Lord Krishna
-
ప్రశాంత్ వర్మ కథలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు?
-
Lok sabha elections 2024: శ్రీకృష్ణుని గోపికను నేను: హేమమాలిని
మథుర(యూపీ): గోపాలకృష్ణుని 16 వేల గోపికల్లో ఒకరినంటూ సినీ నటి హేమమాలిని తనను తాను అభివర్ణించుకున్నారు. మథురలో బీజేపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన హేమమాలిని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గోపికల్లో ఒక గోపికగా నన్ను నేను ఊహించుకుంటాను. మథుర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన బ్రిజ్వాసులంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రేమ, అభిమానం. అందుకే బ్రిజ్వాసులను ఇష్టంతో సేవిస్తే కృష్ణ భగవానుని ఆశీస్సులు లభిస్తాయని నా నమ్మకం. అందుకే వారికి విశ్వాసంతో సేవ చేస్తున్నా’అని ఆమె అన్నారు. పేరు, ప్రఖ్యాతుల కోసమో, మరే ఇతర భౌతిక లాభాపేక్షతోనో రాజకీయాల్లోకి రాలేదన్నారు. మథుర చుట్టుపక్కల 84 కోసుల పరిధి(252 కిలోమీటర్లు)లోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. -
మల్లెల వేళ... వెన్నెల మాసం
‘వసంతం’ అన్న మాటే ఎంత మృదువుగా చెవిని తాకుతుంది! ఆ మాటలో ఒక్క పరుషాక్షరంకానీ, ద్విత్వాక్షరం కానీ, సంయుక్తాక్షరం కానీ లేవు. ఎందుకుంటాయి? వసంతమంటే, ప్రకృతి మోహపరవశయై రంగురంగుల పూలతో సిగను అలంకరించుకుని నూతన సృష్టికి సంసిద్ధమయ్యే కాలం కదా! స్త్రీపురుషుల ఎదలో తీపి ఊహలు రేపి లలితలలితం చేసే మధుమాసం కదా! వేదాలలో సామంగా, ఛందస్సులలో గాయత్రిగా, మాసాలలో మార్గశీర్షంగా తనను చెప్పుకున్న కృష్ణ పరమాత్మ; ఆరు ఋతువులలోనూ సర్వశ్రేష్ఠం కనుకనే కుసుమాకరమైన వసంతమూ తానేనన్నాడు. సమృద్ధికి సంకేతమైన ఆమని, ఋతుపతి, కామవల్లభము, పికబాంధవము, పూలకారు అనిపించుకునే వసంతఋతువుకు రారాజు మన్మథుడైతే; అతని చెలికాడూ, సేనానీ వసంతుడట! అరవిందం, అశోకం, మామిళ్ళు, కొత్త మల్లెలు, నీలోత్పలాలనే అయిదూ మన్మథుని బాణాలట! అవి ప్రేయసీప్రియుల ఎడదను తాకి వలపు పులకలతో ఠారెత్తిస్తాయట! ఆదికవి నుంచి ఆధునికుని వరకూ వసంత రుతుగానం చేయని కవికోకిల ఎవరుంటారు? సీతావియోగ దుఃఖంతో అడవుల వెంబడి పడిపోతున్న రాముణ్ణి వసంతశోభ ఆకర్షించడమే కాదు, మరింతగా దుఃఖవివశుణ్ణి చేసినట్టు వాల్మీకి వర్ణిస్తాడు. పంపాతీరానికి చేరేసరికి ఆ సరస్సు పద్మాలు, ఉత్పలాలు, చేపలతో కనువిందు చేసింది. అందులోని నీళ్ళు వైడూర్యంలా స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయి. చుట్టుపక్కల అడవి అంతటా ఎత్తైన చెట్లు, పర్వతాలు పచ్చదనంతో ముచ్చట గొలుపుతున్నాయి. పూర్తిగా పుష్పించి ఉన్న చెట్లను లతలు గాఢాలింగనం చేసుకుని ఉన్నాయి. రక రకాల చెట్ల మధ్యలో నీలి, పసుపురంగు గడ్డిభూములు రంగురంగుల పూలదుప్పటి కప్పుకున్నట్టున్నాయి. ఆహ్లాదకరమైన పిల్లగాలితో ఎల్లెడలా పూలు, పండ్ల పరిమళాన్ని గుప్పిస్తూ వసంతం ఎంతో కొత్తగానూ, స్వాతిశయంతోనూ భాసించింది. మేఘాల్లోంచి పడే వర్షంలా అదేపనిగా పూల వాన కురుస్తోంది. ఆదికవిది ఎంత సుసూక్ష్మ పరిశీలనంటే, కొన్ని పూలు అప్పటికే రాలిపోగా, కొన్ని రాలి పోతూపోతూ ఉన్నాయట. ప్రతిచోటా గాలి పూలతో పరాచికాలు ఆడుతూనే ఉందట. కాళి దాసు ఋతుసంహార కావ్యాన్ని గ్రీష్మంతో ప్రారంభించి వసంతంతో ముగిస్తాడు. అప్పుడు చెట్లు పూల తోనూ, నీళ్ళు పద్మాలతోనూ, స్త్రీలు ప్రియసమాగమ కాంక్షతోనూ, గాలి పూలగంధంతోనూ, సాయంత్రాలు సుఖం గొలిపేలానూ, పగళ్ళు పరమరమ్యంగానూ ఉండి సమస్తమూ సుమనో హరంగా ఉందంటాడు. మగకోకిల బాగా చిగిర్చిన మామిడి చిగుళ్ళు మెక్కి మదించి తనకు ప్రియమైన ఆడకోకిలను ముద్దాడుతున్నట్టూ; తుమ్మెద కమలాల్లోని పూదేనె గ్రోలుతూ ఝంకారం చేస్తూ ఆడుతుమ్మెదను ఆకర్షించే నర్మవ్యాపారాలు చేస్తున్నట్టూ వర్ణిస్తాడు. ప్రతిపద్య చమత్కృతికి పెట్టిన పేరైన చేమకూర వెంకటకవి తన ‘విజయవిలాస’ కావ్యంలో వసంతుడికీ, చంద్రుడికీ మధ్య స్పర్థను కల్పించి తన ఊహావైభవాన్ని అంచులు దాటిస్తాడు. వసంతుడు వస్తూనే మోడువారిన చెట్లను చిగురింపజేసి రసవంతమైన ఫలపుష్పాలతో నలువైపులా సుగంధాలను వ్యాపింపజేసినా, అవి వట్టి చెట్లే కదానని చెప్పి చంద్రుడు మెచ్చలేదట. ప్రసన్న, సుకుమారమైన తన వెన్నెలజల్లుతో ఏకంగా రాళ్ళనే కరిగింపజేశాడట. చేమకూరకు మరింత చవిని జోడించే మరో పద్యం మన్మథుడి జైత్రయాత్రను చెబుతుంది. రాజు ఎక్కడికైనా వెడుతున్నప్పుడు సూర్యచంద్రుల బొమ్మలున్న పొడవాటి కర్రలను పట్టుకుని పరిచారకులు ముందునడవడం పరి పాటి కాగా; మన్మథుడు జగజ్జేత కనుక తూర్పు, పడమటి కొండలపై ప్రకాశించే సూర్యచంద్రులనే నేరుగా రాజలాంఛనం చేసుకుని దిగ్విజయానికి బయలుదేరాడట. వసంతాగమనాన్ని ఎలా పోల్చుకోవాలో విశ్వనాథవారు తన ‘ఋతుసంహార’ కృతిలో అందంగా ఏకరవుపెడతారు. కౌగి లింత వేళ ఉద్రిక్త అయిన ప్రియురాలి ఎద చెమర్చినా, చన్నీటిస్నాన సౌఖ్యం వల్ల ముక్కుపుటాలలో చెమరింపు పుట్టినా, పేరంటానికి వెళ్ళే పిన్నబాలిక వాలుజడలో మల్లెమొగ్గ కనబడినా, వంగిన వేపకొమ్మకు కావి చిగురుపట్టి పక్క ఈనెకు పూతపట్టినా, హఠాత్తుగా ఓ రోజున పొద్దెక్కినవేళ దూరపు కోన నుంచి కోకిలస్వరం వినిపించినా వసంతం అడుగుపెట్టిందన్న మధురోహ కలుగు తుందంటారు. ఆపైన, కొత్తగా జతకట్టిన కోకిలమ్మ పెంటికై నూత్నయవ్వనోద్వేగంతో వేగిపోతూ వసంతవనాంత వీథిలో ముక్కున చిదమని మామిడి చిగురు లేదంటారు. శేషేంద్ర ఏం తక్కువ! ‘ఎక్కడ చూసినా స్వచ్ఛకాంతులీనుతూ సంతోషంలో ముంచే జాజులు, మల్లెలు, తీగసంపెంగలు, కొదమ గులాబులతో విశ్వదిశాంతరాళాన్ని సుమసముద్రం చేస్తున్నది– ఇదేనా మధుమాసమంటే’ అని తన ‘ఋతుఘోష’లో ఆశ్చర్య, పారవశ్యాలను అక్షరీకస్తారు. ‘ఈ ఆకాశమూ, ఈ మహా సము ద్రాలూ, ఈ భూమండలమూ, ఈ తరుప్రపంచమూ ఈ విశ్వమంత అంతర్గత శోభతో ఉర్రూత లూగిస్తున్నాయి; ఊహావిహంగం ఉత్కంఠతో ఎగిరిపోవాలనుకుంటోం’దంటారు. విశ్వమందిరంలో కన్నులపండువగా కొలువైన పురుషునికీ; పూవులతో, ఎర్రని చిగుళ్లతో సింగారించుకుని సొంపుగులికే ప్రకృతికీ మధ్య రాసక్రీడగా వసంతారంభ కాలాన్ని రూపుకడతారు. ఇంకోవైపు, జీవజాల మనే ఒడ్లను ఒరుసుకుంటూ ప్రవహించే ఈ వాసంతరస స్రవంతి వేళ, ప్రియురాలితో కలసి సరస్తీరాలకు, పూపొదల చాటుకు, తోటలకు వెళ్ళే అవకాశం లేకుండా మధ్యాహ్నకాలాల్లో చేలల్లో మగ్గి పోయే శ్రామికజనాలపై జాలితో కరిగినీరవుతారు. వసంతం మామూలుగా కాదు, ఉత్సవంలా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జీవుల మనుగడను ఆహ్లాదపు ఊయెల ఎక్కించి ఊపి విడిచిపెడుతుంది. వసంతానుభవపు మత్తుకు, గమ్మత్తుకు చిత్తు కాని జీవి ప్రపంచంలోనే ఉండడు. మన్మథుడా మజాకానా! ఆయన జగత్తుకే రారాజు కదా!! -
జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం
భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది. జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్‌మెరైన్ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు. భక్తులకు ఆక్సిజన్ మాస్్క, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్ అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం డాక్ షిప్‌యార్డ్ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంగీతం..సంస్కారానికి ఆవిష్కారం
సంగీతం మనసును, మెదడును ఒకేసారి కదిలిస్తుంది. సంగీతంవల్ల మనసులో మెదడు, మెదడులో మనసు ఒకేసారి మెదులుతూ ఉంటాయి. మనిషిలోంచి మనిషిని బయటకులాగి తనలోకి తీసుకుంటుంది సంగీతం. జీవనావసరాలకు అతీతంగా మనిషిని మనిషిని చేస్తుంది సంగీతం. ‘భూమి సారం నీరు, నీటి సారం మొక్క , మొక్క సారం మనిషి , మనిషి సారం మాట, మాట సారం సంకీర్తన లేదా సంగీతం‘ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. సంగీతం అన్నిటికన్నా గొప్పది అని ఉపనిషత్ కాలం నుంచీ నేలపై నెలకొన్న సత్యం. మనిషికన్నా సంగీతం గొప్పది కాబట్టే మనిషికి సంగీతం మేలు చెయ్యగలిగేది అయింది. ‘ఆశతో బతికే వ్యక్తి సంగీతంతో నాట్యం చేస్తాడు’ అని ఒక ఇంగ్లిష్ సామెత తెలియజెబుతోంది‘. ‘తనలో సంగీతం లేని వ్యక్తి, మధురమైన శబ్దాలతో కలిసిపోని వ్యక్తి అననురాగానికి, కపటోపాయానికి, దోపిడికి తగిన వాడు అవుతాడు‘ అని ఇంగ్లిష్ కవి షేక్స్పియర్ ఒకచోట చెబుతాడు. అన్నింటికన్నా సంగీతం మనిషికి ఉన్నతమైన తోడు. సంగీతాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు మనం కనిపించం! ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా? సంగీతం వింటున్నంత సేపూ మనం మెరుగైన స్థితిలో ఉంటాం. మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం కావాలి. సంగీతం మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు! బంధువులవల్లా, స్నేహితుల వల్లా, సమాజంవల్లా మనం మోసపోతూ ఉంటాం. కానీ సంగీతంవల్ల మనం మోసపోవడం లేదు. కొన్ని రచనలు మనల్ని పాడుచెయ్యచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని తప్పుడు దారి పట్టించచ్చు. కానీ సంగీతం మనల్ని పాడుచెయ్యదు. సంగీతం మనల్ని తప్పుడువాళ్లను చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం కొందరికి చెడుపు చేసింది. కానీ సంగీతం ఎప్పుడూ ఎవరికీ ఏ చెడుపూ చెయ్యదు. సంగీతం సలహాలు ఇవ్వదు. సంగీతం సూచనలు చెయ్యదు. సలహాలు, సూచనలు లేకుండా సంగీతం మనతో చెలిమి చేస్తుంది. సంగీతం మనదైపోతుంది. సంగీతాన్ని వింటున్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా మనిషి నిజంగా బతుకుతాడు. సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడు అవుతాడు. మనుగడలో భాగంగా మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సంగీతం వింటూ ఉండడంవల్ల మనల్ని మనం మళ్లీ మళ్లీ పొందచ్చు. వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకూ మనం మాటిమాటికీ బాధపడుతూ ఉంటాం. సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి, ప్రతిభ, పాండిత్యాలు లేని స్థితిలోకి వెళ్లిపోయి మనం మనంగా కాకుండా పసితనంతో ఉంటాం. ప్రతిమనిషికీ తెలుసు తాను కొంత మేరకు దుర్మార్గుణ్ణే అని. సంగీతాన్ని వింటున్నంతసేపూ తననుంచీ, తన మార్గం నుంచీ మనిషి బయటకు వచ్చేస్తాడు కాబట్టి సంగీతం కాసేపైనా మనిషిని మంచిలో ఉంచుతుంది. సంగీతం విన్నంతసేపూ అనడమో, ఏదో చెయ్యడమో ఉండవు కాబట్టి మనవల్ల అవకతవకలు, అన్యాయం, అకృత్యాలు జరగవు. శబ్దానికి సంస్కారం సంప్రాప్తిస్తే సంగీతం అవుతుంది. సంగీతం ఒక సంస్కారానికి ఆవిష్కారం. మనకూ, మన జీవనాలకూ కూడా సంస్కారం ఉండాలి. వీలైనంతగా సంగీతానికి చేరువ అవుదాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉందాం. సంగీతంలో మైమరచిపోతూ ఉండడం మనం మళ్లీ, మళ్లీ పుడుతూ ఉండడం అవుతుంది. రండి, సంగీతం వల్ల మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉందాం. అద్భుతమైన అభివ్యక్తి సంగీతం; ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం. కృష్ణుడు తన పిల్లనగ్రోవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. సంగీతం కృష్ణతత్త్వంలో ఒక అంశం. కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు. ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం. అంటే సంపూర్ణత్వానికి సంగీతం ముఖ్యం అని గ్రహించాలి. – రోచిష్మాన్ -
శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై యాదవసంఘాల అభ్యంతరాలు
-
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణపై హైకోర్టు స్టే
-
శ్రీకృష్ణుడి అలంకార సేవలో శ్రీలక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీస్వామి వారు మురళి చేతబట్టి శ్రీకృష్ణుడి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం.. పొన్న వాహన సేవలో తిరు మాడ వీధుల్లో ఊరేగారు. ఆచార్యులు తిరు మాడ వీధుల్లో స్వామిని ఊరేగించి, పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపంలో అధిష్టించి అలంకార సేవల విశిష్టతలను వివరించారు. సాయంత్రం ఆలయ మాడ వీధిలో వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
Srikrishna Janmashtami 2022 : ముద్దు లొలికిస్తున్న ‘చిన్ని కృష్ణులు’ (ఫొటోలు)
-
Srikrishna Janmashtami 2022: శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ తేదీన జరుపుకోవాలంటే!
చిన్నా పెద్దా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే పండుగ కృష్ణాష్టమి. అయితే, కొన్నిసార్లు తిథులు తగులు, మిగులు (ముందు రోజు తర్వాత రోజు) వచ్చినప్పుడు పండుగను ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధం చాలా మందిలో ఉంటుంది. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి విషయంలోనూ అదే తరహా సందిగ్దం. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే సందేహం. మరి ఈ ఏడాది ఈ పండుగను ఏ రోజున జరుపుకోవాలంటే...? శ్రీ కృష్ణుడు 64 కళలు కలవాడని నమ్మకం. శ్రీకృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే.. జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలను తొలగించి.. సుఖ సంతోషాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. విష్ణువుకు సంబంధించిన దశావతారాల్లో శ్రీ కృష్ణావతరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు తన చిన్నతనంలో అల్లరి చేష్టలతోనూ జీవిత పరమార్థాన్ని చెప్పాడని చాలా మంది నమ్ముతారు. కన్నయ్య వెన్న దొంగగా అందరి మనసులను కొలగొట్టేశాడు. గోప బాలుడిగా, సోదరుడిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో కీలకమైన పాత్రలను పోషించాడు. ఆయన ఉపదేశించిన భగవద్గీత మరెంతో ప్రత్యేకం. అయితే కృష్ణుని లీలలన్నీ లోక కళ్యాణం కోసమే. ఆరోజే పండుగ! నిజానికి ఆగష్టు 18 గురువారం సప్తమి తిథి రాత్రి 12.16 నిముషాల వరకూ ఉంది. తదుపరి అష్టమి వచ్చింది. ఆగష్టు 19 శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. శుక్రవారం అర్థరాత్రి 1.04 వరకూ ఉంది. పంచాంగం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగష్టు 19 శుక్రవారం జరుపుకోవాలని స్పష్టత ఉంది. అయితే, ఆగష్టు 18న జరుపుకోవాలన్న వాదన ఎందుకు తెరపైకి వచ్చిందో గమనిద్దాం… శ్రీకృష్ణుడు అష్టమి తిథి అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని, అందుకే ఆగష్టు 18న ఆ సమయానికి అష్టమి రావడంతో అదేరోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలంటున్నారు కొంతమంది. ఇదిలా ఉంటే.. హిందువుల పండుగల్లో 90 శాతం సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే అష్టమి తిథి గురువారం అర్థరాత్రి వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయానికి తిథి ఉండడమే కాదు ఆ రోజు కూడా అర్థరాత్రి ఉంది కాబట్టి ఆగష్టు 19 శుక్రవారం పండుగ చేసుకోవాలంటున్నారు పండితులు. గోకులాష్టమి నాడు.. కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని పర్వదినంగా జరుపుకుంటారు. కిట్టయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కన్నయ్య పుట్టినరోజైన పండుగ రోజున ఒకపూట భోజనం చేసి వేణుమాధవుడికి పూజ చేసి.. శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతాన గోపాల మంత్రం పూజిస్తే.. అదే విధంగా సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు! ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః! ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః! ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేసేవారిని దుఃఖం దరిచేరదంటారు. కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా భగవానుడి నామ స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ కృష్ణుడిని పూజించి మర్నాడు ఉదయం దగ్గర్లో ఉన్న వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు. -ఇన్పుట్స్: డి.వి.ఆర్ చదవండి: ద్వివిధుడి వధ -
నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు.. వన్నె తగ్గని సౌందర్యం!
నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు ఆధ్యాత్మికతనే కాదు వన్నె తగ్గని సౌందర్యాన్ని చూపుతాడు ఆ కళను ఫ్యాషన్ ప్రియులు తమ డిజైనర్ డ్రెస్సుల మీదకు తీసుకొచ్చి మరింత చూడముచ్చటగా తీర్చుతున్నారు. వాటిని ఎంపిక చేసుకున్నవారు అంతే ఆనందంగా తమ కళాత్మక హృదయాన్ని చాటుతున్నారు. కలంకారీ, మధుబని, పటచిత్ర.. మన దేశంలోని కళారూపాలన్నింటిలోనూ కృష్ణ సౌందర్యం మన కళ్లకు కడుతూనే ఉంటుంది. సంప్రదాయ చీరలు, కుర్తీలు, దుపట్టాల మీద మనకు ఈ సొగసైన కళ కొత్త కాంతులతో రూపుకడుతూనే ఉంది. బాల్యంలో చేసిన అల్లరి పనులు, రాధాకృష్ణుల ప్రణయ ఘట్టం, గోవుల కాపరిగా, యశోదా తనయుడిగా .. దుస్తుల మీద కొలువుదీరిన మురళీధరుడు ఫ్యాషన్ ప్రియులకు ఆరాధ్యుడయ్యాడు. కృష్ణుడి అలంకారంలో భాగమైన నెమలి పింఛం, పిల్లన గ్రోవి, శ్యామవర్ణం.. యువత మదిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే, స్త్రీ పురుషులిద్దరి వెస్ట్రన్ డ్రెస్సుల మీదా ఈ అలంకారాలు పెయింటింగ్‌గా అమరుతున్నాయి. ఎంబ్రాయిడరీగా అలరారుతున్నాయి. ఆభరణాలుగా మెరుస్తున్నాయి. బ్యాగుల అలంకరణలో ముఖ్య భూమిక అవుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీదా వినూత్న హంగులతో నడయాడుతున్నాయి. చదవండి: Saiee Manjrekar: ఈ హీరోయిన్ ధరించిన అనార్కలీ సెట్ ధర 46 వేలు! జరియా లేబుల్ వేల్యూ అదే! -
శ్రీకృష్ణుడితో నేను రోజు మాట్లాడతా: అఖిలేష్ యాదవ్
లక్నో: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదిపార్టీని ఏర్పాటు చేసి, రామ రాజ్యాన్ని నిర్మిస్తామని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి చెందిన బహ్రైచ్‌లోని నాన్పరా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధురీ వర్మ సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాగా, సమాజ్‌వాది పార్టీలో క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్లున్నారనే బీజేపీ ఆరోపణలపై.. అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ నేరస్థులను, మాఫియా డాన్లను ప్రక్షాళన చేయడానికి వాషింగ్మెషిన్లను కొనుగోలు చేసిందా అంటూ వ్యంగ్యంగా స్పందించారు. శ్రీ కృష్ణుడు ప్రతిరోజు తనకలలో వస్తారని.. తాను రోజు ఆయనతో మాట్లాడతానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ గెలుస్తుందని కృష్ణుడు కూడా అన్నారని పేర్కొన్నారు. అదే విధంగా, పొరుగు దేశం చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల పేర్లు మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. మన సీఎంని చూసి వారు కూడా గ్రామాల పేర్లు మారుస్తున్నారని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రాను యూపీ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఎస్పీ చీఫ్ స్పందించారు. యోగి నిద్రలో మత్తులో ఉండగా, ఆయన చీఫ్ సెక్రెటరీ మారిపోయారా.. అంటూ వ్యంగ్యంగా చమత్కరించారు. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గృహవినియోగ దారులకు 300ల యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. అదేవిధంగా, 2012 నుంచి 2017 వరకు ఎస్పీ తమ హయంలో అనేక విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తుచేశారు. బీజేపీ వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అఖిలేష్‌యాదవ్ స్పష్టం చేశారు. చదవండి: వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని.. -
ఉపాధ్యాయ దినోత్సవం: మొదట చెప్పుకోవాల్సిన గురువు ఆయనే
సెప్టెంబర్ 5 అనగానే ఉపాధ్యాయుల దినోత్సవం అనుకోవటం కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఒకసారి గురువులను అంటే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గురువులను స్మరించుకోవాలి. మొట్టమొదటగా మనం చెప్పుకోవలసిన, గుర్తు చేసుకోవలసిన గురువు జగద్గురువు శ్రీకృష్ణపరమాత్ముడు. ఈ జాతికి భగవద్గీతను బోధించిన గురువు ఆ నల్లనయ్య, ఒక్క భగవద్గీతతో అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించాడు. కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. దుష్టసంహారం చేయించాడు. కురు వృద్ధుడైన భీష్మాచార్యుడు స్వయంగా శ్రీకృష్ణుడిని జగద్గురువు అని సంబోధించాడు. గురువు అంటే తన శిష్యునిలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేవాడని అర్థం. అంతేకాని పాఠాలు చెప్పే ప్రతివారు గురువులు కాదు. విద్యార్థికి మార్గదర్శనం చేసి, విద్యార్థిలోని ఆసక్తిని గమనించి, ఆ విద్యార్థి ఏ రంగంలో రాణించగలడో గమనించగల శక్తి కలవాడే గురువు అని భీష్ముని మాటలలో వ్యక్తమవుతుంది. అందుకే వయసులో శ్రీకృష్ణుడు భీష్ముడి కంటె చిన్నవాడైనప్పటికీ జగద్గురుత్వం ప్రాప్తించింది. చదవండి: సీఎం వైఎస్ జగన్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు m అదే గౌరవం దక్కిన మరొకరు ఆదిశంకరాచార్యులు. జగద్గురు ఆదిశంకరాచార్య అనే మనం భక్తితో, గౌరవంగా పిలుచుకుంటాం. 32 సంవత్సరాలు మాత్రమే తనువుతో జీవించినా, ఆయన రచనలతో నేటికీ అంటే కొన్ని వందల సంవత్సరాల తరవాత కూడా జీవించాడు శంకరాచార్యుడు. ఆచార్యత్వ గుణాల వల్లే శంకరుడు శంకరాచార్యుడయ్యాడు. జగద్గురువయ్యాడు. భారతజాతికి అనర్ఘరత్నాల వంటి స్తోత్రాలు అందించాడు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు తిరుగుతూ, శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, శక్తి పీఠాలు స్థాపించి, జ్ఞానతృష్ణ ఉన్నవారికి పరోక్షంగా గురువుగా నిలుస్తున్నాడు శంకరుడు. చదవండి: మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్ మరో జగద్గురువు స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి, ఆయన దగ్గర జ్ఞాన సముపార్జన చేసి, గురువుల సందేశాలను యావత్ప్రపంచానికి అందించి, అతి పిన్నవయసులోనే కన్నుమూశాడు వివేకానందుడు. అయితేనేం నేటికీ వివేకానందుడు ఎంతోమందికి గురువుగా పరోక్షంగా జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్నాడు. చెళ్లపిళ్ల కవుల దగ్గర చదువుకున్నామని చెప్పుకోవటం ఒక గర్వం, ఒక ధిషణ, ఒక గౌరవం. అంతటి గురువుల దగ్గర చదువుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన గురువులకు దక్కని గౌరవం తనకు దక్కిందన్నారు. తన వంటి శిష్యులున్న గురువులు మరెవరూ లేరని సగర్వంగా అన్నారు. అదీ గురువుల ఔన్నత్యాన్ని చాటిచెప్పే సంఘటన. గురువులు అంటే శిష్యుల భుజాల మీద చేతులు వేసుకుని, వారితో సమానంగా అల్లరి పనులు చేయటం కాదు. గురువులు అంటే శిష్యుల దగ్గర డబ్బులు చేబదులు పుచ్చుకుని, వ్యసనాలను తీర్చుకోవటం కాదు. వందే గురు పరంపర గురువు అంటే తన దగ్గర చదువుకునే విద్యార్థిని ప్రేమ వివాహం చేసుకోవటం కాదు. గురువంటే బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు. ఉత్తర తన శిష్యురాలు. ఆమెను వివాహం చేసుకోమని విరటుడు కోరితే, అందుకు అర్జునుడు.. అయ్యా, నా దగ్గర చదువుకున్న అమ్మాయి నాకు కూతురితో సమానం. కూతురితో సమానమైన అమ్మాయిని కోడలిగా చేసుకోవచ్చు కనుక నా కుమారుడు అభిమన్యునికిచ్చి వివాహం చేస్తానన్నాడు. అదీ గురువు లక్షణం. చదువురాని గురువులు విద్యార్థులకు చేసే బోధన మీద తెన్నేటి లత ఆ రోజుల్లోనే సంచలన కథ రాశారు. అదే ఎబ్బెచెడె... అంటే ఏ బి సి డి లను ఎలా పలుకుతారో వివరించారు. అంతేకాదు కొన్ని పాఠశాలల్లో టీచర్లు చుక్ చుక్ రైలు వస్తోంది అనే బాల గేయాన్ని... సుక్కు సుక్కు రైలు వత్తాంది అని చెబుతున్నారు. ఇటువంటి గురువుల వల్ల విద్యార్థులకు గురువుల పట్ల అగౌరవంతో పాటు, విద్య అంటే ఏమిటో తెలియకుండా పోతారు. చదువు చెప్పే గురువులకు చదువుతో పాటు క్రమశిక్షణ, నిబద్ధత, సత్ప్రవర్తన వంటి మంచి లక్షణాలు ఉండాలి. అటువంటి గురువులు ఉన్ననాడే ఉపాధ్యాయ దినోత్సవానికి అర్థం పరమార్థం కలుగుతుంది. గురుదేవోభవ అనే మాటల అంతరార్థం నిజమవుతుంది. గురువు దేవుడిలా బోధించాలి. దానవుడిలా బోధిస్తే అది దానవత్వాన్ని వృద్ధి చేస్తుందని గుర్తించాలి. - వైజయంతి పురాణపండ -
పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి
మహా సంగీతవేత్త అయిన జయదేవుడు కృష్ణభక్తుడు. ఒడిశా రాష్ట్రంలోని కెంధు బిల్వా అనే ప్రదేశంలో భోజదేవుడు, రమాదేవి అనే దంపతుల కడుపున పుట్టాడు. కారణ జన్ముడు. భార్య పద్మావతీ దేవి. 8 అంగాలుగా ఉండేటట్టు రాయడంతో ఆయన కీర్తనలు జయదేవుడి అష్టపదులుగా ప్రసిద్ధి. ఆయన పాట పాడుతుంటే ఆమె నృత్యం చేసేది. జయదేవుని కీర్తనకు నర్తన చేసేటప్పుడు ఆమె పాదం లయ తప్పకుండా ఉండేటట్లు కృష్ణ పరమాత్ముడు జాగ్రత్తపడేవాడట. భక్తులందరూ ఆయన పాదాలవంక చూస్తుంటే ఆయన మాత్రం ఆమె పాదాలు జయదేవుని కీర్తనలకు అనుగుణంగా పడేటట్లు శ్రద్ధ చూపడంతో ఆయనకు ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ అని ప్రస్తుతించారు. ఒకసారి జయదేవుడు అష్టపదుల రచన చేస్తున్నాడు. ఒక సన్నివేశంలో–‘‘ ప్రియే చారుశీలే! స్మరగరళ ఖండనం మమతిరతి మండనం దేహిపదపల్లవ ఉదారం...’’ అని రాశాడు. అంటే ‘ఓ రాధా! నీ పైన ఉండే విశేషమైన అనురాగంతో మన్మథ బాణాలు నామీద పడి మదనతాపం అనే విషం నా తలకెక్కిపోతున్నది. వేడి తగ్గటం లేదు. ఒక్కసారి పల్లవమైన చల్లని నీ పాదాన్ని తీసి నా తలమీద పెట్టవూ...’ అని కృష్ణుడు అన్నట్లుగా రాసాడు. రాసిన తరువాత ఆయనకు – ‘ఎంత రాధమీద ప్రేమ ఉంటే మాత్రం...రాధా! నీ మీద నాకున్న మోహం చేత మదనతాపం కలిగి వేడెక్కిన నా తల మీద నీ పాదం పెట్టు..’ అంటాడా భగవానుడు.. అనడు. అందువల్ల నేనిలా రాయకూడదు. మరోలా రాయాలి.. అని ఆ చరణాలు కొట్టేసి.. ఘంటం పక్కనపెట్టి– ‘‘పద్మావతీ! స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తా..’ అని చెప్పి అభ్యంజనానికి బయల్దేరాడు. అభ్యంజనం...అంటే ఒంటినిండా నూనె రాసుకుని వెళ్ళి స్నానం చేయడం. ఇలా గడప దాటాడో లేదో మళ్ళీ జయదేవుడు వెనక్కి వచ్చాడు...‘‘అదేమిటి మళ్ళీ వచ్చారు?’ అని పద్మావతీ దేవి అడిగితే ..‘‘అష్టపది పూర్తిచేయడానికి మంచి ఆలోచన వచ్చింది. ..’ అంటూ పూర్తి చేసి వెళ్లిపోయాడు. కొంతసేపటి తరువాత నదీస్నానం ముగించుకుని జయదేవుడొచ్చాడు. తాను రాసిన పుస్తకం మీద నూనెబొట్లు పడి ఉన్నాయి. ‘‘పద్మావతీ, ఇదేమిటి.. నేను కొట్టి వేసిన చరణాలు మళ్ళీ రాసి ఉన్నాయి. ఎవరు రాసారు?’’ అని అడిగాడు. దానికామె ‘మీరేగా.. మంచి ఆలోచన స్ఫురించిందని ఇది ఉంటేనే బాగుంటుందని అంటూ అప్పుడే వెనక్కి వచ్చి రాసి వెళ్ళారుగా..’’ అంది. ‘‘పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. వచ్చింది నేను కాదు. ఆ పరమాత్మ. స్వయంగా ఒంటికి నూనె పూసుకుని నా రూపంలో వచ్చి నేను కొట్టేసిన చరణాలు మళ్ళీ రాసిపోయాడు. ఆయన దర్శన భాగ్యం నాకు కలగలేదు. నీవు పొందావు’’ అన్నాడు. అందుకే వీటిని ‘దర్శన అష్టపది’ అంటారు. ఇప్పటికీ భక్తులు ఈ అష్టపదులను ఇంట్లో వింటూ ఉంటారు. అవి అలా వింటూ ఉంటే స్వామి ప్రసన్నుడౌతాడని వారి నమ్మకం. -
కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్ యువతి
లక్నో: దేవుడంటే ఆమెకు అమిత భక్తి. నిత్యం శ్రీకృష్ణుని నామస్మరణలో మునిగి తేలే ఆమె తన ఆరాధ్య దైవాన్ని ఓ సారి దర్శించాలనుకుంది. అందుకోసం ఆత్మహత్య చేసుకుని ఆ దేవుడి చెంతకు చేరేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రష్యన్ యువతి తత్యానా హెలోవ్స్కయ గతేడాది ఫిబ్రవరి నుంచి యూపీలోని వృందావన్ ధామ్ అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో తను ఉంటున్న భవనంలో ఆరో అంతస్థు నుంచి దూకి అర్ధాంతరంగా తనువు చాలించింది. (చదవండి: చేపల కూర విషయమై గొడవ, హత్య) అయితే ఆమెకు కృష్ణుడిని కలవాలన్న కోరిక ఉండేదని, అందుకోసమే ఇలా ప్రాణత్యాగం చేసి ఉండవచ్చని అదే భవనంలో నివసిస్తున్న స్నేహితురాలు పోలీసులకు తెలిపారు. కాగా ఆత్మహత్య చేసుకున్న యువతి రష్యాలోని రోస్తవ్ నగరానికి చెందినదని, ప్రయాణికురాలి వీసా కింద ఇక్కడకు వచ్చిందని పోలీసులు నిర్ధారణ చేశారు. ఆమె మరణ విషయాన్ని రష్యన్ ఎంబసీకి చేరవేశారు. (చదవండి: వెండి సింహాల చోరుడి అరెస్ట్) -
తనయుడతడు.. తల్లి భూమాత
యుద్ధంలో మరణించిన నరకుడు వీరస్వర్గం అలంకరించటానికి బయలుదేరుతూ.. రెండు రోజుల తరవాత స్వర్గానికి వస్తాను, అంతవరకు భూలోకంలో తిరిగే అవకాశం ఇవ్వమని ఇంద్రుడిని వరం కోరాడు. ఇంద్రుడు అనుమతి ఇచ్చాడు. నరకుడు నేరుగా సత్యభామ దగ్గరకు వెళ్లాడు. ‘‘అమ్మా..’’ అని సంబోధించాడు ఆర్తిగా నరకుడు. సత్యభామ మనసు ఒక్కసారి కలుక్కుమంది. ప్రజలను యథేచ్ఛగా బాధించాడు నరకుడు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని వర గర్వంతో విర్రవీగాడు. మునులు, ఋషులు, వృద్ధులు, పిల్లలు, స్త్రీలు.. ఒకరేమిటి.. అందరూ నరకుని బాధితులే. నిస్సహాయ స్థితిలో ప్రజలంతా శ్రీకృష్ణునికి విన్నవించుకున్నారు. నవ్వురాజిల్లెడు మోముతో యశోదా నందనుడు అందరికీ అభయం ఇచ్చి పంపాడు. యుద్ధానికి సుముహూర్తం నిర్ణయించాడు. సంగ్రామ అభిలాష ఉన్న సత్యభామ తాను కూడా యుద్ధానికి వస్తానని, చీర నడుముకి బిగించింది. శ్రీకృష్ణుడు మరో మాట మాట్లాడకుండా విల్లందుకుంది, రథం అధిరోహించింది. ఇరు పక్షాల నడుమ యుద్ధం హోరాహోరీగా జరిగింది. సంగరంలో కొద్దిసేపు శ్రీకృష్ణుడు మూర్ఛితుడయ్యాడు. కాళిదాసు వర్ణించినట్లుగా మన్మధ బాణాల వంటి కనుబొమలు కలిగిన సత్యభామ నారి సంధించింది. శర వర్షం కురిపించింది. ఒక పక్క శ్రీకృష్ణుని వైపు అమృత కిరణాలను ప్రసరిస్తోంది. మరో పక్క నరకుడిపై రౌద్ర బాణాలు విడుస్తోంది. కొంతసేపటికి శ్రీకృష్ణుడు స్వస్థుడయ్యాడు. సత్యభామా సమేతుడై నరకుడిని వధించాడు. ప్రజలంతా శ్రీకృష్ణుడిని స్తుతించారు, సత్యభామను అభినందించారు. రాక్షస సంహారం జరిగితే జాతరలు, సంబరాలు, పండుగలు జరుపుకోవలసిందే కదా. ఆయా ప్రాంతాల వారు వారి సంప్రదాయానుసారం నరక చతుర్దశి జరుపుకోవటానికి సన్నద్ధులయ్యారు. అక్కడితో ఆగకుండా మరుసటి రోజు దీపావళి కూడా జరుపుకోవాలని తీర్మానించారు. అన్ని లోగిళ్లు పండుగకు సన్నాహాలు చేయటంలో మునిగిపోయాయి. తల్లి ఆశీర్వాదం యుద్ధంలో మరణించిన నరకుడు వీరస్వర్గం అలంకరించటానికి బయలుదేరుతూ.. రెండు రోజుల తరవాత స్వర్గానికి వస్తాను, అంతవరకు భూలోకంలో తిరిగే అవకాశం ఇవ్వమని ఇంద్రుడిని వరం కోరాడు. ఇంద్రుడు అనుమతి ఇచ్చాడు. నరకుడు నేరుగా సత్యభామ దగ్గరకు వెళ్లాడు. సత్యభామ సాక్షాత్తు భూదేవి అవతారం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. ‘‘అమ్మా..’’ అని సంబోధించాడు ఆర్తిగా నరకుడు. సత్యభామ మనసు ఒక్కసారి కలుక్కుమంది. నరకుడు తన కుమారుడే అయినప్పటికీ దుష్ట సంహారం చేసి, తన ప్రజలను కాపాడింది సత్యభామ. ‘‘అమ్మా! నేను నీ కుమారుడినే కదా. నన్ను ఎందుకు సంహరించావు, నన్ను నువ్వే మనిషిగా మార్చలేకపోయావేం’ అని దీనంగా ప్రశ్నించాడు. అందుకు సత్యభామ, ‘బుద్ధి కర్మానుసారీ’ అన్నారు పెద్దలు. నీకు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా నువ్వు నీ దుష్టత్వం విడిచిపెట్టలేదు. నా కుమారుడి కారణంగా నా రాజ్య ప్రజలంతా బాధలు పడటం చూస్తూ ఎలా ఉంటాను. అందుకే నా మాతృ హృదయాన్ని పక్కన పెట్టి, కొద్దిసేపు పాషాణంలా ప్రవర్తించి, నిన్ను యుద్ధంలో సంహరించాను’ అని గంభీరంగా పలికింది సత్యభామ. ‘‘నేను దుర్మార్గుడిని, దుష్టుడిని అని కదా నువ్వు నన్ను సంహరించావు. మరి ఈ పండుగను నా పేరుతో ఎందుకు ‘నరక చతుర్దశి’ గా జరుపుకుంటున్నారు’’ అని అమాయకంగా ప్రశ్నించాడు. సత్యభామ.. ఈ ప్రశ్నకు తన ప్రజలే సరైన సమాధానం చెబుతారని భావించి, ‘నాయనా! నువ్వు ఒకసారి ఈ పండుగ జరుపుకుంటున్న ప్రదేశాలన్నీ సంచరించి, నీ సందేహానికి సమాధానం దొరుకుతుందేమో ప్రయత్నించు’ అని ఆశీర్వదించి, అంతఃపురానికి బయలుదేరింది, తల్లికి నమస్కారం నరకుడు భూలోక సంచారం ప్రారంభించాడు. ఎక్కడ చూసినా వీధులన్నీ ముగ్గులతో, గుమ్మాలన్నీ తోరణాలతో నిండిపోయాయి. అందరూ తలంట్లు పోసుకుని, టపాసులు కొద్దిగా కాల్చుతున్నారు. తన పీడ వదిలినందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటున్నారని అర్థం చేసుకున్నాడు నరకుడు. ఇంటింటా దీపాలు ఉంచటానికి ప్రమిదెలు, నూనె, ఒత్తులు, బాణాసంచా, మిఠాయిలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఒక వీధిలోకి ప్రవేశించాడు నరకుడు. అక్కడ చాలామంది పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుకుంటూ కనిపించారు. వాళ్ల దగ్గరగా వెళ్లి, ‘చిట్టిపిల్లలూ! ఏమిటి ఇంత సంబరంగా ఉన్నారు’ అని ప్రశ్నించాడు. అందుకు వారు, ‘నీకు తెలీదా! నరకుడు అనే రాక్షసుడిని ఈ రోజునే చంపారు. అందుకే మేం పండుగ చేసుకుంటున్నాం. నీకు ఇంకో విషయం తెలుసా, వాడు రాక్షసుడే అయినా కూడా మేం ఈ పండుగకి నరకచతుర్దశి అని ఆ రాక్షసుడి పేరుతోనే జరుపుకుంటున్నాం’ అన్నారు. తను అడగాలనుకున్న ప్రశ్నను వారే చెప్పడం తనకు ఆశ్చర్యం వేసింది. ‘‘రాక్షసుడి పేరు మీద ఎందుకు చేసుకుంటున్నారు’’ అని ఆసక్తిగా ప్రశ్నించాడు నరకుడు. ఏ రాక్షసుడిని చంపారో మాకు గుర్తుండాలి కదా. ఊరికే దీపావళి పండుగ అంటే నరకుడు గుర్తుండడు కదా. అంతే కాదు, ఆ నరకుడి పేరు గుర్తు రాగానే, ‘మనం ఈ రాక్షసుడిలా చెడ్డ పనులు చేస్తే, మనల్ని శ్రీకృష్ణుడు చంపుతాడు’ అని అందరికీ భయం కలగాలి కదా. అందుకే ఆ పేరుతో ఈ పండుగ జరుపుకుంటామని మా నాన్న చెప్పారు’’ అన్నాడు ఒక కుర్రవాడు. ఒక్కోరు ఒక్కోలా నరకాసురుడిని నిందిస్తూనే ఉన్నారు. తన వంటి వాడు స్వర్గానికి అనర్హుడు. నరకంలోకి కూడా ప్రవేశం ఉండదు.. అని మనసులో పలువిధాల బాధ పడ్డాడు నరకుడు. తాను ఎన్ని చెడ్డ పనులు చేసినా, సాక్షాత్తు తాను భూదేవి కుమారుడు కావటం వల్లనే తన పేరుతో పండుగ చేసుకుంటున్నారని తల్లికి శతకోటి నమస్కారాలు చేసి, నేరుగా స్వర్గానికి చేరుకున్నాడు నరకుడు. సృజన రచన : వైజయంతి పురాణపండ -
కృష్ణం వందే జగద్గురుమ్!
‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!’’ సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి ధర్మసంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటానని లోకానికి భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కురుక్షేత్రంలో మోహరించిన సేనలను చూసి, విచలితుడైన అర్జునుడు ధనుర్బాణాలు విడిచి, చేష్టలుడిగి కూలబడిపోతే, తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ‘గీత’బోధ చేశాడు. అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేశాడు. ‘గీత’బోధ కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త లోకానికీ ఉద్దేశించిన కర్తవ్యబోధ! అందుకే శ్రీకృష్ణుడు గీతాచార్యుడిగా, జగద్గురువుగా పూజలందుకుంటున్నాడు. మనకు తెలిసిన దశావతారాల లెక్క ప్రకారం శ్రీకృష్ణుడు నారాయణుడి ఎనిమిదో అవతారం. ధర్మగ్లాని సంభవించినప్పుడు దుష్ణశిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు ఎత్తే అవతారాలను లీలావతారాలంటారు. శ్రీకృష్ణుడి అవతారం కూడా లీలావతారమే! భాగవత కథనం ప్రకారం నారాయణుడి లీలావతారాలు ఇరవైరెండు. వాటిలో శ్రీకృష్ణావతారం ఇరవయ్యవది. లీలావతరాల్లోని ముఖ్యమైన పదింటినే పురాణాలు దశావతారాలుగా చెబుతున్నాయి. శ్రీకృష్ణావతారం నారాయణుడి పరిపూర్ణావతారంగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువగా భక్తులు ఆరాధించేది శ్రీకృష్ణుడినే! మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలలో, వివిధ నామాలతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. ప్రతి ప్రాంతంలోను శ్రీకృష్ణ క్షేత్రాలు పురాతనకాలం నుంచి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బాలకృష్ణుడిగా, ఒడిశాలోని పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, తిరుమలలో శ్రీవెంకటేశ్వరునిగా, కర్ణాటకలోని ఉడిపిలో శ్రీకృష్ణుడిగా, కేరళలోని గురువాయూరులో గురువాయూరప్పగా– ఇలా చాలా చోట్ల చాలా రకాలుగా శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. శ్రీకృష్ణారాధన చరిత్ర శ్రీకృష్ణారాధన క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్ది నాటికే బాగా ఉనికిలో ఉండేది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో లభించిన క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్ది నాటి చిత్రంలో సుదర్శనచక్రాన్ని ధరించిన రథసారథి కృష్ణుడేనని పండితుల అంచనా. శ్రీకృష్ణుని ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఛాందోగ్యోపనిషత్తు. సామవేదానికి చెందిన ఈ ఉపనిషత్తు క్రీస్తుపూర్వం 8–6 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు చెబుతారు. ఛాందోగ్యోపనిషత్తులో శ్రీకృష్ణుని ప్రస్తావన, ధృతరాష్ట్రుడి ప్రస్తావన కనిపిస్తాయి. ఛాందోగ్యోపనిషత్తు తర్వాతి కాలానికి చెందినవైన నారాయణ అధర్వ శీర్షోపనిషత్తు, ఆత్మబోధోపనిషత్తు వంటి మరికొన్ని ఉపనిషత్తులలో కూడా శ్రీకృష్ణుని ప్రస్తావన ఉంది. పురాణ వాఙ్మయంలోని భాగవత, మహాభారత గ్రంథాల్లో శ్రీకృష్ణుని గాథ సమగ్రంగా కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణకర్త పాణిని తన గ్రంథంలో ‘వాసుదేవకుడు’ అంటే వాసుదేవుడి భక్తుడు అనే అర్థాన్ని చెప్పాడు. పాణిని గ్రంథంలోనే అర్జునుడి ప్రస్తావన కూడా ఉన్నందున, ఇందులో ప్రస్తావించిన వాసుదేవుడే శ్రీకృష్ణుడని భావించవచ్చునని పండితుల అభిప్రాయం. హెలియోడోరస్ విదిశాలో ప్రతిష్ఠించిన గరుడస్తంభం, మాయాపూర్‌లో నిర్మాణమవుతున్న చంద్రోదయ మందిరం నమూనా గ్రీకువీరులూ కృష్ణభక్తులే! చంద్రగుప్తుని ఆస్థానాన్ని క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో సందర్శించిన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ తన రచనల్లో మధురలోని శూరసేనుడనే రాజు ‘హెరాకిల్స్’ను పూజించేవాడని రాశాడు. మెగస్తనీస్ ఇతర రచనలను బట్టి ‘హెరాకిల్స్’, ‘కృష్ణుడు’ ఒకరేనని చరిత్ర పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. క్రీస్తుపూర్వం 180–165 కాలానికి చెందిన గ్రీకో–బాక్ట్రియస్ పాలకుడు అగాథొకిల్స్ కృష్ణబలరాముల బొమ్మలతో నాణేలను ముద్రించాడు. అంటే, ఆనాటికే శ్రీకృష్ణుని ప్రాభవం గ్రీస్ వరకు పాకిందన్నమాట! క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దిలో తక్షశిలకు వచ్చిన గ్రీకు రాయబారి కొడుకైన హెలియోడోరస్ శ్రీకృష్ణ భక్తుడిగా మారి, భాగవత ధర్మాన్ని అవలంబించాడు. అతడు మధ్యప్రదేశ్‌లోని విదిశా (ఇదివరకటి బేస్‌నగర్) నగరంలో గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించి, దానిపై ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం ఈ గరుడ స్తంభాన్ని వేయించిన భాగవత ప్రభుభక్తుడు హెరిడోరస్’ అని శిలాశాసనం వేయించాడు. దాదాపు ఇదే కాలానికి చెందిన మరో శాసనం మధుర సమీపంలోని మోరాలో ఉంది. ఇందులో వృష్టి వంశానికి చెందిన ఐదుగురు వీరుల ప్రస్తావన ఉంది. అందులో ప్రస్తావించిన ఐదుగురు వీరులు: బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు. ఆల్ఫ్రెడ్ బీ ఫోర్డ్ (అంబరీష్ దాస్) శరణాగత రక్షకుడు ‘‘నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పైజల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు...’’ అంటూ శ్రీకృష్ణుని రూపాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు పోతనామాత్యుడు. తన ఆంధ్ర మహాభాగవతంలో ఆయన శ్రీకృష్ణుని రూప స్వభావ లీలా విలాసాలను అత్యంత రమ్యంగా వర్ణించాడు. ‘కృష్’ అంటే దున్నడమనే అర్థం ఉంది. భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి మొన నల్లగా ఉంటుంది. అందుకే ‘కృష్ణ’ అనే శబ్దానికి ‘నల్లని’ అనే అర్థం ఏర్పడింది. భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. అందజాలని వాడైన శ్రీకృష్ణ పరమాత్ముడు సంపూర్ణమైన భక్తికి మాత్రమే లోబడతాడు. ‘అన్యథా శరణం నాస్తి’ అంటూ శరణాగతులైన వారిని తక్షణమే రక్షిస్తాడు. భాగవత, మహాభారతాలలో ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. కురుసభలోని ద్రౌపదిని ఈడ్చుకు వచ్చిన దుశ్శాసనుడు ఆమె వలువలూడ్చబోతే, నిస్సహాయ స్థితిలో ఆమె కృష్ణుడినే స్మరిస్తూ తనను రక్షించమని మొరపెట్టకున్న తక్షణమే ఆమె మానసంరక్షణ చేశాడు. జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసిన కాలంలో అడుగడుగునా వారిని కాపాడుతూ వచ్చాడు. వారి అరణ్య, అజ్ఞాతవాసాలు ముగిశాక, వారి తరఫున రాయబారం చేశాడు. దుర్యోధనుడి దురహంకారం కారణంగా రాయబారం విఫలమైతే, కురుక్షేత్రంలో అర్జునుడి రథానికి సారథ్యం వహించి, ధర్మసంస్థాపన చేశాడు. శరణాగతులకు తానెప్పుడూ తోడుగా ఉంటానని భగవద్గీతలో తానే స్వయంగా చెప్పుకున్నాడు. వైష్ణవ సంప్రదాయంలో భక్తులు శరణాగతినే అనుసరిస్తారు. భక్తిమార్గంలో పరాకాష్ట శరణాగతి. లీలామానుష విగ్రహుడు శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. పసివయసు నుంచే లెక్కలేనన్ని లీలలను ప్రదర్శించాడు. దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టిన కృష్ణుడు, పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమై, యశోదా నందుల వద్ద పెరిగాడు. మేనమామ కంసుడు తనపైకి పంపిన రాక్షసులను పసితనంలోనే వధించినవాడు. తోటి గోపబాలకులతో కలసి గోవులను కాసుకుంటూ, వారితో ఆటలాడినవాడు. ఇరుగు పొరుగు ఇళ్లలో వెన్న దొంగిలించి అల్లరి చేసినవాడు. మన్ను తిన్నావెందుకని మందలించిన తల్లి యశోదకు తన నోటనే ఏడేడు పద్నాలుగు లోకాలను చూపినవాడు... శ్రీకృష్ణుడి బాల్యలీలలు, జీవిత విశేషాలు చర్వితచర్వణమే అయినా, భక్తులకు ఇవన్నీ మనోరంజకమైనవి. ఈ లీలలను తలచుకుంటూనే భక్తులు తన్మయులైపోతారు. శ్రీల ప్రభుపాద ప్రసిద్ధ కృష్ణభక్తులు ఎందరో సుప్రసిద్ధులు శ్రీకృష్ణుని ఆరాధించారు. శ్రీకృష్ణుని లీలలను కీర్తిస్తూ భక్తి కీర్తనలను రచించి, గానం చేశారు. శ్రీకృష్ణుడి భక్తితత్వాన్ని బోధించారు. చైతన్యప్రభు, భక్తజయదేవ, మీరాబాయి, సూరదాసు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు వంటివారెందరో శ్రీకృష్ణుని ఆరాధించి, ఆయన భక్తితత్వాన్ని, శరణాగత మార్గాన్ని లోకానికి చాటారు. శ్రీకృష్ణ భక్తుడైన వల్లభాచార్యులు ఒకసారి అడవి గుండా ప్రయాణిస్తూ దారితప్పిపోయారు. పొద్దుగూకే వేళ అయినా, దారి కానరాక తనను కాపాడమంటూ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు నిజరూపంలో కనిపించి, ఆయనకు వెన్నంటి ఉంటూ దారి చూపాడట. ఆ దర్శనం తర్వాతే వల్లభాచార్యులు ‘మధురాష్టకం’ రాశాడని అంటారు. వల్లభాచార్యుని శిష్యుడైన సూరదాసు అంధుడు. చిన్ననాటి నుంచే కృష్ణనామ స్మరణలో మునిగి తేలేవాడు. సూరదాసు ఒకసారి తన నిస్సహాయతనువ్యక్తం చేస్తూ కీర్తనను గానం చేయగా ఆలకించిన వల్లభాచార్యులు అతనికి హితబోధ చేశారు. భక్తుని పలుకుల్లో దైన్యం ఉండరాదని, ఏదైనా భగవంతుని పుత్రునిలా అర్థించాలని నచ్చజెప్పి, అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. సూరదాసు బృందావనంలో శ్రీకృష్ణుడు సంచరించిన చోట కూర్చొని రోజూ ఒక కొత్త భజనగీతాన్ని ఆలపించేవాడు. బ్రజభాషలో ఆయన ఆలపించిన గీతాలు ‘సూరసాగర్’ పేరిట గ్రంథస్థమయ్యాయి. సూరదాసు పాడేటప్పుడు ఆయన గానం వినడానికి శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చేవాడని ప్రతీతి. శ్రీకృష్ణ భక్తుడైన చైతన్యప్రభు గౌడీయ వైష్ణవ తత్వానికి ప్రాచుర్యం కల్పించాడు. ‘హరేకృష్ణ’ నామాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చాడు. గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు చైతన్యప్రభును సాక్షాత్తు శ్రీకృష్ణుడి అవతారంగానే భావిస్తారు. అద్వైత ఆచార్యులకు, నిత్యానంద ప్రభుకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి మాదిరిగానే చైతన్యప్రభు విశ్వరూపాన్ని ప్రదర్శించాడని కూడా కొన్ని గ్రంథాల్లో పేర్కొనడం విశేషం. విదేశాలకు విస్తరించిన కృష్ణచైతన్యం చైతన్యప్రభు బోధలతో గౌడీయ వైష్ణవంలోని కృష్ణతత్వం, ‘హరేకృష్ణ’ భక్తి ఉద్యమం దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది. శ్రీల ప్రభుపాదగా ప్రసిద్ధి పొందిన అభయచరణారవింద భక్తివేదాంత స్వామి తాను నెలకొల్పిన ‘ఇస్కాన్’ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్) ద్వారా కృష్ణతత్వాన్ని విదేశాలకు కూడా విస్తరించారు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ‘ఇస్కాన్’ ఆలయాలు వెలిశాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాలన్నింటిలోనూ కలుపుకొని ప్రస్తతానికి దాదాపు 850 ‘ఇస్కాన్’ ఆలయాలు ఉన్నాయి. వీటిలో మన దేశంలోనే అత్యధికంగా 150 ఆలయాలు ఉన్నాయి. వీటితో పాటు ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన 12 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ‘ఇస్కాన్’ వ్యాప్తితో ‘హరేకృష్ణ’ ఉద్యమం పలు దేశాలలో సాంస్కృతికంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. పశ్చిమబెంగాల్లోని ‘ఇస్కాన్’ ప్రధానకేంద్రమైన మాయాపూర్‌లో ‘చంద్రోదయ మందిరం’ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. సుమారు 4.25 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ప్రాంగణంలో 340 అడుగుల ఎత్తున చేపట్టిన ఈ మందిర నిర్మాణం మరో రెండేళ్లలో పూర్తి కానుంది. ఈ నిర్మాణం పూర్తయితే, కంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్ ఆలయం తర్వాత అతి పెద్ద ఆలయం ఇదే కానుంది. ఈ ఆలయ ప్రాంగణంలో సమస్త సౌకర్యాలతో పాటు అధునాతనమైన ప్లానెటోరియం కూడా ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి 75 మిలియన్ డాలర్లు ఖర్చవుతుండగా, ఇందులో సింహభాగం ‘ఫోర్డ్ మోటార్ కంపెనీ’ వ్యవస్థాపకుడైన హెన్రీఫోర్డ్ మునిమనవడు ఆల్ఫ్రెడ్ బీ ఫోర్డ్ ఖర్చు చేస్తున్నారు. ‘హరేకృష్ణ’ ఉద్యమానికి ఆకర్షితుడైన ఆయన ‘ఇస్కాన్’లో చేరారు. అంబరీష్ దాస్‌గా వైష్ణవనామాన్ని స్వీకరించి, ప్రస్తుతం ‘ఇస్కాన్’ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు తన వ్యాపారాలను చూసుకుంటూనే, ‘ఇస్కాన్’ చేపట్టే కార్యక్రమాలకు భూరి విరాళాలు చెల్లిస్తూ, ఈ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. -
రారా కృష్ణయ్య..!
బృందావనమది అందరిదీ అవునో కాదోగాని, గోవిందుడు అందరివాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీమద్భాగవత పురాణంలో, మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించిన విపులమైన గాథలు ఉన్నాయి. బాలకృష్ణుడిగా చేసిన చిలిపిచేష్టలు, ఆ చిన్నారి వయసులోనే తనను చంపడానికి మేనమామ కంసుడు పంపిన పూతన, శకటాసుర, ధేనుకాసురాది రాక్షసుల హననం, చివరకు తనను చంపదలచిన మేనమామ కంసుడినే వధించడం శ్రీకృష్ణుడి అవతార మహిమకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. మన్ను తిన్నావెందుకని నిలదీసిన తల్లి యశోదకు తన నోట చతుర్దశ భువనభాండాలను చూపిన బాలకృష్ణుడు తనను తాను సర్వంతర్యామిగా ఆనాడే ప్రకటించుకున్నాడు.యవ్వనారంభంలో రాధా మనోహరుడిగా, గోపికా మానస చోరుడిగా చేసిన రాసలీలలు, అష్టమహిషుల ప్రభువుగా అలరారిన శ్రీకృష్ణుడు మహాభారతంలో పాండవ పక్షపాతిగా, అర్జునుని సారథిగా, యుద్ధానికి వెనుకంజ వేసిన అర్జునుడికి గీతబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. గోపాలుడైన గోవిందుడు ఆబాల గోపాలాన్నీ ఆకట్టుకున్నవాడు. అందుకే గోవిందుడు అందరివాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 24) సందర్భంగా ఈ ప్రత్యేక కథనం... నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పై జల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా జిల్లెడు మోమువా డొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో! మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే! శ్రీకృష్ణుని రూపురేఖల గురించి శ్రీమద్భాగవతంలో పోతనామాత్యుడు చేసిన వర్ణన ఇది. నల్లనివాడు కావడం వల్లనే అతడికి కృష్ణుడనే పేరు వచ్చింది. కృష్ణుడు ఉత్త నల్లనివాడేనా? చాలా అల్లరివాడు కూడా. బాల్యావస్థలో చిన్నికృష్ణుని అల్లరి చేష్టలను కూడా పోతనామాత్యుడు కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. చిన్నప్పుడు అల్లరి చేష్టలతో పెరిగిన కృష్ణుడే మహాభారతంలో రాజనీతి చతురుడైన పార్థసారథిగా, లోకానికి గంభీరంగా కర్తవ్యబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. అల్లరి కృష్ణుడిగానే అవతార మహిమలు అల్లరి కృష్ణుడిగా పేరుమోసిన చిన్నారి వయసులోనే శ్రీకృష్ణుడు తన అవతార మహిమలను ప్రదర్శించాడు. ద్వాపరయుగంలో లోకంలో అధర్మం ప్రబలింది. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు ధర్మపరిరక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమ్మీద అవతరించదలచాడు. దేవకీ వసుదేవులకు జన్మించదలచాడు. అప్పుడు యాదవ క్షత్రియుడైన శూరసేన మహారాజు మధురా నగరాన్ని పరిపాలించేవాడు. ఆయన కుమారుడే వసుదేవుడు. ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకితో వసుదేవునికి వివాహం జరిపిస్తారు. వివాహం తర్వాత చెల్లెలిని అత్తవారింట దిగవిడచడానికి కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతాడు. రథం మార్గమధ్యంలో ఉండగానే ‘నీ చెల్లెలికి పుట్టబోయే ఎనిమిదో కుమారుడు నిన్ను సంహరిస్తాడు’ అని అశరీరవాణి పలకడంతో ఆగ్రహోదగ్రుడైన కంసుడు చెల్లెలు దేవకిని, బావ వసుదేవుడిని చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో దేవకికి పుట్టిన ఆరుగురు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా తన కత్తికి బలిచేస్తాడు. దేవకి ఏడోగర్భంలో ఉండగా విష్ణువు తన మాయతో ఆ పిండాన్ని నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. రోహిణికి కొడుకుగా బలరాముడు పుడతాడు. దేవకికి చెరసాలలోనే గర్భస్రావం అయి ఉంటుందని కంసుడు సరిపెట్టుకుంటాడు. కొన్నాళ్లకు దేవకి ఎనిమిదోసారి గర్భందాలుస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రివేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడిని పొత్తిళ్లలో పట్టుకుని వసుదేవుడు చెరసాల దాటి బయలుదేరుతాడు. దారిలో ఉన్న యమునా నది రెండుగా చీలి అతనికి దారి ఇవ్వడంతో నందుని ఇంటికి చేరుకుంటాడు వసుదేవుడు. నందుని మరో భార్య యశోద పక్కనున్న శిశువును తీసుకుని, ఆమె పక్కన కృష్ణుడిని విడిచిపెట్టి, తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. ఉదయాన్నే దేవకి శిశువును ప్రసవించిందన్న వార్త విన్న కంసుడు బిడ్డను చంపడానికి చెరసాలకు వెళతాడు. పుట్టినది కొడుకు కాదు, ఆడశిశువు అంటూ దేవకీ వసుదేవులు వారిస్తున్నా, కంసుడు ఆ శిశువును లాక్కును నేలకేసి కొట్టబోతాడు. శిశువు యోగమాయగా పైకెగసి, ‘నిన్ను చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులను కంసుడు ఇంకా చెరసాలలోనే ఉంచుతాడు. మరోవైపు వ్రేపల్లెలోని నందుని ఇంట కృష్ణుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంటాడు. తనను చంపబోయే బాలుడు ఎక్కడున్నాడో వెదికి పట్టుకుని చంపాలంటూ కంసుడు తన చారులను నలువైపులా పంపుతాడు. కంసుడు పంపిన వారిలో పూతన తొలుత కృష్ణుడి జాడ కనుక్కుంటుంది. విషపూరితమైన పాలు ఇవ్వబోయిన పూతనను పాలుతాగే వయసులోనే కృష్ణుడు పరిమార్చుతాడు. దోగాడే వయసులో కృష్ణుడి అల్లరి ఎక్కువవడంతో యశోద అతణ్ణి రోకలికి కట్టేస్తుంది. రోకలిని ఈడ్చుకుంటూ దోగాడుతూనే వెళ్లి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగిస్తాడు. బుడిబుడి నడకల ప్రాయంలోనే కంసుడు పంపిన బక, ధేనుక, శకటాసురాదులను సంహరిస్తాడు. ఆరుబయట ఆటలాడుకుంటూ ఒకసారి బాలకృష్ణుడు మన్నుతినడంతో తోటి గోపబాలకులు యశోదకు ఫిర్యాదు చేస్తారు. తినడానికి ఇంట్లో వెన్న మీగడలుండగా మన్ను తిన్నావెందుకని యశోద గద్దించితే, నోరు తెరిచి తన నోటనే ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించి, ఆమెను సంభ్రమానికి గురిచేస్తాడు. తనను పూజించడం మానేసినందుకు గోకులంపై ఆగ్రహించిన ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి, అల్లకల్లోలం సృష్టించినప్పుడు చిటికిన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, ఆ కొండ నీడన వ్రేపల్లె వాసులకు, గోవులకు రక్షణ కల్పిస్తాడు. కాళింది నదిని విషపూరితం చేస్తూ, జనాలను భయభ్రాంతులను చేస్తున్న కాళీయుని పడగపైకెక్కి తాండవమాడి కాళీయుని మదమణచి తాండవకృష్ణుడిగా చిన్నారి వయసులోనే జేజేలందుకుంటాడు. చిన్న వయసులోనే ఇన్ని మహిమలు చూపినా, మళ్లీ ఏమీ ఎరుగని వానిలాగానే తోటి గోపబాలకులతో కలసి ఆలమందలకు కాపలాగా వెళతాడు. వాళ్లతో కలసి అల్లరి చేస్తూ ఆటలాడుతాడు. ఎవరూలేని గోపాలుర ఇళ్లలోకి చొరబడి వెన్నమీగడలను దొంగిలిస్తాడు. ఇంటి మీదకు తగవులు తెచ్చి, మామూలు అల్లరిపిల్లవాడిలాగానే తల్లి యశోదతో చీవాట్లు తింటాడు. అరుదైన గురుదక్షిణ అల్లరిగా ఆటపాటలతో గడిపే కృష్ణబలరాములకు విద్యాభ్యాసం జరిపించాలనుకుంటాడు నందుడు. సాందీపని మహర్షి గురుకులంలో చేరుస్తాడు. కృష్ణబలరాములు సాందీపని మహర్షి గురుకులంలో చేరేనాటికి ఆయన పుత్రశోకంతో కుమిలిపోతూ ఉంటాడు. బాల్యంలోనే ఆయన కొడుకు ప్రభాస తీర్థంలో మునిగిపోతాడు.. గురువుకు శుశ్రూషలు చేసి మిగిలిన శిష్యుల మాదిరిగానే బలరామ కృష్ణులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు. విద్యాభ్యాసం పూర్తయి, గురుకులాన్ని విడిచిపెట్టే సమయంలో గురుదక్షిణగా ఏమివ్వమంటారని అడిగాడు కృష్ణుడు. గురుపత్ని విలపిస్తూ ప్రభాసతీర్థంలో మునిగి కనిపించకుండా పోయిన తమ కుమారుడిని తెచ్చివ్వగలరా అని అడుగుతుంది. బలరామకృష్ణులు ప్రభాసతీర్థానికి చేరుకుంటారు. ప్రభాసతీర్థంలో గురుపుత్రుడిని అపహరించుకుపోయిన పాంచజన్యునితో పోరాడి, అతనిని తుదముట్టించి, గురుపుత్రుని సురక్షితంగా తీసుకువచ్చి, అతడిని గురుదక్షిణగా సమర్పించి, గురుకులం వీడి ఇంటికి చేరుకుంటారు కృష్ణబలరాములు. కృష్ణుడిని ఎలాగైనా తుదముట్టించాలన్న పట్టుదలతో కంసుడు పథకం పన్నుతాడు. ఉద్ధవుడిని దూతగా పంపి కృష్ణ బలరాములను మథురకు రప్పిస్తాడు. వారిని చంపడానికి చాణూర ముష్టికులనే మల్లులను ఉసిగొల్పుతాడు. కృష్ణుడు చాణూరుడిని, బలరాముడు ముష్టికుడిని సంహరిస్తారు. తర్వాత కృష్ణుడు కంసుడిని తుదముట్టించి, చెరలో ఉన్న తాత ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుడిని చేసి, తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను కూడా చెర నుంచి విడిపిస్తాడు. గురుకులంలో చెలికాడైన నిరుపేద బ్రాహ్మణుడు సుదాముడు పెద్దయిన తర్వాత తన ఇంటికి వస్తే, సముచిత రీతిలో ఆతిథ్యమిచ్చి, అతడి దారిద్య్రబాధను కడతేరుస్తాడు. అష్టమహిషులు కృష్ణుడు ఎనిమిదిమంది భార్యలను వివాహమాడాడు. రుక్మిణి కృష్ణుడిని ప్రేమించింది. ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తలుస్తాడు ఆమె సోదరుడు రుక్మి. బలవంతపు పెళ్లి ఇష్టంలేని రుక్మిణి రహస్య సందేశం పంపడంతో కృష్ణుడు ఆమెను ఎత్తుకుపోయి రాక్షసవివాహం చేసుకుంటాడు. అడ్డు వచ్చిన రుక్మికి సగం శిరస్సు, సగం మీసాలు గొరిగి బుద్ధిచెబుతాడు. సత్రాజిత్తు వద్దనున్న శమంతకమణి పోయి, అతడి సోదరుడు ప్రసేనుడు సింహం నోటపడి మరణించడంతో ఆ నింద కృష్ణునిపై పడుతుంది. శమంతకమణిని జాంబవంతుని గుహలో కనుగొన్న కృష్ణుడు అతడిని యుద్ధంలో గెలవడంతో జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కృష్ణుడికి సమర్పిస్తాడు. శమంతకమణిని తిరిగి తెచ్చివ్వడంతో సత్రాజిత్తు తన కూతురు సత్యభామతో కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. వసుదేవుడి చెల్లెలైన శ్రుతకీర్తి కూతురు భద్రను, మరో మేనత్త కూతురు అవంతీ రాజపుత్రిక మిత్రవిందను స్వయంవరంలో పెళ్లాడతాడు. కోసలరాజు నగ్నజిత్తు వద్ద ఏనుగులంత బలం ఉండే ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి కూతురునిస్తానని ప్రకటించడంతో, కృష్ణుడు ఏడు రూపాల్లో ఏడు వృషభాలనూ నిగ్రహించి, నగ్నజిత్తు కూతురు నాగ్నజితిని వివాహమాడతాడు. మద్ర దేశాధిపతి కూతురు లక్షణ స్వయంవరంలో కృష్ణుడిని వరిస్తుంది. ఈ ఎనిమిదిమంది ద్వారా కృష్ణుడికి పదేసిమంది చొప్పున కొడుకులు కలిగారు. మహాభారతంలో కృష్ణుడు మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడికి మొదటి నుంచి స్నేహబాంధవ్యాలు ఉండేవి. ముఖ్యంగా పాండవ మధ్యముడైన అర్జునుడితో శ్రీకృష్ణుడిది విడదీయరాని బంధం. నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని ప్రతీతి. పాండవపత్ని ద్రౌపదిని సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. శ్రీకృష్ణుడి సలహాల మేరకే ధర్మరాజు మొదలుకొని పాండవులంతా నడుచుకునేవారు. ద్యూత వ్యసనుడైన ధర్మరాజు కృష్ణుడి సలహా తీసుకోకుండానే శకుని ఆహ్వానించగానే మాయజూదంలో చిక్కుకుని సర్వస్వాన్ని కోల్పోతాడు. జూదంలో ధర్మరాజు పణంగా ఒడ్డిన ద్రౌపదిని దుశ్శాసనుడు కురుసభలోకి ఈడ్చుకొచ్చి వలువలు వలిచే ప్రయత్నం చేసినప్పుడు ఆమె తలచినంతనే చీరలు ప్రసాదించి, మానసంరక్షణ చేస్తాడు. మాయజూదంలో ఓటమిపాలై అరణ్య, అజ్ఞాతవాసాల్లో ఉన్న పాండవులకు శ్రీకృష్ణుడు అడుగడుగునా అండగా నిలుస్తాడు. తన రాజ్యానికి బెడదగా ఉన్న జరాసంధుని భీముడి సాయంతో తుదముట్టిస్తాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయం చేసినప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలమిస్తాడు. శిశుపాలుడు దీనిని ఆక్షేపించి, శ్రీకృష్ణుడిని దూషిస్తాడు. మేనత్తకు ఇచ్చిన వరం మేరకు శిశుపాలుడి వందతప్పులను సహించిన శ్రీకృష్ణుడు, అతడు వందతప్పులనూ పూర్తి చేయడంతో ఇక ఏమాత్రం ఉపేక్షించక తన చక్రాయుధంతో అతడిని సంహరిస్తాడు. పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత వారి తరఫున రాయబారిగా కురుసభకు వెళతాడు. దుర్యోధనుడు మొండికేసి సూదిమొన మోపినంత చోటైనా పాండవులకు ఇవ్వననడమే కాకుండా, కృష్ణుడిని బంధించడానికి తెగబడటంతో నిండుసభలోనే విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడానికి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తాత్కాలికంగా చూపునిస్తాడు. యుద్ధం అనివార్యమైనప్పుడు తాను పాండవులపక్షా నిలిచి, అర్జునుడికి సారథిగా కురుక్షేత్ర రణరంగానికి వెళతాడు. రణరంగంలో అయినవారిని చూసి, తాను వారిని తన చేతులతో సంహరించలేనంటూ అర్జునుడు వెనుకాడినప్పుడు కురుక్షేత్రంలో మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించి, గీతబోధ చేసి, అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం బారి నుంచి ఉత్తర గర్భస్థ శిశువును తన చక్రాన్ని అడ్డువేసి కాపాడతాడు. ఉత్తరకు పుట్టిన కొడుకు పరీక్షిత్తు పాండవుల తర్వాత రాజ్యభారం వహిస్తాడు. అవతార పరిసమాప్తి కురుక్షేత్రం యుద్ధంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్న గాంధారి, దీనంతటికీ కృష్ణుడే కారణమని తలచి అతడిపై ఆక్రోశం పెంచుకుంటుంది. యుద్ధంలో కురువంశం నాశనమైనట్లే యదువంశం కూడా నాశనమవుతుందని గాంధారి శపిస్తుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు యాదవ యువకులు కొందరు కృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన సాంబుడికి ఆడవేషం కట్టి, నిండుచూలాలి మాదిరిగా అలంకరిస్తారు. అటుగా వచ్చిన మునులను అడ్డగించి, ఆడవేషంలోని సాంబుడిని చూపి, పుట్టబోయేది ఆడబిడ్డో, మగశిశువో చెప్పాలంటూ ఆటపట్టిస్తారు. ఆగ్రహించిన మునులు యదుకులాన్ని నాశనం చేసే ముసలం పడుతుందని శపిస్తారు. సాంబుడికి వేషం తీసేశాక, అతడి దుస్తుల్లోంచి లోహపు ముసలం ఒకటి బయటపడుతుంది. దానిని చూసి యాదవులు భయపడతారు. దానినేం చేయాలని పెద్దలను అడిగితే, అరగదీసి సముద్రంలో కలిపేయమని సలహా ఇస్తారు. వీలైనంత వరకు దానిని అరగదీసి సముద్రంలో కలిపేస్తారు. చిన్న ములుకులాంటి భాగం మిగిలిపోవడంతో దానిని ఒడ్డున పడేస్తారు. ముసలాన్ని అరగదీసిన ప్రదేశంలో రెల్లుగడ్డి మొలుస్తుంది. ములుకులాంటి భాగం ఒక నిషాదుడికి దొరకడంతో, అతడు దానిని తన బాణానికి ములుకులా అమర్చుకుంటాడు. కొన్నాళ్లకు యాదవులు తప్పతాగి వారిలో వారే కొట్లాడుకుని ఒకరినొకరు చంపుకుంటాడు. జరిగిన దారుణానికి తల్లడిల్లిన బలరాముడు యోగమార్గంలో దేహత్యాగం చేస్తాడు. కృష్ణుడు ఒంటరిగా ఒక చెట్టునీడన కూర్చుని వేణువూదుతూ కాలిని ఆడిస్తుండగా, అక్కడేదో మృగం ఉందని భ్రమించి నిషాదుడు బాణం సంధిస్తాడు. ఆ బాణం వల్లనే కృష్ణుడు దేహత్యాగం చేశాడని, బాణాన్ని సంధించిన నిషాదుడు గతజన్మలో వాలి కొడుకైన అంగదుడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. వాలిని రాముడు చెట్టుచాటు నుంచి వధించడం వల్లనే ద్వాపరయుగంలో నిషాదుడిగా జన్మించిన అంగదుడు చెట్టుచాటునున్న కృష్ణుడిపై బాణం సంధిస్తాడని కొన్ని పురాణాల కథనం. శ్రీకృష్ణుడి నిర్యాణంతో ద్వాపరయుగం అంతరించి కలియుగం ప్రారంభమైందని కూడా పురాణాలు చెబుతాయి. అయితే, శ్రీకృష్ణుడు జరామరణ రహితుడని రామానుజాచార్యులు మొదలుకొని గౌడీయ వైష్ణవ గురువుల వరకు పలువురు ఆచార్యలు చెప్పారు. పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు ఆదిమధ్యాంత రహితుడని, పాంచభౌతిక దేహానికి అతీతుడని వైష్ణవుల విశ్వాసం. పురాణాలు... చారిత్రక ఆధారాలు... శ్రీకృష్ణుని ప్రస్తావన పురాణాల్లోనే కాకుండా, ఉపనిషద్వాంగ్మయంలోనూ కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో అత్యంత ప్రాచీనమైనదని భావిస్తున్న ‘ఛాందోగ్యోపనిషత్తు’లో కృష్ణుడి ప్రస్తావన కనిపిస్తుంది. కృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఇదే. ఇందులో శ్రీకృష్ణుడు దేవకీసుతుడని, ఘోర అంగీరసుడికి శిష్యుడని ఉంది. ‘నారాయణ అధర్వశీర్ష’, ‘ఆత్మబోధ’ వంటి ఉపనిషత్తులు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడని, నారాయణుని అవతారమని చెప్పాయి. హరివంశం, విష్ణుపురాణం వంటి పురాణగ్రంథాల్లో కూడా కృష్ణుని గురించిన గాథలు కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో మగధ రాజ్యానికి వచ్చిన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ తన రచనల్లో కృష్ణుడిని ‘హెరాకిల్స్’గాను, బలరాముడిని ‘అగాథకిల్స్’గాను ప్రస్తావించాడు. మధుర రాజైన శూరసేనుడు ‘హెరాకిల్స్’ను పూజించేవాడని మెగస్తనీస్ రాశాడు. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది నాటి గ్రీకు రాయబారి హెలియోడోరస్ విదిశ ప్రాంతంలోని బేస్‌నగర్‌లో నెలకొల్పిన స్థూప శాసనంలో ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం’ ఆ గరుడ స్తంభాన్ని భక్తుడైన తాను వేయించినట్లు పేర్కొన్నాడు. ఇండో–గ్రీకు పాలకుడైన అగాథోక్లెస్ క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దిలో కృష్ణబలరాముల బొమ్మలున్న నాణేలను ముద్రించాడు. ఆ కాలంలోనే వృష్టివంశానికి చెందిన ఐదుగురు వీరులు: కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు పూజలందుకునేవారు. మధుర సమీపంలోని మోరా వద్ద లభించిన శాసనంలో ఈ ఐదుగురు వృష్టివంశ వీరులకు పూజలు జరిపేవారనేందుకు ఆధారాలు బయటపడ్డాయి. సుమారు అదేకాలంలో వ్యాకరణకర్త పతంజలి రచనల్లో కృష్ణుడు, సంకర్షణుడు, జనార్దనుడు, బలరాముడు, కేశవుడు వంటి దేవతల పేర్లు కనిపిస్తాయి. కృష్ణుని ఆరాధన... ఆలయాలు... దేశం నలుమూలలా కృష్ణుని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడిగా, కేరళలోని గురువాయూర్‌లో గురువాయూరప్పగా, గుజరాత్‌లోని నాథద్వారలో శ్రీనాథుడిగా, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనాలలో శ్రీకృష్ణుడిగా, గుజరాత్‌లోని ద్వారకలో ద్వారకాధీశునిగా, మహారాష్ట్రలోని పండరిపురంలో పాండురంగ విఠలునిగా, తమిళనాడులోని మన్నార్గుడిలో రాజగోపాలునిగా ఆరాధిస్తారు. మీరాబాయి, చైతన్య మహాప్రభువు, సూరదాసు, భక్త జయదేవుడు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు వంటివారు కృష్ణభక్తుల్లో సుప్రసిద్ధులు. భారతీయ సంప్రదాయ సంగీత సాహిత్యాలలో కృష్ణునికి విశేషమైన స్థానం ఉంది. కృష్ణుని గురించిన అనేక కీర్తనలు, కృతులు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి. భక్తజయదేవుని గీతగోవిందం, అష్టపదులు, సూరదాసు గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట కచేరీల్లో వినిపిస్తూనే ఉంటాయి. పోతన భాగవతంలో శ్రీకృష్ణుని వర్ణన నిరుపమానమైనవి. తెలుగునాట అన్నమయ్య వంటి పలు వాగ్గేయకారులు కూడా శ్రీకృష్ణుని స్తుతిస్తూ రాసిన కీర్తనలు నేటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆధునిక కాలంలో భక్తివేదాంత స్వామి ప్రభుపాద ‘హరేకృష్ణ’ ఉద్యమాన్ని ప్రారంభించి, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ (ఇస్కాన్) స్థాపించారు. ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో దేశ దేశాల్లో ఆలయాలు నడుస్తున్నాయి. ధార్మిక జీవనశైలి, భగవద్గీత, కృష్ణతత్వం ప్రచారం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ‘హరేకృష్ణ’ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ ఉంది. పలువురు విదేశీయులు సైతం ‘ఇస్కాన్’ ఆలయాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. జన్మాష్టమి వేడుకలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. వైష్ణవ సంప్రదాయం పాటించేవారు ఇళ్లలో కూడా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి పాటలు పాడుతారు. ముంగిళ్లలో బాలకృష్ణుని పాదముద్రలను తీర్చిదిద్దుతారు. ఆ పాదముద్రలనే ఆనవాలు చేసుకుని బాలకృష్ణుడు తమ నట్టింట నడయాడుతాడని కొందరు భక్తులు నమ్ముతారు. ఇంట్లోని పూజమందిరంలో కృష్ణుని ప్రతిమను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. పాలు, అటుకులతో తయారుచేసిన మధుర పదార్థాలను, వెన్న మీగడలను కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి, బంధుమిత్రులతో కలసి ఆరగిస్తారు. కృష్ణాష్టమి రోజున పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీకృష్ణ లీలలను పఠించడం లేదా ఆలకించడం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించితే చతుర్విధ పురుషార్థాలూ ప్రాప్తిస్తాయని ‘స్కందపురాణం’ చెబుతోంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో చిన్నారులు ఉంటే కృష్ణుడిలా, గోపికల్లా వారికి వేషాలు కడతారు. కొన్ని చోట్ల ఉట్టికొట్టే వేడుక జరుపుతారు. భాగవత పారాయణ, భగవద్గీత పారాయణ, విష్ణుసహస్రనామ పారాయణ, కృష్ణాష్టక పారాయణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. -
అఫీషియల్ : కృష్టుడిగా ఆమిర్..!
ఇప్పటికే చాలా సార్లు వెండితెరకెక్కిన మహాభారత గాథ ఇప్పుడు మరింత భారీగా రూపొందనుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ భారీ ప్రాజెక్ట్‌కు పూనుకున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా సిరీస్‌గా మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమిర్.. శ్రీ కృష్ణుడిగా నటించే అవకాశం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ స్పందించాడు. జీరో సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షారూఖ్ తనకు శ్రీ కృష్ణుడి పాత్రలో నటించాలని ఉందని.. అయితే ఆ పాత్రను త్వరలో ఆమిర్ పోషించబోతున్నాడని వెల్లడించారు. దీంతో మహాభారతంలో ఆమిర్ చేయబోయేది శ్రీకృష్ణుడి పాత్రే అని కన్ఫామ్ అయ్యింది. -
మహాభాగవతం దశమ స్కంధం – రెండవ భాగం
♦ శ్రీకృష్ణుడు అపనిందను పోగొట్టుకొని, జాంబవతిని, సత్యభామను పెండ్లాడటం ♦ శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి ఇంద్రప్రస్థానికి వెళ్ళటం ♦ కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణలతో కృష్ణుడి పరిణయం ♦ నరకాసుర సంహారం ♦ ఉషాపరిణయం, బాణాసురుని కథ, చిత్రరేఖ యోగశక్తి, అనిరుద్ధుడు నాగపాశబద్ధుడవటం ♦ బాణ, శ్రీకృష్ణుల యుద్ధం ♦ నృగమహారాజు చరిత్ర ♦ బలరాముడు గోపాలకుల వద్దకు వెళ్లడం ♦ పౌండ్రక వాసుదేవుని కథ ♦ ద్వివిధవానర సంహారం ♦ బలరాముడు తన నాగలితో హస్తినను గంగలోకి నెట్టబోవటం ♦ పదహారువేల స్త్రీజనంతో కూyì ఉన్న కృష్ణుని మహిమను నారదుడు గుర్తించటం ♦ జరాసంధ భీతులైన రాజులు ♦ శిశుపాల వధ ♦ సాల్వుడు సౌభక విమానం పొంది ద్వారకపై దండెత్తటం ♦ శ్రీకృష్ణుడు దంతవక్తృని సంహరించటం ♦ బలభద్రుని తీర్ధయాత్ర ♦ కుచేలుని కథ ♦ శ్రీకృష్ణుడు బంధుగణంతో గ్రహణ స్నానం చేయుట ♦ లక్షణ తన వివాహ వృత్తాంతాన్ని ద్రౌపదికి చెప్పటం ♦ నారదాది మహర్షులు వసుదేవునితో యాగం చేయించటం ♦ కృష్ణ బలరాములు మృతులైన తమ అన్నలను దేవకీ వసుదేవులకు చూపటం ♦ సుభద్రా పరిణయం ♦ శ్రీకృష్ణుడు ఋషి సమేతుడై మిథిలకు వెళ్లడం ♦ శ్రుతిగీతలు ♦ విష్ణుసేవా ప్రాశస్త్యం ♦ వృకాసురుడు విష్ణుమాయకు లోబడి నశించటం ♦ భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించటం ♦ శ్రీ కృష్ణుడు మృత్యువు వాత బడిన విప్రకుమారులను తిరిగి బతికించి తీసుకు రావడం ♦ శ్రీ కృష్ణుని వంశానుక్రమ వర్ణన. -
దశమ స్కంధము – మొదటి భాగం
♦ బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్తుడైన విష్ణువును కీర్తించటం ♦ శ్రీ కృష్ణావతారం ♦ దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతం ♦ పూతన, శకటాసుర, తృణావర్త సంహారం ♦ శ్రీ కృష్ణ బలరాముల క్రీడలు ♦ కృష్ణుడు మన్నుతిని నోటిలో యశోదకు విశ్వరూపం చూపడం ♦ నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతం ♦ యశోద కృష్ణుని వెంబడించి పట్టుకొని కట్టివేయడం ♦ కృష్ణుడు మద్దిచెట్టును కూల్చివేయడం ♦ నందాదులు బృందావనానికి తరలి వెళ్ళడం ♦ వత్సాసుర, బకాసురుల సంహారం ♦ శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్ది అన్నం ఆరగించటం ♦ అఘాసురుని కథ, బ్రహ్మ లేగలను, గోపాలురను మాయం చేయటం ♦ కాళీయ మర్దనం, కాళీయుని వృత్తాంతం, శ్రీ కృష్ణస్తుతి ♦ శ్రీ కృష్ణుడు కార్చిచ్చును కబళించటం ♦ బలరాముడు ప్రలంబుడనే రాక్షసుని సంహరించటం ♦ గోపికా వస్త్రాపహరణం ♦ మునిపత్నులు బాలకృష్ణునికి ఆరగింపు చేయడం ♦ గోవర్ధనోద్ధరణ, శ్రీ కృష్ణుడు నందగోపుని వరుణనగరం నుండి కొని తేవడం ♦ శరద్రాత్రులలో వేణుగానం, గోపికాకృష్ణుల క్రీడలు ♦సుదర్శన శాపవిమోచనం, శంఖచూడుడు, వృషభాసురుడు, కేశి అనే రాక్షసుల వధ బృందావనానికి అక్రూరుడు రావడం, బలరామ కృష్ణులను దర్శించుకోవటం ♦ బలరామ కృష్ణులు మధురలో ప్రవేశించడం ♦ కువలయాపీడనం అనే ఏనుగును కృష్ణుడు సంహరించటం ♦ బలరామ కృష్ణులు చాణూరముష్ఠికులు అనే మల్లులను సంహరించటం ♦ కంస వధ, ఉగ్రసేనుని పట్టాభిషేకం ♦ భ్రమర గీతాలు ♦ ఉద్ధవ సహితుడైన కృష్ణుడు కుబ్జను అనుగ్రహించటం ♦ కాలయవనుడు కృష్ణుని పట్టుకోబోవడం, ♦ ముచికుందుని వృత్తాంతం ♦ జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించటం ♦ రుక్మిణీ కళ్యాణం ♦ శ్రీకృష్ణుడు కుండిన నగరానికి రావటం ♦ బలరాముడు రుక్మిణీదేవిని ఓదార్చటం. -
శిక్ష అనుభవించాల్సిందే!
కురుపాండవుల మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెతాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది. ‘కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు... వీరిని కూడా విడిచిపెట్టలేదు, వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా. వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే. ... అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది..’’ అంటూ ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. ‘‘వారు చేసిన పాపం ఏమిటి’’ రెట్టించింది. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు.‘‘నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ. వారు జీవితమంతా నిజమే చెప్పారు. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు’ ‘‘ఏం తప్పు చేశారు?’’ ‘‘పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే, పెదవి విప్పకుండా, తలలు దించుకుని మౌనం వహించారు. జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి, హక్కు ఉండి కూడా వారిరువురూ మౌనం వహించడం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది. ఇంతకుమించిన నేరమేముంది...’’ ‘‘మరి కర్ణుడి సంగతి ఏంటి? ఆయన దానకర్ణుడన్న పేరు సంపాదించాడుగా. గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా. ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో. నువ్వు మరీ ఇంత నిర్దయుడివా’’ ‘నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే, యుద్ధరంగంలో యోధానుయోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు... మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి, పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చెలమ ఉంది. దుర్యోధనుడు ఇవ్వడానికి వీలు లేదన్నాడు. అలా కర్ణుడు అభిమన్యుడి దాహం తీర్చలేదు. ఆ తరవాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ ఒక్క తప్పు చేసినా, జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే పని నీతిమంతమైనదేనా? న్యాయమైనదేనా? అని ఆలోచించాలి’’ సెలవిచ్చాడు శ్రీకృష్ణపరమాత్ముడు. – డా. వైజయంతి -
'ప్లీజ్.. నన్ను మీ రాజకీయాల్లోకి లాగొద్దు'
సాక్షి, మీరట్ : తనను రాజకీయాల్లోకి లాగొద్దని అలియా ఖాన్ అనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని వేడుకుంది. తాను కృష్ణుడి వేషం వేయడం, భగవద్గీత శ్లోకాలు చెప్పడం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'నేను కృష్ణుడు వేషం వేసి, భగవద్గీత శ్లోకాలు చదివినంత మాత్రాన ఇస్లాం బలహీనమైనదని అర్ధం కాదు. అలా అనుకునే వారితో నేను ఏకీభవించను. ముస్లిం మత పెద్దలు నాకు వ్యతిరేకంగా ఫత్వా కూడా విడుదల చేశారు. అందుకే ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు' అని అలియా వేడుకుంది. గతంలో కూడా తాను చేసిన పని ఏ ఒక్క మత విశ్వాసాన్నిగానీ, గుర్తింపునకుగానీ హానీ కలిగించదని చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది (2017) డిసెంబర్ 30న జరిగిన ఓ కార్యక్రమంలో అలియా కృష్ణుడి వేషం వేసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు కూడా చదివింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. -
పాశుర ప్రభాతం
8వ పాశురం కీళ వానమ్ వెళ్లెజ్జ్ఎరుమై శిఱువీడు మేయ్వాన్ పరందన కాణ్! మీక్కుళ్ల పిళ్లైగళుమ్ పోవాన్ పోగినాజ్జ్ ప్పోగామల్ కాత్తున్నై కూవువాన్ వందు నిన్నోమ్ కోదుకలముడైయ పావాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు వావాయ్ విళందానై మల్లరై మాట్టియ దేవాది దేవనై చ్చెజ్జ్ నామ్ శేవిత్తాల్ ఆవా వెజ్జ్ఆరామ్ందు అరుళే లోరెమ్బావాయ్. భావం: తూర్పుదిక్కు తెల్లవారుతోంది. పచ్చిక మేయడానికై చిన్న బీడులోనికి విడువబడిన గేదెలు విచ్చలవిడిగా వెళుతున్నాయి. మిగిలిన గోపికలందరూ వ్రతస్థలానికి బయలుదేరి పోవడమే తమకు ప్రయోజనం అనునట్లు పోతున్నారు. వారిని ఆపి నిన్ను పిలుచుటకు మేము నీ వాకిట్లో వచ్చి నిలిచి యున్నాం. కుతూహలం కలిగిన ఓ పడతీ! లేచి రావమ్మా! కృష్ణ భవవానుని గుణాలను కీర్తించి వ్రతాన్ని ప్రారంభించి వ్రతసాధనమైన పరను పొందుదాం. కేశి అను రాక్షసుని చీల్చి చంపిన వానిని... చాణూర ముష్టికులని మట్టుపెట్టిన వానిని దేవాధిదేవుణ్ణి మనం వెళ్లి సేవించెదము. అప్పుడు స్వామి మనతో ‘అయ్యో! మీరే వచ్చితిరా’ అని బాధపడి తదుపరి మన మంచి చెడులను పరిశీలించి మనలను కటాక్షిస్తాడు. ప్రేమతో చూస్తాడు. – ఎస్. శ్రీప్రియ -
విరజా నది
శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా భద్రాద్రి మీద కొలువై ఉంటాడు. నిజానికి వైకుంఠమే కొద్ది పాటి మార్పులతో భద్రాచల శిఖరం అయింది అంటాడు భక్తాగ్రేసరుడు భద్రాచల రామదాసు. అలాగే దక్షిణాది వైష్ణవులు శ్రీరంగ మహా క్షేత్రాన్ని వైకుంఠ ధామంగా భావిస్తారు. వాళ్లకు కావేరీ నదే విరజానది. ఆ విరజానదే ఈ కావేరి, శ్రీరంగనాథ ఆలయమే వైకుంఠం. శ్రీహరి విరజా తీరంలో, దివ్య భోగాలతో ఇందిరా సహితుడిగా ఎలా శోభిల్లుతుంటాడో, అచ్చం అలాగే కావేరీ తీరంలో శ్రీరంగధాముడై సౌఖ్య శ్రీలతో చెన్నారుతుంటాడు, అంటుంది శ్రీరంగ మహాత్మ్య కావ్యం. విరజ అనే పౌరాణిక నాయిక బ్రహ్మకైవర్త పురాణంలో కనిపిస్తుంది. ఈమె అతిలోక సౌందర్యవతి. రాధాకృష్ణులు నివసించే గోలోకంలోనే ఈమె నివాసం కూడా. ఈమె కూడా తన మధుర భక్తితో రాధా వల్లభు డిని వలచి, వలపించుకొన్న ధన్యురాలు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు విరజా దేవితో విహరిస్తుండగా, రాధాదేవి కంటబడతాడు. రాధాదేవి కోపించి, విరజను నదిగా మారిపొమ్మని శపిస్తుంది. నదీ రూపం పొందినా, విరజ వైకుంఠాన్ని తన తీరంలో కలుపుకొని, వైకుంఠుడయిన నారాయణుడితో సాన్ని హిత్యాన్ని కొనసాగిస్తూ ఆయనను సేవిస్తూనే ఉంది. విరజకు శ్రీహరి ద్వారా ఏడుగురు పుత్రులు కలిగారు. కానీ ఆ బిడ్డల ఆలనా, పాలనా, పోషణ తనను శ్రీకృష్ణ సాంగత్యానికి దూరం చేస్తున్నాయన్న వేదనతో, ఆమె తన సంతానాన్నే సప్త సముద్రాలుగా మార్చి వేసిందట. ‘అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు. అమా యకులైన పిల్లలనెందుకమ్మా అలా శపించావు?’ అని ప్రశ్నించాడట వైకుంఠంలో శ్రీహరి ఆంతరంగిక సేవ కులలో ఒకడైన సుదాముడు. దాంతో, విరజ ఆయన మీద కూడా కోపించి ‘నువ్వు రాక్షసుడిగా పుడతావు!’ అని శపించిందట. ఫలితంగా సుదాముడే శంఖ చూడుడనే రాక్షసుడిగా పుట్టాడు. పురాణ కథలు ప్రతీకాత్మకమైన పాత్రల ద్వారా, కథల ద్వారా ధర్మాన్ని, సన్మార్గాన్నీ బోధించుతాయి. ఈ కోణం నుంచి చూస్తే విరజా నది అంటే రజం లేనిది. రజం అంటే దుమ్మూ, ధూళీ, మాలిన్యం, కాలుష్యం. కాలుష్యం లేని పరిశుద్ధమైన, పావనమైన నది విరజా నది. కల్మషమూ, కాలుష్యమూ లేని శుద్ధ త్వాన్నీ, పవిత్రతనూ భగవంతుడైన శ్రీహరి అభిమా నిస్తాడు. కనుక ఆయన నివాసం విరజా నదీ తీరంలో. కల్మషం లేని, పరిశుద్ధతగల విరజమైన పరిసరాల లోనూ, అంతఃకరణాలలోనూ భగవంతుడు నెలవై ఉంటాడు. – ఎం. మారుతిశాస్త్రి