ఏపీ నిఘా చీఫ్‌గా అనురాధ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం తొలి అధిపతిగా సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీ ఏఆర్ అనురాధ(1987 బ్యాచ్) నియమితులయ్యారు. అనురాధ భర్త సురేంద్రబాబుతో పాటు మరో ముగ్గురు అదనపు డీజీ స్థాయి అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు(1989 బ్యాచ్) సీఐడీ విభాగాధిపతిగా పోస్టింగ్ ఇచ్చారు. శిక్షణ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఎన్వీ సురేంద్రబాబు(1987 బ్యాచ్)ను ఆపరేషన్స్ వింగ్‌కు బదిలీ చేసి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బాధ్యతలు అప్పగించారు.