న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, భారీగా పెరిగిన ధర వద్ద లాభాల స్వీకరణ పసిడి ధరపై తాజాగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.1,450 తగ్గి రూ.72,200కు దిగివచ్చింది.
కేజీ వెండి ధర రూ.2,300 తగ్గి, రూ.83,500కు చేరింది. కాగా ఆర్థిక రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్చత ధరలు వరుసగా రూ.1,277, రూ.1,272 తగ్గి రూ.71,598, 71,311కు దిగివచ్చాయి. వెండి కేజీ రూ.1,547 మైనస్‌తో రూ.80,007కు తగ్గింది.కాగా పసిడి ఫ్యూచర్ మార్కెట్లలో సైతం క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లో ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment