సాక్షి, విజయవాడ: నగరంలో 2018 కంటే 17 శాతం క్రైం రేట్ తగ్గిందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 కంటే 12 శాతం కేసులు తగ్గాయని వెల్లడించారు. గతేడాది కన్నా రికవరీ 29 శాతం పెరిగిందన్నారు. నగరంలో చోరీలపై మరింత దృష్టి సారిస్తామని సీపీ పేర్కొన్నారు. మహిళలపై నేరాల శాతం గణనీయంగా తగ్గిందని, రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయని తెలిపారు.
రూ.కోటికి పైగా గంజాయి, రూ.2 కోట్ల విలువచేసే గుట్కా స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. మద్యం అక్రమ రవాణాపై 1230 కేసులు నమోదు చేయడంతో పాటు, వెయ్యి వాహనాలు సీజ్ చేశామని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, కుటుంబ సమస్యలపై మహిళా మిత్ర మానిటరింగ్ చేస్తుందని, సైబర్ మిత్రని మరింత మెరుగుపరుస్తామన్నారు. యాప్‌ల నుంచి లోన్స్ తీసుకోవద్దని సీపీ శ్రీనివాసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment