Nandigama MLA
-
దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం ఎదురైంది. రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పటికీ సౌమ్య పట్ల తీవ్ర వివక్ష చూపించింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల వేళ సౌమ్యను డమ్మీగా మార్చింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్‌గా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని ఎమ్మెల్యే సౌమ్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యే చెప్పిన కౌన్సిలర్‌కు కాకుండా మరొకరికి అధిష్టానం బీ ఫామ్ ఇచ్చింది.తాను చెప్పిన కౌన్సిలర్‌కే ఛైర్మన్ ఇవ్వాలని సౌమ్య పట్టుబట్టారు. సౌమ్య ప్రతిపాదనలను చెత్తబుట్టలో వేసిన అధిష్టానం.. కృష్ణకుమారికి బీ ఫామ్ ఇచ్చింది. దీంతో అధిష్టానంపై ఎమ్మెల్యే సౌమ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో గత్యంతరం లేక సభ్యులు.. కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం సూచించిన అభ్యర్ధికే ఓటేశారు. -
ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా..
సాక్షి, నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. నందిగామ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే కోరారు. చికిత్స తీసుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని, కలవటానికి ప్రయత్నించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే జగన్మోహన్రావు పేర్కొన్నారు. -
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి
పెద్ద దోర్నాల: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ ఎంతో అవసరమని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు అన్నారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ప్రకటించారని తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కృష్ణా జిల్లా నందిగామ నుంచి శ్రీశైలం వరకు ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలకు చేరింది. ఈ సందర్భంగా మండల సరిహద్దులోని చిన్న గుడిపాడు, చిన్నదోర్నాల అడ్డరోడ్డు, జమ్మిదోర్నాల, హసానబాద్లో నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టారు. స్థానిక నటరాజ్ సెంటర్లోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. పశ్చిమ ప్రకాశం వరప్రదాయని అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయటమే సీఎం ముఖ్య లక్ష్యమన్నారు. అనంతరం దోర్నాల నుంచి ఎమ్మెల్యే పాదయాత్రను కొనసాగించి నల్లమల అటవీ ప్రాంతమైన చింతల చెంచుగూడేనికి చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్‌కుమార్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న మంచితనమే గెలిపించింది
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక కౌంటింగ్ దివంగత తంగిరాల ప్రభాకరరావు కుమార్తెకు పట్టం 74,827 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్‌కు దక్కిన డిపాజిట్ ‘నోటా’కు మూడో స్థానం నందిగామ : తన తండ్రి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మంచితనం వల్లే ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందానని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ నెల 13న నందిగామ(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌ను మంగళవారం స్థానిక కేవీఆర్ కళాశాలలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో 1,84,064 ఓట్లు ఉండగా, 1,27,434 ఓట్లు పోలయ్యాయి. సౌమ్యకు 99,748 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్లుగా పోటీచేసిన కటారపు పుల్లయ్యకు 941, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్న అనంతరం సౌమ్య మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించడం కూడా తన గెలుపునకు దోహదపడినట్లు ఆమె తెలిపారు. తన గెలుపునకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు సౌమ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలతో కలసి ర్యాలీగా స్థానిక రైతుపేటలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సౌమ్య మంత్రి ఉమాకు పాదాభివందనం చేశారు. కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచారు. అక్కడి నుంచి తంగిరాల ప్రభాకరరావు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. మంత్రి ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు టీడీపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెప్పారు. ప్రతి రౌండ్లోనూ మెజారిటీ నందిగామ కేవీఆర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి ఉదయం 8 గంటలకు ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి కౌంటింగ్ సిబ్బందికి అందజేశారు. ఎన్నికల రిటర్సింగ్ అధికారి రజనీకాంతరావు కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడితే సస్పెండ్ చేయటంతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, అబ్జర్వర్ సాగర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరిగింది. కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్పీ విజయ్‌కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చివరి 15వ రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, ఎన్నికల అబ్జర్వర్ సాగర్, తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మాకు గెలుపు, ఓటములతో పనిలేదు : బోడపాటి తమకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబూరావు అన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఎన్నికల్లో పోటీ చేశామని వివరించారు. గత ఎన్నికల్లో రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చిన తమ పార్టీకి ఉప ఎన్నికల్లో 24,921 ఓట్లు లభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, గింజుపల్లి అనిల్, జాఫర్ పాల్గొన్నారు. డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకుంది. టీడీపీ పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు 74,827 భారీ మెజారిటీ రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల్లో ఊరట లభించింది. మూడో స్థానంలో ‘నోటా’ నందిగామ ఉప ఎన్నికల్లో మూడో స్థానం ‘నోటా’కు లభించింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కటారపు పుల్లయ్యకు 941 ఓట్లు, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. కానీ, నోటా గుర్తును 1,177 మంది నొక్కారు. దీంతో మూడో స్థానం ‘నోటా’కు లభించినట్లయింది. -
తంగిరాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: బాబు
నందిగామ : టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు భౌతిక కాయానికి ఆపార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. చంద్రబాబు సోమవారం ఉదయం తంగిరాల భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తంగిరాల మృతి పార్టీకి కృష్ణాజిల్లా ప్రజలకు తీరని లోటు అన్నారు. తంగిరాల మృతిని తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు ఆయన తెలిపారు. క్రియాశీల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తంగిరాల పార్టీకి ఎనలేని సేవ చేశారన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు తంగిరాల కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. నిజాయితీకి తంగిరాల మారుపేరుగా నిలిచారన్నారు. కాగా ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు వెంటనే మదర్‌థెరిస్సా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 12 సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి
-
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ హఠాన్మరణం
* గుండెపోటుతో ఆస్పత్రిలో కన్నుమూత నందిగామ: కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు (64) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు వెంటనే స్థానిక మదర్‌థెరిస్సా ఆస్పత్రికి తరలించారు. అరుుతే 12 సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. ఆదివారం ఉదయమే ఆయన మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలసి పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు.