election 2013
-
ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రపాయి కదలికలపైనా దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలు 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తున్నందున, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కానుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. నిఫ్టీ ఇప్పటికే సరికొత్త శిఖరానికి చేరుకుంది. కావున తదుపరి నిరోధం 20,500–20,800 స్థాయిని చేధించేందుకు ప్రయత్నం చేసుకుంది. ఇదే సమయంలో సచీలు వారం రోజులు ర్యాలీ నేపథ్యంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. దిగువ స్థాయిలో 19850–20050 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. బుధవారం ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ బుధవారం( డిసెంబర్ 6న) ప్రారంభం కానుంది. చైర్మన్ శక్తికాంత దాస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనున్నారు. ద్రవ్యోల్బణ దిగిరావడంతో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే సప్లై సమస్యలు, వృద్ధి అవుట్లుక్లతో పాటు వచ్చే ఏడాది వడ్డీరేట్ల తగ్గింపు అభిప్రాయాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు భారత్‌తో సహా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఈయూలు మంగళవారం సేవారంగ పీఐఎం గణాంకాలు ప్రకటించనున్నాయి. అమెరికా బుధవారం నవంబర్ ప్రైవేట్ రంగ ఉద్యోగ కల్పన డేటా, వీక్లీ జాబ్‌లెస్ గణాంకాలను గురువారం వెల్లడించనుంది. ఇదే రోజున యూరోజోన్ ప్రస్తుత సంవత్సరపు క్యూ3 జీడీపీ డేటా, చైనా వాణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. జపాన్ క్యూ3 జీడీపీ డేటా శుక్రవారం వెల్లడి అవుతుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక డేటా ప్రకటనకు ముందు మార్కెట్ వర్గాలు అప్రమత్తత వహించవచ్చు. నవంబర్‌లో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు గత రెండు నెలలు నికర అమ్మకదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో ర.9వేల కోట్ల పెట్టబడులు పెట్టారు. అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గడంతో పాటు దేశీయ మార్కెట్ బౌన్స్ బ్యాక్ ర్యాలీ ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇదే నెలలో డెట్ మార్కెట్లో ర.14,860 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత్ వృద్ధి రానున్న రోజుల్లో మరింత పెరగడం, బలమైన ఆర్థిక డేటా, ప్రోత్సాకర కార్పొరేట్ ఆదాయాలు తదితర కారణాలతో దేశీ మార్కెట్లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి’’ అని నిపుణులు పేర్కొన్నారు. -
ఓటేసిన సినీ సెలబ్రిటీలు వీరే.. ఫస్ట్ ఓటు ఎవరంటే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- 2023 పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. తెలంగాణ బరిలో నిలిచిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనున్నారు. టాలీవుడ్ నుంచి పులువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా హీరో సుమంత్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటును వినియోగించుకున్నాడు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153 వద్ద అల్లు అర్జున్ ఓటు వేశాడు. వాస్తవంగా ఓటేసేందుకు ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నది బన్నీనే.. ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు ఆయన చేరుకున్నాడు. ఆయన క్యూ లైన్లో ఉండగా కొంత సమయం పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అల్లు అర్జున్ గంటకు పైగానే క్యూ లోన్లోనే నిల్చున్నాడు. (ఇదీ చదవండి: గంటకు పైగానే క్యూ లైన్లోనే ఉన్న అల్లు అర్జున్) జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్లో జూ. ఎన్టీఆర్ కుటుంబంతో సహా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తారక్‌తో పాటు తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు అమ్మగారు షాలిని ఉన్నారు. వారందరూ కూడా క్యూ లైన్లో నిల్చోని ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. యువత అందరూ నేడు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చాడు. ► జూబ్లీహిల్స్ బూత్ నం.149లో ఓట్ వేసిన హీరో రామ్‌చరణ్ ► తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన తెలుగు హీరో ఆది సాయికుమార్ View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) ► జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటేసిన హీరో మహేశ్‌బాబు ► ఓటేసిన యాంకర్ అనసూయ.. సెల్ఫీ ఫొటో ఇన్ స్టాలో పోస్ట్ ► తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన టాలీవుడ్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, మెహర్ రమేశ్ ► జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165)లో ఓటేసిన విజయ్ దేవరకొండ ► నానక్ రామ్ గూడలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు నరేష్ ► ఓటుతో మీ గళాన్ని వినిపించండి అంటున్న యంగ్ హీరోస్ మంచు మనోజ్, రామ్ ► తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన రవితేజ, గోపీ చంద్ ► గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో ఓటేసిన హీరో నాని ► వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోలింగ్ బూత్ 151 వద్ద ఓటేసిన నాగార్జున, అమల, నాగచైతన్య ► నా హక్కును ఉపయోగించుకున్నాను: సాయి ధరమ్ తేజ్ ►ఓటు వేయడం మన హక్కు, భాద్యత కూడా మరిచిపోకండి: సింగర్ సునీత ► ఓటేసిన బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, హీరో సుమంత్ ► సతీమణి తబితతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న డైరెక్టర్ సుకుమార్ ► పాన్ ఇండియా స్టార్స్.. జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ ► ఓటు హక్కు వినియోగించుకున్న విక్టరీ వెంకటేశ్,డైరెక్టర్ తేజ ► ఓట్ వేయని వాడు 'దేశ ద్రోహి': తేజ ► FNCC వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న హీరో రాణా దగ్గుబాటి ► ఓటేసి సామాజిక అభివృద్ధిలో పాల్గొనండి: నటి పూనమ్ కౌర్ ► జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నితిన్ ► షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్లో ఓటేసిన రాజమౌళి.. మీరు వేయండి అంటూ ట్వీట్ ► తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు హరీశ్ శంకర్.. ఆసక్తికర ట్వీట్ ► మా కుటుంబంలోని 9 మంది ఓట్లేశారు.. మీరు కూడా ఓటేయాలని కోరిన ఆర్. పి. పట్నాయక్ ► జూబ్లీహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149) వద్ద భార్యతో కలిసి ఓటు వేసిన చిరంజీవి -
తెలంగాణ ఎన్నికలు: గంటకు పైగానే క్యూ లైన్లోనే ఉన్న అల్లు అర్జున్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- 2023 పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టాలీవుడ్ నుంచి పులువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటును వినియోగించుకునేందుకు సుమారు గంటకు పైగానే క్యూ లైన్లో ఉన్నారు. హైదరాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153 వద్ద అల్లు అర్జున్ ఓటు వేసేందుకు వచ్చాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా పోలింగ్ కేంద్రం వద్దకు బన్నీ వచ్చాడు. ఉదయం 6:50 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు ఆయన చేరుకున్నాడు. ఆయన క్యూ లైన్లో ఉండగా కొంత సమయం పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అల్లు అర్జున్ గంటకు పైగానే క్యూ లోన్లోన్లోనే ఉన్నాడు. -
TS Election 2023: పోలీస్‌లకు ఝలక్..! ఎన్నికల సంఘం ఆదేశం..!
వరంగల్: పోలీస్‌శాఖలో బదిలీలు, పోస్టింగ్‌లపై రచ్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ విధానాన్ని అమలు చేయకపోవడంపై అందిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) స్పందించింది. వరంగల్, కరీంనగర్, రామగుండం పోలీసు కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీసు అధికారుల పోస్టింగ్‌ల్లో కమిషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. అత్యధికంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 21 మందికి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ముగ్గురు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ కోణం, వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్ తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి లేఖ నం. 434/1/టీఈఎల్/ ఎస్ఓయూ 3/ 2023 ద్వారా రాశారు. అడుగడుగునా ఉల్లంఘనలే...? ఫిర్యాదుల పరంపరపై ఆరా... ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలని లెటర్ నంబర్ 437/6/1/ఐఎన్ఎస్టీ/ఈసీఐ/ఎఫ్యుఎన్సీటీ/ఎంసీసీ/2023 ద్వారా తేదీ 02.06.2023న కమిషన్ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పేర్కొంది. అందుకు విరుద్ధంగా గత నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అనేక మందికి తిరిగి జిల్లాలోనే పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరహా పోస్టింగ్‌లకు సంబంధించి 51 మంది పేర్లతోపాటు వారు ఎక్కడెక్కడ, ఎంతకాలం పని చేశారన్న వివరాలను ఫిర్యాదులో చేర్చారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 21 మంది పో స్టింగ్లపై ఫిర్యాదులు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్‌లు వివాదాస్పదం అయ్యాయి. ఈ పోస్టింగ్‌ల పైనే వివాదం.. నాలుగేళ్లలో మూడేళ్లు పూర్తి చేసిన కొందరికి అదే ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారని ఫిర్యాదులున్నాయి. చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్న ఎన్నికల కోడ్ వర్తించే అధికారుల జాబితా ఇలా ఉంది. ► జూలై 15న మామునూరు ఏసీపీగా నియమితులైన సి.సతీష్.. దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్ జిల్లాలో పనిచేశారు. ఇది కమిషన్ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన వారు కూడా ఉన్నారు. ► ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జరిగిన బదిలీల్లో పరకాల ఏసీపీగా పోస్టింగ్ తీసుకున్న కిషోర్ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. ► 2014 ఎన్నికల్లో పని చేసిన డేవిడ్‌రాజ్ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్‌లలో పని చేశారు. ► గత ఎనిమిదేళ్లుగా వరంగల్ జిల్లాలో పనిచేసి ఎస్బీ ఏసీపీ నుంచి నర్సంపేటకు ఏసీపీగా బదిలీ అయిన పి.తిరుమల్ ఎనిమిదేళ్లు వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే పని చేశారు. ► ఇంతేజార్గంజ్ సీఐ నుంచి శాయంపేట ఇన్స్పెక్టర్గా బదిలీ అయిన మల్లేశ్ ఆయన సర్వీసు కాలమంతా వరంగల్ జిల్లా, కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు. జనగామ, నర్మెటలలోనూ సీఐగా పనిచేశారు. ► సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌లలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాస్ ఐటీకోర్.. టాస్క్‌ఫోర్స్‌లకు మారగా.. ఎనిమిది సంవత్సరాలుగా వరంగల్ (కమిషనరేట్) జిల్లాలోనే పనిచేశారు. ► హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్, డీసీఆర్బీ, వెకెన్సీ రిజర్వు (వీఆర్)లలో పోస్టింగ్‌లు కొ ట్టారు. ఏసీపీ విజయ్‌కుమార్, సీఐలు రవికుమార్, దేవేందర్, కె.కుమారస్వామి, ఓ.రమేష్‌లు పై పోస్టింగ్‌లలో ఉన్నారు. సుబేదారి ఎస్హెచ్ఓ షుకూరుది వరంగల్ జిల్లా. ► ధర్మసాగర్ ఎస్హెచ్ఓగా నియమితులైన శ్రీధర్ తొమ్మిదేళ్లుగా వరంగల్ జిల్లా (పోలీస్ కమిషనరేట్)లో పని చేస్తున్నారు. హసన్‌పర్తి ఎస్హెచ్ఓగా, ఎస్బీ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఆయన ధర్మసాగర్ ఎస్హెచ్ఓగా నియమితులయ్యారు. ► వరంగల్ జిల్లాలోనే తన సర్వీసు కాలమంతా పని చేసిన సీఐ సుజాతను కాజీపేట ట్రాఫిక్‌గా నియమించడం వివాదాస్పదమైంది. ఆరేళ్లుగా జిల్లాలోనే పనిచేస్తున్న మరో మహిళా అధికారిణి సువర్ణను కూడా రూరల్ మహిళ పోలీసుస్టేషన్ సీఐగా నియమించారు. ► ఆరేళ్లుగా జిల్లాలోనే పని చేస్తున్న రామకృష్ణ సీఐని గీసుకొండ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఐదేళ్లుగా అర్బన్ మహిళ పోలీసుస్టేషన్ సీఐగా ఉస్మాన్ షరీప్ పనిచేస్తున్నారు. ► మహబూబాబాద్ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్ఐ ఎస్కే యాసిన్, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్‌ను ఆదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్ కేసులో భాగస్వామి అని ఆరోపణలున్న రాణాప్రతాప్‌ను గూడూరు ఎస్ఐగా కూడా నియమించారు. ► ములుగు జిల్లా డీఎస్‌బీగా ఉన్న సట్ల కిరణ్, ఆర్ఐ కిరణ్, సీసీఎస్‌లో ఉన్న శివకుమార్‌లు దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది. -
సీఎం పెద్దపల్లి నుంచి పోటీ చేయాలి : బొంకూరి సురేందర్ సన్నీ
కరీంనగర్: సీఎం కేసీఆర్ పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఈ నెల 26న భీమ్ గర్జన ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బొంకూరి సురేందర్ సన్నీ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిలర్లు బొంకూరి భాగ్యలక్ష్మి, ఈరబోయిన శ్రీనివాస్‌లతో కలిసి, మాట్లాడారు. సహజ వనరులు, పారిశ్రామిక ప్రాంతం కలిగి ఉన్న పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించారని అన్నారు. ర్యాలీని విజయవంతం చేసి, సీఎం కేసీఆర్ పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి జెండా కూడలిలోని కాన్షీరాం విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. సీఎం పెద్దపల్లికి ప్రాతినిధ్యం వహిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. -
పోలింగ్ వీక్షణం కేంద్రాల గుర్తింపునకు జియోట్యాగింగ్..
కరీంనగర్: వచ్చే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసి ఓటరు జాబితా రూపొందిస్తుండగా పోలింగ్ స్టేషన్ల జియోట్యాగింగ్‌కు చర్యలు చేపట్టింది. 2018 శాసనసభ ఎన్నికల్లోనే సదరు ప్రక్రియ చేపట్టగా మళ్లీ పరిశీలన చేపట్టారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎలాంటి ఘటనలకు తావులేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్(ఏరోనెట్) విధానంలో బోగస్ ఓట్లను ఏరివేయగా నివాస ప్రాతిపదికన ఓటు హక్కు కల్పిస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో.. జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాలుండగా వీటి పరిధిలో 20మండలాలున్నాయి. జిల్లాలో 1,338 పోలింగ్ కేంద్రాలుండగా పోలింగ్ జియోట్యాగింగ్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కేంద్రాల మార్పు, పేర్ల మార్పు ప్రక్రియ పూర్తయింది. కరీంనగర్ నియోజకవర్గంలో 11 కేంద్రాలను మార్పు చేయగా, 19 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు చేశారు. చొప్పదండి 25 పోలింగ్ కేంద్రాల మార్పు, 18 పేర్లు మార్పుచేశారు. మానకొండూర్ 6 కేంద్రాల మార్పు, ఒకటి పేరు మార్పు, హుజూరాబాద్‌లో ఒకకేంద్రాన్ని మార్పు చేయగా 6 పేర్లు మార్చారు. ఆధునిక సాంకేతికతను వాడి టీఎస్ సీవోపీ ప్రత్యేక యాప్ ద్వారా గుగూల్ మ్యాపును అనుసరించి పోలింగ్ కేంద్రం చిత్రాలు సహా ఇతర విషయాల్ని పొందుపరుస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిల.. నియోజకవర్గాల వారీగా కేంద్రాలు జియోట్యాగ్‌తో ప్రయోజనం.. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు నేరుగా గూగుల్ మ్యాప్ ఆధారంగా ఆయా కేంద్రాలకు చేరుకోవచ్చు. ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చు. ఆయా కేంద్రాలకు మధ్య ఉన్న దూరం తదితర విషయాల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. జిల్లాకేంద్రంతో పాటు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానంగా ఇవి ఉండటంతో పర్యవేక్షణ మరింతగా పెరగనుంది. ఏవైనా గొడవలు జరిగినా వెనువెంటనే అక్కడికి చేరుకునేందుకు సులువవనుంది. ఏరోనెట్‌తో బోగస్‌కు చెక్.. కుటుంబం మొత్తానికి ఒకేచోట ఓటుహక్కు కల్పించేందుకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్ (ఎరోనెట్) విధానాన్ని అనుసరించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ఈ విధానం ద్వారా ఒక వ్యక్తికి ఎక్కడెక్కడ ఓటుహక్కు ఉందో తేలనుంది. సదరు వివరాలు ఆధారంగా అధికారులు విచారణ చేసి ఎక్కడ నివాసం ఉంటారో అక్కడనే ఓటుహక్కు కల్పిస్తారు. ముసాయిదా ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా బూత్‌లెవల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పులులేని ఓటరు జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. -
ముదురుతున్న చేరికల పంచాయితీ! అంతర్గత 'హస్త'వ్యస్తం!
మహబూబ్‌నగర్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల పోరుకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్‌లో చేరికలు చిచ్చురేపుతున్నాయి. కీలక నేతల చేరికలతో పార్టీని బలోపేతం చేసే దిశగా పెద్దలు అడుగులు వేయగా.. ఉమ్మడి పాలమూరులో పాత, కొత్త నాయకుల మధ్య పంచాయితీకి ఆజ్యం పోసింది. అభ్యర్థిత్వాలపై ఎవరికి వారు పట్టు కొనసాగిస్తుండగా.. అసమ్మతి రాజుకుంటోంది. పలు నియోజకవర్గాల్లో ఇరువర్గాల నేతల అనుచరులు పరస్పర విమర్శలకు దిగుతుండడం రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరికి వారు ఆధిపత్యంకోసం ప్రయత్నిస్తుండడం పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. సర్వేఫలితాలే ఫైనల్ అంటూ అధిష్టానం మిన్నకుండిపోవడంపై హస్తం శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. -
డ్రీమ్ గర్ల్ పై కోడ్ ఉల్లంఘన కేసు
నటి హేమామాలిని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆమె పై అధికారులు కేసును నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మథుర లోకసభ నియోజకవర్గం నుంచి ఆమె బిజెపి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తన నియోజకవర్గంలోని బేరా గ్రామంలో అల్కేశ్వర్ దేవాలయంలో ఏప్రిల్ 7 న ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె గుడిలో ఒక ఎన్నికల సభను కూడా నిర్వహించారు. దేవాలయం అరుగునే వేదికగా ఉపయోగించుకుని ఆమె ప్రసంగించారు కూడా. ఇప్పటికే హేమామాలినిపై మూడు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అయితే హేమామాలిని రాజకీయ ప్రత్యర్థులు కూడా కోడ్ ను ఉల్లంఘించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అనుజ్ గార్గ్, బిఎస్ పి అభ్యర్థి యోగేశ్ ద్వివేది, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి మహారామ్ సింగ్ లపై కూడా కేసులు నమోదు చేశారు.