surendra babu
-
TDP ఎమ్మెల్యే సురేంద్ర బాబుపై BJP నేత విశ్వనాథ్ రెడ్డి ఫైర్
-
Ananthapur: బాబుతోనే తాడోపేడో తేల్చుకుంటాం
కళ్యాణదుర్గం: ‘మేమేం పార్టీకి ద్రోహం చేయలేదు... నష్టమూ చేయలేదు. ఇన్నేళ్లు పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చాం. అలాంటిది పార్టీలో మాకే విలువ లేకుండా చేస్తారా? అసలు నీతో మాకేటి? తాడోపేడో చంద్రబాబుతోనే తేల్చుకుంటాం’ అంటూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఝలక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం యర్రంపల్లికి చేరుకున్న సురేంద్రబాబు... నేరుగా ఉన్నం హనుమంతరాయ చౌదరిని ఆయన ఇంటి వద్దనే కలిశారు. ఊహించని ఈ పరిణామంతో ఉన్నం ఒకింత అసహనానికి గురయ్యారు. అయినా సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని సురేంద్ర కోరారు. ఆ సమయంలో ఉన్నం మాట్లాడుతూ.. తామేమి తప్పు చేశామో చెప్పకుండా టికెట్ నిరాకరించిన అంశంపై నేరుగా చంద్రబాబుతోనే తేల్చుకుంటామని, ఆ తర్వాతే తమ నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో అమిలినేని నిరాశతో వెనుదిరిగారు. -
టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు చేదు అనుభవం
-
ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు అందాయి. కాగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. చేనేత జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్ బదిలీ అలాగే చేనేత, జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్ కూడా బదిలీ అయ్యారు. ఆయన సాధారణ పరిపాలన శాఖు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి జె.మురళికీ చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. -
ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎంతో చర్చల అనంతరం జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ...‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం మా భుజం తట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తొలి కేబినెట్లో అమలు చేయడం సంతోషం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి నిర్ణయం వెలుగులు నింపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జీవితాంతం రుణపడి ఉంటారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం వల్ల 55వేలమంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆర్టీసీ రూ.7కోట్లు అప్పుల్లో ఉంది. మా డిమాండ్లను ముఖ్యమంత్రి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు’ అని అన్నారు. కాగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)ను తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నియామకంపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. రెండు నెలల్లో ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేస్తారు. -
ముగిసిన చర్చలు.. సీఎంను కలిసిన అనంతరం ప్రకటన
సాక్షి, అమరావతి : ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో జేఏసీ నేతలు మంగళవారం జరిపిన చర్చలు ముగిశాయి. ఈ చర్చలు ఫలప్రదంగా సాగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మొదటి కేబినెట్ సమావేశంలో ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. సానుకూల వాతావరణం లోనే చర్చలు జరిగాయని, మొత్తం 26 అంశాలపై ఎంవోయూ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పీ. దామోదరరావు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తాము చేసిన 27 డిమాండ్లలో 26 డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యం సానుకూల స్పందించిందని, ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకునే డిమాండ్ ఒక్కటే మిగిలి ఉందని తెలిపారు. ఈ రోజు తప్పనిసరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తామని, ఆయనను కలిసిన అనంతరం సమ్మెపై ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీ హౌస్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు జేఏసీ నాయకులు ఎండీని కలిసి.. చర్చలు కొనసాగించారు. నిన్న అర్థరాత్రి వరకూ ఎండీ సురేంద్రబాబుతో జరిగిన చర్చలు సమస్యల పరిష్కార దిశగా సాగిన సంగతి తెలిసందే. 90శాతం వరకూ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందని జేఏసీ నాయకులు తెలిపారు. -
చంద్రబాబు బండారం బయటపెట్టాలి..
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీని ఎందుకు నష్టాల్లోకి నెట్టారంటూ ముఖ్యమంత్రిని ఆయన నిలదీశారు. ‘ఏటా రూ.650 కోట్ల నష్టాలు వస్తుంటే తమరు నియమించిన ఎండీ సురేంద్రబాబు ఏం చేసినట్లు?. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు బస్సులు సమకూర్చడంలో బిజీగా ఉన్నాడా?’ అని సూటిగా ప్రశ్నించారు. అనంతపురంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని మరణ మృదంగం మోగుతోందని, వేలాది కుటుంబాలు కర్ణాటకకు తరలిపోతున్నాయని, పశువులు, గొర్రెలు మేత లేక పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు. రెయిన్ గన్ల స్టోరీలు, నీటి గలగలలు, కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం వచ్చిందని ఎన్నాళ్లు మోసం చేస్తురని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ఇక చంద్రబాబు ప్రభుత్వ పోర్టల్‌లో పెట్టని రహస్య జీవోలన్నింటిని గవర్నర్ జోక్యం చేసుకుని బయటపెట్టాలని కోరారు. వదంల జీవోలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని, తన విమానం అద్దెలు, దొంగ చెల్లింపుల జీవోలన్నింటిని దాచి పెట్టారని, కొత్త ప్రభుత్వం ఏర్పడేలోగానే బాబు బండారం బయటపెట్టాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ చార్జీలు 30 శాతం పెంచాల్సిందే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చార్జీలను గత నాలుగేళ్లుగా పెంచలేదని, ఏడాదికి 7.5 శాతం చొప్పున మొత్తం 30 శాతం మేర చార్జీలు పెంచేందుకు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు పంపిస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ఎన్వీ సురేంద్రబాబు చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడ ఆర్టీసీ హౌజ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్షణ అవసరం కింద రూ.3,717.95 కోట్లను ప్రభుత్వం 2019–20 బడ్జెట్లో చేర్చి, సాయమందిస్తే తప్ప ఆర్టీసీ అప్పులు, నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏడాదికి రూ.650 కోట్ల నష్టాన్ని ఆర్టీసీ భరించాల్సి వస్తోందన్నారు. 2015–16లో సంస్థకు రూ.735 కోట్లు నష్టం రాగా, 2016–17లో ఈ నష్టం రూ.789 కోట్లకు చేరిందన్నారు. 2017–18లో రూ.1,209 కోట్ల మేర ఆర్టీసీ నష్టపోయిందని వివరించారు. ప్రతి కిలోమీటర్‌కు రూ.6.53 నష్టం ఆర్టీసీకి బ్యాంకు అప్పులు, ఇతరత్రా బకాయిలన్నీ కలిపి రూ.6,445 కోట్ల మేర ఉన్నాయని సురేంద్రబాబు వెల్లడించారు. పల్లెవెలుగు బస్సుల వల్ల రూ.1,409 కోట్ల నష్టం వస్తోందన్నారు. కాలం చెల్లిన బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపబోమని, 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నింటినీ మార్చాలంటే మొత్తం 1,666 కొత్త బస్సులు అవసరమవుతాయని తెలిపారు. ఇందుకు రూ.666 కోట్లు కావాలన్నారు. బస్సును నడిపితే కిలోమీటర్‌కు రూ.6.53 చొప్పున నష్టం వస్తోందని అన్నారు. మోటార్ వెహికల్(ఎంవీ) ట్యాక్స్‌ల రూపంలో ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,409 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. పొదుపు చర్యలతో ఆదాయం పెంచాం.. 2018–19లో ఆర్టీసీ 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) సాధించిందని సురేంద్రబాబు గుర్తుచేశారు. అంతర్గత పొదుపు చర్యల ద్వారా సంస్థ ఆదాయం పెంచామని చెప్పారు. 2018–19లో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ.554 కోట్ల సాయం అందిందని పేర్కొన్నారు. ఎంవీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, పల్లెవెలుగు బస్సుల వల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగులను తొలగించడం లేదని, పదవీ విరమణ తర్వాత ఖాళీలను భర్తీ చేయకుండా.. ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులపై ప్రతిరోజూ వారితో చర్చలు జరుపుతామని అన్నారు. రాజకీయ పార్టీల్లాగా ఓటర్లు తమకు ఓటేయరేమోనన్న ఆలోచనలతో కార్మిక సంఘాలతో ప్రతి అంశాన్ని తాము చర్చించలేమని సురేంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం కోరిన మేరకే బస్సులు కేటాయిస్తున్నామని, ఇందుకు గాను ఆర్టీసీకి డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగినా కచ్చితంగా చెల్లిస్తారని చెప్పారు. -
‘ప్రభుత్వ దృష్టికి కార్మిక సంఘాల సమస్యలు’
సాక్షి, విజయవాడ : సమ్మెకు వెళ్లే కార్మిక సంఘాలతో తాము చర్చలు జరుపుతామని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. ప్రభుత్వ దృష్టికి ఆయా సమస్యలను తీసుకవెళ్తామని, మార్చిలో జరిగిన ఒప్పందం విషయంలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని తెలిపారు. కార్మిక సంఘాలు సమ్మెకు సంబంధించిన నోటీసుల ఇచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్న విషయమూ తెలిసిందే. ఈ నెల 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మె తేదిని ప్రకటిస్తామని , ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
-
ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్ఆర్టీసీ) సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సమ్మె నోటీసుకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా మద్దతు ప్రకటించింది. ఈ నోటీసులో ఆర్టీసీ కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. 50 శాతం వేతన సవరణతో పాటు అలవెన్సులు వంద శాతం పెంచాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నోటీసులో పేర్కొన్నారు. సంస్థ నష్టాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ కార్మికుల పదవి విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలన్నారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజిల్‌పై రాయితీ ఇవ్వాలని, ఖాళీ ఉద్యోగాల భర్తీ, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ స్కీమ్ ఆపాలన్నారు. -
ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది
సాక్షి, విజయవాడ : ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని ఏపీఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులు నష్టాల్లో నడుస్తున్నా సామాజిక బాధ్యతతో తిప్పుతున్నామని తెలిపారు. గత రెండు నెలలుగా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టామని, సెలవుల్లో విషయంలో ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బందిని సమకూర్చామని పేర్కొన్నారు. దాదాపు 20,200 మందికి పెన్షన్లు పెండింగ్‌లో ఉన్న విషయం గుర్తించామన్నారు. కార్మికులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని, జూన్ నెలలో రిటైరయ్యే వారికి అదేరోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ఆదేశించానని సురేంద్రబాబు అన్నారు. పాత బకాయిలు క్లియర్ చేసే పనిలో ఉన్నాం.. పాత బకాయిలు క్లియర్‌చేసే పనిలో ఉన్నామని సురేంద్రబాబు తెలిపారు. కార్మికులను చార్జిమెమోలతో వేధించే విధానానికి స్వస్తి పలికి సరికొత్త విధివిధానాలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా వేళలు మార్చడంద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందన్నారు. విద్యార్థుల బస్‌పాస్‌లను నెలవారీ కాకుండా త్రైమాసికం, వార్షిక విధానానికి వెసులుబాటు కల్పించామన్నారు. రెండు వందల కోట్లతో 850 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, డిమాండ్ ఉన్న రోజుల్లో టికెట్ల ధరలు పెంచుతామని పేర్కొన్నారు. పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి భారంగా మారాయని, టికెట్ల ద్వారానే కాకుండా ఇతన మార్గాల ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఆర్టీసీ స్థలాల్ని వాణిజ్యపరంగా వినియోగంలోని తీసుకువస్తామన్నారు. -
సురేంద్రబాబుకా? అనురాధకా?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ఎంపికకు రేస్ ముందే మొదలైంది. డీజీపీ మాలకొండయ్య జూన్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో తదుపరి డీజీపీ ఎవరనేదానిపై పోలీస్‌శాఖలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నండూరి సాంబశివరావుకు రెండేళ్లపాటు పొడిగింపు ఇస్తున్నట్లు గతేడాది చివరివరకూ హడావుడి చేసిన చంద్రబాబు సీనియారిటీ ప్రాతిపదికన మాలకొండయ్యకు డీజీపీ పగ్గాలు అప్పగించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డీజీపీగా విధులు చేపట్టిన మాలకొండయ్య జూన్‌లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు మరో రెండేళ్లు పొడిగింపు ఇవ్వాలని ఇప్పటి నుంచే చంద్రబాబుకు కొందరు సిఫార్సు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ముక్కుసూటిగా వ్యవహరించే మాలకొండయ్యను ఎన్నికల సమయంలో కొనసాగిస్తే ఇబ్బంది పడతామని చంద్రబాబుకు మరో వర్గం నూరిపోస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్వీ సురేంద్రబాబును తెరమీదకు తెచ్చినట్టు చెబుతున్నారు. ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిజం ఫోర్స్)లో ఏడీజీగా ఉన్న సురేంద్రబాబుకు ఈ ఏడాది మార్చి 14న డీజీపీగా పదోన్నతి కల్పించారు. అంతేకాక, మార్చి 22న ఆర్టీసీ ఎండీ పగ్గాలు అప్పగించారు. ఇది.. మూడు నెలల తరువాత ఆయనను పోలీస్ బాస్ చేసేందుకేనన్న ప్రచారం ఆ శాఖలో విస్తృతంగా జరుగుతోంది. డీజీపీ ఎంపిక ఇక రాష్ట్రం ఇష్టం గతేడాది చివరలో డీజీపీ ఎంపిక కసరత్తు దశలోనే రాష్ట్ర ప్రభుత్వానికి తలబొప్పి కట్టిన సంగతి తెల్సిందే. చివరి నిమిషంలో పంపిన జాబితా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ పలుమార్లు తిప్పి పంపింది. దీంతో పంతానికిపోయిన చంద్రబాబు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని నియమించుకునేలా పోలీస్ చట్ట సవరణ చేశారు. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించిన వారే పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. దినేష్‌రెడ్డి, ప్రసాదరావు, సాంబశివరావు, మాలకొండయ్య ఆర్టీసీ ఎండీ నుంచి పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన వారే. అదే ఆనవాయితీకి కొనసాగింపుగా ఎన్నికల సమయానికి సురేంద్రబాబుకు డీజీపీ పగ్గాలు అప్పగిస్తారా? అనేది ఐపీఎస్‌లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవేళ సురేంద్రబాబుకు అవకాశం ఇవ్వకుంటే ఆయన భార్య, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఏదీ ఏమైనా సురేంద్రబాబు, అనురాధ పేర్లు ఇప్పుడు డీజీపీ రేసులో ముందువరుసలో ఉన్నాయి. కానీ, మాలకొండయ్య తరువాత సీనియర్లుగా ఉన్న వీఎస్కే కౌముది, వినయ్‌రంజన్ రే, ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్‌లు ఉన్నారు. కౌముది, వినయ్‌రంజన్ రేలు కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌పై ఉండగా.. ఏసీబీ డీజీగా ఠాకూర్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా సవాంగ్ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. కాగా, సీనియారిటీ కింద డీజీపీ పోస్టుకు ఠాకూర్, సవాంగ్‌లలో ఒకరిని సీఎం ఎంపిక చేస్తారా? లేక ఆనవాయితీ కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. -
ఏపీఎస్ఆర్టీసీ నూతన ఎండీగా సురేంద్ర
-
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఎండీగా ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబు నియమితులయ్యారు. 2001 నుంచి 2004ల మధ్య ఆయన విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేశారు. 2007లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందారు. 2006 నుంచి 2007ల మధ్య హైదరాబాద్ సిటీ అడిషనల్ పోలీసు కమిషనరేట్‌లో కో-ఆర్డినేషన్ విభాగంలో పని చేశారు. అంతకుముందు హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సేవలు అందించారు. ప్రస్తుతం ఆక్టోపస్(కౌంటర్ టెర్రరిజం ఫోర్స్) విభాగంలో అడిషనల్ డైరక్టరు జనరల్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉప్పలపాడులో ఆడ మృత శిశువులు
ఏ తల్లి కన్న కవలలో కానీ బొడ్డూడకుండానే వాగులో మృతశిశువులుగా కనిపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు సమీపంలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు...ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికివచ్చిన కొందరికి ఏడుమంగళంవాగు బ్రిడ్జి కింద ఉన్న నీటిలో తేలియాడుతూ ఇద్దరు ఆడశిశువుల మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని పోలీసులు సమాచారం అందించారు. రూరల్ ఎస్.ఐ.లు సురేంద్రబాబు, జె.సిహెచ్.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ఆస్పత్రుల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
సెలవుపై వెళ్లిన సీపీ గౌతం సవాంగ్
విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబును నియమించారు. గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు. ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ గతంలో సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న సవాంగ్‌పై అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే కాల్ మనీ కేసు విచారణను మీరే చేపట్టాలంటూ బాధితులు విన్నవించడంతో ఆ తర్వాత సెలవును రద్దు చేసుకున్నట్టు సవాంగ్ చెప్పారు. -
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
-
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారులోని ఆలూరు రోడ్డులో ఉన్న వీఎస్పీ అయిల్ మిల్లులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్ల మంటలు చెలరేగడంతో సుమారు రూ.50లక్షల విలువైన నూనె దగ్ధమైందని మిల్లు యజమాని సురేంద్రబాబు చెప్పారు. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐదు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు -
రూ.35 వేలు లంచంతో పట్టుబడ్డ ఎమ్మార్వో
చిత్తూరు : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మార్వో సురేంద్రబాబు ఏసీబీ అధికారులకు శుక్రవారం దొరికిపోయాడు. పట్టాదారుపాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న రైతును ఎమ్మార్వో రూ. 35 వేలు లంచం అడిగాడు. ఈ నేపథ్యంలో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శుక్రవారం ఉదయం పీలేరు ఎమ్మార్వో కార్యాలయంలో రైతు నుంచి రూ. 35 వేల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులు పన్నీన వలలో సురేంద్రబాబు చిక్కాడు. -
ఏపీ నిఘా చీఫ్‌గా అనురాధ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం తొలి అధిపతిగా సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీ ఏఆర్ అనురాధ(1987 బ్యాచ్) నియమితులయ్యారు. అనురాధ భర్త సురేంద్రబాబుతో పాటు మరో ముగ్గురు అదనపు డీజీ స్థాయి అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు(1989 బ్యాచ్) సీఐడీ విభాగాధిపతిగా పోస్టింగ్ ఇచ్చారు. శిక్షణ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఎన్వీ సురేంద్రబాబు(1987 బ్యాచ్)ను ఆపరేషన్స్ వింగ్‌కు బదిలీ చేసి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బాధ్యతలు అప్పగించారు.