అదంతా.. ఐ–టీడీపీ పైశాచికమే
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా కార్యకర్తలపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ చిత్రహింసలతో దమనకాండకు తెగబడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. వారం రోజుల్లోనే ఏకంగా 147 కేసులు... 49 మంది అరెస్టులు...680 మందికి నోటీసులతో రాష్ట్రంలో అరాచకాలకు తెర తీసింది. తన దమననీతిని సమరి్థంచుకునేందుకు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ప్రభుత్వ పెద్దలు శ్రీరంగ నీతులు చెబుతుండటం పచ్చ కుట్రలకు పరాకాష్ట. కానీ వాస్తవం ఏమిటంటే... ఐ–టీడీపీ.. ఆది గురువు! పైశాచికత్వానికి నాంది పలికింది... విశృంఖలత్వాన్ని పెంచి పోషించింది... మారి్ఫంగ్ ఫొటోలతో మహిళలు, పిల్లలపై జుగుప్సాకర పోస్టులు పెట్టే విష సంస్కృతిని వ్యవస్థీకృతం చేసింది టీడీపీనే అన్నది అక్షర సత్యం. అందుకోసం చంద్రబాబు బృందం వేలాది మందితో తయారు చేసిన సోషల్ మీడియా పిశాచ గణ విభాగమే ‘ఐ–టీడీపీ’. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నెలకొల్పిన ఆ విష వృక్షం దశాబ్దకాలంలో వేళ్లూనుకుని పచ్చ రాక్షస మూకతో విశృంఖలత్వాన్ని సృష్టిస్తూ విరుచుకుపడుతోంది. అసభ్య పదజాలం... పచ్చి బూతులు... జుగుప్సాకర పోస్టులు... మహిళలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేస్తూ ఐ–టీడీపీ వెగటు రాజకీయాలకు బరి తెగిస్తోంది.ఫేక్ ఐడీలతో దేశ, విదేశాల నుంచి సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టుల వరద పారిస్తూ పైశాచికానందాన్ని పొందుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పేర్లతో ఫేక్ ఖాతాలను సృష్టించి ఏకంగా మహానేత వైఎస్సార్ కుటుంబ సభ్యులనే కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం టీడీపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట. ఈ కుట్రలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసులు ఛేదించినా సరే... ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు ఖాకీలు పచ్చ ముఠా కుట్రకు కొమ్ముకాస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. దశాబ్దకాలంగా సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకర విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఐ–టీడీపీ తాజాగా కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి మరింతగా పేట్రేగిపోతోంది. సోషల్ మీడియా పిశాచ గణం... టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’ వికృత రాజకీయానికి, జుగుప్సాకర సంస్కృతికి తెరతీసింది. 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీపై దు్రష్పచారం కోసం ఓ వేదికగా టీడీపీ ప్రారంభించిన ఈ ఐ–టీడీపీ పదేళ్లుగా విశృంఖలత్వాన్ని పెంచి పోషించి వ్యవస్థీకృతం చేసింది. హైదరాబాద్‌లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కేంద్రగా ఈ పిశాచాల ముఠా సోషల్ మీడియా ద్వారాదుష్ప్రచారనికి, వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేసుకుని పుంఖాను పుంఖాలుగా అసభ్య పదజాలం, బూతులు, దూషణలతో కూడిన పోస్టులను వైరల్ చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని పని చేస్తోంది. 2019 ఎన్నికల తరువాత ఐ–టీడీపీ సోషల్ మీడియా అరాచకాలు మరింత పేట్రేగిపోయాయి. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంతగా బరితెగించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులతోపాటు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారీ్టలో క్రియాశీలంగా వ్యవహరించే మహిళలు, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నాడు మంత్రులుగా ఉన్న అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని తదితరులను కించపరుస్తూ... వారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ పోస్టులు పెట్టారు. ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ యూట్యూబ్ చానళ్లలో వీడియోలు వైరల్ చేశారు. నాడు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వైఎస్ జగన్ ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ పోస్టులు పెట్టడం పచ్చ పిశాచాల బరి తెగింపునకు నిదర్శనం. ఇక 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఐ–టీడీపీ విశృంఖలత్వం వెర్రి తలలు వేసింది.ఈసారి ఏకంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరుల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి సోషల్ మీడియా ఖాతాలు తెరిచింది. ఆ ఐడీల నుంచే జుగుప్సాకరమైన పోస్టులతో బరితెగించింది. దాంతో చూసేవారికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే ఆ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని నమ్మించడమే లక్ష్యంగా ఈ కుట్రను కొనసాగించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ... వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ ఐ–టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తోంది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీసులు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన బాధితుడినే.. తాజాగా నిందితుడిగా చూపిస్తూ..! తాజాగా చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతోంది. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో అసభ్యకర పోస్టులు పెట్టడంపై వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే అవే పోస్టుల పేరుతో వైఎస్సార్ కడప జిల్లా పోలీసులే ప్రస్తుతం వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం విస్మయం కలిగిస్తోంది. మరి అలాంటప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన కేసు సంగతి ఏమైనట్లు..? టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఈ ఉదంతం ద్వారా మరోసారి రుజువవుతోంది. ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇరికించే కుట్ర...! టీడీపీ పెద్దల ఆదేశాలతో పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిని చిత్రహింసలకు గురి చేసి వేధించారు. ఆయన చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు 40 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు, యూట్యూబ్ చానళ్ల ద్వారా తాము అసభక్యకర పోస్టులను వైరల్ చేసినట్టు వర్రా రవీంద్రారెడ్డి తన దర్యాప్తులో అంగీకరించారని పోలీసులు ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు చేయడం గమనార్హం. ఈ అక్రమ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఇరికించేందుకు కూడా పోలీసులు పన్నాగం పన్నడం గమనార్హం. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన పీఏ రాఘవరెడ్డి రాసిన పోస్టులను తాము సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వర్రా రవీంద్రారెడ్డి వెల్లడించారని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ భారతి పీఏ కాదు... ఇక వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతి పీఏ అంటూ టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఆమె వద్ద పీఏగా పని చేయలేదు. అయితే టీడీపీ దురుద్దేశపూరితంగానే ఈ అవాస్తవ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐ–టీడీపీ అప్పటికే ఫేక్ సోషల్ మీడియా ఖాతాను సృష్టించింది. ఆ ఖాతా నుంచి అసభ్యకర పోస్టులను వైరల్ చేస్తోంది. షరి్మల, నర్రెడ్డి సునీతను కూడా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం టీడీపీ కుట్రకు పరాకాష్ట. దీన్ని వైఎస్సార్ కుటుంబ సభ్యులపైనే నెట్టివేసేందుకే టీడీపీ ఈ అవాస్తవ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. వాస్తవం ఏమిటంటే వర్రా రవీంద్రారెడ్డి ఏనాడూ వైఎస్ భారతి వద్ద పీఏగా పని చేయలేదు. ఆయన కూడా తాను పీఏనని ఏనాడూ చెప్పుకోలేదు కూడా!ఐ–టీడీపీ అరాచక పోస్టుల్లో కొన్ని...⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ వారి ఫొటోలను ఐ–టీడీపీ ముఠాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆత్మలతో మాట్లాడతారని చంద్రబాబు, లోకేశ్ దారుణంగా దు్రష్పచారం చేయడం... దాన్ని ఐ–టీడీపీ మారి్ఫంగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ చేసి కించపరిచింది. ⇒ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విడదల రజని, ఉషాశ్రీ చరణ్, పాముల పుష్పశ్రీవాణితోపాటు పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.⇒ అంబటి రాంబాబు, ఆయన సతీమణి, కుమార్తెలతో ఉన్న ఫొటోను అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని, ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ మారి్ఫంగ్ ఫొటోలతో వేధించారు. ⇒ హీరో అల్లు అర్జున్, ఆయన సతీమణిని కించపరుస్తూ.. వారి ఫొటోలను మారి్ఫంగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేశారు. ఫేక్ ఐడీలతో వైఎస్సార్ కుటుంబంపై పోస్టులుపోలీస్ విచారణలో ఐ–టీడీపీ దారుణాలు బహిర్గతం ఈ వికృత క్రీడకు టీడీపీ ఎంతగా బరితెగించిందంటే... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పేరుతో సృష్టించిన ఫేక్ ఐడీలతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కుట్రలకు దిగజారింది. షర్మిల, సునీత తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనుక ఐ–టీడీపీ కుట్ర దాగి ఉందని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడి కావడమే దీనికి నిదర్శనం. వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐ–టీడీపీ ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించింది.ఆ ఖాతాల నుంచి వైఎస్సార్ కుటుంబ సభ్యులను, ప్రధానంగా మహిళలను కించపరుస్తూ పోస్టుల వరద పారించింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ తక్షణమే స్పందించి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి సోషల్ మీడియాలో జుగుప్సాకర పోస్టులు పెడుతున్నారంటూ వర్రా రవీంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు దర్యాప్తు చేయడంతో ఐ–టీడీపీ దారుణాలు బట్టబయలయ్యాయి. ఈక్రమంలో విశాఖపటా్ననికి చెందిన ఐ–టీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్‌ను అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రరెడ్డి పేరుతో సృష్టించిన ఫేక్ ఐడీ నుంచే షరి్మల, నర్రెడ్డి సునీతలను కించపరుస్తూ అతడు పోస్టులు పెట్టినట్లు ఆధారాలతోసహా వెల్లడైంది. న్యాయమూర్తి దృష్టికి పోలీస్ అరాచకాలు వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తి ఎదుట వాస్తవాలను వెల్లడించడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. పోలీసులు తనను తీవ్రంగా హింసించారని... తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని తీవ్రంగా కొట్టారని... తాను చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలంగా నమోదు చేశారని వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తి వద్ద మొర పెట్టుకోవడంతో పోలీసుల కుట్ర బట్టబయలైంది.