విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబును నియమించారు. గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు.
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ గతంలో సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న సవాంగ్పై అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే కాల్ మనీ కేసు విచారణను మీరే చేపట్టాలంటూ బాధితులు విన్నవించడంతో ఆ తర్వాత సెలవును రద్దు చేసుకున్నట్టు సవాంగ్ చెప్పారు.
సెలవుపై వెళ్లిన సీపీ గౌతం సవాంగ్
Published Mon, Feb 1 2016 9:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement
Advertisement