్యూహమని తన ‘రిచ్ డాడ్’ సూచించేవారని చెప్పారు.ఈ నేపథ్యంలో ‘క్యాపిటల్ క్లబ్’ పేరుతో ఒక ప్రైవేట్ పెట్టుబడి వేదిక గురించి కూడా కియోసాకి తన పోస్టులో ప్రస్తావించారు. నాలుగు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంగారం, వెండి మైనింగ్ కంపెనీలో ప్రీ-పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టుబడి అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కొలరాడో, ఘనా, దక్షిణాఫ్రికా, పపువా న్యూ గినియాలో కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ప్రైవేట్ రౌండ్లో ఇప్పటికే సగానికి పైగా పెట్టుబడులు సమీకరించబడ్డాయని, తదుపరి అవకాశం ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని కియోసాకి తెలిపారు. అయితే ప్రైవేట్ పెట్టుబడులు, మైనింగ్ కంపెనీల్లో వాటాలు వంటి అంశాల్లో అధిక రిస్క్ ఉండొచ్చన్న విషయాన్ని పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గంటల వ్యవధిలోనే.. బంగారం ధరల్లో భారీ మార్పు!
భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (గురువారం) ఉదయం రూ.1,55,130 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, సాయంత్రానికి రూ.1,53,600 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు తారుమారైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గురువారం (13 ఆగస్టు) రూ.1,55,130 (24 క్యారెట్స్) రూ.1,42,200 (22 క్యారెట్స్) వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.153600, రూ.140800 వద్దకు చేరింది. అంటే ధరలు వరుసగా రూ.1530, రూ.1400 తగ్గాయన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా సాయంత్రానికి, ఉదయానికి రేట్లలో చాలా తేడా కనిపించింది. ఉదయం 1,42,350 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,950 వద్దకు చేరగా.. 24 క్యారెట్ల రేటు 1,55,280 రూపాయల నుంచి 1,53,750 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,42,200 వద్ద, 24 క్యారెట్ల ధర రూ.1,55,130 వద్దనే ఉన్నాయి. వెండి రేటు మాత్రం రూ.2.60 లక్షలు (కేజీ ధర) వద్ద ఉంది. -
ఇన్వెస్టర్లకు పండగే మళ్లీ పెరిగిన బంగారం ధరలు
-
బంగారం భారీ ధరలకు అదే కారణం..
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు పసిడిపై ఆసక్తి చూపారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 1శాతానికిపైగా పెరిగింది.అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.1 శాతం పెరిగింది. జూన్‌లో ఇది 0.4 శాతం తగ్గింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఫెడ్ సెప్టెంబర్‌లో రేట్ల పెంపు చేసే అవకాశం తగ్గిందన్న అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.ఈ పరిణామానికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్ పైకి ఎగబాకింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపించింది. హైదరాబాద్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆగస్ట్ 12) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1040 పెరిగి రూ.1,54,860 లకు, 22 క్యారెట్ బంగారం రూ.950 ఎగిసి రూ.1,41,950 వద్దకు చేరింది.ఇదిలా ఉంటే, సెప్టెంబర్‌లో ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి కొనసాగుతోంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్‌మార్క్ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే కొనసాగించింది. అయితే ముగ్గురు ఫెడ్ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని సూచించింది.ఇక బంగారం తదుపరి కదలికకు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) కీలకం కానుంది. PPI అంచనాల కంటే ఎక్కువగా వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయన్న సంకేతాలు వెలువడి, ఫెడ్ రేట్లపై అంచనాలు మళ్లీ మారే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, చమురు ధరలు కూడా బంగారం ధరను ప్రభావితం చేయనున్నాయి. -
దివాలా తీయనున్న బ్యాంకులు? భారీగా పెరుగుతున్న GOLD LOANS
-
రికార్డు స్థాయికి బంగారం ధరలు..
-
మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి తగ్గేదేలే..
న్యూఢిల్లీ: ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్‌పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి. -
ఇక సామాన్యులు గోల్డ్ కొనలేరా? తులం 2 లక్షలు?
-
ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కేంద్రానికి పసిడి పంట
బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది మే 13 నుంచి ఆగస్టు 2 వరకు స్వల్ప వ్యవధిలోనే విలువైన లోహాల దిగుమతుల ద్వారా కస్టమ్స్ సుంకాల రూపంలో ఏకంగా రూ.10,463 కోట్ల రాబడి సమకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ఆదాయంలో పసిడిదే అగ్రస్థానంమొత్తం కస్టమ్స్ వసూళ్లలో సింహభాగం బంగారం నుంచే లభించింది. బంగారం దిగుమతులపై రూ.10,040 కోట్లు, వెండి దిగుమతులపై రూ.328 కోట్లు, ప్లాటినం దిగుమతులపై రూ.95 కోట్లు సమకూరింది.సుంకాల పెంపునకు కారణాలుపశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం, హార్మూజ్ జలసంధి ఆటంకాల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు, ఎరువుల ధరలు పెరిగాయి. దేశీయ విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్) పరిరక్షించుకోవడానికి, అనవసర దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం మే 13న పసిడి, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతాల నుంచి 15 శాతానికి, ప్లాటినం సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన విషయం విదితమే. చమురు, నిత్యావసర పారిశ్రామిక ముడిసరుకుల దిగుమతులకు ఫారెక్స్ నిల్వలను ప్రాధాన్యత క్రమంలో కేటాయించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.స్మగ్లింగ్‌పై ఉక్కుపాదంపన్ను రేట్లు పెరగడంతో అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉండటంతో తనిఖీ ఏజెన్సీలు నిఘాను తీవ్రతరం చేశాయి. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ సరిహద్దుల్లో దాడి చేసి 161 కిలోల అక్రమ బంగారాన్ని జప్తు చేయడమే కాకుండా 116 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద పసిడి వినియోగదారైన భారత్‌లో దిగుమతి సుంకాల పెంపు వల్ల పసిడి విక్రయాలు కొంత మందగించినప్పటికీ ప్రభుత్వానికి మాత్రం త్వరితగతిన భారీగా రెవెన్యూ సమకూరిందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
పసిడి ప్రియులకు షాక్.. తులం 2 లక్షలు?
-
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
బంగారం, వెండి ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయి. ఇది వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఎంతవరకు ధరలు పెరగనున్నాయి?, అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ద్రవ్యోల్బణ గణాంకాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పాజిటివ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1.57 లక్షలు, వెండి ధర కేజీ రూ.2.80 లక్షల వరకు చేరే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు ప్రణవ్ మేర్ అంచనా వేశారు.దేశీయ మార్కెట్లో పసిడి ధరలు.. ఈ వారంలో దాదాపు 6 శాతం పెరిగి రూ.1.51 లక్షలకు చేరింది. వెండి రూ.2.49 లక్షలకు చేరింది. అమెరికా కార్మిక మార్కెట్.. అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో.. అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కొంత సడలింపు చూపించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో బంగారం, వెండిపై కొనుగోళ్లు పెరిగాయి. మరోవైపు డాలర్ బలహీనపడటం కూడా ధరలు పెరగడానికి కారణం అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బంగారం ధర దాదాపు 7 శాతం పెరగగా.. వెండి ఏకంగా 10 శాతం వరకు ఎగబాకింది. వచ్చే వారం అమెరికా ఆర్థిక గణాంకాలతో పాటు అమెరికా - ఇరాన్ మధ్య పరిణామాలు కూడా కీలకం కానున్నాయి. పశ్చిమాసియాలో ఏదైనా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి? -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తలకిందులైన రేట్లు!
బంగారం ధరలు ఈ వారం మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఏకంగా 7 శాతానికి పైగా లాభపడి, ఎనిమిది నెలల్లోనే అత్యుత్తమ వారపు పనితీరును నమోదు చేసింది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 4,336 డాలర్లకు చేరగా, ట్రేడింగ్‌లో 4,350 డాలర్ల సమీపంలో ఏడు వారాల గరిష్ఠాన్ని తాకింది. బలహీనమైన అమెరికా ఉద్యోగాల డేటా, తగ్గుతున్న ముడిచమురు ధరలు, వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు పసిడి ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.బంగారానికి పెరిగిన డిమాండ్అమెరికా జూలై నాన్-ఫార్మ్ పేరోల్స్ అనూహ్యంగా 23 వేల ఉద్యోగాలు తగ్గడం మార్కెట్లను ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ గణాంకాలను కూడా దిగువకు సవరించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరిగాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ సమీప సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందన్న అంచనాలు బలపడ్డాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగినప్పుడు బాండ్లపై రాబడులు, డాలర్ బలహీనపడే అవకాశం ఉండటంతో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.మరోవైపు ముడిచమురు ధరలు తగ్గడం కూడా బంగారానికి కలిసొచ్చింది. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ‘హయ్యర్ ఫర్ లాంగర్’ వడ్డీ రేట్ల అంచనాలు బలహీనపడతాయి. అదే సమయంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్న నిధులు పసిడి ధరలకు అదనపు మద్దతు ఇస్తున్నాయి.సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా ప్రస్తుత ర్యాలీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకులు 288.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 62 శాతం పెరుగుదల. దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంక్ కూడా 13 ఏళ్ల విరామం తర్వాత తిరిగి బంగారం కొనుగోలు చేయడం అధికారిక రంగంలో పసిడిపై ఆసక్తి ఇంకా బలంగానే ఉందన్న సంకేతాలను ఇస్తోంది.పెరిగింది రూ.8వేలు పైనే..ఇక హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 8న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,350గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,39,650గా నమోదైంది. వారం ప్రారంభంలో అంటే ఆగస్టు 1న 24 క్యారెట్ల ధర రూ.1,44,220, 22 క్యారెట్ల ధర రూ.1,32,200గా ఉండగా.. వారం రోజుల్లో 24 క్యారెట్లపై రూ.8,130, 22 క్యారెట్లపై రూ.7,450 పెరిగింది.మరో భారీ బుల్‌రన్ అవుతుందా?అయితే ఈ ర్యాలీని నేరుగా మరో భారీ బుల్రన్గా నిర్ధారించడం తొందరపాటు అవుతుందని విశ్లేషకుల అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి బలంగా కొనసాగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, మార్కెట్లలో రిస్క్ అప్పటైట్ తిరిగి రావడం వంటి అంశాలు బంగారంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగితే స్వల్పకాలంలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొంతకాలం పరిమిత శ్రేణిలో కదలవచ్చని పేర్కొంది.అదే సమయంలో ఆర్థిక మందగమనం, కొత్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు లేదా ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు కలిసి వస్తే బంగారం మళ్లీ 4,500 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంటే ప్రస్తుత ర్యాలీకి దీర్ఘకాలిక బలం ఉన్నప్పటికీ, మధ్యలో ధరల కరెక్షన్, లాభాల స్వీకరణ వంటి పరిణామాలు తప్పక చూడాల్సి ఉంటుంది. -
“బంగారం ధరలపై మళ్లీ షాక్.. పసిడి ప్రియులకు భారీ దెబ్బ!”
-
మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ఈ రోజు తులం ఎంతంటే?
-
బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్లు!
-
నిప్పులు కక్కిన బంగారం! వెండి ఒక్కరోజులో రూ.10 వేలు..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. ఇక వెండి ధరలు కూడా నేడు మరింత పెరిగాయి. దీంతో బంగారం, వెండి కొనేవాళ్లకు ఈరోజు కూడా భారీ నిరాశ తప్పలేదు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
భారీగా తగ్గిన బంగారం ధరలు
-
మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు
-
మెరుపు తగ్గిన మేలిమి బంగారం
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం, వెండి.. ఇంకా అవే ధరలు
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగడం ఇది వరుసగా ఆరో రోజు. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం కొనసాగింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ధరలు క్రితం రోజున తగ్గుముఖం పట్టాయి. నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
భారీగా తగ్గిన బంగారం ధర నేడు తులం ఎంతంటే?
-
గంటల్లోనే మారిన ధరలు తులం ఎంతంటే?
-
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
-
బంగారం కొనుగోళ్లు.. రూ.1.98 లక్షల కోట్లు!
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే.. పండుగలు, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు ప్రజలు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. కానీ.. ఈసారి పసిడి ధరలు భారీగా పెరగడంతో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొనుగోళ్ల పరిమాణం కొంత తగ్గినప్పటికీ.. బంగారంపై ప్రజలు ఖర్చు చేసిన మొత్తం మాత్రం రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 130.9 టన్నులుగా నమోదైంది. గత ఏడాది(139.1 టన్నులు)తో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం తక్కువే, కానీ.. ధరలు మాత్రమే గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది దాదాపు 59 శాతం పెరిగింది. దీనివల్ల కొనుగోళ్లపై ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది.2026 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు బంగారం కొనుగోలు కోసం రూ.1.98 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు నివేదిక చెబుతోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువ. అంటే ప్రజలు తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినప్పటికీ, పెరిగిన ధరల కారణంగా ఖర్చు చేసిన మొత్తం పెరిగిందన్నమాట.ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే ఎక్స్చేంజ్ పద్ధతులు, ఈఎంఐ సౌకర్యాలు, తక్కువ బడ్జెట్లో విలువైన ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ అనేది ధరలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా రెండో అర్ధభాగంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ధరలు ఇలాగే అధికంగా కొనసాగితే ఆభరణాల కొనుగోళ్లపై కొంత ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్‌లో రెండు బెడ్షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? -
ఏకంగా 13 వేలు తగ్గిన బంగారం నేడు తులం ఎంతంటే?
-
బంగారం ఎందుకో చిన్నబోయింది!
అంతర్జాతీయ వ్యాప్తంగా బంగారం ధరల్లో నెలకొన్న తీవ్ర అస్థిరత భారతీయ పసిడి ప్రియులను కొనుగోళ్లకు దూరంగా ఉంచుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యమున్న గోల్డ్ విక్రయాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసికం కాలంలో దేశీయ బంగారం డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 6 శాతం తగ్గి 131.4 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా ‘క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దేశీయంగా 139.7 టన్నుల పసిడి వినియోగం నమోదైంది.పరిమాణం తగ్గినా.. విలువలో ఆల్‌టైమ్ రికార్డు!బంగారం కొనుగోలు పరిమాణంలో తగ్గుదల కనిపించినప్పటికీ ఆకాశాన్నంటిన ధరల కారణంగా విలువ రూపంలో బంగారం వాణిజ్యం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పసిడి వినియోగ విలువ గతేడాదితో పోలిస్తే ఏకంగా 50 శాతం పెరిగి రూ.1,98,100 కోట్లకు చేరింది. 2025 క్యూ2లో ఇది రూ.1,32,500 కోట్లుగా ఉంది. భౌతిక పరిమాణం తగ్గినా భారతీయుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో పసిడికే ప్రథమ స్థానం దక్కుతోందని డబ్ల్యూజీసీ భారత ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు.ఆభరణాల విక్రయాలపై దెబ్బ.. కారణాలివే..డబ్ల్యూజీసీ సమాచారం ప్రకారం, అత్యధిక క్షీణత ఆభరణాల (జువెల్లరీ) విభాగంలోనే నమోదైంది. క్యూ2లో ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75.1 టన్నులకు (గతేడాది 88.8 టన్నులు) పరిమితమైంది. దీనికి ప్రధాన కారణాలు..పసిడి ధరలు నిరంతరం రికార్డు స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనుకావడం, వినియోగదారులు వేచి చూసే ధోరణి అవలంబించడం.దిగుమతి సుంకం పెంపు ప్రభావంతో దేశీయ మార్కెట్లో రీటైల్ ధరలు మరింత పెరిగాయి.సుంకాలు పెరగడంతో అక్రమ రవాణా పెరిగిపోతోందని, ఇది అధికారిక బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.కోలుకునే అవకాశం!వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ ఏడాది మొత్తానికి భారత్‌లో పసిడి డిమాండ్ 650-750 టన్నుల మధ్య నమోదుకావచ్చు. రాబోయే పండుగల సీజన్లో (దసరా, దీపావళి) ధరలు కొంత సద్దుమణిగితే బంగారం కొనుగోళ్లు తిరిగి పుంజుకుని మార్కెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు -
భారీగా పడిపోయిన బంగారం ధరలు ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
-
వసివాడిన పసిడి మెరుపులు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
తగ్గిన పసిడి,వెండి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్ నెలకొనడంతో దేశీయంగా పసిడి ధరలు తగ్గాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,640 తగ్గి రూ. 1,47,000కు దిగి వచ్చింది. అటు వెండి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. కేజీకి రూ. 5,200 తగ్గి రూ. 2,24,800కి పరిమితమైంది.రూపాయి బలపడటంతో దిగుమతి చేసుకున్న బులియన్ వ్యయం తగ్గిందని, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని, దీనితో పసిడి ధర నెమ్మదించిందని ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 1.31 శాతం తగ్గి 4,023.50 డాలర్లకు, వెండి 2 శాతం క్షీణించి 57.24 డాలర్లకు నెమ్మదించింది. -
బంగారం ధర ఒక్కసారిగా భారీగా పడిపోయింది..!
-
ఇంకా తగ్గనున్న బంగారం ధరలు!
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కారణం అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అంటే మార్కెట్లో ఊహకందని పరిణామాలు జరగలేదన్నమాట. అయినప్పటికీ త్వరలోనే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధరలపై అత్యధిక ప్రభావం చూపుతున్నది అమెరికా ఆర్థిక వ్యవస్థ. యూఎస్ డాలర్ విలువ పెరగడం, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రాబడులు అధికంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి, ధరలు కూడా పతనమవుతున్నాయి.దేశీయ మార్కెట్లో ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1550 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.750 తగ్గింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.200 రీఛార్జ్ ప్లాన్.. జియో vs వొడాఫోన్ ఐడియా! -
కరుగుతోన్న బంగారు కొండ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!
-
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో క్రితం రోజున మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
రూ.1.45 లక్షలకు చేరిన బంగారం ధర!
బంగారం ధరల్లో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఒకరోజు తగ్గుముఖం పడితే.. మరోరోజు భారీగా పెరగడం. ఇంకోరోజు ధరలు స్థిరంగా ఉండిపోవడం. ఇలా గోల్డ్ రేటు ముందుకు సాగుతోంది. ఈ కథనంలో వారం (జులై 19 నుంచి 25 వరకు) రోజుల్లో పసిడి ధరలు ఎలాంటి మార్పునకు లోనైంది. తాజా ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గత ఆదివారం (జులై 19) రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర జులై 25 నాటికి రూ.1,44,930 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,350 నుంచి రూ.1,32,850 వద్దకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏడు రోజుల్లో రూ.1,43,440 నుంచి రూ.1,45,080 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,450 నుంచి రూ.1,33,000 వద్దకు (రూ.1550 పెరిగింది) చేరింది. దీన్ని బట్టి చూస్తే వారం రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. జులై 19న రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి ధర జులై 25 నాటికి రూ.1,45,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,350 నుంచి రూ.1,33,000 వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో సిల్వర్ రేటు కూడా వారం రోజుల్లో గణనీయమైన మార్పుకునకు లోనైంది. దీంతో కేజీ వెండి రేటు ఏడు రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు చేరింది. అంటే రూ.5000 పెరిగిందన్నమాట. -
తారుమారైన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
-
పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?
-
గంటల వ్యవధిలో.. భారీగా తగ్గిన బంగారం రేటు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం రూ.770 పెరిగి రూ.1,47,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.గురువారం (జులై 23) ఉదయం రూ.1,47,280 (తులం 24 క్యారెట్స్ గోల్డ్), రూ.1,35,000 (తులం 22 క్యారెట్స్ గోల్డ్) వద్ద బంగారం రేటు, సాయంత్రానికే రూ.1,46,180.. రూ.1,34,000 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1100, రూ.1000 తగ్గింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు ఎంత మారిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో కూడా బంగారం ధరలో గణనీయమైన మార్పు ఏర్పడింది. దీంతో ఉదయం, సాయంత్రం ధరలకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146330 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,34,150 వద్ద ఉంది. అయితే.. చెన్నైలో మాత్రం ఈ రోజు సాయంత్రానికి ధరల్లో మార్పు కనిపించలేదు. -
బంగారం @ 1,50,000? ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే..
-
ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి తగ్గినా.. ‘గోల్డ్ బాండ్ల’ జోరు తగ్గేదేలే..
బంగారం ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గినప్పటికీ సార్వభౌమ పసిడి బాండ్లలో (సావరీన్ గోల్డ్ బాండ్స్-ఎస్జీబీ) పెట్టుబడి పెట్టిన వారికి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ 34-44 శాతం వరకు లబ్ధి చేకూరుతోంది. కొత్తగా ఎస్‌జీబీల జారీని ప్రభుత్వం నిలిపివేసినప్పటికీ 2032 ఫిబ్రవరి వరకు గడువు తీరే దాదాపు 45 బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫామ్ల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి వార్షికంగా 2.50 శాతం వడ్డీని అందిస్తూనే గడువు ముగిసే సమయానికి నాటి పసిడి మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ సొమ్మును చెల్లిస్తాయి.900 శాతానికి పైగా పెరుగుదలరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 2024లో చివరిసారిగా ఎస్జీబీని జారీ చేసింది. 2015 చివరిలో ఈ పథకం ప్రారంభమైనప్పుడు 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.25,000 ఉండగా ప్రస్తుతం అది దాదాపు రూ.1.29 లక్షలకు చేరింది. ఫలితంగా, ప్రభుత్వంపై ఎస్‌జీబీల బాధ్యత సుమారు రూ.1.12 లక్షల కోట్ల- రూ.1.20 లక్షల కోట్లకు (సుమారు 130 టన్నుల బంగారం) పెరిగింది. ఇది 2015తో పోలిస్తే 900 శాతానికి పైగా పెరుగుదల.ఈ క్రమంలోనే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర బడ్జెట్ 2026లో కీలక పన్ను సవరణ చేసింది. ఇకపై ఆర్బీఐ ద్వారా ప్రాథమికంగా బాండ్లు కొనుగోలు చేసి ఎనిమిదేళ్ల గడువు వరకు ఉంచుకునే వారికి మాత్రమే మూలధన లాభాల పన్ను మినహాయింపు లభిస్తుంది. సెకండరీ మార్కెట్ (NSE/BSE)లో ఇతరుల నుంచి ఎస్‌జీబీలు కొనుగోలు చేసేవారికి ఈ పన్ను మినహాయింపు వర్తించదని నిపుణులు చెబుతున్నారు. బాండ్ల పన్ను విధానంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కొత్తగా పసిడిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు మెరుగైన ప్రత్యామ్నాయమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: కోకా-కోలా ‘ఫెయిర్‌లైఫ్’పై సైబర్ దాడి -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు తులం ఎంతంటే?
-
బంగారం సెగ ఇప్పట్లో తగ్గేలాలేదు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. -
బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జులై ఆరంభంలో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. తదనంతరం సాగిన లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్), కీలక వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకుల వైఖరి వల్ల ధరల్లో తగ్గుదల నమోదైంది. ఈ అనిశ్చిత వాతావరణంలో సాధారణ మదుపరులు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై ఆర్థిక నిపుణులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు.ధరల కదలికలు.. కారణాలుయుద్ధం, ఆర్థిక అనిశ్చితి కాలంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తిగా బంగారానికి ప్రాధాన్యం ఇస్తారు. జులై నెలలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు మండిపోవడం వల్ల పసిడికి భారీగా డిమాండ్ పెరిగింది. అయితే, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణ అంచనాలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు బంగారంలో కదలికలను పరిమితం చేశాయి. మరోవైపు, వెండి కేవలం సురక్షిత పెట్టుబడిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక డిమాండ్ (సోలార్, ఎలక్ట్రానిక్స్) కలిగిన లోహం కావడంతో రెసిస్టెన్స్ లెవల్స్ వద్ద కొంత ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది.ఇప్పుడేం చేయాలి?దీర్ఘకాలిక మదుపరులు: ఇప్పటికే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారం, వెండి ఉంటే వాటిని వెంటనే విక్రయించాల్సిన అవసరం లేదు. భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం బంగారం రీ-రేటింగ్ అయ్యే అవకాశం ఉన్నందున హోల్డ్ చేయడం ఉత్తమం.కొత్తగా పెట్టుబడి పెట్టేవారు: మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ప్రమాదకరం. ధరలలో దిద్దుబాటు వచ్చిన ప్రతిసారి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్జీబీ-ప్రస్తుతానికి ప్రభుత్వం వీటిని తాత్కాలికంగా నిలిపేసింది. మళ్లీ తీసుకొస్తే పెట్టుబడి పెట్టడం), గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా డిజిటల్ గోల్డ్ ద్వారా 5-10% మేర కేటాయింపులు చేసుకోవడం శ్రేయస్కరం.స్వల్పకాలిక ట్రేడర్లు: ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేవారు గరిష్ట ధరల వద్ద కొంతమేర లాభాలను స్వీకరించి ‘స్టాప్ లాస్’ విధానాన్ని పాటించాలి.అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు సమసిపోయే వరకు పసిడి, వెండి ధరల్లో అస్థిరత కొనసాగుతుంది. ప్రతికూల ఆర్థిక వాతావరణంలో ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోకు రక్షణ కల్పించే ఇంధనంగా పసిడి ఉంటుంది. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులను కొనసాగించడమే మెరుగైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో క్రితం రోజున మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..


