డ్రీమ్ గర్ల్ పై కోడ్ ఉల్లంఘన కేసు
నటి హేమామాలిని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆమె పై అధికారులు కేసును నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మథుర లోకసభ నియోజకవర్గం నుంచి ఆమె బిజెపి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తన నియోజకవర్గంలోని బేరా గ్రామంలో అల్కేశ్వర్ దేవాలయంలో ఏప్రిల్ 7 న ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె గుడిలో ఒక ఎన్నికల సభను కూడా నిర్వహించారు. దేవాలయం అరుగునే వేదికగా ఉపయోగించుకుని ఆమె ప్రసంగించారు కూడా.
ఇప్పటికే హేమామాలినిపై మూడు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అయితే హేమామాలిని రాజకీయ ప్రత్యర్థులు కూడా కోడ్ ను ఉల్లంఘించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అనుజ్ గార్గ్, బిఎస్ పి అభ్యర్థి యోగేశ్ ద్వివేది, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి మహారామ్ సింగ్ లపై కూడా కేసులు నమోదు చేశారు.