Lok sabha elections 2024: శ్రీకృష్ణుని గోపికను నేను: హేమమాలిని | Lok Sabha Elections 2024: Hema Malini Calls Herself Lord Krishna Gopi In Mathura, More Details Inside - Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: శ్రీకృష్ణుని గోపికను నేను: హేమమాలిని

Published Fri, Apr 19 2024 5:42 AM | Last Updated on Fri, Apr 19 2024 10:35 AM

Lok sabha elections 2024: Hema Malini Calls Herself Lord Krishna Gopi in Mathura - Sakshi

మథుర(యూపీ): గోపాలకృష్ణుని 16 వేల గోపికల్లో ఒకరినంటూ సినీ నటి హేమమాలిని తనను తాను అభివర్ణించుకున్నారు. మథురలో బీజేపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన హేమమాలిని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గోపికల్లో ఒక గోపికగా నన్ను నేను ఊహించుకుంటాను.

మథుర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన బ్రిజ్‌వాసులంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రేమ, అభిమానం. అందుకే బ్రిజ్‌వాసులను ఇష్టంతో సేవిస్తే కృష్ణ భగవానుని ఆశీస్సులు లభిస్తాయని నా నమ్మకం. అందుకే వారికి విశ్వాసంతో సేవ చేస్తున్నా’అని ఆమె అన్నారు. పేరు, ప్రఖ్యాతుల కోసమో, మరే ఇతర భౌతిక లాభాపేక్షతోనో రాజకీయాల్లోకి రాలేదన్నారు. మథుర చుట్టుపక్కల 84 కోసుల పరిధి(252 కిలోమీటర్లు)లోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement