పతంగిదేపై ‘చేయి’ | GHMC Standing Committee Elections 2025 | Sakshi
Sakshi News home page

పతంగిదేపై ‘చేయి’

Feb 22 2025 8:16 AM | Updated on Feb 23 2025 8:43 AM

GHMC Standing Committee Elections 2025

బల్దియా స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమే  

కలిసి, నిలిచి, గెలిచిన కాంగ్రెస్, ఎంఐఎం 

 పోటీ నుంచి వైదొలగిన బీఆర్‌ఎస్‌  

 

సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల సందర్భంగా సస్పెన్స్‌లు.. డ్రామాలు.. రక్తికట్టిన అనంతరం జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు ఊహించినట్లుగానే ఏకగ్రీవమయ్యాయి. అధికారంలో ఉన్న పారీ్టతో సఖ్యత ఫార్ములాతో ఎంఐఎం.. కాంగ్రెస్‌తో జత కట్టడంతో ఆ రెండు పారీ్టల కార్పొరేటర్లే స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో జట్టుకట్టిన ఎంఐఎం.. ఈసారి కాంగ్రెస్‌తో జత కలిసింది. 

దాంతో.. ఈసారి బీఆర్‌ఎస్‌ స్థానే కాంగ్రెస్‌ సభ్యులు స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్న జీహెచ్‌ఎంసీలో 15 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యుల కోసం ఎన్నిక జరిగింది. రెండు పారీ్టలు కలిస్తే.. మిగతా పార్టీలు గెలవవని తెలిసినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయానికి ముందస్తుగానే నామినేషన్లు వేసి బరిలో దిగిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో పోలింగ్‌ జరగకుండానే పోటీలో మిగిలిన 15 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి ప్రకటించారు.  

పోటీ చేయని బీజేపీ 
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు దూరమంటూ జీహెచ్‌ఎంసీలో ఆ పారీ్టతో  కలిస్తే అపప్రథ అనే తలంపుతో బీజేపీ అసలు పోటీ చేయలేదు. ఈ ఎన్నికకు పారీ్టలతో సంబంధం లేనందున వ్యక్తిగత బలంతో గెలవవచ్చనుకున్నారో, లేక లోపాయికారీగా నామినేషన్లు ముగిసేలోగా ఏమైనా జరగవచ్చనుకున్నారో నామినేషన్లు వేసిన ఇద్దరు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పోటీ నుంచి వైదొలిగారు. గెలవలేమని తెలిసి బరిలో ఉండొద్దంటూ అధిష్ఠానం ఆదేశించడంతో  నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.  

ఎంఐఎందే హవా.. 
స్టాండింగ్‌ కమిటీలో స్థానంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పరువు దక్కించుకున్నప్పటికీ, ఎంఐఎం హవా కొనసాగనుంది. 15 మంది సభ్యులకుగాను 8 మంది ఎంఐఎం వారే. అంటే, ఒక్కటే అయినప్పటికీ, కాంగ్రెస్‌ కంటే ఎంఐఎందే మెజారీ్ట. ఇక జీహెచ్‌ఎంసీ పాలకమండలికి చివరి సంవత్సరంలో  కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్న తరుణంలో స్టాండింగ్‌క మిటీలో ఆమోదం పొందాలంటే ఎంఐఎం సభ్యులే కీలకం కానున్నారు. ఎంఐఎంకు అధికారంలోని పార్టీలతో అనుబంధం ఈనాటిది కాదు. బీఆర్‌ఎస్‌ రాకముందు నుంచీ అది అధికారంలో ఉన్న పారీ్టతో పొత్తు కొనసాగిస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పొత్తులో భాగంగా స్టాండింగ్‌ కమిటీలోనే కాదు..మేయర్, డిప్యూటీ మేయర్‌ స్థానాలు పొత్తులో భాగంగా పంచుకున్నారు.  

పెరిగిన కాంగ్రెస్‌ బలం.. 
కాంగ్రెస్‌ పార్టీ బలం ప్రస్తుతం 25కు చేరినప్పటికీ, ఆ పార్టీ తొలుత గెలిచింది రెండు సీట్లే. ఇతర పారీ్టల నుంచి చేరికలతో దాని బలం 25కు పెరిగింది. గతంలో కాంగ్రెస్‌–ఎంఐఎం పొత్తు కొనసాగినప్పుడు  కాంగ్రెస్‌ 8, ఎంఐఎం 7 స్టాండింగ్‌కమిటీ స్థానాలు పొందేవి. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక బల్దియాలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 99 మంది, ఎంఐఎం కార్పొరేటర్లు 44 మంది ఉన్నప్పుడు బలానికనుగుణంగా అంటూ బీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది, ఎంఐఎంనుంచి ఆరుగురు మాత్రమే స్టాండింగ్‌ కమిటీలో ఉన్నారు. గత పాలకమండలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలం 56కు తగ్గడంతో  తిరిగి స్టాండింగ్‌ కమిటీకి 8 మందినే ఖరారు చేశారు. ఇప్పుడు  ఎంఐఎం–కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా ఎంఐఎంకు ఎక్కువమంది కార్పొరేటర్లు ఉన్నందున వారు ఎనిమిది స్టాండింగ్‌ కమిటీ స్థానాలు పొందారు. మొత్తానికి ఎన్నికలకున్న ఏడాది సమయంలో ముఖ్యపాత్ర పోషించనున్నారు. కాంగ్రెస్‌లోకి ఇతర పారీ్టల నుంచి వచి్చనవారే స్టాండింగ్‌ కమిటీలో స్థానం పొందారు. తొలుత గెలిచిన వారిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.  

వీరే స్టాండింగ్‌ కమిటీ సభ్యులు (పారీ్టల వారీగా)

ఎంఐఎం నుంచి.. 
అబ్దుల్‌ వాహబ్‌ (చాంద్రాయణగుట్ట), 
డాక్టర్‌ ఆయేషా హుమేరా (టోలిచౌకి), గౌసుద్దీన్‌ మహ్మద్‌(¿ోలక్‌పూర్‌), పరీ్వన్‌ సుల్తానా 
(ఘాన్సీబజార్‌), బాతాజబీన్‌ (విజయనగర్‌ కాలనీ), మహ్మద్‌ సలీం (దూద్‌బౌలి), 
సమీనా బేగం (తలాబ్‌ చంచలం), సయ్యద్‌ మిన్హాజుద్దీన్‌ (అక్బర్‌ బాగ్‌).  

కాంగ్రెస్‌ నుంచి..  
వి.జగదీశ్వర్‌గౌడ్‌ (మాదాపూర్‌), బానోత్‌ సుజాత (హస్తినాపురం), మహ్మద్‌ బాబాఫసియుద్దీన్‌(బోరబండ), బూరుగడ్డ పుష్ప (ఆర్‌సీపురం), బొంతు శ్రీదేవి (చర్లపల్లి), మహాలక్ష్మి రామన్‌ గౌడ్‌ (హిమాయత్‌నగర్‌), సీఎన్‌ రెడ్డి 
(రహ్మత్‌నగర్‌).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement