Gautham sawaang
-
తిరుపతి: బాధ్యత పెంచి.. స్ఫూర్తి నింపి
-
కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
-
వారికోసం ప్రత్యేకంగా ఇద్దరు ఐఏఎస్‌లు!
సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతున్నారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఏపీ వారికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారన్నారు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వారు అక్కడే ఉండండి. ఎవరూ సొంత ప్రాంతాలకు రావాలని ప్రయత్నించవద్దు. అది మీకు, మీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. సతీష్ చంద్ర, పీయూష్ కుమార్ లను ఈ వ్యవహారాల కోసం సీఎం నియమించారు. దయచేసి ఎవరు సొంత ప్రాంతాలకు రావద్దని సీఎం ప్రత్యేకంగా కోరారు’ అని ఆయన తెలిపారు. ఇది చదవండి: ( చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి) ఇప్పటి వరకు భారతదేశంలో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ పీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. శనివారం రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కరోనాపై విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఆయన వెల్లడించారు. ఈ రోజు 22 మందికి పరీక్షలు నిర్వహిస్తే అన్ని నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఏపీలో విదేశాల నుండి వచ్చిన వారికి.. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. -
సెలవుపై వెళ్లిన సీపీ గౌతం సవాంగ్
విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబును నియమించారు. గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు. ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ గతంలో సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న సవాంగ్‌పై అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే కాల్ మనీ కేసు విచారణను మీరే చేపట్టాలంటూ బాధితులు విన్నవించడంతో ఆ తర్వాత సెలవును రద్దు చేసుకున్నట్టు సవాంగ్ చెప్పారు. -
గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ
కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్‌పై వేటు పడింది. కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పేర్లు ఎవరివీ బయటకు రాకూడదంటూ గత రెండు రోజులుగా గౌతమ్ సవాంగ్‌పై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలతో పాటు కీలక నేత నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన అంగీకరించలేదని తెలిసింది. దాంతో సెలవుల్లో వెళ్లాల్సిందిగా పై స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో విధిలేని పరిస్థితుల్లో పక్షం రోజుల పాటు సెలవుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కాల్ మనీ వ్యవహారం దర్యాప్తు నిర్వహించినప్పుడు అత్యంత భయానక విస్మయకర విషయాలెన్నో ఒక్కొక్కటికీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో బాధితులు కూడా ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ కీలక సమయంలో కాల్ మనీ గ్యాంగ్ పెద్దల తరఫున అధికార పార్టీ కీలక నేతలు జోక్యం చేసుకుని గౌతమ్సవాంగ్పై ఒత్తిళ్లు పెంచారు. విజయవాడలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎస్పీల సమీక్షా సమావేశం జరుగుతున్న సందర్భంగానే గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లడమన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, అధికారులెవరూ తలొగ్గరాదంటూ చెప్పుకొచ్చారు. అలా మాట్లాడి 24 గంటలు కూడా తిరక్కముందే కాల్ మనీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి కేసు దర్యాప్తు ప్రారంభించిన విజయవాడ కమిషనర్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. ఎస్పీల కాన్ఫరెన్స్ జరుగుతున్న సందర్భంగానే పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గౌతమ్ సవాంగ్ 15 రోజుల సెలవు కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. డీజీపీ రాముడు దాన్ని వెంటనే ఆమోదించడమే కాకుండా గౌతమ్ సవాంగ్ స్థానంలో ఏడీజీ ఆపరేషన్స్ విభాగం అధిపతి సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. -
గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ