
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీస్వామి వారు మురళి చేతబట్టి శ్రీకృష్ణుడి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం.. పొన్న వాహన సేవలో తిరు మాడ వీధుల్లో ఊరేగారు.
ఆచార్యులు తిరు మాడ వీధుల్లో స్వామిని ఊరేగించి, పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపంలో అధిష్టించి అలంకార సేవల విశిష్టతలను వివరించారు. సాయంత్రం ఆలయ మాడ వీధిలో వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.