కర్నూలు: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆమె హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఛాతీలో నొప్పి రావడంతో లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కార్డియో సమస్యతో బాధపడుతున్నారని డా. రితేష్ బులెటిన్‌లో పేర్కొన్నారు. యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉందని, లక్ష్మమ్మకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్ రితేష్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment