సాక్షి, విజయవాడ: సీఎం జగన్‌పై రాళ్ల దాడి దారుణమని.. ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేది. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు.
ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్
‘‘ఎయిర్‌గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది. చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు. ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారు ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారు. ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెబుతారు. ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది. టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరు’’ అంటూ సజ్జల మండిపడ్డారు.
ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు
‘‘ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదు. పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్. దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఇలా మాట్లాడతారా?. ప్రతీ చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారు. నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్‌కు లేదు. సింపతీతో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి’’ అని సజ్జల పేర్కొన్నారు.
చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు..
‘‘సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగింది. చంద్రబాబు కూడా అందుకే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. కొట్టండి అంటూ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు. అధికారం రాదన్న అసహనంతో ఇలా రెచ్చగొడుతున్నాడు. సీఎం జగన్ బస్ యాత్ర సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ దాడి చేశారు. చంద్రబాబు రాజకీయ సిద్దాంతంలోనే ద్వేషం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం ఉన్నాయి. చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేతికి కట్టుతో వెళ్లి పాల్గొన్నాడు. కానీ చంద్రబాబు డ్రామాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తాడో దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఒక పుస్తకంలో రాశాడు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని ఉన్న నాయకుడు. ప్రజలతో ఇలానే మమేకం అవుతూ ముందుకు సాగుతారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: సీఎం జగన్‌పై దాడి ఎలా జరిగిందంటే..?
Comments
Please login to add a commentAdd a comment