లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్‌ నటి హ్యాట్రిక్‌.. అభినందించిన కూతురు! | Esha Deol Congratulates Mother Hema Malini For Her Mathura Win In Lok Sabha Elections 2024 | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్‌ నటి హ్యాట్రిక్‌.. అభినందించిన కూతురు!

Published Wed, Jun 5 2024 3:36 PM | Last Updated on Wed, Jun 5 2024 4:04 PM

Esha Deol Congratulates Mother Hema Malini For Her Mathura Win In Lok Sabha Elections 2024

ఈ ఏడాది జూన్‌ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో సీనియనర్ నటి హేమ మాలిని విజయం సాధించింది. యూపీలోని మథుర లోక్‌సభ నియోజకవర్గం బరిలో నిలిచిన ఆమె వరుసగా మూడోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు చెందిన ముఖేష్ ధన్‌గర్‌పై 5,10,064 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. తాజాగా ఈ విజయంపై ఆమె కూతురు, నటి ఇషా డియోల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు అభినందనలు మమ్మా.. హ్యాట్రిక్‌ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. 

కాగా.. హేమ మాలిని 1999లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2004లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. తాజాగా హ్యాట్రిక్‌ కొట్టడంపై హేమమాలిని స్పందించారు. ప్రజలకు మూడోసారి సేవ చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement