vijayawada cp
-
రాజకీయ కక్షతో విజయవాడ సీపీపై బదిలీ వేటు
సాక్షి, విజయవాడ: రాజకీయ కక్షతోనే విజయవాడ సీపీపై బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విజయవాడ సీపీ కాంతిరాణా దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణ చేస్తున్న కాంతిరాణాపై కక్షతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులతో కూటమి బ్లాక్మెయిల్ చేసింది. ఈ క్రమంలో ష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీని బదిలీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే వేముల సతీష్ అరెస్టయ్యారు. టీడీపీ నేత బోండా ఉమకు వేముల సతీష్అనుచరుడిగా ఉన్నారు. విచారణ కీలక దశలో ఉండగా సీపీ కాంతిరాణా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. -
విజయవాడ సీపీగా కాంతి రాణా..
సాక్షి, విజయవాడ: 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనంతపురం డీఐజీగా పని చేస్తున్న కాంతి రాణా.. గతంలో విజయవాడ డీసీపీగా పని చేశారు. -
ఆ కేసుతో విజయవాడకు సంబంధంలేదు: సీపీ
సాక్షి, విజయవాడ: గుజరాత్లో పట్టుబడ్డ డ్రగ్స్‌కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విజయవాడకు డగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారన్నది వాస్తవం కాదని సీపీ స్పష్టం చేశారు. గుజరాత్ ముంద్ర పోర్టులో హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. (చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) చెన్నై నివాసముంటున్న దుర్గాపూర్ణ వైశాలి పేరుతో విజయవాడ అడ్రస్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారన్నారు. కొన్నేళ్లుగా వైశాలి, ఆమె భర్త, సుధాకర్ చెన్నైలో ఉంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డీఆర్ఐ విచారణ జరుపుతోందని సీపీ వివరించారు. ఈ కేసుపై అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలలో కూడా సోదాలు నిర్వహించాయన్నారు. విజయవాడలో ఇంటి అడ్రస్‌తో లైసెన్స్ తీసుకోవడం తప్పితే డ్రగ్స్ ఆనవాళ్లు లేవని సీపీ తెలిపారు. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు -
ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి
సాక్షి, విజయవాడ: కోవిడ్ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలని సీపీ స్పష్టం చేశారు. వచ్చే అంబులెన్స్‌లను పరిశీలించి అనుమతి ఇస్తున్నామన్నారు. మద్యం అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సమస్యలు ఉన్నాయి. జీజీహెచ్‌లో అక్సిజన్ అయిపోయే ప్రమాదాన్ని అందరి సహకారంతో అరికట్టాం. పోలీసు శాఖలో 97 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లను అమ్మే 12 గ్యాంగ్‌లను పట్టుకున్నాం. విజయవాడ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుపై కేసులు నమోదు చేశాం. కరోనా కట్టడికి పెద్ద ఎత్తున ర్యాలీలు, అవగాహన కల్పించామని’’ సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. చదవండి: తండ్రి పేరుతో సుక్కు ఆక్సిజన్ ప్లాంట్, ప్రారంభించిన మంత్రి ‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణం’ -
మున్సిపోల్స్‌పై ఖాకీల డేగకన్ను..
సాక్షి, విజయవాడ: ఈనెల 10న జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై విజయవాడ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సిటీ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కీలకమైన విజయవాడ కార్పొరేషన్, ఉయ్యూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీపీ బత్తిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. సీపీ నిత్య పర్యటనలతో సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 3,200 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నట్లు సీపీ తెలపారు. ఎన్నికల విధుల్లో 67 మొబైల్, 27 స్ట్రైకింగ్, 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన 1900 మందిని 110 సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఈనెల 8వ తేదీ నుండి పోలింగ్ కేంద్రాలను అధీనంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
12 శాతం నేరాలు తగ్గాయి: సీపీ శ్రీనివాసులు
సాక్షి, విజయవాడ: నగరంలో 2018 కంటే 17 శాతం క్రైం రేట్ తగ్గిందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 కంటే 12 శాతం కేసులు తగ్గాయని వెల్లడించారు. గతేడాది కన్నా రికవరీ 29 శాతం పెరిగిందన్నారు. నగరంలో చోరీలపై మరింత దృష్టి సారిస్తామని సీపీ పేర్కొన్నారు. మహిళలపై నేరాల శాతం గణనీయంగా తగ్గిందని, రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయని తెలిపారు. రూ.కోటికి పైగా గంజాయి, రూ.2 కోట్ల విలువచేసే గుట్కా స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. మద్యం అక్రమ రవాణాపై 1230 కేసులు నమోదు చేయడంతో పాటు, వెయ్యి వాహనాలు సీజ్ చేశామని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, కుటుంబ సమస్యలపై మహిళా మిత్ర మానిటరింగ్ చేస్తుందని, సైబర్ మిత్రని మరింత మెరుగుపరుస్తామన్నారు. యాప్‌ల నుంచి లోన్స్ తీసుకోవద్దని సీపీ శ్రీనివాసులు సూచించారు. -
బెజవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు
సాక్షి, విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు సీపీగా పని చేస్తున్న బత్తిన శ్రీనివాసులు పూర్తిస్థాయిలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ బాధ్యతల నుంచి ద్వారకా తిరుమలరావు రిలీవ్ అయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీగా పనిచేసిన అనుభవం, నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు. మరోసారి సీపీగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ని బలోపేతం చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆన్లైన్ మోసాలపై సైబర్ సెల్ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కాగా గతంలో బత్తిన శ్రీనివాసులు 2013 మే నుంచి 2014 ఆగస్టు వరకు బెజవాడ సీపీగా పనిచేశారు. (గ్యాంగ్ వార్ కేసులో పురోగతి) నేరాలను నియంత్రించాం: ద్వారకా తిరుమలరావు విజయవాడలో 23 నెలలుగా సీపీగా పనిచేశానని మాజీ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేశామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు నగరంలో పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నేరాలను నియంత్రణ చేయగలిగామన్నారు. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకున్నామని వెల్లడించారు. సీపీగా విజయవాడలో పనిచేయడం మంచి అనుభవం, జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కొత్తగా నియమితులైన శ్రీనివాసులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. (బెజవాడ గ్యాంగ్‌వార్ : పండు అరెస్ట్) -
పేకాట సరదా.. 25 మందికి కరోనా..
సాక్షి, విజయవాడ: నగర సిటీ కమిషనర్రేట్ పరిధిలో కరోనా వైరస్ కలవరం పుట్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు 107కి చేరుకోవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పేకాట సరదా కారణంగా ఒక్క వ్యక్తి నుంచి 25 మందికి కరోనా వైరస్ సోకడంతో నగరంలో కలకలం సృష్టించింది. కృష్ణలంక, కార్మికనగర్, భవానీపురం, ఖుద్దూస్ నగర్, ఏఎస్ నగర్ లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కృష్ణలంక,కార్మిక నగర్లలో ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. (కరోనాను జయించి.. మనో ధైర్యం నింపి..) వ్యక్తి నిర్లక్ష్యం ఫలితంగా 14 మందికి కరోనా.. సరదా కోసం పేకాట, హౌసీ ఆడినందుకు ఒకే చోట 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో ప్రాంతంలో ఒక వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా 14 మందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. రెడ్ జోన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ వైరస్ బారినపడ్డారని వెల్లడించారు. కాంటాక్ట్స్ అందరినీ క్వారంటైన్‌కు తరలించామని సీపీ పేర్కొన్నారు.ఆపదలో ఉన్న కరోనా పాజిటివ్ మహిళకు సాయం చేసిన మరో ఎస్ఐ, కాంటాక్ట్స్ ను క్వారంటైన్లో పెట్టామని తెలిపారు. (కరోనా: అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీనే) ప్రజలు సహకరించాలి.. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది త్యాగాలను ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. రెడ్జోన్లలో నిబంధనలు ఉల్లంఘించడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లనే కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. నగరంలో 8 ప్రాంతాలను రెడ్జోన్లుగా గుర్తించామని తెలిపారు. రెడ్ జోన్లలో లక్ష్మణ రేఖ దాటితే కఠినచర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఇళ్ల నుంచి బయటకొస్తే క్వారెంటైన్ కు తరలిస్తామని తెలిపారు. డ్రోన్,సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలి.. మాస్కులు లేకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామన్నారు. ద్విచక్ర వాహనాల్ల ఒకరికన్నా ఎక్కువ మంది ప్రయాణిస్తే కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నగరంలో ఆరువేల బైకులను సీజ్ చేసి.. కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అజాగ్రత్తగా ఉంటే కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో రంజాన్ మాస ప్రార్థనలు ఇంటి వద్దే చేసుకోవాలని ముస్లిం సోదరులకు సీపీ విజ్ఞప్తి చేశారు. ఆదివారం మాంసం, చేపల విక్రయాలపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు సాగిస్తే కఠినచర్యలు తప్పవని సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. -
‘2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించాం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో తొలిసారి విజయవాడ రూరల్‌లో ఉన్న పోలీసు స్టేషన్‌కు టెక్నాలజీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిందని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకాతిరులమరావు తెలిపారు. 2019 వార్షిక మీడియా సమావేశాన్ని సీపీ ద్వారకాతిరుమలరావు సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించామన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు ప్రముఖుల ప్రమాణస్వీకారాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించామని సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. పదేళ్ల తరువాత కృష్ణానదికి వరద వచ్చిందని.. దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. 2019లో ఎఫ్ఐఆర్ నమోదులు తగ్గాయని.. బైండోవర్ కేసులు పెరిగాయని వెల్లడించారు. కిడ్నాప్ కేసులు 25 శాతం, హత్యాయత్నం కేసులు 52 శాతం, దాడుల కేసులు 24 శాతం, ప్రాపర్టి అఫెన్స్ కేసులు 18 శాతం, వరకట్నం కేసులు 45 శాతం తగ్గాయన్నారు. దొంగతనం కేసులు 21 శాతం, మర్డర్ కేసులు 19 శాతం, గృహహింస కేసులు 11 శాతం పెరిగాయని సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వీటితోపాటు పోక్సో కేసులు 2018లో 95 కేసులు, 2019లో 67 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కేసులు, ఘరానామోసాలు తగ్గాయన్నారు. కాగా, 2018లో 498 కేసులు, 2019లో 463 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని.. 2018లో 191, 2019లో 242 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులో ప్రాపర్టీ రికవరీ గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది ఎక్కవగా చేశామన్నారు. మిస్సింగ్ కేసులు తగ్గాయని 2018లో 788, 2019లో 624 కేసులు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 199 మంది మగపిల్లల్ని, ఐదుగురు ఆడపిల్లలను గుర్తించామని సీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గంచగలిగామని.. 2018లో 1,483 కేసులు, 2019లో 1,376 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. 2019 టాస్క్ ఫోర్స్ కేసుల్లో కీలకమైనవి.. క్రికెట్ బెట్టింగ్, నకిలీ బంగారం, విదేశి సిగిరెట్లు, డ్రగ్స్, నకిలి సర్టిఫికెట్స్ కేసులని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్‌తో పాటు అత్యాచారం, మిస్సింగ్ లాంటి చాలా కీలకమైన కేసులను 2019లో చేధించగలిగామని సీపీ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు. క్రైమ్ స్పాట్ వాహనాలు ప్రారంభించామని.. సైబర్ మిత్ర పేరుతో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామమని సీపీ తెలిపారు. గడిచిన ఆరునెలల్లో 2,968 స్పందన పిటిషన్లు వచ్చాయని.. 2,961 పిటిషన్లను పరిష్కరించామన్నారు. కేవలం 7 పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 379 పిటిషన్లపై ఎఫ్ఐఆర్లు నమొదు చేశామన్నారు. రూ.10 కోట్లతో మాచవరం, ఉయ్యూరు, కంకిపాడు పోలీసు స్టేషన్లను నిర్మించామని అయన పేర్కొన్నారు. రూ.2.75 కోట్లతో కృష్ణలంక, భవానిపురం, సత్యనారాయణపురంలో పోలీసుల స్టేషన్ల భవన నిర్మాణం జరగుతుందన్నారు. డయిల్ 100కు 3,06,036 కాల్స్ వచ్చాయని.. 72,889 కాల్స్ మాత్రమే నిజమైనవని, మిగిలిన 2,33,147 కాల్స్ ఆకతాయిలు చేసిన నకిలీవి వచ్చాయని సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. -
మహిళలకు విజయవాడ సీపీ అభయం..
సాక్షి, అమరావతి : ‘అమ్మా... మీకేదైనా ప్రమాదం సంభవించినా, సమస్య ఏదైనా తలెత్తవచ్చనే అనుమానం కలిగినా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయోద్దు.. తక్షణం 100కు డయిల్ చేయండి. వాట్సాప్ నంబరు 73289 09090కు సమాచారం ఇవ్వండి. నగర పరిధిలో నాలుగు నిమిషాల్లో మీ చెంతకు చేరుకుంటాం. శివారు ప్రాంతాలకైతే ఆరు నిమిషాల్లో వచ్చేస్తాం. సమస్య మీదే కాకపోవచ్చు.. మీ పక్కన, పరిసరాల్లో ఎక్కడైనా, ఎవరికైనా ప్రమాదం పొంచి ఉందనే అనుమానం కలిగినా ఆలోచించవద్దు..’ అని విజయవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు నగర ప్రజలకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో పశువైద్య శాలలో వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకరెడ్డి దారుణహత్య నేçపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా మహిళలు, యువతులు, ఆడపిల్లలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏ సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉన్నారన్న విషయాన్ని మరచిపోవద్దని కోరారు. వెనువెంటనే స్పందిస్తారు.. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎవరైనా ఆపదలో ఉండి డయల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు సగటున నాలుగు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యపై స్పందిస్తారన్నారు. నగర శివార్లకు వెళ్లేందుకు ఆరు నిమిషాలు తీసుకుంటున్నా... సత్వరమే ఫిర్యాదీదారులు చెప్పిన ప్రాంతానికి పోలీసులు చేరుకుంటారని చెప్పారు. డయల్ 100కి ఫోన్ వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న రక్షక్, బ్లూకోట్స్ సిబ్బందికి సమాచారం చేరవేయడమే కాకుండా వెనువెంటనే వచ్చేస్తారని పేర్కొన్నారు. ఇవే కాకుండా ఇంటర్సెప్టార్ 12 వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంచామని.. నగరంలోని బెంజిసర్కిల్, స్టేట్ గెస్ట్‌హౌస్, బస్టాండు, రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డు తదితర ముఖ్య కూడళ్ల వద్ద ఈ వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తిని కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకెళుతున్నా... ఏదైనా వాహనం అతి వేగంతో వెళుతున్నా వాటిని నియంత్రించడానికి, చర్యలు తీసుకోవడానికి సిబ్బంది వెంబడిస్తారన్నారు. 7328909090 నంబరుకు చెపితే... డయల్ 100 మాదిరిగానే విజయవాడ నగర పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన 7328909090 వాట్సాప్ నంబరు కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ చెప్పారు. ఈ వాట్సాప్ నంబరుకు సంక్షిప్త సందేశం కాని, చిత్రాలు కాని, వీడియోలు కాని పంపవచ్చని చెప్పారు. 24 గంటలు టోల్‌ఫ్రీ నంబర్లు 100, 112, 181, 1091. చేరువ ద్వారా అవగాహన.. నగరంలో జరుగుతున్న నేరాల పట్ల, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన కలి్పంచడానికి చేరువ కార్యక్రమాన్ని చేపట్టామని సీపీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. చేరువ వాహనాల ద్వారా సిబ్బంది వీధివీధినా తిరుగుతూ ప్రజలకు నేరాలు, చట్టాల పట్ల అవగాహన కలి్పస్తున్నారని వివరించారు. జీపీఆర్ఎస్తో అనుసంధానం మహిళల రక్షణ కోసం పోలీసులు ప్రత్యేక సర్వీసును ప్రవేశపెట్టారు. మీరు ఎప్పుడైనా కారు, కాబ్, ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తుంటే..ఆ వాహనం నంబర్‌ను 9969777888కు ఎస్ఎంఎస్ చేయాలి. ఆ నంబర్‌ను వెంటనే జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానించి.. మీరు పంపిన నంబర్‌కు ఒక రిటర్న్ ఎస్ఎంఎస్ వస్తుంది. వాహన గమనం ఎలా ఉందో గుర్తిస్తుంది. జాగ్రత్తలు చెప్పాలి.. పిల్లలకు తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు భద్రత గురించి చెప్పాలని, ఏదైనా సమస్య తలెత్తితే ఎలా దాన్ని అధిగమించాలో వివరిస్తుండాలని సీపీ సూచించారు. ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉన్నందున ఆపత్కాలంలో ఎవరిని సంప్రదించాలో ప్రత్యేకంగా నంబర్లు నోట్ చేసుకోవాలని కోరారు. విద్యా సంస్థలు కూడా ఈ విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఏదీ చెప్పి రాదని అందువల్లే అప్రమత్తత ముఖ్యమన్నారు. -
సీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ
-
సీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన సీపీకి ఫిర్యాదు చేశారు. తనను కించపరిచేలా ఆడపిల్లల పేర్లుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వంశీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘టీడీపీ సోషల్ వింగ్ పేరుతో సర్క్యులేట్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. తన రాజకీయ భవిష్యత్ నాశనం చేయాలని కొందరు వ్యక్తులు మానవత్వం లేకుండా మా కుటుంబాన్ని కించపరుస్తున్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరాను. అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు’ అని ఎమ్మెల్యే తెలిపారు. -
దసరా ఉత్సవాలకు కట్టుదిట్ట ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో దసరా ఏర్పాట్ల గురించి ఆయన వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతర జిల్లాల నుంచి బలగాలను రప్పించామని వెల్లడించారు. 29న ఆదివారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు. మూల నక్షత్రం రోజున 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనేదే లక్ష్యమని తెలిపారు. విఐపిలకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. విఐపిలకు ప్రత్యేక సమయాలు కేటాయించామని వెల్లడించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, ఉదయం 11 నుంచి 12 గంటల వరుకు, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరుకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉంటుందన్నారు. విఐపిలతో పాటు సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వెల్లడించారు. విఐపి ప్రోటోకాల్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. స్టేట్ గెస్ట్ హౌస్, పున్నమి ఘాట్, ప్రోటోకాల్ పాయింట్స్ లను విఐపిలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘దసరా పార్కింగ్ యాప్- 2019’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఈ యాప్‌తో పార్కింగ్ సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్‌లో మోబి జెన్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 12 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలీస్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అమ్మవారి దర్శనం కల్పిస్తారని తెలిపారు. సిసి కెమెరాల ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు. డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తామన్నారు. గత ఏడాది ఎక్కడా చోరీలు జరగలేదని. ఈ ఏడాది కూడా క్రైం పార్టీలను పెంచుతామన్నారు. దాతలకు కూడా ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసామని.. 10 రోజుల్లో ఏ రోజు అయినా దర్శనం చేసుకోవచ్చన్నారు 90 శాతం ఏర్పాట్లు పూర్తి:ఈవో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈవో సురేష్‌బాబు అన్నారు. 90 శాతం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కేశన ఖండనశాల పనులు పూర్తిచేస్తున్నామని వెల్లడించారు. క్యూలైన్ పనులు రేపటికి పూర్తవుతాయని..అన్యమతస్థులకు టెండర్లు ఇవ్వలేదని ఈవో తెలిపారు. -
జలీల్‌ఖాన్‌పై వైఎస్ఆర్సీపీ నాయకుల ఫిర్యాదు
-
జలీల్‌ఖాన్‌పై కమిషనర్‌కు ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకుడు జలీల్‌ఖాన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ సమయంలో జలీల్‌ఖాన్ ప్రజలను భయాబ్రాంతులకు గురి చేసేలా దాడి చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు ఉన్నారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే జలీల్‌ఖాన్ ప్రజలను మభ్యపెట్టాలని చూశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్‌పై దాడికి పాల్పడిన జలీల్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీని కోరినట్టు తెలిపారు. దాడికి పాల్పడ్డ జలీల్ఖాన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జలీల్‌ఖాన్ ప్రవర్తిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని తెలిపారు. టీడీపీ నాయకులు రౌడీల మాదిరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపినట్టు వెల్లడించారు. -
ఇంద్రకీలాద్రిపై భద్రతను పర్యవేక్షించిన సీపీ
విజయవాడ : మూలా నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించ వలసి వచ్చిందని చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లను గౌతం సవాంగ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ రోజు అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. అందులోభాగంగా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ గౌతం సవాంగ్ వివరించారు. -
దసరా ఉత్సవాల్లో దీక్షతో పని చేయండి
పోలీసు సిబ్బందికి సీపీ గౌతం సవాంగ్ నిర్దేశం ఇంద్రకీలాద్రిపై భారీ బందోబస్తు ఇతర జిల్లాల నుంచి 3,750 మంది సిబ్బంది రాక విజయవాడ: వచ్చే నెల 1వ తేదీ నుంచి 11వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల బందోబస్తులో దీక్షతో, సేవాభావంతో పని చేయాలని నగర పోలీసు కమిషనర్ డి. గౌతం సవాంగ్ సిబ్బందికి ఉద్బోధించారు. గురువారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బందోబస్తుకు నియమితులైన పోలీసులతో సమావేశమయ్యారు. సీపీ మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, భవానీలు తరలివస్తారని, ఎలాంటి అవాంఛనీయాలు, ప్రమాదాలు జరగకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో పాల్గొనే అధికారులు. సిబ్బంది క్రమ శిక్షణతో ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. సిటీ సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి సుమారు 3,750 మంది పోలీసులు వస్తున్నారని తెలిపారు. కమిషనర్ జారీ చేసిన సూచనలు ఇలా... కృష్ణాపుష్కరాల్లో మాదిరిగానే పేరు తెచ్చేలా దసరా ఉత్సవాలలో కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలి. ప్రతీ ఒక్కరు ఆయా ప్రదేశాల్లో తమకు నిర్ధేశించిన షిప్టులలో బాధ్యతాయుతంగా, అవగాహనతో వ్యవహరించాలి. బందోబస్తులో పాల్గొనే అందరి ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుతూ అన్ని అంశాలు కంప్యూటరైజ్ చేయడం జరిగిందన్నారు. ఆయా సెక్టార్లకు సంబందించిన అధికారులు, అందరు సిబ్బంది విధులకు గైర్హాజరు కాకుండా పర్యవేక్షించాలి. పోలీసు శాఖ అంటే ప్రజలకు సేవ చేసే వ్యవస్థగా ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకునేలామెలగాలి. భక్తులతో మర్యాదపూర్వకంగా, మృదువుగా మాట్లాడాలి. ఎప్పటికప్పుడు క్రమపద్దతిలో భక్తులను అనుమతించాలి. ఈ కార్యక్రమంలో జేసీపీ పి.హరికుమార్, డీసీపీలు పాల్రాజు, కోయ ప్రవీణ్, జి.వి.జి. అశోక్ కుమార్, కాంతి రాణాటాటా పాల్గొన్నారు. -
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: సవాంగ్
విజయవాడ : కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో గౌతం సవాంగ్ విలేకర్లతో మాట్లాడుతూ.... పుష్కరాలు నేపథ్యంలో 5 శాటిలైట్ రైల్వేస్టేషన్లు, 6 శాటిలైట్ బస్టాప్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పుష్కరాల్లో 17500 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారన్నారు. 18 డ్రోన్ కెమెరాలు, 1400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 19 మంది ఐపీఎస్‌లతోపాటు 14 మంది ఎస్పీ స్థాయి అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. 7 వేల మంది వాలంటీర్లను కూడా నియమించినట్లు గౌతం సవాంగ్ వివరించారు. -
మళ్లీ విధుల్లోకి సీపీ సవాంగ్
విజయవాడ : పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ బుధవారం విధులకు హాజరయ్యారు. కమిషనరేట్‌లోని అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. వాస్తవానికి మంగళవారం నుంచే కమిషనర్ విధులకు హాజరుకావాల్సి ఉంది. పుష్కర బందోబస్తుపై డీజీపీ జె.వి.రాముడు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి హాజరుకావాల్సి రావడంతో హైదరాబాద్‌లోనే ఉన్నారు. వ్యక్తిగత కారణాలపై ఈ నెల 3 నుంచి సవాంగ్ సెలవుపై వెళ్లారు. గత డిసెంబర్లోనే వెళ్లాల్సి ఉండగా అనివార్య పరిస్థితుల్లో సెలవు రద్దు చేసుకున్నారు. తిరిగి ఈ నెల మూడు నుంచి సెలవుపై వెళ్లడంతో ఇన్చార్జి పోలీసు కమిషనర్‌గా అదనపు డీజీపీ(ఆపరేషన్స్) ఎన్.వి.సురేంద్రబాబు బాధ్యతలు నిర్వర్తించారు. సిట్ ఐజీ మహేష్ చంద్ర లడ్హాతోపాటు డీసీపీలు ఎల్.కాళిదాసు, జి.వి.జీ.అశోక్‌కుమార్ తదితరులు కమిషనర్ సవాంగ్‌ను కలిశారు. -
'వంగవీటి'పై బెజవాడ సీపీకి ఫిర్యాదు
విజయవాడ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'వంగవీటి' సినిమాపై గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ చిత్రం కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ వాళ్లు గురువారం విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మళ్లీ తెర మీదకు వస్తే బెజవాడలో ప్రశాంతత దెబ్బతింటుందని అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రంపై వర్మ రోజుకో వార్తతో న్యూస్ లో ఉంటున్న విషయం తెలిసిందే. -
సెలవుపై వెళ్లిన సీపీ గౌతం సవాంగ్
విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబును నియమించారు. గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు. ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ గతంలో సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న సవాంగ్‌పై అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే కాల్ మనీ కేసు విచారణను మీరే చేపట్టాలంటూ బాధితులు విన్నవించడంతో ఆ తర్వాత సెలవును రద్దు చేసుకున్నట్టు సవాంగ్ చెప్పారు. -
టీడీపీ నేతల్ని రక్షించుకోవడానికే సవాంగ్‌ను సెలవుపై పంపారు
♦ చంద్రబాబుపై అంబటి రాంబాబు ధ్వజం ♦ నిష్పాక్షికంగా ఉండే అధికారుల్ని మార్చడం బాబుకు కొత్తకాదు ♦ బాబు, కేసీఆర్ మధ్య సయోధ్య కుదరడం వెనుక కథేంటో చెప్పాలి? సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం సెలవుపై పంపడం దారుణమని, అధికారపార్టీ వారిని రక్షించుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంవద్ద మీడియాతో మాట్లాడుతూ సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో సవాంగ్‌ను సెలవుమీద పంపడంపై ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. సవాంగ్‌కు ముక్కుసూటిగా వెళ్లే అధికారిగా పేరుందని నేరస్తులు ఎవరైనా శిక్షపడేలా చేస్తారనే నమ్మకం ప్రజలకుందని, ఆయనుంటే ఇబ్బందులెదురవుతాయనే.. సెలవుపై పంపినట్లుగా ఉందన్నారు. తమమాట వినకుండా నిష్పాక్షికంగా వ్యవహరించే పోలీసు ఉన్నతాధికారుల్ని మార్చడం బాబుకు కొత్తేం కాదని, అమరావతి ప్రాంతంలో పొలాలు కాలిపోయినపుడు గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలను కూడా బదిలీ చేశారన్నారు. పాలనపై బాబుకు పట్టు లేదు చంద్రబాబుకు పాలనపై పూర్తిగా పట్టు సడలిందని, కేవలం తమ పార్టీవారిని కుంభకోణాల నుంచి కాపాడుకునే దుస్థితిలో ప్రస్తుతమున్నారని అంబటి అన్నారు. కాల్‌మనీలో పీకల్లోతున టీడీపీ నేతలంతా మునిగిపోతే ఆత్మరక్షణలో పడిపోయిన బాబు ఇతరపక్షాలపైనా బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో తమ పార్టీ యువజన నేత కావటి మనోహర్‌నాయుడు ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించడమే అందుకు పరాకాష్టన్నారు. మనోహర్‌నాయుడు ఇంట్లో వారికేమీ దొరకలేదన్నారు. ప్రభుత్వాలు ఇవాళుండి, రేపు పోతాయని, ఎప్పటికీ సర్వీసులో ఉండే పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిన్నటి దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదించుకున్న ఉభయరాష్ట్రాల సీఎంలు కేసీఆర్, బాబుల మధ్య హఠాత్తుగా ఆ సయోధ్య ఎలా కుదిరిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయని నిన్నటివరకూ కేసీఆర్ చెప్పారని, ఇప్పుడవి ఉలవచారులో మునిగిపోయాయా? అని ప్రశ్నించారు. -
అందుకే సవాంగ్‌ను సెలవుపై పంపారు
-
గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ
కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్‌పై వేటు పడింది. కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పేర్లు ఎవరివీ బయటకు రాకూడదంటూ గత రెండు రోజులుగా గౌతమ్ సవాంగ్‌పై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలతో పాటు కీలక నేత నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన అంగీకరించలేదని తెలిసింది. దాంతో సెలవుల్లో వెళ్లాల్సిందిగా పై స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో విధిలేని పరిస్థితుల్లో పక్షం రోజుల పాటు సెలవుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కాల్ మనీ వ్యవహారం దర్యాప్తు నిర్వహించినప్పుడు అత్యంత భయానక విస్మయకర విషయాలెన్నో ఒక్కొక్కటికీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో బాధితులు కూడా ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ కీలక సమయంలో కాల్ మనీ గ్యాంగ్ పెద్దల తరఫున అధికార పార్టీ కీలక నేతలు జోక్యం చేసుకుని గౌతమ్సవాంగ్పై ఒత్తిళ్లు పెంచారు. విజయవాడలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎస్పీల సమీక్షా సమావేశం జరుగుతున్న సందర్భంగానే గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లడమన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, అధికారులెవరూ తలొగ్గరాదంటూ చెప్పుకొచ్చారు. అలా మాట్లాడి 24 గంటలు కూడా తిరక్కముందే కాల్ మనీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి కేసు దర్యాప్తు ప్రారంభించిన విజయవాడ కమిషనర్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. ఎస్పీల కాన్ఫరెన్స్ జరుగుతున్న సందర్భంగానే పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గౌతమ్ సవాంగ్ 15 రోజుల సెలవు కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. డీజీపీ రాముడు దాన్ని వెంటనే ఆమోదించడమే కాకుండా గౌతమ్ సవాంగ్ స్థానంలో ఏడీజీ ఆపరేషన్స్ విభాగం అధిపతి సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. -
గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ
-
నేను...ఆ టైపు కాదు!
విజయవాడ సిటీ : ‘కొత్తలో హడావుడి మామూలే అనుకోవడం పరిపాటి. నేను ఆ టైపు కాదు. ఒక్కొక్క విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. తద్వారా ప్రజలకు దీర్ఘకాలిక మేలు జరగాలనేది నా అభిప్రాయం. పోలీసులు అంతర్గతంగాను.. బహిర్గతంగా మారాలి. అప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్ సాధ్యం’ అంటూ నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం కమిషనరేట్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇక్కడ మోసగాళ్లు అధికంగా ఉన్నారనే విషయం గుర్తించినట్టు చెప్పారు. ‘వీరిని గట్టిగా నియంత్రించాలి. నిక్కచ్చిగా ముందుకు వెళుతుంటే ఆపాలంటూ ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వచ్చినంత మాత్రాన విధి విధానాలు మార్చుకోవడం కుదరదు’ అని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... పోలీసులు కనిపించాలి రద్దీ వేళల్లో రోడ్లపై పోలీసులు కనిపించాలి. అప్పడే ప్రజలకు పోలీసులు ఉన్నారనే భరోసా కలుగుతుంది. ముందు దీనిపై దృష్టి పెట్టాను. ఇప్పటికే రద్దీ వేళల్లో తిరగాలంటూ అందరికీ ఆదేశాలు జారీ చేశాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత రద్దీ వేళల్లో ఏంచేయాలనే దానిపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటిస్తాను. విటులను బయటకు లాగుతాం వ్యభిచార వృత్తిని ఉపేక్షించేది లేదు. మహిళలు, యువతులతో వ్యాపారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. పలు ప్రాంతాల్లో వ్యభిచార నిర్వాహకులు ఇళ్లను అద్దెకు తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించాం. ఆన్లైన్ ద్వారా విటులను రప్పించుకొని వ్యాపారం చేస్తున్నారు. వీరిని పట్టుకోవడంతో పాటు తరచూ వీరి వద్దకు వచ్చే విటులను కూడా బయటకు లాగి మీడియా సమక్షంలో వెల్లడిస్తాం. గుట్కాను తరిమి కొడతాం ప్రమాదకర క్యాన్సర్‌కు కారణమైన గుట్కాను నగరం నుంచి తరిమికొడతాం. గుట్కా మాఫియాకు సంబంధించిన ఆధారాలు కొంతవరకు సేకరించాం. మరికొంత సమాచారం రావాల్సి ఉంది. ఆపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో గుట్కా మాఫియాకు రుచి చూపుతాం. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసే డాక్యుమెంటు రైటర్లను వదిలేది లేదు. రాజధాని నేపథ్యంలో భూముల విలువలు భారీగా పెరిగాయి. ఒకే స్థలానికి ఒకటికి మించి డాక్యుమెంట్లు తయారుచేసేవారి సంఖ్య పెరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు తెలిసింది. భూ వివాదాల సమయంలో డాక్యుమెంట్లు నకిలీవని తేలితే తయారు చేసిన డాక్యుమెంటు రైటర్‌ను ప్రాసిక్యూట్ చేస్తాం. ఎవరి ప్రోద్బలంతో తప్పుడు డాక్యుమెంటు తయారు చేశారనేది నిర్ధారించి బాధితులకు న్యాయం చేస్తాం. అలసత్వం ఉపేక్షించను పోలీసు అధికారుల్లో అలసత్వాన్ని ఉపేక్షించను. స్టేషన్‌కి వచ్చే బాధితులతో మంచిగా మాట్లాడటం పోలీసుల బాధ్యత. ఇందుకు ఖర్చేముంటుంది? కచ్చితంగా స్టేషన్‌కి వచ్చేవారితో మంచిగా మాట్లాడి, చెప్పేది విని న్యాయం చేయాల్సిందే. ఇందుకు విరుద్ధంగా జరిగితే ఉపేక్షించేది లేదు. ఇప్పుడిప్పుడే దీనిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చాను. మారకుంటే మార్చేస్తాను. -
'మత్తయ్య నిందితుడని తెలియదు'
-
'మత్తయ్య నిందితుడని తెలియదు'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోట్ల కేసులో మత్తయ్య అనే వ్యక్తి కూడా నిందితుడు అన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అందుకే మత్తయ్య నేరుగా విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేసినా అతడిని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మత్తయ్య తమ ఆధీనంలో లేడని కూడా ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. మత్తయ్య నిందితుడైనా అతడు మీడియాతో మాట్లాడుతున్నా తన నివాసాన్ని ఎప్పటికప్పుడు మార్చడంతో అతడి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నామని ఓ దశలో పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ మత్తయ్య విజయవాడ వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఇంత జరిగినా.. మత్తయ్య నిందితుడన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ సీపీ చెప్పడం గమనార్హం.