సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం ఎదురైంది. రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పటికీ సౌమ్య పట్ల తీవ్ర వివక్ష చూపించింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల వేళ సౌమ్యను డమ్మీగా మార్చింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్‌గా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని ఎమ్మెల్యే సౌమ్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యే చెప్పిన కౌన్సిలర్‌కు కాకుండా మరొకరికి అధిష్టానం బీ ఫామ్ ఇచ్చింది.
తాను చెప్పిన కౌన్సిలర్‌కే ఛైర్మన్ ఇవ్వాలని సౌమ్య పట్టుబట్టారు. సౌమ్య ప్రతిపాదనలను చెత్తబుట్టలో వేసిన అధిష్టానం.. కృష్ణకుమారికి బీ ఫామ్ ఇచ్చింది. దీంతో అధిష్టానంపై ఎమ్మెల్యే సౌమ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో గత్యంతరం లేక సభ్యులు.. కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం సూచించిన అభ్యర్ధికే ఓటేశారు.
Comments
Please login to add a commentAdd a comment