సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్సార్‌సీపీ నేతలు తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నేతలు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మల్లాది విష్ణు. కావటి మనోహర్ ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురి చేసి కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. డిప్యూటి మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా?.
కిడ్నాప్ చేయడానికి దాడులు చేయడానికి వెనకడం లేదు. ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇలాంటి చర్యలు ఏంటని అడుగుతున్నా. హూకోర్టు ఆదేశాలు కూడా పోలిసులు అమలు చేయడం లేదు. ఏనీలో అక్రమాలకు వంత పాడుతున్న అధికారులు అందరూ చేసిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment