కర్నూలు జిల్లా ఆదోని శివారులోని ఆలూరు రోడ్డులో ఉన్న వీఎస్‌పీ అయిల్ మిల్లులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.
కర్నూలు జిల్లా ఆదోని శివారులోని ఆలూరు రోడ్డులో ఉన్న వీఎస్‌పీ అయిల్ మిల్లులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్ల మంటలు చెలరేగడంతో సుమారు రూ.50లక్షల విలువైన నూనె దగ్ధమైందని మిల్లు యజమాని సురేంద్రబాబు చెప్పారు. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐదు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు