decreased
-
దిగివచ్చిన బంగారం ధర
-
సిటీ ‘రియల్’ మార్కెట్ ఢమాల్
వరుస ఎన్నికలు, ప్రభుత్వ మార్పు, భూమి విలువల సవరణ, కరువు ఛాయలు, ఆర్థిక మందగమనం, బ్యాంకు రుణవడ్డీ రేట్ల భారం.. వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో గ్రేటర్హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పడిపోయాయి. గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారస్థాయికి చేరింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయే సరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది.- సాక్షి,హైదరాబాద్రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టతసాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నగదు లభ్యత,లావాదేవీలపై పరిమితులు, వడ్డీ రేట్ల ప్రభావం, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం వంటివి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇప్పటికీ విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత కొరవడింది. ఔటర్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, 111 జీవో రద్దు వంటి పలు కీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.రిజిస్ట్రేషన్లపై లెక్కలు చూస్తే..2022 జనవరి–జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 2,32,628 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయి.. ఆదాయం రూ.3,920 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు పడిపోయాయి. అంటే 2022తో పోలిస్తే 30 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో తగ్గుదలసాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి.హైదరాబాద్జిల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజిస్ట్రేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్‌లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.లే–ఆఫ్‌లు, ధరల పెరుగుదలా కారణమే..గ్రేటర్లో గృహాలు, ఆఫీసు స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు, ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లే–ఆఫ్‌లు జరుగుతున్నాయి. కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో.. గ్రేటర్లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది. మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారుసాధారణంగా హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరడంతో మార్కెట్ ఎలా ఉంటుందోఅన్న సందేహాలు ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి స్థిరాస్తి రంగం బాగుంటుంది. – ఇంద్రసేనారెడ్డి,గిరిధారి హోమ్స్ ఎండీ -
4 శాతం తగ్గిన డీజిల్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ ప్రథమార్ధంలో డీజిల్ వినియోగం 4 శాతం క్షీణించింది. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వేడి వాతావరణ పరిస్థితులు రవాణాపై ప్రభావం చూపించడం వల్లే వినియోగం తగ్గినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల తరుణంలో ఇంధన విక్రయాలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది ఎన్నికల సమయంలో వినియోగం నెలవారీగా క్షీణిస్తూ వచి్చంది. ఎన్నికలు ముగిసిన మరుసటి నెలలోనూ వినియోగం తగ్గడం వాతావరణ పరిస్థితుల వల్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ 1 నుంచి 15 మధ్య 3.95 మిలియన్ టన్నుల డీజిల్ విక్రయాలు నమోదైనట్టు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 3.9 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు ఈ ఏడాది మార్చిలో 2.7 శాతం, ఏప్రిల్‌లో 2.3 శాతం, మే నెలలో 1.1 శాతం చొప్పున డీజిల్ విక్రయాలు క్షీణించాయి. ఇక జూన్ మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.42 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోనూ 1.41 మిలియన్ టన్నుల విక్రయాలే జరిగాయి. మే నెల మొదటి అర్ధ భాగంలోని విక్రయాలతో పోల్చి చూస్తే అమ్మకాలు 3.6 శాతం తగ్గాయి. వేసవిలో అధిక వేడి నుంచి ఉపశమనం కోసం కార్లలో ఏసీ వినియోగం పెరుగుతుంది. ఇది అధిక ఇంధన వినియోగానికి దారితీస్తుంది. అయినా కానీ, ఈ వేసవిలో ఇంధన అమ్మకాలు క్షీణించాయి. ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.2 చొప్పున ప్రభుత్వరంగ సంస్థలు తగ్గించడం కూడా అమ్మకాలకు ప్రేరణనివ్వలేదని తెలుస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం అమ్మకాల్లో డీజిల్ వాటా 40 శాతంగా ఉంటోంది. 70 శాతం డీజిల్ వినియోగం రవాణా రంగంలోనే నమోదవుతుంటుంది. పెరిగిన ఏటీఎఫ్ అమ్మకాలు... ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు ఈ నెల మొదటి 15 రోజుల్లో 2.3 శాతం పెరిగి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు) 3,31,000 టన్నలుగా ఉన్నాయి. మే నెల మొదటి 15 రోజులతో పోల్చి చూస్తే 4.5 శాతం తక్కువ. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వినియోగం కరోనా ముందునాటి స్థాయిని దాటిపోవడం గమనార్హం. వంటగ్యాస్ వినియోగం (ఎల్పీజీ) పెద్దగా మార్పు లేకుండా 1.24 మిలియన్ టన్నులుగా నమోదైంది. -
భారీగా తగ్గిన పసిడి ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, భారీగా పెరిగిన ధర వద్ద లాభాల స్వీకరణ పసిడి ధరపై తాజాగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.1,450 తగ్గి రూ.72,200కు దిగివచ్చింది. కేజీ వెండి ధర రూ.2,300 తగ్గి, రూ.83,500కు చేరింది. కాగా ఆర్థిక రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్చత ధరలు వరుసగా రూ.1,277, రూ.1,272 తగ్గి రూ.71,598, 71,311కు దిగివచ్చాయి. వెండి కేజీ రూ.1,547 మైనస్‌తో రూ.80,007కు తగ్గింది.కాగా పసిడి ఫ్యూచర్ మార్కెట్లలో సైతం క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లో ట్రేడవుతోంది. -
FICCI-IBA Bankers survey: ప్రభుత్వ బ్యాంకుల్లో తగ్గిన మొండిబాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ గత ఆరు నెలలుగా మొండిబాకీలు (ఎన్పీఏ) గణనీయంగా తగ్గాయి. ప్రైవేట్ రంగంలో 67 శాతం బ్యాంకుల్లో మాత్రమే ఎన్పీఏలు తగ్గాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వాటిల్లో 77 శాతం బ్యాంకులు గత ఆరు నెలలుగా మొండిబాకీలు తగ్గినట్లు వెల్లడించాయి. సగం పైగా బ్యాంకులు రాబోయే ఆరు నెలల్లో తమ స్థూల ఎన్పీఏలు 3–3.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. పీఎస్‌బీలు, విదేశీ బ్యాంకుల్లో గత ఆరు నెలల్లో ఎన్పీఏలేమీ పెరగలేదు. కానీ 22 శాతం ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం పెరిగాయి. 18వ ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వేను గతేడాది జూలై–డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులు కలిపి మొత్తం 23 బ్యాంకులు ఇందులో పాల్గొన్నాయి. అసెట్ల పరిమాణంపరంగా బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా 77 శాతంగా ఉంటుంది. మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అధికంగా ఎన్పీఏలు ఉన్నాయి. ► వచ్చే ఆరు నెలల్లో ఆహారేతర పరిశ్రమలకు రుణాల వృద్ధి 12 శాతం పైగానే ఉండొచ్చని 41 శాతం బ్యాంకులు, 10–12 శాతం ఉండొచ్చని 18 శాతం బ్యాంకులు భావిస్తున్నాయి. 36% బ్యాంకులు ఇది 8–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ► రాబోయే ఆరు నెలల్లో ఎన్పీఏలు 2.5–3 % స్థాయిలో ఉండొచ్చని 14% బ్యాంకులు తెలిపాయి. ► టర్మ్ డిపాజిట్లు పుంజుకోగా, మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా తగ్గిందని 70 శాతం బ్యాంకులు తెలిపాయి. దీర్ఘకాలికంగా అధిక వడ్డీ రేట్లకు డిపాజిట్లను లాకిన్ చేయాలనే ధోరణిలో కస్టమర్లకు ఉండటమనేది టర్మ్ డిపాజిట్లకు సానుకూలంగా మారింది. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఐరన్ .. ఉక్కు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ కోసం డిమాండ్ నెలకొంది. -
జూన్ త్రైమాసికంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 7.6 శాతంగా ఉన్నట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 19వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను విడుదల చేసింది. 15 ఏళ్ల పైన వయసుండి, పనిచేసే అర్హతలు కలిగిన వారిలో, ఉపాధి లేమిని ఈ రేటు సూచిస్తుంటుంది. 2023 జనవరి–మార్చి కాలంలో నిరుద్యోగం 6.8 శాతంగా, 2022 జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్లో 7.2 శాతంగా నిరుద్యోగ రేటు ఉండడం గమనించొచ్చు. పట్టణాల్లో 15 ఏళ్లకు పైన మహిళల్లో నిరుద్యోగం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది ఇది 9.2 శాతంగా ఉంది. పురుషుల్లో నిరుద్యోగ రేటు జూన్ త్రైమాసికంలో 5.9 శాతానికి క్షీణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.1 శాతంగా ఉంటే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 6 శాతంగా ఉండడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.8 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది పట్టణాల్లో 48.5 శాతంగా ఉంది. -
మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన మద్యం ధరలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా తగ్గించింది. ఫుల్ బాటిల్‌పై(750ఎంల్) రూ.40 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 180 ఎంఎల్‌పై రూ.20, 180 ఎంఎల్‌పై రూ.10, 90 ఎంఎల్‌పై రూ.5 తగ్గించింది. తగ్గిన ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పినట్లయింది. అయితే బీరు ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం లిక్కర్ బ్రాండ్లకే కొత్త ధరలు వర్తిస్తాయి. కాగా.. తెలంగాణలో ఏప్రిల్ నెలలో కోటికిపైగా బీర్లు అమ్ముడైన విషయం తెలిసిందే. ఎండల్లో చల్లబడేందుకు బీర్ ప్రియులు తెగ లాగించేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో రోజుకు ఇన్ని వీధి కుక్కలు చనిపోతున్నాయా? -
అమ్మ కడుపు చల్లగా.. ఏపీలో రెండేళ్లుగా తగ్గిన మాతా, శిశు మరణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా మహిళలు, బాలల ఆరోగ్యం పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, ఎప్పటికప్పుడు వైద్యం, మందులు అందిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. జాతీయ స్థాయి సగటుతో పోల్చితే ప్రసూతి మరణాలతో పాటు శిశు మరణాలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా ప్రసూతి మరణాలు తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించినట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రసూతి మరణాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రగతిని సాధించిందని పేర్కొంది. సుస్థిర ప్రగతి లక్ష్యం మేరకు ప్రతి లక్ష ప్రసవాల్లో ప్రసూతి మరణాలు 70లోపు ఉండాలి. 2017–18లో రాష్ట్రంలో లక్ష ప్రసవాల్లో 58 ప్రసూతి మరణాలు సంభవించగా 2020లో ఈ సంఖ్య 45కు తగ్గినట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గత నెలలో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జాతీయ స్థాయిలో కూడా ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గినప్పటికీ రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ ఉన్నాయి. 2017–18లో జాతీయ స్థాయిలో ప్రతి లక్ష ప్రసవాల్లో 103 ప్రసూతి మరణాలు సంభవించగా 2020లో 97కు తగ్గాయి. అలాగే సజీవ జననాల్లో శిశు మరణాలు జాతీయ స్థాయికన్నా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యి సజీవ జననాల్లో శిశు మరణాలు 2018లో 29 ఉండగా 2019లో 25కు, 2020లో 24కు తగ్గినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇదే జాతీయ స్థాయిలో వెయ్యి సజీవ జననాల్లో 2018లో 32 శిశు మరణాలు సంభవించగా 2019లో 30కు, 2020లో 28కు తగ్గినట్లు తెలిపింది. ఆస్పత్రుల్లోనే 97 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ఆస్పత్రుల్లో కాన్పులు 92 శాతమే ఉంటే.. 2019 – 21లో 97 శాతానికి పెరిగింది. అత్యధిక కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. మూడు శాతమే ఇళ్ల వద్ద జరుగుతున్నాయి. పటిష్ట ప్రణాళికతో గర్భిణులు, శిశువుల పరిరక్షణ మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గర్భిణులు, శిశువుల పరిరక్షణకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను అమలు చేస్తోంది. వలంటీర్లు సచివాలయాల స్థాయిలో గర్భిణులు, 5 ఏళ్లలోపు బాలల వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నారు. పిల్లలు, గర్బిణుల డేటా, ఆధార్‌ను ఆర్సీహెచ్ (పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్య) పోర్టల్ ఐడీతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 2.59 లక్షల గర్భిణుల వివరాలను మ్యాపింగ్ చేశారు. ఈ వివరాలను సచివాలయాల గృహ కుటుంబాల డేటాలో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోఎక్కువ ప్రమాదం గల గర్భిణులను గుర్తించి వారికి సుఖ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకు ఏఎన్ఎం స్వయానా ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు అందిస్తున్నారు. చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ అవసరమైన వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద గర్భిణులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. శిశువుల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్సీయూ )లు పనిచేస్తున్నాయి. 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన టీకాలు ప్రభుత్వం వేయిస్తోంది. బాలలకు ఐఎఫ్ఏ సిరప్, డి–వార్మింగ్, విటమిన్ ఏ చుక్కలు అందిస్తోంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత లేకుండా చూడటం వలన గర్భిణులు, శిశువులకు నిరంతర వైద్య సేవలు అందుతున్నాయి. -
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 300 శాతం తగ్గాయి: ఎమ్మెల్సీ పల్లా
సాక్షి, హైదరాబాద్: రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చే యూత, సాగునీటి ప్రాజెక్టులు, వనరుల కారణంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గతంతో పోలిస్తే 300 శాతం తగ్గాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగం ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, వి.గంగాధర్ గౌడ్, తాత మధులతో కలిసి ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. 2014లో 1,300 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది ఇప్పుడు 352గా ఉందని, నీతి ఆయోగ్ వంటి సంస్థ తెలంగాణలో వ్యవసాయ స్థితిగతులు బాగున్నాయని కితాబిచి్చందని గుర్తు చేశారు. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పది శాతంలోపు తగ్గితే తెలంగాణలో 300 శాతం తగ్గాయని, వివిధ కారణాలతో భూ మి లేనివారు ఆత్మహత్యలు చేసుకుంటే కూ డా రైతుల ఖాతాలో వేస్తున్నారని అన్నారు. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది బాధాకరమే అని, తప్పుడు లెక్కలతో ఓ పత్రిక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అసత్యా లు ప్రచారం చేస్తుందని విమర్శించారు. చదవండి: సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి!.. కేంద్రం రూ.1,100 కోట్ల నిధులు ఆపేసింది -
ఏపీలో ఈ ఏడాది భారీగా తగ్గిన క్రైం రేట్
సాక్షి, విజయవాడ: ఏపీలో క్రైమ్ రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గించగలిగామన్నారు. లోక్ అదాలత్ ద్వారా పెద్ద ఎత్తున కేసులు పరిష్కరిస్తున్నాం. 1.08 లక్షల కేసులు పరిష్కరించాం. చోరీ కేసుల్లో రికవరీ శాతం బాగా పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు. ‘‘గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19,203 జరగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాం. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సీపీ/ ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు(మహిళలకు సంబంధించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణ చేస్తారు’’ అని డీజీపీ వివరించారు. ‘‘ప్రతి రోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం ఈ విధానం ద్వారా కేసు ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడేవిధంగా చేయొచ్చు. అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశం’’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. -
వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించండి.. ఆర్బీఐకి సీఐఐ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి పరిశ్రమల సమాఖ్య సీఐఐ విజ్ఞప్తి చేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కట్టడి చేసేందుకే ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 190 బేసిస్ పాయింట్ల మేర పెంచినప్పటికీ .. దాని ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం కార్పొరేట్ రంగంపై కనిపిస్తున్నాయని పేర్కొంది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 2,000 పైచిలుకు కంపెనీల ఆదాయాలు, లాభాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని తమ విశ్లేషణలో వెల్లడైనట్లు సీఐఐ తెలిపింది. దీంతో ‘అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశీయంగా వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే నేపథ్యంలో గతంలో లాగా 50 బేసిస్ పాయింట్ల స్థాయిలో కాకుండా వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించడాన్ని పరిశీలించాలి‘ అని ఆర్బీఐని సీఐఐ కోరింది. ఇంకా 6 శాతం ఎగువనే ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైతే మరో 25 నుండి 35 బేసిస్ పాయింట్ల వరకూ మాత్రమే పెంచే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) డిసెంబర్ తొలి వారంలో వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సీఐఐ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు ధరలను కట్టడి చేస్తూనే అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా ఆర్బీఐ గతంలో లాగా తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించాలని సీఐఐ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు రిస్కులను తీసుకోవడానికి ఇష్టపడని ధోరణులు పెరుగుతుండటం .. భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. దీనితో కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకోవడంలోనూ సవాళ్లు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం కేవలం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) మాత్రమే ఎక్కువగా పట్టించుకోవడం కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), ఎన్నారై నిధుల ప్రవాహంపై కూడా దృష్టి పెట్టాలని సీఐఐ అభిప్రాయపడింది. -
Sakshi Cartoon: భారత్‌లో పేదరికం తగ్గింది
భారత్‌లో పేదరికం తగ్గింది: ప్రపంచ బ్యాంకు -
నాగర్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు
-
రైతుల ఆత్మహత్యలు తగ్గాయి
సిరిసిల్ల: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని.. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్‌లో శుక్రవారం మంత్రి, గోకుల్దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అపెరల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. జౌళి రంగం అభివృద్ధికి తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపెరల్ పాలసీ(టీ–టాప్) తెచ్చామని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 12 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అలాగే సిరిసిల్లలో 60 ఎకరాల్లో నెలకొల్పిన అపెరల్ పార్క్ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీడీలు చేస్తూ రె క్కలు ముక్కలు చేసుకునే మహిళలకు సులభంగా నెలకు రూ.10 వేలనుంచి రూ.12 వేలు సంపాదించుకునేందుకు గార్మెంట్ పరిశ్రమలు దోహదపడతాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్రాలు ప్రపంచ విపణిలో పోటీ పడతాయని, నాణ్యమైన, నవ్యమైన వస్త్రాలకు సిరిసిల్ల కేంద్ర బిందువు అవుతుందని పేర్కొన్నారు. మన పత్తి ఎంతో నాణ్యమైంది దేశంలోనే తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని, ఈ విషయాన్ని దక్షిణ భారత స్పిన్నింగ్ మిల్లుల సంఘమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం నేతన్నల బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రైతుల తరహాలో నేతకార్మికులు ఏ కారణాలతో చనిపోయినా.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా బీమా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ నేతన్నకు చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 26 వేల మంది కార్మికులకు రూ.110 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. కాగా, సిరిసిల్లలో రూ.400 కోట్లతో చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకం కొద్ది రోజుల్లో కార్యరూపం దాలుస్తుందన్నారు. మహిళల ఉపాధికి ప్రాధాన్యం: శైలజారామయ్యర్ అపెరల్ పార్క్‌లో మహిళల ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో రూ.20 కోట్లతో రోడ్లు, షెడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఇన్నర్‌వేర్ గార్మెంట్ పరిశ్రమకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గోకుల్దాస్ కంపెనీ ఎండీ సుమీర్ హిందుజా మాట్లాడుతూ మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గృహ విక్రయాలు డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి దేశీయ గృహ విభాగాన్ని వెంటాడుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గత త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్ (క్యూ2)లో గృహ విక్రయాలు 23 శాతం క్షీణించాయి. ఏడాది క్రితంతో పోలిస్తే మాత్రం 83 శాతం వృద్ధి అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాలలో ఈ ఏడాది క్యూ2లో మొత్తం 19,635 ఇళ్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంలో 10,753 యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1)లో 25,583 గృహాలు విక్రయమయ్యాయి. సేల్స్ డౌన్.. బెంగళూరు, ముంబైలలో మినహా మిగిలిన అన్ని ప్రధాన నగరాలలో గృహ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. క్యూ1లో బెంగళూరులో 2,382 యూనిట్లు సేల్ కాగా.. క్యూ2 నాటికి 47 శాతం వృద్ధి రేటుతో 3,500లకు, ముంబైలో 5,779 యూనిట్ల నుంచి 1 శాతం వృద్ధితో 5,821 గృహాలకు పెరిగాయి. ఇక, హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో 3,709 ఇళ్లు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికి 15 శాతం తగ్గి 3,157 యూనిట్లకు పరిమితమయ్యాయి. చెన్నైలో 3,200 నుంచి 600లకు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5,448 నుంచి 2,440లకు, కోల్‌కతాలో 1,320 నుంచి 578కి, పుణేలో 3,745 నుంచి 3,539 యూనిట్లకు తగ్గాయి. లాంచింగ్స్ అప్.. కొత్త గృహాల లాంచింగ్స్‌లో మాత్రం హైదరాబాద్‌లో మినహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో కొత్త గృహాల ప్రారంభాలలో క్షీణత నమోదయింది. నగరంలో గతేడాది క్యూ1లో 2,949 యూనిట్లు లాంచింగ్ కాగా.. క్యూ2 నాటికి 71 శాతం పెరుగుదలతో 5,034 గృహాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8,591 ఇళ్లు ప్రారంభం కాగా.. సెకండ్ క్వాటర్ నాటికి 28 శాతం వృద్ధి రేటుతో 10,980 గృహాలు లాంచింగ్ అయ్యాయి. -
12 శాతం నేరాలు తగ్గాయి: సీపీ శ్రీనివాసులు
సాక్షి, విజయవాడ: నగరంలో 2018 కంటే 17 శాతం క్రైం రేట్ తగ్గిందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 కంటే 12 శాతం కేసులు తగ్గాయని వెల్లడించారు. గతేడాది కన్నా రికవరీ 29 శాతం పెరిగిందన్నారు. నగరంలో చోరీలపై మరింత దృష్టి సారిస్తామని సీపీ పేర్కొన్నారు. మహిళలపై నేరాల శాతం గణనీయంగా తగ్గిందని, రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయని తెలిపారు. రూ.కోటికి పైగా గంజాయి, రూ.2 కోట్ల విలువచేసే గుట్కా స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. మద్యం అక్రమ రవాణాపై 1230 కేసులు నమోదు చేయడంతో పాటు, వెయ్యి వాహనాలు సీజ్ చేశామని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, కుటుంబ సమస్యలపై మహిళా మిత్ర మానిటరింగ్ చేస్తుందని, సైబర్ మిత్రని మరింత మెరుగుపరుస్తామన్నారు. యాప్‌ల నుంచి లోన్స్ తీసుకోవద్దని సీపీ శ్రీనివాసులు సూచించారు. -
ఆకాశంలో సగం.. అవకాశాలు మృగ్యం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తలెత్తిన దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, ఇలా అన్నిస్థాయిల వ్యక్తులు, కుటుంబాలు ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ తరగతి వర్గాలకు భవిష్యత్‌పై ఆందోళనలు ఒత్తిళ్లకు గురిచేస్తున్నాయి. విభిన్న రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (ఫార్మల్ సెక్టార్‌లోని 2.1 కోట్ల శాలరీడ్ జాబ్స్‌తో సహా) భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మహిళలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా పడటంతో ‘ఆమె’పై వివక్ష మరింత పెరుగుతోంది. ఇప్పటికే పురుషులతో పోల్చితే దాదాపుగా అన్ని రంగాల్లోని ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న మహిళల శాతం మరింత తగ్గిపోతోంది. చదవండి: భారత మహిళలకు కమల ఆదర్శం గత డిసెంబర్లో 9.15 శాతమున్న వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఫర్ ఉమెన్ (డబ్ల్యూపీఆర్) ఈ ఏడాది ఆగస్టు కల్లా 5.8 శాతానికి తగ్గిపోయినట్టు బెంగళూరు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయిమెంట్’ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాజా పరిశోధనలో వెల్లడైంది. స్వయం ఉపాధి, తదితర రంగాల్లోని వారు ఉద్యోగం, ఉపాధి ద్వారా సంపాదించే ఆదాయంతో, లాక్డౌన్ విధించాక, అన్‌లాక్ మొదలయ్యాక ఉపాధి, ఉద్యోగం ద్వారా పొందే ఆదాయాన్ని పోల్చినప్పుడు ఆయా అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్వయం ఉపాధి, క్యాజువల్ వర్కర్లు, దైనందిన వేతనం/నెల జీతమొచ్చే వర్కర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. గణనీయంగా తగ్గిన మహిళా ప్రాతినిధ్యం.. గత డిసెంబర్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళల వివరాలు, సమాచారం సేకరించి మళ్లీ వారు లాక్డౌన్ విధించాక ఏప్రిల్, ఆగస్టు నెలల్లో ఏం చేస్తున్నారన్న విషయాన్ని పరిశీలించారు. డిసెంబర్‌తో పోల్చితే ఏప్రిల్‌లో 32 శాతం మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు కొనసాగగా, ఆగస్టు వచ్చేటప్పటికీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మళ్లీ తమ పాత ఉద్యోగాల్లో చేరినట్టు ఈ అధ్యయనంలో తేలింది. ప్రధానంగా విద్యా, రిటైల్, డొమెస్టిక్ వర్క్ వంటి రంగాల్లో మహిళలు ఎక్కువ ప్రభావితమయ్యారు. కోల్‌కతాలో ఇళ్లల్లో పనిచేసేవారు 40 నుంచి 50 శాతం మంది మహిళలు తమ పనులు కోల్పోయినట్టు పశ్చిమ్ బంగా పరిచారిక సమితి వెల్లడించింది. చదవండి: దీపం జ్యోతి పరబ్రహ్మ.. మహిళా శక్తిని పెంచేందుకు చర్యలు అవసరం: యాక్షన్ ఎయిడ్ ఇండియా రాబోయే నెలల్లో పరిస్థితులు మరింత దిగజారి ఆర్థిక, లింగపరమైన అసమానతలు పెరగనున్న నేపథ్యంలో మహిళా శక్తిని వర్క్‌ఫోర్స్‌లోకి, పనుల్లోకి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత గట్టిగా కృషి చేయాల్సిన అవసరముందని యాక్షన్ ఎయిడ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ ఛాచ్ర పేర్కొన్నారు. బీడీలు చుట్టే వారు మొదలుకుని, ఇళ్లల్లో పనిచేసే వారు, వ్యవసాయ కార్మికులు ఇలా వివిధ రంగాలకు చెందిన మహిళా వర్కర్లను రిజిష్టర్ చేసి లింగపరమైన అసమానతలు దూరం చేయడంతో పాటు గ్రామీణ, ఇతర స్థాయిల్లో పిల్లల సంక్షేమ, సహాయ కార్యక్రమాలను పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ (ఐసీడీఎస్)ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గృహహింస పెరుగుతోంది.. ‘ఇంట్లో, బయటా మహిళలపై ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమస్యలపై దంపతుల మధ్య కీచులాటలు ఎక్కువయ్యాయి. దీంతో మహిళలపై గృహహింస పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు అంతా ఇళ్లల్లోనే అన్ని సమయాల్లో ఉండటంతో గృహిణులపై పనిభారం రెండింతలు పెరిగింది. దీనికి తోడు వారిపై భవిష్యత్‌పై భయాలు, ఆందోళనలు పెరిగి మానసిక ఒత్తిళ్లకు ఎక్కువగా గురవుతున్నారు. భర్త, భార్య సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది.. 7, 8 నెలలుగా కొనసాగుతున్న పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగితే భవిష్యత్‌లో కంఫర్టబుల్‌గా ఉంటారు. భర్తలు కూడా పురుషాధిక్య ధోరణిని విడనాడి భార్యలు కుటుంబం కోసం చేస్తున్న శ్రమ, త్యాగాలను గుర్తించి గౌరవిస్తే కుటుంబ బంధాలు బలపడతాయి. ఈ ఏడాది జీవించడమే ముఖ్యమని, ఆరోగ్యంగా ఎలాంటి ఆందోళనలు, ఒత్తిళ్లకు గురికాకుండా జీవించేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగమో లేక ఏదో ఒక ఉపాధి అవకాశం కోసమే చూడకుండా మహిళలు ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలి. తక్కువ ఖర్చుతో చేయగలిగే చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటి అవకాశాలు పెంచుకునే దిశలో కృషి చేయాలి’ – ‘సాక్షి’తో సైకాలజిస్ట్ సి.వీరేందర్ -
కరోనా పోటు రూ. 52,750 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా రూపంలో గట్టి దెబ్బే పడింది. ఆశించిన ఆదాయం గణనీయంగా తగ్గి... ఆర్థిక ప్రణాళిక తల్లకిందులైంది. ఇప్పుడు నికరంగా వచ్చేదెంతో చూసుకొని.. ప్రాధాన్యాలను బట్టి పద్దులను సరిచేసుకోవాల్సి వస్తోంది. కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో ప్రస్తుత (2020–21) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020–21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి సూచించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ శనివా రం ప్రగతిభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020–21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితిని వివరించారు. తల్లకిందులైన బడ్జెట్ అంచనాలు ‘రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020–21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. ఆశించిన 15 శాతం వృద్ధి లేకపోగా.. కరోనా వల్ల గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం రూ.1,15,900 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరాంతానికి కేవలం రూ.68,781 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.47,119 కోట్లు తగ్గనుంది’అని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ‘రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ.8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,024 కోట్లు తగ్గింది. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 9,725 కోట్లకు గాను, రూ.8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ.802 కోట్ల కోతపడే అవకాశం ఉంది’అని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతాక్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చింది శూన్యం: కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అని మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వర్షాలు, వరదలతో భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్నారు. ‘ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ‘హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు రూ.5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ.1,350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్టోబర్ 15న లేఖ రాశారు. వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతోకొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’అని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు. -
తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంపై కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. దేశీయంగా ఈ సెప్టెంబర్‌లో మొత్తం 39.43 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది ఇదే నెలలో పోలిస్తే ఇది 66 శాతం తక్కువని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. అయితే జూలై, ఆగస్ట్లతో పోలిస్తే సెప్టెంబర్‌లో విమాన ప్రయాణికులు పెరిగారు. సమీక్షించిన నెలలో అత్యధికంగా ఇండిగో లో 22.6 లక్షల మంది తర్వాతి స్థానంలో స్పెస్‌జెట్‌లో 5.3 లక్షలమంది ప్రయాణించారు. అలాగే ఎయిరిండియా, ఎయిర్ఏషియా, విస్తరా, గోఎయిర్ విమానాల్లో వరుసగా 3.72 లక్షలు, 2.35 లక్షలు, 2.58 లక్షల మంది ప్రయాణించినట్లు డీజీసీఏ గణాంకాలు చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు 57–73 శాతం: భారతీయ విమాన సంస్థల ఆక్యుపెన్సీ రేటు సెప్టెంబర్‌లో 57 నుండి 73 శాతం మధ్యలో ఉంది. అత్యధికంగా స్పైస్‌జెట్‌లో ఆక్యుపెన్సీ రేటు 70 శాతంగా ఉంది. ఇతర ప్రధాన సంస్థలైన విస్తరా, ఇండిగో, ఏయిర్ ఏషియా ఇండియా, గోఎయిర్, ఎయిరిండియాల ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 66.7 శాతం, 65.4 శాతం, 58.4 శాతం, 57.9 శాతం, 57.6 శాతంగా నమోదైనట్లు డీజీసీఏ తెలిపింది. సైకిళ్లకు గిరాకీ పెంచిన కరోనా న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టాలతో అల్లాడుతుండగా భారత్‌లో సైకిళ్ల అమ్మకాలు మాత్రం స్పీడందుకున్నాయి. గడిచిన 5 నెలల్లో సైకిళ్ల అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించాయి. ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ, మధ్యస్థాయి గమ్యస్థానాలను చేరుకోవచ్చనే అభిప్రాయంతో పాటు ఆరోగ్య భద్రత, ఫిట్నెస్ తదితర అంశాల దృష్ట్యా ప్రజలు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మొత్తం 41,80,945 సైకిళ్లు అమ్ముడుపోయినట్లు అఖిల భారత సైకిల్ తయారీ సమాఖ్య(ఏఐసీఎంఏ) తెలిపింది. కరోనా సంక్షోభంతో ప్రజలకు ఆరోగ్య భద్రత, రోగనిరోధశక్తి పెంపు ఆవశ్యకతల పట్ల అవగాహన పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సైకిళ్ల వాడకమనేది ఆశాజనకంగా మారింది. డిమాండ్ ఒక్కసారిగా ఉపందుకోవడంతో పలు నగరాల్లో సైకిళ్ల కొరత ఏర్పడింది. వినియోగదారులు కొత్త సైకిళ్ల రాక కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. ‘‘దేశవ్యాప్తంగా సైకిళ్లకు అనూహ్యరీతిలో డిమాండ్ పెరిగింది. ఈ 5 నెలల్లో అమ్మకాలు 100 శాతానికి వృద్ధిని సాధించాయి. ఈ స్థాయిలో డిమాండ్ నెలకొనడం ఇదే మొదటిసారి కావచ్చు’’ అని ఏఐసీఎంఏ సెక్రటరీ జనరల్ కేబీ థాకూర్ తెలిపారు. 40శాతం క్షీణించనున్నలగ్జరీ కార్ల మార్కెట్! న్యూఢిల్లీ: భారత లగ్జరీ కార్ల తయారీ మార్కెట్ ఈ ఏడాదిలో 40 శాతం క్షీణించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. పరిశ్రమ డిమాండ్ ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన నేపథ్యంలో మొత్తం తయారీ పరిమాణం 40 శాతానికి పైగా తగ్గుతాయని ఇక్రా తెలిపింది. గతేడాది అమ్ముడుపోయిన 35 వేల లగ్జరీ కార్లతో పోలిస్తే ఈ ఏడాదిలో 21వేల కార్లు మాత్రమే అమ్ముడుపోయే అవకాశం ఉందని ఇక్రా అంటుంది. ఇదే ఏడాదిలో పాసింజర్ వాహన (పీవీ) విభాగపు డిమాండ్ నెమ్మదిగా సాధారణ స్థాయికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ పేర్కొంది. -
ఏపీ: భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వినియోగం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ ఆదాయం కూడా భారీగానే తగ్గిపోయింది. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మద్య వినియోగంలో 65 శాతం తగ్గుదల ఉండగా, బీరు వినియోగంలో అయితే ఏకంగా 91.76 శాతం తగ్గుదల నమోదైంది. ప్రభుత్వ ఆదాయం 28.411 శాతం తగ్గింది. గత ఆరి్థక ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అమ్మకాల్ని ఈ ఏడాదితో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. అమ్మకాల విలువలో 32.48 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గతేడాది ఏప్రిల్–ఆగస్టు అమ్మకాలను, వినియోగాన్ని పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో (ఏప్రిల్–ఆగస్టు) ఈ ఏడాది పోల్చి చూస్తే కేవలం 0.31 శాతం మాత్రమే మద్యం వినియోగం తగ్గింది. కానీ.. ప్రభుత్వ ఆదాయంలో మాత్రం 2.93 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అమ్మకాల విలువలో 4.66 శాతంవృద్ధి నమోదైంది. (చదవండి: మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం) ఐదు నెలల్లో రూ.2,170 కోట్లు ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ ►గతేడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో మద్యం ద్వారా రూ.7,638.24 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచి్చంది. ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,468.17 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. అంటే గతేడాది కంటే రూ.2,170.07 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ►మద్యం, బీరు అమ్మకాల విలువ పరిశీలిస్తే ఐదు నెలల (ఏప్రిల్ – ఆగస్టు) వ్యవధిలో గతేడాది రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.5,998.87 కోట్లు మాత్రమే. అమ్మకాల విలువ గతం కంటే రూ.2,885.82 కోట్లు తక్కువగా నమోదైంది. ►దక్షిణాదిలో అతి చిన్న రాష్ట్రం కేరళలో కంటే మద్యం వినియోగం ఏపీలో తక్కువగా ఉండటం గమనార్హం. (చదవండి: మద్యం మత్తులో యువతుల హల్చల్) -
అమ్మ పదిలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాతృత్వపు మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గింది. దేశంలో అత్యంత తక్కువ ఎంఎంఆర్ నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2016–18 ఏళ్ల మధ్య దేశంలో నమోదైన ఎంఎంఆర్పై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పెషల్ బులెటిన్ విడుదల చేసింది. జాతీయస్థాయి సగటు ఎంఎంఆర్ లక్షకు 113గా ఉండగా అందులో అత్యంత తక్కువ ఎంఎంఆర్ నమోదైన రాష్ట్రం కేరళ (43). ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (46), తమిళనాడు (60), తెలంగాణ (63) నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సగటు ఎంఎంఆర్ 67గా నిలిచింది. అస్సాంలో ఎంఎంఆర్ అత్యంత ఎక్కువగా 215గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గతం కంటే తక్కువ... రాష్ట్రంలో ఎంఎంఆర్ క్రమంగా తక్కువగా నమోదవుతోంది. 2015–17 మధ్య ఎంఎంఆర్ 76గా ఉంటే ఇప్పుడు 63కు తగ్గింది. తెలంగాణలో 2017లో ప్రారంభించిన కేసీఆర్ కిట్‌తో ఎంఎంఆర్ తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు ప్రభుత్వం రూ. 12 వేల నుంచి రూ. 13 వేల వరకు ఇస్తుండటం తెలిసిందే. అలాగే తల్లీబిడ్డల సంరక్షణకు వివిధ రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తోంది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అలాగే గతంలో ఇళ్ల వద్ద జరిగే ప్రసవాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ ప్రారంభానికి ముందు అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హయాంలో ప్రసూతి దవాఖానాల్లో ప్రారంభించిన లేబర్ రూంలు, ఇతర మౌలిక సదుపాయాల వల్ల కూడా ఎంఎంఆర్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఐరాస లక్ష్యాన్ని చేరుకున్నాం 15–49 ఏళ్ల వయసులోని మాతృత్వపు మహిళల్లో జరిగే మరణాలను ఎంఎంఆర్ కింద లెక్కిస్తారు. గర్భధారణ, ప్రసవం లేదా గర్భస్రావం సమయంలో జరిగే మరణాలను ఎంఎంఆర్‌గా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ‘మాతృత్వపు మరణం అంటే గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత 42 రోజుల్లోపు ఏదైనా కారణంతో చనిపోవడం’. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ప్రకారం ఎంఎంఆర్‌ను 70కన్నా తగ్గించడంకాగా దీన్ని మొదటిసారి రాష్ట్రం సాధించడం విశేషమని అధికారులు పేర్కొన్నారు. -
మామిడి రైతుకు ‘అకాల’ కష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మామిడి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. మొన్నటి దాకా ‘ఫలం’చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానతో కాయలు రాలిపోగా, ఉన్న కొద్దిపాటి మామిడిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అకాల వర్షాలకు తోడు గడ్డిఅన్నారం నుంచి మార్కెట్ తరలింపు, కొత్తగా ఏర్పాటుచేసిన కోహెడ మార్కెట్ కూలడం మామిడి రైతుకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అమ్మకాలకు డిమాండ్ ఉండే ఈ సీజన్లో లాక్డౌన్ ఉండటం, అమ్మకాలు తగ్గడం వారి కష్టాలను రెట్టింపు చేస్తోంది. ‘తీపి’కరువైన మామిడి రాష్ట్రవ్యాప్తంగా 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. జగిత్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాలు ఈ తోటలకు ప్రసిద్ధి. సగటున ఏటా మామిడి దిగుబడి 5 లక్షల టన్నుల నుంచి 6 లక్షల టన్నుల వరకు ఉంటుంది. ఈ ఏడాది వడగండ్ల వానలు, అకాల వర్షాలతో పంట దిగుబడి 4 లక్షల టన్నులకు తగ్గిందని అంచనా. జగిత్యాల మామిడికి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మామిడికి మంచి ఆదరణ ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, దషేరి, రసాలు వంటి రకాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రకాలన్నీ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో పాటు అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతవుతుంటాయి. లాక్డౌన్ కారణంగా ఈసారి దారులన్నీ మూసుకుపోయాయి. హోల్‌సేల్ వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడంతో ఎగుమతుల్లేక స్థానిక మార్కెట్లపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. ఉన్న ఒక్క మార్కెట్లో అష్టకష్టాలు.. మామిడి అమ్మకాలకు గడ్డిఅన్నారం మార్కెట్ ప్రధానమైనది. అయితే, ఈ మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలతో భౌతికదూరం పాటించే అవకాశాలు లేకపోవడం, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ద్రాక్ష, బత్తాయి, మామిడి వాహనాల నుంచి పండ్లు దించేందుకు హమాలీలు వెనకాడటం, దీన్ని మూసివేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంలో దీన్ని గత నెల 22 నుంచి తాత్కాలికంగా మూసివేశారు. మార్కెట్‌ను వికేంద్రీకరణ చేసి మామిడి మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అక్కడ ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్న సమయంలో సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులకు షెడ్డు కూలిపోవడం కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. మార్కెట్‌కు రోజూ 1,500 టన్నులకుపైగా మామిడి వస్తుండటంతో మళ్లీ మార్కెట్‌ను గడ్డిఅన్నారం తరలించారు. మూడ్రోజుల పాటు ఇక్కడే మామిడి అమ్మకాలు కొనసాగనున్నాయి. మళ్లీ మూడ్రోజుల్లో కోహెడ మార్కెట్‌ను పునరుద్ధరించి అక్కడికే తరలిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు సరుకు ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరికి, ఎంతకు అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. కలిసిరాని సీజన్ ఏటా సీజన్ ప్రారంభంలోనే మామిడిపండ్లకు మంచి ధర పలుకుతుంది. ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతేడాది క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ధరరాగా ఈసారి రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్యనే పలుకుతోందని రైతులు వాపోతున్నారు. ఏటా మార్చిలో మొదలయ్యే మామిడి సీజన్ జూన్ వరకు కొనసాగుతుంది. ఏప్రి ల్, మే నెలల్లో మామిడి మార్కెట్ కళకళలాడుతుండేది. ఈసారి సీజన్ ఆరంభంలోనే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో పరిస్థితి తారుమారైంది. పచ్చళ్లకు వాడే మామిడిని కొనేవారే లేరు. బేకరీలు, స్వీట్ దుకాణాలు లేక జామ్‌ల తయారీ నిలిచిపోయింది. మామిడి తాండ్ర పరిశ్రమలు మూతపడి మామిడి కొనుగోళ్లు నిలిచిపోయాయి. -
పౌల్ట్రీ విలవిల!
సాక్షి, హైదరాబాద్: పౌల్ట్రీ పరిశ్రమ సంకటంలో పడింది. క్షేత్రస్థాయిలో ధరలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఫారం వద్ద కొనుగోళ్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడం.. మరోవైపు శుభకార్యాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడటంతో వాణిజ్య పరంగా డిమాండ్ తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతు కుదేలవుతున్నాడు. రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమలో 85.10 కోట్ల కోళ్లున్నాయి. ఇందులో లేయర్స్ (గుడ్లు పెట్టేవి) 53.4 కోట్లు, బాయిలర్స్ (మాసం కోసం పెంచేవి) 31.70 కోట్లున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు బాయిలర్ కోళ్లు, గుడ్లు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ అతలాకుతలమవుతోంది. ఇక్కడ తక్కువ.. అక్కడ ఎక్కువ! దూర ప్రాంతాలకు కోళ్లు, గుడ్లు సరఫరా బంద్ కావడంతో వ్యాపారం అంతా స్థానిక మార్కెట్‌పై ఆధారపడింది. కరోనా నేపథ్యంలో డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ.. క్షేత్రస్థాయిలో రిటైల్ వ్యాపారులు ధరలు మాత్రం తగ్గించలేదు. రిటైల్ వ్యాపారులు పౌల్ట్రీ ఫాం వద్ద కిలోకు రూ.35 నుంచి రూ.45 చొప్పున బాయిలర్ కోళ్లు (లైవ్ బర్డ్) కొనుగోలు చేస్తున్నారు. అలాగే కోడి గుడ్డు ఒక్కింటికి రూ.1 నుంచి రూ.1.50 చొప్పున కొనుగోలు చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో రిటైల్ వ్యాపారులు కిలో చికెన్ (స్కిన్ లెస్) ధర రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. రెండో రకం కింద కిలో చికెన్ (విత్ స్కిన్) రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక గుడ్డు ఒక్కింటికి రూ.5 చొప్పున అమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో ధరలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. పౌల్ట్రీ రైతుల వద్ద మాత్రం సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మరోవైపు కోళ్లను ఎక్కువ రోజులు ఫారంలోనే ఉంచుకుంటే దానా వేయడం భారమవుతుందనే భావనతో ధర తక్కువైనా స్టాక్‌ను వదిలించుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. పెరిగిన అంతరం.. బాయిలర్ కోళ్ల పరిశ్రమలో కోడి పిల్లలను తెచ్చిన రోజు మొదలు 42 రోజుల్లో పెరిగి పెద్దవవుతాయి. దీంతో వాటిని లిఫ్ట్ చేసి చికెన్ మార్కెట్‌కు తరలిస్తారు. అలా లిఫ్ట్ చేసిన తర్వాత ఫారంను పక్షం రోజుల పాటు ఖాళీగా ఉంచి తిరిగి పిల్లలను తెచ్చి పెంచడం ప్రారంభిస్తారు. ఫారంలో ఇన్ఫెక్షన్లు ఇతర ఇబ్బందులు తొలగిపోయేందుకు ఈ అంతరం అవసరమనే నిబంధన ప్రకారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంతరం 20 నుంచి 25 రోజులకు పెరిగింది. లాక్డౌన్, కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్ కాస్త మందగమనంలో ఉండటంతో రైతులు ఈ దిశగా గ్యాప్ పాటిస్తున్నారు. అయితే కొందరు పౌల్ట్రీ నిర్వాహకులు మాత్రం కొత్త పిల్లలు పెంచేందుకు నిరాకరిస్తున్నారు. రెండు, మూడు నెలల పాటు వేచిచూసేందుకే మొగ్గుచూపుతున్నారు. 2 నెలల్లో అరకోటి నష్టం.. 90 వేల లేయర్ బర్డ్స్‌తో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నా. పెట్టుబడి భారీగా అయ్యింది. లాక్డౌన్ కారణంగా పౌల్ట్రీ రంగంలో తీవ్ర నష్టాలే ఎదురవుతున్నాయి. గత ఐదు నెలలుగా గుడ్లు, చికెన్ సేల్స్ మందగించాయి. తర్వాత కాస్త కోలుకుంటున్న సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పరిశ్రమ కుదేలైంది. అంతర్రాష్ట్ర రవాణా నిలిచిపోవడంతో సరఫరా ఆగిపోయింది. దీంతో గుడ్ల డిమాండ్ తగ్గడంతో ధర భారీగా పడిపోయింది. క్షేత్రస్థాయిలో రిటైలర్స్ సంతృప్తికరమైన ధరకే విక్రయిస్తున్నా.. మావద్ద మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు లేయర్ కోళ్లకు ఇచ్చే దానా ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో కిలో దానా రూ.12 నుంచి రూ.16 మధ్యలోఉండేది. ప్రస్తుతం ఈ ధర రూ.20కి పెరిగింది. మొత్తంగా గణిస్తే ఒక గుడ్డుపై సగటున రూ.1.50 నష్టం వస్తోంది. గడిచిన రెండు, మూడు నెలల్లో రూ.50 లక్షల వరకు నష్టం వచ్చింది. – ఎడమ నరేందర్‌రెడ్డి, మంచాల, రంగారెడ్డి జిల్లా ఆలస్యంతో లాభాలు ఆవిరి... 12 వేల బర్డ్స్‌తో బాయిలర్ పౌల్ట్రీ నిర్వహిస్తున్నా. సాధారణంగా ఒక కోడి పిల్ల పెరిగేందుకు 40 నుంచి 42 రోజులు పడుతుంది. ఎక్కువ శాతం 42వ రోజు బర్డ్స్ లిఫ్ట్ చేస్తాం. ఈ లెక్క ప్రకారం బర్డ్స్ లిఫ్ట్ చేస్తేనే ఆదాయం వస్తుంది. 42 రోజుల పాటు ఎదిగిన కోడి తినే ఆహారం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఒక్క రోజు ఆలస్యమైనా అంతే సంగతి. ఆ తర్వాత బర్డ్స్‌కు ఫీడ్ ఇచ్చినప్పటికీ కనీసం 10 గ్రాముల బరువు కూడా పెరగదు. కచ్చితంగా నిర్దేశించిన రోజుల్లో తీసేయాలి. లాక్డౌన్ కారణంగా రవాణా గందరగోళంగా మారింది. దీంతో బర్డ్స్ లిఫ్ట్ చేయడానికి ఎక్కువ రోజుల సమయం పడుతోంది. దీంతో బర్డ్స్‌కు ఫీడ్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో వచ్చే లాభం కాస్త ఆవిరవుతోంది. – జూలూరు పాండు, కుమ్మెర, చేవెళ్ల -
తగ్గిన గృహహింస
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో గృహహింస కేసులు గణనీయంగా తగ్గాయి. గతంలో రోజుకి గరిష్టంగా 550కిపైగా న మోదయ్యే కేసులు ఏకంగా 5 రె ట్లు పడిపోయి కనిష్టంగా 80–90 మధ్య నమోదవుతున్నాయి. లా క్‌డౌన్‌కు ముందు ప్రతీనెల 10 నుంచి 12 వేల వరకు గృహహింస కేసు లు నమోదయ్యేవి. లాక్డౌన్ అనంతరం ఈ సంఖ్య 3 వేలకు పడిపోయింది. వాస్తవానికి లాక్డౌన్ నేపథ్యంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయని సో షల్ మీడియాలో ప్రచారం వెల్లువెత్తిం ది. అయితే ఇది వాస్తవం కాదని, పోలీ సు రికార్డులు చెబుతున్నాయి. ఉత్తరాది లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, దక్షిణాదిన తగ్గాయని తెలుస్తోంది. గృహహింస వివాదాలపై డయల్ 100కు వ చ్చే కాల్స్‌లో గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. గృహహింస కేసుల్లో ప్రధానంగా భర్తల కారణంగా వేధిం పులు ఎదుర్కొనే వారే అధికంగా ఉండేవారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొంచెం అత్తామామల జోక్యం కని పించేది. ఏదిఏమైనా లాక్‌డౌన్‌తో భార్యాపిల్లలతో రోజూ ఎక్కువసేపు గడుపుతుండటం వల్ల చాలావరకు కలహా ల కాపురాలు కూడా చక్కబ డుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక ప్రతీ ఇం ట్లోనూ గొడవలకు ప్రధాన కారణం తాగుడు. మద్యం పే ద, దిగువ మధ్య తరగతి కు టుంబాల్లో తీరని వ్యథలను మిగులుస్తోంది. ఈ విషయం లో తరచుగా దంపతులు పోట్లాడుకుని ఠాణా మెట్లెక్కేవారు. కానీ, ఇప్పుడు మ ద్యం అందుబాటులో లేకపోవడంతో కే సులు తగ్గాయని, ఇతరత్రా చికాకులు కూడా లేకపోవడంతో అంతా ప్రశాం తంగా ఉన్నారని పోలీసులంటున్నారు. మార్చి 24తర్వాత అనూహ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 23 వరకు 35 వేలకుపైగా గృహహింస కేసులు నమోదయ్యాయి. మార్చి 24వ తేదీ నుంచి కేసులు గణనీయంగా పడిపోయాయి. అప్పటివరకు రోజుకు సగటు సరాసరిగా 382 అంతకంటే అధికంగా కేసులు నమోదయ్యేవి. లాక్డౌన్ తర్వాత కేసులు ఏ రోజూ రెండు వందల అంకెను చేరుకోకపోవడం గమనార్హం. ఏప్రిల్‌లో చాలా రోజులు సగటున 80 – 90 కేసులు మాత్రమే నమోదవడం విశేషం. ఈ ఏడాది నెలల వారీగా నమోదైన గృహహింస కేసులు జనవరి: 11,461 ఫిబ్రవరి: 10,875 మార్చి: 10,414 ఏప్రిల్: 3,015 (ఏప్రిల్ 23 వరకు) మొత్తం: 35,765 -
కరోనా వైరస్: క్రైం డౌన్ !
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పోలీసులంతా స్టేషన్లను వదిలి రోడ్లపై కాపలా కాస్తున్నారు.. జనమంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. కరోనా మహమ్మారి విజృంభించకుండా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో నేరాల సంఖ్య సైతం పూర్తిగా తగ్గిపోయింది. దొంగలు, నేరగాళ్లు సైతం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లున్నారు. అందుకే క్రైం రేటు తగ్గిపోయింది. పోలీసులు రోడ్లపై జనం తిరగకుండా కాపలా కాయడం మినహా నేరాలపై దృష్టిసారించే పరిస్థితి లేనప్పటికీ క్రైం రేటు తగ్గడానికి ప్రధాన కారణం లాక్డౌన్ అని చెప్పవచ్చు. జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు ఉన్న పరిస్థితిని పరిశీలిస్తే నెలకు సగటున 1800 నుంచి 2 వేల వరకు నేరాల సంఖ్య ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య మూడో వంతుకు పడిపోయింది. ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, గృహ హింసలు వంటి కేసులతో పాటు రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ ఆ తరువాత నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కరోనా నియంత్రణ విధుల్లోనే కొనసాగుతున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద, క్వారంటైన్ కేంద్రాల వద్ద, గ్రామాల నుంచి నగరాల వరకు రోడ్లపైన ప్రజలెవరూ తిరగకుండా కాపలాలు కాస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కరోనాను నియంత్రించే పనిలోనే ఉన్నప్పటికీ నేరాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెలలో జిల్లాలో నేరాల సంఖ్య మూడో వంతుకు పడిపోవడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా లాక్డౌన్ వల్ల రోడ్లపై వాహనాలను పూర్తిగా నియంత్రించడంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. అందులో కూడా ఫిబ్రవరి నెలాఖరుతో పోలిస్తే మార్చి నెల చివరి పదిరోజుల్లో నేరాల సంఖ్య ఐదో వంతు కూడా లేకపోవడం విశేషం. ఇలా ఎలాంటి నేరాలను పరిశీలించినా లాక్డౌన్ సమయంలో మామూలు రోజుల కంటే ఐదో వంతుకు నేరాల సంఖ్య పడిపోవడం చూస్తుంటే జనంతో పాటు నేరస్తులు సైతం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
కరోనా హీట్ ముందు దిగదుడుపే..!
సాక్షి, హైదరాబాద్: కరోనా భయం ఇంటింటిని తాకింది. బయటకు వెళ్తే వైరస్ వస్తుందన్న భయానికి తోడు ఇంటి పట్టునే ఉంటున్నా.. ఇంట్లో సైతం వైరస్ బారిన పడకుండా నగరవాసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ వైపు ఎండలు ముదిరి ఉక్కపోతలు మొదలైనా.. ఏసీలు, కూలర్ల వాడకానికి మెజారిటీ ప్రజలు దూరంగానే ఉంటున్నారు. రిఫ్రిజిరేటర్లలోనూ సాధారణ ఉష్ణోగ్రతలే మెయింటైన్ చేస్తున్నారు. దీంతో నగరంలో గృహ, వాణిజ్య కేటగిరీల్లో విద్యుత్ వినియోగం అమాంతం పడిపోయింది. గడిచిన ఏడాది (2019) ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో 2,763 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగితే, 2020 ఏప్రిల్ 5 వచ్చే సరికి 1826 మెగావాట్లకు పడిపోయింది. ఇలా తగ్గిన డిమాండ్‌లో అత్యధికంగా గృహ, వాణిజ్య (కేటగిరీ)దే కావటం విశేషం. డిస్కం అంచనాలు తారుమారు సాధారణంగా మార్చి మూడో వారం నుంచి హైదరాబాద్‌లో రోజుకు 2,550 మెగావాట్ల నుంచి 2,800 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం జరగాల్సి ఉంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) కూడా అదే అంచనాలతో ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటుంది. కానీ, గతానికి భిన్నం గా ఈసారి ప్రస్తుతం రోజువారీ సగటు విద్యుత్ వినియోగం భారీగా పడిపోవటంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇది నెలవారీ రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో భవిష్యత్తులో భారీ నష్టాలు చవి చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు 2,500 మెగావాట్లు.. గ్రేటర్ హైదరాబాద్‌లో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 45 వేలకు పైగా చిన్న, పెద్ద, భారీ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. మరో 7 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. 48 లక్షలకు పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు మార్చి మొదటి వారంలో నగరంలో రోజు సగటు వినియోగం 2,500 నుంచి 2,800 మెగావాట్లుగా ఉంది. గతేడాది అయితే ఏకంగా 3 వేల మెగావాట్ల వరకు వెళ్లింది. ప్రస్తుతం చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల్లో చాలా వరకు మూతపడ్డాయి. ఐటీ, దాని అనుబంధ సంస్థలు సహా భారీ షాపింగ్ మాళ్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలూ పని చేయట్లేదు. ఫలితంగా రోజువారీ సగటు వినియోగం 2,500 నుంచి 1,800 మెగావాట్లకు పడిపోయింది. సమ్మర్ మార్కెట్ ఢమాల్.. వేసవి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ దుకాణాలన్నీ ఏసీ, కూలర్ల కొనుగోలుదారులతో నిండిపోయేవి. అబిడ్స్‌లోని ఎలక్ట్రానిక్ దుకాణాలన్నీ కూలర్లతో సందడిగా కన్పించేవి. కానీ, ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఆయా షాపులు మూతపడ్డాయి. ఇంట్లో ఏసీ ఆన్ చేస్తే.. చలిగాలికి వైరస్ ఎక్కడ విస్తరిస్తుందో అని గ్రేటర్‌వాసులు భయపడుతున్నారు. ఏసీలను కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా చేయట్లేదు. దీంతో ఆయా ఎలక్ట్రానిక్ కంపెనీలు సహా డీలర్లు కూడా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఏప్రిల్5న హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ ఇలా.. -
భారీగా పడిపోయిన చికెన్ ధరలు
-
ఇరాన్ లో తగ్గుతున్న మరణాల సంఖ్య
-
వాహన రంగానికి... బీఎస్–4 గుదిబండ
న్యూఢిల్లీ: వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం కోసం భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి తాజా ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త నిబంధనలు అమలుకానున్న కారణంగా పాత నిబంధనలకు అనుగుణంగా ఉన్న బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల చివరినాటికి ముగించేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో ఇన్వెంటరీలను కలిగి ఉన్న వాహన రంగ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. మొన్నటివరకు పరిస్థితి బాగానే ఉందని, ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాప్తి వేగంగా ఉన్నందువల్ల షారూంలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయి అమ్మకాలు నిలిచిపోయాయని చెబుతున్నాయి. విజృంభిస్తోన్న వైరస్ పరంగా చూస్తే.. గడువు తేదీలోపు బీఎస్–4 వాహన విక్రయాలను పూర్తి చేయడం కష్టమేనని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. మరోవైపు పాత వాహనాల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తికావాలని పలు రాష్ట్ర రవాణా విభాగాలు డీలర్లకు సర్క్యులర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. 30–రోజులకు పెరిగిన నిల్వలు పేరుకుపోయిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం కోసం పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు హర్షరాజ్ కాలే అన్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది డీలర్ల వద్ద అన్ని విభాగాలకు చెందిన పాత వాహనాల నిల్వలు అధిక స్థాయికి చేరుకున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర నిల్వలు అధికంగా ఉన్నాయని వివరించారు. వీటి ఇన్వెంటరీ 20–30 రోజులుగా ఉందన్నారు. ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్)తో కలిసి సంప్రదింపులు నిర్వహించనున్నామని, ఇందుకు తగిన పరిష్కార మార్గం దొరక్కపోతే డీలర్లు భారీ స్థాయిలో నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వివరించారు. -
అమ్మ.. హ్యాపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3,675 మంది శిశువులు చని పోగా, 2019–20 సంవత్సరంలో 2,408 మంది మృతి చెందినట్లు నివేదిక తెలిపింది. ప్రభుత్వం శిశు మరణాల తగ్గుదలపై అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నందువల్లే మరణాలు తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1,040 శిశు మరణాలు సంభవించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి (10 నెలల్లో) వరకు 498 మంది చనిపోయినట్లు తెలిపింది. అంటే సగం పైగా మరణాలు తగ్గడం గమనార్హం. నల్లగొండ జిల్లాలోనూ గత ఆర్థిక సంవత్సరంలో 207 మంది శిశువులు మరణించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 138 మంది చనిపోయారు. ఇక వరంగల్ అర్బన్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో 726 మంది చనిపోగా, ఈ సారి ఆ సంఖ్య 99కు తగ్గింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 245 మంది శిశువులు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 66కు పడిపోవడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ గతంలో 248 మంది చనిపోగా, ఈసారి ఆ సంఖ్య 53కు పడిపోయింది. అయితే కొన్ని జిల్లాల్లో శిశు మరణాలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో 34 మంది శిశువులు చనిపోగా, ఈసారి ఏకంగా 139 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో నలుగురు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే 32 మంది శిశువులు చనిపోయారు. అలాగే భూపాలపల్లి జిల్లాలో గతంలో ఇద్దరు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 27 మంది శిశువులు కన్నుమూశారు. సంగారెడ్డి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 79 మంది చనిపోగా, ఇప్పుడు 139 మంది శిశువులు చనిపోయారు. ‘రూరల్’లో ఎక్కువ.. ‘అర్బన్’లో తక్కువ ఇటు రాష్ట్రంలో పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగే శిశువుల శాతం గతం కంటే తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో పుట్టిన శిశువుల్లో గంటలోపే తల్లిపాలు తాగినవారు 79.2% మంది ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి 74.3 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 99.2 శాతం, సూర్యాపేటలో 99%, వరంగల్ రూరల్ జిల్లాలో 99.3% శిశువులు పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగటం విశేషం. అత్యంత తక్కువగా వరంగల్ అర్బన్ జిల్లాలో 33.9 శాతం శిశువులు మాత్రమే పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగుతున్నారు. తల్లిపాలు గంటలోపు తాగితేనే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని, భవిష్యత్తులో పిల్లలు ఇతరత్రా అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే అనేక సందర్భాల్లో సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరుగుతుండటం వంటి కారణాల వల్ల తల్లులు గంటలోగా శిశువులకు పాలిచ్చే పరిస్థితి ఉండటం లేదంటున్నారు. ఇక రెండున్నర కేజీల బరువు కంటే తక్కువ బరువుతో పుడుతున్న వారి సంఖ్య గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో 32,586 మంది రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి అంటే 10 నెలల కాలంలోనే 34,696 మంది అలా తక్కువ బరువుతో పుట్టడం గమనార్హం. దాదాపు సగం తగ్గిన ఇన్ఫెక్షన్ మరణాలు.. శిశు మరణాలు వివిధ కారణాల వల్ల సంభవిస్తాయి. ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా సహా ఇతరత్రా కారణాలుంటాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా చనిపోయిన వారి శాతం గణనీయంగా తగ్గింది. దాదాపు సగం మేరకు తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో ఇన్ఫెక్షన్లతో 6.9 శాతం మంది చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతానికి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఇక పుట్టిన తర్వాత శ్వాస ఆడకపోవడం, ఉక్కిరిబిక్కిరి కావడం తదితర కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో 14.4 శాతం మంది చనిపోగా, ఈసారి 6.4 శాతం తగ్గడం విశేషం. ఇక శిశు మరణాల్లో న్యుమోనియాతో చనిపోయే వారి శాతం రెండింతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో న్యుమోనియాతో 2.4 శాతం మంది మరణిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి నాటికి 5.4 శాతానికి చేరింది. -
విస్తీర్ణం తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో 2014లో అపార్ట్మెంట్ సగటు విస్తీర్ణం 1,400 చ.అ.గా ఉండేది. కానీ, 2019 నాటికది 1,020 చ.అ.లకు తగ్గింది. అత్యధికంగా ముంబైలో ఫ్లాట్ల సైజ్లు 45 శాతం మేర తగ్గిపోయాయి. 2014లో ఇక్కడ ప్రాపర్టీల సగటు విస్తీర్ణం 960 చ.అ. కాగా.. ఇప్పుడది 530 చ.అ. పడిపోయింది. పుణేలో అయితే క్షీణత 38 శాతంగా ఉంది. ప్రస్తుతమిక్కడ సగటు విస్తీర్ణం 600 చ.అ.లుగా ఉంది. ఇక, ఎన్సీఆర్లో 6 శాతం క్షీణతతో 1,390 చ.అ.లకు, బెంగళూరులో 9 శాతం క్షీణించి 1,300 చ.అ.లకు, చెన్నైలో 8 శాతం క్షీణతతో అపార్ట్మెంట్ సగటు సైజ్ 1,190 చ.అ.లకు చేరింది. హైదరాబాద్‌లో సగటు అపార్ట్మెంట్ విస్తీర్ణం 1,570 చ.అ.లుగా ఉంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇదే అతిపెద్ద విస్తీర్ణం. ఐదేళ్ల క్రితం కోల్‌కతాలో ఫ్లాట్ సైజ్ 1,230 చ.అ.లుగా ఉండేది. ఇప్పుడక్కడ సగటు విస్తీర్ణం 9 శాతం క్షీణించి 1,120 చ.అ.లుగా ఉంది. విభాగాల వారీగా విస్తీర్ణం ఎంత తగ్గిందంటే.. రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాల విస్తీర్ణం ఐదేళ్లలో 28 శాతం తగ్గాయి. 2014లో 750 చ.అ.లుగా ఉన్న అఫడబుల్ హౌజ్ సైజ్లు 2019 నాటికి 540 చ.అ.లకు తగ్గిపోయాయి. రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఉన్న మధ్యస్థాయి గృహాల విస్తీర్ణం 17 శాతం తగ్గాయి. 2014లో 1,150 చ.అ.లు కాగా.. ఇప్పుడవి 950 చ.అ.లకు క్షీణించాయి. రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల ధర ఉన్న ప్రీమియం హోమ్స్ విస్తీర్ణం 21 శాతం తగ్గాయి. 2014లో 1,450 చ.అ.లుండగా.. ఇప్పుడవి 1,140 చ.అ.లకు తగ్గిపోయాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉన్న లగ్జరీ గృహాల సైజ్ 18 శాతం క్షీణించాయి. 1,640 చ.అ. నుంచి 1,350 చ.అ.లకు తగ్గాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ గృహాల విస్తీర్ణం 8 శాతం తగ్గాయి. ఐదేళ్ల క్రితం ఆయా ఫ్లాట్ల సైజ్ సగటు 2,400 చ.అ.లు ఉండగా.. ఇప్పుడవి 2,200 చ.అ.లకు తగ్గిపోయాయి. తక్కువ విస్తీర్ణం గృహాలకే డిమాండ్.. ప్రధాన నగరాల్లో అందుబాటు గృహాలకు డిమాండ్ పెరగడమే అపార్ట్మెంట్ల విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అఫడబుల్ హౌసింగ్‌కు ప్రభుత్వం రాయితీలు ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఈ గృహాల వైపే మొగ్గుచూపుతున్నారన్నారు. అయితే ఆయా అఫడబుల్ గృహాలు రూ.45 లక్షల లోపు ధర 850 చ.అ. బిల్టప్ ఏరియాను మించకూడదు. అప్పుడే ప్రభుత్వం నుంచి రాయితీలు అందుతాయి. అంతేకాకుండా అఫడబుల్ గృహాలకు జీఎస్టీ కూడా తక్కువే. ఇతర గృహాలకు జీఎస్టీ 5 శాతం ఉంటే అఫడబుల్ ప్రాజెక్ట్‌లకు ఒక్క శాతమే ఉంది. -
నిధులు ‘నీళ్ల’ధార
ఒకవైపు నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు... మరోవైపు సముద్రం. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా చుట్టూ నీటి వనరులు ఉండటం వలన రీచార్జ్ కావాలి. కానీ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. జల సంరక్షణ పేరుతో గత ప్రభుత్వం చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. జల సంరక్షణైతే కన్పించలేదు గాని నిధుల స్వాహా మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీ నేతల జేబులు నిండాయే తప్ప జిల్లాలో భూగర్భ జలాలు పెరగలేదు. ఖర్చు పెట్టిన కొద్దీ భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయాయి. దోపిడీకి చూపించిన శ్రద్ధ తగ్గిపోయిన భూగర్భ జలాలపై చూపలేదు. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అభివృద్ధికి మూలం జలం అని చెప్పుకుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల సంరక్షణ కోసం జిల్లాలో ఐదేళ్ల కాలంలో రూ.1026.19 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అనేక రకాల పథకాలు, కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. పనులు చేసినట్టు రికార్డుల్లో కూడా చూపించారు. కానీ జిల్లాలో భూగర్భ జలాలు పెరగలేదు సరికదా మరింత తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వ నిధులు నిరుపయోగమయ్యాయి. జల సంరక్షణ పనులు చేశాక కూడా భూగర్భ జలాలు మరింత దిగజారిపోయాయి. 2011 మే నాటికి 5.32 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2015 మే నాటికి 5.88 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. 2016 మే నాటికి 5.89 మీటర్ల లోతుకు చేరాయి. 2017మే నాటికైతే 6.82 మీటర్ల మరింత లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 2018 మే నాటికి 6.05 మీటర్ల లోతుకు చేరగా, 2019 మే నాటికి 5.82 మీటర్ల లోతుకు వెళ్లాయి. 2018, 2019లో వరుసగా వచ్చిన తుపాన్లు కాసింత ప్రభావం చూపడంతో భూగర్భ జలాలు మరింత అడుగంటకుండా కాపాడాయి. నేతల ఆస్తులు పెరిగాయి... భూగర్భంలో నీళ్లు తగ్గాయి: జల సంరక్షణ పేరుతో పనుల పందేరానికి తెరలేపారు. నామినేటెడ్ ముసుగులో నిధులు దోచి పెట్టారు. నేతలు సిండికేట్‌గా మారి పనులు చేపట్టారు. రికార్డుల్లో అంతా జరిగినట్టు చూపించారు. నిధులు ఎంచెక్కా డ్రా చేసేసుకున్నారు. కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. జిల్లాలో నీరు చెట్టు అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలుసు. నేతల మేతకు బాగా పనిచేసింది. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్... ఇలా రకరకాల కాంక్రీట్ పనుల రూపంలో పెద్ద ఎత్తున నిధుల స్వాహా చేశారు. చెరువు పనుల్లో మట్టి అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఇక, కాంక్రీటు పనుల విషయానికొస్తే కొన్ని పనులు నాసిరకంగా, మరికొన్ని అసంపూర్తిగా చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిచోట్లయితే పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్నిచోట్లయితే పాత పనులకే పైపై మెరుగులు దిద్ది బిల్లులు చేసేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇంకుడు గుంతలు, పంట సంజీవిని, కాంటూరు ట్రెంచెస్, రాక్‌ఫీల్డ్ డ్యామ్‌లు... తదితర కార్యక్రమాల పేరుతో ఇరిగేషన్, డ్వామా, అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీటిలో కూడా దాదాపు అక్రమాలు చోటు చేసుకున్నాయి. విజిలెన్స్ వరకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. విజిలెన్స్ విచారణలో కూడా అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా నీరు చెట్టు పూర్తిగా దోపిడీకి గురైందని తేలింది. చెప్పాలంటే జల సంరక్షణ పేరుతో నిధులు తినేశారు. దీంతో టీడీపీ నేతల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. నేతల మేతకు పనికొచ్చాయే తప్ప నీటిమట్టాన్ని పెంచలేకపోయాయి. భవిష్యత్‌పై బెంగ.. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. కానీ, భూగర్భ జలాలు మాత్రం ఎక్కడా పెరగలేదు సరికదా మరింత తగ్గిపోయాయి. 2014కు, ఇప్పటికీ చూస్తే మీటర్ లోతుకి భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. వరుస తుపాన్లు వచ్చినా కూడా మునుపటి స్థాయికి భూగర్భ జలాలు చేరలేదు. దీంతో ఆందోళన నెలకొంది. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ వంటి నదులున్నాయి. వీటి వలన రీచార్జ్ జరిగి భూగర్భ జలాలు మరింత పెరగాల్సి ఉంది. అలాగే, మరోవైపు సముద్రం కూడా ఉంది. దాని వలన రీచార్జ్ జరిగే అవకాశం ఉంది. కానీ, ఊహించని విధంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నిధుల మేతపై చూపిన శ్రద్ధ భూగర్భ జలాల పరిరక్షణ కోసం చూపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో గత ఐదేళ్లలో జల సంరక్షణకు చేసిన ఖర్చు.. -నీరు చెట్టు పనులకు : రూ.427 కోట్లు -మంచినీటి చెరువుల పూడిక తీతకు : రూ.113.91 కోట్లు -సాగునీటి చెరువుల పనులకు: రూ.344.91 కోట్లు -కొత్త పశువుల చెరువులు/చెరువుల డీసిల్టింగ్ పనులకు: రూ.83.28 కోట్లు -ఇంకుడు గుంతల తవ్వకానికి: రూ.22.88 కోట్లు -రజక చెరువుల పూడిక తీతకు : రూ.44.07 లక్షలు -వ్యవసాయ చెరువు (ఫారమ్ ఫాండ్)లకు : రూ.9.62 కోట్లు -మినీ పెర్కోలేషన్ పనులకు : రూ.44.35 లక్షలు -అస్థిర కందకం కోసం: రూ.1.02 కోట్లు -బావుల తవ్వకానికి: రూ.31.83 లక్షలు -రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలకు: రూ.1.24 కోట్లు -సరిహద్దు కందకాల నిర్మాణం కోసం: రూ.2.31 కోట్లు -ఎస్ఎంసీ ట్రెంచెస్ నిర్మాణాలకు: రూ.2.72 కోట్లు -రాతి కట్టడాలకు: రూ.55.59 లక్షలు -ఇతర పనుల కోసం : రూ.15.54 కోట్లు -
పాతాళంలోకి గంగమ్మ
సాక్షి, ఆదిలాబాద్: ఆకాశ గంగమ్మ భువికి దిగి రానంటోంది. పాతాళ గంగమ్మ పైకి రానంటోంది. మరోవైపు మితిమీరిన ఎండలతో జనం గొంతెండిపోతోంది. గుక్కెడు నీటికోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భజలాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా భారీ వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. బజార్హత్నూర్లో 36.23 మీటర్లు, నేరడిగొండలో 48 మీటర్ల లోతుకు జలం వెళ్లిదంటే పరిస్థితి ఎంత జఠిలంగా ఉందో అర్థమవుతోంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా.. కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోసిపోతున్న జలాశయాలు జలాశయాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో సాత్నాల, మత్తడివాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన్నవాగు, కుమురంభీం, పీపీరావు ప్రాజెక్టు, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. చెరువులు ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. బావులు, చేతిపంపుల్లో నీళ్లు రావడం లేదు. జూన్ 1 నుంచి వర్షాలు కురవాల్సి ఉన్నా ఈసారి నైరుతి రుతుపవనాలు కనికరించకపోవడంతో ఇంకా వర్షాల జాడలేకపోయింది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటే వైపరీత్యాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా.. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది పరిస్థితులే ఈసారి కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. జిల్లాలో కనిష్టంగా 5.52 మీటర్లలో, గరిష్టంగా 48 మీటర్లలో భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బజార్హత్నూర్, నేరడిగొండలో పరిస్థితి దారుణంగా ఉంది. బజార్హత్నూర్లో 36.23 మీటర్లు, నేరడిగొండలో 48.00 మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటాయి. ఏటా ఈ రెండు మండలాల్లోనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. జిల్లాలో సగటున కనిష్టంగా 4.23 మీటర్లు, గరిష్టంగా 24.98 మీటర్ల లోతులో నీళ్లు పడిపోయాయి. తానూర్ మండలం బోసిలో 24.98 మీటర్లు, సారంగాపూర్ మండలం బీరవెల్లిలో 19.20 మీటర్లు, నర్సాపూర్‌లో 18.60 మీటర్లు, లోకేశ్వరం మండలం మన్మడ్‌లో 24.50 మీటర్లు, కుంటాలలో 17.70 మీటర్లలో జలాలు పడిపోయాయి. కుమురంభీం జిల్లా.. కుమురంభీం జిల్లాలోనూ భూగర్భజలాలు పడిపోతున్నాయి. ఆసిఫాబాద్‌లో 21.85 మీటర్లు, కాగజ్‌నగర్ శివారు జంబుగాంలో 15.50 మీటర్లు, దహెగాంలో 15.75 మీటర్లు, పెంచికల్పేట్ సమీపంలోని ఎల్కపల్లిలో 15.50 మీటర్ల లోతులో జలాలు పడిపోయాయి. ఇతర మండలాల్లోనూ భూగర్భ జలాలది ఇదే పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా.. మంచిర్యాల జిల్లాలోనూ భూగర్భజలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సగటున జిల్లాలో 7.98 మీటర్లకు జలాలు పడిపోయాయి. జైపూర్ మండలం కుందారంలో 19.54 మీటర్లకు, మందమర్రి సమీపంలోని పొన్నారంలో 16.35 మీటర్లు, తాండూర్‌లో 15.48 మీటర్లకు పడిపోయాయి. వర్షాలు పడితేనే రీచార్జ్ సమయానికి వర్షాలు కురువని పక్షంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బోర్లు ఎండిపోతున్నాయి. మళ్లీ మంచి వర్షాలు పడినప్పుడే రీచార్జ్ అవుతాయి. ప్రజలు నీళ్లను పొదుపుగా వాడాలి. – టి.హన్స్‌రాజ్, అసిస్టెంట్ డైరెక్టర్, భూగర్భజల శాఖ, ఆదిలాబాద్ -
అడుగంటుతున్న భూగర్భ జలాలు
జిల్లాల్లో భూగర్భ జల మట్టంవేగంగా పడిపోతోంది. బోరుబావులు బోరుమంటున్నాయి. తాగునీటి వనరులు అడుగంటిపోతున్నాయి. పల్లెల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 4.22 మీటర్ల లోతులోకి పడిపోగా, గతనెలతో పోల్చితే 1.17 మీటర్ల లోతులోకి వెళ్లింది. కొల్చారం మండల పరిధిలోని రంగంపేట గ్రామంలో ఏకంగా 40.05 మీటర్ల లోతులోకి జలమట్టం పడిపోయింది. వ్యవసాయ బోరు బావులు వట్టిపోతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల రైతులు పంటపొలాలను పశువుల మేతకు వదిలేశారు. –మెదక్‌జోన్ వరుస కరువుకాటకాలతో నీటివనరులు అడుగంటాయి. సాగునీరుకాదు కదా తాగునీరు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా జిల్లాపై నిప్పుల వాన కురుస్తోంది. ఏకంగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. భూగర్భజలాలు అందనంత లోతుకి పడిపోయాయి. అత్యధికంగా కొల్చారం మండలంలో ఏకంగా 40.01 మీటర్ల లోతులోకి నీటిమట్టం పడిపోయంది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే 4.22 మీటర్ల లోతులోకి పడిపోగా గతనెలతో పోల్చితే 1.17 మీటర్ల లోతులోకి పడిపోయింది. జిల్లావ్యాప్తంగా 95 వేల బోరుబావులు ఉండగా ఇప్పటికే 80 శాతం బోర్లు మూలన పడ్డాయి. తాగునీటికి సైతం కష్టమొచ్చింది. పశుపక్షాదులకు సైతం నీరు దొరక్క అడవి జంతువులు రోడ్లపైకి వస్తూ ప్రమాదాలకు గురవుతూ మృత్యువాత పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,660 చెరువులు, కుంటలు ఉండగా ఒకటి రెండింటిలో కొద్దిపాటి నీరు తప్ప ఎందులోనూ చెప్పుకోదగ్గ నీరులేదు. ఈ యేడు రబీసీజన్‌లో కొన్ని మండలాల్లో బోర్ల నుంచి కొద్దిపాటి నీరురావడంతో వాటి ఆధారంగా 15,338 హెక్టార్లలో పంటలను సాగుచేశారు. పంటలు చేతికందే సమయంలో బోర్లలో పూర్తిగా నీరు ఇంకిపోవడంతో సాగుచేసిన పంటల్లో సగానికిపైగా ఎండిపోయాయి. ఫలితంగా రైతులకు పెట్టుబడిసైతం చేతికందని పరిస్థితి నెలకొంది. గత సంవత్సరంకన్నా 4.47 మీటర్ల లోతులో.. గత సంవత్సరం మార్చి–ఏప్రిల్‌తో పోల్చుకుంటే 4.22 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు పడిపోయాయి. గత ఏడాది కొల్చారం మండలం రంగంపేటలో 35.58 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా ఈఏడాది 40.05 మీటర్ల లోతులోకి పడిపోయాయి. మొత్తంగా జిల్లాలో మార్చి నెలలో 21.85 మీటర్ల లోతులో నీటిమట్టం ఉండగా ఏప్రిల్‌లో ఏకంగా 23.02 మీటర్లకు పడిపోయింది. ఈ లెక్కన 1.17 మీటర్ల లోతులోకి పడిపోయింది. ప్రమాదకరస్థాయిలో కొల్చారం మండలం భూగర్భజలాలు అత్యధికంగా పడిపోయిన వాటి లో అట్టడుగు స్థానంలో కొల్చారం మండలం ఉంది. ఈ మండల పరిధిలోని రంగంపేట గ్రామంలో ఏకంగా 40.05 మీటర్ల లోతులోకి నీరు పడిపోయింది. ఫలితంగా ఈ గ్రామంలో ఎక్కడ చూసినా తాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో నీటిఊటలు అడుగంటి పోవడంతో వ్యవసాయం పూర్తిగా మానేయాల్సిన పరిస్థితి నెలకొంది. రెండో స్థానంలో టేక్మాల్, తూప్రాన్ మండలాలు ఉన్నాయి. టేక్మాల్ మండలంలో 38.19 మీటర్ల లోతులోకి నీటి ఊటలు పడిపోగా తూప్రాన్ మండలంలో 37.60 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. -
ఏపిలో తగ్గిన ఉష్ణోగ్రతలు
-
ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. 2015తో పోల్చితే 2016లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 54 శాతం తగ్గాయని కేంద్ర వ్యవసాయ మంత్రి బుధవారం పార్లమెంట్లో ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 24 గంటల విద్యుత్‌తో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా రైతులకు ప్రయోజనకారిగా నిలిచాయన్నారు. ఈ ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ. 8 వేల చొప్పున పెట్టుబడి సాయం, కొత్త సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
జూరాలలో తగ్గిన ఇన్‌ఫ్లో
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జూరాల : కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వరద కేవలం 18వేల క్యూసెక్కులు వస్తుండటంతో జలవిద్యుత్ కేంద్రంలో రెండు పంపుల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువ నదిలోకి 16వేల క్యూసెక్కుల వరదను పుష్కరఘాట్ల అవసరాల కొరకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీంఎసీలు కాగా ప్రస్తుతం 9.09 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇక్కడి నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు పంపింగ్ కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 123 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు పై నుంచి ఇన్‌ఫ్లో 20,420 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ద్వారా 15వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా 32.23 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి ఇన్‌ఫ్లో 16,321 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో క్రస్టుగేట్లన్నీ మూసివేసి నీటినిల్వను పెంచుతున్నారు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా దిగువ జూరాల రిజర్వాయర్‌కు 6వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. -
జూరాలకు తగ్గిన వరద
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లోపై ప్రభావం పడింది. శనివారం ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు 1,10,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కష్ణానది వరద శాంతించడంతో పుష్కరఘాట్లలో భక్తులు స్నానమాచరించేందుకు నీటిమట్టాలు అందుబాటులో ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.08టీఎంసీల నీటినిల్వ ఉంది. దిగువ నదిలోకి క్రస్టుగేట్లు విద్యుదుత్పత్తి ద్వారా 1,52,180 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో కష్ణానదిపై ఉన్న ఆల్మట్టి పాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 109టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి ఇన్‌ఫ్లో 1,87,196 క్యూసెక్కులు వస్తుండగా విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు దిగువన కర్ణాటకలో ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు ప్రస్తుతం 30టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి 1,02,987 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా ప్రాజెక్టులో 19క్రస్టుగేట్లను ఎత్తి జూరాల రిజర్వాయర్‌కు 79,948 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. ∙ -
పోలీస్ ఫేస్బుక్ ద్వారా కూడా స్పందిస్తాం..
ఒంగోలు : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఆయన మంగళవారం జిల్లాలో క్రైమ్ రేటు వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రత్యక్షంగా సమాచారం ఇవ్వలేని వారి కోసం పోలీస్ ఫేస్బుక్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోలీస్ ఫేస్బుక్ ద్వారా సమాచారం ఇచ్చినా పోలీసు స్పందిస్తారని ఆయన చెప్పారు. ఒంగోలులో ట్రాఫిక్ నియంత్రణకు ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకపోవటం బాధాకరమన్నారు. ప్రకాశం జిల్లా నేర నియంత్రణ కోసం ప్రజల సహకరించాలని ఎస్పీ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయ్..
ముంబై: నగరంలో డిసెంబర్ 31న తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 2006 డిసెంబర్ 31న సుమారు 10 భారీప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. వారికి జరిమానాలు విధించడమే కాక, కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రారంభించారు. దాంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నానాటికీ తగ్గుతూ వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి తాగి వాహనాలు నడిపిన 568 వాహనదారులపై కేసులు నమోదు చే శామని బుధవారం నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 2012తో పోలిస్తే 270 కేసులు తక్కువ నమోదయ్యాయని వారు వివరించారు. నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న 62 మందిపై కేసులు నమోదు చేశామని, హెల్మెట్ లేకుండా అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న 1,540 మందికి, అలాగే సిగ్నల్ జంప్ చేసిన, సీటు బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్న మరో 570 మందికి జరిమానా విధించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ పోలీస్ కమిషనర్ వివేక్ ఫంసాల్కర్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా గత క్రిస్మస్ నుంచి 31 రాత్రి వరకు తాము భద్రతా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. డిసెంబర్ 31 రాత్రే అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. కాగా, 2012లో ఇదే రోజు 840 కేసులు, 2011లో 739 కేసులు నమోదయ్యాయని వివేక్ తెలిపారు. 2012 డిసెంబర్ 31 కంటే గత డిసెంబర్ 31న 272 కేసులు తక్కువ నమోదయ్యాయని ఆయన విశ్లేషించారు. తాగి వాహనాలు నడిపిన వారిలో ఎక్కువమంది 21 నుంచి 30 లోపు వయస్సు వారే ఉన్నారన్నారు. మంగళవారం రాత్రి నగరవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో బ్రీత్ ఎనలైజర్లతో నాకాబందీ నిర్వహించామని, 150 మంది అధికారులు, 600 మంది పోలీస్ సిబ్బందిని దీని కోసం నియమించామని ఫంసాల్కర్ తెలిపారు. తమ అవగాహన శిబిరాల్లో పలు స్వచ్ఛంద సంస్థల సాయం కూడా తీసుకున్నామన్నారు. అలాగే 31వ తేదీ రాత్రి ఆటోలను నడపాలని ఆటో యూనియన్లకు సూచించామన్నారు. ఒకవేళ ఎవరైనా తాగి తమ సొంత వాహనాలపై వెళ్లేందుకు అవస్థ పడుతుంటే, ఆ సమయంలో ఆటోలు అందుబాటులో ఉండేలా చూశామన్నారు. కాగా, ఆటో డ్రైవర్లు ఎవరూ రాత్రి తాగి బండి నడిపినట్లు ఎక్కడా కేసులు నమోదు కాలేదని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభినందించారు. -
పల్నాట శాంతి పవనాలు
సాక్షి, నరసరావుపేట: చీకటి పడుతుందంటే ఒకప్పుడు ఆ గ్రామాలు బిక్కుబిక్కుమనేవి. ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక ఆందోళనతో సతమతమయ్యేవి. మావోయిస్టులు, పోలీసుల దాడుల మధ్య నలిగిపోయేవి. ఇలాంటి గ్రామాలు పల్నాడులో ఎన్నో. అయితే నేడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. మావోయిస్టుల ప్రాబల్యంతోపాటు పోలీసుల దాడులు తగ్గడంతో ఆ గ్రామాలు ప్రశాంత వాతావరణంలో ఊపిరి పీల్చుకుంటున్నాయి. పల్నాడులోని బొల్లాపల్లి, ఈపూరు, దుర్గి, వెల్దుర్తి, మాచవరం, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లోనేకాక పిడుగురాళ్ల పోలీస్ సర్కిల్ పరిధిలోని బెల్లంకొండ మండలంలోని గ్రామాలు అన్నీ ఒకప్పుడు భయం నీడన బతుకుతుండేవి. ఏకంగా 15 ఏళ్ల పాటు దినదినగండంలా గడిచింది. అన్నల పుణ్యమా అని కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ కొత్త సమస్యలెన్నో పుట్టుకువచ్చాయి. గ్రామా ల్లో అశాంతి రాజ్యమేలింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విపరీతంగా భయపడాల్సిన పరిస్థితి. గ్రామంలో ఎవరితో ఎవరు ఏ మాట మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడేవారు. నాలుక జారితే ఏ కొంప కూలుతుందో అన్న భయం వెంటాడేది. మనసు విప్పి అరుగులపై ముచ్చట్లు చెప్పుకునే ఊసే కరువైంది. మావోయిస్టులతో ఇలావుంటే, పోలీసుల నుంచి పులి మీద పుట్రలా మరో బాధ. ఏ రాత్రి ఏ కూం బింగ్ పార్టీ వచ్చి ఇళ్ల మీద దాడులు చేస్తుందో మావోయిస్టు సానుభూతిపరులంటూ ఎవరిని ఎత్తుకువెళుతుందో తెలియని పరిస్థితులు వెంటాడాయి. ప్రశాంత వాతావరణంలో పల్నాడు గ్రామాలు.. 15 ఏళ్ల పాటు మావోయిస్టులు, పోలీసుల నడుమ నలిగిపోయిన పల్నాడు పల్లెల ప్రజలు గత కొన్నేళ్లుగా క్రమేణా మారిన పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారు. పల్లెల్లో మళ్లీ సందడి నెలకొంది. రచ్చబండలపై ప్రజలు హాయిగా మనసు విప్పి మాట్లాడుకోగలుగుతున్నారు. ప్రజల్లో నెల కొన్న అభద్రతా భా వం క్రమేణా దూరమైంది. గతంలో మావోయిస్టుల భయంతో గ్రామాలను విడిచి వెళ్లిన అనేక మ ంది నాయకులు, ప్రజలు తిరిగి తమతమ గ్రామాలకు చేరుకుని హాయిగా జీవనం సాగిస్తున్నారు. మళ్లీ పడగవిప్పుతున్న ఫ్యాక్షనిజం.. పల్నాడులో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గి పల్లె ప్రజలు హాయిగా జీవనం సాగిస్తున్న సమయంలో స్వార్థ రాజకీయ నాయకులు తమ ఆధిపత్యాల కోసం మళ్లీ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో మావోయిస్టుల భయంతో అనేక పల్లెల్లో తోకముడిచిన రౌడీయిజం, ఫ్యాక్షనిజం మళ్లీ పడగ విప్పుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.ఈ పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత అటు ప్రజాప్రతినిధులు, ఇటు పోలీసు అధికారులపై ఎంతైనా వుంది.