దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం | Sajjala Ramakrishna Reddy fires on Ramoji Rao | Sakshi
Sakshi News home page

దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం

Published Wed, May 24 2023 4:21 AM | Last Updated on Wed, May 24 2023 4:59 AM

Sajjala Ramakrishna Reddy fires on Ramoji Rao - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధికి తలమానికంగా నిలిచే మచి­లీపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో జనరంజక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎంపీ అవినాశ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తోందంటూ ఎల్లో మీడియా దుష్ఫ్రచారా­లకు తెగ­బడుతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామ­కృష్ణారెడ్డి విమ­ర్శించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇప్ప­టికే ఆరేడు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారని, విచా­ర­ణకు పూర్తిగా సహ­­కరిస్తున్నారని గుర్తు చేశారు. ఆయన మాతృ­మూర్తి ఆరో­గ్యం విషమంగా ఉండటం, తండ్రి జైల్లో ఉన్నందున తల్లిని చూసుకు­నేందుకు సమయం కావాలని కోరుతూ సీబీఐకి లేఖ రాశార­న్నారు.

అవినాశ్‌ను అరెస్టు చేసేందుకు సీఐబీ అధి­కా­రులు కర్నూలుకు చేరుకున్నారని, ఎస్పీతో చర్చించారని, సీబీఐకి సహకరించడం లేదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. కర్నూలు ఎస్పీ సహకరించలేదని సీబీఐ అధికారులు ఎవరైనా చెప్పారా? అని నిలదీశారు. ఒకవైపు కర్నూలుకు కేంద్ర బల­గాలు దిగుతున్నాయంటూ ప్రచా­రం చేస్తూ మరోవైపు ప్రభు­త్వం నిరోధించిందంటూ బురద చల్లుతు­న్నా­రని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమ­వారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 ఛానళ్లు ఇదే అంశంపై ఇష్టారీతిన చర్చలు నిర్వహించి అవినాశ్‌రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్ప­డ్డాయని మండిపడ్డారు.

‘ఆ చర్చల్లో ఒకాయన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటాడు. వాళ్లని చూస్తుంటే ప్రప­ంచ యుద్ధాన్ని కూడా సృష్టించగల శక్తి ఉన్నట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘తల్లి ఆరోగ్యం బాగోలేదని, నాట­కాలు ఆడుతున్నా­రంటూ తప్పుడు రాతలు రాస్తే ఎవరికైనా కడుపు మండదా? వైఎస్సార్‌సీపీని, అవినాశ్‌రెడ్డిని అభి­మా­నించే వారికి బాధ కలగదా?’ అని నిలదీశారు. ఆ ఆక్రో­శంతోనే ఒకరో ఇద్దరో ఎల్లో మీడియాపై దాడి చేశా­రని, నిజ­మైన మీడియాపై ఎవరిమీదైనా దాడి జరిగిందా? అని ప్రశ్ని­ం­చారు. ఎల్లో మీడి­యాపై దాడి జరిగినా తాము ఖండి­స్తా­మని, అదే­విధంగా ఎల్లో మీడియా రోత రాతలను కూడా ఖం­డించాలని సూచించారు. మంగళవారం తాడేపల్లి­­లోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల మీడియాతో మాట్లా­డా­రు.

రామోజీ, అవినాశ్‌కు చెరో న్యాయమా?
ఎంపీ అవినాశ్‌రెడ్డి తనకున్న హక్కు ప్రకారం సీబీఐ విచా­ర­ణకు మరికొద్ది సమయం కోరారు. ఆయనకు ఉన్న హక్కుల ప్రకారం కోర్టులకు వెళ్లవచ్చు. రామోజీరావు మార్గ­­దర్శి కేసు విచారణను ఆపేందుకు తట్టని కోర్టు తలుపులు లేవు. ఆయన చేస్తే న్యాయం? అవినాశ్‌రెడ్డి కోర్టుకు వెళితే అన్యా­యమా? చంద్రబాబు అధికారంలో ఉండగా సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా జీవో ఇచ్చారు.  ఈనాడులో అప్పుడు కుక్క తోక కత్తిరించినట్లు పెద్ద కార్టూన్‌ కూడా వేశారు. మళ్లీ ఇప్పుడు వారికి అదే సీబీఐపై ప్రేమ పుట్టుకొ­చ్చింది.

రాష్ట్రాన్ని దిక్సూచిలా నిలిపారు
వైఎస్సార్‌సీపీని స్థాపించిన 8 ఏళ్లలోనే సరిగ్గా నాలుగేళ్ల క్రితం 151 స్థానాల్లో ఘన విజయం సాధించాం. ముందుగా తయారు చేసుకున్న బ్లూ ప్రింట్‌ ప్రకారం సీఎం జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నారు. నాలుగేళ్లలో 98.5 శాతానికిపైగా హామీ­లను నెరవేర్చారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకం అయిన పార్టీ పనితీరు ఎలా ఉంటుంది? అలాంటి పార్టీపై ఆశలు పెట్టుకుంటే ఎంత సక్రమంగా అమలు చేసి చూపు­తా­రనేది ఈ నాలుగేళ్లలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఏపీని దేశానికి దిక్సూచిలా నిలిపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. ఇప్పటికే రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించాం. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయని ప్రజలు గ్రహించారు. 2019 ఎన్నికల కంటే అద్భుత విజయాన్ని 2024లో సాధిస్తాం.

సీఎం జగన్‌ కేంద్రంతో చర్చించి రాబట్టారు
కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేస్తోంది. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను హక్కుగా రాబట్టుకుంది.  రాష్ట్రానికి నిధులు రావడాన్ని ఎల్లో మీడియా ఓర్చుకోలేక పోతో­ంది. రామోజీరావు కడుపు మంటతో ఈనాడులో విషప్రచారం చేస్తున్నా­రు. ఎల్లో మీడియా కడుపు మంటకు మందు లేదని మరోసారి స్పష్టమైంది. టీడీపీ హయా­ంలో నిధులు తేలేకపోవ­డం చంద్రబాబు అసమర్థ­తకు నిదర్శనం.

కేంద్రంలో భాగస్వామిగా కొన­సాగి కూడా నిధులు సాధించకుండా చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు­పెట్టారు. సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి హక్కుగా రావా­ల్సిన నిధులను కేంద్రంతో చర్చించి రాబట్టుకుంటున్నారు. ఆ క్రమంలోనే 2014–15 రెవెన్యూ లోటు కింద రూ.10,461 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రానికి మంచి జరిగితే ఓర్చుకోలేని ఎల్లో మీడియా నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రా మాదిరిగా వ్యవహరిస్తూ విషం చిమ్ముతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement