kurnool district
-
కర్ణాటక బస్సు బీభత్సం.. నలుగురి మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ డే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
నూటొక్క దేవళాల శిల్పగిరి
∙సాహెబ్ జాన్, ఆలూరు రూరల్ఒకనాటి శిల్పగిరి గ్రామమే నేటి చిప్పగిరి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామంలో ఆనాటి కాలంలో నూటొక్క దేవాలయాలు ఉండేవి. నూటొక్క బావులు ఉండేవి. పురాతన ఆలయాలకు, చారిత్రక శిల్పకళా వైభవానికి నిలయంగా ఉండటంతో ఈ గ్రామానికి శిల్పగిరి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు చిప్పగిరిగా మారింది. ఆనాటి ఆలయాల్లో దాదాపు తొంభై శాతం కనుమరుగైపోగా, పది శాతం ఆలయాలు మాత్రమే ఇప్పటికి మిగిలి ఉన్నాయి.మిగిలి ఉన్న వాటిలో ఐదో శతాబ్ది నాటి దిగంబర జైన ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.ఇక్కడి ఆలయాల్లో భోగేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా వేసవిలో చిప్పగిరి గ్రామంలో పర్యాటకుల హడావుడి కనిపిస్తుంటుంది. ఇక్కడి పురాతన ఆలయాలను, చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.రాయల వంశానికి చెందిన గుండప్ప దేవర పదకొండో శతాబ్దంలో శిల్పగిరిని రాజధానిగా చేసుకుని, పరిపాలన సాగించాడు. ఆయన హయాంలోనే ఇక్కడ చెన్నకేశవ స్వామివారి ఆలయంతో పాటు మరో వంద ఆలయాలను నిర్మించారు. తాగునీటి కోసం నూటొక్క బావులు తవ్వించారు. గుండప్ప దేవర తదనంతరం రామరాయలు, బుక్కరాయలు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ భోగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా యాభై అడుగుల ఏకశిలా స్తంభాలతో రంగ మండపాన్ని నిర్మించారు. దీనినే ‘సభా సింహాసన కట్ట’ అంటారు.రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతంలో మరికొన్ని బావులను కూడా తవ్వించారు. తర్వాతి కాలంలో ఇక్కడ నీటి ఎద్దడి బాగా పెరిగింది. బావులలో నీరు ఇంకిపోయింది. గ్రామస్థులు చిప్పలతో నీళ్లు తోడుకునేవారు. అందువల్ల ప్రజలు చిప్పగిరిగా గ్రామానికి నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పాలన కొనసాగించలేక రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. పల్లవుల జైనాలయంపల్లవ రాజులు ఐదో శతాబ్ది కాలంలో ఇక్కడ జైన ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో దేశ పర్యటనకు బయలుదేరిన పల్లవ రాజులు మార్గమధ్యంలో ఈ గ్రామ పరిసరాల్లో విడిచి చేసి, కొంతకాలం గడిపారు. అప్పట్లోనే వారు ఈ గ్రామ శివార్లలో ఉన్న కొండపై కోటను నిర్మించుకున్నారు. అక్కడే ఏకశిలతో దిగంబర జైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలక్రమంలో కోట దెబ్బతినగా, కోట గోడలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.విజయదాసుల కట్టకర్ణాటకకు చెందిన విజయదాసులు పద్నాలుగో శతాబ్దిలో మాన్వి జిల్లాలో తుంగభద్ర తీరాన ఉన్న చిలకలపర్వి గ్రామంలో జన్మించారు. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసుకు శిష్యుడు విజయదాసులు. ఆయన ధ్యాన గానాలలో నిమగ్నమై, దేశమంతటా సంచరించేవాడు. ఒకసారి ఆయన చిప్పగిరిలోని పురాతన బావిలో దైవచింతనలో ఉండగా, బావిలో ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది. ఆయన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, రెండేళ్ల తర్వాత పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ నెలలో పదకొండు రోజుల పాటు విజయదాసుల కట్టలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి పురోహితులు ఈ ఆరాధనోత్సవాలకు తరలి వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు జరుపుతారు. వీటిని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. -
మల్లన్న భక్తులకు తప్పని నడక కష్టాలు
మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి భక్తులు కాలినడకన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని ఏటా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే శివ మాల ధరించిన భక్తులు తమ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుని నిష్టాగరిష్టులై స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న శివరాత్రి (MahaShivratri) ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం, దేవదాయశాఖ అధికారులు పాదయాత్ర భక్తులను మాత్రం విస్మరించినట్లున్నారు. జంగిల్ క్లియరెన్స్, తాగు నీటి ఏర్పాట్లను మొదలే పెట్టకపోవడంతో పాదయాత్ర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివయ్యా.. నీ చెంతకు చేరే దారేదయ్యా అంటూ లోలోనే మదన పడుతున్నారు.శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లాలనుకునే భక్తుల్లో చాలా మంది వెంకటాపురం మీదుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. 41 రోజులు కఠోర దీక్షలో ఉంటూ, శివనామస్మరణ చేస్తూ, నేలపై నిద్రించి అనునిత్యం శివ నామాన్ని జపించే శివమాలధారులు చివరిగా ఆ శివయ్యను చేరుకునేక్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజులకు పైగా భక్తుల రద్దీ కొనసాగే ఈ ఈ 45 కిలోమీట్ల నడక దారిలో జంగిల్ క్లియరెన్స్‌ను ఇటు శ్రీశైలం దేవస్థానం గానీ.. అటు అటవీశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. బొబ్బలెక్కిన కాళ్లకు... గుళక రాళ్లు మరింత అడ్డంకి వెంకటాపురం గ్రామం నుంచి కాస్త దూరం వెళ్లగానే నాగలూటి క్షేత్రం చేరుకుంటారు. ఈక్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిన్న దారి, గుబురుగా పెరిగిన చెట్ట కొమ్మలు, రాలిపడిన ఆకుల కింద ముళ్లు భక్తులకు ఇబ్బందిగా మారనున్నాయి. అక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుని ఎగువగట్టుకు వెళ్లేక్రమంలో ప్రతి ఐదు లేదా పది నిమిషాలకోసారి మల్లన్నా.. నీ దర్శనం ఎప్పుడంటూ నడవలేక ఆగిపోయే పరిస్థితులున్నాయి. అతికష్టమైనా మెట్లు ఎక్కే భక్తులకు. చెత్తచెదారం కాళ్లకు గుచ్చుకుంటే మాత్రం భరించలేదు. ఎలాగో కష్టపడి గట్టు దిగిన భక్తులకు పెచ్చెరువుకు చేరుకోవడం సులభమే. కానీ సాదులమఠం, సీతమ్మబావి, భీమునికొలను చేరే క్రమంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భీముని కొలనులోయలో పడే ప్రమాదముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అతి కష్టంపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని మరో చేత్తో కొండ గట్టును పట్టుకుని ఒక్కొక్కరుగా ముందుకుసాగాల్సిన దుస్థితి ఉంది. భీముని కొలను దిగగానే కైలాస ద్వారానికి వెళ్లే మెట్ల మార్గం మరో ఛాలెంజ్. ఆ తర్వాత కైలాస ద్వారం నుంచి హఠటకేశ్వరం క్షేత్రం చేరే సమయంలోనూ దారి అస్తవ్యస్తంగా ఉంది. ఇలా 45 కిలోమీటర్ల ప్రయాణంలో భక్తుల పాదాలకు గుచ్చుకునే పదునైన కొండరాళ్లు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నడిచి రావడంతో అప్పటికే బొబ్బలెక్కిన కాళ్లకు వెదురుబొంగులు, పదునై ఎర్రరాళ్ల కొస వల్ల మరింత కష్టంగా మారుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్లకు పైగా శివమాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి నడకమార్గం ఎప్పుడూ శుభ్రం చేయకపోవడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం దేవస్థానం అధికారులు తూతూ మంత్రంగా నిధులిస్తుండటంతో ఫారెస్టు అధికారులు కూడా అంతే రీతిలో పనులు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. కేవలం నాగలూటి క్షేత్రం వద్ద ఉన్న రెండు కోనేరులను శుభ్రం చేయడం, నాగలూటి వరకు అక్కడక్కడా వెదురుబొంగులు తొలగించడం మినహా.. రహదారి విశాలంగా చేయడం కానీ, నడక దారి భక్తుల కాళ్లకు గుచ్చుకోకుండా రాళ్లను తొలగించడం కానీ చేసిన దాఖలు లేదు. కాగా తాము నిధులిస్తున్నా.. అటవీ శాఖ దేనికి ఖర్చు చేస్తుందో చెప్పడం లేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి. – విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు తాగు నీరు ఏర్పాటు చేయాలి యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి. – సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం -
వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
-
పట్టుకు పెట్టింది పేరు ఎమ్మిగనూరు
∙పి.ఎస్. శ్రీనివాసులు నాయుడు, కర్నూలుభారతీయ మహిళల వస్త్రధారణలో చీరకు ఉన్న ప్రత్యేకత ఎన్నటికీ వన్నె తరగనిది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైన చీర ఇప్పుడిప్పుడే పాశ్చాత్యులనూ ఆకట్టుకుంటోంది. కాలం తెచ్చిన మార్పుల్లో చీరకట్టు కొంత వెనుకబడింది. ఆధునిక జీవనశైలి ఆదరాబాదరాగా మారడంతో మగువలు సులువుగా ధరించడానికి వీలయ్యే సల్వార్ కమీజ్‌లు, జీన్స్, టీ షర్ట్స్ వంటి దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల వేళల్లో మాత్రం పట్టుచీరల రెపరెపలు నిండుగా కనువిందు చేస్తున్నాయి. పట్టుచీరల డిజైన్లలోను, వాటి జరీ అంచుల తీరుల్లోను కొత్త కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి.దేశంలోని కొన్ని ప్రదేశాలు చేనేతకు చిరునామాలుగా తమ ప్రత్యేకతను ఇంకా నిలుపుకొంటూ వస్తున్నాయి. అలాంటి ప్రదేశాల్లో కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకటి. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు చేనేతకు పెట్టింది పేరు. విజయనగర సామ్రాజ్యకాలం నుంచే ఇక్కడ నిపుణులైన నేతగాళ్లు ఉండేవాళ్లు. తర్వాతి కాలంలో వనపర్తి సంస్థానాధీశులు, హైదరాబాద్ నవాబులు ఇక్కడి చేనేత వస్త్రాలను బాగా ఆదరించేవారు. స్వాతంత్య్రానికి మునుపే, 1938లో ‘పద్మశ్రీ’ మాచాని సోమప్ప ఇక్కడ ఎమ్మిగనూరు చేనేతకారుల సహకార సంఘాన్ని ప్రారంభించారు. ఇక్కడి చేనేతకారులు మగ్గాల మీద చీరలతో పాటు రుమాళ్లు, తువ్వాళ్లు, పంచెలు, దుప్పట్లు, దోమతెరలు వంటివి కూడా నేస్తున్నారు. తొలినాళ్లలో నూలు వస్త్రాలను నేసే ఇక్కడి చేనేతకారులు, 1985 నుంచి పట్టుచీరల నేత కూడా ప్రారంభించారు. శుభకార్యాల్లో పట్టుచీరలకే ప్రాధాన్యంచీరల్లో రకరకాల ఫ్యాషన్లు వస్తున్నాయి. పండుగలు పబ్బాలు, వేడుకలు, శుభకార్యాలలో సందర్భానికి తగిన చీరలు ధరించడానికి మగువలు ఇష్టపడుతున్నారు. ఇటీవలికాలంలో డిజైనర్ శారీలు, వర్క్ శారీలు ఫ్యాషన్‌గా కొనసాగుతున్నాయి. అయినా, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లో మాత్రం మహిళలు పట్టుచీరలకే ప్రాధాన్యమిస్తున్నారు. పట్టుచీరల తయారీకి మగ్గాలతో పాటు ఇటీవలి కాలంలో యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, పూర్తిగా మగ్గంపై నేసిన చేనేత పట్టుచీరలకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పట్టుచీరలతో పాటు సహజమైన రంగులతో నేసిన చేనేత నూలు చీరలను ధరించడానికి చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారు. సాధారణ జరీ నుంచి వెండి జరీ వరకు రకరకాల జరీ అంచుల పట్టుచీరలను నేయడంలో ఎమ్మిగనూరు చేనేతకారులు చక్కని నైపుణ్యం కనబరుస్తున్నారు. తగ్గిన చీర పొడవుఇదివరకటి కాలంలో తొమ్మిది గజాల చీరలు, ఏడు గజాల చీరలు, ఆరు గజాల చీరలు విరివిగా వాడుకలో ఉండేవి. కాలక్రమంలో చీరల పొడవు బాగా తగ్గింది. ఇప్పడు చీరల పొడవు ఐదు మీటర్లకే పరిమితమైపోయింది. ఇక వెడల్పు సుమారు 1.2 నుంచి 1.5 మీటర్ల వరకు ఉంటోంది. మగ్గం మీద పట్టుచీర నేయడానికి ఎంతో ఓపిక, శ్రమ, నైపుణ్యం అవసరం. వీటి నేతకు రెండు రకాల మగ్గాలను వినియోగిస్తుం టారు– చిన్న మగ్గాలు, పెద్ద మగ్గాలు. చిన్న మగ్గం మీద చీర నేయడానికి కనీసం నాలుగు రోజులు పడుతుంది. వెయ్యి రూపాయల కూలి దొరుకుతుంది. పెద్దమగ్గంగా చెప్పుకొనే జాకాట్ మగ్గం మీద చీర నేయడానికి నెల రోజులు పడుతుంది. ఒక చీర నేసినందుకు పన్నెండువేల రూపాయల వరకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసిన చీరలను మాస్టర్ వీవర్స్ గద్వాల్ చీరలు, ధర్మవరం పట్టుచీరలుగా బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్నారు.⇒ కర్నూలు జిల్లాలో చేనేత కుటుంబాలు 4,000⇒ ఉమ్మడి జిల్లాలో మగ్గాలు 10,000⇒ కర్నూలు నగరంలో వస్త్ర దుకాణాలు 700⇒ పట్టుచీరల రకాలు 10⇒ నగరంలో పట్టుచీరల గరిష్ఠ ధర రూ. 50,000⇒ గద్వాల పట్టుచీరల గరిష్ఠ విలువ రూ.25,000 -
టీడీపీ, జనసేన బాహాబాహి
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. తాజాగా గురువారం రాత్రి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. నియోజకవర్గంలోని డీలర్‌షిప్‌ల వాటాల విషయంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద గుమిగూడారు.నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నిర్వహిస్తున్న నిత్యావసర సరుకుల దుకాణాల డీలర్‌షిప్‌లను తొలగించి తమకు ఇవ్వాలని, ఈ విషయంపై తమ అధినేతలు జిల్లా కలెక్టర్, ఆ శాఖ మంత్రిని ఆదేశించారంటూ బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలానా డీలర్షిప్ తమకు కావాలంటే తమకు కావాలని రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆదోని టూటౌన్ పోలీసులు అక్కడకు వచ్చి రెండువర్గాలకు సర్ధిచెప్పి శాంతింపచేశారు. -
5 ఏళ్ల బాలుడి కిడ్నాప్
-
పల్లె టు దిల్లీ
‘ఇప్పుడు ఎందుకు లే...’ అని రాజీపడే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ‘ఎప్పుడు అయితే ఏమిటి!’ అనుకుంటూ ఉత్సాహంగా కార్యక్షేత్రంలోకి దిగేవాళ్లు ఎప్పుడూ విజేతలే. అలాంటి ఒక విజేత పెబ్బటి హేమలత. పెద్ద చదువులు చదవకపోయినా... పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది. హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ (ఫిష్ ఆంధ్ర) తో తన కలను నిజం చేసుకుంది. అత్యుత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డ్‌కు ఎంపికైంది. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ ‘ఆంధ్ర స్టోర్స్’ను ప్రోత్సహించింది. రూ.3.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. ఆరోజు మొక్కై మొలిచిన ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ఇప్పుడు చెట్టై ఎంతోమందికి నీడనిస్తోంది. ‘డొమెస్టిక్ మార్కెటింగ్’ విలువను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది...కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని సోమప్ప నగర్‌కు చెందిన హేమలత సాధారణ గృహిణి. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది తన కల. స్నాక్స్ (తినుబండారాలు)తో వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని ఆలోచించింది. కొంత మంది మహిళలతో కలసి చక్కిలాలు తయారు చేయటం మొదలు పెట్టింది. వాటిని పట్టణంలోని చిన్నచిన్న మిఠాయి కొట్లకు సరఫరా చేసేది. క్రమంగా నలభై మంది మహిళలతో కలసి వ్యాపారాన్ని విస్తరించింది. పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పించింది. చకిలాలతోపాటు చెగోడిలు, నిప్పట్లు, బులెట్లు, మసాలా వడలు, స్వీట్స్ వంటి పదిరకాల స్నాక్స్‌ను తయారు చేసి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, తెలంగాణ లోని ఐజ, గద్వాల వరకూ అంగళ్లకు సరఫరా చేస్తోంది. ప్రతి రోజు రూ.30 వేలకు పైగా స్నాక్స్‌ను తయారు చేయించి మార్కెట్ చేస్తోంది. తన దగ్గర పనిచేసే నలభై మంది మహిళలతో నాలుగు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది.ఎకో ఫ్రెండ్లీ నాన్ ఓవెన్ బ్యాగ్‌లు΄్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించిన హేమలత బ్యాంక్‌ల సహకారంతో రూ.50 లక్షలతో కాలుష్యరహిత నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ యూనిట్నుప్రారంభించింది. పది మంది వర్కర్స్‌తో ఈ యూనిట్‌ను నడుపుతోంది. 10–14 ఇంచుల సైజ్ మొదలు 16–21 సైజు వరకూ వివిధ రకాల బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి డి–కట్, డబ్లూ–కట్, బాక్స్‌టైప్, స్టిచ్చింగ్ బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. తమ దగ్గర తయారు చేసే నాన్ ఓవెన్ బ్యాగ్‌ల స్టిచ్చింగ్ పనిని పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళా టైలర్లకు ఇస్తూ వారికి వేతనాలు చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మాల్స్, స్టోర్స్‌కు సరఫరా చేస్తోంది. నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ టర్నోవర్ ఏడాదికి రూ. కోటి దాటిపోయింది. కోవిడ్ సమయంలో మాస్క్‌లు, ఆస్పత్రి మెటీరియల్స్‌ను తయారు చేయించి ఎంతోమందికి ఉపాధి చూపింది.దక్షిణాదిలో నెంబర్వన్ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహకాలందించేవారు. గత ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సహకార యోజన (పీఎంఎంఎస్వై)తో హేమలత ఎమ్మిగనూరులో రూ.50 లక్షలతో ఫిష్ ఆంధ్ర (హేమ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్) ను ప్రారంభించింది. ఫిష్ ఆంధ్ర నిర్వహణ లో దక్షిణాదిలోనే ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హేమలత ఎంతోమంది ఔత్సాహికులకు ‘ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్’గా స్ఫూర్తిని ఇస్తోంది.‘ఫిష్ ఆంధ్ర’కు రాష్ట్రపతి అవార్డు ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. రూ.20 లక్షలు సబ్సిడీ రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చగా, రూ.7.5 లక్షలు హేమలత సమకూర్చుకుంది. మిగిలిన రూ.42.50 లక్షలను బ్యాంక్ రుణంగా ఇచ్చింది. ‘ఫిష్ ఆంధ్ర లాంజ్..హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇరవై మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న ఈ యూనిట్ ద్వారా రోజుకు రూ.40–50 వేల వరకు వ్యాపారం సాగించే స్థాయికి చేరుకుంది. చిక్కీల నుంచి రెస్టారెంట్ వరకు ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ వందమంది ప్రత్యక్షంగా, మరో యాభై మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచింది హేమలత. సూపర్ సక్సెస్ అయిన ఈ యూనిట్‌ను కేంద్ర బృందం పలుమార్లు సందర్శించి అత్యుత్తమ యూనిట్‌గా గుర్తించింది. హేమలత రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. గర్వంగా ఉందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న అవార్డు అందుకోబోతున్నానన్న వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. సుమారు వందమందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది. పేదరిక నిర్మూలనకు, మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు అందిస్తున్నప్రోత్సాహం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ పథకాలు, నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. – పెబ్బటి హేమలత– గోరుకల్లు హేమంత్ కుమార్, సాక్షి, ఎమ్మిగనూరు, – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి. -
పుట్టింటి గోవు.. ఆ ఇంటికి ఆదరువు
కుమార్తెకు పెళ్లిచేస్తే.. తోడుగా గోవును సాగనంపడం కొన్ని కుటుంబాల్లో ఆచారం. ఆస్తిపాస్తులు లేని గ్రామీణ పేదలు ఇలా గోవును కట్నంగా సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆ నూతన వధూవరులిద్దరూ కట్నంగా వచ్చిన గోవును వరంగా భావించి.. దానిలోనే మహాలక్ష్మిని చూసుకున్నారు.పుట్టింటి కానుకతో మెట్టినింట కాసుల పంటగా మలుచుకున్నారు. ఆ గోవుతో ఏకంగా 150 ఆవుల పాడిని సృష్టించారు. నలుగురు పిల్లల పెళ్లిళ్లు మంద ఆదాయంతోనే కానిచ్చారు. కరువు సీమలో ఒక్క ఆవుతో కరువును జయించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అయ్యమ్మ, వీరారెడ్డి కుటుంబం. – మంత్రాలయంఆ ఇంట అదే కామదేనువుకర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన మూకయ్య, బంగారమ్మ దంపతుల పెద్ద కుమార్తె అయ్యమ్మ. ఆమెకు 18వ ఏట కోసిగి గ్రామానికి చెందిన కామన్‌దొడ్డి వీరారెడ్డితో వివాహం నిశ్చయించారు. మూకయ్య స్థోమతకు తగ్గట్టు అయ్యమ్మకు కట్నంగా గోవును ఇవ్వాలని నిర్ణయించి సుమారు 30 ఏళ్ల క్రితం పెళ్లి బాజాలు మోగించారు. అప్పగింతల రోజున తండ్రి మూకయ్య ఓ పెయ్యి ఆవును అయ్యమ్మకు ఇచ్చి భర్తతో మెట్టినింటికి సాగనంపాడు. అయ్యమ్మ, వీరారెడ్డి అనుబంధం వరకట్నంగా వచ్చిన ఆవుతోనే మొదలైంది. గోవునే వరలక్ష్మిగా భావించి.. కూలీనాలి చేసుకుంటూ ఆ దంపతులిద్దరూ గోవును పెంచుకున్నారు. తొలి చూడిలోనే అది మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. ఇలా ఏడాదికి రెండు ఆవుల చొప్పున జన్మించగా.. పుట్టిన ఆవుల సంతతిని విక్రయించకుండా కుటుంబ పోషణకు వనరుగా ఆ దంపతులు మలచుకున్నారు. కూలి పనులు మానేసి పశువులను పోషించుకుని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చారు. ఇలా 30 ఏళ్లలో ఆవుల సంతతి 150కి పెరిగింది. వారింట అడుగుపెట్టిన గోవు సుమారు 16 ఏళ్ల క్రితం మరణించగా.. దాని సంతతి మాత్రం ఇప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంది.వలసబాట పట్టకుండా..ఏటా వయసు మళ్లిన ఆవులు, దూడలను విక్రయిస్తూ అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులు బాగానే కూడబెడుతున్నారు. ఏటా 10 టన్నులకు పైగా ఆవు పేడను సైతం రైతులకు విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతుల వద్ద 50 గోవులు ఉన్నాయి. కోసిగి ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఇక్కడ వ్యవసాయ పనులు ముగియగానే ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి బతుకు బండి నడుపుకుంటారు. ఏటా ఎంత లేదన్నా 15 వేల కుటుంబాలకు పైగా ఇక్కడి నుంచి వలస వెళ్తారు. అయితే, అయ్యమ్మ కుటుంబం ఏ ఒక్కరోజు వలసబాట పట్టలేదు. పాడితో కరువును జయించడం ఎలాగో అయ్యమ్మ కుటుంబానికి చూస్తే బోధపడుతుంది.ఊపిరి ఉన్నంత వరకు వదలనుమా అయ్యకు మేం ఐదుగురు కూతుళ్లం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్న ఓ ఆవును కట్నంగా ఇచ్చాడు. తోబుట్టువులు నలుగురికి ఒక్కో ఆవును కట్నంగా ఇచ్చాడు. నేను అదే ఆవుతోనే జీవితం ఆరంభించాను. ఊపిరి ఉన్నంతవరకు పాడి పోషణను వదలను. నేను తనువు చాలించినా పాడిని వదల పెట్టవద్దని నా పిల్లలకు చెబుతాను. గోవులు లేకుంటే మా బతుకు ఎలా ఉండేదో ఊహించలేను. – కామన్‌దొడ్డి అయ్యమ్మ, కోసిగిఎప్పుడూ ఇబ్బంది పడింది లేదుఅత్తమామలు ప్రేమతో ఆవును కట్నంగా ఇచ్చారు. దానిని మేం దైవంగా స్వీకరించాం. ఆవు పోషిస్తూ పాడిని పెంచాం. ఏనాడూ పాడి పోషణలో విసుగు చెందలేదు. ఇబ్బంది పడింది కూడా లేదు. ఇద్దరం పాడిని చూసుకుంటూ సంసారం కొనసాగించాం. మేం ఇప్పటివరకు కరువును చూడలేదు. ఇక్కడి నుంచి ఎంతోమంది వలసపోతున్నారు. మేం మాత్రం ఏ రోజూ వెళ్లలేదు. మా మామ మూకయ్య నేటికీ మా ఆదర్శ జీవనంపై ఆనందం వ్యక్తం చేస్తాడు. – కామన్‌దొడ్డి వీరారెడ్డి, కోసిగిపైసా అప్పు లేకుండా పెళ్లిళ్లుఅయ్యమ్మ, వీరారెడ్డి దంపతులకు రాముడు, ఈరయ్య, వీరభద్ర, మహేష్, కుమార్తె రామేశ్వరమ్మతో కలిపి ఐదుగురు సంతానం. పెద్ద కుమారుడు రాముడికి 20వ ఏట వివాహం జరిపించారు. ఆ పెళ్లికి రూ.30 వేలు ఖర్చు కాగా.. మందలో కొన్ని దూడలను విక్రయించి గట్టెక్కారు. రెండో కొడుకు ఈరయ్యకు 21వ ఏట వివాహం జరిపించగా.. రూ.50 వేలు ఖర్చయ్యింది. దీంతో కొన్ని ఆవులు, దూడలను విక్రయించారు. మూడో కొడుకు వీరభద్ర పెళ్లికి రూ.1.50 లక్షలు ఖర్చు కాగా.. అందుకు కూడా లేగ దూడలను అమ్మి శుభకార్యం జరిపించారు. నాలుగో కుమారుడు మహేష్‌కు రెండేళ్ల క్రితం వివాహం చేయగా.. రూ.3 లక్షలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని కూడా కొన్ని దూడల్ని విక్రయించి సొమ్ము సమకూర్చుకున్నారు. ఇక ఒక్కగానొక్క కూతురు రామేశ్వరమ్మకు సంబంధాలు వెతుకుతున్నారు. -
‘‘నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం’’
కర్నూలు, సాక్షి: కూటమి ప్రభుత్వంలో ఉండడం ఏమోగానీ.. అధికార మదంతో రోజుకొకరు వార్తల్లో నిలుస్తున్నారు. తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలే చేశారు.కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం. నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కల్యాణ్ చెప్పినట్లే. ఎవరైతే ఇన్నాళ్లూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్లంతా ఉన్నపళంగా వదలేసి వెళ్లిపోవాలి. .. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడాల్లాంటివి ఉండవు. వాళ్లంతా లబ్ధి చేకూర్చేవన్నింటిని విడిచిపోవాలి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. లేకుంటే లెక్క మరోలా ఉంటుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసి.. ‘ఇక నుంచి ఇవి మావే’ అంటూ ప్రకటన చేశారు. దీంతో రేషన్ డీలర్లు షాక్‌కు గురయ్యారు.‘‘ఎన్టీఆర్ హయాం నుంచి ఆ రేషన్ షాపులను తామే నడుపుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా లాగేసుకోవడం ఏంటని, తమ షాపులు లాకుంటే తాము రోడ్డున పడుతామంటూ’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహం భావంతో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
సీఐ ఓవరాక్షన్.. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసు ప్రవర్తన
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ నోరు పారేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న సచివాలయం దగ్గరికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీవు ఎవరు మాకు చెప్పడానికంటూ మాజీ ఎమ్మెల్యేపై సీఐ దురుసుగా వ్యవహరించారు. పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎన్నికలను రాజకీయాలకతీతంగా నిర్వహించాల్సి ఉండగా సంఘాల్లో కేవలం టీడీపీ మద్దతుదారులు ఉండాలనే లక్ష్యంతో అధికారులను రంగంలోకి దింపింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఎన్నికలు అంతా ఏకపక్షంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 123 నీటి వినియోగదారుల అసోసియేషన్లు, 10 డిస్ట్రిబ్యూటరీ, 2 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, కేసీ కెనాల్, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని మేజర్ చెరువుల కింద భూములు ఉన్న ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ఎన్నికలకు కూటమి పార్టీ నేతలు రాజకీయ రంగులద్దారు. -
జింక చర్మాల అక్రమ రవాణా
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజాగ్రహం
-
యురేనియం వార్.. కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత
కర్నూలు, సాక్షి: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.చదవండి: రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్! -
కొద్ది గంటల్లో పెళ్లి.. సినీ ఫక్కీలో పెళ్లి కూతురు జంప్
-
కర్రల సమరం.. జన సంద్రంగా దేవరగట్టు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు జనసంద్రంగా మారింది. బన్ని ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం ఊరేగింపుతో బన్నీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా కర్రల సమరం సాగనుంది. కర్ణాటక, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య
మద్దికెర: ప్రేమించుకుని, కలిసి జీవించాలనుకున్న ఓ జంట... ఇంట్లో పెద్దలను ఒప్పించే ధైర్యం లేక రైలు కిందపడి అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటన కర్నూలు జిల్లా, మద్దికెర రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతాప్‌సింగ్, ఉమ 20 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లుకు చేరుకొని పానీపూరి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తె మీనూ(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతాప్‌సింగ్ మధ్యప్రదేశ్‌కే చెందిన కుల్దీప్ పరిహార్ (23) అనే యువకుడిని పనిలో పెట్టుకున్నాడు. మీనూ, పరిహార్ ఇద్దరూ ప్రేమించుకోవడం, విషయం ఇంట్లో తెలియడంతో పరిహార్‌ను పనిలో నుంచి తొలగించారు. గుంతకల్లులోనే ఆ యువకుడు మరోచోట పానీపూరి బండి పెట్టుకొని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు. ఇటు అమ్మాయితో ప్రేమను కొనసాగించాడు. విషయం ఇంట్లో వారికి తెలిసి మరోసారి గట్టిగా మందలించడంతో భయంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి మద్దికెరకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న నోట్‌బుక్‌లో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తామే చనిపోతున్నామని హిందీలో రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రైతు పొలంలో ‘వజ్రం’ పండింది
సాక్షి, కర్నూలు: జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు బయటపడుతున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన సమాచారం.సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు..కాగా, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. -
కర్నూలు : మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రుడి మహారథోత్సవం (ఫొటోలు)
-
‘లోకేష్, అనితా.. నిజాలు తెలుసుకొని మాట్లాడండి’
కర్నూలు, సాక్షి : నిజాలు తెలుసుకోకుండా మంత్రులు నారా లోకేష్, అనితా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయలేదు. టీడీపీ పార్టీ నేతల వర్గా విబేధాలుతోనే ఈ హత్య జరిగింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే కేయి శ్యాం బాబు, మంత్రి బురద జల్లే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. హోసూరులో జరిగిన హత్యను తప్పు పుట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. హోసూరు గ్రామంలో జరిగిన ఘటనలో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా మా పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. -
కర్నూలులో భగ్గుమన్నకూటమి నేతల విబేధాలు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా కూటమి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్థసారథికి వార్నింగ్ ఇచ్చారు. ‘అభివృద్ధిపై ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో అబద్దాలు చెప్పారు. ఆయన గెలవక ముందు ఒకటి.. గెలిచిన తరువాత మరొక్క మాట మాట్లాడుతూన్నారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఓట్లు వేస్తేనే గెలిచి.. ప్రస్తుతం అదే టీడీపీ కార్యకర్తలను మరిచారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీని దూరంగా ఉంచడం పద్ధతి కాదు. ఇలాగే కొనసాగితే త్వరలో నిర్ణయాలు వేరుగా ఉంటాయి. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సమన్వయంతో పని చేస్తాను’ అని అన్నారు.ఆదోని కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీనాక్షి నాయుడు ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. ‘ఆదోని టీడీపీలో 5 వర్గాలు ఉన్నాయి. బీజేపీలో కాని జనసేనలో కాని వర్గాలు లేవు. అందరిని సమన్యాయం చేసుకుంటూ పోతున్నాను. మీనాక్షినాయుడు తన మాటే వినాలని చెబుతున్నారు. నేను ఎమ్మెల్యేని అబద్ధాలు మాట్లాడే అవసరం నాకు లేదు. ఏది మాట్లాడినా అన్ ద రికార్డు.. ఆఫ్ ద రికార్డ్‌కి తావే లేదు. టీడీపీ పార్టీలో ఐదు వర్గాలు ఉన్నాయి. ఎవరిని పట్టించుకోకూడదు తన మాటే నడవాలి అనడం మీనాక్షి నాయుడుది ఒంటెద్దు పోకడ. ఐదు వర్గాలని కలుపుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్లని అన్యాయం చేసింది మీనాక్షి నాయుడే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని అన్నారు. -
మనోడే.. పోస్టింగ్ ఇచ్చేయండి
కర్నూలు: రకరకాల సిఫారసులు, భారీ పైరవీలతో కర్నూలు రేంజ్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు పోస్టింగులు దక్కించుకున్నారు. వన్‌సైడ్‌గా పనిచేస్తామని చెప్పడమే కాకుండా పోస్టుకు తగినట్లుగా సమర్పించుకున్న వారికి కుర్చీలు దక్కాయన్న చర్చ జరుగుతోంది. కర్నూలు రేంజ్ పరిధిలో 35 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 13 మందికి, నంద్యాల జిల్లాలో 9 మందికి కలిపి 22 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది.రెడ్‌బుక్ స్క్రీనింగ్‌తో సీఐల జాబితా విడుదలఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ సీఐల జాబితాను రెడీ చేసి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సమర్పించారు. అన్ని అర్హతలు పరిశీలించి వారం రోజుల క్రితమే జాబితా పోలీస్ హెడ్ క్వార్టర్‌కు చేరింది. అయితే తీవ్ర ప్రతిష్టంభన తర్వాత రెడ్ బుక్ స్క్రీనింగ్‌తో జాబితా విడుదలైనట్లు కొంతమంది పోలీసు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వారికి ప్రజాప్రతినిధుల లేఖలు చాలా వరకు పనిచేశాయి. సమర్థులైన పోలీసు అధికారులు స్టేషన్లో ఉంటే శాంతిభద్రతల పరిరక్షణ సవ్యంగా సాగుతుందన్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియనిదేమీ కాదు. అయితే అధికార పార్టీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన కొందరు గ్రూపుగా ఏర్పడి రేంజ్ పరిధిలో పోస్టింగుల వ్యవహారంలో చక్రం తిప్పారనే చర్చ జరుగుతోంది. కర్నూలు పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లు ఉండగా కర్నూలు టూటౌన్‌కు సీసీఎస్‌లో ఉన్న జి.వి.నాగరాజరావును నియమించి అక్కడున్న సీఐ ఇంతియాజ్ బాషాను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే కర్నూలు ఎస్హెచ్ఆర్సీలో పనిచేస్తున్న బి.రామకృష్ణ కడప వన్‌టౌన్‌కు బదిలీ అయ్యారు. -
చదువుల తల్లికి ఎంత కష్టం
సాక్షి, కర్నూలు జిల్లా: చదువుకోవాలని ఆశ ఉన్నా.. అందుకు కుటుంబ పరిస్థితులు సహకరించడం లేదు. దీంతో ఆ బాలిక వారంలో నాలుగు రోజులు పనికి వెళ్తోంది. మూడు రోజులు బడికి వెళ్తూ శ్రద్ధగా చదువుకుంటోంది. గోనెగండ్ల మండలం చిన్నమరివీడు గ్రామానికి చెందిన బోయ సింధు.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు బోయ పార్వతి, బోయ గోవిందులకు ఇల్లు తప్ప ఏమీ లేదు. వీరు రోజూ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉండటంతో వీరికి తోడుగా సింధు పొలం పనులకు వెళ్తోంది. తాము చాలా పేదరికంలో ఉన్నామని, బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు బిడ్డపై బెంగగా ఉంటుందని బోయ పార్వతి, గోవిందు తెలిపారు. బిడ్డ చదువుకు ఇబ్బంది లేకుండా అధికారులు కేజీబీవీలో సీటు ఇప్పించాలని వీరు కోరుతున్నారు. -
ఆగని టీడీపీ విధ్వంసాలు
సాక్షి నెట్వర్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంస చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇష్టారీతిన వ్యవహరించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంçÜం చేశారు. వీఆర్వో కుటుంబంపై దాడిచేశారు. » పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలోని గ్రామ సచివాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని శనివారం రాత్రి విరగ్గొట్టారు. విగ్రహం ధ్వంసంపై వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నాయకుడు కానాల పుల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోగుల అంజిబాబు, నేతలు చిమటా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి అయ్యప్ప, షేక్ దమ్మాలపాటి బుజ్జి, గంటా శ్రీనివాసరావు, షేక్ మస్తాన్‌వలి, ఇందూరి వెంకటరెడ్డి, మహంకాళిరావు, జయరావు, బి.రాజు కోరారు. » ఏలూరు జిల్లా దెందులూరులోని లైబ్రరీ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతుల్ని విరగ్గొట్టారు. ఈ విధ్వంసంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. » కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామ వీఆర్వో తిరుపాల్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. వీఆర్వో కథనం మేరకు.. మండలంలోని తిమ్మందొడ్డి గ్రామ ఎస్సీ కాలనీలో వీఆర్వో తిరుపాల్ తన కుటుంబంతో నివాసముంటున్నారు. అదే గ్రామంలో బీసీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వీఆర్వో కుటుంబసభ్యుల్ని కులం పేరుతో దూషించి, కించపరిచారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపాల్ భార్య దేవమ్మ తిట్టిన వారిని ప్రశి్నంచడంతో ‘ఎస్సీ కులానికి చెందినదానవు, నీవు మా ఇళ్ల దగ్గరకు వస్తావా..’ అంటూ మరోసారి దూషించారు. అంతటితో ఆగకుండా ఇంటిమీదకు వెళ్లి తిరుపాల్, దేవమ్మ దంపతులపైన, వారి కుమారుడు జానుపైన దాడిచేశారు. తమపై టీడీపీకి చెందిన పెద్దశేషన్న కుమారుడు హరి, ముత్యాలు కుమారులు వెంకన్న, గిడ్డయ్య, గౌరన్న కుమారుడు హరి దాడిచేసినట్లు వీఆర్వో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కలి్పంచి, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వో కోరారు. ఈ విషయమై ఎస్.ఐ. తిమ్మరెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై తనకు సమాచారం వచి్చందని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
టీడీపీ అరాచకం.. వైఎస్సార్సీపీ దళిత మహిళా కార్యకర్త హత్య
సాక్షి, కర్నూలు జిల్లా: అధికార మదంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు ఆగడం లేదు. ఆదోని మండలం నాగనాతన హల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త గుండమ్మను హత్య చేశారు. దళిత మహిళ గుండమ్మ పొలంలో పని చేసుకుంటుండగా టీడీపీ నేత రాగప్పరెడ్డి... ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. పొలం విషయంలో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. దళిత మహిళ గుండమ్మను హత్యచేసి పరారయ్యారు.పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఆగడాలు మితిమీరి పోతున్నాయి. టీడీపీ నేతల వేధింపులకు ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బలయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. నెల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్‌ను టీడీపీ నేతలు వేధిస్తుండగా, ఫిల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
కొనసాగుతున్న విధ్వంసకాండ
కృష్ణగిరి/నాగలాపురం/నల్లజర్ల/జలదంకి: టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్ విగ్రహాలను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన శిలాఫలకాలను పనిగట్టుకుని పగులగొడుతున్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కృష్ణగిరిలోని బస్టాండ్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. విగ్రహం తల, చెయ్యి తొలగించారు. ఆదివారం ఉదయం దీన్ని చూసిన స్థానికులు నాయకులకు సమాచారం ఇచ్చారు.ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయకులు కటారుకొండ మాధవరావు, శివ, వెంకటేశ్వర్లు, ఎరుకలచెర్వు ప్రహ్లాద, వెంకటరాముడు, అమకతాడు బాలు, మాధవస్వామి, కృష్ణగిరి జయరామిరెడ్డి, హుసేన్‌సాహెబ్, బాలమద్ది తదితరులు ఈ చర్యను ఖండించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని గోవర్ధనగిరి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న వైఎస్సార్సీపీ శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వీటి ప్రారంభోత్సవ సమయంలో ఈ శిలాఫలకాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనతో గ్రామంలో అలజడి రేగింది. టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ధ్వజమెత్తారు. దీనిపై గోవర్థనగిరి వైఎస్సార్సీపీ సచివాలయ కన్వీనర్ మునిశేఖర్ పిచ్చాటూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల సచివాలయం–1 పరిధిలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి నవరత్న పథకాలు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. 26 రోజులుగా సాగుతున్న దాడులు, దాష్టీకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక పాలనలో ఉన్నామా అని సందేహం కలుగుతోందని గ్రామ సర్పంచ్ బండి చిట్టి, ఉప సర్పంచ్ నక్కా పండు ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై మానవ హక్కుల కమిషన్ తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిలాఫలకంపై పేర్లు తొలగింపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాళెంలో 2023లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, పంచాయతీ భవనం రీ మోడలింగ్ తదితర పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలతో చేపట్టింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లను ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.ఆదివారం గ్రామంలోని టీడీపీ నాయకులు ఈ శిలాఫలకంలో అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు వారికి నచ్చని పేర్లను పచ్చ పెయింట్‌తో తుడి చేశారు. శిలాఫలకం దిమ్మెలకు కూడా పచ్చ పెయింటింగ్ వేశారు. పంచాయతీ భవనం గోడపై సీబీఎన్ అని రాశారు. గతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేరు మాత్రం తొలగించలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
Kurnool Diamond: కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన వజ్రం
కర్నూలు: తొలకరి చినుకులు పడగానే కర్నూలు జిల్లా మద్దికెర, తుగ్గలి మండలాల్లో వజ్రాల వేట మొదలవుతోంది. దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి ఇక్కడ వజ్రాలు వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రైతులు తమ పొలాలు సాగు చేసేటప్పుడు కూడా వజ్రాలు లభ్యమవుతుంటాయి. శనివారం మద్దికెర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేస్తుండగా రూ.5లక్షలు విలువైన వజ్రం దొరికింది. అలాగే మదనంతపురం గ్రామానికి చెందిన మరో రైతుకు రూ.15 లక్షలు విలువైన వజ్రం లభించింది. ఈ రెండు వజ్రాలను పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
కోడుమూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... ఆదోనిలోని బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు బుధవారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఆదోనికి బయలుదేరింది. కోడుమూరు వద్ద లారీని ఓవర్టేక్ చేసేందుకు డ్రైవర్ అతివేగంగా వెళ్లే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమను రక్షించాలని హాహాకారాలు చేశారు.కోడుమూరు సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ బాలనరసింహులు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగులగొట్టి గాయపడినవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మి (13), సురేష్ కుమార్తె గోవర్దనీ(9) మరణించారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన వీరిద్దరూ తమ మేనత్త కృష్ణవేణితో కలిసి ఆదోనికి బస్సులో వెళుతూ గాఢ నిద్రలోనే కన్నుమూశారు. హైదరాబాద్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులకు చెందిన కృష్ణవేణి, పుష్పావతి, మౌనిక, అశోక్, భారతి, గౌస్‌మొహిద్దీన్, పినిశెట్టి లక్ష్మి, వెంకటరెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బోయ శకుంతల, శివరాముడు, లక్ష్మి, గణేష్, అశోక్‌కుమార్‌లతోపాటు మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 అంబులెన్స్‌లలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
వాన పడింది..వజ్రాల వేట షురూ..
-
అవినీతి శ్రీశైలం కొండంత
శ్రీశైలం మల్లన్న సాక్షిగా... కర్నూలు జిల్లాకు చెందిన ఈ టీడీపీ నేత నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. నైతికంగా దిగజారిపోయాక నాకేంటి సిగ్గన్నట్టు అవినీతికి తెగించేశారు. పాలు తాగి రొమ్ము తన్నేసిన ఈ నేత చంద్రబాబు 23 సంఖ్యలో భాగస్వామి. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, నమ్మిన పారీ్టకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ పంచన చేరిపోయారు. తన నియోజకవర్గాన్ని అవినీతికి అడ్డాగా మార్చేశారు. రోడ్లు, డ్రైన్లు, ఎర్రమట్టి తవ్వకాలు, నీరు–చెట్టు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు... ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలం కొండంత. తన మాట వినని వారిపై దాడులు, బెదిరింపులకు పాల్పడడం అతనికి అతి సాధారణం. సాక్షి, టాస్క్‌ఫోర్స్: తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఈ నేత ఇంట్లో సిరుల వర్షం కురిసింది. ప్రధానంగా నీరు– చెట్టు పనులు ఈ నేతకు కల్పతరువులా మారాయి. ప్రతి పనికి 10 నుంచి 15 శాతం కమీషన్లు చెల్లిస్తేనే పనులు మంజూరు అయ్యేవి. నీరు–చెట్టు పనులకు మండలానికి రూ.50 కోట్లు మంజూరయ్యేవి. ఆత్మకూరు, బండి ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాల్లో ఈ పనులు చేయాలంటే ఈ నేతకు కప్పం కట్టాల్సిందే. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా సార్ గారికి నచ్చదు. ఇతన్ని కాదని అధికారులు ముందుకు వచ్చే వారు కాదు. ఒక్క నీరు–చెట్టు పనుల్లోనే దాదాపు రూ.30 కోట్ల మేర దండుకున్నారు. నాసిరకం పనులు...ఆత్మకూరు మండలంలో ఈ అవినీతి తారస్థాయికి చేరింది. కురుకుంద, ముష్టపల్లి, సిద్ధపల్లి, కృష్ణాపురం తదితర గ్రామాల్లో దాదాపు రూ.60 కోట్లకు పైగా పనులు జరిగాయి. రైతుల పచ్చని పొలాల్లో పంటలను ధ్వంసం చేసి రహదారులు ఏర్పాటు చేశారు. సిద్ధపల్లి గ్రామంలో సాగులో ఉన్న వరి, మిరప, ఆముదాలు లాంటి పంటలను ప్రొక్లెయిన్లతో ధ్వంసం చేసి మట్టి రోడ్లు నిరి్మంచారు. కళ్ల ముందర చేతికి వచి్చన పంటలను నాశనం చేయొద్దని రైతులు అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకుని బతిమాలినా ఏమాత్రం చలించలేదు. కురుకుంద గ్రామంలో చెరువు పూడిక తీత పనుల్లో అనుమతికి మించి మట్టిని కొల్లగొట్టి రూ.10 లక్షల బిల్లులు మంజూరు చేయించుకున్నారు. అదే చెరువులో మరోసారి పూడిక తీసి మరికొన్ని లక్షలు దండుకున్నారు. 👉 వెలుగోడు మండలంలో ఈ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒకరు రూ.10 లక్షల పనికి లక్షకు రూ.15 వేల చొప్పున కమీషన్ వసూలు చేశారు. పంట పొలాలకు వెళ్లే రహదారులు, పంట కాల్వల్లో పూడిక తీత పనులు, మట్టి రోడ్ల మరమ్మతులు, తెలుగు గంగ పరిధిలో రాస్తా పనులు, కేసీ కెనాల్ పరిధిలో చేపట్టిన ప్రతి పనిలోనూ కమీషన్లు దండారు. 👉 బండి ఆత్మకూరు మండలంలో రూ.50 కోట్లకు పైగా పనులు మంజూరు అయ్యాయి. కేసీ కెనాల్, కుందు ఆయకట్టు రోడ్ల అభివృద్ధి పేరుతో నిధులు మంజూరు చేయించుకొని దాదాపు 20 నుంచి 30 శాతం కమీషన్లు వసూలు చేశారు. కుందు నది వెడల్పు 50 మీటర్లు ఉంటే మొత్తం పూడిక తీసినట్లు కొలతలు వేసి బిల్లులు స్వాహా చేశారు. మద్దిలేరు, పోతుల వాగు, సంకలవాగు, అభివృద్ధి పనులు కూడా తూతూ మంత్రంగా చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 👉 మహానంది మండలంలో సీసీ రోడ్లు, ఎర్రమట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఖజానాను గుల్ల చేశారు. రహదారులు, చెరువులు, కుంటల పూడికతీతకు రూ.11.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు చేసిన స్థానిక టీడీపీ నాయకులు తమ నేతకు 15 నుంచి 20 శాతం ముడుపులు చెల్లించారు. గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి తరలింపులో స్థానిక ఎమ్మెల్యే 60 శాతం, అప్పటి జిల్లా మంత్రిగా ఉన్న నేత 40 శాతం మేర డబ్బులు పంచుకున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. అన్ని అర్హతలున్నా రెండు నెలల మొత్తం ముందుగా ఇస్తేనే పింఛను మంజూరు చేస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు బహిరంగంగానే వసూలు చేశారు. ఆదరణ పథకం కింద కుల వృత్తి దారులకు సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే వాషింగ్ మిషన్లు, ఇతర పరికరాలపై కూడా కమీషన్లు వసూలు చేశారు. నాటి పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుందని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు. క్రిమినల్ కేసులు ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్నాయి. బెదిరింపులు, దాడులు తదితర నేరాలపై ఐపీసీ 504, 506 సెక్షన్ 155(3), ఐపీసీ 143, 341, 149, 324, 506, 34, సీఆర్పీసీ 151 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. -
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
-
సర్కారు చేయూత.. చదువుల తల్లి కల సాకారం
ఆదోని రూరల్/ఆస్పరి: చదువుల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న ఆ బాలికను పేదరికంతో తల్లిదండ్రులు చదువు మానిపించారు. ఆ చదువుల తల్లి పదో తరగతిలో 537 మార్కులు సాధించినా.. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా.. ఆ ర్థిక పరిస్థితుల రీత్యా చదువుకు దూరమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ఆమెకు వరమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గతేడాది జూన్‌లో బాలిక ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తాను చదువుకుంటానంటూ బాలిక ఆయనకు మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలికను కర్నూలు జిల్లా ఆస్పరి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో చేర్పించారు. అడుగడుగునా ప్రభుత్వ ప్రోత్సాహం అందించడంతో తాజాగా విడుదలైన మొదటి ఏడాది ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 421 మార్కులు సాధించి ఆ బాలిక టాపర్‌గా నిలిచింది. ‘కార్పొరేట్ కళాశాలల్లో చదివితేనే ఎక్కువ మార్కులు’ అనే అపోహను తుడిచిపెట్టేసి ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి అత్యుత్తమ మార్కులను సొంతం చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది చదువుల తల్లి నిర్మల. కూలి పనుల నుంచి కాలేజీకి పంపిన ప్రభుత్వం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు హనుమంతమ్మ, శీనప్ప దంపతులకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు. నాలుగో కుమార్తె నిర్మలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించారు. పదో తరగతిలో 600కి 537 మార్కులు సాధించి నిర్మల సత్తా చాటింది. అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదివించేందుకు నిర్మల తల్లిదండ్రులకు ఆ ర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో ఆమెను చదువు మానిపించి తమతోపాటే కూలిపనులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలోనే ఉన్న నిర్మల ‘సార్ నేను చదుకుంటాను. నాకు సీటు ఇప్పించండి. మా అమ్మానాన్నలు పేదవాళ్లు. డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి’ అని వేడుకుంది. చలించిపోయిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంటనే ఆమెను కాలేజీలో చేర్పించాలని అప్పటి ఎంపీడీవో గీతావాణి, తహసీల్దార్ వెంకటలక్షి్మని ఆదేశించారు. మరోవైపు నిర్మలపై ‘సాక్షి’లో కథనం రావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నిర్మలను తన కార్యాలయానికి పిలిపించారు. నిర్మల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పి ఆమెను ఆస్పరి కేజీబీవీలో చేర్పించారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రూపాయి కూడా ఫీజు కట్టకుండానే నిర్మల చదువుకుంది. అంతేకాకుండా ఆమెకు మెటీరియల్, పుస్తకాలను కూడా కలెక్టర్ అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓవైపు చదువుల్లోనే కాకుండా మరోవైపు ఆటల్లోనూ నిర్మల రాణిస్తోంది. గతేడాది కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది. ఈ క్రమంలో నిర్మలను జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ కావాలన్నదే నా జీవిత ఆశయం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సృజన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కలెక్టర్ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. నా చదువుకు మేడమ్ అన్నివిధాల సహకరిస్తున్నారు. ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. – నిర్మల, విద్యా ర్థిని చాలా గర్వంగా ఉంది.. నిర్మల ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది.. పాఠ్యాంశాలపై ఆసక్తి చూపుతోంది. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రూపకల్పన చేసిన పంచతంత్ర ప్రోగ్రామ్ ద్వారా డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. నిరంతర మూల్యాంకనంతోపాటు విద్యార్థుల సందేహలను నివృత్తి చేస్తున్నాం. ఈ టెస్ట్‌ల్లో నిర్మల మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉంది. – శారున్ స్మైలీ, ప్రిన్సిపాల్, కేజీబీవీ, ఆస్పరి, కర్నూలు జిల్లా -
కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్
సాక్షి, పల్నాడు జిల్లా: మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేయడానికి వైఎస్సార్సీపీలో చేరేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సీఎం పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. టీడీపీ, బీజేపీని వదిలి ఆ పార్టీల కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీకి చెందిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్, తదితరులు వైఎస్సార్సీపీలోకి చేరారు. అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. -
కర్నూలు : హోరాహోరీగా పిడకల సమరం (ఫొటోలు)
-
ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు: సిద్ధార్థ్ రెడ్డి
-
సేవలు తొలగి.. వేదన మిగిలి!
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు.కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్‌దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు.. రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్‌లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్‌్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి తావులేకుండా పథకాల అమలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు. ఉసురు తగులుతుంది ‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్‌దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు. –కౌతాళం కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు. – కోసిగిభయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం. – అనిల్, చెరుకులపాడు స్వచ్ఛందంగా సేవలు అందించాం ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. – ప్రేమ్‌కుమార్, చెరుకులపాడు రాజీనామాతో బుద్ధి చెబుతాం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది. – వీరయ్య ఆచారి, కొసనాపల్లి బాధ కలిగించింది నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం.– విజయ్ రాజ్‌కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు -
సేవలు తొలగి.. వేదన మిగిలి!
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు. కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్‌దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు.. రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్‌లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్‌్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి తావులేకుండా పథకాల అమలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు. ఉసురు తగులుతుంది ‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్‌దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు. –కౌతాళం కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు. – కోసిగి భయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం. – అనిల్, చెరుకులపాడు స్వచ్ఛందంగా సేవలు అందించాం ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. – ప్రేమ్‌కుమార్, చెరుకులపాడు రాజీనామాతో బుద్ధి చెబుతాం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది. – వీరయ్య ఆచారి, కొసనాపల్లి బాధ కలిగించింది నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం. – విజయ్ రాజ్‌కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు -
ఓటుతోనే ప్రజల తలరాత మారుతుందన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో మార్పును కొనసాగించేందుకు ఓటు వేయాలని పిలుపు.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, రాతనలో ప్రజలతో ముఖాముఖి...ఇంకా ఇతర అప్డేట్స్
-
కదం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు
4 వ రోజు స్టార్ క్యాంపెయినర్లతోసీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ పలు ఫొటోలను ట్వీట్ చేశారు. ‘నాలుగో రోజు మేమంతా సిద్ధం యాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో..’ అంటూ పేదలతో మమేకమైన ఫొటోలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ ఫొటోలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి, అమరావతి (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డనైన నాకు అండగా నిలవండి. మీరే నా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి. జరిగిన మంచిని ఇంటింటా వివరించాలి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కదం తొక్కుతున్నారు. నాలుగో రోజు శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగిన బస్సు యాత్రలోని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. యాత్రలో ఆద్యంతం ప్రజల నుంచి ఘన స్వాగతం లభించడంతో పాటు, మండుటెండను సైతం లెక్క చేయకుండా ముసలిముతక, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం కర్నూలు జిల్లా రాతన వద్ద బస శిబిరంలో పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా ముఖ్యనేతలు సీఎం జగన్‌ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం 10.30 గంటల ప్రాంతంలో శిబిరం నుంచి యాత్రను ప్రారంభించారు. రాతన గ్రామంలో భారీ గజమాలతో, ఆనందోత్సాహాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఊరంతా∙రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరి వైఎసార్సీపీ ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేశారు. అనంతరం ఇదే జిల్లా తుగ్గలికి చేరుకున్న సీఎం జగన్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో గడిచిన ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేసిన మంచిని సీఎం వివరించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో మాట్లాడారు. జాతీయ రహదారి పొడవునా జనమే జనం గుత్తి పట్టణంలో రోడ్‌షో తర్వాత బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్44)పై మిడుతూరు, పామిడి, కల్లూరు, గార్లదిన్నె మీదుగా సీఎం అనంతపురం చేరుకున్నారు. గుత్తి నుంచి అనంతపురం వరకూ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు మండలాల గ్రామాల్లోని ప్రజలు రోడ్డు మీదకు చేరుకున్నారు. దీంతో ప్రతి పాయింట్ వద్ద సీఎం జగన్ బస్సు ఆపి ప్రజలకు అభివాదం చేశారు. పామిడిలో వేల మంది జనం జాతీయ రహదారి మీదకు చేరుకుని సీఎం జగన్‌కు తమ మద్దతు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గ ప్రజలు కల్లూరులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతపురం పట్టణంలోని రాజీవ్‌కాలనీ, తపోవనం ప్రజలు, నాయకులు అతిపెద్ద గజమాలలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు అనంతపురం చేరుకోవాల్సి ఉండగా 9 గంటలు దాటాక చేరుకున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తీరడంతో ఉదయం నుంచే నిర్దేశించిన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా యాత్ర కొనసాగింది. అయినపటగ్పటికీ ప్రజలు ఏ మాత్రం విసిగి పోకుండా అభిమాన నేతను కలవడానికి ఓపికతో వేచిచూశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావులేకుండా సంక్షేమ ఫలాలను తమ దరిచేర్చడంతో పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్‌ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతపురంలో రోడ్‌షో అనంతరం రాప్తాడు, ఎస్కేయూ మీదుగా శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం వరకు యాత్ర చేరుకుంది. రాత్రి 10.30 గంటలకు రాప్తాడు చేరుకుంది. అప్పటికే రోడ్డుపై ఉన్న వేల మంది జనాలు జై జగన్ నినాదాలతో సీఎంపై అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగింది. నాలుగోరోజుబస్సు యాత్రకు అపూర్వ స్పందన కర్నూలు (సెంట్రల్)/తుగ్గలి: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అభిమానం పోటెత్తింది. పల్లె పల్లెలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా పూల స్వాగతంతో అభిమానం చాటుకున్నారు. భారీ క్రేన్లతో గజమాలలు వేసి ఉప్పొంగిపోయారు. నాలుగో రోజు బస్సు యాత్ర పత్తికొండ నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం 10.32 గంటలకు సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి యాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.25 గంటలకు అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె పొలిమేర్లలోకి చేరుకోవడంతో కర్నూలు జిల్లాలో యాత్ర ముగిసింది. తుగ్గలిలో ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ప్రజల సమస్యలు విన్నారు. సలహాలు స్వీకరించారు. బస్సు యాత్ర సాగిందిలా.. ♦ ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమా మహేశ్వర నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లికార్జున్‌తోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి సీఎం వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ♦ ఉదయం 10.32 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు పత్తికొండలో ప్రారంభం. ♦ 10.50 గంటలకు రాతనలో అపూర్వ స్పందన. భారీ క్రేన్ ద్వారా సీఎంకు గజమాల వేసి పూల బాట పరిచారు. ♦ 11.20 గంటలకు మాజీ ఎమ్మెల్యే, దివంగత తమ్మారెడ్డి కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. తమ్మారెడ్డి పెద్ద కుమారుడు ప్రతాపరెడ్డి, సోదరుని కుమారుడు ప్రహ్లాదరెడ్డి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న తమ్మారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి, కోడళ్లు రంగమ్మ, విజయలక్ష్మి, అరుణమ్మలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డితో మాట్లాడారు. ♦ 11.46 గంటలకు తుగ్గలి సమీపంలో ప్రజలతో ముఖాముఖి. ♦ మధ్యాహ్నం 1.29 గంటలకు గిరిగెట్లలో ప్రజల ఘన స్వాగతం. ♦ 1.49 గంటలకు జొన్నగిరిలో పూల వర్షం. తమ గ్రామ సమీపంలోని చెరువును హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో నింపాలని విన్నపం. ♦ 2 గంటలకు ఎర్రగుడిలో సీఎం జగన్ కాన్వాయ్‌పై పూల వర్షం. ♦ 2.25 గంటలకు అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశం. ♦ రాత్రి 11 గంటలకు బస శిబిరానికి చేరుకున్న సీఎం జగన్ గుత్తిలో జన సునామీ తుగ్గలిలో ముఖాముఖి అనంతరం తిరిగి బస్సు యాత్ర ప్రారంభమై జొన్నగిరి, ఎర్రగుడి మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. మిట్ట మధ్యాహ్నం భానుడి ప్రతాపాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడికి ప్రజలు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర బసినేపల్లి, గుత్తి ఆర్‌ఎస్‌ల మీదుగా గుత్తి పట్టణానికి చేరుకుంది. బసినేపల్లి నుంచి గుత్తి పట్టణం వరకూ ఇసుకేస్తే రాలనంతగా జనం యాత్రలో మమేకం అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే శనివారం సాయంత్రం గుత్తి పట్టణం జన సునామీని తలపించింది. అశేషమైన జనం కదలి రావడంతో సీఎం జగన్ రోడ్ షో కాన్వాయ్ ముందుకు చాలా నెమ్మదిగా కదిలింది. గుత్తి రైల్వే బ్రిడ్జ్ నుంచి ఎన్‌హెచ్ 44 మధ్య 7 కి.మీ దూరం రెండు గంటలకు పైగానే రోడ్‌షో కొనసాగింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. -
టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలను తిప్పికొట్టడానికి రాష్ట్ర ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు... ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగం...ఇంకా ఇతర అప్డేట్స్
-
లక్షల గళాల గర్జన
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ ఎమ్మిగనూరు వేదికగా లక్షలాది గొంతుకలు సింహగర్జన చేశాయి. పొత్తులు.. జిత్తులు.. మోసాలు.. కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుఇవ్వడంతో లక్షల మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. చంద్రబాబు లాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధం... మీరంతా సిద్ధమైతే సెల్ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయాలని సీఎం జగన్ కోరడంతో ఒక్కసారిగా లక్షల మంది సెల్ఫోన్లలో టార్చ్ లైట్ వెలిగించడంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో కనిపించిన దృశ్యాలివీ.. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని ఎమ్మిగనూరు సభ మరోసారి చాటిచెప్పిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది ప్రతీకగా నిలిచిందని అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర జైత్రయాత్రను తలపించింది. గురువారం పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం జగన్ రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు సిటీ, పాణ్యం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఎన్నికల్లో విజయానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించి రామచంద్రాపురం మీదుగా కోడుమూరుకు చేరుకున్న సీఎం జగన్‌కు భారీ గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోడుమూరులో సీఎం జగన్ రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో సాగుతున్నంత దూరం బస్సు ముందు చిన్నారులు కోలాటమాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి సీఎం జగన్‌పై బంతి పూలవర్షం కురిపించారు. చేనేత కార్మికులు చీరను, మగ్గాన్ని బహూకరించి సీఎం జగన్‌కు మద్దతు పలికారు. బుడగ జంగం సామాజికవర్గ ప్రజలు సీఎం జగన్‌ను కలిసిసంఘీభావం తెలిపారు. కురుబ సామాజికవర్గానికి చెందినవారు సీఎం జగన్‌కు మేకను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోడుమూరు నుంచి హంద్రీ కైరవాడి చేరుకునే సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఎండను లెక్క చేయకుండా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి సీఎం జగన్‌పై పూలవర్షం కురిపిస్తూ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధమంటూ... నినదించారు. గోనెగండ్లలోనూ సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు. ఎమ్మిగనూరులో జన సునామీ.. భోజన విరామం అనంతరం రాళ్లదొడ్డి నుంచి బయలుదేరిన సీఎం జగన్ బస్సు యాత్రకు ఎర్రకోటలో జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ బస్సుపై బంతిపూలవర్షం కురిపించారు. షెడ్యూలు ప్రకారం బస్సు యాత్ర ఎమ్మిగనూరుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, ప్రజలు అడుగడుగునా నీరాజనాలుపలకడంతో రెండుగంటలు ఆలస్యంగా 5.30 గంటలకు చేరుకుంది. సీఎం జగన్ ఎమ్మిగనూరుకు చేరుకునేసరికి కర్నూలు జిల్లా నలుమూల నుంచి లక్షల సంఖ్యలో జనవాహిని తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 11 గంటల నుంచి ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మొదలైన జనప్రవాహం సాయంత్రం 4.30 గంటలకు సునామీని తలపించింది. 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు, ఇరువైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మిగనూరు చరిత్రలో సీఎం జగన్ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జననేత కోసం నిరీక్షణ.. ఎమ్మిగనూరు సభ రాత్రి 7.20 గంటలకు ముగిసింది. అనంతరం బస్సుయాత్ర హనుమాపురం చేరుకుంది. సీఎం జగన్‌ను చూసేందుకు అవ్వతాతలు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. సీఎం జగన్ రాగానే బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హనుమాపురం నుంచి ఆస్పరి చేరుకునే సరికి రాత్రి 8.30 గంటలైంది. బస్సు యాత్ర అక్కడికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. జన నీరాజనాల మధ్య చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా రాతన వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి రాత్రి 9.47 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజక వర్గాల్లో సాగిన బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ బైపాస్ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉప్పొంగిన భావోద్వేగం ఐదేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేయడంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి పేదరికాన్ని రూపుమాపడం, రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫొటోతోపాటు సంతకం చేసిన లేఖను ఇంటింటికీ పంపిన చంద్రబాబు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోభృతిగా ఇస్తానని, చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ చేస్తానని, అర్హులందరికీ మూడు సెంట్ల భూమి ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తాననే ముఖ్యమైన హామీలతోపాటు 650 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా వంచించటాన్ని ప్రస్తావించినప్పుడు లక్షల మంది ప్రజలు ఔనంటూ.. చేతులు ఎత్తి ఏకీభవించారు. ఇప్పుడు మళ్లీ అదే పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలతో సూపర్ సిక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, వాటిని ఎదుర్కొని పేదల భవిష్యత్తును మరింతగా గొప్ప మార్చేందుకు వైఎస్సార్సీపీని గెలిపిచేందుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో మేమంతా సిద్ధమే.. అంటూ లక్షల గొంతుకలు ప్రతిస్పందించాయి. శింగనమలలో ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు వైఎస్సార్సీపీ టికెట్ ఇస్తే చంద్రబాబు ఎద్దేవా చేసి తన పెత్తందారీ పోకడలను రుజువు చేసుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. పేదవాడు పైకి ఎదిగితే ఎందుకంత మంట? అని నిలదీశారు. మడకశిరలో ఈర లక్కప్ప అనే ఉపాధి కూలీకి టికెట్ ఇచ్చామని, దాన్ని కూడా ఎద్దేవా చేస్తావా బాబూ? అని ప్రశ్నించారు. ‘‘నా...’’ అంటూ అక్కున చేర్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 200 శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో వంద సీట్లు ఇచ్చామని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పేదల పార్టీ కాబట్టే సగం సీట్లు ఇచ్చామన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవహేళన చేయడంతోపాటు తోకలు కత్తిరిస్తానంటూ బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు తోకను కత్తిరించేలా తీర్పు ఇవ్వాలని సీఎం జగన్ పిలుపునిచ్చి నప్పుడు మేమంతా సిద్ధమే అంటూ లక్షల గొంతుకలు నినదించాయి. -
పల్లెల్లో అపూర్వ ఆదరణ
కర్నూలు (సెంట్రల్): మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ఎదురు చూశాయి. మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 108 కిలోమీటర్ల మేర సాగింది. శుక్రవారం ఉదయం 10.35 గంటలకు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడులో రాత్రి బస చేసిన శిబిరం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర పత్తికొండ మండలం రాతన వరకు కొనసాగింది. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తిగా రాత్రి వేళ సాగినా ప్రజలు వైఎస్ జగన్ రాక కోసం నిరీక్షించారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దల నుంచిపిల్లల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మూడో రోజు యాత్ర సైడ్‌లైట్స్ ♦ ఉదయం 9.30 గంటలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, డాక్టర్ జె.సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం వైఎస్ జగన్‌ను పెంచికలపాడు శిబిరంలో కలిశారు. ♦ 10.35 గంటలకు పెంచికలపాడులోని రాత్రి బస శిబిరం నుంచి సీఎం వైఎస్ జగన్ బయటకు వచ్చి బస్సు ఎక్కారు. అక్కడ భారీగా వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ♦ 11.35 గంటలకు సీఎం జగన్ కోడుమూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వేలాది మంది ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. ♦ 11.38 గంటలకు సీఎంకు కోడుమూరులో చేనేతలు మగ్గం, నేసిన చీరను బహూకరించారు. గొర్రెల పెంపకందారులు గొర్రె పిల్లలను అందించి తమ అభిమానం చాటుకున్నారు. ♦ 11.45 గంటలకు కోడుమూరులో బుడగ జంగాలు తమకు ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా, వచ్చే ప్రభుత్వంలో ప్రాధాన్యతగా తీసుకుంటామని సీఎ జగన్ హామీ ఇచ్చారు. ♦ 12.20 గంటలకు కోడుమూరు మండలం వర్కూరుకు బస్సు యాత్ర చేరుకుంది. ♦మధ్యాహ్నం 1.15 గంటలకు సీఎం బస్సుయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగొండ్ల మండలం వేముగోడుకు చేరుకోగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకా ఘన స్వాగతం పలికారు. ♦ 1.59 గంటలకు సీఎం జగన్ బస్సు యాత్ర గోనెగండ్ల చేరుకోగా, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. ♦ 2.30 గంటలకు సీఎం జగన్ భోజన విరామం కోసం గోనెగండ్ల మండలం రాళ్లదొడ్డిలో ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకున్నారు. ♦ సాయంత్రం 4 గంటలకు గోనెగండ్ల మండల మాజీ ఎంపీపీ కేవీ కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరగా, ఆయనకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ♦ భోజన విరామం అనంతరం సాయంత్రం 4.30గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. ♦ సాయంత్రం 5.45 గంటలకు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం జగన్ చేరుకున్నారు. ♦ రాత్రి 7.14 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామానికి సీఎం జగన్ చేరుకోగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ♦ 7.25 గంటలకు ఎమ్మిగనూరు మండలం అరెకల్కు, అక్కడి నుంచి 8.15 గంటలకు ఆదోని క్రాస్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ♦ 8.20 గంటలకు ఆదోని నియోజకవర్గం విరుపాపురం చేరుకున్నారు. ♦ 9 గంటలకు ఆలూరు నియోజవకర్గం బిణిగేరి మీదుగా ఆస్పరి చేరుకున్నారు. ♦ 9.30 గంటలకు చిన్నహుల్తి మీదుగా పత్తికొండ బైసాస్ చేరుకోగా నేతలు అపూర్వ స్వాగతం పలికారు. ♦ రాత్రి 9.47 గంటల సమయంలో పత్తికొండ మండలం రాతన సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. నేడు తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి 4వ రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బస్సు యాత్ర సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగనుంది. బస్సు యాత్ర నాలుగో రోజు షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం రాత్రి వెల్లడించారు. పత్తికొండలో రాత్రి బస చేసిన ప్రదేశం నుంచి సీఎం జగన్ శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుని ఉదయం 10 గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి.. గుత్తి శివారులో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి మీదుగా సంజీవపురం శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
కోడుమూరు Day-3 : నీతోనే జనం.. నీదేగా జయం (ఫొటోలు)
-
పేదల తలరాతలు మార్చే ఎన్నికలివి : సీఎం వైఎస్ జగన్
సాక్షి, నంద్యాల : వైఎస్సార్సీపీ 58నెలల పాలనలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోయాయని, ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మారాయి. సర్కారు స్కూళ్లలో డిజిటల్ బోధన వచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతూ పేదవాడికి ఆరోగ్య పరీక్షలతోపాటు మందులు కావాలన్నా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నాం’ అని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలను అందజేస్తున్నామన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆళ్లగడ్డలోని రాత్రి బస ప్రాంతం నుంచి గురువారం ఉదయం మొదలైంది. అక్కడి నుంచి సీఎం జగన్ ఉదయం 11 గంటల సమయంలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని రైతులు, వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని మాట్లాడారు. ప్రతి అక్కచెల్లెమ్మ తమ సొంత కాళ్లమీద నిలబడేలా రుణాలు, ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నాం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ దిశ యాప్ తీసుకొచ్చాం. ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలను నిమిషాల వ్యవధిలో ఆదుకుంటున్నాం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశామని గొప్పలు చెప్పుకునే వారు ఏ రోజూ కనీసం ఆలోచన చేయని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల వ్యవధిలో గొప్ప మార్పులు తెచ్చాడు. వ్యవస్థల్లో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను గమనించండి. ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయండి. దేవుడి దయవల్ల ఇంత మంచి చేయగలిగాం. వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మీరు సలహాలు ఇవ్వవచ్చు. అందరికీ ఓ విన్నపం.. ఎన్నికల కోడ్ కారణంగా పథకాలకు ఆటంకం తలెత్తకుండా ఈ మధ్య కాలంలో ఈబీసీ నేస్తం, చేయూత బటన్లు నొక్కాం. ఇది వరకు వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కోడ్ కారణంగా పది రోజులు అటు ఇటుగా పథకాల లబ్ధి నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవుతుంది. దీని గురించి ఆందోళన చెందవద్దు. చిన్న పిల్లాడు చేసిన పనులు..మీరెందుకు చేయలేదు? నేను చాలా చిన్న పిల్లాడిని. మన ప్రభుత్వం కంటే ముందు మీరు చాలా ప్రభుత్వాలను చూశారు. నాకన్నా వయసులో పెద్దోళ్లు, ఎంతో అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే వారు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక నా కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన పరిపాలన చేశారు. ఆయన ఏకంగా 14 ఏళ్లు పాలించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను వయసులో ఆయన కంటే చాలా చిన్నోడిని. నేను ఒకటే అడుగుతున్నా. ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశారా? మీరంతా దీనిపై ఆలోచన చేయాలి. ఈ రోజు ఏ రకంగా మన బతుకులు, జీవితాలు మారాయి? ఏ రకంగా వ్యవస్థల్లో మార్పులు తేగలిగాం? అనే విషయాలను అందరూ ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. రైతన్నకు ప్రతి అడుగులో అండగా.. ప్రతి రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. రైతన్నల కోసమే ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. గత పాలనలో బ్యాంకులలో పంట రుణాలు అందకుంటే ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలో తెలియని దుస్థితి. అలాంటిది ఈ రోజు గ్రామంలోనే ఆర్బీకేలను తీసుకొచ్చి ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, పంట నష్టపోతే సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నాం. రైతన్నకు పెట్టుబడి సాయంగా రూ.13,500 చొప్పున మీ బిడ్డ హయాంలోనే అందుతోంది. మీ కుటుంబంతో చర్చించండి.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. ఓటు వేయలేదని వివక్ష చూపించలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధిని అందజేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు వచ్చాయి. విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు మీడియంతో ప్రచురించిన పుస్తకాలను పిల్లలకు అందజేస్తున్నాం. విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఉచితంగా ఇస్తున్నాం. మీరంతా ఒక్కసారి ఇంటికి వెళ్లి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో సాకారమైన మార్పులను గమనించండి. ఇది కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలు. అందరూ ఇంటికి వెళ్లాక ఒక్కసారి మీ భార్య, పిల్లలు, ఇంట్లో అవ్వాతాతలతో మాట్లాడండి. అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. నేడు ఎమ్మిగనూరులో సీఎం జగన్ సభ సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజైన శుక్రవారం కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. బస్సు యాత్ర శుక్రవారం షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ పెంచికలపాడు నుంచి బయలుదేరి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు. ఆ ప్రాంతంలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకొని మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్‌కు దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. ఒక్క ఊరికే రూ.49 కోట్ల ఉపకారం కేవలం ఒక్క ఎర్రగుంట్ల గ్రామానికే 58 నెలల వ్యవధిలో వివిధ పథకాల ద్వారా డీబీటీతో రూ.49 కోట్ల మేర లబ్ధి చేకూర్చగలిగాం. ఈ గ్రామంలోని రెండు సచివాలయాల పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది లబ్ధిదారులున్నారు? ఎవరెవరికి ఏయే పథకాలు అందాయి? అనే విషయాలను కాసేపటి క్రితమే అడిగి తెలుసుకున్నా. గ్రామంలో 1,496 ఇళ్లు ఉండగా, 1,391 ఇళ్లకు ప్రభుత్వ పథకాల ద్వారా రూ.48,74,34,136 అందాయి. 93 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందాయి. ఒక్క ఈ ఊరులోనే వైఎస్సార్ పెన్షన్ కింద రూ.16.52 కోట్లు పంపిణీ చేశాం. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.6.81 కోట్లు, అమ్మఒడితో 1,043 మంది తల్లులకు రూ.4.69 కోట్లు అందజేశాం. వైఎస్సార్ ఆసరా కింద రూ.3.88 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 492 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2.96 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 837 మందికి రూ.2.46 కోట్లు, హౌసింగ్ కింద రూ.2.75 కోట్లు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2.24 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీతో రూ.1.13 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.కోటి, సున్నా వడ్డీ కింద రూ.86 లక్షలు, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.67 లక్షలు, జగనన్న తోడు కింద ఇచ్చిన రుణాలు రూ.41.30 లక్షలు, చేదోడు కింద రూ.40 లక్షలు, కాపు నేస్తం కింద రూ.31 లక్షలు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.21.48 లక్షలు అందజేశాం. మీ బిడ్డ గత 58 నెలల వ్యవధిలో ఒక్క గ్రామానికే ఇంత మంచి చేశాడనే విషయాన్ని గమనించాలని కోరుతున్నా. వీటితోపాటు గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ కింద మరింత అదనంగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా ఎవరూ లంచం అడగడం లేదు. అర్హత ఉంటే చాలు పారదర్శకంగా ప్రయోజనాన్ని అందిస్తున్నాం. చివరిగా.. ఈ ముఖాముఖిలో వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. సమయాభావం వల్ల అందరికీ మాట్లాడే అవకాశం దొరకలేదు. మీ అందరికీ స్లిప్పులు ఇచ్చాం. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అందులో రాసి బాక్సులో వేస్తే నా దగ్గరికి వస్తాయి. వ్యవస్థను ఇంకా బాగుపరిచే సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులను సీఎం జగన్ చేసి చూపించారు. తెలంగాణలో నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయాలని తలపెట్టి చేతులెత్తేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సర్కారు బడుల రూపురేఖలు మార్చి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. – హుసేన్‌బాషా, ఎర్రగుంట్ల ఎన్నో పథకాలు అందించారు నాలాంటి వారికి అన్నగా, పిల్లలకు మేనమామలా, అవ్వాతాతలకు మనవడిగా ఎంతో మందికి కుమారుడిగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధిస్తారు. – పుష్పలత, ఎర్రగుంట్ల రూ.5 లక్షలు బీమా వచ్చింది మా అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందింది. నాలుగుసార్లు అమ్మ ఒడి పథకం వర్తించింది. అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారు. – పద్మావతి, గోవిందపల్లె స్కూళ్ల రూపురేఖలు మార్చారు ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా తీర్చిదిద్దారు. ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తున్నారు. గతంలో మా పాఠశాలకు ప్రహరీ లేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. మరుగుదొడ్ల వసతి కల్పించారు. గోరుముద్ద ద్వారా చిక్కీలు, గుడ్లు, రాగిజావతో ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నారు. – చర్విత, విద్యార్థిని, శిరివెళ్ల ఆదుకున్న సీఎంఆర్ఎఫ్.. నా కుమారుడికి చిన్న వయసులోనే గుండెకు రంధ్రం పడి పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తింది. ఆపరేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆపరేషన్ చేశారు. నా కుమారుడు బతికి బయటపడ్డాడంటే సీఎం జగన్ చలవే. ఆయనే మళ్లీ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – నాగరాజు దంపతులు, ఎర్రగుంట్ల పాదయాత్ర హామీలన్నీ నెరవేర్చారు చంద్రబాబు 600కిపైగా హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌కు మాత్రమే దక్కుతుంది. మాకు మళ్లీ అధికారం ఇస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం, పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు ఆర్థిక చేయూతనందిస్తామని చెబుతున్నాం. కానీ, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో ఒక్కసారి గమనించండి. ఒకరేమో తమ దగ్గర ఎర్ర పుస్తకంలో పేర్లు రాసుకున్నామని, అధికారంలోకి వస్తే వారి అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఇంకొకరేమో తాము అధికారంలోకి వస్తే మీరంతా గుడుల్లో, బడుల్లో దాక్కోవాలంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పగటి కలలు కనడం మానండి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేది జగనే. – గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈ రోజు ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ జనం కోసం నిలబడిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో ప్రజల బాధలు విన్నారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం అలాగే ఉండాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యుల జెండాను, అణగారిన వర్గాల అజెండాను మోసుకుంటూ, నడుచుకుంటూ వచ్చారు. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు తగిన సమయం వచ్చింది. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ రెండో రోజు యాత్ర సాగిందిలా.. మేమంతా సిద్ధం అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. ♦ రాత్రి బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9.40 గంటలకు సీఎం జగన్ బయటకు వచ్చారు. ♦ 9.45 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు మీదుగా ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ♦ 11.10 గంటలకు ఎర్రగుంట్ల గ్రామంలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖిలో పాల్గొని ప్రసంగించారు. ♦ 12.50 గంటలకు సభ నుంచి బయటకు వచ్చి వెంకటాపురం, శిరివెళ్ల మెట్ట మీదుగా దీబగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ♦ మధ్యాహ్నం 2 గంటలకు దీబగుంట్ల వద్ద ఎమ్మెల్యే శిల్పా రవి పుష్పగుచ్చాలు అందజేసి నంద్యాల నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. ♦ 2.40 గంటలకు చాబోలు వద్ద భోజన విరామం కోసం ఆగారు. ♦ సాయంత్రం 4.40 గంటలకు చాబోలు నుంచి రైతు నగరం క్రాస్ మీదుగా బొమ్మలసత్రం ఫ్లై ఓవర్ మీదుగా ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభ వద్దకు 5.30 గంటలకు చేరుకున్నారు. ♦ 5.40 గంటల నుంచి 7.10 వరకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ♦ 8.10 గంటలకు ఆర్జీఎం కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థులకు అభివాదం చేశారు. ♦ 9.40 గంటలకు పాణ్యం, సుగాలిమెట్ట, హుసేనాపురం, ఓర్వకల్లు మీదుగా నన్నూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ♦ పెద్దటేకూరు, మార్కాపురం క్రాస్ మీదుగా రాత్రి 11.06 గంటలకు బస చేయనున్నపెంచికలపాడుకు చేరుకున్నారు. -
ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేననే మరోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రెండో రోజు జైత్రయాత్రలా కొనసాగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ క్రాస్ వద్ద సీఎం జగన్ బస చేసిన శిబిరం వద్దకు గురువారం ఉదయం నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. ప్రజల కేరింతల మధ్య రెండో రోజు బస్సు యాత్ర ఉదయం 9.30 గంటలకు మొదలైంది. ఆళ్లగడ్డ క్రాస్ నుంచి నల్లగట్ల వరకూ కిలోమీటర్ల కొద్దీ జనం బారులు తీరారు. సీఎం తమ వద్దకు చేరుకోగానే ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై బంతిపూల వర్షం కురిపించారు. నల్లగట్ల వద్ద అంబులెన్స్‌కు దారి ఇచ్చిన జగన్.. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల సమీపంలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను ఆశీర్వదించారు. ఎర్రగుంట్ల గ్రామముఖ ద్వారంలో సీఎం జగన్ బస్సుపై బంతి పూలవర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో మమేకమై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి ఇంటికీ మంచి చేశారంటూ సీఎం జగన్‌పై ఎర్రగుంట్ల వాసులు ప్రశంసలు కురిపించారు. అనంతరం ఎర్రగుంట్ల నుంచి శిరివెళ్ల మండలం గోవిందపల్లి, చాబోలు మీదుగా బస్సు యాత్ర సాగింది. చాబోలులో భోజన విరామం తరువాత నంద్యాల నియోజకవర్గం నూనెపల్లికు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. నంద్యాలలో జనహోరు.. నంద్యాలలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ప్రారంభమవుతుందని ప్రకటించినా ఉదయం 11 గంటల నుంచే జనప్రవాహం మొదలైంది. ఎండ వేడి పెరిగేకొద్దీ జనం పెరిగారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఆళ్లగడ్డ క్రాస్ నుంచి నూనెపల్లి వరకూ జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టడంతో గంట ఆలస్యంగా సాయంత్రం 5.30 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. సభా వేదికపైకి సీఎం జగన్ చేరుకోగానే జనం హర్షద్వానాలు, కేరింతలతో సభా ప్రాంగణం హోరెత్తింది. సీఎం జగన్ ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నప్పుడు జనం జయహో జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సంక్షేమాభివద్ధి పథకాల ద్వారా చేసిన మంచి, రాష్ట్రం రూపురేఖలు మార్చేలా చేసిన అభివృద్ధిని వివరించడంతోపాటు 2014–19 మధ్య టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు. మళ్లీ ఇప్పుడు అదే కూటమితో చంద్రబాబు పోటీ చేస్తుండటాన్ని ప్రస్తావించినప్పుడు విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు.. మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చినప్పుడు మేమంతా సిద్ధం అంటూ దిక్కులుపిక్కటిల్లేలా జనం నినదించారు. విద్యార్థుల ఉత్సాహం.. నంద్యాల సభ రాత్రి 7 గంటలకు ముగియగా అనంతరం బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైంది. సీఎం జగన్ బస్సు యాత్ర కడప–కర్నూలు జాతీయ రహదారిపై నిర్వహించనున్నట్లు తెలియడంతో ఆర్జీఎం కాలేజీ విద్యార్థులు మధ్యాహ్నం నుంచే భారీగా తరలి వచ్చారు. రాత్రి 8.30 గంటలకు సీఎం జగన్ బస్సు చేరుకోగానే విద్యార్థులు హర్షధ్వానాలు చేయగా వారికి సీఎం జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి బస్సు యాత్ర పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సుగాలిమిట్ట వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. హుస్సేనాపురం, ఓర్వకల్లుల్లో రాత్రి 9.30 గంటలైనా జనం రోడ్డుపైనే నిలబడ్డారు. నన్నూర్ వద్ద నారాయణ కాలేజీ విద్యార్థులను యాజమాన్యం నియంత్రించినా లెక్క చేయకుండా భారీ ఎత్తున రహదారిపైకి చేరుకుని బంతిపూల వర్షంతో స్వాగతం పలికారు. నన్నూర్ వద్ద బస్సు యాత్ర కర్నూలు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కర్నూలు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ సార«ద్యంలో నేతలు అక్కడ సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం మీదుగా పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ రాత్రి 11.06 గంటలకు చేరుకున్నారు. -
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు!
కర్నూలు (సెంట్రల్): శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 87 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది సహేతుక న్యాయం చేసేందుకు డీ సెంట్రలైజేషన్ (పరిపాలనా వికేంద్రీకరణ) విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అందులో భాగంగానే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని, రాష్ట్ర న్యాయ సంస్థలన్నింటినీ కర్నూలులోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలో జగన్నాథగట్టు వద్ద 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సీఎం జగన్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజలు జరిగాయి. లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తితో కలసి న్యాయ విశ్వ విద్యాలయం పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. న్యాయ విశ్వ విద్యాలయం నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ 87 ఏళ్ల క్రితం సహేతుక న్యాయం కోసం ఈ ప్రాంత ప్రజలు శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అప్పటి నుంచి అమలు కోసం నిరీక్షిస్తున్నారని గుర్తు చేశారు. లా యూనివర్సిటీకి సంబంధించిన శిలాఫలకం వద్ద సీఎం జగన్ 1937లో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు ఆ రోజుల్లోనే హైకోర్టును ఇక్కడే నెలకొల్పుతారని భావించారని చెప్పారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే నెలకొల్పే సామర్థ్యాన్ని లా యూనివర్సిటీ సంతరించుకుంటుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. త్వరలోనే వర్సిటీ నిర్మాణ పనులను చేపట్టి వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలుకు మరిన్ని న్యాయ సంస్థలు కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంతోపాటు మరిన్ని ప్రతిష్టాత్మక న్యాయ విభాగాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునళ్లను కర్నూలులోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు పని చేస్తున్నాయని గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో ఆయా కమిషన్లు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయ సంస్థలన్నింటికీ జగన్నాథగట్టుపైనే భవన సముదాయాలను సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం నిలుస్తుందని, సీమ అభివృద్ధికి ఇది మచ్చు తునక లాంటిదని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. తుంగభద్రలో కాలుష్య విముక్తికి రూ.131.84 కోట్లు కర్నూలు నగర పాలకసంస్థలో అమృత్ 2.0 పథకం కింద రూ.131.84 కోట్లతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. రాంబొట్ల దేవాలయం, మామిదాలపాడు, మునగాలపాడు సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా తుంగభద్ర నదికి మురుగునీరు, కాలుష్యం నుంచి విముక్తి లభించనుంది. కార్యక్రమంలో మంత్రి బుగ్గన, రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జిల్లా చైర్మన్ కరణం కిశోర్‌కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జేసీ నారపురెడ్డి మౌర్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయమనోహరి, జేసీఎస్ జిల్లా అధ్యక్షుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అది రాయలసీమ, కర్నూలు వాసుల కోరిక: సీఎం జగన్ శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇక్కడే (కర్నూలు) హైకోర్టు పెడతామని చెప్పారు. ఈమేరకు ఆ రోజుల్లోనే ఇక్కడకు రావాల్సింది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసినందున అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలు ఆ హోదాను కోల్పోతుండటంతో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రోజు చెప్పిన మాట మేరకు ఈరోజు మన అడుగులు ముందుకు పడుతున్నాయి. – సీఎం జగన్ కర్నూలు సమగ్ర నీటి సరఫరాకు రూ.115 కోట్లు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో నీటి కొరతను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. రూ.115 కోట్లతో అమృత్ 2.0 పథకం ద్వారా సమగ్ర నీటి సరఫరాకు సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా జగన్నాథగట్టు వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్, సర్వీసు రిజర్వాయర్, గ్రావిటీ మెయిన్స్ విభాగాల ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. శుద్ధి అయిన నీటిని అక్కడి నుంచి కర్నూలు నగరానికి సరఫరా చేస్తారు. రోజుకు 50 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీటిని శుద్ధి చేసేలా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అగ్రకుల పేదలను గుర్తించిన ఏకైక సీఎం జగన్ అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారని గు ర్తించి మేలు చేస్తున్న ఏకైక సీఎం జగనే. గత ఎన్నికలకు ముందు నా భర్త మరణించగా వితంతు పింఛన్ అందలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు పింఛన్ మంజూరైంది. ఈబీసీ నేస్తం ద్వారా నాకు రూ.45 వేల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగాం. ఇప్పుడు ఇంటివద్దే వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు. – పద్మావతి, ఈబీసీ నేస్తం లబ్ధిదారురాలు, బనగానపల్లె -
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నాం..
-
కర్నూలులో తన్నుకున్న టీడీపీ నేతలు
కర్నూలు: కర్నూలులో టీడీపీ నేతలు తన్నుకున్నారు. ‘బీసీ జయహో’ సభలో బీభత్సం సృష్టించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ కోసం మాచాని సోమనాథ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ‘బీసీ జయహో’ సభలో బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. -
ఇన్చార్జులపై ‘రూకలు’పోటు
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ మసిబూసి మారేడు కాయ చేసి ప్రస్తుత ఇన్చార్జులను వంచించేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు వారిచేత డబ్బులు ఖర్చుచేయించి ఇప్పుడు రోకలిపోటుకు సిద్ధమైంది. మంత్రా ల యం, ఎమ్మిగనూరు, ఆదోనిలో అభ్యర్థులను మార్చేందుకు యోచిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై టీడీపీ జోన్–4 ఇన్చార్జ్ బీద రవిచంద్రయాదవ్ పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జ్‌లు డైలమాలో పడ్డారు. ఎమ్మిగనూరు ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనను కాదని మాచాని సోమనాథ్‌ను బరిలోకి దించే యోచనలో టీడీపీ ఉంది. శనివారం కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సోమనాథ్‌ను కలిశారు. టికెట్ విషయం ప్రస్తావించారు. అయితే సమయం ఇవ్వాలని ఆలోచించి చెబుతా మని సోమనాథ్ చెప్పినట్లు తెలుస్తోంది. సోమనాథ్‌కు టికెట్ ఇస్తే జయనాగేశ్వరరెడ్డి రాజకీయ ప్రయాణం ముగిసినట్లే! ఆదోని ఇన్చార్జ్గా మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన తరఫున సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ టికెట్ దక్కించుకోవాలని భావిస్తున్నారు. కుదరకపోతే తానే టీడీపీ తరఫున బరిలోకి దిగాలనే యోచన కూడా చేస్తున్నట్లు తెలు స్తోంది. టీజీ వెంకటేశ్‌కు బంధువు కావడంతో విశ్వప్రసాద్‌కు టికెట్ ఇప్పించేందుకు వెంకటేశ్, భరత్ కూడా యత్నిస్తున్నట్లు తెలు స్తోంది. దీంతో మీనాక్షినాయుడు శుక్రవారం ఆదోని లో సదస్సు నిర్వహించారు. ‘ఎవరంటే వారు టికెట్ అడుగుతున్నారని, ఇదేమైనా సినిమా టికెట్టా? అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నట్లు తె లుస్తోంది. తనకేనా లేదా తన కుమారుడు భూపాల్ నాయుడుకైనా టికెట్ వస్తుందని,లేనిపక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం. మంత్రాలయంలో రాఘవేంద్ర జపం మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్గా తిక్కారెడ్డి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తిక్కా రెడ్డి ఓడారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కాకుండా బీసీ వర్గానికి చెందిన రాఘవేంద్రని బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తోంది. ఇటీవల టీడీపీలో చేరిన రాఘవేంద్ర.. చంద్రబాబును కలిశారు. కచ్చితంగా బీసీలకే టిక్కెట్ ఇస్తామని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని రాఘవేంద్రకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 2 ఎన్నికల్లో టీడీపీ కోసం భారీగా ఖర్చు చేశానని, తనకు టి కెట్ ఇవ్వకపోతే పార్టీలో కొనసాగనని తిక్కారెడ్డి తన వర్గీయులతో చెప్పినట్లు సమాచారం. -
బనియన్ల నిండా బంగారం, నగదే
సాకక్షి, కర్నూలు: సినీ ఫక్కీలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం, నగదు పెట్టుకుని దర్జాగా బస్సులో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,84,53,500 నగదు, 4.565 కిలోల బంగారం, 5కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా బంగారం తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కృష్ణగిరి, వెల్దుర్తి ఎస్ఐలు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సీఐ గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో తనిఖీలు చేయగా, అమర్‌ప్రతాప్ పవార్(నంద్యాల), శబరి రాజన్(సేలం, తమిళనాడు), వెంకటేష్ రాహుల్(కోయంబత్తూరు), సెంథిల్‌కుమార్ (కోయంబత్తూరు) సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్‌కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అమర్‌ప్రతాప్ పవార్ నుంచి రూ.1,20,80,000, శబరి రాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్ రాహుల్ నుంచి 3.195 కిలోల బంగారం, రూ.19,23,500 నగదు, సెంథిల్‌కుమార్ నుంచి 1.37కిలోల బంగారం, రూ.44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ రూ.2,74,54,800 ఉంటుంది. బంగారం, వెండి, నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ మస్తాన్, వీఆర్వో గిడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్‌లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్‌తోపాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్ సిబ్బందిని అభినందించారు. కాగా, గత నెల 26న రాత్రి ఇదే టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం చేసుకున్నారు. -
చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు!
కర్నూలు(సెంట్రల్)/నెల్లూరు, సాక్షి ప్రతినిధి/ నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో, కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ ఆదివారం నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలు జనం లేక వెలవెలబోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న వారి వ్యూహం బెడిసికొట్టింది. కనీసం ఏడెనిమిది వేల మంది చొప్పున కూడా జనం హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాగైతే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని, ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు, పత్తికొండలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకపోయింది. చాలాచోట్ల డబ్బులిస్తామన్నా.. ‘మేము రాము బాబో.. మీ సభలకు’ అంటూ ప్రజలు ముఖంమీదే తేల్చి చెప్పడంతో స్థానిక టీడీపీ నేతలు చేతులెత్తేశారు. రెండు జిల్లాల్లోనూ సభలు జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానంతోపాటు క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. జగన్ అర్జునుడు కాదు : చంద్రబాబు పత్తికొండ, నెల్లూరు సభల్లో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆయన అభిమన్యుడు కాదు.. అర్జునుడూ కాదూ.. భస్మాసురుడు’ అని విమర్శించారు. సాక్షి పత్రికలో అబద్ధాలే రాస్తారని, చదవొద్దని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తామని చెప్పారు. రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఐటీకి తానే ఆద్యుడినని, తనకు 80 దేశాల్లో మద్దతు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్జగన్ చెబుతున్నట్లు 175 సీట్లు వారు గెలవలేరని, పులివెందులలో జగన్‌ను ఓడిస్తామన్నారు. జగన్ టిక్కెట్లు ఇచ్చిన వారిలో రౌడీలు, దోపిడీ దారులే అధికంగా ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను ఓడించేందుకు ఏపీలోని 5 కోట్లమంది స్టార్ క్యాంపెయినర్లు కలసి తనతో రావాలని పిలుపునిచ్చారు. తన 45 ఏళ్ల పాలనలో ఇంత తీవ్ర వ్యతిరేక ఉన్న ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. సీఎం జగన్ నాపై ఎన్ని కేసులుపెట్టి వేధించారో ప్రజలు చూశారన్నారు. సీఎం జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలపై సోమిరెడ్డి మండిపాటు నెల్లూరు సభలో జనసేన కార్యకర్తలు వారి పార్టీ జెండాలను ఊపుతుండగా, టీడీపీ నాయకులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జెండాలు అడ్డుగా ఉన్నాయని, పక్కకు వెళ్లాలని సూచించారు. అయినా ఆ పార్టీ కార్యకర్తలు వినలేదు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి సూచించినా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మైక్ తీసుకుని జనసేన కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు ఎవరు చెప్పినా వినరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 31న కృష్ణపట్నం పోర్టులో ఉన్న కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతుందని విమర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరోక్షంగా దుర్భాషలాడారు. డబ్బులు, మద్యం ఎర చూపినా.. నెల్లూరులో డబ్బులు, మద్యం ఎర చూపినా ప్రజలు చంద్రబాబు సభ వైపు రాలేదు. కేవలం రెండు వేల మంది మాత్రం ఎస్వీజీఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హడావుడి చేశారు. వారూ వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద నాయకులకు టెంట్, కూలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో మండుటెండలో వారు విలవిలలాడారు. ఉదయం 11.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం 12.45 గంటలకు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకోవడం కార్యకర్తల సహనానికి పరీక్ష పెట్టింది. సభకు వచ్చిన కార్యకర్తలకు రూ.250, క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేయడం కనిపించింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆద్యంతం కుర్చీలు ఖాళీగా కనిపించడంతో స్థానిక నాయకులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను మాట్లాడే సమయానికి ప్రజలను నిలబెట్టలేకపోయారా అని నెల్లూరు నగర రూరల్ ఇన్చార్జిపై మండిపడ్డారు. పత్తికొండలోని ఆదోని రోడ్డులో జరిగిన సభకు కచ్చితంగా లక్ష మంది వస్తారని శనివారం సాయంత్రం స్థానిక నేతలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. తీరా ఆదివారం ప్రజలెవరూ రాకపోవడంతో సభాస్థలిలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది కూడా సభ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచలేదు. -
సైకిలెక్కితే సైడ్‌ట్రాకే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్రబాబు పంచన చేరితే వంచనకుగురై చతికిలపడ్డారు. సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశారని తెరవెనుక గగ్గోలు పెడుతున్నారు. కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు నంద్యాల వరదరాజులరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో బలమైన నేతలు. బలమైన రాజకీయ నేపథ్యం వారి సొంతం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు. చంద్రబాబును నమ్మి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు. వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు.. ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు ఉన్నారు. కోట్ల కోటకు బీటలు కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి కుటుంబాలు ‘సీమ’ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడు సూర్యప్రకాశ్‌రెడ్డి కేంద్రమంత్రిగా చేశారు. భూమా నాగిరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు. 2014లో సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో చేరడమే కోట్ల కుటుంబం చేసిన తప్పిదమని, దీంతోనే గెలుపు దక్కడం లేదనే భావన ఆయన అనుచరవర్గంలో ఉంది. ఈ దఫా కూడా ఎంపీగా గెలవలేమని కోట్ల భావిస్తున్నారు. అందుకే ఎమ్మిగనూరు టికెట్ ఆశించగా.. డోన్ ఎంచుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడ బరిలోకి దిగితే ఓటమి తప్పదని కోట్ల భయపడుతున్నారు. భూమా కుటుంబం తంటాలు వైఎస్సార్సీపీ నుంచి 2014లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందారు. అఖిలప్రియ టీడీపీ తరఫున 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ మారి తప్పుచేశామనే చర్చ అఖిల కుటుంబంలో జరిగింది. ఆమె కుటుంబీకులు కూడా దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఈ సారి మొండిచేయి చూపారు. అతని స్థానంలో ఫరూక్‌కు టికెట్ ఖాయమైంది. ఆళ్లగడ్డలో కూడా అఖిలకు కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే పోటీ నుంచి భూమా కుటుంబం పూర్తిగా వైదొలిగినట్లే.. నమ్మితే నిండాముంచారు శ్రీశైలం, పాణ్యం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలుగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, దేవగుడి ఆదినారాయణరెడ్డిలు కూడా 2014 తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వీరికి ఘోర ఓటమి తప్పలేదు. వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని కాదని చంద్రబాబును నమ్మడంతో 2019లో ఓటమి తప్పలేదు. ఇప్పుడు అసలు టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. గౌరు వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్ చేసిన మేలు అందరికీ తెలిసిందే.. జగన్మోహన్రెడ్డిని కాదని టీడీపీలో చేరితే 2019లో ఓడిపోయారు. ఈ దఫా కూడా వీరు గెలిచే పరిస్థితి లేదు. మరోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే కడప ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అతనికి టికెట్ కూడా ఇవ్వలేదు. అంతర్మథనంలో నేతలు రాయలసీమలో అత్యంత బలంగా వైఎస్సార్సీపీ ఉంది. 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో బలహీనంగా ఉన్న టీడీపీలో కొనసాగినా రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనకు వచ్చారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిపై ప్రజలతో పాటు సొంత పార్టీలోని నేతలకు కూడా స్పష్టత వచ్చింది. ప్రత్యామ్నాయం లేక టీడీపీలో కొనసాగుతున్నామని, ఏ ఆప్షన్ ఉన్నా వెంటనే సైకిల్ దిగి వెళ్లిపోతామని ఈ నేతలంతా తమ అనుచరులతో చెబుతున్నారు. కల్లబొల్లి మాటలు నమ్మి వెళ్తే.. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన వారిలో కర్నూలు, కోడుమూరు, కదిరి, బద్వేల్ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, అత్తర్ చాంద్‌బాషా, జయరాములు ఉన్నారు. వీరికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. దీంతో మోహన్‌రెడ్డి, మణిగాంధీ తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబును నమ్మినందుకు చాంద్‌బాషా, జయరాములు పూర్తిగా రాజకీయ భవిష్యత్ కోల్పోయారు. కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి కూడా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. ఇద్దరికీ చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో బుట్టా రేణుక 2019 ఎన్నికలకు ముందే తిరిగి సొంత పార్టీలో చేరారు. చంద్రబాబును నమ్మి మోసపోయానంటూ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల ఎంపీగా, అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా, కుమార్తె సుజల శ్రీశైలం నుంచి, మరో కుమార్తె అరవిందరాణి బనగానపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా వీరంతా చంద్రబాబును నమ్మి మోసపోయినవారే. చంద్రబాబును నమ్మి మోసపోయానని ఎస్పీవై రెడ్డి 2019లో బహిరంగ ప్రకటన కూడా చేశారు. -
పాణ్యంలో సాధికార పండుగ
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాధికార పండుగ చేసుకొన్నారు. గురువారం వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వేనోళ్ల కీర్తిస్తూ వీధివీధిలో కలియదిరిగారు. డాక్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు ఇలా అన్ని వృత్తుల వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మధాహ్నం అన్ని వర్గాల ప్రతినిధులతో కేఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం అనంతరం యాత్ర ప్రారంభమైంది. చెన్నమ్మ సర్కిల్ వరకు ర్యాలీ ఘనంగా జరిగింది. 500 బైక్‌లతో యువత ర్యాలీలో పాల్గొన్నారు. కళాకారుల నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో పండుగ వాతావరణం కన్పించింది. మహిళలు, ప్రజాప్రతినిధులు కూడా నృత్యం చేసి సందడి చేశారు. సాయంత్రం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బడుగుల గురించి ఆలోచించిన సీఎం ఒక్క జగన్ మాత్రమే: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సభలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పేదల పిల్లలు కూడా సంపన్నుల పిల్లల మాదిరిగా అత్యున్నతస్థాయికి ఎదిగేలా అత్యాధునిక చదువులు చెప్పిస్తున్న దేవుడు సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఒకే వేదికపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూర్చోబెట్టి ఆ వర్గాలకు న్యాయం చేశామని ధైర్యంగా ప్రజలకు చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. 75 ఏళ్లలో ఎవ్వరూ ఆలోచించని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి గురించి సీఎం జగన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థితికి చేర్చారని చెప్పారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని అడ్డుకోవడానికి రామోజీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు చాలామంది ప్రయత్నిస్తున్నారని, అయినా, వెనుకాడేది లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని, బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదని చెప్పారు. సీఎం జగన్ అన్ని స్థానాలు, పదవుల్లో ఈ వర్గాలకే అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. పురందేశ్వరి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5కు చంద్రబాబు కావాలని, ప్రజలకు మాత్రం సీఎం జగన్మోహన్రెడ్డే కావాలని అన్నారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు: ఎంపీ గోరంట్ల రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని సంక్షేమ పథకాల్లో, అన్ని పదవుల్లో కనీసం 70 శాతం ఇచ్చి సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమేనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలను సీఎం జగన్ నాయకులుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆయన స్వార్ధం కోసం రాష్ట్రానికి, ప్రజలకు తీరని అన్యాయం చేశారని, ప్రత్యేక హోదాను మోదీకి అమ్మి ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకున్న దుర్మార్గుడని చెప్పారు. బాబు ప్రజలకు అందించిన స్కీములేవీ లేవని, స్కాములు మాత్రం లెక్కలేనన్ని చేశారని అన్నారు. ఆయన చేసిన తప్పులకు జీవితకాలం జైలులో ఉండాలన్నారు. సీఎం జగన్ గొప్ప దార్శనికుడు: ఎంపీ గురుమూర్తి సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికుడని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారని, సంక్షేమ పథకాలతో ప్రజల స్థితిగతులను ఉన్నతంగా మారుస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నారాయణ, చైతన్య లాంటి ప్రైవేటు విద్యా సంస్థల అభ్యున్నతి కోసం పని చేస్తే.. వాటికి దీటుగా సీఎం జగన్ ప్రభుత్వ బడులను ఆధునీకరించి మంచి చదువు చెప్పిస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి లేదు అనే వారు పాణ్యానికి వచ్చి చూడాలి: ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పాణ్యంలో ఈ నాలుగున్నరేళ్లలో 1.60 లక్షల మందికి రూ.170 కోట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చెప్పారు. పిన్నాపురంలో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్కో రెన్యువబుల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామన్నారు. గుట్టపాడు దగ్గర రూ.600 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటు కూడా పూర్తయిందన్నారు కర్నూలు సిటీలో అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, సుధాకర్, మేయర్ బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సామాజిక సాధికార యాత్ర
-
నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని ఆత్మీయంగా పలకరించేందుకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన యాత్ర నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సాగనుంది. కర్నూలు జిల్లా: ఎమ్మినూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మండల పరిషత్ కార్యాలయంలో 3.30 గంటలకు ముఖ్య నేతలతో ముఖాముఖి అనంతరం.. 4.30కుఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్సార్ సర్కిల్‌కు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాష, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, మా జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ఎంపీ. సంజీవ్ కుమార్, తదితరులు హాజరుకానున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తాపేశ్వరంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కలువు పువ్వు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, తదితరులు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలకు కసరత్తు.. నేడు, రేపు ఈసీ సమీక్ష -
క్వింటా పత్తి రూ. 7,711
ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర రూ.7,711గా నమోదైంది. గత వారంలో రూ.7,500 ధర ఉండగా.. ఈ వారం రోజురోజుకు రూ.50, రూ.100 చొప్పున పెరుగుతూ రూ.7,711కు చేరుకుంది. శుక్రవారం మార్కెట్‌కు 2,626 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ట ధర రూ.7,711, మధ్య ధర రూ.7,389, కనిష్ట ధర రూ.5,169 పలికింది. అలాగే, వేరుశనగ 1,437 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,969, కనిష్ట ధర రూ.3,849.. ఆముదాలకు గరిష్ట ధర రూ.5,475, కనిష్ట ధర రూ.4,500, పూల విత్తనాలకు గరిష్ట ధర రూ.4,212, కనిష్ట ధర రూ.3,926 లభించింది. -
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఒకరు మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేష్ అనే యువకుడు మృతిచెందాడు. గాయాలపాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో మరోసారి సంప్రదాయమే గెలిచింది. ఆచారం పేరిట యథావిధి ఈ భక్తి పోరాటం కొనసాగింది. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవంలో పాల్గొంటారు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరిగింది. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదన్న భక్తులు.. ఈ కర్రల సమరంలో సుమారు 2 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. -
అభాగ్యులకు ఆపన్న హస్తం..సహాయార్థులను ఆదుకున్న సీఎం జగన్
-
ఆంధ్రప్రదేశ్‌లో పేదవాడికి, పెత్తందారుకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎమ్మిగనూరుకు సీఎం జగన్ వరాల జల్లు..!
-
పట్టు వదలని విక్రమార్కుడు మన సీఎం జగన్
-
సీఎం జగన్ ఎంట్రీ..దద్దరిల్లిన ఎమ్మిగనూరు
-
కర్నూల్ జిల్లాలో అడుగుపెట్టిన సీఎం వైఎస్ జగన్
-
Live: ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రేపు ఎమ్మిగనూరులో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
-
రేపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరుకు చేరుకుంటారు. వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని.. జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేయనున్నారు. సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. -
కర్నూల్ జిల్లాలో టీడీపీ కి బిగ్ షాక్
-
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్..
-
నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది: సీఎం జగన్
సాక్షి, నంద్యాల/డోన్: రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు కాబట్టే సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది అని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్. కాగా, ముఖ్యమంత్రి జగన్ డోన్ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నమ్మకం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. చంద్రబాబు ఉద్దేశ్యం రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఇవన్నీ ఈనాడు రాయదు.. చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం ఢంకా భజాయిస్తుంది. ఒక టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసి బ్రహ్మండంగా చేసిందని చెబుతుంది. ఇలా దుర్మార్గమైన ఆలోచనతో చేసిందే చంద్రబాబు పాలనంతా. టీడీపీ హయంలో జరిగిదంతా.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. దోచుకోవడం గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలో ప్రారంభమైతే.. చివరకు దత్తపుత్రుడి షేరింగ్‌తో ఎండ్ అవుతుంది’ సీమ కష్టాలు మీ బిడ్డకు తెలుసు.. రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. కరువు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మెట్ల ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందుతుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదు. కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం.. నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నాను. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. హంద్రీనీవాను దివంగత మహానేత వైఎస్సార్ పూర్తి చేశారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు తీసుకున్నాం. రూ. 253 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పట్టించుకోని పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టాం. వెలుగొండ ప్రాజెక్ట్‌ను వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నాం. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది మన ప్రభుత్వం. మీ బిడ్డ ప్రభుత్వంలో తేడాను గమనించండి.. గతంలో ఇదే బడ్జెట్. అప్పటి కంటే ఇప్పుడు అప్పులు తక్కువ చేశాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2లక్షల35వేల కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది?. మా ఊరిలో స్కూళ్లను, ఆసుపత్రులను గమనించండి. వైద్య, విద్య, సంక్షేమంలో మన ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దొంగల ముఠా అబద్దాలు, మోసాలను ప్రజలు నమ్మవద్దు. ఈ ముఠా రానున్న కాలంలో మరిన్ని అబద్దాలను వడ్డిస్తుంది. మన ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. -
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
-
ఎర్రనేలల్లో పసిడి పంట
తుగ్గలి(కర్నూలు): ఎర్ర నేలల్లో బంగారం పండనుంది. దాదాపు 45 ఏళ్లకు పైగా చేసిన సర్వేలు ఎట్టకేలకు ఫలించాయి. బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి–బొల్లవానిపల్లి మధ్య గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి జియో మైసూర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ చార్లెస్ డెవినిష్, మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ నమూనాను విడుదల చేశారు. అనంతరం చార్లెస్ డెవినిష్ మాట్లాడుతూ 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1945 తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి దేశంలో 1945 సంవత్సరం తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి అని చార్లెస్ డెవినిష్ తెలిపారు. రోజుకు 1,000 నుంచి 1,500 టన్నుల వరకు ముడి సరుకును ఈ ప్లాంట్‌లో ప్రాసెసింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ప్రాసెసింగ్ చేస్తున్నామని, వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తామని వివరించారు. ప్లాంట్ ఏర్పాటైన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే కంపెనీలో 100 మందికి ఉపాధి కల్పించామని, మరో 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మానసబిశ్వాల్, హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్ ఏర్పాటుతో తుగ్గలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అక్కడ టీడీపీ అడ్రసే లేదు.. పక్క జిల్లాలకు నేతలు!
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 2019 ఎన్నికల్లో సైకిల్ అడ్రస్సే లేకుండా పోయింది. దీంతో టీడీపీ నేతలు తలో దిక్కు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లోని నేతలు పక్క ప్రాంతాలు, పక్క జిల్లాల్లో సెటిల్ అవుతున్నారు. అటువంటిదే ప్రస్తుత నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం. ఇక్కడ టీడీపీకి నాయకుడు లేకపోవడంతో అక్కడున్న కొద్దిపాటి కేడర్ డీలా పడుతోందట. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నంద్యాల జిల్లా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఇన్చార్జ్ బీసీ జనార్థనరెడ్డి...ఆ తర్వాత నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్నపుడు కొంత హడావుడి చేసి, ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ నియోజకవర్గాన్ని వదిలేశారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా బనగానపల్లెని చూసి పోతున్నాడు కాని.. వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన ఆయనకు లేదని కేడర్ చెబుతోంది. 2019 ఎన్నికల్లో సొంత అన్న బిసి బాలతిమ్మారెడ్డి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని టాక్. అయితే జనార్దన్ రెడ్డి మాత్రం తన అన్న గుండె పోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించారనే ఆరోపణలు బనగానపల్లెలో దుమ్ము రేపుతున్నాయి. సొంత అన్నకు న్యాయం చెయ్యలేని నాయకుడు ప్రజలకు ఏమి చేస్తాడనే విమర్శలు సొంత పార్టీలోనే చెలరేగుతున్నాయి. అక్కడ తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ 2019 ఎన్నికల్లో బనగాపల్లెలో తెలుగుదేశం జెండా ఎగురుతుందని ఆ పార్టీ కేడర్ నమ్మకంతో ఉంది. అయితే రాయలసీమ నాలుగు జిల్లాల్లో కలిపి టీడీపీకి వచ్చింది మూడే స్థానాలు. ఉమ్మడి కడప, కర్నూల్ జిల్లాల్లో అయితే తుడిచిపెట్టుకుపోయింది. బనగానపల్లెలో బిసి జనార్థనరెడ్డి అర్థబలం, అంగబలం వైఎస్సార్సీపీ ముందు నిలబడలేక బోర్లా పడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సొంతింటి కల నెరవేర్చడానికి పూనుకుంటే.. ఆ గొప్పతనం వైఎస్సార్సీపీకి వస్తుందనే దురుద్దేశంతో పట్టాల పంపిణీ జరుగకుండా అతని అనుచరులతో కోర్టుల నుంచి స్టే తెప్పించాడు. పేదలకు ఇంటి స్థలాలు రాకుండా చేసిన ఘనత సాధించాడు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జనార్థనరెడ్డి. బిసిపై ప్రజలలో రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతుండటంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాడని టాక్ నడుస్తోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అయితే టీడీపీ నేత బీసీ జనార్థనరెడ్డి మాత్రం అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందకుండా అడ్డుకుంటూ ప్రజా వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నాడు. -
శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు
-
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొక్కుబడిగా చంద్రబాబు పర్యటన
-
ఈయనేనా మాజీ సీఎం.. చంద్రబాబును పట్టించుకోని జనం
సాక్షి, పగిడ్యాల(నంద్యాల జిల్లా): ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన మొక్కుబడిగా సాగింది. ముచ్చుమర్రిలో నిశ్శబ్ద వాతావరణంలో పర్యటన సాగగా, స్వాగతం పలికేందుకు నాయకులు కరువయ్యారు. ఎప్పటిలాగే బూటక మాటలు చెప్పి చంద్రబాబు వెళ్లిపోయారు. నందికొట్కూరులో రోడ్‌షోను ముగించుకుని ప్రత్యేక కాన్వాయ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ముచ్చుమర్రికి చేరుకున్నారు. అయితే చంద్ర బాబుకు జనసంచారం లేని నిర్మానుష్యమైన దారులు మాత్రమే స్వాగతం పలికాయి. సుమారు కిలోమీటరు దూరం ఊరిలో ఓపెన్ టాపు వాహనంలో చంద్రబాబు కనిపించినా స్థానికులు ఎవరూ ఆయనను పట్టించుకోకపోవడం గమనార్హం. స్థానిక నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపించడంతో బాబు ప్రాజెక్టు సందర్శన కేవలం 25 నిముషాల్లోనే ముగిసింది. ఇలా వచ్చి, అలా వెళ్లడం చూసి ఈయనేనా మాజీ ముఖ్యమంత్రి అనే చర్చ కొనసాగింది. చదవండి: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు? -
పొలంలో దొరికిన వజ్రం .. రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి?
పత్తికొండ: కర్నూలు జిల్లాలో ఓ మహిళ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని ప్రచారం జరిగింది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా శనివారం వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది. మహిళా రైతు శనివారం పొలంలో కలుపు మొక్కలు తీసే పనుల్లో ఉన్నారు. ముందు రోజు రాత్రి వర్షం కురవడంతో తళతళ మెరిసే రాయి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకెళ్లి పెరవళిలో ఓ వ్యాపారికి చూపించగా.. వెంటనే రూ.14 లక్షలు డబ్బులు.. 2 తులాలు బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ.15 లక్షల వరకు రాగా.. ఒక్క రోజులో ఆమె లక్షాధికారి అయ్యారు. తొలకరి వర్షాలు కురవగానే కర్నూలుతో పాటుగా అనంతపురం జిల్లాల్లోని గ్రామాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. భూమిలో నుంచి వజ్రాలు బయట పడతాయని ప్రచారం ఉంది. దీంతో గ్రామాల్లో జనాలు పొలాలకు వెళతారు.. వజ్రాల కోసం గాలిస్తుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి.. అలాగే మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం ఉంది. ఈ వజ్రాల కోసం కర్నూలు జిల్లాల వాళ్లే కాదు ఆ పొరుగు ఉండే జిల్లాల్లు, రాష్ట్రాల నుంచి వస్తుంటారు. పొలాల్లో తిరుగుతూ వజ్రాల వేటలో ఉంటారు. వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒకవేళ వజ్రం దొరికితే.. బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. ఈ వ్యాపారం అధికారికంగా జరగదనే చర్చ ఉంది. గత నెలలో మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లిలో ఓ వ్యక్తికి రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. -
మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్.. కీలక ఆదేశాలు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం వైఎస్సార్ రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందచేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం 9 మంది బాధితుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి. సృజన తన కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు. ఆర్థిక సహాయం అందుకున్న వారు.. K.సావిత్రి భర్త వెంకట్రాముడు 1. పత్తికొండ మండలం పత్తికొండ గ్రామానికి చెందిన కె.సావిత్రికి ఎనిమిది నెలల నుంచి గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యను విన్నవించుకున్నారు. T. నరసింహులు 2. కౌతాళ మండలం తోవి గ్రామం చెందిన టి నరసింహులు తను పేదరికంతో ఉన్నానని, కుమారునికి అనారోగ్య కారణంగా వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. మెహరున్నీసా 3. కర్నూలు నగరానికి చెందిన మెహరున్నీసా తన కుమార్తెకు కిడ్నీ సమస్య ఉందని, అలాగే తన కుమార్తె చదువుకు ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తన సమస్యను విన్నవించుకున్నారు. దిలీప్ కుమార్ రెడ్డి 4.మద్దికెర మండలం, గురజాల గ్రామం చెందిన పి. దిలీప్ కుమార్ రెడ్డి తాను తలసేమియా వ్యాధితో బాధపడుతున్నానని, నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించుకోవలసి వస్తుందని,. ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక సోమత లేక ఇబ్బందులు పడుతున్నానని తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. బోయ నరసింహులు 5. నందవరం మండలం, సోమల గూడూరు గ్రామం చెందిన బోయ నర్సింహులు తనకు కుడి కాలు, కుడి చేయి పని చేయడం లేదని, తనకు ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. K.రంగమ్మ 6. పత్తికొండ మండలం, నక్కల దొడ్డి గ్రామానికి చెందిన కె.రంగమ్మ వికలాంగత్వంతో ఉన్న తన కుమార్తెకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్‌కు విన్నవించుకున్నారు. P. ఈరన్న సోదరుడు 7.ఆలూరు మండలం, కోటవీధికి చెందిన పి. చిదానందం తన కుమారుడు ఈరన్నకు కడుపునొప్పి సమస్య ఉందని, ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. కురువ లక్ష్మి 8. ఆదోని మండలం, ఆదోని గ్రామానికి చెందిన కురవ లక్ష్మి తన కుమార్తెలు ఇరువురికి సరిగా చూపు కనపడక అందత్వంతో బాధపడుతున్నారని సీఎం జగన్‌కు విన్నవించుకున్నారు. L.మహేష్ 9. పత్తికొండ మండలం, పత్తికొండ గ్రామం ఎల్ మహేష్ తన కుమార్తె మూగ మరియు చెవిటి బాధతో ఇబ్బంది పడుతుందని తనను ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని మానవతా దృక్పథంతో ఇంత తొందరగా ఆర్థిక సహాయం అందజేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్‌కు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు. -
బటన్ నొక్కి వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకున్నాం
-
అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల
కర్నూలు: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆమె హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి రావడంతో లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కార్డియో సమస్యతో బాధపడుతున్నారని డా. రితేష్ బులెటిన్‌లో పేర్కొన్నారు. యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉందని, లక్ష్మమ్మకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్ రితేష్ స్పష్టం చేశారు. -
కర్నూలులో లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
-
అలా కుదరదు.. లోకేష్‌కు షాకిచ్చిన టీడీపీ కార్యకర్తలు!
సాక్షి, కర్నూలు: టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కర్నూలుకు చేరుకుంది. ఈ క్రమంలో లోకేష్‌కు టీడీపీ స్థానిక నేతలు ట్విస్ట్ ఇచ్చారు. పాదయాత్ర సందర్బంగా టీడీపీలో వర్గపోరు మరింత ముదిరింది. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఆలూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు వర్గ విభేదాలతో టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. కాగా, లోకేష్ పాదయాత్ర సందర్బంగా ఫ్లెక్సీల గొడవ షురూ అయ్యింది. ఆలూరులో ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఫొటో ఫ్లెక్సీలు కట్టాలని లోకేష్.. టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అయితే, సుజాతమ్మ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలను కట్టే ప్రస్తకేలేదని అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. దీంతో, వారి సమాధానం విని లోకేష్ బాబు ఖంగుతిన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అసమ్మతి నేతలు కట్టిన ఫ్లెక్సీల్లో సుజాతమ్మ.. తన ఫొటోను అతికించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి
కర్నూలు(హాస్పిటల్)/ఆలూరు రూరల్/ఎర్రవల్లి చౌరస్తా: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజా రెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఈ నెల 18వ తేదీన భర్త శేషిరెడ్డి వర్ధంతి ఉండడంతో హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన దేవనకొండ మండలంలోని తెర్నెకల్ గ్రామానికి ఆమె ఆదివారం మధ్యాహ్నం కారులో బయలుదేరారు. ఆమె ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు సమీపంలోని కొట్టం కళాశాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు టైర్ పేలడంతో అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. నీరజా రెడ్డి సీటు బెల్టు ధరించకపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మృతి చెందారు. డ్రైవర్ బాబ్జీకి గాయాలయ్యాయి. నీరజారెడ్డి ప్రమాదవార్త తెలిసి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కాటసానితో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆస్పత్రికి చేరుకున్నారు. నీరజారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. నీరజారెడ్డి రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ జిల్లా వేంపల్లె గ్రామానికి చెందిన రాంచిన్నారెడ్డి (హైకోర్టు రిటైర్డ్ జడ్జి) కుమార్తె నీరజా రెడ్డిని 1988లో కర్నూలు జిల్లా తెర్నెకల్ గ్రామానికి చెందిన సోమిరెడ్డి చిన్న కుమారుడు శేషిరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. శేషిరెడ్డి 1989లో పత్తికొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో శేషిరెడ్డి హత్యకు గురయ్యారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నీరజా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 2004లో కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నీరజారెడ్డికి అవకాశం కల్పించారు. అప్పట్లో ఈమె పీఆర్పీ అభ్యర్థి జయరాంపై 5 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె ఆలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈమె కూతురు హిమవర్షిణి తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. -
కర్నూలు మొదటి మహిళా జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ సృజన (ఫోటోలు)
-
కర్నూలు టీడీపీలో ముసలం.. నాలుగు స్తంభాల ఆట మొదలైంది
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా టికెట్ నాదంటే..నాదే అని పోటీ పడుతున్నారు. టికెట్ కోసం నాలుగు స్తంభాలాట మొదలైంది. దీనితో ఆలూరు టిడిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌ని ఢీకొనే సత్తా లేకున్నా టిడిపిలో బలమైన నాయకుల కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. గతంలో టిడిపికి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం నుండి 30 ఏళ్ళపాటు టిడిపి తన పట్టు కాపాడుకుంది. వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించిన తర్వాత చరిత్ర తిరగరాసారు. గత ఎన్నికల్లో అయితే జిల్లాలోనే టీడీపీకి అడ్రస్సే లేకుండా పోయింది. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో తిరిగి పుంజుకోవడానికి టిడిపి ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఆలూరు నియోజకవర్గంలో టిడిపి నాయకుల మధ్య ఐకమత్యం లేకపోవడం, పార్టీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో తిరిగి కోలుకోలేని విధంగా తుడిచిపెట్టుకొని పోయింది. ఆలూరులో తొలినుంచీ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ...2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించగా...ఓటమి ఎదురైంది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో తెలుగుదేశం పత్తా లేకుండా పోయింది. 2009 నుంచి చంద్రబాబు కారణంగానే టీడీపీ ఓడిపోతోందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో అప్పుడే టిడిపిలోకి వచ్చిన కోట్ల సుజాతమ్మకు సీటు ఇవ్వడంతో ఇక్కడ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. 2014లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ ను కాదని... కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వడంతో ఆమెకు వీరభద్రగౌడ్ వర్గం సహకరించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం ముందు కోట్ల సుజాతమ్మ నిలవలేకపోయారు. మళ్ళీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆలూరులో నాలుగు స్తంభాల ఆట మొదలైంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో టిడిపిలో వర్గ విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అందరికీ అర్దమవుతోంది. చంద్రబాబు ఆలూరు పర్యటనలోనే విభేదాలు భగ్గుమన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోనే నాలుగు టిడిపి కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వీరభద్రగౌడ్, కోట్ల సుజాతమ్మ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మరోవైపు వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున వేరు వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లులో కన్ ఫ్యూజన్ మొదలైంది. ఆలూరులో ఇంత గందరగోళం ఏర్పడటానికి పార్టీ అధినేత చంద్రబాబే కారణం అంటూ అక్కడి నాయకులే విమర్శిస్తున్నారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే పార్టీ దెబ్బతిన్నదని..పార్టీ నాయకులకే న్యాయం చెయ్యలేని బాబు ప్రజలకు ఏమి చెయ్యగలడని టిడిపి నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పూజారి కాలి తన్నుల కోసం పోటీ పడే భక్తులు
-
ధాన్యం రైతు ‘ధర’హాసం
ఎమ్మిగనూరు(కర్నూలు జిల్లా): వరి సాగు ఈ ఏడాది రైతుకు కలిసొచ్చింది. దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. వేరుశనగ, మిరప పంటలకు దీటుగా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 31,402 హెక్టార్లు. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించటం, ప్రాజెక్టుల్లో విస్తారంగా సాగునీరు లభ్యంకావటంతో కేవలం ఖరీఫ్‌లోనే 28,651 హెక్టార్లలో వరి సాగైంది. రబీలో కూడా కాలువల కింద రైతులు ఈ పంటను సాగు చేసుకొన్నారు. ఒక్కో ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టగా.. 35 నుంచి 45 బస్తాల వరకు దిగుబడులొచ్చాయి. గతేడాది క్వింటా ధర రూ.1,700 పలికింది. ఈ ఏడాది ఆరంభం(జనవరి)లో కర్నూలు సోనా క్వింటా రూ.2,000, ఆరున్నర రకం(చిన్నసోనా), ఎన్డీఎల్(నంద్యాలసోనా) రకాలు క్వింటాల్ రూ.2,300 వరకు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ.2,900 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు రూ. 3,000 మార్కును అందుకోనుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు ఖరీఫ్ పంట దిగుబడులను రైతులు వెంటనే అమ్ముకోకుండా అధిక ధరలు వచ్చే వరకూ వేర్‌హౌజ్‌ల్లో నిల్వచేస్తున్నారు .రైతుల అవసరాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 95 గోడౌన్ల నిర్మాణం చేపట్టింది. అంతేకాకుండా రైతులు నిల్వచేసుకొన్న పంటకు బ్యాంకులతో రుణాలు మంజూరు చేయిస్తోంది. కొంతమంది వేర్‌హౌజ్ యజమానులు కూడా వరి బస్తాకు రూ.1,000 చొప్పున రైతులకు రుణాలు ఇస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తీరుతున్నాయి. క్వింటా బియ్యం రూ.4500 మార్కెట్లో క్వింటా బియ్యం రూ.4500 పలుకుతోంది. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న శిక్షణలతో రైతుల్లో చైతన్యం మొదలైంది. పంట అమ్మకాల్లో గత కొంతకాలంగా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తాము పండించించిన పంట ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చుతున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు ప్రాంతాల్లోని రైసు మిల్లులకు రైతులు వరిధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలుసోనా బియ్యం క్వింటా రూ.4300, నంద్యాల సోనా, సన్నబియ్యం రూ.4500 వరకు విక్రయిస్తున్నారు. రైతుకు మంచికాలం రైతులకు మంచి కాలం నడుస్తోంది. పంటలకు రేట్లు బాగున్నాయి. ఎప్పుడూ రూ1,800 దాటని వడ్లు ఈఏడు రూ.2,900 అమ్ముతున్నాయి. నేను పది ఎకరాల్లో నంద్యాల సోనా రకం సాగు చేశా. 400 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.2900 చొప్పున విక్రయించా. –ఎన్ పరమేష్, గురుజాల గ్రామం గతంలో ఇంత రేటు లేదు తుంగభద్ర నది పంపుసెట్ల కింద 2.5 ఎకరాల్లో కర్నూలు సోనా పండించా. 100 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.2800 చొప్పున అమ్ముకొన్నా. గతంలో ఎప్పుడూ ఇంత రేటు లేదు. మంచి ధర వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. – కురువ కిష్టప్ప,వరి రైతు -
మిర్చి మిలమిల.. కలిసొచ్చిన సాగు!
కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి పంట రైతులకు లాభాలను తెచ్చి పెడుతోంది. జిల్లాలో సాధారణ సాగు 50,395 ఎకరాలు ఉండగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,26,215 ఎకరాల్లో సాగైంది. గోనెగండ్ల, ఆలూరు, హాలహర్వి, మంత్రాలయం, కోసిగి, హొళగుంద, దేవనకొండ, పెద్దకడుబూరు, ఆస్పరి, సి.బెళగల్, కల్లూరు, చిప్పగిరి తదితర మండలాల్లో సాగు ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రెండు కోతలు పూర్తి అయ్యాయి. మరో రెండు కోతలు వచ్చే అవకాశం ఉంది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లో నేలపై ఎర్ర తివాచీ పరిచినట్లు మిరప దిగుబడులు మిలమిల మెరుస్తున్నాయి. రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి మిర్చి సాగులోఎకరాకు రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. సగటున 25 క్వింటాళ్ల ప్రకారం దిగుబడులు వస్తున్నాయి. జిల్లాలో పండించిన మిర్చి 90 శాతం గుంటూరు మార్కెట్‌కు వెళ్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి ఎక్కువ తెలంగాణ రైతులు తెస్తున్నారు. కర్నూలు మార్కెట్‌కు నాణ్యత పరంగా మొదటి రకాలు రాకపోయినా ఈ ఏడాది క్వింటాకు గరిష్టంగా రూ.39 వేల వరకు ధర లభించింది. జిల్లాలో ఎక్కువగా బ్యాడిగ, సింజెంట, ఆర్మూర్, తేజ, సూపర్ డీలక్స్, దేవనూరు డీలక్స్ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఈ రకాలతో పండించిన మిర్చితో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. దీంతో సగటున క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ధర లభిస్తోంది. గతేడాది మిర్చి పంటను నల్ల తామర కొంత వరకు దెబ్బతీసింది. ఈ ఏడాది దీని ప్రభావం అంతగా లేదు. ‘డ్రిప్’ సదుపాయం జిల్లాలో ఈ ఏడాది 10వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించారు. అత్యధికంగా మిర్చికే డ్రిప్ సదుపాయం కల్పించడం విశేషం. దీంతో దిగుబడులు నాణ్యతతో వచ్చాయి. నీటి సదుపాయంతో సాగు చేసిన పొలాల్లో రికార్డు స్థాయిలో 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొందరు రైతులు మిర్చిని ఏసీ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. కలిసొచ్చిన సాగు గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామ వాసి అయిన గిడ్డయ్య... 20 ఏళ్లుగా ఎండిమిర్చి సాగు చేస్తున్నాడు. గతేడాది ఎకరాకు 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. దానిని కొంత రూ.21వేల ప్రకారం, మరికొంత రూ.30వేల ప్రకారం విక్రయించాడు. ఈ ఏడాది మూడు ఎకరాల్లో సాగు చేశాడు. ఇప్పటికే రెండు సార్లు కోత కోశాడు. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టగా దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు వస్తోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో మిర్చి క్వింటా ధర రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ధర పలుకుతోంది. మిర్చి సాగు బాగా కలసి రావడంతో గిడ్డయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కష్టానికి తగిన ఫలితం శ్రీనివాసరెడ్డి. గోనెగండ్ల మండలం కలుమూల గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్‌రెడ్డి. ఈ ఏడాది 1.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు రెండు కోతలు కోశాడు. మొదటి కోతలో 8 క్వింటాళ్లు రాగా క్వింటా రూ.21వేల ప్రకారం విక్రయించాడు. రెండో కోతలో 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 20వేల ప్రకారం అమ్మాడు. ఇంకా రెండు కోతలకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో ధరలు ఉండడంతో కష్టానికి తగిన ఫలితం వచ్చిందని ఈ రైతు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సారి చీడపీడల సమస్యలు లేవు జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు భారీగా పెరిగింది. అధిక దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే రకాలు అనేకం మార్కెట్లోకి వచ్చాయి. గతేడాది మిర్చి పంటను నల్ల తామర దెబ్బతీసింది. ఈ సారి నల్ల తామర నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. గతేడాదితో పోలిస్తే ఈ సారి చీడపీడల సమస్యలు అంతగా లేవు. దీంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. మిర్చికి గిట్టుబాటు ధరలు లభిస్తుండటం రైతులకు ఊరటనిస్తోంది. – రామాంజనేయులు, జిల్లా ఉద్యానాధికారి, కర్నూలు -
Mahashivratri 2023: శ్రీగిరిలో బ్రహ్మోత్సవ వైభవం!
అదిగదిగో శ్రీశైలం.. భూలోకాన కైలాసం అంటూ భక్తజనం మల్లన్న ఎదుట ప్రణమిల్లుతోంది. శ్రీశైలవాసా.. శరణు మల్లన్న అంటూ నీరాజనం పడుతున్నారు. నల్లమల అభయారణ్యం మీదుగా పగలు, రేయి చిన్నాపెద్దా తేడా లేకుండా పాదయాత్రగా వచ్చే శివభక్త గణం ఎండలు మండుతున్నా.. చల్లని గాలులు వణికిస్తున్నా.. భక్తిభావం తొణకడం లేదు. అడుగులన్నీ శ్రీగిరి వైపు పడుతున్నాయి. కైలాస ద్వారం చేరుకుని మరింత ఉత్సాహంతో మల్లికార్జునుడి దర్శనానికి బారులుదీరుతున్నారు. బ్రహ్మోత్సవ సందడి అంబరాన్ని తాకుతుండగా.. భక్తజనం పులకించిపోతుంది. శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీశైలంలో దేవదేవుళ్లు పూలపల్లకీపై వివహరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేళ భక్తజనం ఆనంద పరవశులై స్వామిఅమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరవ రోజు గురువారం నిర్వహించిన మల్లన్న పుష్పపల్లకీ సేవ దివ్య పరిమళభరితంగా సాగింది. ఆలయ తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుంగంధ పుష్పాలతో అలంకరించిన పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. పల్లకీలో స్వామి ఊరేగుతున్నంత సేపు అశేష భక్తజనవాహిని కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, డ్రమ్స్, డప్పులు, తప్పెట్లు, మేళతాళాలు, భజంత్రీలు, శంఖానాదాల కోలాహలం నడుమ గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. కార్యక్రమంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్థాన చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ఈవో ఎస్.లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్.కనకదుర్గ, అంబాల లక్ష్మీసావిత్రమ్మ, ఎం.విజయలక్ష్మి, మఠం విరుపాక్షయ్యస్వామి, ఓ.మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం భక్తజన సంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేకువజామున్నే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణవేణమ్మకు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం మల్లన్న దర్శనానికి బారులుదీరుతున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులందరికీ స్వామి వారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అందరికీ అలంకార దర్శనాన్ని కల్పిస్తున్నారు. మల్లికార్జున స్వామి గర్భాలయంలో కూడా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేసి త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భక్తులు నల్లమల అడవుల్లో నాగలూటి, పెచ్చుర్వు, కైలాసద్వారం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొర్రప్రోలూరు శివస్వాములు 20 కి.మీ దూరంలోని ఆత్మకూరు డివిజన్లోని రోళ్ల పెంట చేరుకుని అక్కడ నుంచి నేరుగా పెచ్చెర్వుకు చేరుకుంటున్నారు. అనంతరం భీముని కొలను మీదుగా శ్రీశైలక్షేత్రానికి నడకమార్గంలో మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులకు ఏ లోటు రానీయొద్దు ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటు రానీయొద్దని దేవస్థానం అధికారులను ఈఓ లవన్న ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్ర పరిధిలో తాత్కాలిక వైద్యశాల, అన్న ప్రసాదవితరణ, దర్శన క్యూలైన్ల్లను పరిశీలించారు. క్షేత్ర పరిధిలో వైద్య శిబిరాల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. లడ్డూ ప్రసాదాల కేంద్రాల వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమయానుసారంగా అన్నప్రసాదాలను అందించాలని సూచించారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందించాలని సూచించారు. మేము.. మీకు సహాయ పడగలము! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలదేవస్థానం ఆధ్వర్యంలో నందికూడలి వద్ద సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో క్షేత్రానికి సంబంధించిన వివరాలతో కరపత్రాలు అందుబాటులో ఉంచారు. భక్తులు ఏదేనీ సమాచారాన్ని అడిగిన వెంటనే మర్యాదపూర్వకంగా వారికి తెలియజేస్తున్నారు. రథశిఖర కలశానికి పూజలు ఆదివారం రథోత్సవం సందర్భంగా రథశిఖర కలశానికి గురువారం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈఓ లవన్న ప్రత్యేక పూజల నిర్వహించి, రథశిఖర కలశాన్ని స్వయంగా మోసుకుంటూ ఆలయప్రదక్షిణ చేశారు. అనంతరం రథశిఖర కలశాన్ని సంప్రదాయబద్దంగా రథం వద్దకు చేర్చారు. శ్రీశైలం నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ, గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
సంక్షేమం చేరువచేస్తూ..సమాజాన్ని చదివిస్తూ..!
‘‘పనుల్లేక వలసలు పోతున్నారనేది అవాస్తవం. రోజుకు లక్ష మందికి ‘ఉపాధి’ పనులు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 60వేల మంది మాత్రమే వస్తున్నారు. అలాగే పింఛన్లు తీసేశారనేది కూడా సత్యదూరమైన ప్రచారం. అర్హత ఉన్న ఎవ్వరి పింఛన్ తొలగించలేదు. ఏటికేడు పింఛన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేదలకు ఇళ్లు, వారి పిల్లలకు చదువు, పోషకాహారం అందించి ఆరోగ్యవంతులను చేయడంపై ప్రధానంగా దృష్టి సాధించాం. నా బిడ్డను కూడా అంగన్వాడీలో చేర్పించా. క్షేత్రస్థాయి నుంచి సమాజం, పరిస్థితులు తెలుసుకుంటూ పిల్లలు ఎదగాలి. పేదల కష్టాలు తీర్చడమే ప్రభుత్వ, అధికారుల ప్రధాన లక్ష్యం.’’ అని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలు పంచుకున్నారు. – సాక్షి ప్రతినిధి కర్నూలు సాక్షి: పనుల్లేక వలసలు పోతున్నారని ప్రచారం జరుగుతోంది? నిజంగా పనుల్లేవా? వలసకు కారణమేంటి? నివారణ చర్యలేంటి? కలెక్టర్: ఆదోని డివిజన్లో వలసలు దశాబ్దాలుగా ఉన్నాయి. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వలసలు వెళ్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చర్చించా. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెస్(సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషియల్ స్టడీస్)తో సర్వే చేయించా. గత డిసెంబర్ 12న రిపోర్ట్ ఇచ్చింది. ఉపాధి పనులు ప్రతీ గ్రామంలో ఉన్నాయి. జిల్లాలో రోజూ లక్ష పనిదినాలు కల్పించే అవకాశం ఉంది. కానీ 60వేల మందే వస్తున్నారు. పనుల్లేక వలసలు పోతున్నారనేది పచ్చి అబద్ధం. తెలంగాణ, గుంటూరులో నవంబర్, డిసెంబర్, జనవరిలో పత్తికోత కోసం ఆ పని తెలిసిన వారు వెళ్తారు. కిలోకు రూ.14చొప్పున కూలి ఇస్తారు. ఒక్కో వ్యక్తి క్వింటాపైన ఒలిచి రూ.1500–రూ.1800 వరకు సంపాదిస్తారు. పత్తికోత తర్వాత తిరిగి గ్రామాలకు వచ్చి ఉపాధి పనులకు వెళతారు. గతంలో కేరళ, కర్ణాటకకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాక్షి: ఆదోని డివిజన్లో పోషకాహార లోపం కూడా ఎక్కువగా ఉంది? ముఖ్యంగా అమ్మాయిల్లో ఐరన్ లోపం తీవ్రంగా ఉందని తెలుస్తోంది? కలెక్టర్: పోషకాహార లోపాన్ని నివారించడంలో మనం ప్రథమస్థానంలో ఉన్నాం. ఆదోని డివిజన్ వెనుకబాటుకు గురైంది. పేదరికం కూడా ఉంది. దీంతో సరైన పోషకాహారం పిల్లలకు అందలేదు. అందుకే ప్రతీ స్కూలు, కాలేజీలో 10–19 ఏళ్ల బాలికల వివరాలు సేకరిస్తున్నాం. వారంలోపు వివరాలు వస్తాయి. రక్తపరీక్షలు చేసి వారికి ఐరన్ లోపం ఉంటే మందులు ఇస్తాం. హాస్టళ్లలో ఉంటే మెడిసిన్ అందిస్తాం. స్కూళ్లకు వచ్చేవారికి ఇంటికే పంపిస్తాం. ఇంటివద్దే ఉన్న పిల్లలకు ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా అందిస్తాం. హాస్టళ్లు, విద్యాసంస్థల్లో పోషకాహారం అందిస్తున్నాం. పరీక్షలు రాసి పిల్లలు ఇళ్లకు వెళ్లేలోపు ఏ ఒక్కరిలో ఐరన్ లోపం లేకుండా చూస్తాం. సాక్షి: పింఛన్లు తీసేస్తున్నారని ప్రచారం జరుగుతోంది? వాస్తవం ఏంటి? కలెక్టర్: పింఛన్లు తీసేశారనే ప్రచారం సరికాదు. మొన్న ఒక గ్రామానికి వెళ్లాను. ఒక ఆవిడ వచ్చి పింఛన్ కావాలంది. అన్ని వివరాలు అడుగుతూ భూమి ఎంత ఉంది? అని ప్రశ్నిస్తే 17 ఎకరాలు అని చెప్పింది. ఇలాంటి వారికి పింఛన్లు ఎలా ఇస్తాం. పింఛన్ల పంపిణీ లక్ష్యం ఏంటి? అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛన్ తీయలేదు. కొత్తగా వితంతు, వృద్ధాప్య పింఛన్లు మరిన్ని ఇస్తున్నాం. ఏటికేడు పింఛన్ల సంఖ్య పెరుగుతోంది. సాక్షి: ఇళ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ఉగాదికి పూర్తి చేసే అవకాశం ఉందా? కలెక్టర్: 16వేల ఇళ్లు నిర్మిస్తున్నాం. 7వేలు పూర్తయ్యాయి. తక్కినవి పలు దశల్లో ఉన్నాయి. సొంత స్థలం ఉన్నా, గుడిసెలు, శిథిలావస్థలోని ఇళ్లు ఉంటే వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకోవచ్చు. సాక్షి: సమస్యల పరిష్కారం కోసం స్పందనకు వస్తున్నారు? ఫలితం ఉందా? కలెక్టర్: కచ్చితంగా. కావాలంటే మీరు ప్రజలను విచారించవచ్చు. అభ్యంతరం లేదు. సోమవారం మండల, డివిజన్, జిల్లా స్థాయిలో జరిగే స్పందన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సమస్యకు అక్కడికక్కడే పరిష్కారం సూచిస్తున్నాం. ఎక్కువగా భూసమస్యలు వస్తున్నాయి. గతేడాది 4,727 భూసమస్యలు వచ్చాయి. ఇందులో 70శాతం కుటుంబ తగాదాలే. ఇవేమీ చేయలేం. కోర్టు పరిధిలోని అంశాలు. మా పరిధిలోని సమస్యలు తప్పక పరిష్కరిస్తున్నాం. సాక్షి: మీ కుమారుడిని అంగన్వాడీలో చదివిస్తున్నారు? కారణమేంటి? కలెక్టర్: క్షేత్రస్థాయిలో అన్ని పరిస్థితులు తెలుసుకుంటూ పిల్లలు ఎదగాలి. చదువు పేరుతో రుద్ది, వాళ్లను ఉద్యోగంలో వేసి బందీలను చేయకూడదు. ఒకే జీవితం స్వేచ్ఛగా చదవాలి. సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి. అంగన్వాడీ నుంచి ఆక్స్ఫర్డ్ దాకా వెళ్లాలనేది నా కోరిక. ఫస్ట్ టీసీలో అంగన్వాడీ ఉండాలి. పిల్లలకు చదువుతో పాటు సమాజాన్ని చదివించడం నేర్పాలి. అందుకే ఈ నిర్ణయం. సాక్షి: ఇలా పనులకు వెళ్లడంతో పిల్లల చదువుకు ఇబ్బంది కలుగుతుంది కదా? ఈ కారణాలతోనే ఇది దేశంలో అక్షరాస్యతలో కూడా వెనుకబడి ఉందా? కలెక్టర్: పనుల కోసం వెళ్లేవారి పిల్లల కోసం సాధారణ హాస్టళ్లు కాకుండా 71 సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేశాం. గతేడాది ‘పది’ ఫెయిల్ అయినవారు, పనులకు వెళ్లేవారి పిల్లలను గుర్తించాం. వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇస్తున్నాం. ఏ కారణంతో ఎవ్వరూ బడికి వెళ్లని పరిస్థితి రాకూడదు. ‘పది’ ఫెయిల్ అయిన వారు కూడా మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులై పై చదువులకు పంపే ఏర్పాటు తీసుకున్నాం. చదవులతోనే జీవితాలు బాగుపడతాయని మేమంతా నమ్ముతున్నాం. సాక్షి: సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పాలన సులభతరమైందా? ప్రజలకు సేవలు అందించడంలో సంతృప్తి ఉందా? కలెక్టర్: గతంలో సమస్యల కోసం మండల కేంద్రానికి వెళ్లేవారు. ప్రజలు వెళ్లినప్పుడు అధికారులు ఉండొచ్చు? క్యాంపులకు వెళ్లొచ్చు. దీంతో ఒకటికి రెండుసార్లు పనులు వదులుకుని, డబ్బులు ఖర్చు చేసుకుని వచ్చేవారు. సచివాలయాలు వచ్చాక పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇతర సమస్యలు అక్కడే పరిష్కారమవుతున్నాయి. ఇవి ప్రజలకు సౌలభ్యంగా ఉన్నాయి. వీటి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నాం. సాక్షి: పదో తరగతి ఫలితాలు గతేడాది దారుణంగా వచ్చాయి? కారణమేంటి? ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకున్నారా? కలెక్టర్: గతేడాది ఫలితాలపై నేను చాలా బాధపడ్డాను. పిల్లలు కష్టపడి పాసవ్వాలి. అప్పడే భవిష్యత్‌లో వారి ఆలోచన దృక్పథం బాగుంటుంది. దొడ్డిదారిలో పాస్ అయితే, వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అలా అలవాటు చేయొద్దని టీచర్లకు చెప్పా. గతేడాది 22వేల మంది ఫెయిల్ అయ్యారు. ఈ అనుభవంతో ఈ ఏడాది ప్రత్యేకంగా మెటీరియల్స్ ఇచ్చి ప్రత్యేక చొరవ తీసుకున్నాం. ప్రత్యేక అధికారులను నియమించాం. ఒక్కో టీచర్‌కు 5గురు పిల్లల బాధ్యతను అప్పగించాం. 45రోజులు ప్రత్యేకంగా తీసుకున్నాం. వందశాతం లక్ష్యంగా పెట్టుకున్నాం. దగ్గరగా ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. -
నాలుగు వందల ఏళ్ల బావితో పెనవేసుకున్న బంధం ఇది!
సందుకో వాటర్ ప్లాంట్.. కూల్‌డ్రింక్ దుకాణాల్లోనూ వాటర్ ప్యాకెట్లు.. బ్రాండెడ్ కంపెనీ బాటిల్ కొని నీళ్లు తాగనిదే కొందరికి గొంతు తడారదు. ఎక్కడికెళ్లినా వాటర్ క్యాన్లను వెంట పెట్టుకుని వెళ్తున్న జనం కోకొల్లలు. ‘స్వచ్ఛత’ ముసుగులో నీటి వ్యాపారం ‘కోట్లు’ దాటుతోంది. ఇలాంటి ఈ రోజుల్లోనూ ఆ ఊరి జనానికి ఓ బావి నీరు అమృతంతో సమానం. ఊళ్లో వాటర్ ప్లాంట్లు ఉన్నా, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించినా.. ఆ నీటితోనే గొంతు తడుపుకోవడం చూస్తే ఆ గ్రామానికి బావితో ఉన్న అనుబంధం ఇట్టే అర్థమవుతుంది. ఆలూరు రూరల్(కర్నూలు జిల్లా): పట్టణాల సంగతి పక్కనపెడితే.. వాటర్‌ప్లాంట్ కనిపించని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదు. పక్కనే వాగులు, వంకలు పారుతున్నా.. సెలయేళ్లు ఉరుకుతున్నా.. బావులు అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు అందరి అడుగులు వాటర్‌ప్లాంట్ వద్దే ఆగుతున్నాయి. ఐఎస్ఐ మార్కు లేకపోయినా, మినరల్స్ ఏస్థాయిలో ఉంటున్నాయో తెలియకపోయినా.. ప్లాంట్ ముందు ఏర్పాటు చేసిన కుళాయి ముందు బిందెలు బారులు తీరుతున్నాయి. ఐదు, పది రూపాయలు.. మరికొన్ని చోట్ల 20 రూపాయలు వెచ్చించి కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధంగా లభ్యమవుతున్న నీటిని కాదని.. కోరి మరీ రోగాలను కొంటున్నారు. అయితే మండలంలోని మొలగవల్లి గ్రామం ఇప్పటికీ బావి నీటితోనే దాహం తీర్చుకుంటోంది. మినరల్ వాటర్ ప్లాంట్లు ఈ గ్రామంలోకి అడుగుపెట్టినా.. తాగునీరు మాత్రం ప్రతి ఇంటికీ ఈ బావి నీరు ఉండాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు శతాబ్దాలుగా ఈ బావి ప్రతి ఇంటికి అమృతం అందిస్తోంది. ఆ బావి నీళ్లే మినరల్ వాటర్ గ్రామంలో రెండు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా ఉంది. నాలుగు ఓహెచ్‌ఆర్ ట్యాంకులు నిర్మించారు. 7వేల వరకు ఇంటింటి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామస్తులు తాగునీటికి మాత్రం ఆ బావి నీళ్లనే వినియోగిస్తున్నారు. రోజు ఈ నీటిని తాగుతున్న స్థానికులు ఏదైనా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నీరు తాగితే ఒళ్లు నొప్పులు, అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. ఇక ప్రధానంగా అన్నం, పప్పు వండటానికి ఈ నీళ్లు అయితే బాగా ఉడుకుతాయని, ఇతర ఏ నీళ్లు అయినా సరిగా ఉడకవని, తిన్నట్లుగా కూడా ఉండదంటారు. పెద్దబావిలోనే.. చేదుడు బావి.. నాలుగు వందల ఏళ్ల క్రితం మొలగవల్లి గ్రామంలోని చెరువు పక్కన గ్రామస్తుల తాగునీటి అవసరాలకు ఓ పెద్ద బావి నిర్మించారు. దాదాపు రెండు వందల ఏళ్ల తర్వాత బావిలో నీరు ఇంకిపోవడంతో అప్పట్లో గ్రామస్తులు చిప్పలతో నీళ్లను తోడుకునే వారని వయసు మళ్లిన వాళ్లు చెబుతుంటారు. తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా వందేళ్ల క్రితం పెద్ద బావిలోనే స్థానికులు మరో చేదుడు బావిని తవ్వుకున్నారు. చిన్న బావి నిర్మించుకున్న తర్వాత ఎనిమిదేళ్ల క్రితం నీటిని బయటికి తోడి పెద్దబావిలో పూడిక తొలగించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వారానికి ఒకసారి తాగునీటి బావిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుతుంటారు. శుభకార్యాల వేళ గ్రామస్తులు పెద్దబావి వద్దకు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దబాయి నీళ్లు అమృతంతో సమానం నా వయసు 76ఏళ్లు. మా అవ్వతాతల కాలం నుంచి మాకు ఈ బాయి నీళ్లు అమృతంతో సమానం. బయటి నీళ్లు తాగితే కాళ్ల నొప్పులు, దగ్గు, పడిశం వస్తుంది. ఇంక వంట చేయనీక ఈ నీళ్లు అయితేనే బ్యాళ్లు, బియ్యం బాగా ఉడుకుతాయి. మా ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా గంగమ్మకు పూజలు చేయాల్సిందే. – గౌరమ్మ, వృద్ధురాలు, మొలగవల్లి బయటి నీళ్లు తాగితే అనారోగ్యం గ్రామంలో వాటర్ప్లాంట్లు పెట్టినా, కుళాయిలు ఉన్నా మాకు ఈ బావి నీళ్లు తాగితేనే గొంతు తడారుతుంది. మినరల్ వాటర్ కన్నా ఈ నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి నీళ్లు తాగితే ఒంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. గ్రామానికి సరఫరా అవుతున్న నీటిని ఇంటి అవసరాలకు వినియోగిస్తాం. – శ్రీరాములు, మొలగవల్లి బావితో మాకు ఎంతో అనుబంధం మా తాతల కాలం నుంచి ఈ బావితో మాకు అనుబంధం ఉంది. బయటి ప్రాంతాల్లో చిన్న వయస్సుకే మోకాళ్ల నొప్పులు, ఆ రోగం, ఈ రోగం అంటుంటారు. మాకు మాత్రం ఈ నీళ్లు తాగితే ఏ నొప్పులు ఉండవు. వ్యాపారం కోసం మినరల్ వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేసినా మేము మాత్రం బావి దగ్గరకు పోయి నీళ్లు తెచ్చుకునేందుకే ఇష్టపడతాం. – రామాంజినేయులు, మొలగవల్లి -
టీడీపీలో ఇంటిపోరు.. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిపై తిరుగుబాటు!
భూమా కుటుంబంలో విభేదాలు.. డోన్‌లో కేఈ తిరుగుబాటు.. టీడీపీలోని తాజా స్థితికి అద్దం పడుతోంది. పార్టీ అధినేతలు పర్యటిస్తే.. ఆ తర్వాత స్థానిక నేతల్లో సఖ్యత పెరుగుతుందనే భావన ఇప్పటి వరకుంది. అలాంటిది చంద్రబాబు జిల్లాకు వచ్చి వెళ్లిన తర్వాత ఆ పార్టీ నేతల తీరు పార్టీ పరువును బజారున పడేస్తుంది. డోన్‌లో పోటీకి ఓ అభ్యర్థి పేరును పార్టీ అధినేత ప్రకటించగా.. కేఈ ప్రభాకర్ తాను తప్పక పోటీ చేస్తానని తన మనసులోని మాట బయటపెట్టారు. ఇక అఖిలప్రియ వ్యవహార శైలి భూమా కుటుంబంలో అగ్గిరాజేసింది. ఒక్కొక్కరుగా ఆమెకు దూరం కాగా.. పార్టీ బలహీనపడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ.. నేతల కుమ్ములాటలు, విభేదాల నేపథ్యంలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం కాక తప్పదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గీయుల్లోనే వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన తర్వాత ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర, జాతీయ అధ్యక్షులనే సవాల్ చేయడం చూస్తే తమ్ముళ్ల తిరుగుబాటు ధోరణి అర్థమవుతోంది. కర్నూలు పర్యటనలో చంద్రబాబు డోన్ అభ్యరి్థగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ డోన్‌లో తన జన్మదిన వేడుకల సందర్భంగా చంద్రబాబు నిర్ణయంపై ధిక్కారస్వరం వినిపించారు. ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవని వారు, జనామోదం లేని వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని.. ఎవరెన్ని చెప్పినా కేఈ కుటుంబం 2024 ఎన్నికల్లో పోటీ చేసి తీరుతుందని ప్రకటించారు. తనకు వయస్సు మీద పడి ఉండొచ్చని.. ఆర్థిక, అంగ బలం ఉందనే విషయం ఎవ్వరూ మరవొద్దని చెప్పుకొచ్చారు. అంటే.. ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యరి్థగా లేదా మరో పార్టీ నుంచైనా బరిలో నిలుస్తామని చెప్పకనే చెప్పారు. ఇందులో భాగంగా కేఈ ప్రభాకర్ డోన్‌లో కార్యకర్తలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకోగా.. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘పార్టీ మీకు చాలా చేసిందని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు వద్దని, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం’ అని ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఫోన్ చేయించారు. అందుకే కేఈ గట్టిగానే బదులివ్వడంతో అచ్చెన్న ఫోన్ పెట్టేయడం, సోమిశెట్టి మౌనం వహించడం జరిగినట్లు టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. తెరవెనుక బీసీ రాజకీయం భూమా కుటుంబంలోని విభేదాలు, కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే పాలసీని పార్టీ తీసుకోవడంతో మైనార్టీ కోటాలో తన కుమారుడు ఫిరోజ్‌కు టిక్కెట్ దక్కించుకునేందుకు ఫరూక్ పావులు కదుపుతున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి గట్టిగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేఈ, భూమా కుటుంబాలు బలహీనమైతే టీడీపీలో తాను బలమైన నేతగా ఎదగొచ్చనే యోచనతో డోన్, నంద్యాల, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో తన అనుకూలురకు టిక్కెట్లు ఇప్పించుకునే ప్రయత్నం బీసీ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ‘భూమా’ కుటుంబంలో తారస్థాయికి విభేదాలు భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఎమ్మెల్యేగా భూమా బ్రహా్మనందరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అఖిల, బ్రహ్మం మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. బ్రహా్మకి వ్యతిరేకంగా ఆళ్లగడ్డలో పార్టీ కార్యాలయాన్ని అఖిల ప్రారంభించి, అక్కడ కార్యకర్తలకు తన తమ్ముడు జగత్ విఖ్యాత్ అందుబాటులో ఉంటారని చెప్పింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మం గైర్హాజరయ్యారు. దీనికి తోడు నాగిరెడ్డి మృతి తర్వాత కుటుంబంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అఖిలను కుటుంబ సభ్యులంతా విభేదించి దూరమయ్యారు. ఇకపోతే కేసులు, ఇతర వ్యవహారాలు.. రాజకీయంగా చురుగ్గా లేకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో అఖిలకు ప్రత్యామ్నాయంగా కిషోర్‌రెడ్డిని కూడా టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. కుటుంబసభ్యులు కూడా అతనికే మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా దూరమవుతూ.. - ఓ క్రషర్ విషయంలో సమీప బంధువు శివరామిరెడ్డి దూరం కావడంతో పాటు పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. - నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో ఆయనా మౌనం దాల్చారు. - అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితోనే విభేదాలు తలెత్తడంతో అతనూ బీజేపీలో చేరారు. - నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహా్మనందరెడ్డి సోదరుడు మహేశ్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. - భూమా నాగిరెడ్డికి ఆత్మగా మెలిగిన ఏవీ సుబ్బారెడ్డితోనూ వైరం. నువ్వేంది మాకు చెప్పేది అచ్చెన్నా.. ‘మీ అన్న ఎర్రన్నాయుడికి టిక్కెట్ ఇప్పించింది మా అన్న కేఈ కృష్ణమూర్తి! నువ్వేంటి మాకు చెప్పేది. మీ ఇంట్లో నువ్వు.. మీ అన్న కుమారుడు, కూతురు.. ముగ్గురికి టిక్కెట్లు కావాలి. మేము మీరు చెప్పినట్లు వినాలా?’’ – అచ్చెన్నాయుడుతో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఫోన్ సంభాషణగా టీడీపీ వర్గాల్లో చర్చ అన్నా చెల్లెలు మధ్య కయ్యం ఈనెల 8న భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా బ్రహ్మానందరెడ్డి రక్తదానం, అన్నదానాన్ని తన నివాసం వద్ద చేపట్టారు. అలాగే అఖిలప్రియ మరో ప్రాంతంలో రక్తదానం, అన్నదానం నిర్వహించారు. ఇద్దరూ ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరు కాలేదు. దీన్నిబట్టి ఇరు వర్గాల మధ్య వైరం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. -
మరో 20 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఘోరం.. ఆ ఇంట తీవ్ర విషాదం
ఆదోని అర్బన్(కర్నూలు జిల్లా): పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృత్యు ఒడి చేరాడు. మరో ఇరవై రోజుల్లో పెళ్లి ఉందనగా.. గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం పెద్దహరివాణం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎమ్మిగనూరు మండలం గుడికంబాల గ్రామానికి చెందిన హేమాద్రి, రేణుక దంపతుల మొదటి కుమారుడు అరుణ్‌పాండు (24) శిరుగుప్పలోని ఓ ఫర్టిలైజర్స్ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజూ లాగే గురువారం కూడా విధులు ముగించుకొని గ్రామానికి వస్తుండగా.. పెద్దహరివాణం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రియురాలు దీంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా అరుణ్‌పాండుకు మద్దికెర గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరో 20 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దశాబ్దాల సమస్యకు దారి చూపిన జగన్
సి.బెళగల్(కర్నూల్ జిల్లా): కోడుమూరు, కృష్ణగిరి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు దారి చూపిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అన్నారు. మంగళవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం వద్ద హంద్రీ నదిపై వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, కుడా చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి తదితరులు హాజరయ్యారు. హంద్రీ ఒడ్డున భూమిపూజ చేసి శిలా ఫలకాన్ని వీరు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేయడంతో పలు గ్రామాల ప్రజల కష్టా లు తొలగిపోతున్నాయన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించుకుందామన్నా రు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడు తూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూసి చలించి, అధికారంలోకి వస్తే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారన్నారు. కృష్ణగిరి, కోడుమూరు ప్రజలు ఎప్పటికీ జగనన్న మేలు మరువరన్నారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజల వద్దకు పంపుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. -
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్.. 12 గ్రామాలకు తీరనున్న కష్టాలు
సాక్షి, కర్నూలు: దశాబ్దాల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం దగ్గర హంద్రీ నదిపై కాజ్వే నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులను ఓఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణ పనులను ఈనెల 24న ప్రారంభించనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా కృష్ణగిరి మండలంలోని ఎస్‌హెచ్ ఎర్రగుడి నుంచి హంద్రీనది మీదుగా కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామానికి 2017 నవంబర్ 27వ తేదీన నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలు హంద్రీనదిపై కాజ్వే నిర్మించాలని కోరారు. మన ప్రభుత్వం వస్తే కాజ్వే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని అప్పట్లో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు నిధులను మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. ప్రయాణం సులువు గోరంట్ల నుంచి కొత్తపల్లె, ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామాలకు రెండు కిలోమీటర్లు దూరం ఉంది. హంద్రీ నదికి వరద వస్తే 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయా గ్రామాలకు చేరుకోవలసిన దుస్థితి ఉండేది. హంద్రీకి వరద వచ్చే సమయాల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళలేని పరిస్థితి. కాజ్వే నిర్మాణం చేపడితే కష్టాలు తొలగనున్నాయి. అలాగే కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని కొత్తపల్లె, రామకృష్ణాపురం, ఎస్‌హెచ్ ఎర్రగుడి, ఎర్రబాడు, చుంచు ఎర్రగుడి, మన్నేగుంట, కృష్ణగిరి, బాపనదొడ్డి, కంబాలపాడు, జి.మల్లాపురం, ఆగవెలి, పి.కోటకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణం సులువు కానుంది. ఇవీ కష్టాలు.. ►గోరంట్ల గ్రామం దగ్గర ఉన్న హంద్రీనది ప్రతి ఏటా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ► ఈ నది దాటి వెళ్లేందుకు కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ►కొన్ని సందర్భాల్లో రోజులు తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. ► అత్యవసర సమయాల్లో కర్నూలు నగరానికి, కోడుమూరు పట్టణానికి చేరుకోవాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. ► పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిరోజూ హంద్రీ నది పరీక్ష పెట్టేది. ►కాన్పుల కోసం గర్భిణులను అసుపత్రికి తీసుకెళ్లాలంటే తలప్రాణం తోకకు వచ్చేది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం హంద్రీ నదిపై కాజ్వే లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బాల్యంలో మా ఊరు ఎన్హెచ్ఎర్రగుడి నుంచి నేను లద్దగిరికి చదువుకోవడానికి వెళ్లేవాడిని. హంద్రీపై కాజ్వే లేక చాలా ఆవస్థపడ్డా. హంద్రీ నదికి వరద వచ్చిన రోజుల్లో స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి. దశబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు కాజ్వే నిర్మాణంతో పరిష్కారం దొరికింది. చాలా ఆనందంగా ఉంది. – సుధాకర్, కోడుమూరు ఎమ్మెల్యే చాలా సంతోషం ఈ కష్టం ఇప్పటిది కాదు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. భారీ వర్షం వస్తే హంద్రీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయి. పంటలు అమ్ముకోవాలంటే మేం నది దాటి వెళ్లాలి. కాజ్వే లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నాం. మా ఊరి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడుమూరుకు వెళ్లి అక్కడి నుంచి కర్నూలు మార్కెట్‌కు పంట ఉత్పత్తులు తీసుకెళ్తున్నాం. లేదంటే కృష్ణగిరికి వెళ్లి వెల్దుర్తి నుంచి కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. గోరంట్ల వద్ద హంద్రీ నదిపై బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 25 కిలోమీటర్ల ప్రయాణంతో కర్నూలుకు చేరుకుంటాం. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాణం పూర్తయితే రైతుల ఇబ్బందులు తొలగిపోతాయి. మా ఊరితోపాటు చాలా గ్రామాలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగు పడతాయి. – సుంకన్న, ఎస్‌హెచ్ ఎర్రగుడి 24న నిర్మాణ పనులకు శంకుస్థాపన గోరంట్ల సమీపంలోని హంద్రీ నదిపై కాజ్వే నిర్మాణానికి ఈ నెల 24వ తేదీన శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూర్ జయరాం, ఎమ్మెల్యేలు కంగాటి శ్రీదేవి, సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, హాజరుకానున్నారు. – చౌడేశ్వరరావు, డీఈఈ, పీయూఐ -
వ్యాధి ముదిరిపోయిన తర్వాత లక్షణాలు, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతే!
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్‌ను పూర్వకాలంలో రాచపుండుగా పిలిచేవారు. ఈ వ్యాధి ధనికులకే వస్తుందని అప్పట్లో దానికి ఆ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వ్యాధికి పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లే తెలియదు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత దాని తాలూకు లక్షణాలు ప్రారంభమై అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జనవరి నెలను గర్భాశయ ముఖద్వార అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ సంవత్సరం ‘కొన్ని తరాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంతం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెరిగిన వైద్యులు రెండు దశాబ్దాల క్రితం రాయలసీమ కంతటికీ కర్నూలులో ఒక్కరే క్యాన్సర్ వైద్యులుండేవారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పాతికమందికి క్యాన్సర్ డాక్టర్లున్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 60 నుంచి 80 మంది కొత్తగా క్యాన్సర్ బాధితులు వస్తున్నారు. అలాగే ప్రతిరోజూ 10 నుంచి 15 మందికి కీమోథెరపి, 25 మందికి రేడియోథెరపి చేస్తున్నారు. నిత్యం 80 నుంచి 120 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెరి్వకల్ క్యాన్సర్) బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 40 వేల వరకు ఉంటుందని వైద్యుల అంచనా. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు విశ్వభారతి, ఒమెగా, శాంతిరామ్ హాస్పిటల్లలో క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ క్యాన్సర్ కణతులు తొలగించేందుకు నిర్వహించే శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా చేస్తున్నారు. ఈ పథకం లేనప్పుడు రోగులకు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. అన్ని ఆసుపత్రుల్లో క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుని డిశ్చార్జ్ అయిన రోగులకు ఆసరా పథకం కింద రోజుకు రూ.225, నెలకు రూ.5వేలు తక్కువ కాకుండా ప్రభుత్వం అందజేస్తోంది. సెర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఇది ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు ఇవీ.. ► సాధారణ రుతుక్రమం గాకుండా యోని నుంచి రక్తస్రావం ► లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ► పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ► యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ► మూత్రం, మలవిసర్జనలో ఆటంకాలు ఇలా చేస్తే నివారణ సాధ్యం 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా 1,24,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు నమోదవుతున్నారు. వారిలో సగం మంది ఒక సంవత్సరంలోపు మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. దీనికి నివారణగా 30 ఏళ్ల వయస్సు నుంచి లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలందరూ 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి హెచ్‌పీవీ పరీక్ష చేయించుకోవాలి. 9 నుంచి 26 సంవత్సరాల వయస్సుగల బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు వేయాలని సూచించాలి. ఈ వ్యాధిని నయం చేయడం కంటే నివారణ ఉత్తమం. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు. –డాక్టర్ శిల్పారెడ్డి, గైనకాలజిస్టు, కర్నూలు ల్యాప్రోస్కోపి ద్వారా శస్త్రచికిత్స నయం కాని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. –డాక్టర్ సి. వాసురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు -
దిగులు తొలగిస్తూ.. ధీమానిస్తూ!
కర్నూలు(అగ్రికల్చర్): అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలు.. ఊహించని విపత్తులు.. పేద కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో ఆయా కుటుంబాల్లో నైరాశ్యం నెలకొంటోంది. అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితం తలకిందులవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు సైతం ఆగిపోతున్నాయి. పేదల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తూ వారిలో దిగులును తొలగిస్తోంది. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తూ ధీమా నింపుతోంది. రూపాయి కూడా ప్రీమియం లేకుండా.. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఒకరికి (ఇంటి యజమానికి) రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో 5,05,094 కుటుంబాలకు, నంద్యాల జిల్లాలో 4,13,498 కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. బీమా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో రెండు కాళ్లు లేదంటే రెండు చేతులు పోతే రూ.5 లక్షలు, ఒక కాలు, ఒక చేయిపోతే రూ.2.50 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.లక్ష ప్రకారం పరిహారం లభిస్తుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ప్రమాద బీమా, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణం బీమా వర్తిస్తుంది. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకొని క్లయిమ్‌లను పరిష్కరిస్తారు. సహజ మరణానికి పరిహారం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అసంఘటిత రంగంలోని రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం లేకుండా వైఎస్సార్ బీమా సదుపాయం కల్పించడం విశేషం. సహజ మరణం పొందినా, ప్రమాదశాత్తూ మరణించినా వెంటనే సంబంధిత సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంటుకు సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లిస్తారు. గడువులోపు పరిహారం.. వైఎస్సార్ బీమా కింద క్లయిమ్‌ల పరిష్కారానికి ప్రత్యేక షెడ్యూలు ఉంది. దీని ప్రకారం సహజ మరణం క్లయిమ్‌లను 24 రోజులు, ప్రమాద మరణం క్లయిమ్‌లను 65 రోజుల్లోను పరిష్కరిస్తున్నారు. సచివాలయం స్థాయిలో జరిగే డాక్యుమెంటేషన్‌ను అనుసరించి క్లయిమ్‌లు పరిష్కారం అవుతాయి. సహజ, ప్రమాద మరణాలకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంటు డాక్యుమెంటేషన్ పూర్తి చేసి కలెక్టరేట్లోని డీఆర్డీఏ– వైకేపీలోని వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్‌కు పంపాల్సి ఉంది. కాల్ సెంటరులో బీమా డీపీఎం, డీఆర్డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఆమోదించి పరిహారం చెల్లింపు కోసం జీఎస్డబ్ల్యూస్ డిపార్టుమెంట్‌కు పంపుతారు. సహజ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రమాద మరణాలకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. సత్వర సాంత్వన వైఎస్సార్ బీమా పరిహారం ప్రొసీడింగ్స్ అందుకుంటున్న ఈమె పేరు జెల్లి జయమ్మ. ఆదోని మండలం ఆరేకల్ గ్రామానికి చెందిన ఈమె భర్త జెల్లి రాఘవేంద్ర ప్రమాదవశాత్తూ్త 2022 సెప్టెంబరు 6వ తేదీన మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరికి వైఎస్సార్ బీమా అండగా నిలిచింది. నాలుగు నెలల్లోనే 2022 డిసెంబరు 1న రాఘవేంద్ర భార్య జెల్లి జయమ్మకు రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. సత్వర స్వాంతన చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని జయమ్మ తెలిపారు. బాధిత కుటుంబానికి ఊరట ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు నాగేశ్వరమ్మ, కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని మాసామసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈమె భర్త కురువ నాగరాజు ప్రమాదవశాత్తు 2022 ఆగస్టు 10న మృతి చెందాడు. ఇద్దరు కుమారుల పోషణ కష్టంగా ఉన్న తరుణంలో ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా ద్వారా చేయూత ఇచ్చింది. నాగేశ్వరమ్మకు రూ. 5 లక్షల పరిహారం లభించింది. పకడ్బందీగా బీమా పథకం అమలు వైఎస్సార్ బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సచివాలయంలో ఎంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి పంపితే అంత త్వరగా క్లయిమ్ పరిష్కారం అవుతుంది. రైస్ కార్డు కలిగిన కుటుంబాలన్నిటికీ వైఎస్సార్ బీమా లభిస్తుంది. కర్నూలు జిల్లాలో 5 లక్షలకుపైగా కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయం ఉంది. – వెంకటసుబ్బయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ–వైకేపీ లక్షలాది పేద కుటుంబాలకు భరోసా జాప్యం లేకుండా క్లయిమ్‌లు పరిష్కారమవుతుండడంతో ఆయా కుటుంబాలకు భరోసా లభిస్తోంది. 2021–22లో వైఎస్సార్ బీమా కింద 1,398 కుటుంబాలకు భరోసా దక్కింది. 2022–23లో కర్నూలు జిల్లాలో సహజ మరణం పొందిన 496 కుటుంబాలకు రూ.4.82 కోట్లు, నంద్యాల జిల్లాలో 477 కుటుంబాలకు రూ.4.60 కోట్లు పరిహారం లభించింది. 30 క్లయిమ్‌లకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 80 రిజిష్టర్ కాగా 35 పరిష్కారం అయ్యాయి. నంద్యాల జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 76 రిజిష్టర్ కాగా 23 పరిష్కారం అయ్యాయి. మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయి. -
రూ.150 కోట్లతో కామినేని ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడంటే?
వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్ తాజాగా కర్నూలులో నూతన ఆసుపత్రిని ప్రారంభించింది. జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్ పేరుతో రూ.150 కోట్లతో 150 పడకలతో ఇది ఏర్పాటైంది. ఈ ఏడాదే రూ.75 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో క్యాన్సర్ చికిత్స కేంద్రం సైతం స్థాపించనున్నారు. మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను ఈ కేంద్రం తదుపరి స్థాయికి మారుస్తుందని సంస్థ తెలిపింది. అందుబాటు ధరలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు కామినేని హాస్పిటల్స్ వివరించింది. కార్డియాక్, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్టీ, జనరల్, మినిమల్ యాక్సెస్ సర్జరీ, ప్లాస్టిక్/కాస్మెటిక్ సర్జరీ, రెనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, యూరాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కామినేని ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. -
Kurnool District: గ్రామీణ ప్రాంతాల్లో మందగించిన పన్ను వసూళ్లు
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులను సమీకరించుకోవడం, పన్ను వసూళ్లు, ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించిన నిధుల పరిపుష్టితోనే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుత పాలకవర్గాలు ఆ దిశగా అడుగులు వేయకుండా, కేవలం ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లపైనే ఆధారపడుతుండటంతో అభివృద్ధి నిదానించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులకు తోడుగా.. గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరములపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే ఆయా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నులు, పన్నేతరములకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండున్నర నెలలు మాత్రమే ఉండడంతో పన్నుల వసూలు వేగం పుంజుకుంది. సర్పంచుల పాత్ర కీలకం గ్రామ పంచాయతీ పరిధిలో పన్ను వసూలు చేయడం, వాటిని అభివృద్ధి పనులకు వెచ్చించుకునే విషయంలో గ్రామ సర్పంచులది కీలకపాత్ర. ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గ్రామాభివృద్ధి కోసం వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. అయినా వివిధ గ్రామాల సర్పంచులు పన్ను వసూళ్లపై పెద్దగా దృష్టి సారించనట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం, ఇతర గ్రాంట్ల పైనే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దృష్టి కేంద్రీకరించాయే తప్ప స్థానిక వనరుల నుంచి పంచాయతీలకు వచ్చే ఆదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు(ఇంటి పన్ను, లైబ్రరీ సెస్సు, కుళాయి పన్ను ), పన్నేతరముల (మార్కెట్ వేలాలు, షాపింగ్ అద్దెలు, లైసెన్స్ ఫీజులు, కుళాయి ఫీజులు, భవన నిర్మాణ ఫీజులు) రూపంలో సొంత వనరులను సమీకరించుకోవడంలో సర్పంచులు తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లె ఆదాయాన్ని పెంచేందుకు సమష్టి కృషి గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని పెంచుకునే అంశంలో క్షేత్ర స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక గ్రామ పంచాయతీల్లో దశాబ్దం క్రితం ఉన్న ఇళ్ల సంఖ్యనే నేటికీ లెక్కల్లో చూపుతున్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 శాతం గ్రామ పంచాయతీలు భౌగోళికంగా విస్తరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామ పంచాయతీల్లో కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా గ్రామ శివారుల్లో ఏర్పాటవుతున్న కాలనీలు, కొత్త ఇళ్లపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యక్షంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. డివిజన్ల వారీగా లక్ష్యాలు పన్నుల వసూళ్లకు సంబంధించి డివిజన్ల వారీగా లక్ష్యాలను నిర్ణయించాం. ఒక్కో డివిజన్ వారానికి రూ.కోటి వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశాం. అలాగే ముగ్గురు డీఎల్పీఓలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వసూళ్లకు సంబంధించి ప్రతి రోజు జిల్లా కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయిలోని ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులను కోరుతున్నాం. – టి.నాగరాజునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు గ్రామాల్లో పన్నులు చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాము విధులు నిర్వహిస్తున్న గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి చెల్లిస్తున్నారు. అలాగే డివిజన్, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేస్తాం. – గురుస్వామి, అధ్యక్షులు, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం -
మూగనేస్తాలు.. మౌనభావాలు..
మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. పక్క పక్కనే ఇళ్లు ఉంటున్నా.. అంటీముట్టనట్లుగా ఉండటం పరిపాటిగా మారింది. మనసు విప్పి మాట్లాడుకోవటం మాని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో సావాసం చేయడం అధికమైంది. పల్లెటూళ్లలో కాస్త కలివిడితనం ఉంటున్నా.. పట్టణాల్లోని కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా జీవనం సాగుతోంది. ఈ కోవలో ఏదో కోల్పోయిన భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మూగజీవాలతో స్నేహం కాస్త ఊరటనిస్తోంది. మాటలు రాకపోయినా మనసుకు దగ్గరయ్యే స్వభావం ప్రశాంతత చేకూరుస్తోంది. – పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు/కర్నూలు డెస్క్ చెట్టుపై నిద్రపోయిన పక్షులన్నీ తెల్లారింది లెవండోయ్ అన్నట్లు ఒక్కసారిగా పైకి లేచి ఆహార వేటకు పయనమవడం.. గంప కింద కోడి కొక్కొరొక్కోమని మేల్కొలపడం.. పిడికెడంత కూడా లేని పిచుకలు కీచుకీచుమంటూ ఇంటి ముందు వాలి గింజల కోసం వెతుకులాడటం.. పెంపుడు కుక్కలు యజమాని వెంట పొలం బాట పట్టడం.. పశువులు పొలం పనులకు సిద్ధమవడం.. ఇదీ పల్లె జీవనం. మనిషి జీవితంలో ఈ మూగప్రాణాలు ఓ భాగం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ వీటితో అనుబంధం క్రమంగా తగ్గిపోతోంది. యాంత్రిక జీవనంలో మునిగితేలుతూ మానసిక ఆనందాన్ని కోల్పోతున్న వేళ ఇప్పుడిప్పుడే మూగ ప్రాణుల మీద మమకారం పెరుగుతోంది. డబ్బు పోయినా పర్వాలేదు.. మనసు విప్పి మాట్లాడితే మనసుకు సాంత్వన లభిస్తుందనే అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న ఖలీల్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతనికి చిన్నప్పటి నుంచి మూగజీవాలంటే ప్రాణం. మొదట కుక్కలు, పిల్లులతో సావాసం చేసినా, ఐదేళ్లుగా పక్షులను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. సాధారణంగా ఒకటో, రెండో పక్షులను ఓ చిన్న కేజ్‌లో బంధించి అమితమైన ప్రేమను చూపడం సహజం. ఇందుకోసం వెచ్చించే డబ్బు కూడా వేలల్లోనే ఉంటుంది. అయితే ఇతను తన ఇంటి ఆవరణనే పెద్ద బోనుగా మలచడం విశేషం. పక్షుల స్వేచ్ఛా విహంగానికి అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ బోనుకు చేసిన వ్యయం అక్షరాలా రూ.3లక్షల పైమాటే. ఇక ఈ ఐదేళ్లలో అతను పెంచుతున్న పక్షుల ఖరీదు రూ.7లక్షల పైనే కావడం చూస్తే ఆ మూగ ప్రాణులు అతని జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో తెలుస్తోంది. ఇంతే కాదు.. ప్రతినెలా వీటికి చేస్తున్న ఖర్చు రూ.5వేల వరకు ఉంటోంది. కింద పడితే తినవు.. డబ్బు విలువ పెరుగుతున్న కొద్దీ ఆహారం దొరకడం కూడా కష్టతరమవుతోంది. నిరుపేదలు ఇప్పటికీ దుర్భర జీవనం గడపటం చూస్తున్నాం. కొందరికి డబ్బు ఎక్కువై ఆహార పదార్థాలను వీధులపాలు చేస్తే.. ఇప్పటికీ ఆ విస్తర్లకేసి చూసే జనం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్ని పక్షుల విషయానికొస్తే.. కింద పడిన గింజలను ముట్టుకోవంటే ఆశ్చర్యమేస్తుంది. యజమాని ఎంతో ఇష్టంగా వాటి నోటికి అందించే దేనినైనా తినే ఈ పక్షులు, నోరు జారితే వాటికేసి కూడా చూడకపోవడం వింతేమరి. కుటుంబ సభ్యుల్లానే.. పక్షుల పెంపకం కుటుంబంలో భాగమవుతోంది. వీటి పెంపకం కాస్త కష్టమే అయినా ఇష్టాన్నిపెంచుకుంటే కుటుంబ సభ్యుల తరహాలోనే దగ్గరవుతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొద్దిసేపు పక్షులతో గడిపితే మానసిక ఆనందం లభిస్తుందని పక్షుల ప్రేమికులు చెబుతున్నారు. ఇక ఉదయాన్నే పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే పిల్లలు సైతం వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వీటిపై అమితమైన ప్రేమను చూపుతూ స్నేహితుల్లా భావిస్తుండటం విశేషం. కదలికలు పసిగట్టి.. బాధ తెలుసుకొని పక్షుల పెంపకం కత్తి మీద సాములాంటిదే. వాటితో ఎంత అభిమానం పెంచుకుంటే అంత దగ్గరవుతాయి. కొన్నాం.. తెచ్చుకున్నాం.. అని కాకుండా, ప్రతి రోజూ వాటితో కొంత సమయం గడిపినప్పుడే ఏం తింటున్నాయి, ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలు తెలుస్తాయి. ముందు రోజు వేసిన ఆహారం తినకపోతే ఏదో అనారోగ్యంతో ఉన్నట్లుగా గుర్తిస్తారు. లేదా కదలికలు రోజులాగా ఉండకపోయినా ఏదో బాధలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ మేరకు వాటికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం వీటికి వ్యాక్సినేషన్ చేయిస్తే ఆరోగ్యంగా ఉంటాయని యజమానులు చెబుతున్నారు. పెరుగుతున్న పక్షుల విక్రయ వ్యాపారం మారుతున్న ప్రజల అభిరుచి వ్యాపార పరంగానూ అభివృద్ధి చెందుతోంది. అక్వేరియంలతో పాటు వివిధ రకాల పక్షులు, కుందేళ్ల విక్రయ దుకాణాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. దుకాణాల్లో పక్షులను ఉంచేందుకు రంగురంగుల పంజరాలు ఉంటున్నాయి. వీటికి అవసరమైన ఆహారాన్ని కూడా యజమానులు దుకాణాల్లోనే విక్రయిస్తున్నారు. పక్షుల పెంపకానికి అవసరమైన సామగ్రిని చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారు. తాబేళ్లలో వివిధ రకాలు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లు, గోల్డ్ రంగు తాబేలు, గ్రీన్ తాబేళ్లు తదితరాలు. వీటిలో గ్రీన్ తాబేలు అమ్మడానికి, పెంచడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా ఇళ్లలో ఈ తాబేళ్లు కనిపిస్తున్నాయి. వీటి ధర రూ. 500 నుంచి రూ.2 వేల వరకు ఉంటోంది. దీపావళి అంటే దడ పక్షులకు దీపావళి వస్తే దడ. టపాసుల శబ్దాలకు బెంబేలెత్తుతాయి. కొన్ని పెంపుడు పక్షులు ఆ శబ్దాలకు హార్ట్ స్ట్రోక్‌కు గురవుతాయి. దీపావళి సమయంలో వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తప్పవని యజమానులు చెబుతున్నారు. వాటితో గడిపితే సమయమే తెలియదు మనిషికి కష్టం వస్తే మాటల్లో చెప్పుకోగలం. పక్షులు తమ బాధను చెప్పుకోలేవు. మనమే అర్థం చేసుకోవాలి. ఉదయం లేవగానే వాటి వద్దకు వెళ్లడం, వాటి బాగోగులను పరిశీలించడం.. స్నేహంగా మెలగడం నా దినచర్యలో భాగమైంది. కనీసం ఓ గంట వాటితో ఉంటే ఏదో తెలియని ఆనందం నాలో కలుగుతుంది. కొత్త వ్యక్తులు వీటి దగ్గరకు వస్తే పెద్ద శబ్దాలు చేస్తూ అటూఇటూ ఎగురుతుంటాయి. నేను కనిపించగానే ఎంతో ప్రేమతో నా మీద వాలిపోతాయి. మనుషుల్లో మానవత్వం లోపిస్తున్న వేళ ఇలాంటి మూగప్రాణులు ఎంతో ప్రేమను కురిపిస్తాయి. ఎంత డబ్బిస్తే ఈ ఆనందాన్ని కొనగలం. – ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, కృష్ణానగర్, కర్నూలు పావురాల పెంపకం ఎంతో ఇష్టం చిన్నతనం నుంచి పావురలంటే అమితమైన ఇష్టం. మొదట్లో నా వద్ద 10 పావురాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎనిమిది రకాలు, వందకు పైగా పావురాలు ఉన్నాయి. ఇంటికి సమీపంలో ఓ షెడ్ ఏర్పాటు చేసుకొని పెంచుతున్నా. రేసింగ్ హ్యూమర్ పావురం ఖరీదు జత రూ.5వేల వరకు ఉంటోంది. 100, 1000 కిలోమీటర్ల పోటీల్లోనూ నా పావురాలు పాల్గొంటాయి. బెట్టింగ్ కాకుండా పావురాల్లోని సత్తా చాటేందుకు పోటీలకు వెళ్తుంటాం. – షేక్ ఇబ్రహీం, కింగ్‌మార్కెట్, కర్నూలు ఇంట్లో మనిషిగానే.. మా ఇంట్లో ఐదుగురం ఉంటాం. రెండేళ్ల క్రితం రూ.10వేలతో రెండు పిల్లులను కొనుగోలు చేశాం. వీటిని ముద్దుగా మిన్నూ అని పిలుచుకుంటాం. ఇంట్లో మనిíÙలాగా మారిపోయాయి. బయటకు వెళ్లి నా కొద్దిసేపటికే ఇంటికి చేరుకుంటాయి. వీటి ఖర్చు నెలకు సుమారు రూ.4వేల వరకు ఉంటుంది. వీటి ద్వారా మానసిక ఆనందం లభిస్తోంది. – ఇర్ఫాన్, కొత్తపేట, కర్నూలు ఆదరణ బాగుంది నగరంలో పెంపుడు జంతువులు, పక్షులకు ఆదరణ బాగుంది. ఉన్నతశ్రేణి కుటుంబాల్లో వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. ఇంట్లో బిడ్డల్లా వీటిని ఆదరిస్తుంటారు. పెంపుడు శునకాలతో పాటు పిచ్చుకలు, పలురకాల పక్షులు, కుందేళ్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎక్కువగా ఇళ్లల్లో అక్వేరియం వుండేందుకు ఇష్టపడుతున్నారు. వివిధరకాల చేపపిల్లలు అందుబాటులో వున్నాయి. బళ్లారి, మైసూర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. అభిరుచికి తగ్గట్టు ఖరీదైన పక్షులు, చేపలను పెంచేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యాపారం సంతృప్తి్తకరంగా వుంది. – మహబూబ్, దుకాణ యజమాని, కర్నూలు. -
సీఎం జగన్ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్ పంపిణీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా కర్నూలు మిల్క్ యూనియన్ (విజయడైరీ) పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. రూ.7.20 కోట్ల బోనస్ చెక్‌ను కర్నూలు మిల్క్ యూనియన్ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి సీఎంకు అందజేశారు. పాడిరైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల తమ సహకార సమితి రెండేళ్లలో రూ.27 కోట్లు లాభాలు గడించిందని ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు మిల్క్ యూనియన్ సమగ్ర పనితీరును వివరించారు. రానున్న రోజుల్లో డైరీని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళతామని ఛైర్మన్, ఎండీ, డైరెక్టర్లు సీఎం జగన్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్ యూనియన్ (విజయడైరీ) ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి, ఎండీ పరమేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రాజేష్, సొసైటీ డెరెక్టర్లు జి.విజయసింహారెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్. సరళమ్మ పాల్గొన్నారు. చదవండి: (పవన్, చంద్రబాబు కలయికపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్స్) -
చదువంటే ప్రాణం.. కన్న కలలు తీరకుండా.. కన్న పేగును చూసుకోకుండానే..
సాక్షి, మంత్రాలయం: ఆ తల్లి కన్న కలలు తీరకుండా తీరని లోకాలకు వెళ్లింది. కనులారా కన్న పేగును చూసుకోకుండానే కన్నుమూసింది. పేగు తెంచుకుని పుట్టిన నవజాత శిశువు (బాబు) సైతం క్షణాల్లోనే ఊపిరి వదిలాడు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కలచివేసింది. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన పెద్ద దస్తగిరి, భీయమ్మ కూతురు చాంద్‌బీని పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన దస్తగిరికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. చదువుపై మక్కువ ఉండటంతో చాంద్‌బీ పత్తికొండ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. తొలి కాన్పు కోసం పుట్టిల్లు రచ్చమర్రికి వచ్చింది. గురువారం చాంద్‌బీకి నొప్పులు మొదలు కావడంతో ఆదోనికి తీసుకెళ్లారు. అక్కడ సాధారణ కాన్పు జరిగింది. అయితే కాన్పు సమయంలో బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరిగి శిశువుకు పురుడు పోయగానే భయంతో ప్రాణాలు కోల్పోయింది. శిశువు సైతం మూడు నిమిషాల వ్యవధిలోనే ఊపిరి వదిలాడు. మొదటి కాన్పులోనే ఇద్దరు మృత్యువాత పడటంతో ఇంటిల్లిపాది శోక సంద్రంలో మునిగారు. చదవండి: (20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
Mahanandi Temple: మహానంది ఆలయానికి మహర్దశ
మహానంది: భక్తుల కోర్కెలు తీర్చే మహానందీశ్వరుడి ఆలయానికి మహర్దశ వచ్చింది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చొరవ, ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణతో మహానంది క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది క్షేత్రానికి గతంలో ఏడాదికి రూ.7 నుంచి రూ.10 కోట్ల ఆదాయం వచ్చేది. రెండేళ్ల నుంచి రూ.13 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వస్తోంది. ఇక ఈ ఏడాది భారీగా పెరిగింది. కోనేరుల మరమ్మతులకు శ్రీకారం ఆలయ పరిధిలో పెద్దకోనేరు(రుద్రగుండం)తో పాటు రెండు చిన్న కోనేరులు ఉన్నాయి. వాటి మరమ్మతులకు దేవదాయశాఖ రూ.80 లక్షలు మంజూరు చేసింది. అందులో భాగంగా సీజీఎఫ్ నుంచి రూ.40 లక్షలు, దేవస్థానం నుంచి రూ.40 లక్షలు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పనులకు త్వరలో భూమిపూజ చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్వంత నిధులు రూ.2 కోట్లతో రాతి నంది విగ్రహాన్ని అభివృద్ధి చేశారు. చుట్టూ వాటర్ ఫౌంటెయిన్, గ్రీనింగ్, అధునాతనమైన లైటింగ్ అమర్చారు. వాటితో పాటు ఆలయ మాడవీధుల్లో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఒకరోజు ఇక్కడే ఉండి పోవాలన్నంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.4.60 కోట్లతో గదుల నిర్మాణం టీటీడీ ఆధ్వర్యంలో రూ.4.60 కోట్లతో 27 గదుల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా నంది విగ్రహం ఎదురుగా ఉన్న వేదపాఠశాల భవనం ప్రాంగణంలో సాయిల్టెస్టును సేకరించారు. త్వరలోనే పనులు మొదలు పెట్టనున్నారు. వీటితో పాటు దాతలు, భక్తుల సహకారంతో వంద వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీ టూరిజం, ప్రస్తుతం ఉన్న టీటీడీ వసతి గృహాల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో 50 గదులు, పార్వతీపురం రస్తాలో ఉన్న దేవస్థానం స్థలంలో మరో 50 వసతి గృహాలను నిర్మాణానికి దేవదాయశాఖ ఆమోదం తెలిపింది. మహానందీశ్వర, కామేశ్వరీదేవి, గంగాసదన్ల పేర్లు ప్రతిపాదించి త్వరలో నిర్మాణం మొదలు పెట్టనున్నారు. అన్నదానానికి రూ.2.30కోట్లు డిపాజిట్లు మహానంది దేవస్థానంలో నిర్వహించే అన్నదాన పథకానికి రూ.2.30 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. గతంలో రోజుకు 150 మందికి అన్నప్రసాద వితరణ చేసేవారు. ప్రస్తుతం 200 మందికి పంపిణీ చేస్తుండగా ఆ సంఖ్యను మూడొందలకు పెంచాలని ప్రతిపాదించారు. శని, ఆది, సోమవారాల్లో ఐదు వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అరిటాకుల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో రూ. 15 లక్షలు వెచ్చించి స్టెయిన్లెస్ స్టీల్ టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. మరింత మంది భక్తులకు అన్నప్రసాదాలు అందాలన్న సదుద్దేశంతో రైతుల నుంచి 1,000 బస్తాల వరిధాన్యం సేకరించారు. కార్తీకమాసంలో రూ.1.40 కోట్లు ఆదాయం మహానందికి అన్ని విభాగాల నుంచి ఆదాయాన్ని పెంచి భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో హుండీ కానుకల లెక్కింపు జరిగితే రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు ఆదాయం వచ్చేది. గత ఏడాది నవంబర్‌లో 49 రోజులకు నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.63,71,256 ఆదాయం సమకూరింది. అలాగే గత ఏడాది కార్తీకమాసంలో నెలరోజులకు రూ.96 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో కంటే అదనంగా రూ. 44 లక్షలు ఆదాయం పెరిగింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆలయానికి ఆదాయం పెంచడంతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దాతల సహకారంతో ఇప్పటికే మరుగుదొడ్లు మరమ్మతులు చేశాం. త్వరలో డాక్టర్ భార్గవవర్ధన్‌రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డిల సహకారంతో బస్‌షెల్టర్ నిర్మించనున్నాం. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో టాయిలెట్లు నిర్మించనున్నాం. త్వరలో వంద వసతి గృహాలను నిర్మిస్తాం. – కాపు చంద్రశేఖర్‌రెడ్డి, ఈఓ, మహానంది -
8న కర్నూలుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాక
సాక్షి, కర్నూలు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 8వ తేదీన కర్నూలుకు రానున్నట్లు బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి.రామస్వామి ’సాక్షి’కి తెలిపారు. ప్రవాసి యోజన కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి కర్నూలు జిల్లాతో పాటు హిందూపురంలో పర్యటిస్తారని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా కర్నూలు నగరంలోని బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్తారని తెలిపారు. అనంతరం నగరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. చదవండి: (ఐదు పైసలకే బిర్యానీ.. క్యూ కట్టిన జనం.. పోలీసుల లాఠీ చార్జ్) -
ప్రేమ వివాహం.. ఆపై ఆటో డ్రైవర్‌కు దగ్గరై.. భర్తను దారుణంగా..
సాక్షి, కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన దాడిబండ ఆమోస్ (26) దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమోస్ భార్య అరుణ ప్రోద్బలంతో ఆటోడ్రైవర్ ములకల సూర్యప్రదీప్, అతని స్నేహితుడు నేసే జీవన్‌కుమార్‌తో కలసి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. నిందితులను పక్కా ఆధారాలతో నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శంకరయ్యతో కలసి బుధవారం సాయంత్రం డీఎస్పీ కేవీ మహేష్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్ అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ కుమార్తె అరుణను 2016లో కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే అరుణ మైనర్ అయినందున ఆమెను హోమ్‌లో ఉంచి ఆమోస్‌పైన నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అరుణ మేజర్ అయిన తర్వాత తిరిగి ఇద్దరూ కలుసుకుని మరోసారి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. చదవండి: (రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి) అల్వాల గ్రామంలో ఉన్నప్పుడు మద్యం సేవించి భార్యను అమోస్ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయంలో భార్యాభర్తలు గొడవ పడి అల్వాల గ్రామం వదిలి ఏడాది క్రితం కర్నూలుకు వచ్చారు. ఉద్యోగనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ సిటీ స్క్వేర్ మాల్లోని బజాజ్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా, అదే షోరూమ్‌లో జాకీ దుస్తుల దుకాణంలో అరుణ సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. వీరిద్దరూ సూర్యప్రదీప్ అనే వ్యక్తి ఆటోలో వెళ్లి వస్తుండేవారు. ఆటోడ్రైవర్ సూర్యప్రదీప్‌తో కలసి ఆమోస్ తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్‌తో అరుణకు చనువు ఏర్పడి తన బాధలు చెప్పుకుంది. హత్య కేసులో నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడిస్తున్న కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ భర్త తనను శారరీకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, అతనిని అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్‌తో చెప్పుకుంది. దీంతో సూర్యప్రదీప్ పథకం ప్రకారం తన స్నేహితుడైన జీవన్ సహాయంతో ఈనెల 22వ తేదీ రాత్రి శరీన్‌నగర్‌లోని సవారితోట కాలనీ చివర గల హంద్రీ నది ఒడ్డుకు ఆమోస్‌ను తీసుకువెళ్లాడు. మద్యం సేవించిన తర్వాత వెంట తీసుకువెళ్లిన రాడ్డుతో తలపై బాది హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రాడ్డు, బండరాయి, సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. చదవండి: (అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది) -
పెళ్లయి రెండేళ్లయినా సంతానం కలగలేదని.. భార్యపై..
పత్తికొండ రూరల్(కర్నూలు జిల్లా): పెళ్లి జరిగి రెండేళ్లు అయినా సంతానం కలగలేదని భార్యపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా.. మండల పరిధిలోని చందోలి గ్రామానికి చెందిన బోయ లాలప్ప, ఆదిలక్ష్మి కుమార్తె భవానీని రెండేళ్ల క్రితం డోన్ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రాముకు ఇచ్చి వివాహం చేశారు. గత కొన్ని నెలల నుంచి సంతానం కలగలేదని భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. మంగళవారం ఇదే విషయంపై భార్యతో గొడవపెట్టుకుని దాడి చేశాడు. వెన్నెముక, కాళ్లు, చేతులపై విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె కుప్పకూలిపోయింది. భవానీని చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్ చేసినట్లు బాధిత మహిళ తల్లిదండ్రులు తెలిపారు. చదవండి: ప్రియురాలితో గోవా టూర్ కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే! -
ఉద్యోగాలకు గుడ్‌బై.. వ్యాపారాల్లో రాణిస్తున్న యువత
ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతోంది. అందుకు తగ్గట్లే ఆలోచనా ధోరణి, జీవన విధానాల్లోనూ మార్పు చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. గతంలో బాగా చదవాలి, మంచి ఉద్యోగం సాధించాలి, చదువు పూర్తయ్యేదాకా మరో ఆలోచన చేయొద్దు.. అనే ధోరణి ఉండేది. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే ప్రోత్సహించారు. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడ్డట్లే అనే భావన కనిపించేది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన కూడా పాఠశాల నుంచి కాలేజీ పూర్తయ్యే వరకు ఉద్యోగం సాధించాలనే ఏకైక లక్ష్యం మినహా మనసులో మరో ఆలోచన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలను గౌరవిస్తున్నారు. దీంతో ఉద్యోగంతో కాదు.. వ్యాపారంతో కూడా స్థిరపడొచ్చనే భావన పెరిగింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు కోవిడ్ నేర్పిన పాఠమే ‘వ్యాపారం’ కోవిడ్ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌తో పాటు చాలా రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీల్లోని ఉద్యోగులకు ‘లాక్డౌన్’ రోజుల్లో 50శాతం వేతనాలు ఇస్తే, కొన్ని పూర్తిగా ఇవ్వలేదు. ఈ క్రమంలో కొందరి ఉద్యోగులు బాగా ఇబ్బంది పడ్డారు. కూరగాయలు విక్రయించి బతికిన వ్యక్తులు కూడా ఉన్నారు. దీంతో ఉద్యోగం కంటే వ్యాపారమే ఉత్తమమనే దారి ఎంచుకున్నారు. ఉద్యోగంలో ఎవరి అభివృద్ధి కోసమో శ్రమించాలి. వ్యాపారమైతే కష్టపడే ప్రతీక్షణం, వచ్చే ప్రతి రూపాయి తమదే అనే భావనలో ఉన్నారు. దీంతోనే బిజినెస్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఆలోచనా దృక్పథంలో మార్పులు గతంలో విద్యార్థి దశలో పెద్దగా ఆలోచనలు ఉండేవి కావు. బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండేవి కావు. ఇప్పుడు చదువులో కూడా మార్పులు వచ్చాయి. సీఏ, ఎంబీఏ లాంటి చదువులతో పాటు డిగ్రీ విద్యార్థులకు కూడా ‘స్కిల్ డెవలప్మెంట్’పై శిక్షణ ఇస్తున్నారు. ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ‘ఎంటర్ఫైనర్ డెవలప్మెంట్’ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఫీల్డ్‌విజిట్. ఇంటర్న్‌షిప్ పేరుతో పరిశ్రమలకు తీసుకెళ్తున్నారు. అక్కడ శిక్షణ ఇస్తున్నారు. దీంతో పెట్టుబడి, సబ్సిడీ, ఆదాయం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన వస్తోంది. ఉద్యోగం కంటే వ్యాపారమే బాగుందనే ధోరణికి వస్తున్నారు. పైగా జీవితంలో తక్కువ సమయం ఉంది, దీన్ని వృథా చేయొద్దు. ఏదోఒకటి సాధించాలి, అందరితో పోలిస్తే ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగం చేస్తే ఒకరి కింద పనిచేయాలి, వ్యాపారం చేస్తే కనీసం 5–9మందికి ఉద్యోగాలు కల్పించొచ్చు అనే ధోరణికి వచ్చారు. ఇతని పేరు డాక్టర్ యాసీర్ హుస్సేన్. రాయచూర్‌లో ఫార్మా–డీ డాక్టరేట్ పొందారు. వ్యాపారంపై ఆసక్తితో ప్రకాశ్‌నగర్‌లో రూ.5లక్షలతో నన్నారి తయారీ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర కిందట లక్ష్మీపురంలో ‘ఉస్తాద్’ జీరా జ్యూస్ ప్లాంట్ స్థాపించారు. ‘హంగర్బక్స్’ అనే ఐటీ కంపెనీతో కలిసి తేనె తయారీ ప్రారంభించారు. ఆపై ‘కూల్ మ్యాజిక్’ బ్రాండ్‌తో నన్నారి, ‘అనంత సుగం«దీ’ పేరుతో రెడీ టూ డ్రింక్ నన్నారిసోడా, జాయ్ సోడా తయారు చేస్తున్నారు. మరో వారంలో ‘కూల్మ్యాజిక్’ పేరుతో గోలీసోడాను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇతని వయస్సు 32 ఏళ్లు. పీఎంజీవై కింద రుణాలు తీసుకుని సబ్సిడీ పొందారు. ఏడాదిన్నరలోనే రెండు రాష్ట్రాలలో విక్రయాలు సాగిస్తున్నారు. ఇతని పేరు శేఖర్‌బాబు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖతర్‌లో ఎలక్ట్రిక్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేశారు. సొంతూరును వదిలి దూరంగా ఉద్యోగం చేయడం నచ్చలేదు. స్వదేశానికి తిరిగొచ్చి వ్యర్థాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనకు వచ్చాడు. కల్లూరు ఎస్టేట్‌లో జీఎస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌ను స్థాపించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించే దిశగా వృథా ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేశాడు. పలురకాలు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ చేశారు. ఆ తర్వాత హోటల్ బిజినెస్‌లోకి రావాలనే ఆశతో ఓ పాత బస్సును రూ.3లక్షలకు కొనుగోలు చేశాడు. లోపల ఇంటీరియర్‌ను మార్చేసి ‘డైన్ ఆన్ బస్’గా తీర్చిదిద్దాడు. వెంకటరమణ కాలనీలో దీనికి మంచి పేరుంది. ఇలా ఇతను 25మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇతని పేరు ఉపేంద్రం కృష్ణంరాజు. ఎంబీఏ పూర్తి చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేశారు. ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోవడంతో బిజినెస్ చేయాలనే ఆలోచనకు వచ్చాడు. భవిష్యత్‌లో హోం థియేటర్లకు డిమాండ్ ఉంటుందని గ్రహించి 2018లో తన ఆలోచనకు పదును పెట్టారు. ‘శ్రీదత్త హోమ్ థియేటర్’ పేరుతో బిజినెస్ ప్రారంభించినా మొదట్లో పెద్దగా లాభం లేకపోయింది. లాక్డౌన్లో ఓటీటీలు రావడం, ఇంట్లోనే సినిమాలు చూసే అలవాటు పెరగడం, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు దాదాపు ‘హోం థియేటర్’పై ఆసక్తి చూపడటంతో బిజినెస్ ఊపందుకుంది. రూ.7లక్షల నుంచి రూ.35లక్షల వరకూ హోం థియేటర్‌కు ఖర్చు అవుతుంది. ఇలా తను ఎంచుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో సంతోషంగా జీవిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌తో అవకాశాలు మెండు మార్కెట్ పరిధి కూడా విస్త్తరించింది. గతంలో బాంబే, చెన్నై, కోల్‌కతాకు మాత్రమే ఎగుమతులు ఉండేవి. ఎక్స్‌పోర్టుపై అవగాహన ఉండేవి కాదు. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎగుమతి అవకాశాలను పెంచారు. పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఎగుమతులు చేస్తున్నారు. ఉదాహరణకు మన జిల్లాలో తడకనపల్లి పాలకోవ ఉంది. దీని క్వాలిటీ బాగుంటుంది. అయితే కర్నూలుకే పరిమితమైంది. దీనిపై గ్రామస్తులకు అవగాహన కలి్పంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగమతి చేస్తున్నారు. గతంలో వ్యాపారులు మనవద్దకు వచ్చి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ పెరగడంతో ఇంట్లో నుంచి ఏ ప్రాంతానికైనా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు. దీంతో వ్యాపారం చేస్తే మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం యువత ఆలోచనా ధోరణి మారడం శుభ పరిణామం. ఉద్యోగం కోసం వెతకడం కంటే పది మందికి ఉపాధి కలి్పంచే స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సబ్సిడీలు అందిస్తోంది. మార్కెటింగ్ కూడా సులభతరమైంది. వ్యాపార రంగంలో విజయాలు అధికంగానే ఉంటున్నాయి. ఎంఎస్ఎంఈలకు దరఖాస్తు చేసుకుంటే ఏపీఐఐసీ ద్వారా భూములు ఇస్తాం. పరిశ్రమలశాఖ కూడా సబ్సిడీలు ఇస్తోంది. – విశ్వేశ్వరరావు, జెడ్ఎం, ఏపీఐఐసీ -
రిజిస్ట్రేషన్లూ ఆన్లైన్లోనే.. కర్నూలుకు ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్
ఆస్తుల క్రయ, విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయమూ ఎక్కువే. వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రజలకు సులభంగా.. అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రీమియం రిరిజిస్ట్రేషన్ సర్వీసు సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా పాసుపోర్టు సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయి హంగులతో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో మొత్తం 9 ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రీమియం రిజస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ సేవలు విజయవంతం కావడంతో మిగిలిన ఏడు చోట్ల ప్రీమి యం రిజిస్ట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కర్నూలులో ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులు కర్నూలు నగరంలో ప్రజలకు అనువైన ప్రాంతం, 1,000 చదరపు అడుగుల భవనం కోసం అన్వేషణ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి నుంచి ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు.. ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ ఫ్రంట్ ఎండ్‌లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ అపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది ఉండి పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్ సేవలు అందించినా.. తర్వాత అన్ని ఆన్లైన్ సేవలే ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. అంతేకాక ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్‌విండో కింద రిక్వెస్టు పెడితే ఆన్లైన్లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినయోగదారులే తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అప్పుడు ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్‌కి వెళ్తుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ఆస్తుల వివరాలను పరిశీలించి సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెస్సేజ్ వెళ్తుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అవినీతికి తావుండదు అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ముఖ్య ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. – కల్యాణి, డీఐజీ, రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ -
విద్యార్థినిపై పీఈటీ టీచర్ దాష్టీకం.. కడ్డీతో చెంపపై కాల్చిన వైనం
సాక్షి, కర్నూలు: కొత్తపల్లిలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దారుణం జరిగింది. ఆదర్శంగా ఉండాల్సిన టీచరే విద్యార్థి ని చెంపపై కడ్డీతో కాల్చింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి కేజీబీవీలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక 10వ తరగతి చదువుతోంది. చున్నీ వేసుకోకుండా తిరగడమే కాక తనను వేరే విద్యార్థినుల ముందు తిడతావా అని కీర్తిపై పీఈటీ టీచర్ పావని ఆగ్రహించింది. అంతటితో వదలకపోగా శనివారం ప్రార్థన సమయంలో కడ్డీని వేడిచేసి బాలిక చెంపపై కాల్చి వాత పెట్టింది. కీర్తికి గిట్టని ఓ విద్యార్థిని చెప్పిన మాటలను నమ్మి సదరు టీచర్ ఇలా చేసినట్లు సమాచారం. విద్యార్థిని తల్లిదండ్రులు ఆదివారం పాఠశాలకు వెళ్లి విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. చదవండి: దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ -
మిల్లెట్స్.. హెల్త్ బుల్లెట్స్
ఆరోగ్యమే మహాభాగ్యం అనేది జగద్విదితం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్య పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. మన దేశంలో దశాబ్దాలుగా వరినే ప్రధాన ఆహారంగా తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల సుగర్, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయని వైద్యుల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తాము తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకుంటున్నారు. త్రుణ/చిరుధాన్యాల (మిల్లెట్స్)ను తీసుకుంటూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. – సాక్షి, కర్నూలు డెస్క్ త్రుణధాన్యాలు అంటే.. త్రుణధాన్యాల్లో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, సామలు. భారతదేశంలో రైతులు దాదాపు ఐదు వేల సంవత్సరాలుగా వీటిని సాగు చేస్తున్నారు. ఇవి తక్కువ కాలవ్యవధి పంటలు. అంటే విత్తిన రెండు నెలలకు పంట చేతికి వస్తుంది. పైగా వర్షాధారితం. ఒక్కసారి తగినంత వర్షం కురిస్తే చాలు పంట పండినట్లే. వీటిలో ఉండే పీచు పదార్థం వల్ల తిన్న వెంటనే గ్లూకోజ్‌గా మారిరక్తంలో కలిసిపోకుండా అవసరమైన మేరకు మాత్రమే కొద్దికొద్దిగా రక్తంలో కలుస్తుంది. గ్రీన్ రివల్యూషన్ ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వరకు చిరుధాన్యాలను ఎక్కువ విస్తీర్ణంలోనే రైతులు సాగుచేసేవారు. అయితే, 1960 –70 దశకంలో భారతదేశంలో వ్యవసాయ విప్లవం (గ్రీన్ రివల్యూషన్) వచ్చిన తరువాత వరి, గోధుమ ప్రధాన ఆహార పంటలుగా మారిపోయాయి. ఎక్కువ దిగుబడి రావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు రైతులందరూ వరినే సాగు చేయడం ప్రారంభించారు. బియ్యంలో పీచు పదార్థం లేకపోవడంతో చాలా సంవత్సరాలుగా వాటిని ఆహారంగా తీసుకుంటున్న ప్రజలు అనారోగ్యాలకు గురయ్యారు. వైద్యుల పరిశోధనల్లో వెల్లడవుతున్న విషయాలపై అవగాహనకు వచ్చిన ప్రజలు ప్రస్తుతం తమ ఆహార అలవాట్లు మార్చుకుంటూ త్రుణధాన్యాలను తీసుకుంటున్నారు. జిల్లాలో చిరుధాన్యాల సాగు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం దాదాపు ఐదు వేల మంది రైతులు 12 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో విత్తనం వేసుకుంటే ఒక్క వర్షానికే పంట చేతికి వస్తుంది. రెండు నెలల్లోనే దిగుబడులు వస్తున్నందున మళ్లీ రెండో పంట కూడా వేసుకునేందుకు వీలవుతోంది. జొన్నలు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. కొర్రలు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్లు వరకు వస్తోంది. ఖర్చు తక్కువ కావడం పంట ఉత్పత్తులకు మార్కెట్ ఉండటంతో రైతులు వాటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా తమ ఆహారంలో మిల్లెట్స్‌కు చోటివ్వడంతో వినియోగం పెరిగి మార్కెట్లో వాటికి డిమాండ్ ఏర్పడింది. అండుకొర్రలు కిలో రూ.55, కొర్రలు రూ.32, అరికెలు రూ.30 ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ తీరుతెన్నులను గమనించిన కొందరు రైతులు త్రుణధాన్యాలనే సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పందిపాడుకు చెందిన రైతు కె.వేణుబాబు ఏకంగా 37 ఎకరాల్లో మిల్లెట్స్‌ను పండిస్తున్నారు. రైతులకు లాభసాటి చిరుధాన్యాల సాగు ప్రస్తుతం రైతులకు లాభసాటిగా మారింది. హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్) నాణ్యమైన చిరుధాన్యాల సీడ్స్ విక్రయిస్తోంది. జిల్లాలో సాగు రైతులు ఎక్కువగా వాటినే వినియోగిస్తున్నారు. చిరుధాన్యాలు సాగుచేసే కొందరు రైతులు సంఘాలుగా ఏర్పడి సీడ్స్ రైతులకు సరఫరా చేస్తూ.. పంట ఉత్పత్తులను కూడా వారే కొనుగోలు చేస్తున్నారు. రైతులకు సీడ్స్ ఇచ్చే సమయంలోనే పంట ఉత్పత్తులను నిర్ణీత ధరకు కొనుగోలు చేసేలా బైబ్యాక్ ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో అటు రైతులకు ఇటు సీడ్ వ్యాపారులకు లాభాలు చేతికి దక్కుతున్నాయి. కర్నూలులోని ‘ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం’ ఒక్కటే దాదాపు నెలకు ఐదు టన్నుల వరకు ప్రాసెస్ చేసిన సిరిధాన్యాలను వినియోగదారులకు విక్రయిస్తున్నదంటే మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ పెరుగుదలకు కారణాలు త్రుణధాన్యాలు ఆహారంగా తీసుకునే వారికి ఆరోగ్యపరంగా పలు ఉపయోగాలున్నాయని డాక్టర్ ఖాదర్‌వలీ, ప్రకృతివనం ప్రసాద్ వంటి వారు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు ప్రజలు కూడా సహజంగానే ఆరోగ్య విషయాలపై అవగాహన పెంచుకుని మెనూలో మార్పులు చేసుకుంటున్నారు. మిల్లెట్స్‌లో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు పీచుపదార్థం ఉంటుంది. పీచుపదార్థం వల్ల తిన్న ఆహారం కొద్దికొద్దిగా మాత్రమే గ్లూకోజ్‌గా మారుతుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ పెద్ద మొత్తంలో ఒకేసారి చేరదు కాబట్టి సుగర్, బీపీ అదుపులో ఉంటాయి. సుగర్ అదుపులో ఉన్నందున ఊబకాయం రాదు. అందువల్లే వీటిని తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. 37 ఎకరాల్లో త్రుణధాన్యాల సాగు ఈ చిత్రంలోని రైతు పేరు కె.వేణుబాబు. కర్నూలు వాసి. గతంలో వాణిజ్యపరంగా పత్తి సాగు చేసేవారు. గత కొద్ది సంవత్సరాలుగా కల్లూరు మండలం పందిపాడులో తనకున్న పొలంతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని త్రుణధాన్యాలు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం 37 ఎకరాలలో త్రుణధాన్యాలు సాగు చేశారు. ఆహారం విషయంలో ప్రజలు చైతన్యవంతులవుతున్నారని, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలకు అలవాటు పడుతున్నందున వాటికి డిమాండ్ ఏర్పడినందున వాటినే సాగు చేశానని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభంలో వేసిన పంట రెండు నెలల్లో చేతికి వస్తున్నందున రెండో పంట సాగుకు కూడా వీలుంటుందని అంటున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల రాగుల దిగుబడి ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి పేరు అల్వాల బాలయ్య. నందికొట్కూరు పట్టణానికి చెందినవారు. కొన్నేళ్లుగా చిరుధాన్యాల సాగులో రాణిస్తున్నారు. ఈ ఏడాది కూడా 3 ఎకరాల్లో సామలు, 2 ఎకరాల్లో రాగులు సాగు చేశారు. సామలు 6, రాగులు 10 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. సామలు క్వింటా రూ.3000 చొప్పున విక్రయించారు. తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం పొందుతున్నారు. సాగు చేయడమే కాదు... చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకుంటున్నారు. -
భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు..
వారిద్దరిదీ ఒకే డిపార్ట్మెంట్.. ఒకే కులం. ఆ యువతితో మాటలుకలిపాడు. అధికారి మనవాడే కదా అని ఆమె కూడా పరిచయం పెంచుకుంది. అదే అదునుగా చూసి ఆ అధికారి పెళ్లయిన విషయాన్ని దాచి మోసం చేశాడు. దీంతో తనకు జరిగన అన్యాయం మరొకరికి జరగకూడదని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో అబిద్ అలీ అనే వ్యక్తి డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అదే సమయంలో డిపార్ట్మెంట్లో ప్రకాశం జిల్లాలో పనిచేసే మహిళా అధికారికి దగ్గరయ్యాడు. పెళ్లయిన విషయం కూడా చెప్పకుండా ఆ సమయంలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. విషయం తెలిసి మహిళా అధికారి నిలదీయడంతో.. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని మాటాచ్చి తర్వాత ముఖం చాటేశాడు. అయితే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు పిలిచి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తన ప్రవర్తనలో మార్పులేకపోవడంతో బాధిత మహిళ తనతో గడిపిన ఫోటోలను, వీడియోలను బయటపెట్టింది. వీటిపై స్పందించిన అబిద్ అలీ ఆ మహిళా అధికారి తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు. చదవండి: (భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!) -
కర్నూలు జిల్లా: గొంతుకోసి ఇద్దరు మహిళల దారుణ హత్య
సాక్షి, కర్నూలు జిల్లా: ఓర్వకల్లు మండలం నన్నూరులో దారుణం జరిగింది. పొలంలో కూలి పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలను దుండగులు గొంతుకోసి చంపారు. మృతులను రామేశ్వరి, రేణుకగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య సడెన్ ఎంట్రీతో షాక్.. తర్వాత -
ఇంట్లోనే వెండితెర.. విస్తరించిన కొత్త కల్చర్
వినోదం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. 50 ఏళ్ల క్రితం కొత్త సినిమా కోసం జిల్లా కేంద్రానికి వెళ్లి మరీ చూసేవారు. ఎందుకంటే అప్పట్లో మండలాల్లో కూడా సినిమాలు విడుదలయ్యేవి కావు. ఆ తర్వాత మండల కేంద్రాలకూ చేరాయి. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయిన 30 రోజులకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇంట్లోనే కూర్చొని సినిమా చూస్తున్నారు. కొందరు థియేటర్ అనుభూతి పొందేందుకు హోమ్ థియేటర్ల(హోమ్ సినిమా సెగ్మెంట్)ను ఏర్పాటు చేసుకుంటున్నారు. పెద్ద, పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు జిల్లాకు విస్తరించింది. కర్నూలు: సగటు ప్రేక్షకుడికి సినిమా ఒక ప్రధాన వినోద సాధనం. తెలుగు చిత్రసీమలో 80 ఏళ్లకు పైగా ఇది రాజ్యమేలుతోంది. పండుగలు, పర్వదినాల్లో నిర్మాతలు స్టార్‌హీరోల సినిమాలు విడుదల చేసి భారీగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించుకుని కలెక్షన్లు కొల్లగొడుతారు. సినిమా ఏదైనా బాగుందంటే ప్రతి రోజు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం. ఈ సందడి 100, 175, 365 రోజుల పాటు ఉండేది. ఇదంతా ఒకప్పటి కథ. కోవిడ్–19 వైరస్ సినిమా కథనూ మార్చేసింది. కోవిడ్‌కు ముందు కోవిడ్ తర్వాత అనే విధంగా మార్చేసింది. కోవిడ్ సమయంలో థియేటర్లు బంద్ చేసిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లో గాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అంతకుముందు కూడా ఓటీటీ సంస్కృతి ఉన్నా కోవిడ్ సమయంలో దీనికి ఆదరణ బాగా పెరిగింది. ఇంట్లోనే టీవీలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమాలు వీక్షించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ప్రస్తుతం సినిమా ఎంత బాగున్నా ఒకేసారి ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు వేస్తుండటంతో 30 రోజులకు మించి ఆడటం లేదు. ఈ క్రమంలో 30 రోజుల తర్వాత ఓటీటీలోనూ ఆ సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందేందుకు ఔత్సాహికులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంట్లోనే హోమ్ థియేటర్‌తో మజా ! ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చాక మనం కోరుకున్న సినిమాను ఇంట్లోనూ కూర్చున్న చోట ఆన్లైన్లో నొక్కి చూడవచ్చనే అభిప్రాయం సగటు ప్రేక్షకులకు వచ్చింది. దీంతో పైస్థాయి మధ్యతరగతి, ఉన్నతస్థాయి ప్రజలందరూ వారి ఇంట్లో హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఈ కల్చర్ కనిపించేది. ఇప్పుడు క్రమంగా జిల్లాకు పాకింది. కాస్త పెద్ద ఇళ్లు ఉన్న వారు హోమ్ థియేటర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక హోమ్ థియేటర్ ఏర్పాటు కావాలంటే రూ.5 లక్షలు ఉంటే చాలు. ఆ పై థియేటర్ గదిని, సౌండ్ సిస్టమ్, స్క్రీన్, కుర్చీల సంఖ్యను బట్టి రూ.35 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇందు కోసం వీటిని ఏర్పాటు చేసే నిర్వాహకులు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవారు. డెమో కూడా అక్కడే చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే డెమో థియేటర్లు ఏర్పాటు చేశారు. దీనికితోడు ఎవ్వరైనా స్నేహితులు, బంధువులు హోమ్ థియేటర్ చేయించుకుని ఉంటే వారిని చూసి మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని వాకబు చేసి మరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. డోన్ సమీపంలోని గ్రామంలో ఓ భూస్వామి తనకూ హోమ్‌థియేటర్ కావాలని పట్టుబట్టి అక్కడ సెల్‌ఫోన్ టవర్ లేకపోయినా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటయ్యేలోగా నిర్వాహకులతో మాట్లాడి సెల్‌టవర్‌ను ఇంటి వద్ద ఏర్పాటు చేయించుకున్నాడంటే హోమ్థియేటర్పై ఉన్న మక్కువ అర్థం అవుతుంది. మంచి టీవీ ధరలోనే హోమ్ థియేటర్ అన్ని రకాల ఫీచర్లు, సౌండ్ సిస్టమ్‌తో ఉన్న బ్రాండెడ్ టీవీని కొనుగోలు చేయాలంటే రూ.2.5 లక్షలకు పైగానే వెచ్చించాలి. ఇలాంటి పెద్దతెర ఉన్న టీవీని తెచ్చుకుని చూడాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి రెండింతలు మొత్తం ఖర్చు పెడితే ఏకంగా ఇంట్లోనే సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్న అభిప్రాయానికి చాలా మంది వస్తున్నారు. సొంత ఇల్లు ఉండి థియేటర్ ఏర్పాటు చేసుకునే స్థలం ఉన్న చాలా మంది ఇప్పుడు హోమ్ థియేటర్‌వైపు మక్కువ చూపుతున్నారు. ఇందుకోసం రూ.5లక్షల నుంచి రూ.35 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. హోమ్‌థియేటర్ ఏర్పాటు కావాలంటే కనీసం 11/22 నుంచి 22/44 వరకు విస్తీర్ణంలో ఉన్న హాలులో 7.1 నుంచి 17.4 ఛానల్స్ వరకు స్పీకర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఆరుగురు నుంచి 20 మంది దాకా కూర్చుని సినిమా చూసే సామర్థ్యం ఉంటోంది. అన్ని భాషల్లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్ ఓటీటీలో చూసే అవకాశం ఉండటంతో హోమ్ థియేటర్‌కు ఆదరణ పెరుగుతోంది. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ లాంటి ప్రాంతాల్లో దాదాపు 250 ఇళ్లలో హోమ్థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. -
అసలే లవ్ మ్యారేజ్.. స్వేచ్ఛ ఎక్కువే.. ఇంకేముంది.. పెళ్లయిన మూణ్ణాళ్లకే పెటాకులు!
కర్నూలులోని ఓ కాలనీకి చెందిన నిరంజన్, స్వప్న (పేర్లు మార్చాం) హైదరాబాదులో చదువులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన రెండేళ్లకే అత్తింటి ఆచారాలు వధువుకు నచ్చలేదు. కొంతకాలం మౌనంతో భరించినా ఆ తర్వాత కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నారు. కర్నూలు పాతబస్తీకి చెందిన నరేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్య స్రవంతి(ఇద్దరి పేర్లు మార్చాం)కి ఫోన్ చేసిన ప్రతిసారి సెల్‌ఫోన్ బిజీ వస్తుండటంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచూ వారు వాదులాడుకునేవారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. నాలుగు గోడల మధ్య సర్దిచెప్పాల్సిన ఇరు కుటుంబాల పెద్దలు ఒక్కోసారి మరింత ఆజ్యం పోస్తున్నారు. చిలిపి తగాదాలను సైతం భూతద్దంలో చూస్తూ బంధాన్ని బలహీనం చేసుకుంటున్నారు. ఒక్కోసారి విడిపోయేందుకు కూడా జంకడం లేదు. కడదాకా కలిసి ఉంటామనే పెళ్లినాటి బాసలను అపహాస్యం చేస్తూ ఏడాది తిరక్కముందే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. సాక్షి, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో విడాకుల కోసం వచ్చే దంపతులు ఎక్కువయ్యారు. ఇక మూడేళ్ల కాలంలో చిన్నచిన్న మనస్ఫర్థలతో 2,986 మంది పోలీస్స్టేషన్లను ఆశ్రయించగా.. కలిసి ఉండటానికి ఇష్టపడని మరో 632 మంది కోర్టు మెట్లెక్కారు. వివిధ పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కరం. గొడవ పడే దంపతుల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. పెళ్లి అయిన యువతులు కొత్త కాపురంలోకి కాలు పెట్టగానే అప్పటివరకు ఊహించుకున్నవి గాలిమేడలనే అభిప్రాయానికి వస్తున్నారు. పుట్టిన రోజును మరచిపోవడం, పండక్కి పుట్టింటికి పంపడం లేదన్న చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది సమస్యను రాద్ధాంతం చేసుకునేంతవరకు వెళ్తోంది. ఒక్కోసారి వారు గుర్తించలేనంత స్థాయిలో అగ్నికి ఆజ్యం పోసేలా మూడో శత్రువు ప్రవేశిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగులో సఖ్యతగా ఉండే ఎవరో ఒకరు లేనిపోని అనుమానాలను పెంచుతున్నారు. వారు చెప్పేది నిజమా? కాదా? అని ఆలోచించకుండానే దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇలాంటి జంటలకు కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ మార్పు చెందకపోవడం వల్ల సంసారాల్లో కలతలు పెద్దవై విడాకుల వరకు వెళ్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారే అధికం పోలీస్స్టేషన్లకు ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకున్నవారే వస్తున్నారు. యుక్త వయస్సులో ఆకర్షణకు లోనై ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎదురై కలహాలు ప్రారంభమవుతున్నాయి. ముందే ప్రేమికులు కావడంతో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఈకారణంతో భార్యాభర్తలు పంతాలకు వెళ్తున్నారు. పోలీసులు ఏం చెబుతున్నారంటే.. కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులేమీ కనిపించవు. కానీ ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో అధిక శాతం పెళ్లయిన ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. విడాకులు కావాలని చెప్పే కారణాలు చాలా చిన్నవిగా ఉంటున్నట్లు కౌన్సెలింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యావంతులైన భార్యాభర్తలు కూడా ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పద్ధతిలో పంతాలకు పోతున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఏడాది, రెండేళ్లకే అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతూ విడాకుల దాకా వెళ్తున్నారు. విభేదాలకు కారణాలు.. ►మద్యం కారణంగా జరిగే గొడవలు – 33% ►వరకట్న వేధింపులు – 31% ►వివాహేతర సంబంధాలు/అనుమానాలు – 26% ►మగపిల్లలు పుట్టలేదని/సంతానం కలగలేదన్న కారణాలతో – 5% ►ఇతర కారణాలు – 5% చిన్న కారణాలకే మనస్పర్థలు పెంచుకుంటున్నారు చిన్న కారణాలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నా రు. ఇరు కుటుంబాల సభ్యుల తో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తూ చాలామందిలో మార్పు తీసుకొస్తున్నాం. అయినా కొందరు కోర్టు దాకా వెళ్తూ విడాకులు కోరుకుంటున్నారు. పలు సమస్యలతో దంప తుల మధ్య సఖ్యత తగ్గి విడాకుల దాకా వెళ్తున్నారు. – వెంకటరామయ్య, దిశ మహిళా పీఎస్ డీఎస్పీ కుటుంబ వ్యవస్థపై అవగాహన ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో యువ జంటలకు కుటుంబ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, సర్దుబాటు ధోరణి సన్నగిల్లడం వల్ల విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పెంపక లోపం, ఆర్థిక స్వేచ్ఛ, అహంకారం, అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ సక్రమంగా నిలబడాలంటే స్త్రీ పాత్ర ముఖ్యమైనది. – ఎ.అన్నపూర్ణారెడ్డి, అడ్వకేట్ -
కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఆస్పత్రి త్వరలో కర్నూలులో అందుబాటులోకి రానుంది. రూ.120 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మించారు. ప్రభుత్వ రంగంలో వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాన్సర్ చికిత్సలపైన కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణాన్ని శర వేగంగా పూర్తి చేశారు. మిగతా వసతులన్నీ కల్పించి ఆరు నెలల్లో దీనిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం 2017లోనే మంజూరు చేసింది. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీని నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ప్రభుత్వ రంగంలో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి ఒక్కటి కూడా లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆస్పత్రిపై కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే దీని నిర్మాణాన్ని చేపట్టి వేగంగా పూర్తి చేసింది. క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చేందుకు చర్యలు చేపడుతోంది. తొలి దశలో రూ.53.60 కోట్లతో పరికరాలను ఏర్పాటు చేస్తోంది. హై ఎండ్ రేడియేషన్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, సర్జరీ అంకాలజీ విభాగాలను అందుబాటులోకి తెస్తోంది. రూ.30 కోట్ల వ్యయంతో హై ఎండ్ డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఎక్విప్మెంట్స్ను వీలైనంత త్వరగా సమకూర్చాలని వైద్య విద్యా సంచాలకులు ఏపీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఆరు నెలల్లోగా అందుబాటులోకి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భవనాల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఆరు నెలల్లోపే క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటిలో ప్రత్యేకంగా క్యాన్సర్ చికిత్సల విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్. శ్రీనివాసన్, రాష్ట్ర క్యాన్సర్ విభాగం నోడల్ అధికారి -
టికెట్‌కి వెల కడతారా?.. మా కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తారా?
పచ్చపార్టీ బాస్ డబ్బుకు తప్ప మనుషులకు విలువ ఇవ్వడని తెలిసిందే. ఎన్నికల్లో కూడా కార్యకర్తల మద్దతు ఉన్నవారికంటే డబ్బున్నవారికే ప్రాధాన్యమిస్తారు చంద్రబాబు. ఇప్పుడు ఉమ్మడి కర్నూల్ జిల్లాలో కూడా ఒక అనామకుడికి నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇచ్చారంటూ కేడర్‌లో నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ అధ్యక్షుడ తీరుపై అక్కడి నాయకులు మండిపడుతున్నారు. బాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బందిపడుతున్న నేత ఎవరో మీరే చదవండి. ఆక్ పాక్ కరివేపాక్ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబు మీద మండిపడుతున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న తమ కుటుంబాన్ని చంద్రబాబు కరివేపాకులా తీసేసారని కేఈ కుటుంబం మదనపడుతోంది. చంద్రబాబు తమను సంప్రదించకుండా.. ఎలాంటి సమాచారం లేకుండా డోన్ ఇన్‌ఛార్జి బాధ్యతలు ధర్మవరం సుబ్బారెడ్డికి అప్పగించడం కెఇ కుటుంబం ఆందోళన చెందుతోంది. మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ పుట్టిన రోజున తెలుగు తమ్ముళ్లు సెలబ్రేషన్స్ జరిపారు. ఇదే అవకాశంగా భావించిన కెఇ ప్రభాకర్ చంద్రబాబుపై ఘాటుగా స్పందించారు. చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్) డోన్ టికెట్‌కు వెల కడతారా? ధర్మవరం సుబ్బారెడ్డిని డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం ఏమాత్రం సరికాదని చంద్రబాబు నిర్నయాన్ని నేరుగా తప్పుపట్టారు కేఈ ప్రభాకర్. ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి వెళ్ళాలంటే రాజకీయంగా అనుభవం ఉండాలి, కనీసం వార్డ్ మెంబర్‌గా కూడా అనుభవం లేని వ్యక్తిని.. కేవలం డబ్బున్నదన్న ఒకే కారణంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటూ మండిపడ్డారు. తమను పక్కన పెట్టి వేరే వ్యక్తిని అక్కడ నిలబెట్టడం ఏమాత్రం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి స్పష్టంగా చెప్పేశారు ప్రభాకర్. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న కుటుంబాన్ని కాదని కేవలం డబ్బును చూసి తీసుకువస్తారా అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఏ బాబు మాట విననంటే వినను అసలే పడిపోయిన పచ్చ పార్టీ ప్రతిష్టను చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మరింత లోతుకు నెట్టేస్తున్నాయని కేడర్ ఆందోళన చెందుతోంది. చంద్రబాబు ఎవరిని తీసుకువచ్చినా.. తమకు సీటివ్వకపోయినా.. పత్తికొండ, డోన్ నియోజకవర్గాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తమ కుటుంబం నుంచి కచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించి తమ బాస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు ప్రభాకర్. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం
సాక్షి, ఆళ్లగడ్డ: డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటే అవుననే అంటున్నారు శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులు. ఏళ్లతరబడిగా ఒకే తీరు పంటలు వేస్తూ దిగుబడులు రాక పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ఇప్పుడిప్పుడే ఇతర పంటలు, లాభదాయక సాగుపై దృష్టిసారిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అటవీ సమీప గ్రామాల రైతులు ఎక్కువగా శ్రీగంధం, ఎర్రచందనం, అగర్ ఉడ్, మల్బరీ వేప, మహాగని తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి రెండేళ్లు కష్టపడితే అవి పెరిగి పెద్దవై రూ.కోట్లలో ఆదాయం తెచ్చి పెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు అవసరం లేదు సిరి సంపదల గని శ్రీగంధం. అడవి సంపదలో రారాజు ఎర్రచందనం. ఇవి ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన ధర పలికే చెట్లుగా వెలుగొందుతున్నాయి. అయితే, ఇవి దట్టమైన అడవుల్లో మాత్రమే లభించే చెట్లు. వీటి చెక్కను ఎన్నో ఔషధాల్లో, కాస్మోటిక్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం వీటి వినియో గం పెరగడంతో అంతరించి పోతున్న అరుదైన జాతి సంపదను స్మగ్లర్ల బారి నుంచి సంరక్షించుకునేందుకు ప్రభుత్వం వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో శ్రీగంధం మినహా మిగతా మొక్కలను సో షల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి కొన్ని రకాలు ఉచితంగా మరి కొన్ని రకాల మొక్కలు నామమాత్రపు ధరకు రైతులకు అందజేస్తోంది. దీంతో జిల్లాలో పలువురు వీటిని సా గు చేస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లో అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అనుమతులు ఇస్తోంది. దీంతో జిల్లాలో ప్ర స్తుతం ఎర్రచందనం, శ్రీగంధం సుమారు 80 హెక్టార్లలో సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీగంధం చెట్టు రైతుకు ఆదాయం.. వాతావరణ పరిరక్షణ శ్రీగంధం, ఎర్రచందనం పెంపకం చాలా తేలిక. అటవీ సాగు మొక్కలైన టేకు, జామాయిల్, సుబాబుల్ మొక్కలు మాదిరే వీటిని పెంచవచ్చు. నీరు నిలవని మెట్టభూములు వీటి సాగుకు అనుకూలం. ఈ మొక్కలకు ఎటువంటి క్రిమి కీటకాలు ఆశించవు. రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి నాలుగైదు సార్లు నీటితడులు, ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. గంధం, చందనం సాగు రైతులకు ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. సాగు ఇలా.. ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 560 మొక్కలు నాటుకోవచ్చు. ఎర్రచందనం మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి ఉచితంగా అందజేస్తారు. శ్రీగంధం మొక్కలు ప్రైవేటు నర్సరీల్లో లభ్యమవుతాయి. మొక్కలు నాటిన మూడు, నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు, సాగు చేసుకోవచ్చు. సాగు వ్యయం ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతుందని అంచనా. పచ్చని బంగారం శ్రీగంధం ఎర్రచందనం తరువాత శ్రీగంధం కలపకు భారీ డిమాండ్ ఉంటుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే. శ్రీగంధం చెక్కను సెంట్లు, అగరబత్తీలు, సబ్బులు, అందమైన బొమ్మలు తయారీలో వినియోగిస్తారు. ఒక కిలో ధర రూ. 8 వేల నుంచి రూ. 16వేల వరకు ఉంటుంది. 12 నుంచి 15 ఏళ్లు తరువాత ఒక్కో చెట్టు నుంచి 15 నుంచి 20 కిలోల వరకూ పొందవచ్చు. దీంతో ఒక్కో చెట్టు నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం లభిస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని దొంగల బారిన పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది. పెరిగి పెద్దయితే ఎర్ర బంగారమే.. ఎర్రచందనం 15 సంవత్సరాల వయసు తరువాత ఈ చెట్లు గరిష్టంగా 20 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. వీటిని నరికితే ఎకరాకు 200 నుంచి 300 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏ – గ్రేడు దుంగలకు టన్ను రూ 60 లక్షలు, బి–గ్రేడు రూ. 40 లక్షలు, సీ–గ్రేడు రూ. 31 లక్షలు ధరలుగా నిర్ణయించారు. ఈ లెక్కన కనీసం సీ గ్రేడు రకానికి లెక్కేసినా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాగులో పాటించాల్సిన మెలకువలు ►నాటిన మొదటి సంవత్సరం మొక్కల బతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మొదటి రెండేళ్ల పాటు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మొక్కలు నేలలో స్థిరపడి బాగా పెరుగుతాయి ►వీటిని మెట్ట,గరప నేలల్లో సాగు చేయవచ్చు ►ఎకరాకు 560వరకు మొక్కలు నాటుకోవచ్చు ►మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి ►శ్రీ గంధం వేర్లకు సొంతంగా పోషకాలను గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. అందుబాటులో చెట్ల వేర్లతో శ్రీగంధం వేర్లు పెనవేసుకొని వాటి నుంచే తేమను పోషకాలను సంగ్రహిస్తాయి. ►నాటిన మూడేళ్ల వరకు శ్రీగంధానికి అందు బాటులో ఏదో ఒక మొక్క ఉండి తీరాల్సిందే. -
దద్దరిల్లిన సీమ గర్జన.. గ్రాండ్ సక్సెస్.. భారీగా తరలివచ్చిన రాయలసీమ వాసులు
సాక్షి, కర్నూలు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అన్యాయంపై రాయలసీమ వాసులు గళమెత్తారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు భారీగా రాయలసీమ వాసులు తరలివచ్చారు. దీంతో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు హాజరయ్యారు. న్యాయ రాజధానిపై జనం నినదించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు, న్యాయ రాజధాని ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. నారాసుర భూతం దిష్టిబొమ్మను సీమ జనం దగ్ధం చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. సభకు మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ గర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సభకు కర్నూలుతో పాటు నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆరాటం: మంత్రి పెద్దిరెడ్డి వికేంద్రీకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదని, స్వప్రయోజనాల కోసమే ఆయన ఆరాటం అని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు: మంత్రి బుగ్గన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన అన్నారు. చంద్రబాబు కుప్పంలో అభివృద్ధి చేయలేకపోయారు. కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు. చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ. రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ. రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు. హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదని, మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. -
న్యాయ రాజధాని కోసం కదం తొక్కిన సీమ వాసులు
అప్డేట్స్ 01:08PM రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ గర్జనకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. దీనికి రాయలసీమ వాసులు భారీగా తరలివచ్చారు. విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు రాయలసీమ గర్జన సభలో పాల్గొన్నారు. 12:00PM చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదు: గుమ్మనూరు జయరాం మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: గుమ్మనూరు జయరాం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం జగన్ ముందకెళ్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా 11:48AM రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు: ఎమ్మెల్సీ ఇక్బాల్ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధాని: ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి న్యాయ రాజధాని కోసం ఎంతకైనా పోరాడతాం 11:52AM రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉంది: బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారు రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలి 11:20AM నారాసుర భూతం దిష్టిబొమ్మను దగ్థం చేసిన సీమజనం రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు 10:30AM మంత్రి బుగ్గన కామెంట్స్ వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్ వికేంద్రకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఆరాటం రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు: మంత్రి ఉషశ్రీ చరణ్ వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుంది: మంత్రి ఉషశ్రీ చరణ్ చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే శ్రీదేవి చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలు ఉండటం దురదృష్టకరం: ఎమ్మెల్యే శ్రీదేవి వికెంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీదేవి 10:00AM కర్నూలులో ప్రారంభమైన జేఏసీ రాయలసీమ గర్జన సభ కర్నూలు న్యాయ రాజధాని కోసం గళం విప్పిన సీమ వాసులు రాయలసీమ జిల్లాల నుంచి సభాస్థలికి భారీగా తరలివచ్చిన జనం శ్రీబాగ్ ఒప్పంద ప్రాకరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ సభా స్థలికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, మేధావులు రాయలసీమ గర్జన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నేతలు గర్జనకు హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్ సభకు హాజరైన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ ‘మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి.. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. -
‘సీమ’ గర్జన: 1937 పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే..
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు రాయలసీమ వాసులు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల భారీ బహిరంగ సభకు వేదిక కానుంది.దీనికి మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే.. వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది. ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మ కంతోనే ఆంధ్రరాష్ట్రం సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదు చేరింది. సీమలోని సిద్ధేశ్వరంను వదిలేసి నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టారు. శ్రీ బాగ్ ఒప్పందం అటకెక్కింది. దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని, కేవలం పాలనా రంగంలోనే కాక జల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలనే సంకల్పంతో నేడు(సోమవారం) చేపట్టిందే రాయలసీమ గర్జన. రాష్ట్ర విభజన సమయంలో సైతం ఇక్కడ ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. అధికార వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని తుంగలోకి తొక్కారు. -
రాయలసీమ గర్జనకు భారీగా తరలిరానున్న ప్రజలు
దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు రాయలసీమ వాసులు సిద్ధమయ్యారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు అన్ని వర్గాల ప్రజలు తరలి రానుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కర్నూలు(రాజ్‌విహార్): రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను జేఏసీ ఏర్పాటు చేసింది. దీనికి మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ గర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సభకు కర్నూలుతో పాటు నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. గర్జనకు సంపూర్ణ మద్దతు రాయలసీమ గర్జనకు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. సీమకు జరిగిన అన్యాయాన్ని వినిపించేందుకు రాయలసీమ జేఏసీ నిర్వహించే సభను జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం మంత్రులతో పాటు అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ సభా స్థలాన్ని సందర్శించారు. రాయలసీమ జేఏసీ చైర్మన్ విజయ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ పరిశీలకుడు కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, రాయలసీమ జేఏసీ విద్యార్థి సంఘం చైర్మన్ శ్రీరాములు, కన్వీనర్లు చంద్రప్ప, సునిల్‌రెడ్డి, మణిరెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపొగు ప్రశాంత్, పార్టీ నాయకులు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, తోట వెంకట కృష్ణారెడ్డి, అక్కిమి హనుమంతరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, ధనుంజయ ఆచారి, సత్యం యాదవ్ పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు కర్నూలు: రాయలసీమ గర్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిద్దార్థ కౌశల్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో సమావేశం అయ్యారు. ఎస్టీబీసీ కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి సామర్థ్యంతో పోలీసులు పనిచేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ సభ దాదాపు మూడు గంటల పాటు సాగుతుందని, మైదానం జనాలతో నిండిన తర్వాత బయట నుండి ఎక్కువ మంది లోపలికి రాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమం పూర్తిగా ముగిసే వరకు సిబ్బందికి కేటాయించిన స్థానాల్లోనే ఉండాలన్నారు. హోంగార్డు స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అప్రమత్తంగా పనిచేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే సత్వరమే స్పందించి పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అడిషనల్ ఎస్పీలు కృష్ణకాంత్ పటేల్, డి.ప్రసాద్, నాగబాబు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. న్యాయ రాజధానితోనే అభివృద్ధి న్యాయ రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని రాయలసీమ జేఏసీ చైర్మన్ (నాన్ పొలిటికల్), చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమకు జరిగిన అన్యాయాన్ని దశాబ్దాలుగా విన్నవిస్తూ వస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి కర్నూలుకు హైకోర్టును మంజూరు చేస్తే కొందరు అడ్డుకుంటున్నారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్ని వర్గాలు కలిసి ఉద్యమిస్తే న్యాయరాజధాని కర్నూలుకు వస్తుందన్నారు. సోమవారం కర్నూలులో జరిగే రాయలసీమ గర్జనకు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. రాయలసీమ విద్యార్థి జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప మాట్లాడుతూ కర్నూలుకు హైకోర్టును మంజూరు చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకోవడం తగదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతుతో న్యాయ రాజధాని సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు టీవీ రత్న ప్రసాద్, మాలిక్‌బాషా, రాజశేఖర్, బార్ అసోసియేషన్ సుబ్బయ్య, సునిల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, సుబ్బయ్య, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయాలి వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది. అయితే అనతి కాలంలోనే దానిని హైదరాబాద్‌కు తరలించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఇక్కడి ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. అధికార వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని తుంగలోకి తొక్కారు. రాజధానితో పాటు హైకోర్టు, అసెంబ్లీ, ఐటీ హబ్, హెల్త్ సిటీ, టూరిజం హబ్ వంటివి అన్నీ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి వేల ఎకరాలు సేకరించారు. అయితే ఆ నిర్మాణాలు పూర్తి కాకపోవడం, జేఏసీ, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మళ్లీ ఆందోళనలు రావడంతో సీమకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీని అమరావతిలోనే ఉంచి కార్యానిర్వహక రాజధాని వైజాగ్‌లో, న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు దీనిని అడ్డుకుంటూ వస్తున్నారు. దీనిపై రాయలసీమ జేఏసీ నాయకులు రాయలసీమ గర్జన పేరుతో కర్నూలులో భారీ సభను ఏర్పాటు చేశారు. దీనికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలపడంతో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించి, తగిన సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నారు. -
‘న్యాయ రాజధాని’ మా హక్కు
సాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు (రాజ్‌విహార్) : అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీ.. హైకోర్టు ఏర్పాటుకు అడ్డు తగులుతూనే ఉంది. దీనిపై కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంద రోజులకుపైగా రిలే దీక్షలు చేశారు. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు, మానవ హారాలు చేశారు. వెనుకబడిన ప్రాంతానికి న్యాయం దక్కుతుందని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారు. ఇదే క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు కూడా తమ ఆకాంక్షను నిరసన రూపంలో తెలియజేశారు. అయితే కర్నూలు వేదికగా చంద్రబాబు సీమ ప్రజల ఆకాంక్షలకు గండికొట్టేలా, కర్నూలులో హైకోర్టు అవసరం లేదని, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని అంటూ.. టీడీపీ కార్యకర్తలతోనూ అదే విధంగా నినాదాలు చేయించి సీమ ప్రజలను మరింత రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ‘సీమ వాణి’ మరింత గట్టిగా వినిపించేందుకు జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సభాప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి బుగ్గన ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి.. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. మొదటగా లక్ష మందితో సభ నిర్వహించాలని భావించినా, నిఘా వర్గాలు, నిర్వాహకుల లెక్క ప్రకారం అంతకు మించి భారీగా ప్రజలు తరలి రానున్నారని తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు, వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ‘న్యాయ రాజధాని’ ప్రకటనతో వేగంగా అభివృద్ధి హైకోర్టు ఏర్పాటైతే నాలుగు జిరాక్స్ మిషన్లు మినహా ఏం ఉపయోగం లేదని కొంత మంది హేళన చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద నగరం, సౌత్ ఇండియాకు ముఖ ద్వారం కర్నూలు. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తే సాధారణ నగరాల కంటే భిన్నమైన అభివృద్ధి జరుగుతుంది. బెంగళూరు–హైదరా>బాద్, చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో కర్నూలు ఉంది. ఇప్పటికే పారిశ్రామికంగా కర్నూలు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ అయితే పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలును ఎంచుకునే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు, భూమి, నీటి లభ్యత హైదరాబాద్ కంటే మరింత మేలుగా ఉండే అవకాశం ఉంది. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమానాశ్రయం కూడా ఉంది. దీంతో ప్రధాన నగరాలకు రవాణా సౌకర్యం కూడా మెరుగ్గా ఉంటుంది. హైకోర్టు ఏర్పాటైతే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌తో పాటు 43కు పైగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏసీబీ కోర్టు కర్నూలులో ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుతో నగరంలో నిర్మాణ రంగం వేగం పుంజుకోనుంది. నగర పరిధి విస్తరించనుంది. దీంతో ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగు పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1953లో రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును 1956లో త్యాగం చేయకుండా ఉండి ఉంటే ‘సీమ’ జిల్లాల ముఖచిత్రం మరోలా ఉండేది. త్యాగం చేయడంతో కర్నూలుతో పాటు సమీప జిల్లాలైనా అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు కూడా భారీగా నష్టపోయాయి. అందుకే ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో ‘న్యాయ రాజధాని’ సాధించాలని ‘సీమ’ వాసులు గట్టిగా సంకల్పించారు. ఆ దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. కాగా, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్, తదితరులు మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. వెనుకబడిన ప్రాంతానికి న్యాయం జరగాలి ‘సీమ’ అత్యంత వెనుకబడిన ప్రాంతం. దీనికి న్యాయం చేసేందుకు హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్దమనుషులు 1937లో ఒప్పందం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంక్షిస్తూ ముఖ్యమంత్రి హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు కుట్రలు చేస్తున్నారు. అది ఎవరో అందరికీ తెలుసు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అందుకే జేఏసీ నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. సభలో పాల్గొంటున్నాం. కచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి. – బుగ్గన, ఆర్థిక శాఖ మంత్రి హైకోర్టు ఏర్పాటు చేసే వరకూ ఉద్యమిస్తాం కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కానీ కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. ఇటీవల జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. పుండుపై కారం చల్లేలా ఆయన మాట్లాడారు. అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని, కర్నూలుకు హైకోర్టు అవసరం లేదని ఆయన టీడీపీ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. అందుకే ‘సీమ గర్జన’తో ప్రజల ఆకాంక్షను నేడు తెలుపబోతున్నాం. – విజయ్‌కుమార్‌రెడ్డి, చైర్మన్, రాయలసీమ జేఏసీ స్వార్థ ప్రయోజనాల కోసమే బాబు కుట్రలు స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలు పన్నుతున్న ఏకైక వ్యక్తి టీడీపీ నేత చంద్రబాబు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో సీఎం జగన్మోహన్రెడ్డి ముందుకు వెళ్తున్నారు. కానీ అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అమరావతి చుట్టూ చంద్రబాబు అనుచరులందరికీ భూములు ఉన్నందున, వారికి నష్టం జరగకూడదని చూస్తున్నారు తప్ప ఇతర ఆలోచన లేదు. తన రియల్ దందా దెబ్బ తింటుందనే ఆవేదనతోనే కుట్రలకు తెర లేపారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబుకు సీమ నెత్తురు ఉంటే కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేలా మద్దతు ప్రకటించాలి. – గుమ్మనూరు జయరాం, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చంద్రబాబు అడ్డంకులు తాత్కాలికమే వేల ఎకరాల పచ్చని పొలాలను రాజధాని పేరుతో తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఎడారిగా మార్చేసింది. అక్కడ అభివృద్ధి కోసం అంటూ రూ.వేల కోట్లు ఖర్చు చేసినా కనీసం టీ హోటల్ కూడా లేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతల అభివృద్ధి కోసం సీఎం జగన్ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు లాంటి వాళ్లు ఎంత మంది అడ్డుకున్నా అవి తాత్కాలికమే. రాయలసీమ గర్జనకు మా పూర్తి సహకారం ఉంటుంది. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్, రాయచోటి ఎమ్మెల్యే -
‘రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు’
కర్నూలు: రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాయలసీమ హక్కుల కోసం జేఏసీ పోరాటం చేస్తోందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. డిసెంబర్ 5వ తేదీన కర్నూలులో జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నారని, రాయలసీమ గర్జన పేరుతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ గర్జన సభకు తమ పార్టీ వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బుగ్గన పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని ప్రాంతాల వారిని మోసం చేశారని, పచ్చటి పొలాలను కూడా నాశనం చేశారని బుగ్గన మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు మంత్రి. -
న్యాయ రాజధాని సీమ హక్కు
కర్నూలు (రాజ్‌విహార్): న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలన్నది రాయలసీమ హక్కు. ఆ హోదా కర్నూలుకు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. డిసెంబరు 5వ తేదీన కర్నూలులో జరిగే రాయలసీమ గర్జన కార్యక్రమం జయప్రదంపై ఆయన బుధవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ప్రైవేటు కళాశాలలు, విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మద్రాసు, ఆ తరువాత హైదరాబాదు నుంచి విడిపోవడం, విభజన హామీలు పక్కాగా అమలు కాకపోవడంతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. 2014లో రాష్ట్ర విభజన అయ్యాక అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సీమకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణకు సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. కర్నూలు నుంచి రాజధాని హైదరాబాదుకు తరిలించే సమయంలో పెద్దల సమక్షంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమకు అన్యాయం జరగకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, దీనిని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. గతంలో జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో జరగరాదనే గొప్ప ఆలోచనతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు చేపట్టిన గర్జన విజయవంతం అయిందని, కర్నూలుకు హైకోర్టును సాధించుకునేందుకు ప్రతి వర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో జరిగే రాయలసీమ గర్జన జయప్రదం కావాలని, గర్జనతో ఆగకుండా ఇక్కడ న్యాయ రాజధాని ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు విశ్రమించరాదని సూచించారు. హైకోర్టు కోసం చేసే ప్రతి ఉద్యమం, ఆందోళనకు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లోనూ చైతన్యం వచ్చిందని, అయితే సమన్వయంతో కలుపుకొని వెళ్లాలని సూచించారు. విద్యార్థి, న్యాయవాదులు, ఉద్యోగ, కార్మిక, వ్యాపార సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ తరలివచ్చేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎ హఫీజ్‌ఖాన్, డాక్టర్ సుధాకర్, జేఏసీ కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, విద్యా సంస్థల నిర్వహకులు, జేఏసీ నాయకులు రాయలసీమ క్రిష్టియన్ కళాశాల కరస్పాండెంట్ ఆదిమూలపు సతీష్, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, రవీంద్ర కళాశాలల కరస్పాండెంట్ జి.పుల్లయ్య, జి.సుబ్బయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాశాంతి, ఆదర్శ విద్యా సంస్థల కరస్పాండెంట్ తిమ్మయ్య, శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజేఎంలు మురళీకృష్ణ, సురేష్, సెయింట్ జోసెఫ్ కరస్పాండెంట్ అనూప్, శ్రీలక్ష్మీ విద్యా సంస్థల కరస్పాండెంట్ మాధవీలత, వల్లపురెడ్డి జనార్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో మొదటి నిందితుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో మొదటి నిందితుడిగా ఉన్న బీసన్నగారి రామాంజనేయులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇతను ఇసుక, మద్యం అక్రమ రవాణా చేస్తూ కొంతమందిని కలుపుకుని ఒక గ్రూపుగా తయారై చెరుకులపాడు గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గూండాయిజం, బెదిరింపులకు పాల్పడుతుండటంతో వెల్దుర్తి, కృష్ణగిరి పోలీస్స్టేషన్లలో ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. చిన్నటేకూరు గ్రామానికి చెందిన అల్లుడు సురేంద్ర నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రామాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుడును హత్య చేసిన కేసులో రామాంజనేయులు ప్రథమ నిందితుడిగా ఉన్నాడు. చదవండి: (విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు) -
అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సజ్జల
-
‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైంది’
కర్నూలు: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి హైకోర్టులో భిన్న తీర్పులు వచ్చాయని, అయితే ఒకే ప్రాంతానికి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు సజ్జల. ఈరోజు(సోమవారం) కర్నూలులో మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘ సీఎం వైఎస్ జగన్ ఆశయాలను నెర వేరుతున్నాయి, ఆయన తీసుకున్న నిర్ణయానికి ఏపీలో ప్రజలు మద్దతు ఇస్తున్నారు..స్వాగతిస్తున్నారు. చట్టం కూడా సీఎం వైఎస్ జగన్‌కు సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు కుట్రలకు సుప్రీంకోర్టు మొట్టికాయలు కొట్టింది. ఒకే చోట రాజధాని కట్టాలని హైకోర్టు చెప్పడం సరైనది కాదు, దానిపై సుప్రీంకోర్టు తప్పుపట్టి, ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్, రామోజీ రావు కోరిక చంద్రబాబు సీఎం కావాలనేది. కానీ ఇది ప్రజలు తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని కోరిక లేదు. చంద్రబాబు సీఎం కావాలని ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారు’ అని సజ్జల పేర్కొన్నారు. చదవండి: రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు అమరావతి రాజధాని కేసు: హైకోర్టు ఆదేశాల్లో సుప్రీం స్టే విధించిన అంశాలివే -
చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసనలు
కర్నూలు: చంద్రబాబు చేపట్టిన కర్నూలు జిల్లా పర్యటనకు ఎక్కడ చూసిన నిరసన గళమే వినిపిస్తోంది. గురువారం, శుక్రవారాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడటంతో టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ నేతలపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై టీడీపీ నేతల గూండా వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా శనివారం ఆందోళనలు మిన్నంటాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే కర్నూలులో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా, నిన్నటి పర్యటనలో చంద్రబాబు రెచ్చిపోతూ, ఊగిపోతూ మాట్లాడారు. ‘తమ్ముళ్లు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాళ్లు పతనమవడం ఖాయం. నాకు వచ్చిన కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అది నా సభ్యత. నాకు çహుందాతనం ఉంది’ అని అంటూనే పచ్చి బూతులు, రెచ్చగొట్టే మాటలతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘పనికి మాలిన వ్యక్తుల్లారా.. నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా.. రేయ్ వాన్ని తన్ను.. రేయ్ రారా చూపిస్తా.. మా ఆఫీసుకే వస్తార్రా మీరు.. ఎంత ధైర్యం రా నీకు.. ధైర్యం ఉంటే రాండ్రా గాడిదల్లారా.. బోడి నా కొడుకులు తమాషాలాడుతారా.. రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమికొట్టిస్తా.. గుడ్డలిప్పదీసి కొట్టిస్తా.. పోలీసులు చొక్కాలిప్పేసి నిద్రపోండి.. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం.. మీతో కాకపోతే నేనే తేల్చుకుంటా’ అంటూ సహనం కోల్పోయారు చంద్రబాబు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు మరింత పేట్రేగిపోయారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై భౌతిక దాడులు చేసేందుకు యత్నించారు. -
చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాలకు ఆందోళన కలిగించేవి. ఇంతకాలం లేస్తే మనిషిని కానట్లుగా డబాయిస్తూ రాజకీయం చేసేవారు. కానీ ఈసారి ఆయన బేలగా, తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని అన్నారు. అక్కడితో ఆగలేదు. వచ్చేసారి అధికారం రాకపోతే రాజకీయాలలో ఉండలేనని కూడా ఆయన కడుపు చించేసుకున్నారు. దీని అర్థం ఏమిటి? చదవండి: అబద్ధాలపై పేటెంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. 2024 శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించకపోతే జెండా పీకేయడమే అన్న అర్థం కూడా వస్తుంది. ఆయన ఆ మాట అనలేదు కాని, వచ్చేసారి ఎన్నికలలో గెలుస్తాం అని ధీమాగా చెప్పలేకపోయారు. ఇది సహజంగానే తెలుగుదేశం వర్గాలకు ఇబ్బంది కలిగించే అంశమే. తమ పార్టీ విజయావకాశాలపై వారికే నమ్మకం సడలుతుంది. జనంతో బాబు ఆటలు ఇంతకాలం చంద్రబాబు మేకపోతు గాంభీర్యంతో అయినా మాట్లాడేవారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన దానిని కూడా వదిలేశారు. ఆయన కావాలని అన్నారో, లేక తన మనసులో మాట అనుకోకుండా బయటకు వచ్చేసిందో కాని, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం మంచి పాయింట్ అందించారు. దాంతో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందని, వచ్చే ఎన్నికలలో గెలవలేనని ఆయనే చెబుతున్నారని, ఈ నేపథ్యంలో పలు అబద్దాలతో పాటు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మధ్యలో తన భార్య ప్రస్తావన తేవడం, జరగని అవమానాన్ని జరిగినట్లుగా మళ్లీ పిక్చర్ ఇవ్వడం, వచ్చేసారి గెలవకపోతే రాజకీయాలలో ఉండలేనని అనడం.. అంతా సానుభూతి కోసమే అన్న విశ్లేషణలు వస్తున్నాయి. డామిట్.. నాడు కథ అడ్డం తిరిగింది.! గతంలో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేస్తేనే రాని సానుభూతి, ఇప్పడు ఆఖరి చాన్స్ అంటే వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాపం తెలుగుదేశం మీడియాకు చెందిన ఒకరు దానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు తనకు ఆఖరి చాన్స్ ఇవ్వాలని అనలేదని, ఆయన వ్యాఖ్యలకు అర్ధం ప్రజలకు చివరి చాన్స్ ఇవ్వడం అని చెబితే అందరూ దానిపై వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సాధారణంగా వయసు మళ్లీనవారు తమ నియోజకవర్గాలలో తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నప్పుడు ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. ఈ ఒక్కసారికి గెలిపిస్తే, తాను ఇక ఎన్నికలలో పోటీ చేయబోనని వారు చెబుతుంటారు. ఆ ఎన్నిక ముగియగానే మళ్లీ మామూలే. ఆ వ్యక్తి గెలిస్తే ఐదేళ్ల తర్వాత యథాప్రకారం ఈ సారి ఖాయంగా తప్పుకుంటానని, ప్రజల కోరిక మేరకు పోటీ చేస్తున్నానని అంటుంటారు. చివరికి ఓటమి ఎదురయ్యేదాక వారు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు కూడా అలాగే ఆఖరి చాన్స్ అనడం ద్వారా ప్రత్యర్ధులకు మంచి పాయింట్ అందించినట్లయింది. చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమేనని, అందుకే భయంతో ఇలా మాట్లాడారని వారు పేర్కొటున్నారు. ఒక్క ఛాన్స్ ఎందుకివ్వాలి? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. దీనిపై కూడా పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. టీడీపీతో కలవడంపై వెనుకాడే పరిస్థితి ఏర్పడిందని, అందుకే తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతలు ఆ విషయాన్ని నిర్థారిస్తూ, టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని, జనసేనతో కలిసే బీజేపీ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తుందని వారు స్పష్టం చేశారు. దాంతో పవన్ కల్యాణ్ ఊబిలో పడ్డయిట్లయింది. పవన్ ఒక్క ఛాన్స్ అనడంతో చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితిలో తనకు ఆఖరు చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. కానీ ఎక్కడా తాను ఏపీకి ఇంత మంచి చేశాను.. ఇంకా ఫలానా మంచి పనులు చేస్తానని చెప్పడం లేదు. పైగా ఇంత కాలం జగన్ అమలు చేసిన సంక్షేమ స్కీములను విమర్శిస్తూ మాట్లాడిన చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు మాటను పూర్తిగా మార్చి తాము ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తామని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. కర్నూలులో మాట మడత ఏపీలో మూడు రాజధానుల వివాదం టీడీపీని ఒక కుదుపు కుదుపుతోంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని, చంద్రబాబు అందుకు అడ్డుపడుతున్నారని న్యాయ వాదులు విమర్శిస్తున్నారు. వారు ప్రత్యక్షంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దీనిని ఎదుర్కోవడం టీడీపీకి ఒక పెద్ద సమస్యగా ఉంది. అందుకే చంద్రబాబు ఇంకో మాట చెబుతున్నారు. తనకు అధికారం ఇస్తే, ఐదేళ్లు పాలించి, ఆ తర్వాత పగ్గాలను వేరే వారికి అప్పగిస్తానని చెప్పారు. అంతే తప్ప తన కుమారుడు లోకేష్‌కు వారసత్వం ఇస్తానని చెప్పలేకపోయారు. లోకేష్ గురించి ప్రమోట్ చేస్తే అసలుకే మోసం వస్తుందేమోనన్న అనుమానం చంద్రబాబులో ఉండవచ్చు. లేక కొడుకు లోకేష్ సామర్థ్యం గురించి పూర్తి అవగాహన ఉండడంతో అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చు. ఒక సారి వెనక్కి చూడు బాబు.! రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదు. గత 70 ఏళ్లలో చంద్రబాబు కన్నా పలువురు సమర్ధులు ఏపీని పాలించారు. వారి ఆధ్వర్యంలోనే ప్రకాశం బారేజీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు వచ్చాయి. వారెవరూ తాము లేకపోతే ఆంధ్రులు బతకలేరని చెప్పలేదు. కానీ చంద్రబాబు మాత్రం అంతా తనతోనే ఉందని భ్రమపడుతూ ప్రజలను భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. వర్తమాన సమాజంలో ఎప్పటికప్పుడు కొత్త నేతలు పుట్టుకొస్తారు. కానీ చంద్రబాబు మాత్రం తను అధికారంలోకి రాలేకపోతే ఏదో నష్టం జరుగుతుందని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. సీఎం జగన్ పాలనపై బురద జల్లేందుకు కష్టపడుతున్న చంద్రబాబు చివరికి ఆయన స్కీములనే అమలు చేస్తామని చెప్పే పరిస్థితిలో పడ్డారు. తద్వారా జగన్ సమర్థ పాలకుడని చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. ఎవరి మ్యానిఫెస్టో మాయమయింది? చంద్రబాబు గత శాసనసభ సమావేశాలకు వెళ్లలేదు. అంతమాత్రాన శాసనసభ ఆగిపోలేదు. ప్రభుత్వం నడుస్తూనే ఉంది. జగన్ తాను చేస్తానని చెప్పిన పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అన్ని ఎన్నికలలో చిత్తుగా ఓడించారు. దాంతో చంద్రబాబులో భయం పట్టుకుని చివరి మాటగా ఆఖరి అవకాశం అన్న పదాన్ని ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఓటమి చెందితే ఆయనకు అవి చివరి ఎన్నికలు అవ్వచ్చేమోకాని ప్రజలకు కాదు. ఎందుకంటే ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతూనే ఉంటారు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ మాత్రం వచ్చే ఎన్నికలలో గెలిస్తే 30 ఏళ్లు తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే మాటను ప్రజలకు చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పని చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతీ మాటను, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని అమలు చేసి నిజంగానే ప్రజలపై చెరగని ముద్ర వేశారు. చంద్రబాబు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 2014కు ముందు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని పూర్తిగా నెరవేర్చని చంద్రబాబు.. ఏకంగా తమ మ్యానిఫెస్టోనే పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసింది. ఇప్పుడు ఆఖరు అవకాశం అనడం ద్వారా చంద్రబాబు ఆత్మ రక్షణలో పడితే 175 సీట్లకు, 175 గెలుస్తామని చెప్పడం ద్వారా జగన్ అఫెన్స్ గేమ్ ఆడి తన క్యాడర్లో ఆత్మ విశ్వాసం పెంచుతున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మీకు చెప్పు చూపించాలి: ఊగిపోయిన చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘తమ్ముళ్లు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాళ్లు పతనమవడం ఖాయం. నాకు వచ్చిన కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అది నా సభ్యత. నాకు çహుందాతనం ఉంది’ అని అంటూనే పచ్చి బూతులు, రెచ్చగొట్టే మాటలతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘పనికి మాలిన వ్యక్తుల్లారా.. నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా.. రేయ్ వాన్ని తన్ను.. రేయ్ రారా చూపిస్తా.. మా ఆఫీసుకే వస్తార్రా మీరు.. ఎంత ధైర్యం రా నీకు.. ధైర్యం ఉంటే రాండ్రా గాడిదల్లారా.. బోడి నా కొడుకులు తమాషాలాడుతారా.. రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమికొట్టిస్తా.. గుడ్డలిప్పదీసి కొట్టిస్తా.. పోలీసులు చొక్కాలిప్పేసి నిద్రపోండి.. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం.. మీతో కాకపోతే నేనే తేల్చుకుంటా.. దద్దమ్మ సీఎం.. పనికి మాలిన సీఎం.. రౌడీ సీఎం.. ఇదేమన్నా పులివెందుల అనుకుంటున్నావా?’ అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. కర్నూలులో పర్యటిస్తూ.. కర్నూలుకు న్యాయ రాజధాని వద్దని, అన్నీ ఒక్క అమరావతిలోనే ఉండాలని చెప్పడం భావ్యం కాదని విన్నవించడానికి వచ్చిన న్యాయవాదులు, విద్యార్థులను చూసి చంద్రబాబు ఇలా రెచ్చిపోయారు. అడుగడుగునా నిరసనలే మూడు రోజుల కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు తొలిరోజు నుంచీ అడుగడుగునా నిరసన సెగ తగులుతూనే ఉంది. దేవనకొండ సర్కిల్, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరులో బాబు పర్యటనకు అడ్డుపడిన న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, జేఏసీ నేతలు.. చివరి రోజు శుక్రవారం తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఉదయం ఓ హోటల్లో టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు మధ్యాహ్నం 2.40 గంటలకు టీడీపీ ఆఫీసుకు బయల్దేరారు. బుధవారపేటకు రాగానే ‘న్యాయ రాజధాని’ని కాంక్షించే ప్రజలు, విద్యార్థులు కాన్వాయ్కి అడ్డుతగిలారు. అక్కడి నుండి కలెక్టరేట్ సర్కిల్‌కు రాగానే వందలాది విద్యార్థులు కాన్వాయ్కి అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా లాగేశారు. అక్కడి నుండి గాయత్రి ఎస్టేట్‌లోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు చేరుకున్నారు. ఇక్కడ కూడా న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, జేఏసీ సభ్యులతో పాటు కుల, ప్రజా సంఘాల నేతలు భారీగా తరలివచ్చి టీడీపీ ఆఫీసులోకి చొరబడే ప్రయత్నం చేశారు. నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. నల్లజెండాలు చేతపట్టుకుని, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని ప్ల్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. చంద్రబాబు వీరందరినీ చూస్తూ ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ‘మన ఏకైక రాజధాని అమరావతే. తమ్ముళ్లూ ఇదే విషయం వారికి చెప్పండి. వారిని తన్నండి.. బట్టలూడదీసి కొట్టండి. మీ చేతకాకపోతే నేను వస్తా.. వారి కథ తేలుస్తా’ అని కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు అమరావతే రాజధాని అంటూ నినాదాలు చేశాయి. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ నేతలపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. ఇదంతా చూస్తున్న చంద్రబాబు.. వారిని మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో జేఏసీ నేతలు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దశలో పోలీసులతో పాటు జిల్లా ఎస్పీపై కూడా చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ‘పోలీసులూ నిద్రపోండి. మీరు బట్టలిప్పేయండి. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం. ఎస్పీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరికి కాపలా కాస్తున్నారు? రౌడీలకు అండగా ఉంటారా? నీకు ఐపీఎస్ ఇచ్చిందే దండగ’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. మందు, బిర్యానీ ఇచ్చింటారు.. ‘ఇది పేటీఎం బ్యాచ్.. క్వార్టర్ మందు, బిర్యానీ ఇస్తారు. దీంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ రోజు కూడా వీరందరికీ క్వార్టర్, బిర్యానీలు ఇచ్చి ఉంటారు’ అని చంద్రబాబు.. జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, ఇతర సంఘాల నేతల ఉద్యమాన్ని హేళన చేస్తూ మాట్లాడారు. ‘నేను పార్టీ ఆఫీసుకు వస్తే నలుగురు వచ్చి బెదిరించాలని చూస్తారా? రౌడీయిజాన్ని అణిచివేస్తా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా. నేను కుప్పానికి వెళ్లినా రౌడీలను తీసుకొస్తున్నారు. ఎక్కడికి వస్తారా? నన్ను రాయలసీమ ద్రోహి అంటారా? రాయలసీమను రతనాల సీమగా మార్చే పార్టీ టీడీపీ. రాయలసీమను దోపిడీ చేసిన వ్యక్తి జగన్. కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుని నువ్వు రాజకీయం చేస్తావా? మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా ప్రాణాన్ని లెక్క చేయను. 23 బాంబులకే భయపడలేదు. నేను కనుసైగ చేస్తే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు బట్టలు ఊడదీయిస్తారు. పోలీసు వ్యవస్థ నాశనమైంది. పతనమైంది. నా పర్యటనలకు వస్తున్న స్పందన చూసి వైఎస్సార్ సీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే నన్ను అడ్డుకోవాలని ఐదు, పది మంది వస్తున్నారు. మా తమ్ముళ్లు కన్నెర్ర చేస్తే వీరు పారిపోవడం ఖాయం. కర్నూలును అభివృద్ధి చేసింది నేనే’ అని చెప్పుకొచ్చారు. నువ్వా.. మూడు రాజధానులు నిర్మించేది? ‘టిడ్కో ద్వారా 10 వేల ఇళ్లు ఇచ్చా. చేతనైతే వాటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వు. 90 శాతం నేను పూర్తి చేస్తే 10 శాతం పూర్తి చేయలేకపోయావు. 10 శాతం ఇళ్లు పూర్తి చేయలేని నువ్వు మూడు రాజధానులు కడతావా? ఏమి మనిషివయ్యా.. నీ పుట్టుకే అబద్ధాల పుట్టుక. నీ చరిత్రే నేర చరిత్ర. నేరగాళ్లను పట్టుకునే పార్టీ టీడీపీ. జగన్ అమరావతి రాజధానిగా ఒప్పుకున్నాడా? లేదా? ఓడిపోతాననే పిరికితనంతో ఇప్పుడు మూడు ప్రాంతాల్లో చిచ్చుపెట్టి పచ్చని కాపురాలు నాశనం చేయాలనుకుంటున్నావు. నాలుగేళ్ల నీ పాలనలో ఒక్క రూపాయి పనైనా కర్నూలులో చేశావా? మద్యం, భూములు, భూగర్భ సంపద మీకే కావాలి. పేరు రాయలసీమది, దోపిడీ జగన్‌ది’ అంటూ సీఎంపై నోరు పారేసుకున్నారు. నాతో ఎవరైనా పెట్టుకుంటే అదే వారికి చివరి రోజు. రాజశేఖరరెడ్డి లాంటోళ్లే నాతో పెట్టకోలేదు. వీరెంత.. అవసరమైతే కర్నూలులోనే బస చేస్తా.. ఎవరెవరు ఏం చేశారో చెబుతా.. నువ్వేం చేశావో చెప్పే ధైర్యం ఉంటే పేపర్‌కు ఇవ్వు.. నేనేం చేశానో ఇస్తా.. కర్నూలు ప్రజలే నిర్ణయిస్తారు. రాయలసీమలో ముఠా నేతలను అణిచి వేసిన పార్టీ టీడీపీ’ అని అన్నారు. అంతకు ముందు ఆయన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని, తాండ్రపాడులోని చెరువును పరిశీలించారు. చదవండి: (మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
చంద్రబాబుకు చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ నినాదాలు
కర్నూలు జిల్లా: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మరోసారి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ అంశంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశానికి సంబంధించి చంద్రబాబు వైఖరి ఏమిటో తెలపాలని న్యాయవాదులు శుక్రవారం ధర్మా చేపట్టారు. ఈ క్రమంలోనే కర్నూలులో చంద్రబాబు బస చేసే హోటల్ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధానికి అంగీకరించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. ఇక్కడ అడుగుపెట్టే అధికారం లేదని న్యాయవాదుల సంఘం హెచ్చరించింది. ఇక్కడ చదవండి: కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ -
కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. ఎమ్మిగనూరు విశాఖ గార్డెన్ వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన తెలిపింది. సీమాంధ్ర ద్రోహి చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. న్యాయ రాజధానిపై చంద్రబాబు వైఖరి ప్రకటించాలని, లేదంటే చంద్రబాబు కర్నూలు పర్యటనను అడ్డుకుంటామని న్యాయవాదులు హెచ్చరించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ న్యాయవాదులు మండిపడ్డారు. చదవండి: పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా? -
రాయలసీమ ద్రోహి గోబ్యాక్.. చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి, కర్నూలు జిల్లా: పత్తికొండలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. హైకోర్టును అడ్డుకుంటున్న ద్రోహి అంటూ ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు కాన్వాయ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. రాయలసీమ ద్రోహి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాగా, కర్నూలుకు చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని వచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గురించి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలపైన బాదుడే బాదుడు చేసింది.. బాబే కాదా. మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తన రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు తాపత్రయం అంటూ ఆయన మండిపడ్డారు. చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’ -
చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలుకు చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని వచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గురించి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలపైన బాదుడే బాదుడు చేసింది.. బాబే కాదా. మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తన రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు తాపత్రయం అంటూ మండిపడ్డారు. ‘‘కర్నూలుకు ఏం చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చాడు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. మూడు రాజధానులను అడ్డుకుంటుంది చంద్రబాబు కాదా?. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా?. రాయలసీమపై ప్రేమ ఉంటే న్యాయ రాజధానికి బాబు మద్దతివ్వాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం’’ అని హఫీజ్‌ఖాన్ అన్నారు. చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’ -
జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!
కర్నూలు(సెంట్రల్): అవసరాలకు అనుగుణంగా ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో గతేడాది సెకండ్ హ్యాండ్ షోరూముల్లో దాదాపు 5 వేల కార్లు, 10 వేల బైక్‌ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ఏ కంపెనీ బైక్ తీసుకున్నా దాదాపు రూ.లక్షకు అటు ఇటుగా ధరలు ఉన్నాయి. ఈఎంఐల రూపంలో తీసుకుంటే వడ్డీ, ఇతర చార్జీలు కలుపుకొని రెండేళ్ల వ్యవధిలో రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సగం ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌లు లభిస్తుండడంతో చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొని బతికేవారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్స్లో రూ.50 వేల నుంచి రూ. 70 వేల మధ్య రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల జీవన గమనంలో వృద్ధి కనిపిస్తోంది. ఇదే క్రమంలో సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో మంచి పంటలు పండుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి గిట్టుబాటు ధరలు ఇస్తుండడంతో రైతన్నల ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు విలాసవంతమైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో అవసరాలకు తగ్గట్లుగా కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వెలుస్తున్న షోరూంలు.. సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుండడంతో వ్యాపారులు అందుకు తగ్గట్లుగా షోరూంలను తెరుస్తున్నారు. కర్నూలులో 15 కారు, 20 బైక్ షోరూంలు ఉన్నాయి. ఆదోనిలో 5 కారు, 10 బైక్, నంద్యాలలో 5 కారు, 13 బైక్ షోరూంలు వెలిశాయి. వీటిని ఆయా పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సెకండ్ హ్యాండ్ షోరూముల్లో గతేడాది 5 వేల వరకు కార్లు, 10 వేల వరకు బైక్‌లు అమ్మకాలు జరిగాయి. ఈఎంఐ సదుపాయం సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌లకు కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ వడ్డీ, తక్కువ డౌన్పేమెంట్స్తో ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ వసతి కూడా ఉంది. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కొనుగోలు చేసే వాహనాన్ని మొదట మెకానిక్కు చూపించి, దాని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రేటును నిర్ణయించుకోవాలి. తక్కువ దూరం తిరిగినవి మేలైన మన్నిక ఇస్తాయి. షోరూంలకు చిన్నపాటి మరమ్మతులకు గురైనవి అధికంగా వస్తుంటాయి. కొందరు అచ్చుబాటుకాక, మరికొందరు తక్షణ రుణావసరాల కోసం అమ్మి ఉంటారు. రికార్డులను పరిశీలించి, కొనుగోలు చేయడం ఉత్తమం. కార్లపై పెరిగిన ఆసక్తి... మార్కెట్లో పలు కంపెనీల కార్లు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంది. సెకండ్స్లో రూ.లక్ష నుంచి సరసమైన ధరకు కార్లు లభిస్తున్నాయి. నాలుగైదు లక్షలు వెచ్చిస్తే మంచి కంపెనీ..రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో సామాన్యులు సైతం కార్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెకండ్స్లో కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో ఉద్యోగులు, రైతులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. కార్లు ఎక్కువగా కొంటున్నారు కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో మా షోరూం ఉంది. ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని రికార్డులు సక్రమంగా ఉంటాయి. కొనుగోలుదారులకు భవిష్యత్‌లో ఏమీ ఇబ్బందులు ఉండవు. నెలలో కనీసం 10 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. – శ్రీనివాసులు సౌకర్యవంతంగా ఉంది మేం ఇటీవల సెకండ్ హ్యాండ్లో కారును కొనుగోలు చేశాం. దాని స్థితిగతి చాలా బాగుంది. మేము కొనుగోలు చేసిన వాహనం కొత్తదైతే రూ.10 లక్షల విలువ ఉంటుంది. సెకండ్స్లో దానిని రూ.4 లక్షలకే కొనుగోలు చేశాం. మా కుటుంబ అవసరాలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. – రజనీకాంత్‌రెడ్డి, కర్నూలు సగం ధరకే కొనుగోలు చేశా నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. స్కూలుకు సమయానికి వెళ్లేందుకు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించాను. అయితే మార్కెట్లో ఫస్టు హ్యాండ్ వాహనాలకు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది. సెకండ్స్లో చూస్తే మేము అనుకున్న ధరకే లభించింది. దాదాపు సగం ధరకే కారును కొనుగోలు చేశా. – శ్రీనివాసరెడ్డి, కర్నూలు -
కన్నీళ్లు తెప్పించే ఘటన.. ఎమ్మిగనూరులో తండ్రి.. హైదరాబాద్‌లో కొడుకు..
ఎమ్మిగనూరు రూరల్ (కర్నూలు జిల్లా): తండ్రి మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే కుమాడురు మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు..ఎమ్మిగనూరు పట్టణం ఎస్ఎంటీ కాలనీకి చెందిన మాదేష్(65), బేబిలు రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వీరికి జగదీష్ (32) ఒక్కడే సంతానం. కొన్ని సంవత్సరాల క్రితం జగదీష్‌కు రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్‌లో సెంట్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే జగదీష్ గత నెల 25వ తేదీన ఎమ్మిగనూరుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కుమారుడికి ప్రమాదం జరిగినప్పటి నుంచి తండ్రి మాదేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. కుమారుడికి ఆపరేషన్ చేస్తుండడంతో హైదరాబాద్‌కు వెళ్లిన మాదేష్ భార్య బేబి విషయం తెలుసుకుని మధ్యాహ్నం ఎమ్మిగనూరుకు చేరుకుంది. తండ్రి అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తుండగా బీపీ, షుగర్ పెరిగి జగదీష్ మృతి చెందాడు. భర్త మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌తో భార్య రాధ ఒక్కటే ఎమ్మిగనూరు వచ్చింది. ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందటంతో ఎమ్మిగనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: భర్తతో విడాకులు.. ఇంటి పనికి వెళ్లి వస్తానని చెప్పి.. -
మూడు సార్లు గుండె ఆగినా.. ప్రాణాలు నిలిపారు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన వరుణ్ అనే 8 ఏళ్ల బాలుడికి ఇన్ఫెక్షన్ కారణంగా మూడు సార్లు గుండె ఆగిపోయింది. ఇలాంటి స్థితిలో వైద్యులు.. బాలుడికి సీపీఆర్ చేసుకుంటూ మెరుగైన వైద్యం అందించడంతో తిరిగి ప్రాణం పోసుకున్నాడు. వివరాలను బుధవారం కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జీ వివరించారు. వరుణ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయానికి అతనికి కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఎంతో శ్రమించి వైద్యులు అతని గుండెను పునఃప్రారంభింపజేశారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. బాబుకు ఇన్ఫెక్షన్ సోకడంతో గుండె సామర్థ్యం మందగించిందని తెలుసుకున్నారు. వైద్యం చేసే సమయంలోనే బాలుడి గుండె మూడు సార్లు ఆగిపోయింది. ఆ సమయంలో మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తి పక్షవాతం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెరుగైన వైద్యం కారణంగా పక్షవాతం రాలేదు. పిల్లల గుండెకు ఇన్షెక్షన్ సోకి గుండె పనితీరు మందగించడం చాలా అరుదుగా జరుగుతుందని, దీనిని వైద్య పరిభాషలో మయోకార్డియారెస్ట్ అంటారని డాక్టర్ మురార్జీ తెలిపారు. మయోకార్డియాటీస్ ఉన్నప్పుడు తక్కువ మంది పిల్లలకు తీవ్రమైన గుండె సమస్యలు తలెత్తుతాయని, వారికి ఇంట్రావీనస్ ఆయనోట్రోఫిక్ సపోర్ట్, మెకానికల్ వెంటిలేషన్‌తో ఇంటెన్సివ్ కేర్ థెరపీ అవసరం ఉంటుందని డాక్టర్ మురార్జీ వివరించారు. చదవండి: (బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం) -
బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): తాను బతికి ఉండగా నాగలి చేతబట్టి ధాన్యరాశులు పండించి పదుగురికీ పట్టెడన్నం పెట్టాడు. చివరకు మరణించాక కూడా ఐదుగురికి తన అవయవాలను దానం చేసి వారిలో జీవిస్తున్నాడు. కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డికి ఈ నెల 5వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని కర్నూలు నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌కు తరలించారు. అతన్ని రక్షించేందుకు మూడురోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తూ అతను మంగళవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆ తర్వాత వైద్యబృందం అవయవదానంపై వారి కుటుంబసభ్యులు భార్య, కుమారులకు, బంధువులకు అవగాహన కల్పించారు. వారి అంగీకారంతో కళ్లు, కాలేయం, రెండు కిడ్నీలు దానం చేశారు. చనిపోతూ అతను మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. జీవనధాన్ ఆధ్వర్యంలో అవసరం ఉన్న చోటికి గ్రీన్‌చానెల్ ద్వారా కాలేయం, కిడ్నీలను తరలించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చదవండి: (సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు) -
షాకింగ్ ఘటన.. కాన్పుకు పుట్టింటికి వెళ్దాం పదమ్మా.. రానంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి..
వెల్దుర్తి(కర్నూలు జిల్లా): ఐదు నెలల గర్భంతో ఉన్నావు, మొదటి కాన్పుకు ఇంటికి వెళ్దాం పదమ్మా అని కూతురును ఓ తల్లి కోరితే, పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేక పురుగు మందు తాగి తనువు చాలించిందా కూతురు. వెల్దుర్తి మండలం గువ్వలకుంట్లలో జరిగిన సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంకు చెందిన కురువ దేవరింటి కుమారికి, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గువ్వలకుంట్లకు చెందిన ఆనంద్‌కు 8 నెలల క్రితం వివాహమైంది. చదవండి: భార్యకు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో.. భర్త షాకింగ్ నిర్ణయం కుమారి ప్రస్తుతం 5నెలల గర్భిణి. ఈనెల 2న కుమారి తల్లి లక్ష్మీదేవి తన కుమార్తెను పుట్టింటికి పిలుచుకు వెళ్లేందుకు గువ్వలకుంట్లకు చేరుకుంది. కాన్పుకు తీసుకెళ్తానని తెలిపింది. పుట్టింటికి తాను రానంటూ పరిగెత్తుకు వెళ్లిన కుమారి బాత్రూమ్ తలుపేసుకుని గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కుమారిని కర్నూ లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.తదుపరి మెరుగైన వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రికి, తిరిగి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించారు. చివరకు ప్రభుత్వాసుపత్రిలో కోలుకోలేక సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
కరువు నేలలో కృష్ణమ్మ పరుగులు
వర్షం పడితేనే పంటలు పండే నేలలో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. కృష్ణమ్మ జల స్పర్శతో చెరువులు సైతం పులకించనున్నాయి. ఇందుకోసం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో త్వరలోనే రైతుల కల సాకారం కానుంది. కృష్ణగిరి(కర్నూలు): జిల్లాలోని çపత్తికొండ, డోన్, ఆలూరు, కర్నూలు నియోజకవర్గాలకు గతంలో సాగునీటి వనరులు తక్కువగా ఉండేవి. వరుణుడి కరుణతోనే పంటలు పండేవి. ఇక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుని కృష్ణా జలాలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా తరలించేందుకు 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా కృష్ణాజలాలను చిత్తూరు జిల్లా వరకు తీసుకెళ్లేలా నిధులు మంజూరు చేసి పనులు సైతం పూర్తి చేయించారు. 2014 ఎన్నికల కంటే ముందుగానే కాలువకు నీరు విడుదల చేసి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్‌కు అప్పటి మంత్రులు పాదయాత్ర చేపట్టారు. జిల్లాలో ఏడు ఎత్తిపోతల పథకాలు, రెండు రిజర్వాయర్లతోపాటు రెండు చానల్ కాల్వల ద్వారా 80వేల ఎకరాలకు అధికారికంగా సాగునీరు ఇస్తున్నారు. ఇదంతా దివంగత నేత వైఎస్సార్ పుణ్యమే అని ఇక్కడి ప్రజలు నిత్యం స్మరించుకుంటున్నారు. 68 చెరువులకు హంద్రీ–నీవా నీరు హంద్రీ–నీవా ప్రాజెక్టుతో బీడు భూములను వైఎస్సార్ సస్యశ్యామలం చేయిస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి హంద్రీ–నీవా ప్రధాన కాల్వ నుంచి 68 చెరువులకు నీరు మళ్లించే పనులను పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ సమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ 90 కి.మీ దగ్గర పంప్‌హౌస్ నిర్మించారు. ఇందులో 3,800 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్ల నుంచి కటారుకొండ పంచాయతీ పరిధిలోని పులిచెర్ల సమీపంలో డెలివరీ చాంబర్‌కు నీరు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి మూడు ౖపైపుల ద్వారా నీరు చెరువులకు మళ్లించనున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలతోపాటు డోన్, ప్యాపిలి, కల్లూరు, దేవనకొండ మండలాల్లోని 68 చెరువులకు పైపుల ద్వారా నీరు వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 186 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 160 కోట్లు ఖర్చు చేసింది. పంటలు పూర్తయిన వెంటనే డిస్ట్రిబ్యూటరీ పనులు కృష్ణగిరి మండల పరిధిలోని పులిచెర్ల కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్ నుంచి మూడు గ్రావిటీల ద్వారా చెరువులకు నీరు మళ్లించే మెయిన్ పైప్‌లైన్ పనులు 80 శాతానికిపైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ పంటలు ఉండటంతో డిస్ట్రిబ్యూటరీ పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. పంట కాలం పూర్తయిన వెంటనే పనులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని అనుమతులు వచ్చాయి 68 చెరువులకు నీరు మళ్లించే పథకానికి సంబంధించి అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా ఉండేవి. అయితే ఇప్పుడు అన్ని అనుమతులు వచ్చాయి. మెయిన్ పైప్‌లైన్ దాదాపుగా 80 శాతానికిపైగా పూర్తి చేశాం. డిస్ట్రిబ్యూటరీలు కొన్ని చేపట్టాల్సి ఉంది. పొలాల్లో రైతులు పంటలు తీస్తే ఆ పనులు కూడా త్వరగా పూర్తి చేస్తాం. డిసెంబర్ నాటికి 30 చెరువులకు పైగా నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణరెడ్డి, ఇరిగేషన్ ఈఈ మూడు గ్రావిటీలు ఇవే.. గ్రావిటీ–1: పులిచెర్ల సమీపంలోని కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్ నుంచి 41.52 కిలోమీటర్ల దూరం ప్రయాణించి డోన్, వెల్దుర్తి, కల్లూరు, కృష్ణగిరి మండలాల్లోని 22 చెరువులకు నీరు చేరుకుంటుంది. 4,217ఎకరాలకు నీరు అందనుంది. గ్రావిటీ–2: డెలివరీ చాంబర్ నుంచి నీరు 21.20 కిలోమీటర్లు ప్రయాణించి పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల్లోని 16 చెరువులకు చేరుతుంది. మొత్తం 3,018 ఎకరాలకు నీరు పారనుంది. గ్రావిటీ–3: డెలివరీ చాంబర్ నుంచి నీరు 38 కిలోమీటర్లు దూరం ప్రయాణించి డోన్, ప్యాపిలి, తుగ్గలి మండలాల్లోని 30 చెరువులకు చేరుతుంది. ఆయా మండలాల్లో 2,898 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ట్రయల్ రన్ విజయవంతం హంద్రీ– నీవా కాలువ నుంచి చెరువులకు నీటిని మళ్లించేందుకు సెప్టెంబర్ నెలలో డీఈలు రవీంద్రనాథ్‌రెడ్డి, రామకృష్ణ ట్రయల్ రన్ నిర్వహించారు. రెండు మోటార్ల ద్వారా నీటిని పులిచర్ల సమీపంలోని డెలివరీ చాంబర్లోకి వదిలారు. అక్కడి గ్రావిటీ–1 పైపులైన్ ద్వారా కృష్ణగిరి మండలంలోని కటారుకొండ తుమ్మల చెరువు, కర్లకుంట, డోన్ మండలంలోని మల్లెపల్లె, వెంకటాపురం, జగదుర్తి చెరువులకు నీటిని పంపించారు. అలాగే గ్రావిటీ–2 పైప్‌లైన్ ద్వారా ఆలంకొండ గ్రామంలోని బోయినాల, కూర్మగిరి, తుగ్గలి మండలంలోని బొందిమడుగుల, చందోళి, చక్రాళ్ల, ముకెళ్ల చెరువుల్లోకి నీటి విడుదల విజయవంతమైంది. దీంతో ఈ గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాం వైఎస్సార్ చలువతో మా గ్రామానికి సమీపంలోనే హంద్రీ–నీవా కాలువ ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడంతో హంద్రీ–నీవా కాలువ నుంచి చెరువులకు నీరు వదిలే పనులు చురుగ్గా సాగుతున్నాయి. బోయినాల, కూర్మగిరి చెరువులకు త్వరలోనే నీరు వదులుతామంటున్నారు. మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాం. – ఆర్బీ వెంకటరాముడు, ఆలంకొండ ప్రతి ఏడాది వరి సాగు చేస్తాం హంద్రీ–నీవా కాలువకు మా గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు. మా చెరువులకు నీరు వస్తుందనే ఆశ కూడా మాకు లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకుని పనులు చేయిస్తున్నారు. చెరువులకు హంద్రీ–నీవా నీరొస్తే ప్రతి ఏడాది వరిసాగు చేస్తాం. – ఆదినారాయణ, వెంకటాపురం భూగర్భ జలాలు పెరుగుతాయి మా గ్రామ చెరువు ఎప్పుడూ నిండింది లేదు. రెండేళ్ల కిందట ఒకసారి భారీ వర్షానికి నిండింది కానీ పంట సాగుచేస్తే చివరివరకు నీరు చాలలేదు. సెస్టెంబర్లో నిర్వహించిన ట్రయల్ రన్లో మా చెరువులోకి హంద్రీ–నీవా నీరు వచ్చింది. చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే ప్రతి ఏటా వరి పండిస్తాం. బోరుబావుల్లో కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. – జల్ల సుంకన్న, బొందిమడుగుల -
ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత
సాక్షి, అమరావతి/అవుకు: నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46)కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. 1976 మే 28న జన్మించిన భగీరథ్‌రెడ్డి.. ఉమ్మడి కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు భార్య శ్రీలక్ష్మి(అవుకు జెడ్పీటీసీ సభ్యురాలు), ఇద్దరు కుమారులు రాజ్యాభిషేక్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. గవర్నర్ విచారం ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగీరథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని గవర్నర్ ఆకాంక్షించారని రాజ్‌భవన్ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. సీఎం జగన్ దిగ్భ్రాంతి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి అకాల మరణం పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవుకులోని ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భగీరథ్‌రెడ్డి చురుకైన నాయకుడని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. -
పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..
సాక్షి, కర్నూలు: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పట్టణానికి చెందిన మోహన్ ఉరఫ్ యోహానుపై ఓ యువతి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలిలా ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని తెలిపింది. తరువాత గర్భం తీయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా టాబ్లెట్లు మింగించి గర్భస్రావం చేయించాడని, చివరికి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంది. నమ్మించి మోసం చేసిన తన ప్రియుడిని, వేరే అమ్మాయితో పెళ్లికి ప్రేరేపిస్తున్న అతడి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడు మోహన్, అతనికి సహకరిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. చదవండి: (Nursing Student: ‘నాన్న తాగొద్దు, అమ్మను కొట్టొద్దు, అంతా అన్న చూసుకుంటాడు') -
శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ మిలియన్ మార్చ్
సాక్షి, కర్నూలు: న్యాయ రాజధానికి మద్దతుగా రాయలసీమ జేఏసీ(నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన ఈ మిలియన్ మార్చిలో మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రాయలసీమ ఉద్యమకారులు పాల్గొన్నారు. కాగా సీమ ముఖద్వారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. రాయలసీమ ఉద్యమకారులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు ఒక్కటై నినదిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించుకోలేమని ఉద్యమబాట పడుతున్నారు. రాయలసీమకు 70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి న్యాయ రాజధానే సరైన పరిష్కారమని నమ్ముతున్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయాల్సిందే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకొచ్చారు. రాజధానుల వికేంద్రీకరణలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టుతోపాటు న్యాయ సంబంధిత సంస్థలన్నింటీని స్థాపించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వికేంద్రీకరణ నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కర్నూలులో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అలాగే వారం రోజుల క్రితం వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ‘న్యాయ’ గళాన్ని వినిపించారు. అక్టోబర్ 30వ తేదీన రాయలసీమ జేఏసీ(నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో 129 ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కర్నూలులో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు జరిగాయి. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోటా న్యాయ రాజధాని కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌పై సంపూర్ణ నమ్మకం మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అమరావతికి జై కొట్టింది. దీంతో రాయలసీమ ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అడ్డుపడుతున్న టీడీపీ నాయకులపై ఉద్యమకారులు ఆగ్రహంతో ఉన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 2014లో రాయలసీమలో రా జధాని ఏర్పాటు చేయాలని, లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరితే చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. ప్రస్తుతం కర్నూలును న్యాయ రాజధాని చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, త్వరలోనే తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావాన్ని రాయలసీమ వాసులు వ్యక్తం చేస్తున్నారు. -
రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త
కర్నూలు: జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పాచిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలింది. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు.. ఆ విభాగం కర్నూలు ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో శనివారం కర్నూలు జిల్లాలోని పలు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కుళ్లిన కూరగాయలు వినియోగించడం, పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మాంసాహార పదార్థాలు రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి అవసరమైనప్పుడు తీసి ఉడికించడం, లేదంటే వేడి చేసి మసాలాలు, రంగులు కలిపి రుచికరంగా తయారు చేసి అందిస్తున్నట్లు గుర్తించి పలు హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు. విజిలెన్స్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, శానిటరీ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నాగరాజు యాదవ్, కేశవరెడ్డి, ఏఏఓ షణ్ముఖ గణేష్, ఏజీ సిద్ధయ్య, ఎఫ్ఎస్ఓ శేఖర్‌రెడ్డి, రాముడు, తూనికలు కొలతల శాఖ అధికారి కుమార్, అనిల్ తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలుతో పాటు కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కర్నూలులోని ల్యాటిట్యూడ్ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టి అవసరమైనప్పుడు వేడి చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెడ్ ఫుడ్ కలర్ వాడినట్లు గుర్తించి రూ.5 వేలు జరిమానా విధించారు. అలాగే కర్నూలులోని మసాలా బౌల్ హోటల్, నాగార్జున పార్క్ లేన్ బేకర్స్‌లో వంటశాల అపరిశుభ్రంగా ఉండడంతో రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. బావార్చీ మల్టీ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచి వేడిచేసి వినియోగిస్తున్నందుకు రూ.10 వేలు, అనిల్ బార్ అండ్ రెస్టారెంట్లో సరైన శుభ్రత లేని కారణంగా రూ.5 వేలు అపరాధ రుసుం విధించారు. అలాగే కోడుమూరు రెడ్డీస్ హోటల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే కోడుమూరులోని శివ హోటల్లో వాటర్ బాటిళ్లు ఎంఆర్పీ కంటే రూ.5 అధికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు రూ.2 వేలు ఫైన్ వేశారు. ఎమ్మిగనూరులోని అమృత బార్ అండ్ రెస్టారెంట్, గ్రాండ్ మహల్ హోటళ్లలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి రూ.10 వేలు, రూ.2 వేలు అపరాధ రుసుం విధించారు. చదవండి: చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి.. -
సిగరెట్.. గుండెనూ కాల్చేస్తుంది
సాక్షి, అమరావతి: గుప్పెడంత గుండె శరీరం మొత్తానికి నిరంతరాయంగా రక్తం సరఫరా చేస్తుంటుంది. అంతటి కీలకమైన గుండెకు ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలు, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి జబ్బులు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ధూమపానం గుండె ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతోందని కర్నూలు జీజీహెచ్ వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజీ వైద్యనిపుణుడు వినోద్ బైపాస్ సర్జరీ కేసులపై పరిశీలన జరిపారు. 2016 ఆగస్టు నుంచి 2021 డిసెంబర్ మధ్య కర్నూలు జీజీహెచ్‌లో నిర్వహించిన 108 బైపాస్ సర్జరీ కేసులను అనలైజ్ చేశారు. ఈ కేసుల్లో గుండె జబ్బు బాధితుల కనిష్ట వయసు 35, గరిష్ట వయసు 85 సంవత్సరాలు కాగా.. మొత్తం కేసుల్లో పురుషులు 90 మంది.. మహిళలు 18 మందిఉన్నారు. అధిక కేసులకు ధూమపానమే కారణం మెడికల్ అనలైజేషన్ ప్రొటోకాల్ ప్రకారం వివిధ కోణాల్లో పరిశీలన జరపగా.. 108 బైపాస్ సర్జరీ కేసుల్లో 60 మందిలో ధూమపానమే ప్రధాన కారణంగా నిర్ధారించారు. ధూమపానం అనంతరం రెండో స్థానంలో మద్యపానం ఉంది. 36 మందిలో మద్యపానం గుండె జబ్బుకు కారణంగా తేలింది. 28 మందిలో రక్తపోటు, 19 మందిలో మధుమేహం చరిత్రను గుర్తించారు. ధూమపానం ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా ఉన్న వ్యక్తులు యుక్త వయసు నుంచే ఆ వ్యసనానికి అలవాటుపడి ఉన్నట్టుగా నిర్ధారించారు. సుదీర్ఘకాలం పొగతాగడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడి బైపాస్ సర్జరీలకు దారి తీసింది. రక్తనాళాలకు హాని ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం చేసినప్పుడు పీల్చే రసాయనాలు గుండె, రక్త నాళాలకు హాని కలిగిస్తాయి. దీంతో అథెరోస్క్లెరోసిస్ లేదా ధమనులలో ఫలకం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం కొంతమందికి, ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించే స్త్రీలకు, మధుమేహం ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఈ క్రమంలో ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. రక్తపోటు, మధుమేహం వంటి జీవన శైలి జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరి తిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు -
వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..!
సాక్షి, కర్నూలు: మొనదేలిన పిన్నీసును 8 నెలల చిన్నారి మింగడంతో కర్నూలు వైద్యులు చాకచక్యంగా ఎండోస్కోపీ పరికరంతో దాన్ని తొలగించారు. శనివారం స్థానిక గాయత్రి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన చిన్నారి 8 నెలల నక్షత్ర శనివారం ఉదయం ఆడుకుంటూ పొరపాటును పిన్నీసును మింగేసిందన్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం దీంతో తల్లిదండ్రులు పాపను తమ వద్దకు తీసుకు రాగా ఎక్స్‌రే తీసి చూడగా ఛాతి మధ్యలో ఊపిరితిత్తులకు దగ్గరగా ఉన్నట్లు గమనించామన్నారు. మొనదేలి ఉన్నందున లోపల గుచ్చుకోకుండా ఎండోస్కోపి పరికరంతో చాకచక్యంగా బయటకు తీశామన్నారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలని, వారికి సమీపంలో ఇలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. -
కర్నూల్ జిల్లా ఆలూర్ నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ