Yadadri Temple
-
యాదాద్రిలో రీల్స్.. స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఇటీవల చేసిన ఫొటోషూట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(అక్టోబర్ 25) కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుడి లోపల తాను ఫోటోషూట్ చేయలేదని చెప్పారు. యాదాద్రి దేవాలయ అద్భుత నిర్మాణం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందుకే తాను ఫొటో షూట్ చేశానన్నారు. తాను లక్ష్మీనరసింహస్వామికి పెద్ద భక్తుడినని, ఆలయ ఈవో, పోలీసుల అనుమతి తీసుకునే ఫొటోషూట్ చేశానని కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తన భార్య,కూతురితో కలిసి యాదాద్రి గుడిలో రీల్స్ షూట్ చేశారు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆలయ ఈవో కౌశిక్‌రెడ్డిపై యాదాద్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తాను ఈవో అనుమతితోనే వీడియోలు షూట్ చేశానని కౌశిక్‌రెడ్డి చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత.. హైకోర్టులో కేఏ పాల్ వాదనలు -
ఆధ్యాత్మికతకు నెలవు
మహా దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి.. చెంతనే తిరుమలను పోలిన స్వర్ణగిరి.. దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ ఆలయాలకు నిత్యం వేలాదిగా వస్తున్న భక్తులతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. వీటితో పాటు భువనగిరి ఎల్లమ్మ టెంపుల్, మత్స్యగిరి, ఇతర ప్రధానాలయాలకూ భక్తులు పోటెత్తుతున్నారు. సాక్షి, యాదాద్రి: జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. యాదాద్రి, స్వర్ణగిరి క్షేత్రాలకు నిత్యం పోటెత్తుతున్న భక్తులతో పులకించిపోతుంది. ముఖ్యంగా శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన స్వర్ణగిరి క్షేత్రం తిరుపతిని పోలి ఉండడంతో అనతికాలంలో విశేష ప్రాచుర్యం పొందింది. యాదాద్రికి వచ్చిన భక్తులంతా స్వర్ణగిరిని చూడనిదే వెనుదిరగడం లేదు. వెరసి స్వల్పకాలంలోనే ఈ ప్రాంతం పర్యాటకంగా, వ్యాపారపరంగా వృద్ధి చెందింది. స్వయం ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడినట్లు స్థానికులు చెబుతున్నారు.యాదాద్రి టు స్వర్ణగిరిపునర్నిర్మాణంతో యాదాద్రి ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో రోజూ 5 వేల మందికి మించి భక్తులు వచ్చేవారు కాదు. ప్రస్తుతం నిత్యం 25 వేలకు పైగా భక్తులు దైవ దర్శనం చేసుకుంటున్నారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి సైతం భక్తులు రావడం విశేషం. యాదాద్రికి వస్తున్న భక్తులు.. తప్పనిసరిగా స్వర్ణగిరిని దర్శించుకుంటున్నారు. తిరుమల తిరుపతి ఆలయాన్ని పోలిన విధంగా స్వర్ణగిరి క్షేత్రం రూపుదిద్దుకుంది. ఈ ఆలయాన్ని భువనగిరి శివారులో యాదాద్రికి వెళ్లే మార్గం మానేపల్లి హిల్స్‌లో నిర్మించారు. అద్భుత శిల్పకళతో నిర్మితమైన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరిగి 100 రోజులు గడిచింది. ఇప్పటి వరకు 35 లక్షల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్షేత్రాల కారణంగా సమీపంలో ఉన్న ఎల్లమ టెంపుల్, వలిగొండ మండలంలోని మత్స్యగిరికి సైతం భక్తుల తాకిడి పెరిగింది.వసతులకు పెద్దపీటదేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిఽధిలో గల యాదాద్రి దేవస్థానంలో భక్తుల వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు పర్యవేక్షణలో అఽధికారులు, ఉద్యోగులు నిత్య సేవలు అందిస్తున్నారు. ఇక స్వర్ణగిరి క్షేత్రంలోనూ భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త మానేపల్లి రామారావు, కుటుంబ సభ్యులు.. క్షేత్రంలో వసతులను పర్యవేక్షిస్తున్నారు. వసతులు ఇంకా పెంచాలని భక్తులు కోరుతున్నారు.మెరుగుపడిన ఉపాధి అవకాశాలుయాదాద్రి, స్వర్ణగిరి క్షేత్రాలకు నిత్యం వేలాదిగా భక్తులు వస్తుండడంతో యాదాద్రి, భువనగిరి ప్రాంతాలు పర్యాటకంగా, వ్యాపారపరంగా మరింత వృద్ధి చెందుతున్నాయి. తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగు పడుతున్నాయి. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. రోజంతా గిరాకీ ఉంటుందని వాహనదారులు అంటున్నారు. దీంతో పాటు హోటల్ వ్యాపారం పెరిగింది. రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్లు మొదలుకొని పెద్ద హోటళ్ల వరకు గిరాకీ పెరిగింది. అలాగే భక్తికి సంబంధించిన సామగ్రి దుకాణాలు వెలుస్తున్నాయి. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. -
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
-
యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..
-
యాదాద్రిలో ఘనంగా జరుగుతున్న అమ్మవారి పూజలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను కొలిచిన ఆచార్యులు.. ప్రధానాలయంలోని ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలలో శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటితో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు. అమ్మవారి సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు అంతకుముందు హోమం నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు గజివెల్లి రఘు, దొమ్మాట సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా ఊంజలి సేవ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. -
ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన సమయంలో దక్షిణ రాజగోపురంపై ప్రతిష్టించిన బంగారు కలశాల్లో ఒకటి ఊడిపోయి కింద పడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై స్థానిక భక్తులు, పలువురు అధికారులు తెలిపిన వివరాలివి. యాదాద్రి ఆలయ దక్షిణ రాజగోపురంపై బిగించిన బంగారు కలశాల్లో ఒకటి మంగళవారం సాయంత్రం సమయంలో కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన ఆలయాధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. దక్షిణ రాజగోపురంపై బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం శిల్పులు తిరిగి బిగించారు. దీనిపై ఆలయ డీఈవో దోర్భల భాస్కర్‌శర్మను ప్రస్తావించగా.. గోపురంపై కలశాలు బిగించేటప్పుడు కింద పడకుండా చెక్కలను ఏర్పాటు చేశారని తెలిపారు. అవి వదులైపోవడంతో పాటు కోతులు వాటిపైకి ఎక్కి ఆడటంతో ఊడిపోయాయని పేర్కొన్నారు. వెంటనే గోపురం వద్ద పూజలు జరిపించి, శిల్పులతో బిగించామని వెల్లడించారు. -
యాదాద్రి దేవాలయంలో చాలా మార్పులు చేశాం...!
-
ఎంతమంది భక్తులు వచ్చినా దర్శనం చేసుకునేలా సిద్ధం చేశాం
-
యాదాద్రి దేవాలయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి
-
నరసింహ స్వామి యాళి స్తంభం ప్రాముఖ్యత..!
-
కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైంది..!
-
దేవుడే నాతో ఉండి కట్టించాడనిపించింది..!
-
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గురించి ఇది తెలుసా..?
-
స్వామి దశావతారం గురించి యాదాద్రి ఆర్ట్ డైరెక్టర్..!
-
యాదాద్రి ఆలయ విగ్రహాల గురించి ఆనంద్ సాయి మాటలో..!
-
లక్ష్మీ నరసింహ స్వామి మహిమ తెలుసుకుందామా..!
-
యాదాద్రి దేవాలయం గురించి వివరించిన ఆర్ట్ డైరెక్టర్
-
యాదాద్రిలో నిబంధనలకు తిలోదకాలు
నల్గొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిబంధనలకు అధికారులే తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి కొండపై ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనాలు ఉత్తర రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. టికెట్ ఉన్న వారినే ర్యాంప్ పైనుంచి బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. కానీ, ఆలయంలో విధులు నిర్వహించే ఓ అధికారి తనకు తెలిసిన వ్యక్తులు బుధవారం బ్రేక్ దర్శనం సమయంలో వచ్చారు. దీంతో అధికారి వద్ద పని చేసే సిబ్బంది వారిని నేరుగా లిఫ్టు మార్గంలో ప్రధానాలయానికి చేరుకొని, పశ్చిమ రాజగోపురం నుంచి నేరుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీనిని చూసిన భక్తులు కొందరు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ దర్శనం కొనుగోలు చేసే భక్తులు ఉత్తర రాజగోపురం నుంచి పోలీసులు తనిఖీలు చేసిన తరువాతనే ఆలయంలోకి పంపిస్తున్నారు. కానీ, అధికారికి తెలిసిన వారు వస్తే నేరుగా ఎగ్జిట్ నుంచి దారి నుంచి పంపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులను అడిగితే.. ఓ ఏఈవో అధికారికి తెలిసిన వ్యక్తులు కాబట్టి, ఆయన దగ్గర పని చేసే సిబ్బంది పశ్చిమ గోపురం నుంచి తీసుకెళ్లారని సమాధానం ఇచ్చారు. దీనిని చూసిన ఇతర సిబ్బంది భక్తులను బ్రేక్ దర్శనం సమయంలో పశ్చిమ రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్లారు. -
యాదాద్రీశా.. ఇదేమిగోస!.. భక్తుల విలవిల
సాక్షి, యాదాద్రి: వందల కోట్లతో పునర్నిర్మాణం చేసిన యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులకు ఇంకా కనీస స్థాయి వసతులు సమకూరకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. గడిచిన వారం రోజులుగా పగటి పూట ఎండ తీవ్రతకు కొండపైన భక్తులు విలవిలలాడుతున్నారు. 43 డిగ్రీలు దాటుతున్న ఎండ ధాటికి కృష్ణ శిలలతో నిర్మించిన ప్రధానాలయం, దాని పరిసరాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధానాలయంలో సెంట్రల్ ఏసీలో శ్రీస్వామి దర్శనం చేసుకుని బయటకు వచి్చన భక్తులకు ఎండ వేడిమితో పట్టపగలే చుక్కలు కని్పస్తున్నాయి. ప్రసాదాల కొనుగోలుకు, శివాలయానికి వెళ్లడానికి, కొండపైన బస్టాండ్‌కు వెళ్లడానికి కాలినడకన వెళ్లాల్సిన ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. స్వామి దర్శనం కోసం చెప్పులు లేకుండా వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో పాదాలు కాలుతుండడంతో పరుగులు తీçస్తున్నారు. పిల్లలతో వచి్చన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వృద్ధులు కాళ్లకు సాక్స్ మాదిరిగా టవల్స్ చుట్టుకుని నడుస్తున్నారు. కూలింగ్ పెయింట్‌తోనే సరి భక్తులకు కనీస వసతులు కలి్పంచాల్సిన దేవస్థానం చేతులెత్తేసింది. చలువ పందిళ్లు, జూట్ మ్యాట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. కేవలం కొంత ప్రాంతంలో వైట్ కూలింగ్ పేయింట్ వేసి చేతులు దులుపుకుంది. వేసిన కొన్ని జ్యూట్ మ్యాట్లపై వాటిపై క్రమం తప్పకుండా నీళ్లు చల్లడంలేదు. మంచినీటి నల్లాల వద్ద ఎలాంటి నీడ లేకపోవడంతో వాటి నుంచి చల్లని నీటికి బదులు వేడి నీరు వస్తోంది. దీంతో కొండపైన నీటి వ్యాపారం జోరందుకుంది. వ్యాపారులు రూ.20 ఉన్న కూల్ వాటర్ బాటిల్ రూ.30కి విక్రయిస్తున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు -
చిన్న వానే.. యాదాద్రి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయ మండపాల స్లాబ్‌పై నీళ్లు నిలిచాయి. దీంతో అష్టభుజి ప్రాకార మండపం, బ్రహ్మోత్సవ మండపం, వేంచేపు మండపం, ప్రధానాలయ ముఖమండపంలోని అండాళ్ అమ్మవారి ఆలయం వెనుకున్న గోడ, ఆంజనేయస్వామి ఆలయం వెనక భాగాల్లోని గోడ నుంచి వర్షపు నీరు కారుతోంది. గతంలో వర్షం కురిసిన సమయాల్లో లీకేజీలు ఏర్పడ్డ చోట మరమ్మతులు చేపట్టినా లీకేజీలు అవుతున్నాయి. ఇక మాడ వీధుల్లో అక్కడక్కడా వర్షపు నీరు నిలిచింది. క్యూకాంప్లెక్స్ మూడో అంతస్తులో స్లాబ్ బీమ్ నుంచి వర్షపు నీరు చుక్కలుగా పడుతున్నాయి. కొండపైన ప్రొటోకాల్ కార్యాలయం నుంచి ప్రధానాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న మట్టి రోడ్డు సైతం కోతకు గురైంది. ఇది కూడా చదవండి: కొత్త భవనంలోకి సచివాలయ శాఖల షిఫ్టింగ్.. కేసీఆర్ ఆఫీస్ ఏ ఫ్లోర్లో ఉంటుందంటే? -
యాదాద్రిలో వైభవంగా శ్రీచక్ర తీర్థం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో నిత్య పూజలను నిర్వహించిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించాక విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. -
నృసింహస్వామి పెండ్లికొడుకాయెనే..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉదయం ప్రధానాలయ మాఢ వీధుల్లో శ్రీస్వామివారు జగన్మోహిని అలంకార సేవలో..సాయంత్రం అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై అమ్మవారిని ఆలయ మాఢవీధిలో ఊరేగించారు. గజవాహనంపై కల్యాణోత్సవానికి... శ్రీనృసింహస్వామికి లక్ష్మీదేవితో వివాహం చేసేందుకు మూహుర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి తుల లగ్నం ముహుర్తంలో 9.30గంటలకు బ్రహ్మోత్సవ మండపంలో శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీస్వా మి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
శ్రీకృష్ణుడి అలంకార సేవలో శ్రీలక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీస్వామి వారు మురళి చేతబట్టి శ్రీకృష్ణుడి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం.. పొన్న వాహన సేవలో తిరు మాడ వీధుల్లో ఊరేగారు. ఆచార్యులు తిరు మాడ వీధుల్లో స్వామిని ఊరేగించి, పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపంలో అధిష్టించి అలంకార సేవల విశిష్టతలను వివరించారు. సాయంత్రం ఆలయ మాడ వీధిలో వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
యాదాద్రిలో వైభవంగా సాంస్కృతికోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7గంటలకు సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. తూర్పు రాజగోపురం వద్ద ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో 100 మంది కళాకారులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. అనంతరం టి.కే.సిస్టర్స్ కర్నాటక గాత్ర కచేరీ నిర్వహించారు. శ్రీసాయి బృందం మోర్సింగ్ వాయిద్య కచేరి భక్తులను ఆకట్టుకుంది. వేడుకల్లో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
మత్స్యావతారంలో యాదగిరీశుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం అలంకార సేవలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం నిత్య పూజలు, నిత్య పూర్ణాహుతి, ఆరాధనలు పూర్తయ్యాక.. 9గంటలకు మత్స్యావతార అలంకారంలో సేవోత్సవం నిర్వహించారు. ప్రధానాలయం తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపం వద్ద శ్రీస్వామి వారి మత్స్యావతార సేవను ప్రారంభించారు. రాత్రి ఆలయంలో నిత్యారాధనలు ముగిశాక 7గంటలకు శేష వాహనంపై శ్రీనారసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మత్సా్యవతార, శేష వాహన సేవల విశిష్టతను ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు భక్తులకు వివరించారు. -
వైభవంగా యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం స్వస్తివాచనంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచారాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు మార్చి 3 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధానాలయాన్ని పూల మాలికలు, విద్యుత్ దీపాలతో అలంకరించడంతో బంగారు వర్ణంలో శోభాయమానంగా ఆకట్టుకుంటోంది. 0గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరాధన, ఉపాచారాల అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం నిర్వహించారు. విష్వక్సేనుడు సమస్త సేవా నాయకులకు అధిపతి. అంటే.. సర్వసైనాధ్యక్షుడు కావడంతో ఈయనను ఈ ఉత్సవాలకు ఉద్యుక్తున్ని చేయడమే ఈ పూజ ప్రత్యేకత. అలాగే ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి మంత్రోచ్ఛారణల మధ్య వాటికి ప్రత్యేక పూజలు చేశారు. రక్షాబంధనం ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్షను తీసుకోవడమే రక్షాబంధనం. గర్భాలయంలో స్వామివారి వద్ద కంకణాలకు పూజ చేసి ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం అర్చకులు.. చైర్మన్ బి.నర్సింహమూర్తి, దేవస్థానం ఈఓ గీతారెడ్డిలకు రక్షాబంధనం చేశారు. అంకురార్పణ సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పోచంపల్లి పట్టు ధోవతి, కండువా, చీర సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు అగ్ని పరీక్ష, ధ్వజారోహణం, రాత్రి 7.30 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం, హవనము జరుగుతాయి. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలో విశ్వక్సేన ఆరాధనతో ఆచార్యులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆరు సంవత్సరాల పాటు బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఉద్ఘాటన తర్వాత తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో కొండపై శ్రీస్వామి సన్నిధిలో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలిరానున్నారు. విదేశీ భక్తులు సైతం వచ్చే అవకాశం ఉంది. ఆర్జిత సేవలు రద్దు: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో నిర్వహించే నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, బాలభోగం, అభిషేకం, అర్చనలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రూ.1.50 కోట్ల బడ్జెట్ ప్రధానాలయం ఉద్ఘాటన అనంతరం జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.రూ.1.50 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఉత్తర మాడ వీధిలో కల్యాణం 28వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణాన్ని ప్రధానాలయం ఉత్తర మాడ వీధిలో నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వానపత్రికలో పేర్కొన్నారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని సూచించారు. 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ షెడ్యూల్.. ►21వ తేదీ ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం. ►22న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. ►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం. 9 గంటలకు మత్సా్యవతార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ. ►24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి, రాత్రి 7గంటలకు హంస వాహన సేవలు. ►25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకారం (మురళీ కృష్ణుడి) సేవ, రాత్రి 7 గంటలకు పొన్నవాహన సేవ. ►26న ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి, రాత్రి 7 గంటలకు సింహవాహన సేవలు. ►27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలు, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం. ►28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం ►మార్చి 1న ఉదయం 9 గంటలకు మహా విష్ణు అలంకార గరుడ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం. ►2వ తేదీ ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం. ►3వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం -
21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలకు ఆలయ ఆచార్యులతో అధికారులు సోమవారం పూజలు చేయించారు. బ్రహ్మోత్సవాలలో జరిగే పూజా కార్యక్రమాలు ఇవీ.. ►21వ తేదీ ఉదయం 10గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన జరిపిస్తారు. ►22న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. ►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకా రం చుడతారు. ఉదయం 9గంటలకు మత్సా్యవతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7గంటలకు శేష వాహన సేవ ఉంటుంది. ►24న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7గంటలకు హంస వాహన సేవ. ►25న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ. రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ. ►26న ఉదయం 9గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7గంటలకు సింహ వాహన సేవ. ►27న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకా ర సేవ. రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవ, అ నంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం. ►28న ఉదయం 9గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం. ►మార్చి 1వ తేదీన ఉదయం 9గంటలకు గరుడ వాహన సేవ. రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం. ►2వ తేదీన ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన. ►3వ తేదీన ఉదయం 10గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి. ఉత్తర మాడవీధిలో కల్యాణం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో తిరు కల్యాణ వేడుకను నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వాన పత్రికలో తెలియజేశారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని అధికారులు కోరుతున్నారు. కల్యాణానికి సీఎం వచ్చే అవకాశం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 28వ తేదీన రాత్రి శ్రీ స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం జరగనుంది. ఈ కల్యాణ వేడుకకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆ రోజు ఉదయం సీఎం కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆలయ అధికారులు, అర్చకులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారు. -
యాదాద్రిలో మెట్ల నృత్యోత్సవం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని భావనాలయ నాట్యాచార్యుడు డాక్టర్ వట్టికోట యాదగిరిచార్యులు, ఆయన శిష్య బృందం ఆదివారం మెట్ల నృత్యోత్సవం నిర్వహించాయి. మొదట శ్రీస్వామి వారి వైకుంఠద్వారం వద్ద మెట్ల పూజను నిర్వహించారు. అనంతరం మెట్లపై నృత్యం చేస్తూ కొండపైకి వెళ్లారు. కొండపైన తూర్పు రాజగోపురం వద్ద కుంభ నీరాజనంతో కార్యక్రమాన్ని ముగించారు. యాదాద్రి వైభవాన్ని నలు దిశలా చాటేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వట్టికోట యాదగిరిచార్యులు స్పష్టం చేశారు. -
యాదాద్రీశుడి సేవలో గవర్నర్ తమిళిసై
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆమెకు ఆలయ తూర్పు త్రితల రాజగోపురం వద్ద ఆచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూప్రసాదాన్ని దేవస్థానం ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు గవర్నర్‌కు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి పట్టువస్త్రాలు అందజేశారు. గవర్నర్ రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ ఉన్న సమయంలో భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. అంతకుముందు కొండపైన వీఐపీ గెస్ట్‌హౌస్ వద్ద గవర్నర్ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. విలేకరులు మాట్లాడించేందుకు ప్రయత్నించగా అందరూ సంతోషంగా ఉండాలని అన్నారు. -
ఘనంగా నృసింహుడి ఎదుర్కోలు
యాదగిరిగుట్ట: పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్లకు గురువారం ఉదయం సింహ వాహనసేవ, రాత్రి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో ఉదయం హవన పూజలు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్టానాలు, పారాయణికులతో వేద పారాయణాలు జరిపించిన అనంతరం శ్రీస్వామి, అమ్మవార్లను సింహవాహనం సేవపై తిరువీధుల్లో ఊరేగించారు. సాయంత్రం జరిగిన ఉత్సవంలో శ్రీస్వామి వారిని అశ్వవాహనంపై మేళతాళాలతో ఊరేగించి ఆలయ ముఖ మండపంలో ఎదుర్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్ల తిరు కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. -
యాదాద్రిలో ఘనంగా రథసప్తమి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రథసప్తమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీస్వామి, అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణ రథంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. యాదాద్రి క్షేత్రంలో రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహన సేవను నిర్వహించడం ఇదే తొలిసారి. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో రథసప్తమి వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మొదటిసారిగా రథసప్తమి వేడుకలకు సిద్ధమైంది. ప్రధానా లయం పునఃప్రారంభమైన తర్వాత.. శనివారం రథ సప్తమి రోజు శ్రీస్వామి వారిని ఉదయం సూర్యప్రభ వాహనంలో భక్తుల మధ్య ఊరేగించనున్నట్లు ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. తొలిసారి నిర్వహిస్తున్న రథ సప్తమి వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. -
యాదగిరీశుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
యాదగిరిగుట్ట: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సంతోష్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆచార్యులు జస్టిస్ సంతోష్‌రెడ్డికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ట అలంకార మూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జస్టిస్ సంతోష్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రిలో హైకోర్టు జడ్జి మాధవిదేవి
యాదగిరిగుట్ట: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవిదేవి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆమె గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను దర్శించుకున్నారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన తదితర పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జస్టిస్ మాధవిదేవికి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రిలో సీఎంలు..
-
బీఆర్ఎస్ సభ: 2024లో మోదీ ఇంటికి.. మేము ఢిల్లీకి: కేసీఆర్
Upadates: Time 5.45 PM చివరగా అథితులుగా వచ్చిన సీఎంలు, నేతలకు ఘన సత్కారంతో సభను ముగించారు. Time 5. 40 PM దేశంలో ప్రబలమైన మార్పునకు ఖమ్మం బీఆర్ఎస్ భేరి ఒక సంకేతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు. 589 గ్రామాలకు రూ. 10లక్షల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మధిర, వైర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు ప్రకటించారు. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా?. దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. విదేశీ సాయం అవసరం లేనంత వనరులు దేశంలోనే ఉన్నాయి. లక్ష కోట్ల ఆస్తి మన దేశం సొత్తు. దేశంలో 83 కోట్ల సాగు అనుకూల భూములున్నాయి. కానీ, ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండాలి?. ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇంకా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు అవసరమా?. అన్ని సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఫర్వాలేదు.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ వాటిని వెనక్కి తీసుకువస్తాము. అగ్నిపథ్‌కు కూడా రద్దు చేస్తాము. ఎల్ఐసీని ప్రభుత్వపరం చేస్తాము. రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ది నేషనలైజేషన్. తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ అందిస్తాము. Time 5.20 PM కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యకమం అంటూ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కంటి వెలుగు పథకం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. ఢిల్లీలో ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్స్ ఉన్నాయి. అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్.. కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే గవర్నర్ తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అభివృద్దికి అడ్డుపడటమే గవర్నర్ల పని అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. Time 4.41 PM భారతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారు. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ అన్న మోదీ.. ఇప్పుడు ఎవరితో ఉన్నారు?. మోదీ పేదవాళ్లను వదిలేసి.. కార్పొరేటర్లతో తిరుగుతున్నారు. అలాగే.. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ఫెడరల్ స్ఫూర్తి అంటే అని కేంద్రానికి ఏకిపడేశారు. చివరికి.. వన్ నేషన్.. వన్ లీడర్.. వన్ పార్టీ అనే రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్న రాజా.. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని డి. రాజా పేర్కొన్నారు. Time 4.02 PM దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇవాళ్టితో ఇంకా 399 రోజులే మిగిలి ఉన్నాయి. కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతుల్ని ఆదుకుంటామన్నారు.. మాట తప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.. చేతులెత్తేశారు. తెలంగాణలో మాదిరే యూపీలోనూ బీజేపీ ప్రక్షాళన జరుగుతుందని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. Time 3.56 PM దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుంది అని కేరళ సీఎం ప్రకటించారు. Time: 3.35 PM సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, అఖిలేష్ యాదవ్, డి. రాజా ఉన్నారు. Time: 2.30 PM ►రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జాతీయ నేతలు, సీఎంల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. Time: 02.00PM ►యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత చాంబర్లో కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. అనంతరం కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జాతీయ నేతల చేతులమీదుగా కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు. Time: 12.30PM సీఎం కేసీఆర్‌తో కలిసి ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణ శిలలలో నిర్మించిన ఆలయాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆలయాన్ని ఆధునీకరించిన విధానం, ఆలయ విశిష్ఠతలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. తరువాత ఆలయ అర్చకులు ముఖ్యమంత్రులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. Time: 11.30AM ► తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర జాతీయ నేతలు యాదాద్రి చేరుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు .లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం తర్వాత ఖమ్మం సభకు నేతలు వెళ్లనున్నారు. అయితే కేరళ సీఎం పినరయి విజయన్, సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా దైవ దర్శనానికి వెళ్లలేదు. గెస్ట్‌హౌజ్‌లోనే ఉండిపోయారు. సాక్షి, ఖమ్మం: చారిత్రక సభకు ఆతిథ్యమిచ్చేందుకు ఖమ్మం సిద్ధమైంది. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుండడంతో సభావేదిక, చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా నగరమంతా గులాబీ నగిషీలు తొడుక్కుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సారథ్యాన ఏర్పాట్లు పూర్తి కాగా, మరోపక్క నూతన కలెక్టరేట్ సముదాయం పుష్పగుచ్ఛంలా ముస్తాబైంది. ముఖ్యఅతిథులు తొలుత కలెక్టరేట్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కంటివెలుగును ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కళాశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించాక ఆవిర్భావ సభకు హాజరవుతారు. జాతరలా తరలివచ్చేలా.. బీఆర్ఎస్ తొలి సభ ఖమ్మంలో ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి పార్టీ యంత్రాంగం జన సమీకరణకు సర్వశక్తులొడ్డుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఆరుగురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 18 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తొలి సభ కావడం, నాలుగు రాష్టాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు వస్తుండడంతో విజయవంతాన్ని ఈ బృందం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభావేదిక ప్రత్యేకతలు.. సభా ప్రాంగణం : 100 ఎకరాలు వేదిక : జర్మనీ టెక్నాలజీ వాటర్, ఫైర్ రూఫ్ (గులాబీరంగు) హాజరయ్యే జనం (అంచనా : 5 లక్షలు ప్రాంగణంలో కుర్చీలు : లక్ష వేదికపై కూర్చునేది : సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్‌సింగ్‌మాన్, మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సీపీఎం, పీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు సభావేదిక ముందు: ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య అతిథులు అధ్యక్షత : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించేది: సీఎంలు పినరయ్ విజయన్, భగవంత్ సింగ్మాన్, కేజ్రీవాల్,అఖిలేష్ యాదవ్, డి.రాజా, చివరన సీఎం కేసీఆర్ సభా సమయం : మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు. సీఎంల పర్యటన షెడ్యూల్ ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు బీఆర్ఎస్ తొలి సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఖమ్మం రానున్నారు. వీరి పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ► సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ► సీఎం కేసీఆర్‌తో కలిసి బుధవారం ఉదయం 10.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరి 10.35 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుంటారు. అక్కడ 10.40గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాక 11.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ► ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌తోపాటు కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ► మధ్యాహ్నం 2.25 గంటలకు కలెక్టరేట్ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బీఆర్ఎస్ సభాస్థలి వద్దకు చేరుకుంటారు. ► ఈ సభలో తొలుత ముందుగా సీఎం పినరయి విజయన్ మాట్లాడగానే హెలీకాప్టర్‌లో విజయవాడ బయలుదేరతారు. ఆ తర్వాత మిగతా అతిథులు ప్రసంగిస్తారు. సభ ముగిశాక కేజ్రీవాల్, భగవంత్ మాన్ సాయంత్రం 5 గంటలకు, ఆతర్వాత అఖిలేష్ యాదవ్ విజయవాడ వెళ్లి అక్కడి నుంచి విమానాల్లో వారి రాష్ట్రాలకు వెళ్తారు. ► సీఎం కేసీఆర్ కూడా ఖమ్మం నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరతారు. తొమ్మిది మంది సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు ఖమ్మం నగరాన్ని పోలీసులు గుప్పిట్లోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ తదితరులు వస్తున్నారు. వీరిలో కేజ్రీవాల్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండడంతో పంజాబ్, ఢిల్లీకి సంబంధించిన సీఎంల సెక్యూరిటీ వింగ్ అధికారులు చేరుకుని సభావేదిక, ప్రాంగణం, నూతన కలెక్టరేట్‌ను పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో నలుగురు సీఎంలు తొలిసారి ఒకే వేదికపైకి రానుండడంతో నిఘా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం 6నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. బందోబస్తు బాధ్యతలను తొమ్మిది మంది సీనియర్ ఐపీఎస్‌లు పర్యవేక్షిస్తుండగా, 5,210 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. కాగా, కలెక్టరేట్ నుంచి పది వాహనాలతో సభావేదిక వద్దకు కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టారు. అలాగే, పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌తో పాటు పోలీసు కమిషనరేట్‌లో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేశారు. నిఘా నీడలో ఖమ్మం! బీఆర్ఎస్ సభ సందర్భంగా నాలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతలే కాకుండా ఐదు లక్షల మంది మేర కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి నుంచి పోలీసు సిబ్బందికి విధులు కేటాయించగా వారంతా జిల్లాకు చేరుకున్నారు. వీరిలో డీఎస్పీ ఆపైస్థాయి అధికారులకు గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస ఏర్పాటు చేయగా మిగతా వారికి కళ్యాణమండపాలు, హాస్టళ్లలో వసతి కల్పించారు. అలాగే, నగరంలోని వాసవీ గార్డెన్స్, మంచికంటి భవన్, తనికెళ్ల, బైపాస్‌రోడ్లలోని ఫంక్షన్ హాళ్లలో మెస్‌లు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు 5,200మంది ఖమ్మంతోపాటు ఇతర జిల్లాలనుంచి సుమారు 5,210మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఇందులో ఏఎస్పీలు పది మంది, ఏసీపీలు 39, సీఐలు, ఆర్ఐలు 139మంది, ఎస్సైలు 409మంది, ఏఎస్సైలు 530మంది, కానిస్టేబుళ్లు 1,772మంది, మహిళా కానిస్టేబుళ్లు 169మంది, హోంగార్డులు 1,005 మందితో పాటు స్పెషల్ పార్టీలు, రోప్ పార్టీ సిబ్బంది ఉన్నారు. ఇక భారీగా జనం హాజరుకానుండడంతో పిక్ పాకెటర్లు, పాత నేరస్తులపై సీసీఎస్ పోలీసులు నిఘా వేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి 150మంది ఇంటిలెజెన్స్ సిబ్బంది చేరుకోగా, వీరిలో ఐజీ స్థాయి మొదలు ఉద్యోగులు ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి బహిరంగ సభకు వివిధ జిలాల్ల నుంచి కార్యకర్తలు హాజరుకానుండడంతో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించగా, అక్కడ వాహనాలు నిలిపి సభకు వెళ్లేలా సూచనలు చేశారు. అలాగే, వాహనాలు వచ్చివెళ్లే మార్గాలను కూడా ప్రకటించారు. రహదారులు, బ్రిడ్జిలపై వాహనాలు ఎక్కడైనా ఆగిపోతే వెంటనే పక్కకు తొలగించేలా బోయింగ్ వాహనాలు సిద్ధం చేశారు. ప్రారంభానికి ముస్తాబు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ – ఐడీఓసీ) ప్రారంభానికి ముస్తాబైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మూడు రాష్ట్రాల సీఎంలు కలెక్టరేట్‌తో పాటు ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగును బుధవారం ప్రారంభించనుండడంతో మంగళవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐడీఓసీ మొత్తాన్ని అందంగా పూలతో అలంకరించి లైట్లు అమర్చడంతో రాత్రివేళ జిగేల్మంటూ కనిపించింది. సీఎంలు, ఇతర ముఖ్యులు కలెక్టరేట్లోనే మధ్యాహ్న భోజనం చేయనుండడంతో మొదటి అంతస్తు స్టేట్ చాంబర్ పక్కనే ఉన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ) చాంబర్లో ఏర్పాట్లు చేశారు. -
గోదాదేవి కల్యాణంలో సీఎస్ శాంతికుమారి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి జరిగిన గోదాదేవి– శ్రీరంగనా«థుల కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గోదాదేవి– శ్రీరంగనాథులను అలంకరించి తిరువీధుల్లో ఆచార్యులు ఊరేగించగా.. సీఎస్ శాంతికుమారి దంపతులు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో ముందు నడిచారు. ఆలయ ముఖ మండపంలో జరిగిన కల్యాణ వేడుకను తిలకించారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి యాదాద్రి క్షేత్రానికి వచ్చిన శాంతికుమారికి ఆచార్యులు, ఈవో గీతారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ట అలంకార మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎస్ దంపతులకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. నరసింహ నామస్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు (ఫొటోలు)
-
యాదాద్రి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు మూడు గంటలు, వీఐపీ దర్శనానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 30వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్య ఆదాయం రూ.45,86,412 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
‘ముక్కోటి’కి యాదాద్రి ముస్తాబు
యాదగిరిగుట్ట: వైకుంఠ (ముక్కోటి) ఏకాదశికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు అనుబంధంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబయ్యాయి. సోమవారం యాదాద్రీశుడు వైకుంఠనాథుడిగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రధానాలయం ప్రారంభమయ్యాక తొలి సారిగా వస్తున్న వైకుంఠ ఏకాదశి కావడంతో ఇది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ప్రధానాలయం పనులు జరుగుతున్న సందర్భంగా బాలాలయంలో తూర్పు ద్వారం గుండానే భక్తులకు శ్రీస్వామి వారు దర్శనం ఇచ్చారు. ఈ సారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడంతో ఉత్తర రాజగోపురం నుంచి భక్తులకు వైకుంఠనాథుడి దర్శన భాగ్యం కల్పిస్తారు. ప్రధానాలయంలో.. వైకుంఠ ద్వార దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో రంగురంగుల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలు, విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరిపడా పులిహోర, లడ్డూ మహా ప్రసాదాలను సిద్ధం చేశారు. ప్రధానాలయంలో సోమవారం ఉదయం 6.48 గంటలకు శ్రీస్వామివారు వైకుంఠనాథుడిగా దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. పాతగుట్టలో.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ఉదయం 6.48 గంటలకు ఉత్తర ద్వారానికి శ్రీస్వామి వారిని వేంచేపు చేయించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అనంతరం శ్రీస్వామి వారిని ఆలయ ముఖ మండపంలో అధిష్టింపచేసి, క్యూలైన్లలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయమే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున్న ఉత్తరం వైపు భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం, ఆరాధన, తిరుప్పావై నిర్వహించి, అలంకార సేవను ఏర్పాటు చేస్తారు. ఉదయం 6.48 గంటల నుంచి 7 గంటల వరకు వైకుంఠద్వార దర్శనం, ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అలంకార దర్శనం కల్పిస్తారు. నేటి నుంచి అధ్యయనోత్సవాలు.. యాదాద్రీశుడి ఆలయంలో సోమవారం నుంచి ఈనెల 6వతేదీ వరకు ఐదు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలలో విశేష అలంకార సేవలు నిర్వహిస్తారు. ఐదురోజులపాటు లక్ష్మీ సమేతుడైన నారసింహుడు దశావతారాలతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక అలంకరణ సేవల్లో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అధ్యయనోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు భక్తులు నిర్వహించే మొక్కు, శాశ్వత బ్రహ్మోత్సవాలు, నిత్య, శాశ్వత కల్యాణోత్సవాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. -
Telangana: ‘న్యూఇయర్’ దర్శనాలకు యాదాద్రి సిద్ధం..
యాదగిరిగుట్ట: నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంతోపాటు పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. వేకువజామున 3 గంటలకే ఆలయాన్ని తెరవనున్నారు. వేకువజామున 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం మొదలు రాత్రి 9:45 గంటల నుంచి 10 గంటల వరకు శయనోత్సవం వరకు నిత్య పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ద్వారబంధనం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, 10 గంటల నుంచి 11:30 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరపనున్నారు. అనుబం«ధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం ఆదివారం ఉదయం 4:30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 8:45 గంటల వరకు భక్తులకు దర్శనాలు కలి్పంచనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఈవో గీతారెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రిలోని ఆలయ పరిసరాలు, క్యూలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేశాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదం.. ఆలయానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా లడ్డూ, పులిహోర ప్రసాదం సిద్ధం చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్లను ఉదయం 5 గంటలకే తెరిచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. స్వర్ణ తాపడం కోసం రూ. 33 కోట్ల నగదు,8 కిలోల బంగారం విరాళాలు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం ఇప్పటివరకు దాతల ద్వారా రూ. 33 కోట్ల నగదు, 8 కిలోల బంగారం వచి్చందని ఈవో గీతారెడ్డి తెలిపారు. ప్రధానాలయం ప్రారంభానికి ముందే సీఎం కేసీఆర్ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించారు. ఇందుకు దాతలు విరివిగా విరాళాలు ఇచ్చారు. మరింత బంగారం, నగదు విరాళం రూపంలో వస్తుందని చెప్పారు. ప్రస్తుతం విమాన గోపురానికి అవసరమైన పనులు జరుగుతున్నాయని, రెండు నెలల్లో ఈ పనులు పూర్తి కాగానే బంగారు తాపడం పనులు ప్రారంభిస్తామన్నారు. చదవండి: TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు -
నారసింహుడి సేవలో ముర్ము
సాక్షి, యాదాద్రి/ సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆమె ఉదయం 9.22 గంటలకు బొల్లారం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్‌లతో కలిసి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. వారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డు మార్గంలో కొండపైకి వెళారు. ఆలయంలో త్రితల రాజగోపురం వద్ద అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నారసింహుడికి ప్రత్యేక పూజలు, కేశవ నామార్చన చేశారు. తర్వాత ముఖ మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గవర్నర్ తమిళిసైలకు వేదాశీర్వచనం చేసి.. ప్రసాదాన్ని, పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి జ్ఞాపికను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రపతికి అందజేశారు. ఆలయం నుంచి బయటికి వచ్చాక ఉత్తర రాజగోపురం ముందు మంత్రులు, అధికారులు, అర్చకులు, దేవస్థానం సిబ్బందితో రాష్ట్రపతి ఫొటోలు దిగారు. కాగా.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు యాదాద్రి కొండపైకి అనుమతించలేదు. అమర సైనికుల కుటుంబాలతో భేటీ యాదాద్రి నుంచి వచ్చిన తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అమర సైనికుల కుటుంబాలను ముర్ము పరామర్శించారు. దేశం కోసం ప్రాణా లు అర్పించిన వీరులను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులతో కొంతసేపు మాట్లాడారు. వారిని సన్మానించి, బహుమతులు అందచేశారు. ప్రముఖులకు విందు రాష్ట్రంలో పర్యటన ముగుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో రాజకీయ ప్రముఖులకు ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరికొందరు మంత్రులు, ఎంపీలు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.లక్ష్మణ్, నామా నాగేశ్వర్రావు, దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు, జ్ఞాపికతో వీడ్కోలు హైదరాబాద్‌లో శీతాకాల విడిదిని ముగించుకున్న రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆమెకు గవర్నర్ తమిళిసై, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ నూతన పట్టువస్త్రాలు, జ్ఞాపిక, ఫలాలను రాష్ట్రపతికి అందచేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి కలిసి వెండి వీణను బహూకరించారు. -
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి (ఫొటోలు)
-
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి
సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించుకున్నారు. రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ద్రౌపది ముర్ము.. యాదాద్రి గర్భాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. యాదాద్రిలో భారీ ఏర్పాట్లు కాగా రాష్ట్రపతి యాదాద్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధానాలయాన్ని మామిడి, అరటి తోరణాలు, పూలతో అలంకరించారు. ఉత్తర రాజగోపురం గుండా రాష్ట్రపతి శ్రీస్వామివారి దర్శనానికి వెళ్లనుండడంతో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్‌కు కూల్ పేయింట్ వేశారు. రాష్ట్రపతి ఆలయానికి చేరుకొని తిరుగుపయనం అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసుల ఆధీనంలో యాదాద్రి రాష్ట్రపతి పర్యటన సందర్భంగా యాదాద్రి ప్రధానాలయంతో పాటు రింగ్ రోడ్డు, ఘాట్‌రోడ్డు, హెలిపాడ్లు ఏర్పాటు చేసిన యాగస్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో అడిషనల్ సీసీ సురేంద్రబాబు, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్లా నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట పట్టణ సీఐ సైదయ్య బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి వెంట ఎస్పీజీ, ఐబీ, క్యూఆర్టీ టీంలు రానున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రధానాలయంలో భక్తులతో నిర్వహించే పూజలను రద్దు చేసి స్వామివారికి చేపట్టే ఆర్జిత సేవలను అంతరంగికంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉదయం 9నుంచి 10 గంటల వరకు ఉన్న బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతనే భక్తులు శ్రీస్వామి దర్శనానికి రావాలని ఆలయ అధికారులు కోరారు. -
యాదాద్రిలో భక్తుల సందడి.. భారీగా క్యూ లైన్లు (ఫొటోలు)
-
యాదాద్రికి భక్తుల తాకిడి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, రింగ్ రోడ్డు ప్రాంతాలు కిటకిటలాడాయి. శ్రీస్వామి వారి ధర్మదర్శనానికి మూడున్నర గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని 40వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక వివిధ పూజలతో రూ.64,50,178 నిత్యాదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
కరోనా ఫోర్త్ వేవ్‌పై అప్రమత్తంగా ఉన్నాం
యాదగిరిగుట్ట: కరోనా ఫోర్త్ వేవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభూలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఫోర్త్ వేవ్‌కు సంబంధించి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఇప్పటికే పరీక్షలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో 100శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయిందని, హైబ్రిడ్ ఇమ్యూనిటీ కూడా వచ్చినట్లు వెల్లడించారు. -
యాదాద్రిలో హైకోర్టు జడ్జి పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు జడ్జి వెంకటేశ్వరరెడ్డి, కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వా గతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతి ష్టా అలంకార మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రథమ ప్రాకారంలో జరిపించిన శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం తదితర పూజల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. జడ్జికి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రికి పెద్ద ఎత్తున భక్తులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు ఏకాదశి కలసి రావడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి ధర్మదర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకుపైగా సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కాగా, వివిధ పూజల ద్వారా యాదాద్రి దేవస్థానానికి రూ.59,04,585 నిత్య ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
యాదాద్రి ఆలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
-
ఇక ఆన్లైన్లో యాదాద్రి బ్రేక్ దర్శనం టికెట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ఆన్లైన్లో బ్రేక్ దర్శనం టికెట్లను కొనుగోలు చేసేందుకు ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యాదాద్రీశుడి ఆలయంలో బ్రేక్ దర్శనాలకు రూ.300 టికెట్ కొనుగోలు చేసి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. http://yadadritemple.telangana.gov.in లో లాగిన్ కావాలని ఈవో6 సూచించారు. ఈ వెబ్సైట్లో ఉఈ్చటటజ్చిnకు వెళ్లి బ్రేక్ దర్శనం రూ.300 అన్న ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్లో రుసుము చెల్లించి టికెట్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఒక టికెట్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు. -
యాదాద్రి ఆదాయం @ రూ.1.16 కోట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో శ్రీస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చారు. దీంతో శ్రీస్వామివారికి రికార్డుస్థాయిలో నిత్యాదాయం సమకూరింది. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాదం విక్రయశాల వంటి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి 4 గంటలకుపైగా, వీఐపీ దర్శ నానికి రెండున్నర గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల కోసం భక్తులు బారులుదీరి కనిపించారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ప్రధా న బుకింగ్‌తో రూ.3,24,650, కైంకర్యాలు రూ. 16,100, సుప్రభాతం రూ.10,300, వ్రతాలు రూ.15,20,000, ప్రచార శాఖ రూ.2,87,500, వీఐపీ దర్శనం రూ.18,90,000, యాదరుషి నిలయం రూ.1,92,500, ప్రసాద విక్రయం రూ.44,37,150, పాతగుట్ట ఆలయం రూ.3,78,670, కల్యాణ కట్ట రూ.1,78,000, శాశ్వతపూజలు రూ.37,500, వాహన పూజలు రూ.31,200, కొండపైకి వాహనాల ప్రవేశం రూ.9,75,000, సువర్ణ పుష్పార్చన రూ.2,52, 348, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాల యం రూ.32,600, అన్నదానం రూ.55,659, బ్రేక్ దర్శనాలు రూ.9,75,000 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి వారి నిత్య ఆదాయం గత ఆదివారం రూ.1.09 కోట్లు రాగా, ఈ ఆదివారం అదనంగా రూ.6,31,531 ఆదాయం వచ్చింది. -
భక్త జన యాదాద్రి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణలోని నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వీఐపీ దర్శనం కోసం రూ.150 టికెట్ కొనుగోలు చేసిన భక్తులు తూర్పు రాజగోపురం నుంచి పడమటి రాజగోపురం వరకు క్యూకట్టారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు 2 గంటల సమయం పట్టింది. ఇక ధర్మదర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వీరికి 5 గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 50వేల మంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ప్రసాదం కొనుగోలు చేయడానికి భక్తులు అధికంగా ఆసక్తి చూపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు నిత్యాదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్క రోజే శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.1,09,82,446 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
గ్రహణంతో ఆలయాల మూసివేత
యాదగిరిగుట్ట/భద్రాచలం/బాసర (ముథోల్): చంద్ర గ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మంగళవారం మూతబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. యాదాద్రిలో తెల్లవారుజామున సుప్రభాత సేవలు సహా ఇతర పూజల అనంతరం ఉదయం 6:15 గంటల నుంచి 7:30 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం 8:15 గంటలకు ఆలయాన్ని మూసేసి తిరిగి చంద్రగహణం ముగిశాక రాత్రి 8 గంటలకు తెరిచారు. శుద్ధి, సంప్రోక్షణ, ఇతర పూజలు నిర్వహించారు. ఇక భద్రాచలంలో ఉదయం 7:30 గంటలకు ఆలయాన్ని మూసేసి రాత్రి 7:30 గంటలకు పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ, శాంతిహోమం నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి దర్శనాలు పునః ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. బాసరలోనూ ఉదయం పూజలు, నైవేద్య నివేదన అనంతరం అర్చకులు ద్వార బంధనం చేశారు. గ్రహణానంతరం రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేశారు. ఆలయాల్లో మంగళవారం రద్దు చేసిన ఆర్జిత సేవలు, దర్శనాలు బుధవారం ఉదయం నుంచి కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
యాదాద్రి ఆలయం బంద్
యాదగిరిగుట్ట: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మంగళవారం ఉదయం 8.15 నుంచి రాత్రి 8గంటలకు వరకు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉన్నందున ఆలయ వేళల్లో మార్పులు చేశారు. మంగళవారం వేకువజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, సుప్రభాతం తదితర సేవల అనంతరం 6.15 నుంచి 7.30 వరకు ఉభయ దర్శనాలు కల్పించనున్నారు. అనంతరం ద్వార బంధనం చేస్తారు. చంద్రగ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 8గంటలకు ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన, చాత్మర చేపట్టి, రాత్రి 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీస్వామి వారికి అన్నకూటోత్సవాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, స్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు సైతం ఉండవని వెల్లడించారు. ఈ పూజలన్నీ 9వ తేదీన యథావిధిగా కొనసాగుతాయన్నారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి కార్తీకమాసంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. ఆదివారం ఉదయమే కార్తీకమాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాలు, దీపారాధనలకు క్యూకట్టారు. అనంతరం కొండపైన స్వయంభూలను దర్శించుకునేందుకు వెళ్లారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మ దర్శనానికి 5 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఒక్కరోజే నిత్య ఆదాయం రికార్డుస్థాయిలో రూ.85,62,851 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, రద్దీ నేపథ్యంలో కొండపైకి, కిందికి బస్సులు ఆలస్యంగా నడవడంతో భక్తులు ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బ్రేక్ దర్శనాల కోసం భక్తులను నిలిపివేయడంతో కొండపైన, కొండ కింద భక్తులు క్యూలైన్లలో 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రసాద విక్రయ శాల వద్ద తోపులాట జరిగింది. -
యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 9కి బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొండపైన రిసెప్షన్ కార్యాలయంలో ఉద యం 8.30 నుంచే భక్తులు బ్రేక్ దర్శనం కోసం రూ.300 టిక్కెట్‌ను కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం నుంచి ఉత్తర ప్రథమ ప్రాకార మండపంలోకి చేరుకున్నారు. 9గంటల సమయంలో భక్తులను తూర్పు త్రితల రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతిచ్చారు. బ్రేక్ దర్శనాలతో రూ.87,600 ఆదాయం సమకూరింది. 8న ఆలయం మూసివేత నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఉదయం 8.15 నుంచి రాత్రి 8 వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. రాత్రి 8.గంటలకు ఆలయాన్ని తీసి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపడతారని వివరించారు. 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారన్నారు. కార్తీక పౌర్ణ మి సందర్భంగా స్వామి వారికి నిర్వహించే అన్నకూటోత్సవం లాంఛనంగా నిర్వహిస్తా మని తెలిపారు. కాగా చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రీశుడి ఆలయంలో భక్తులచే జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు రద్దు చేసినట్లు ఈఓ తెలిపారు. -
యాదాద్రికి కార్తీకం తాకిడి
యాదగిరిగుట్ట : కార్తీక మాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.150 టికెట్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 734 జంటలు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వ్రతాలు, నిత్య పూజల ద్వారా ఆదివారం ఒక్కరోజే రూ.52,17,063 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
31 నుంచి యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు, వీఐపీ, వీవీఐపీలకు తిరుపతి తరహాలో దర్శనాలు కల్పించేలా ఆలయ అధికా రులు చర్యలు చేపట్టారు. ఈ నెల 31 నుంచి బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నట్లు ఈవో గీతారెడ్డి శనివారం వెల్లడించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికీ టికెట్ ధర రూ.300గా నిర్ణయించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మొదటి దశలో 200, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగే బ్రేక్ దర్శనాలకు 200 టికెట్లు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలు చేసి ఆయా సమయాల్లో వచ్చిన భక్తులను ఉత్తర రాజగోపురం నుంచి శ్రీస్వామి వారి దర్శనాలకు పంపించనున్నారు. ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనాల నిలుపుదల.. బ్రేక్ దర్శనాలు ఉన్న ఆయా సమయాల్లో ధర్మదర్శ నాలు, ప్రత్యేక దర్శనాలను నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు తీసుకువచ్చే భక్తులు కొండపైన రిసెప్షన్ కార్యాలయం (పీఆర్వో)లో ఇచ్చి, అక్కడే రూ.300 టికెట్ కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం వద్దకు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. -
యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘రేపిస్టులకే దండలు వేసి ఊరేగించి బయటకు తీసుకువచ్చే వ్యవస్థ బీజేపీకి ఉంది. అలాంటప్పుడు ఆ పార్టీ నేతలు చేసే ప్రమాణాలు, ఇమానాలకు విలువేం ఉంటుంది. వీటితో సమస్యలు పరిష్కారమైతే కోర్టులు, చట్టాలు, పోలీసుస్టేషన్లు అక్కరలేదు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడిని తాకడం పాపం. యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరుతున్నా..’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. ‘బీజేపీకి ఓటు.. మునుగోడుకు చేటు’శీర్షికతో టీఆర్ఎస్ రూపొందించిన చార్జిషీట్‌ను శనివారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో, ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ 21 అంశాలతో ఈ చార్జిషీట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తడిబట్టలతో ప్రమాణం చేయడంపై, ఎమ్మెల్యేలకు ఎర అంశంపై తీవ్రంగా స్పందించారు. దేవుడు అపవిత్రం అవుతాడు..: ‘గుజరాత్ వాళ్ల చెప్పులు మోసే ఖర్మ బీజేపీ నేతలకు ఉండొచ్చేమో కానీ, వీళ్లు తాకితే దేవుడు మలినం, అపవిత్రం అవుతాడు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి పాప ప్రక్షాళన చేయాలని వేద పండితులను, ఆలయ అధికారులను కోరుతున్నా’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మా మాటలు వక్రీకరించే అవకాశం ఉంది ‘ఎమ్మెల్యేలకు ఎర అంశంపై మేం మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారనే విమర్శలకు అవకాశముంటుంది. దురుద్దేశాలు ఆపాదించి మా మాటలను వక్రీకరించే అవకాశముంది. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సరైన సందర్భంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పందిస్తారు. దర్యాప్తు సంస్థలు అన్ని వివరాలు వెల్లడిస్తాయి. అయినా ఇప్పటికే ప్రజల ముందుకు అన్ని విషయాలు వచి్చనందున దొర ఎవరో.. దొంగ ఎవరో అర్ధమైంది. దర్యాప్తును ప్రభావితం చేసేలా నాతో సహా పార్టీ నేతలెవరూ తొందరపాటు ప్రకటనలు చేయరు..’అని మంత్రి చెప్పారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని బీజేపీ కొనాలనుకుంటోంది.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ధనబలంతో జూటా, జుమ్లా పార్టీ బీజేపీ కొనుగోలు చేయాలనుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. అడ్డికి పావుశేరు చొప్పున దేశాన్ని అమ్మేస్తూ బీజేపీ ప్రభుత్వం కాలే కడుపులను మరింత మాడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏళ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు ► చార్జిషీట్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 67 ఏళ్లలో అందరు ప్రధానులు రూ.55.87 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారు. ► అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు దేశ ఆదాయంలో 2014–15లో 36.1 శాతం ఖర్చు చేస్తే, 2021లో వడ్డీ భారం 43.7 శాతానికి పెరిగింది. ► చేనేత, ఖాదీ ఉత్పత్తులపై దేశంలోనే తొలిసారిగా 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత బీజేపీదే. ► మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా ఉచిత విద్యుత్‌కు ఉరి వేసింది. ► కృష్ణా జలాలపై మోదీ ప్రభుత్వం నికృష్ట రాజకీయం చేస్తోంది. ► గ్యాస్ ధర పెంపుతో వంట గదిలో మంట పెట్టింది ► పెట్రో ధరల పెంపుతో జనం నడ్డివిరుస్తోంది. ► మునుగోడు ఫ్లోరైడ్ గోడును కేంద్రం పట్టించుకోలేదు. వీటితో పాటు గిరిజన రిజర్వేషన్ల అమలు, గౌడ కులస్తుల అణిచివేత, బీసీలపై కపట ప్రేమ సంక్షేమ పథకాలు, నిరుద్యోగం, తెలంగాణ విద్యార్థులపై వివక్ష, విభజన చట్టానికి తూట్లు, రైతు వ్యతిరేక విధానాలు, రూపాయి పతనం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వంటి అంశాలను చార్జిషీట్లో పొందుపరిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, పార్టీ నేతలు సీతారాం నాయక్, దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి...
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి పాదాల వద్ద తాను చేసిన ప్రమాణంతో సీఎం కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ జోస్యం చెప్పారు. కేసీఆర్ తప్పుచేశారు కాబట్టే యాదాద్రికి రాలేదని, మునుగోడులో ఓడిపోతున్నామనే భయంతో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు. ఈ కేసులో కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలందరూ లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ముఖమండపంలో ఉత్సవ విగ్రహాల వద్ద ఆయన ప్రమాణం చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో తనకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అనంతరం కొండ కింద స్వామివారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఆడియో టేపుల పేరుతో తాజాగా మరో కొత్త సినిమా చూపే యత్నం చేసి కేసీఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ యాడ్ చేసినట్లుగా.. చిత్తయిన డ్రామాను రక్తికట్టించేందుకు ఆడియో టేపు పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ ఆడియో టేపుల్లో చెప్పిన దాని ప్రకారం.. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ అని, సంతోష్ అంటే కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్‌కుమార్ అని బండి సంజయ్ చెప్పారు. మునుగోడులో దుకాణం నడవలేదని, హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశాడని, అక్కడా ఫెయిల్ కావడంతో ఢిల్లీ పేరుతో డ్రామా చేయబోతున్నాడన్నారు. లిక్కర్ దందాలో తన బిడ్డను, అవినీతి సొమ్మును ఎలా కాపాడుకోవాలన్నదే సీఎం తపన తప్ప ఇంకేమీ లేదన్నారు. తాను దేవుడిని నమ్ముకున్నానని, కేసీఆర్ దయ్యాలను, అవినీతి సొమ్ముతో కుట్రలు కుతంత్రాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తరువాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపాడన్నారు. తడి బట్టలతో ప్రమాణం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పినట్లుగానే బండి సంజయ్ శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. ముందుగా ఆయన కొండపైకి చేరుకుని అక్కడే బిందెడు నీటితో తల స్నానం చేశారు. తడిబట్టలతోనే శ్రీ స్వామి దర్శనానికి వెళ్లారు. గర్భాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద ప్రమాణం చేశారు. బండి సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలతో ఆందోళన చేశాయి. కాగా, చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలంటూ మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో చేనేత కార్మికులు పోస్ట్‌కార్డులు, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. -
అవన్నీ ఫేక్ వీడియోలే : బండి సంజయ్
-
యాదాద్రి ఆలయంలో బండి సంజయ్ ప్రమాణం
-
యాదాద్రిలో టెన్షన్.. టెన్షన్
-
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్.. యాదాద్రిలో హైటెన్షన్
సాక్షి, యాదాద్రి భువనగిరి: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారం తెలంగాణలో రాజకీయ వేడి రాజేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే తమకు ఆ అవసరం లేదని, మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘటన కేసీఆర్ కుట్ర అని బీజేపీ వాదిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో రాజకీయాలు చేస్తోందని మండిపడింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెట్టాయి. తాజాగా టీఆర్ఎస్, బీజేపీ హైడ్రామా నేపథ్యంలో యాదాద్రిలో టెన్షన్ నెలకొంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కాసేపట్లో యాదాద్రి ఆలయానికి వెళ్లనున్నారు. భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఫాంహౌజ్ వ్యవహారంపై ప్రమాణానికి సిద్ధమని ఆయన తెలిపారు. ప్రమాణం చేయడానికి కేసీఆర్ రావాలని బండి సంజయ్ సవాల్ చేశారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు అడ్డుకున్నా యాదాద్రి వెళ్తానని బండి సంజయ్ తెగేసి చెబుతున్నారు. మరోవైపు యాదాద్రిలో టీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బండి సంజయ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలతో మొత్తానికి యాదాద్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. చదవండి: MLAs Episode: బీజేపీ హైకమాండ్ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ -
నల్గొండ జిల్లా : యాదాద్రికి కార్తీక శోభ (ఫొటోలు)
-
25న యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట: ఈ నెల 25న సూర్యగ్రహణం ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ఉదయం 8.50 గంటల్లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 4.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం అవుతుందని తెలిపారు. దీంతో ఆ రోజు ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. తిరిగి మర్నాడు ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరచి.. సంప్రోక్షణ అనంతరం 10 గంటల నుంచి భక్తులను దైవ దర్శనాలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిత్యపూజలు రద్దు చేసినట్టు చెప్పారు. -
యాదగిరి నర్సన్నకు బంగారు సింహాసనం.. విలువెంత?
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో బంగారు సింహాసనం వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు దీన్ని బహూకరించాడు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల కోసం ఇప్పటికే ఒక బంగారు సింహాసనాన్ని ఓ భక్తుడు అందజేశారు. తాజాగా మరో సింహాసనాన్ని దాత ఇచ్చాడు. ఈ సింహాసనం విలువ ఎంత ఉంటుంది, ఎంత బంగారం పట్టిందనే అంశాలను అధికారులు తెలియనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ సింహాసనాన్ని ఆలయ ముఖ మండపంలో భద్రపరిచారు. -
యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, ప్రసాదం కౌంటర్, క్యూలైన్లు, ఘాట్ రోడ్డు.. ఇలా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. రూ.150 టికెట్ దర్శనం క్యూలైన్ సరిగ్గా లేకపోవడంతో భక్తులు అష్టభుజి ప్రాకార మండపంలో బారులు దీరారు. టికెట్ కొనుగోలు కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్వామి వారిని 22,776 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ విభాగాల నుంచి నిత్యాదాయం రూ.40,29,719 వచ్చినట్లు వెల్లడించారు. భక్తులు భారీగా తరలిరావడంతో రింగ్‌రోడ్డు, కొండపైన ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొండపైన పార్కింగ్ స్థలం కిక్కిరిసిపోవడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొండ కింద ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. -
యాదాద్రి తలనీలాల టికెట్ ధర రూ.50
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తలనీలాల టికెట్ ధరను రూ.50కి పెంచినట్టు ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో టికెట్ ధర రూ.20 ఉండగా రూ.50కి పెంచుతున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. పెంచిన ధర శనివారం నుంచి అమల్లోకి రానున్నట్లు ఈవో పేర్కొన్నారు. పెంచిన రూ.50 టికెట్ ధరలో 60 శాతం నాయీ బ్రాహ్మణులకు, 40 శాతం సొమ్ము దేవస్థానానికి చెందనుందని వివరించారు. -
అద్భుతంగా యాదాద్రి
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి అనుబంధంగా జరుగుతున్న నిర్మాణాలు ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, అత్యంత అద్భుతంగా, వైభవంగా ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాల ని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఫోన్లో ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు మనవడు హిమాన్షుతో కలిసి శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్యవిమాన స్వర్ణ తాపడం కోసం కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారానికి గాను చెక్కును దేవస్థానానికి అందజేశారు. సుమారు 4.40 గంటలపాటు సీఎం యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రి చేరుకున్న కేసీఆర్.. మొదట గుట్ట చుట్టూ బస్సులో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు. అక్కడ యాదాద్రి అభివృద్ధి పనులపై మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు. అనుబంధ సేవలకు 2,157 ఎకరాలు ‘యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ)కి 2,157 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుంది. దాని నిర్వహణను వైటీడీఏ అధికారులు, భూమిని కేటాయించిన శాఖలు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ భూమిని ఆలయ అవసరాలు, పోలీసుశాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమే వినియోగించాలి. ఆలయ అర్చకులకు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇళ్ల స్థలాలను కేటాయించాలి. యాదాద్రి టెంపుల్ టౌన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన వచ్చేలా ఉండాలి. దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలు ఆదాయ పన్ను మినహాయింపు పొందేలా అనుమతులు వెంటనే తీసుకోవాలి..’ అని సీఎం సూచించారు. 50 ఎకరాల్లో కల్యాణ మండపం ‘ఒక ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి కావాలి. హెలిప్యాడ్ల నిర్మాణం కూడా చేపట్టాలి. వైటీడీఏ పరిధిలో ఉన్న 100 ఎకరాల అడవిని ‘నృసింహ అభయారణ్యం’ పేరిట అద్భుతంగా అభివృద్ధి చేయాలి. స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు ఆ అరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుమీద ఒక అద్భుతమైన కల్యాణ మండప నిర్మాణం చేపట్టాలి. ఆలయం సహా రింగు రోడ్డు మధ్యలో ఏ ప్రాంతంలోనూ ఒక్క చుక్క నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దీక్షాపరుల మంటపం, వ్రత మంటపం, ఆర్టీసీ బస్టాండ్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాదాద్రిలో ఉన్న విలేకరులకు కలెక్టర్ పమేలా సత్పతి వైటీడీఏ బయట ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా కాటేజీలు ‘పెద్దగుట్టపై 250 ఎకరాల్లో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా నిర్మించాలి. వాటికి ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లను పెట్టాలి. ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్ హాల్, స్టేజీ, స్క్రీన్ ఏర్పాటు చేయాలి..’ అని సూచించారు. పూర్ణ కుంభంతో స్వాగతం సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘తొందర ఏమీలేదు.. ఇక్కడున్నవారందరికీ తీర్థం ఇచ్చి అక్షింతలు వేయాలని సీఎం వేదపండితులను కోరారు. దాతలతో పాటు అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరి గోత్రనామాలు చదివే వరకు ఓపికతో కూర్చున్నారు. కేసీఆర్ కుటుంబం తరఫున వారి మనవడు హిమాన్షు యాదాద్రీశునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ దంపతులు తమ కుటుంబం తరఫున ప్రకటించిన ఒక కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ.52,48,097 విలువైన చెక్కును హిమాన్షు చేతుల మీదుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం కోసం నాలుగు కిలోల ప్రత్యేక లడ్డూ ప్రసాదాన్ని దేవస్థానం అధికారులు తయారు చేశారు. కాగా ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి రూ.20 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ఎ.రజిత 30 లక్షలు, స్నేహిత బిల్డర్స్ రూ.51 లక్షలు, ఏనుగు దయానందరెడ్డి రూ.50.04 లక్షల (కిలో బంగారం) మేరకు చెక్కులను అధికారులకు అందజేశారు. యాదాద్రీశుని గర్భాలయంలో ఆయా చెక్కులు, ఒక కవర్‌కు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయించారు. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం ఆలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు. రెండు గంటలు సూట్‌లోనే.. రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం వెంటనే స్వామి వారి దర్శనం కోసం వెళ్లకుండా రెండు గంటలపాటు ప్రెసిడెన్షియల్ సూట్‌లోనే ఉండిపోయారు. చెక్ బుక్ మర్చిపోవడంతో అధికారులు హైదరాబాద్ ప్రగతి భవన్‌నుంచి తేవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో సీఎం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు సూట్‌లోనే వేచి చూశారు. యాదాద్రి పర్యటనలో కేసీఆర్ దంపతులతో పాటు మంత్రులు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా సీఎం రాక సందర్భంగా హైదరాబాద్ బేగంపేట నుంచి యాదాద్రి వరకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ ఒక గంటలోనే యాదాద్రికి చేరుకుంది. -
యాదాద్రిలో సీఎం కేసీఆర్
-
యాదాద్రి ఆలయం రక్షణ గోడ నుంచి వాటర్ లీకేజ్
-
యాదాద్రిలో లడ్డూ ప్రసాదం కోసం తోపులాట..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులకు లడ్డూ ప్రసాదం సరిగ్గా అందక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసాద కౌంటర్ల వద్ద లడ్డూలు అయిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ప్రసాద విక్రయశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. సిబ్బంది తలుపులు మూసేయడంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైన లడ్డూ తయారీ మెషీన్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాతగుట్టలో లడ్డూ తయారు చేయిస్తున్నామని.. అక్కడి నుంచి మూడవ ఘాట్ రోడ్డు మీదుగా లడ్డూ ప్రసాదం తీసుకురావడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు అధికంగా రావడం, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పారు. కాగా, యాదాద్రి కొండపై, ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. చాల మంది కాలినడకన కొండపైకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన వాహనాలను సరిగా పార్కింగ్ చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. యాదాద్రికి పోటెత్తిన భక్తులు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. 40వేల మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి దర్మదర్శనా నికి 4గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
యాదాద్రిలో త్వరలో కోటి పుష్పార్చన వేడుక
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానా ర్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే వేడుక తేదీలను ప్రకటిస్తామన్నారు. అంతే కాకుండా కోటి పుష్పార్చన వేడుక ముగిసిన వెంటనే వేయి యజ్ఞ గుండాలతో లోక కల్యాణార్థమైన లక్ష్మీనరసింహ సహస్ర కుండాత్మక మహాయాగం నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. -
యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పుర స్కరించుకుని ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వయంభూ మూర్తులకు నిర్వహించిన నిజాభి షేకంలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలోని పంచనారసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ నందాకు అద్దాల మండపం వద్ద ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
Yadadri Temple: గుట్ట కష్టాలకు ముగింపు ఎప్పుడు?
యాదాద్రి దేవాలయాన్ని వేలాది సంవత్సరాలు మన్నే విధంగా నిర్మించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలని తేలి పోయింది. ఈదురుగాలులూ, వర్షాలకు ఆలయ సముదాయ నిర్మాణంలోని డొల్లతనం బయటపడుతోంది. గతంలో వీచిన గాలులకు ప్రధానాలయ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఒరిగిపోయింది. ఇటీవల కురి సిన వర్షాలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ దిశలో స్టోన్ ఫ్లోరింగ్ కుంగింది. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు ప్రసాద కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దక్షిణ రాజగోపురం ప్రాంతంలో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్‌కు పగుళ్లు వచ్చి కుంగింది. అష్టభుజి మండపంలో వర్షపునీరు లీకేజీతో డంగు సున్నం బయటకు వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే నిర్మాణం ఎంత ‘గొప్ప’గా చేశారో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లలో దాదాపు 25 సార్లకు పైగా యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి, వ్యక్తి గత శ్రద్ధ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రణాళికా లోపం, నమూనాలు, డిజైన్లలో లోపాలు, అధికారుల బాధ్యతా రాహిత్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి, సమన్వయ లోపం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణా లుగా చెప్పవచ్చు. ‘అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం’ అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తరతరా లుగా వస్తున్న ‘యాదగిరిగుట్ట’ పేరును సైతం ‘యాదాద్రి’గా మార్చేసింది. గుట్ట పునర్నిర్మాణానికి ఏకంగా రూ 1,300 కోట్లు వెచ్చించింది. ఈ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఆలయ నిర్మాణంలో నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల కొండపైనా, కింద కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మా ణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వ పరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని కాంట్రాక్టు సంస్థలకు చెందిన సైట్ ఇంజనీర్లతోనే పను లన్నీ చేపట్టారు. గుట్ట చుట్టూ నిర్మాణాలు చేస్తున్న ప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారు. వర్షాలు కురిసినప్పుడు ఎటునుంచి వరద వస్తుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించకపోవడంతో రోడ్లు ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి. గత మే నెలలో కురిసిన వర్షానికి ఆలయం చిత్తడిగా మారింది. ప్రధాన ఆలయంలో పంచతల రాజగోపురం నుంచి.. ధ్వజస్తంభం వరకు వాన నీరు చేరింది. మొదటి నుంచీ ఆలయ పునర్నిర్మాణ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. శిల్పాలు చెక్కే సమ యంలో దేవాలయ స్తంభాలపై మసీదు, పీర్లు, చర్చి, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, కేసీఆర్ చిత్రాలు (రిలీఫ్ ఫిగర్స్) చెక్కారు. అంతటితో ఆగలేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లోగోలను కూడా చెక్కారు. దీంతో విశ్వహిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడంతో ఆ రిలీఫ్స్ను తొలగించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కాశీ అనేది పవిత్ర పుణ్యక్షేత్రం... అక్కడ రాజకీయాలు లేకుండా హిందువుల మనోభావాలు గౌరవించే స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి. కానీ... నట్లు, బోల్టు లతో ఆలయం నిర్మించి తప్పు చేశారు. వర్షం పడితే ఆలయ గోపురం కూలింది, అది అరిష్టం’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరోపించారు. మరి యాదాద్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఏమంటారు? నిజానికి కాశీలో నిర్మిం చిన ఆలయంలో ఎటువంటి అపశ్రుతులు దొర్ల లేదనే విషయం గమనించాలి. ఇతరులను విమర్శించే ముందు తాను చేసిన పనిని సమీక్షించుకోవాల్సిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. పగుడాకుల బాలస్వామి వ్యాసకర్త ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్, తెలంగాణ ‘ మొబైల్: 99129 75753 -
కనువిందు చేసిన కూచిపూడి నృత్యం
యాదగిరిగుట్ట: తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాంపల్లిలోని సాంస్కృతిక విశ్వ కళామండలి, కళాచైతన్య వేదిక వ్యవస్థాపకుడు రాంనర్సయ్య ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన కూచిపూడి నృత్య ఉపా«ధ్యాయిని హవిష సమక్షంలో 50 మంది విద్యార్థులు ఆరు గంటలపాటు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. యాదాద్రీశుడు, వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయాలకు సంబంధించిన పాటలకు నృత్యం చేశారు. అలాగే పేరిణి నాట్యం ప్రదర్శించి భళా అనిపించుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూచిపూడి, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పేరిణి నృత్యాలు చేశారు. -
యాదాద్రిలో రూ.150 టికెట్‌కు ప్రత్యేక క్యూలైన్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధికంగా రూ.150 ప్రత్యేక టికెట్ దర్శనం ద్వారా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం టికెట్‌పై వెళ్లే భక్తులు అష్టభుజి ప్రాకార మండపం వద్దకు రాగానే టికెట్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో ధర్మ దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రత్యేక దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు సోమవారం క్యూలైన్లు, అష్టభుజి ప్రాకార మండపం వద్ద పరిశీలించారు. ప్రత్యేక దర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. (క్లిక్: నరసింహుడికి బంగారు సింహాసనం) -
నరసింహుడికి బంగారు సింహాసనం
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణంలో వినియోగిం చేందుకు బంగారు పూతతో తయారు చేసిన సింహాసనాన్ని న్యూయార్క్‌కు చెందిన దాతలు సామల ఆర్ స్వామి, వీరమణి స్వామి ఆదివారం బహూకరిం చారు. ఈ సందర్భంగా బంగారు పూతతో ఉన్న ఈ సింహాసనానికి ఆలయ ముఖ మండపంలో ఈవో గీతారెడ్డి, ఆలయ ఆచార్యులు పూజలు నిర్వ హించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అధిష్టించి పూజించారు. సింహాసనం విలువ రూ.18 లక్షలు ఉంటుందని దాతలు వెల్లడించారు. -
భక్త జనసంద్రంగా యాదగిరిగుట్ట ఆలయం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం భక్త జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు పూర్తి అవుతుండటంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి నాలుగున్నర గంటల సమయం, శీఘ్ర, అతి శీఘ్రదర్శనాలకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని 40 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రికార్డు స్థాయిలో ఆదాయం.. ప్రధానాలయం ప్రారంభమైన నాటి నుంచి ఆదివా రం రికార్డు స్థాయిలో పూజలతో రూ.50,89,482 ఆ దాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.4,77,700, వీఐపీ దర్శనం ద్వారా రూ.6,90,000, యాదరుషి నిలయం ద్వారా రూ.1,20,680, ప్రసాద విక్రయం ద్వారా రూ.18,27,900, కొండపైకి వాహనాల ప్రవే శంతో రూ.4,50,000, సువర్ణ పుష్పార్చనతో రూ.1,66,800, పాతగుట్ట ఆలయంతో రూ.75,500, కల్యాణ కట్టతో రూ.76,600, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,00,000 వచ్చినట్లు వివరించారు. -
యాదాద్రిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఆదివారం దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని స్వయంభూలను సతీసమేతంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. చీఫ్ జస్టిస్ దంపతులకు ఆలయ ఆచార్యులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ముఖ మండపంలో వారికి వేద ఆశీర్వచనం చేశారు. ఇన్చార్జ్ ఈఓ రామకృష్ణారావు చీఫ్ జస్టిస్‌కు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు కలెక్టర్ పమేలా సత్పతి కొండపై అతిథి గృహం వద్ద చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికారు. -
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇంటర్, పదోతరగతి పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు ఒక్క సారిగా పెరిగారు. 40వేలకు పైగా భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకోవడంతో ధర్మ దర్శనానికే 4 గంటల సమయం పట్టిం దని భక్తులు తెలిపారు. వివిధ పూజల ద్వారా స్వామి వారికి రూ.45,50,079 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మరోవైపు స్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శిం చుకున్నారు. -
యాదాద్రి సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సతీసమేతంగా శనివారం దర్శించుకున్నారు. తూర్పు రాజగోపురం వద్ద ఆచార్యులు సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పంచ నారసింహులను దర్శించుకొని పూజలు జరిపించారు. శ్రీస్వామి వారిని దర్శించుకున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ దంపతులకు ముఖ మండపంలో ఆచార్యులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆయన వెంట తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయన్, అశోక్ కుమార్ జైన్ తదితరులు ఉన్నారు. -
దర్శనానికి మూడు గంటల సమయం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 30 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ పూజల ద్వారా రూ.33,81,486 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
యాదాద్రి ఆలయం అద్భుతం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం అద్భుతంగా ఉందని కంచి కామకోటి మఠం పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం పంచనారసింహుల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు శంకర విజయేంద్ర సరస్వ తి స్వామీజీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువులు, బంగారు ప్రతిష్ట మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో ఆలయ ఆచార్యులతో పండిత గోష్టి నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో ఆలయ నిర్మాణ విశేషాలపై చర్చించారు. -
యాదాద్రి ఈఓ మార్పు తప్పదా?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణ అధికారి(ఈఓ) గీతారెడ్డి మార్పు తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. కూతురు వివాహం కోసం సెలవుపై వెళ్లిన ఈఓ గీతారెడ్డి మంగళవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే తాజాగా యాదాద్రిని చుట్టుముడుతున్న వివాదాలకు తెరదించడానికి ఈఓను తప్పించనున్నారని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో యాదాద్రిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని మంత్రి ప్రకటించినప్పటికీ అంతర్గతంగా వాస్తవ పరిస్థితులపై సుదీర్ఘంగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈఓ గీతారెడ్డి స్థానంలో ఐఏఎస్ లేదా రిటైర్డు ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. వివాదాస్పదమైన నిర్ణయాలు.. సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అయితే మార్చి 28న ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత దేవస్థానంలో అమలు చేసిన పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. భక్తులకు కనీస వసతులైన నీరు, నీడ కల్పించలేకపోవడం, కొండపైన పార్కింగ్ ఫీజు గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 చొప్పున చెల్లించాలని నిర్ణయించడంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని ఇంటాబయటా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదనంగా గంటకు రూ.100 పార్కింగ్ ఫీజు వసూలును ఎత్తివేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ప్రకటించడంతో భక్తులకు కొంత ఊరట కలిగింది. మరోపక్క స్థానిక ఆటోలను కొండపైకి నిషేధించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలతో కలసి పలుమార్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ తీరుపై ఆటో కార్మికులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు నాయకులు గుట్టకు వచ్చినప్పుడు 300 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓకు సూచించారు. దీంతో పాటు మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకపోవడం, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయించడంతో ఈఓ, మీడియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం, ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే యాదాద్రిలో జరిగిన నష్టం వంటి పలు అంశాలు దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశాయని ఉన్నతస్థాయి వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈఓను మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. -
యాదాద్రిలో కొనసాగుతున్న దిద్దుబాటు పనులు
యాదగిరిగుట్ట: ఇటీవల కురిసిన భారీ వర్షానికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు చెల్లాచెదురైన విషయం తెలిసిందే. క్యూలైన్లోని గ్రౌండ్ ఫ్లోర్లో వర్షం నీటితోపాటు చెత్తాచెదారం చేరింది. ప్రత్యేక సిబ్బందితో చెత్తాచెదారం తొలగించడంతోపాటు మట్టిని తీసి పక్కన పోస్తున్నారు. వర్షపునీరు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమ్మతులు చేస్తున్నారు. శిల్పులు వాటర్ క్యూరింగ్ పనులను చేపట్టారు. ఆలయ సన్నిధిలో కుంగిపోయిన స్టోన్ ఫ్లోరింగ్‌ను అధికారులు పరిశీలించి, వాటిని బాగుచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొండపైనే గల విష్ణు పుష్కరిణి వద్ద మట్టి అంతా ఒకేచోటకు చేరడంతో దానిని కూడా తొలగిస్తున్నారు. కూలిపోయిన చలువ పందిళ్లను పునరుద్ధరిస్తున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో మరమ్మతులు చేయాల్సిన చోట్లను ఆర్అండ్ బీ అధికారులు పరిశీలిస్తున్నారు. -
యాదాద్రి క్షేత్రం వరదమయం (ఫోటోలు)
-
యాదాద్రి అతలాకుతలం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట రూరల్: ఆలయ ఉద్ఘాటన తర్వాత తొలిసారిగా కురిసిన భారీ వర్షంతో యాదాద్రి క్షేత్రం అతలాకుతలమైంది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గంటన్నరపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఘాట్రోడ్ల వద్ద మట్టి కుంగింది. కొండపైన ఆలయం, క్యూకాంప్లెక్స్, పరిసర ప్రాంతాల్లో నీరు చేరింది. దీనితో భక్తులు ఇబ్బందిపడ్డారు. ఇంజనీరింగ్ లోపాలు, నాసిరకం పనుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వస్తున్నాయి. కుంగిన ఘాట్ రోడ్డు.. కూరుకుపోయిన బస్సులు.. కొత్తగా నిర్మించిన మూడో ఘాట్‌రోడ్డు ప్రారంభంలో వాననీటి ధాటికి కుంగిపోయి పెద్ద గొయ్యి పడింది. దీనితో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. రెండోఘాట్ రోడ్డుకు అనుబంధంగా వీఐపీల కోసం నిర్మించిన ఈ ఘాట్‌రోడ్డును ఆలయ ఉద్ఘాటనకు కొద్దిరోజుల ముందే ప్రారంభించడం గమనార్హం. సీఎం కేసీఆర్‌తోపాటు ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి వచ్చే ప్రముఖులు, ఆర్టీసీ బస్సుల కోసం మాత్రమే ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. ఇక వాననీటి ధాటికి మట్టికొట్టుకు వచ్చి మొదటి ఘాట్‌రోడ్డు బురద మయంగా మారింది. ఉదయం కొండపైకి భక్తులతో వెళ్తున్న రెండు బస్సులు ఈ బురదలో దిగబడ్డాయి. భక్తులే దిగి బస్సులను బురదలోంచి తోశారు. బస్సులు కూరుకుపోవడంతో కొండపైకి వెళ్లే ఇతర బస్సులూ ఆగిపోయాయి. చాలామంది భక్తులు మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. రింగ్‌రోడ్డులో యాద గిరిపల్లి సమీపంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. కొండ కింద మూడవ ఘాట్ రోడ్డు వద్ద కొట్టుకుపోయిన రోడ్డు ప్రధానాలయంలోకీ నీరు ప్రధానాలయంలో పంచతల రాజగోపురం నుంచి ధ్వజ స్తంభం వరకు వాన నీరు చేరింది. దేవస్థానం సిబ్బంది బకెట్లతో నీటిని తొలగించి శుభ్రం చేశారు. ఇందుకోసం గంటకుపైగా దర్శనాలు నిలిపివేశారు. అష్టభుజి మండపాలు, ప్రాకార మండపాలు, లిఫ్ట్ మార్గంలో పలుచోట్ల వాన నీరు లీకైంది. కొండపై బస్టాండు పక్కన క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల గదుల్లో నీళ్లు నిలిచాయి. లడ్డూలు తడిసిపోయినట్టు సిబ్బంది పేర్కొన్నారు. భక్తులు ఇబ్బందిపడుతూనే దర్శనాలకు వెళ్లారు. క్యూకాంప్లెక్స్ పక్కన కార్యాలయంలో ఉన్న సామగ్రి, కంప్యూటర్లు, స్టోరేజీ రూమ్ జలమయం అయ్యా యి. ప్రధానాలయం బయట వాన నీరు నిండి చిన్నపాటి చెరువును తలపించింది. బంగారు వర్ణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు కూలిపడ్డాయి. కొండపై బస్టాండ్, శివాలయం, ఇతర చోట్ల ఏర్పా టు చేసిన చలువ పందిళ్లు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. కొండ కింద వాహన పూజలు నిర్వహించేచోట భారీ వేప చెట్టు విరిగిపడింది. వెంటనే పునరుద్ధరిస్తాం: దేవాదాయ కమిషనర్ భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ఇతర పనులను వెంటనే పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ చెప్పారు. బుధవారం ఆయన యాదాద్రి ఆలయాన్ని సందర్శించి.. కూలిన పందిళ్లు, వాననీటి లీకేజీలు, ఇతర నష్టాలను పరిశీలించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడతామని.. కొండపై పార్కింగ్ ఫీజులో అదనంగా గంటకు రూ.100 వసూలును భక్తుల కోరిక మేరకు తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కుండపోత పడితే ఎలా? ‘ఇంజనీరింగ్’ నిర్లక్ష్యంతోనే సమస్య అనే ఆరోపణలు తాజా వానతో యాదాద్రి క్షేత్రంలో రోడ్లు దెబ్బతినడం, ఎక్కడిక్కడ నీళ్లు నిలవడం, ఆలయంలోకీ నీరు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. యాదాద్రిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ రూ.1,300 కోట్ల వరకు ఖర్చుచేసి పునర్నిర్మాణం చేపట్టినా.. ఇంజనీరింగ్ లోపాల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండపైన, దిగువన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకుండానే ఆలయ ఉద్ఘాటన చేసిన విషయం తెలిసిందే. ప్రధానాలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మాణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వపరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని.. కాంట్రాక్టు సంస్థల సైట్ ఇంజనీర్లతోనే పనులన్నీ చేపట్టారని అధికారవర్గాలు చెప్తున్నాయి. వైటీడీఏ, సీఎంవో కార్యాలయం, దేవస్థానం ఉన్నతాధికారుల అండదండలతోనే సదరు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పను లు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండ చుట్టూ నిర్మాణాలు చేస్తున్నప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారని.. వర్షాలు పడినప్పుడు ఎటు నుంచి నీరు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించలేక ఇలా రోడ్డు కోతపడిందని అధికారవర్గాలు అంటున్నాయి. ఈ వానకే ఇంత నష్టం జరిగితే.. కుండపోత వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
యాదాద్రి ఇన్చార్జి ఈవోగా రామకృష్ణ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఇన్చార్జి ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్చార్జి ఆర్జేసీ రామకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న ప్రస్తుత ఈవో గీతారెడ్డి తన కుమార్తె వివాహం దృష్ట్యా సెలవుపై వెళ్లారు. దీంతో రామకృష్ణను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు స్వీకరించను న్నట్లు సమాచారం. -
‘కొండెక్కిన’ పార్కింగ్ ఫీజు
సాక్షి, యాదాద్రి: కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తీసుకుని కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు యాదగిరిగుట్ట దేవస్థానం పార్కింగ్ ఫీజుల షాక్ ఇచ్చింది. తిరుమల తరహాలో యాదాద్రిలో భక్తులకు వసతులు కల్పిస్తామన్న దేవస్థానం ప్రకటనతో సంతోషపడ్డ భక్తులు పార్కింగ్ ఫీజుల పెంపు ప్రకటనతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను కొండపైన పార్కింగ్ చేస్తే గంటకు రూ.500, ఆ పైన ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. దేవస్థానం తాజా ఉత్తర్వుల ప్రకారం ఆదివారం నుంచి ఈ పార్కింగ్ చార్జీల వసూలు ప్రారంభం కానుంది. ఈ మేరకు శనివారం ఈవో గీతారెడ్డి ఆదేశాలు జారీచేశారు. మార్చి 28న లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన జరగ్గా, ఆ రోజు నుంచి భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కొండకింద నుంచి పైకి, పైనుంచి కిందకు ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను ఉచితంగా చేరవేస్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం చాల ఖరీదుగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతస్థాయి అధికారులు, న్యాయమూర్తుల ప్రొటోకాల్ వాహనాలకు పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతల గుర్తింపు కార్డులు చూపించిన వారి వాహనాలకు కూడా పార్కింగ్ ఫీజు లేదు. వాహనాల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను నియమించారు. ఫీజు చెల్లించిన వాహనాలను క్యూ కాంప్లెక్స్ ఎదురుగా గల బస్టాండ్, వీఐపీ గెస్‌హౌస్ పక్కన గల ఖాళీ స్థలంలో నిలపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో యాదాద్రి కొండపైకి వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలకు కాలపరిమితి లేకుండా రూ.15, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు రూ.100 పార్కింగ్ ఫీజు వసూలు చేసే వారు. ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలకు పాత ఫీజునే వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని, ఫీజు తగ్గించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
యాదాద్రిలో పార్కింగ్ చార్జీల బాదుడు
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రిలో ఆదివారం నుంచి కొత్త నిబంధన ప్రభుత్వం అమలు చేయనుంది. కొండపై వాహనం పార్క్ చేస్తే గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు రూ.వంద చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో తెలిపారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులకు వాహన రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం -
వైభవంగా రామలింగేశ్వరాలయ ఉద్ఘాటన
రా.. ఆంజనేయులు.. ‘గుట్ట’కు పోదాం! తుర్కపల్లి: సీఎం కేసీఆర్ సోమవారం యాదగిరిగుట్టకు వస్తూ మధ్యలో భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆగారు. గ్రామస్తులతో మాట్లాడారు. సర్పంచ్ పోగుల ఆంజనేయులును తన కాన్వాయ్‌లో ఎక్కించుకుని యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిస్థితుల గురించి ఆంజనేయులును ఆడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో రామాలయం, పాఠశాల తొలగింపుపై గ్రామస్తుల అభిప్రాయాలను ఆంజనేయులు సీఎంకు వివరించారు. కాగా సీఎం ప్రయాణం సందర్భంగా వాసాలమర్రిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టపై శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన, మహాకుంభాభిషేకం సోమవారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన గత నెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఉన్న రామలింగేశ్వరుడి ఆలయాన్ని కూడా కొత్తగా నిర్మించారు. ఇటీవలే ఈ ఆలయ నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో మహాకుంభాభిషేకం, ఉద్ఘాటన, స్పటిక లింగ ప్రతిష్టాపన చేపట్టారు. సీఎం కేసీఆర్, సతీమణి శోభ దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లింగానికి అభిషేకం చేశారు. అనంతరం పూజారులు అష్టబంధనం, ప్రాణ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమము, అఘోర మంత్ర హోమము, దిక్దేవతా క్షేత్రపాల బలిహరణము, కలశ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిం చారు. పూర్ణాహుతిలో పాల్గొన్న తర్వాత సీఎం కేసీఆర్ దంపతులకు యాగ మండపంలో మాధవా నంద సరస్వతి స్వామి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని తీర్చి దిద్దిన స్తపతి బాలసుబ్రహ్మణ్యంను శాలువాతో సన్మానించి, బంగారు కంకణాన్ని చేతికి తొడిగారు. తొలుత నరసింహుడిని దర్శించుకుని.. సీఎం కేసీఆర్ సతీమణి శోభతో కలిసి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో సోమవారం ఉదయం 11.50 గంటలకు యాదగిరిగుట్టకు వచ్చారు. ప్రెసిడెన్షియల్ సూట్లో కాసేపు విశ్రాంతి తీసుకుని.. మూడో ఘాట్‌రోడ్డు మీదుగా ప్రధానాలయానికి చేరుకున్నారు. వేద పండితులు తూర్పు రాజగోపురం వద్ద సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం, ప్రసాదం అందజేశారు. తర్వాత సీఎం దంపతులు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని దర్శించు కుని.. శివాలయానికి వెళ్లారు. 12.48 గంటలకు మహాశివుడిని దర్శించుకొని, శ్రీమాధవనంద సరస్వతి స్వామితో కలిసి అభిషేకం, పూజల్లో పాల్గొన్నారు. మహాపూర్ణాహుతి అనంతరం 1.37 గంటల సమయంలో ప్రెసిడెన్షియల్ సూట్‌కు వెళ్లారు. అక్కడ భోజనం చేసి, అధికారులతో సమీక్షించారు. 3.10 గంటల సమయంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు. ప్రత్యేక ఏర్పాట్లు.. బందోబస్తు.. సీఎం రాక సందర్భంగా యాదగిరిగుట్టపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయం నుంచి శివాల యం వరకు ఎర్ర తివాచీలు పరిచారు. ఎండవేడి తీవ్రంగా ఉండటంతో సీఎం దంపతులకు ప్రత్యే కంగా గొడుగులను ఏర్పాటు చేశారు. ఇక గుట్ట పైన, కింద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు. -
యాదాద్రి ఆలయ ఈవోను తొలగించాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ప్రధానాలయం పునఃప్రారంభం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో ఆలయ ఈవోను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వైకుంఠద్వారం వద్ద ఆటోకార్మికులు కుటుంబాలతో కలసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆందోళన విరమించాలని చెప్పగా కార్మికులు అందుకు నిరాకరించారు. ఫైనాన్స్, అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేశామని, ఆటోలను అనుమతించకపోతే సుమారు 300 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొట్టమీద కొడుతున్న ఈవోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దశలో పోలీసులకు ఆటోకార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. దీంతో భక్తులు కొద్దిసేపు ఇబ్బందులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఆటోకార్మికులు స్వచ్ఛందంగా ఆందోళన విరమించారు. -
రికార్డు స్థాయిలో యాదాద్రీశుడి ఆదాయం
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైనప్పటికీ 29వ తేదీ నుంచి భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం కల్పించారు. అదే రోజు ఆలయంలో హుండీలను ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు హుండీల్లో సమర్పించుకున్న నగదు, నగలను మంగళవారం ప్రధానాలయంలోని ప్రథమ ప్రాకారంలో ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.1,87,17,937 నగదు సమకూరింది. ఇక మిశ్రమ బంగారం 62 గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 550 గ్రాములు వచ్చింది. వీటితో పాటు విదేశీ కరెన్సీ డాలర్లు, రియాల్స్ వచ్చాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన 150 డాలర్లు, అమెరికాకు చెందిన 903 డాలర్లు, సౌదీ అరేబియాకు చెందిన 102 రియాల్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన 10 దీర్హమ్స్, ఖతార్‌కు చెందిన ఒక రియాల్, కెనడాకు చెందిన 25 డాలర్లు, ఇంగ్లాండ్‌కు చెందిన 50 పౌండ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
యాదాద్రి ప్రధానాలయం అత్యద్భుతం
యాదగిరిగుట్ట: యాదాద్రిలో పునర్నిర్మితమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం అత్యద్భుత కట్టడమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ కొనియాడారు. దేశ స్వాతంత్య్రానంతరం పూర్తిగా రాతితో ఇంత పెద్ద ఆలయం ఎక్కడా నిర్మితం కాలేదని చెప్పారు. మంగళవారం తొలిసారి యాదాద్రికి విచ్చేసిన ఆయన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వరూపానందేంద్ర సరస్వతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ శైలిని పరిశీలించారు. ఆ తర్వాత యాదాద్రి కొండ కింద తులసీ కాటేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర స్వామీజీతో కలసి మాట్లాడారు. తిరుమల అంత గొప్పగా కావాలి... దేశంలో హిందూ నాయకులమని చెప్పుకొనే వారు ఎందరున్నా యాదాద్రి ప్రధానాలయాన్ని పునర్నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అహోబిలం, తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం సహా మరెన్నో మండపాలను శ్రీకృష్ణదేవరాయల హయాంలో అభివృద్ధి చేయగా ఇప్పుడు ఇంత గొప్పగా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్ ప్రజలకు అందించడం సంతోషకరమన్నారు. యావత్ దేశంలో శక్తివంతమైన, అద్భుతమైన క్షేత్రంగా, తిరుమల తిరుపతి దేవస్థానం అంత గొప్పగా యాదాద్రి కావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖ శారదా పీఠానికి వచ్చే భక్తులు యాదాద్రి నిర్మాణం గురించి చెప్పడంతో చూసేందుకు వచ్చానని తెలిపారు. ఇటీవలే ప్రధానాలయ నిర్మాణం జరిగినందున ఇంకా లోటుపాట్లు ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే ఆలయ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి బోర్డు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. దేవాలయాలు ఎవరి సొత్తూ కాదు.. హిందూ దేవాలయాలు ఏ ఒక్కరి సొత్తు కావని... అవి సనాతన ధర్మాల సొత్తు అని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అలా ఎవరైనా అనుకుంటే పొరపాటని చెప్పారు. అలాగే ఏ ఆలయాన్నీ వైష్ణవులకో లేక శైవులకో పరిమితం చేయరాదన్నారు. వైష్ణవులు, శైవుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు సకల దేవతలను కీర్తిస్తూ స్తోత్రా లు రాశారని స్వరూపానందేంద్ర గుర్తుచేశారు. ఆదిశంకరాచార్యులు రాసిన ‘ఉగ్రం వీరం మహా విష్ణువు జ్వలంతం సర్వతో ముఖం’ స్తోత్రాన్ని యాదాద్రిలోనూ పఠిస్తున్నారన్నారు. -
యాదాద్రిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర స్వామి (ఫొటోలు)
-
‘యాదాద్రి ఒక అద్భుతమైన కట్టడం’
యాదాద్రి: తిరుమల తిరుపతి దేవాలయం స్థాయిలో యాదాద్రి కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతీ ఆకాంక్షించారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆ తండ్రి పాదాలచెంత ఏకాదశి నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శననం చేసుకోవాలని పది రోజుల క్రితం ఆకాంక్ష కలిగింది.కరోనా భయకర పరిస్థితుల్లో ఎవరూ ఎటూ వెళ్లలేని పరిస్థితి.తమ శాఖలకు చెందిన భక్తులు అద్భుతంగా నిర్మిస్తున్నారని చెప్పారు. యాదాద్రి ఒక అద్భుతమైన కట్టడం. అలనాడు కృష్ణదేవరాయలు అహోబిలం, తిరుమల తిరుపతి దేవాలయాన్ని నిర్మిస్తే ఈరోజుకు కూడా చిరస్థాయిగా మిగిలాయి. హిందువులకు ఆజన్మాంతం పేరు ఉండేలా యాదాద్రి లాంటి ఆలయాన్ని కేసీఆర్ నిర్మించారు. ఈకాలంలో ఇలాంటి నిర్మాణం మహాద్భుతం. దేవాలయం ఇప్పుడే ప్రారంభం అయింది కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి* అని స్వరూపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు. -
యాదాద్రిలో దర్శనానికి 2 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో పంచనారసింహులను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. 30 వేల మందికి పైగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండుగా కనిపించాయి. -
నీళ్లు లేవు.. నీడ లేదు
సాక్షి, యాదాద్రి: మహోన్నత క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి దేవస్థానంలో వసతుల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపై మంచినీటి వసతి లేదు, ఆలయం లోపల ఉక్కపోత.. వెలుపల నిలువ నీడలేక ఎండకు భక్తులు అల్లాడిపోతున్నారు. నేరుగా కొండపైకి చేరుకునే వీలులేక ఆర్టీసీ బస్సుల్లో కిలోమీటర్ల దూరం కొండచుట్టూ ప్రయాణించడంతో సమయం వృథా అవుతోంది. కొండపైకి చేరుకున్న తర్వాత క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్లు దాటుకుని స్వామి దర్శనం చేసుకున్నాక ప్రసాద విక్రయశాల వరకు సుమారు 2 కిలోమీటర్లు తిప్పుతున్నారు. భక్తులు అధికంగా వచ్చే శుక్ర, శని, ఆదివారాలతో పాటు, కొద్ది సంఖ్యలో వచ్చే మంగళ, బుధవారాల్లో కూడా ఈ దూరాభారం తప్పడం లేదు. క్యూకాంప్లెక్స్‌లో ఏసీలు, ఫ్యాన్లు లేవు. ఇక మూత్ర శాలలు, మరుగు దొడ్లు అలంకార ప్రాయంగా ఉన్నాయి. క్యూలైన్ ఎస్కలేటర్లు, చలువ పందిళ్ల జాడలేదు. క్యూలైన్లలో దక్షిణ ప్రాకారం వద్ద చిరిగిన పాత టెంట్ వేయగా, ప్రథమ ప్రాకారం నుంచి గుడిలోకి వెళ్లే చోట భక్తులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. స్వామి దర్శనం తర్వాత భక్తులు బయటకు రాగానే కనీసం సేదదీరడానికి నీడ కూడా లేదు. ఆలయం వెలుపలి బండలు ఎండకు మండుతున్నాయి. కాళ్లు కాలుతుండడంతో భక్తులు పరుగులు తీస్తున్నారు. కొండ కింద సుమారు మూడు కిలో మీటర్లు వెళ్లే వరకు ఎక్కడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దర్శనం అనంతరం స్వామి వారి అన్న ప్రసాద వితరణ జరిగే దీక్షాపరుల మండపం వరకు బస్సు సౌకర్యం లేదు. కొండపైన, కొండకింద దుకాణాలు లేకపోవడంతో పూజా సామాగ్రి ఎక్కడ కొనాలో తెలియని పరిస్థితి నెలకొంది. భక్తుల తికమక.. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన భక్తుడు సంతోశ్ శనివారం తన కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి దర్శనానికి వచ్చారు. కొండకింద తులసీ కాటేజీ వద్ద కారు నిలిపారు. అక్కడి నుంచి కొండపైకి వెళ్లాలనుకుంటే కల్యాణ కట్టవద్ద ఉచిత దర్శనం టికెట్ తీసుకోవాలని పోలీసులు చెప్పి వెనక్కి పంపారు. ఆన్లైన్ కౌంటర్లో టికెట్ తీసుకుని మళ్లీ బస్సు ఎక్కి కొండపైకి వెళ్లారు. దీంతో సుమారు గంట సమయం వృథా అయ్యిందని సంతోశ్ ‘సాక్షి’తో చెప్పారు. సీఎం దృష్టికి తీసుకెళతా యాదాద్రి దేవాలయంలో భక్తుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతా. నేను కూడా స్వామి దర్శనానికి వచ్చా. క్యూలైన్లలో భక్తులతో మాట్లాడితే ఇబ్బందులు చెప్పారు. ఆలయ నిర్మాణమే తప్పుగా జరిగింది. భక్తుల కంటే స్వామివారు దిగువన ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు గర్భాలయంలోకి ప్రవేశించే పరిస్థితి లేదు. భక్తులకు కొండపైన కనీస వసతులు లేవు. ప్రైవేట్ వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తులకు తగిన వసతులు కల్పించాలి. – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ వసతులు కల్పించాలి –– పాశం భాస్కర్, భువనగిరి యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తులకు కనీస వసతులు కల్పించాలి. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనీసం మంచినీరు, వాష్‌రూంలు, నీడకోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం. దర్శనం అనంతరం ఆలయంనుంచి బయటకువచ్చే భక్తులు రెండు నిముషాలు ఆలయ ప్రాంగణంలో కూర్చునే వీలులేదు. ఉచిత టోకెన్లకు ఇబ్బందే.. శ్రీస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే ఉచిత టోకెన్ కౌంటర్ వద్ద ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జియో ట్యాగింగ్ పేరిట అరగంటకు పైగా సీఆర్వో కార్యాలయం వద్దకు వెళ్లి క్యూకట్టాలి. టోకెన్ తెస్తేనే కొండపైన దర్శనం అని అధికారులు చెబుతున్నారు. టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్తే.. ఎవరు కూడా టోకెన్‌ను చూడటం లేదు. కొండపైన క్యూకాంప్లెక్స్‌లో టోకెన్ చెక్ చేయనప్పుడు.. జియో ట్యాగింగ్ ఎందుకు? – స్వప్న, తార్నాక -
యాదాద్రి సమాచారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని సోమవారం ఉదయం 4 గంటలకు తెరుస్తారు. విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటల నుంచి వివిధ పూజాధికాలు.. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, కుంకుమార్చన. రాత్రి 9–9.30 రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం. ద్వార బంధనం. సర్వ దర్శనాలు: ఉదయం 6–7.30. మళ్లీ 10–11.45. మధ్యాహ్నం 12.30 –3. సాయంత్రం 5–7. రాత్రి 8.15–9. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 9 నుంచి 10 వరకు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వీఐపీలకు ఉదయం, సాయంత్రం కల్పించే బ్రేక్ దర్శనాలను శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో రద్దుచేసినట్లు ఈఓ గీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. యాదాద్రికి పోటెత్తిన భక్తులు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభూ పంచనారసింహులను ఆదివారం 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. పట్టణంలోని బస్టాండ్, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద భక్తులు భారీగా కనిపించారు. కొండపైన గల క్యూ కాం ప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తాగునీరు, మరుగుదొడ్ల వసతులు లేకపోవడంతో భక్తు లు ఇబ్బంది పడ్డారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడున్నర గంటలకు పైగా సమయం పట్టింది. -
యాదాద్రిలో స్వల్ప ఉద్రిక్తత
యాదగిరిగుట్ట: యాదాద్రీశుడి ఆలయంలో శనివారం భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఒకేసారి భక్తుల రద్దీ పెరిగిపోవడంతో ఆలయంలోని వివిధ విభాగాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రసాదం కౌంటర్ల వద్ద పురుషులకు, మహిళలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు, అధికారులకు మధ్య స్వల్ప గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భక్తులు ప్రసాదం కౌంటర్ల అద్దాలను ధ్వంసం చేశారు. లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయడానికి వెళ్తే అక్కడ దుస్తులు మార్చుకోవడానికి సరైన ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన చెందారు. పనిచేయని కంప్యూటర్లు.. భక్తులు ఉచిత దర్శనం టికెట్ పొందేందుకు కొండ కింద కల్యాణ కట్ట వద్ద సీఆర్వో కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ జియో ట్యాగింగ్ చేయడానికి కంప్యూటర్ మిషన్లు పనిచేయలేదు. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు వచ్చి జియో ట్యాగింగ్, ఉచిత టికెట్లు లేకుండానే భక్తులను కొండపైకి తరలించారు. స్వామివారి ఆరగింపు సమయంలో, గవర్నర్ వచ్చిన సమయంలో సుమారు 2 గంటల పాటు సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేశారు. క్యూకాంప్లెక్స్‌లో ఏసీలు, ఫ్యాన్లు సరిగ్గా పని చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. దర్శనానికి రెండు గంటల సమయం దైవ దర్శనానికి 20 వేల మంది భక్తులు తరలిరాగా ప్రధానాలయంలో స్వయంభూల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. శనివారం ఒక్కరోజే యాదాద్రీశుడిని 20వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కాగా.. వివిధ పూజలతో శ్రీస్వామి వారి ఆలయానికి రూ.14,43,390 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీస్వామి వారికి నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. -
యాదాద్రీశుడి సేవలో గవర్నర్
యాదగిరిగుట్ట: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రధానాల యం తూర్పు రాజగోపురం వద్ద గవర్నర్ దంపతు లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పంచ నారసింహులు కొలు వైన స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. ముఖ మండపంలో వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అంద జేశారు. దైవదర్శనం తరువాత గవర్నర్ దంపతులు ప్రధానాలయ కట్టడాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఉత్తర రాజగోపురం వద్ద తమిళిసై మాట్లా డుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్రానికి వచ్చిన చిన్నారులతో గవర్నర్ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆలయానికి వచ్చిన గవర్నర్... 2:10 గంటలకు తిరిగి వెళ్లారు. గవర్నర్ వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి తదితరులున్నారు. గవర్నర్ పర్యటనకు దూరంగా ఈఓ.. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానా లయం పునఃప్రారంభమైన తరువాత తొలిసారి స్వయంభూలను దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై పర్యటనకు ఆలయ ఈవో గీతారెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశ మైం ది. యాదాద్రీశుడి దర్శనానికి శనివారం మధ్యా హ్నం గవర్నర్ వస్తున్న విషయాన్ని రాజ్ భవన్ అధికారులు ఆలయ అధికారులకు ముందుగా నే సమాచారం అందించారు. ఆలయ మర్యాద లు, ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌కు ఈవో స్వా గతం పలకాలి. అలాగే దగ్గరుండి పూజలు చే యించాల్సి ఉంది. కానీ ఈవో గీతారెడ్డి గవర్న ర్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆల య అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి గవర్నర్ దంపతులను దగ్గరుండి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. తరువాత స్వ యంగా లడ్డూ ప్రసాదం అందజేశారు. అయితే గవర్నర్ పర్యటనకు డుమ్మాకొట్టిన ఈవో... సా యంత్రం ఆలయంలో జరిగిన సేవలో, ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొనడం గమనార్హం. చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ -
యాదాద్రి సమాచారం: ఆలయ వేళల్లో మార్పులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేసినట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్పులను భక్తులు గమనించాలని సూచించారు. ►సర్వదర్శన వేళలు: ఉదయం 6 నుంచి 7.30 వరకు, తిరిగి 10 నుంచి 11.45 వరకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు, రాత్రి 8.15 నుంచి 9 వరకు.. ►బ్రేక్ దర్శనాలు: ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు.. ►విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 – 4 గంటల మధ్య ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. రాత్రి 9 నుంచి 9.30 వరకు రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం, ద్వార బంధనం. ►ఆండాళ్ అమ్మవారి సేవ: ప్రధానాలయంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. స్వర్ణ తాపడానికి రూ.18.71 కోట్ల విరాళాలు సాక్షి, యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి భక్తుల నుంచి వచ్చిన విరాళాలను దేవస్థానం అధికారులు గురువారం ప్రకటించారు. బుధవారం సాయంత్రం వరకు భక్తుల నుంచి రూ.18,71,11,346 దేవస్థానం ఖాతాలో జమయ్యాయని తెలిపారు. దివ్య విమాన గోపురానికి 125 కిలోలతో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.65 కోట్లు ఖర్చవుతాయని అంచనా. -
యాదాద్రి సమాచారం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని బుధవారం వేకువజామున 3 గంటలకు తెరుస్తారు. విశేష పూజలు: తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం. అనంతరం విశేష పూజాధికాలు. మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు స్వామివారికి మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు).. ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.30 వరకు తిరువారాధన. 7.30 నుంచి 8.15 వరకు సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. 9.15 నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన (ఆరగింపు). 9.45 నుంచి 10 గంటల వరకు శయనోత్సవం.. ఆలయ ద్వారబంధనం. సర్వ దర్శనాలు: 6.30 నుంచి 8 గంటల వరకు. తిరిగి 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మళ్లీ 12.45 నుంచి 4 గంటల వరకు, ఆపై సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు..చివరిగా రాత్రి 8.15 నుంచి 9.15 వరకు సర్వ దర్శనాలు. వీఐపీ బ్రేక్ దర్శనాలు: ఉదయం 8 నుంచి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. 16 నుంచి నిత్య కల్యాణాలు! యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో వచ్చే నెల 16 నుంచి నిత్య కల్యాణం, సుదర్శన హోమం, బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పూజలకు సంబంధించి త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. యాదాద్రిలో ప్రసాదం కౌంటర్లు ప్రారంభం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనాన్ని ఆలయ ఏఈవో శ్రావణ్ కుమార్ మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. కల్యాణ కట్ట వద్ద ఏర్పాటు చేసే సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయం (సీఆర్వో) వద్ద టికెట్లు తీసుకుని, కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈ ప్రసాదం కౌంటర్లలో ప్రసాదం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మంగళవారం ప్రసాదం కొనుగోలు ద్వారా ఆలయానికి రూ.817,580 ఆదాయం వచ్చింది. – యాదగిరిగుట -
Yadadri Temple: వైకుంఠమే దిగివచ్చింది!
అల వైకుంఠపురం భువికి దిగి వచ్చిందా అన్నట్టుగా యాదాద్రి శోభాయమానమైంది. పునర్నిర్మాణ ఆలయ మహాకుంభ సంప్రోక్షణ అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆలయ శిఖరాలు, ఉప ఆలయ సన్నిధులు, ప్రాకార మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీల దర్శనం అనంతరం భక్తులు ఆలయానికి పోటెత్తారు. కృష్ణశిలలతో అబ్బురపరిచే శిల్పాలతో రూపుదిద్దుకున్న అద్భుత నిర్మాణం ఓవైపు.. యాదగిరీశుడి స్వయంభూ దర్శనం మరోవైపు భక్తులను తన్మయత్వంలో ముంచేశాయి. సాక్షి,యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి తరలివచ్చి నారసింహుడి సేవలో పాల్గొన్నారు. తొలుత బాలాలయం నుంచి స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, అళ్వారులు, అండాళ్ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని శోభాయాత్ర నిర్వహించారు. తిరువీధులతో ప్రదక్షిణ చేసి మూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని, పూజలు చేశారు. వేద మంత్రాల మధ్య మహాకుంభ సంప్రోక్షణ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్, కేసీఆర్ మనవడు హిమాన్షు, దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఆచార్యులు విమాన గోపురాల వద్దకు చేరుకున్నారు. తొలుత గర్భాలయంపై ఉన్న విమానగోపురం వద్ద పూజలు చేసి, ఆశీర్వచనం నిర్వహించారు. కేసీఆర్‌కు కంకణధారణ చేసి, సుదర్శన చక్రానికి పూజలు చేయించారు. అనంతరం దివ్య విమాన రాజగోపురం వద్ద ఉదయం 11:55 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త మిథునలగ్న అభిజిత్ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు. ప్రధానాచార్యులు నల్లంథీఘల్ లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో సువర్ణ సుదర్శన చక్రానికి బంగారు కలశంలో నింపిన పవిత్ర నదీజలాలతో మహాకుంభాభిషేకం (సంప్రోక్షణ) నిర్వహించారు. ఇదే సమయంలో మిగతా గోపురాల వద్ద మంత్రులు కుంభ సంప్రోక్షణ చేశారు. చివరిగా సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు, హారతి నివేదన పూర్తి చేశారు. కుటుంబ సభ్యులతో వీఐపీలు.. సీఎం పిలుపు మేరకు యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మహాకుంభ సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో అందరినీ ప్రధానాలయ ముఖమండపంలో కూర్చో బెట్టారు. అంతా సంప్రదాయ వస్త్రాలు ధరించారు. అర్చకులతో కలిసి భజనలు చేస్తూ నారసింహ జపం చేశారు. గర్భాలయంలో సీఎం కుటుంబ సభ్యుల అనంతరం అంతా దర్శనాలు చేసుకున్నారు. మొత్తంగా పంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం సంప్రదాయబద్ధంగా యాదాద్రి ఆలయ ఉద్ఘాటన క్రతువును పూర్తి చేశారు. సన్మానాలు చేసిన సీఎం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న దేవస్థానం అభివృద్ధి మండలి వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఆలయ ధర్మకర్త నర్సింహమూర్తి, ఆర్కిటెక్టులు ఆనంద సాయి, మధుసూదన్, స్థపతులు సుందర రాజన్, ఆనందాచారి వేలు తదితరులను సీఎం, మంత్రులు సన్మానించారు. మంత్రులు, వీఐపీల పూజలు.. దివ్యవిమాన గోపురం వద్ద సీఎం కేసీఆర్ సంప్రోక్షణ పూజలు చేయగా.. తూర్పు రాజగోపురంపై దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు; దక్షిణ రాజగోపురం వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు; పశ్చిమ రాజగోపురం వద్ద మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు; ఉత్తర రాజగోపురం వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు; పశ్చిమ రాజగోపురం(సప్తతల) వద్ద మంత్రి పువ్వాడ అజయ్ దంపతులు; తూర్పు (త్రితల) రాజగోపురం వద్ద మంత్రి గంగుల కమలాకర్ దంపతులు; ఆండాళ్ అమ్మవారి సన్నిధి వద్ద విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి; గరుడాళ్వార్ సన్నిధి వద్ద అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి; ఆంజనేయస్వామి సన్నిధి వద్ద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి; ఆగ్నేయ ప్రాకార మండపం–2 వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి; వాయవ్య ప్రాకార మండ పాల వద్ద మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి; ఈశాన్య ప్రాకార మండపాల వద్ద మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంప్రోక్షణ పూజలు చేశారు. కిక్కిరిసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ఉద్ఘాటన, స్వయంభూ దర్శనం పునః ప్రారంభం కోసం వచ్చిన వీఐపీలు, వారి కుటుంబ సభ్యులు, భక్తులతో యాదాద్రి నిండిపోయింది. సోమవారం మొదట సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, వారి కుటుంబ సభ్యులు ఆలయంలో నారసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాధారణ భక్తులను అనుమతించారు. అప్పటికే యాదగిరిగుట్ట పట్టణ శివార్లలో వేచి ఉన్న వేలాది మంది భక్తులు వరుసకట్టారు. కొండ దిగువన కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి.. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి యాదాద్రిపైకి చేరుకున్నారు. సుదూ ర ప్రాంతాల నుంచీ వచ్చిన భక్తులు స్వామి వారి స్వయంభూ విగ్రహాలను దర్శించుకుని తన్మయత్వంలో మునిగిపోయారు. పూర్తి రాతితో నిర్మించిన ఆలయాన్ని సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. ముగిసిన పంచకుండాత్మక యాగం పంచనారసింహుడు కొలువైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. 7 రోజులు కొనసాగిన సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు ఆచార్యులు 8వ రోజు సోమ వారం రాత్రి ముగింపు పలికారు. మహాకుంభ సంప్రోక్షణ తర్వాత ప్రధానాలయంలో శాంతి కల్యాణం జరిపించారు. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, రంగాచార్యులు పాల్గొన్నారు. జయజయధ్వానాల మధ్య.. మహాకుంభ సంప్రోక్షణ పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులు ప్రధానాలయంలోకి చేరుకున్నారు. ధ్వజ స్తంభానికి, గరుఖ్మంతుడికి పూజలు చేశారు. గర్భాలయం గడపకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ పూజ చేశారు. తర్వాత భక్తుల జయజయధ్వానాల మధ్య ఆచార్యులు స్వయంభూ లక్ష్మీనరసింహుడి గర్భాలయం ద్వారాలను తెరిచారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు లోనికి వెళ్లి ప్రథమ పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదం ఇచ్చారు. సీఎం దంపతులకు ఆలయ ప్రధాన అర్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనర్సింహచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు మహావేద ఆశీర్వచనం ఇచ్చారు. మహాకుంభ సంప్రోక్షణ ఇదీ నూతనంగా నిర్మించిన ఆలయం, గోపురాలపై ఏర్పాటు చేసిన కలశాలకు పంచారాత్ర ఆగమశాస్త్రం ప్రకారం చేసిన పూజలే మహాకుంభ సంప్రోక్షణ. ఇందుకోసం ఈ నెల 21 నుంచి బాలాలయంలోని యాగశాలలో పంచకుండాత్మక హోమం నిర్వహించారు. బిందెలలో నింపిన పవిత్ర నదీజలాలకు మహామంత్రాలతో ఆవాహన చేశారు. ఆ పవిత్ర జలాలతో ప్రధానాలయ గోపురాలపై కలశాలు, సుదర్శన చక్రానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించారు. పవిత్ర మంత్ర జలాల అభిషేకం, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయం పవిత్రమై.. భక్త కోటికి భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆచార్యులు తెలిపారు. యాదాద్రి సమాచారం యాదాద్రీశుడి ప్రధానాలయాన్ని ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు తెరుస్తారు. సుప్రభాతం, బిందెతీర్థం, ఆరాధన, బాలభోగం, నిజాభిషేకం, అలంకరణ, సహస్ర నామార్చన పూర్తిచేశాక.. 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. మధ్యలో 8 గంటల నుంచి గంటపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతిస్తారు. మధ్యాహ్నం 12.45 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. మధ్యలో 4 నుంచి 5 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8.15 వరకు పూజలు జరుగుతాయి. తర్వాత 9.15 గంటల వరకు మళ్లీ సర్వ దర్శనాలు ఉంటాయి. తర్వాత రాత్రి నివేదన, శయనోత్సవం, ద్వార బంధనం నిర్వహిస్తారు. విశేష పూజలివీ.. : ప్రతిరోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 9.15 గంటల వరకు సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం కొనసాగుతాయి. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, 6.45 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్బార్ సేవ ఉంటాయి. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ప్రతి మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11గంటల వరకు ఆకుపూజ.. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. శోభాయాత్ర నుంచి భోజనం దాకా.. యాదాద్రిలో 5 గంటలకు పైగా గడిపిన సీఎం కేసీఆర్ సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో ఆసాంతం సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఉదయం 9.20 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్లో టెంపుల్‌సిటీకి చేరుకున్న ఆయన.. 9.32 గంటలకు మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి వచ్చారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యు లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమాలు, పూజల వివరాలివీ.. ఉదయం ► 10.10: సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. తూర్పు రాజగోపురం నుంచి ప్రదక్షిణ చేశారు. ► 10.45: ఎంపీ సంతోష్, మనవడు హిమాన్షుతో కలిసి కేసీఆర్ విమాన గోపురంపైకి ఎక్కారు. ► 10.50: శోభాయాత్ర ముగిసింది. అర్చకులు బంగారు కవచ మూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. ► 11.04: కేసీఆర్ ఆధ్వర్యంలో మహాకుంభ సంప్రోక్షణ పూజలు మొదలుపెట్టారు. ► 11.22: విమాన గోపురం వద్ద కేసీఆర్, ఇతరులకు ఆశీర్వచనం చేశారు. ► 11.27: మంత్రులు, ప్రజాప్రతినిధులు వారికి కేటాయించిన గోపురాలు, ప్రాకార మండపాల వద్ద సంప్రోక్షణ పూజలు ప్రారంభించారు. ► 11.32: ఆచార్యులు సీఎం కేసీఆర్‌కు కంకణధారణ చేసి.. సుదర్శన చక్రానికి పూజలు చేశారు. ► 11.50: కేసీఆర్ గోత్రనామాలతో పూజలు చేస్తూ మహాకుంభ సంప్రోక్షణ చేసే బంగారు కలశాన్ని ఆయనకు అందించారు. ► 11.55: విమాన గోపురానికి ఏర్పాటు చేసిన స్వర్ణ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్.. మిగతా గోపురాలకు మంత్రులు ఏకకాలంలో కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. ► 11.58: సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు చేసి, హారతి ఇచ్చారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు కల్యాణకట్టలో తలనీలాలు.. యాదగిరిగుట్ట: లక్ష్మీనర్సింహుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అధునాతనంగా నిర్మించిన కొత్త కల్యాణకట్టను చూసి ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు తిరుమల తరహాలో భక్తులకు టోకెన్లు ఇచ్చి.. తలనీలాలు తీసేచోటికి పంపా రు. దర్శనానికి వచ్చిన భక్తులంతా కొండ కింద నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు అచరించారు. పుష్కరిణి మధ్య ఏర్పాటు చేసిన దేవతామూర్తులకు పూజలు చేశారు. అనంతరం దర్శనం కోసం కొండపైకి వెళ్లారు. ప్రత్యేక బందోబస్తు మధ్య..: యాదాద్రి ప్రధానాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది మహాద్భుతం యాదగిరిగుట్ట, రాజాపేట, మోటకొండూర్: యాదాద్రి ఆలయం తెలంగాణకే మకుటాయమానమని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో పాలుపంచుకోవటం ఆనందదాయకమని చెప్పా రు. యాదాద్రి ఆలయం అద్భుతమని, పునః ప్రారంభ క్రతువులో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత చెప్పారు. పువ్వాడపై తేనెటీగల దాడి యాదాద్రి ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్, వేద పండితులపై ఉదయం 11:45 సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. అలాగే సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించిన ఆయన.. అనంతరం హైదరాబాద్ వెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు. ఈ ఆనందంచెప్పలేనిది మేం గత 30 ఏళ్లుగా ప్రతినెలా యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటాం. ఆలయ పునః నిర్మాణం చేపట్టి స్వయంభూ దర్శనం నిలిపివేయడంతో ఆరేళ్లుగా బాలాలయంలో దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు తొలిరోజే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆలయం వైభవోపేతంగా రూపుదిద్దుకుంది. వైకుంఠంలో స్వామి వారిని దర్శించుకున్న అనుభూతి కలిగింది. –భాగ్యలక్ష్మి, సికింద్రాబాద్ మేం ఒకరోజు ముందే యాదాద్రికి వచ్చి వేచి ఉన్నాం. తొలిరోజు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనంతో మనసు పులకరించింది. నల్లరాతి కట్టడం, శిల్పాలు, అలంకరణ కనువిందుగా ఉన్నాయి. ఆలయం మరో తిరుపతిలా ఎంతో బాగుంది. – వెంకటమ్మ, పరిగి నాలుగేళ్ల కింద స్వామివారిని బాలాలయంలో దర్శించుకున్నాం. ఇప్పుడు నూతన ఆలయం, స్వయంభూ దర్శనం మొదలవడంతో కుటుంబ సమేతంగా వచ్చాం. సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ బస్సులో కొండపైకి చేరుకున్నాం. 30 నిమిషాల్లో స్వామివారి దర్శనం లభించింది. ఇది ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆలయ నిర్మాణం చాలా బాగుంది. – లక్ష్మి, సంగారెడ్డి -
యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్
-
యాదాద్రి: మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్
Updates సీఎం కేసీఆర్‌కు ఘన సన్మానం వైటీడీఏ, దేవస్థానం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, ఈవో ఘనంగా సన్మానించారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్ సన్మానించారు. ఆర్కిటెక్ ఆనందసాయి, ప్రధాన స్తపతి సుందర్ రాజన్, ఈవో గీతారెడ్డి, రుత్వికులు, పూజారులను సీఎం సన్మానించారు. తొలి పూజ నిర్వహించిన సీఎం కేసీఆర్ నరసింహస్వామివారి ప్రధాన ఆలయ ముఖద్వారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం నరసింహస్వామివారిని మొదటి దర్శనం చేసుకున్నారు. స్వామివారి గర్భాలయంలో తొలి పూజ నిర్వహించారు. 11.56AM యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ క్రతువు. మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు. పవిత్ర జలాలతో అభిషేకం చేసిన సీఎం కేసీఆర్ దంపతులు. సుదర్శన స్వర్ణ చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ. కేసీఆర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు 10: 57AM సప్త రాజగోపురాల కళాశాల వద్ద సిద్ధంగా ఉన్న వేద పండితులు, మంత్రులు. దివ్య విమాన గోపురం సుదర్శన చక్రం వద్ద మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మనుమడు హిమాన్ష్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. మహా కుంభ సంప్రోక్షణకు హాజరైన సీఎం కేసీఆర్ కూతురు కవిత, 15 మంది మంత్రులు, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, విప్స్, ఎమ్మెల్సీలు. 10:14AM యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాలయం నుంచి యాత్ర ప్రారంభం కాగా, ఇందులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.మంగళవాయిద్యాల నడుమ శోభయాత్ర కొనసాగుతోంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వడ అజయ్ కుమార్, విప్ గొంగిడి సునీత తదితరులు యాదాద్రికి చేరుకున్నారు. ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మొదలవుతుంది. ఆలయ పూజారులు, రుత్వికులు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. గోపురాలు, దైవ సన్నిధులు, ఉప ఆలయాలు, ప్రాకార మండపాల వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఉన్నతాధికారులు సంప్రోక్షణలో పాల్గొంటారు. తర్వాత గర్భాలయంలో సీఎం కేసీఆర్ తొలి పూజ చేస్తారు. అర్చకులు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సీఎం సన్మానిస్తారు. ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని యాగశాల స్థలం వద్ద మధ్యాహ్న భోజనాలు చేస్తారు. యాదాద్రీశుడి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాదాద్రికి వచ్చే వాహనాల విషయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల వాహనాలను యాదగిరిగుట్టకు సమీపంలోని వడాయిగూడెం వద్ద నిలపాలి. కీసర, సిద్దిపేట, గజ్వేల్, తుర్కపల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను మల్లాపురం వద్ద ఆపేస్తారు. రాజాపేట వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని స్పెక్ట్రా వెంచర్లో నిలపాలి. వరంగల్, జనగాం, ఆలేరు నుంచి వచ్చే భక్తుల వాహనాలను వంగపల్లి సమీపంలో నిలిపివేస్తారు. ఈ వాహనాలన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల తర్వాతే యాదగిరిగుట్ట పట్టణంలోకి అనుమతిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా! శ్రీ యాదగిరి నారసింహా!
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి ‘నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠోరమైన తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు’ అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏం కావాలో కోరుకో’’ అని అడిగితే, ‘‘నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి మళ్లీ ప్రత్య„ý మయ్యాడు. యాదర్షి కోరిక విని, ‘‘నా రూపాలన్నీ నువ్వు చూడలేవు’ అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది. స్వాగత తోరణం.. యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు. ఆలయ విశిష్ఠత గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు. గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి. ఆలయమంతా స్వర్ణమయం గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు. బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. శివాలయం... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 25న శివాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. విష్ణు పుష్కరిణి... కొండపైన విష్ణు పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణు పుష్కరిణిలో శ్రీస్వామి వారికి మాత్రమే ఉపయోగించనున్నారు. గిరి ప్రదక్షిణ... శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు మండల దీక్ష చేసే భక్తులు సైతం ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణను ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణిలో భక్తుల స్నానాలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గండి చెరువు సమీపంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణి లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా పలువురు భక్తులు బాలాలయం లో శ్రీస్వామి వారిని కొండపైన దర్శనం చేసుకొని, అనంతరం కొండ కింద జరుగుతున్న నిర్మాణాలను తిలకించారు. ఈ సమయంలో లక్ష్మీ పుష్కరిణిలోకి వెళ్లి స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. కల్యాణ కట్ట ప్రారంభం.. ఆధునిక హంగులతో నిర్మాణం చేసిన కల్యాణ కట్టను ఈవో గీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. 28వ తేదీ నుంచి ప్రధానాలయంలో స్వయంభూల దర్శనం కలగనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది, ఇందులో భాగంగానే ముందస్తుగా కల్యాణ కట్టలో పూజలు చేసి ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా ఈ కల్యాణ కట్టలోనే తలనీలాలను సమర్పించుకోనున్నారు. స్వామి పుష్కరిణి ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే ‘విష్ణుకుండం’ అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించి స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది. వైకుంఠద్వారం... యాదాద్రి కొండపైకి నడకదారిన వెళ్లే భక్తులు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లాలి. ఈ వైకుంఠద్వారాన్ని యాలీ పిల్లర్ల మీద ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మెట్లదారి నుంచి శ్రీస్వామి వారి క్షేత్రానికి వెళ్లవచ్చు. అన్నప్రసాదం... గండి చెరువుకు కొద్ది దూరంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం కోసం అన్నసత్ర భవనాన్ని 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థ రూ.6కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.11కోట్లను వేగేశ్న సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ మండపం స్లాబ్ లెవల్ పనులు పూర్తయ్యాయి. కల్యాణ కట్ట... శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.20.3కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షాపరుల మండపం శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. 1.88 ఎకరాల స్థలంలో రూ.8.09 కోట్ల వ్యయంతో ఈ దీక్షారుల మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 140 మంది పురుషులు, 108 మంది మహిళ భక్తులు దీక్షలు చేసే సమయంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. గండి చెరువు... శ్రీస్వామి వారి తెప్పోత్సవం కోసం గండి చెరువును వైటీడీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఇందులో శ్రీస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సేద తీరేందుకు లాన్స్, గ్రీనరీ, బేంచీలను ఏర్పాటు చేసి, బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలనొసగే ‘ప్రదక్షిణల మొక్కు’ ఈ క్షేత్రంలో ప్రదక్షిణల మొక్కు’ ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్ధమండలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు. యాగ స్థలం... యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం చేయాలని అధికారులు భావించారు. కానీ అనివార్య కారణాలతో ఈ యాగం వాయిదా పడింది. ఇప్పుడు ఇందులో భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. లక్ష్మీపుష్కరిణి... కల్యాణకట్టకు ఎదురుగానే భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణిని ఆధ్యాత్మిక హంగులతో అద్భుతం గా నిర్మించారు. 2.13 ఎకరాల్లో రూ.6.67కోట్ల వ్యయంతో ఈ లక్ష్మీ పుష్కరిణి రూపుదిద్దుకుంది. ఇందులో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లను నింపుతున్నారు. త్వరలోనే గోదావరి జలాలను సైతం నింపనున్నారు. ఈ పుష్కరిణిలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. వ్రత మండపం... అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తరువాత యాదాద్రీశుడి ఆలయంలోనే భక్తులు అధిక సంఖ్యలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఇందుకోసం నిర్మిస్తున్న వ్రత మండపం ఇది. లడ్డూ ప్రసాదం.. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా లడ్డూ, పులిహోరకే మక్కువ చూపెడతారు. ఇందుకు వైటీడీఏ అధికారులు అధునాతన హంగులతో మానవ ప్రమేయం లేకుండా మిషన్ల ద్వారా ప్రసాదం తయారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎంత మంది వస్తే అంత మందికి లడ్డూ, పులిహోర, ఇతర ప్రసాదం తయారీ చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, లైన్లు ఏర్పాటు చేశారు. పూర్వ జన్మ సుకృతం ‘‘యాదాద్రి నరసింహుని ఆలయ పునర్నిర్మాణం కోసమే భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించి ఉంటాడు. అందుకోసమే భక్తులకు కావాల్సిన రీతిలో క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోగలిగాను. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ ప్రకారం పని చేయడానికి నన్ను పిలిపించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్ ద్వారా ఆలయ ప్లాన్‌ను ఆమోదించారు. ఆ క్రమంలో నన్ను అదనపు స్థపతి, సలహాదారుగా నియమించారు. స్వామివారి ప్రధానాలయం, శివాలయం కార్యనిర్వహణ పనిని అప్పగించారు. స్థపతులు, శిల్పులు, టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు... ఇలా అందరి భాగస్వామ్యంతో నాకప్పగించిన పనులు పూర్తి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నిమిషం ప్రతి మనిషి పక్కన స్వామి వారే ఉండి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇది ఏ ఒక్కరి వల్లా పూర్తి కాలేదు. స్వామివారి ఆజ్ఞగానే భావించి అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. సర్వేజనాస్సుఖినోభవంతు అన్న విధంగా స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన నేను.. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. స్వామివారికి సహస్రాధిక నమస్సులు తెలియజేసుకుంటున్నాను’’. – స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది.దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ మహాక్రతువులో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో పూర్తి కావించారు. యావత్ భక్త ప్రపంచం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. నేటి ఉదయం నిత్యకైంకర్యం గావించగానే బాలాలయంలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది. వెంటనే శ్రీస్వామి వారు మేళతాళాలు, స్వస్తి మంత్రాలు, వేద దివ్య ప్రబంధ పాశుర పఠనాలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు. అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 11.45 నిమిషాల నుంచి గోపురాలకు పూజలు నిర్వహించి, 11.55కు కుంభాభిషేకం ఏకకాలంలో జరిపిస్తాం. 92 స్థానాల్లో 200 మంది రుత్విక్కులు పాల్గొని ఏకకాలంలో అన్ని గోపురాలు, ప్రాకార మండపాలు, గర్భాలయం, ఆండాల్, ఆళ్వార్, రామానుజులు, విష్వక్సేన సన్నిధి, చతుర గోపురాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయంలో మొదటి పూజ, మంత్రపుష్ప నీరాజనాలు, ప్రసాద వినియోగం పూర్తవుతాయి. తర్వాత సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం సంధ్యాసమయానికి ద్వితీయ ఆరాధన పూర్తి కాగానే శాంతి కల్యాణం నిర్వహించి ఉత్సవాలకు వచ్చిన పండితులకు సన్మానం చేస్తాం. భక్తులకు శ్రీస్వామి వారి ఆశీర్వచనం ఉంటుంది. – నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆలయ ప్రధానార్చకులు కథనాలు: సాక్షి యాదాద్రి, యాదగిరి గుట్ట, ఫొటోలు: కొల్లోజు శివకుమార్, సాక్షి భువనగిరి -
మూడు వేల మందితో బందోబస్తు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా పెద్ద సంఖ్యలో వీఐపీలు పాల్గొంటుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట పట్టణం, రాయగిరి నుంచి వచ్చే రహదారి, చుట్టుపక్కల ప్రాంతాలు, రింగ్‌రోడ్డు, కొండపైన కలిపి సుమారు మూడు వేల మంది పోలీసు సిబ్బంది పహరా కాస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సివిల్ పోలీసులతోపాటు ట్రాఫిక్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఐటీ, ఇంటెలిజెన్స్, ఎస్బీ, షీటీం విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. బాంబ్, డాగ్ స్వా్కడ్ బృందాలతో ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇక యాదగిరిగుట్ట పట్టణం, యాదాద్రి కొండ, వీఐపీలు పర్యటించే ప్రాంతాల్లో కలిపి 442 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో వెబ్ కాస్టింగ్ వాహనంతో పరిశీలన జరుపుతున్నారు. 3 గంటలదాకా ‘గుట్ట’బయటే.. యాదాద్రీశుడి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాదాద్రికి వచ్చే వాహనాల విషయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ♦సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల వాహనాలను యాదగిరిగుట్టకు సమీపంలోని వడాయిగూడెం వద్ద నిలపాలి. ♦కీసర, సిద్దిపేట, గజ్వేల్, తుర్కపల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను మల్లాపురం వద్ద ఆపేస్తారు. ♦రాజాపేట వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని స్పెక్ట్రా వెంచర్లో నిలపాలి. ♦వరంగల్, జనగాం, ఆలేరు నుంచి వచ్చే భక్తుల వాహనాలను వంగపల్లి సమీపంలో నిలిపివేస్తారు. ఈ వాహనాలన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల తర్వాతే యాదగిరిగుట్ట పట్టణంలోకి అనుమతిస్తారు. పూర్తిస్థాయిలో భద్రత యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మేరకు పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశాం. దర్శనాల కోసం భక్తులు మధ్యాహ్నం 3గంటల తర్వాతే రావాలి. ప్రతి భక్తుడు క్యూ కాంప్లెక్స్ వద్ద జియో ట్యాగింగ్ చేసుకోవాలి. తర్వాత క్యూకాంప్లెక్స్‌లో నుంచి తూర్పు రాజగోపురం ద్వారా దర్శనాలకు వెళ్లవచ్చు. అనంతరం ప్రసాదాలు కొనుగోలు చేసి బస్సులో కొండ దిగాలి. –మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్ వీఐపీలు, ఉద్యోగుల వాహనాల పార్కింగ్ ఇలా.. ♦వీఐపీల వాహనాలను టెంపుల్ సిటీకి వెళ్లే మార్గంలో ఉన్న మున్నూరుకాపు సత్రం వద్ద నిలపాల్సి ఉంటుంది. ♦యాదాద్రి క్షేత్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, మీడియా, ఆచార్యుల వాహనాలను పాత గోశాలలోని సత్యనారాయణస్వామి వ్రత మండపం వద్ద నిలపాలి. ♦ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలను తులసీ కాటేజీలో పార్కింగ్ చేయాలి. -
నమో నారసింహ
సాక్షి, యాదాద్రి: కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ మహాక్రతువులో చివరగా మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించి, ప్రధాన ఆలయంలో దర్శనాలను మొదలుపెడతారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంభూ నారసింహుడి వద్ద తొలిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రధానాలయంతోపాటు పరిసర ప్రాంతాలను ముస్తాబు చేశారు. పంచాకుండాత్మక యాగం ముగించి.. తొలుత ఉదయం 6.30 గంటలకు బాలాలయంలో హవనం ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల సమయంలో పూర్ణాహుతితో పంచకుండాత్మక యాగం ముగుస్తుంది. అనంతరం స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, ఆళ్వారులు, ఆండాళ్ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని బాలాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతారు. ప్రధానాలయం చుట్టూ శోభాయాత్ర నిర్వహించాక మూర్తులను లోనికి తీసుకెళతారు. ఏకకాలంలో అన్నిచోట్లా.. శోభాయాత్ర అనంతరం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మొదలవుతుంది. ఆలయ పూజారులు, రుత్వికులు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. గోపురాలు, దైవ సన్నిధులు, ఉప ఆలయాలు, ప్రాకార మండపాల వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఉన్నతాధికారులు సంప్రోక్షణలో పాల్గొంటారు. తర్వాత గర్భాలయంలో సీఎం కేసీఆర్ తొలి పూజ చేస్తారు. అర్చకులు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సీఎం సన్మానిస్తారు. ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని యాగశాల స్థలం వద్ద మధ్యాహ్న భోజనాలు చేస్తారు. కలశ ప్రతిష్ట, ప్రారంభ పూజలకు అతిథులు వీరే.. మహకుంభ సంప్రోక్షణ సందర్భంగా.. ప్రధానాలయం విమాన గోపురం వద్ద సీఎం కేసీఆర్ పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు. తూర్పు రాజగోపురం వద్ద దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, దక్షిణ రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి, పశ్చిమ రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉత్తర రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, పశ్చిమ రాజగోపురం (సప్తతల) వద్ద మంత్రి పువ్వాడ అజయ్, తూర్పు రాజగోపురం (త్రితల) వద్ద మంత్రి గంగుల కమలాకర్ పూజలు చేస్తారు. శ్రీగరుడ ఆళ్వార్ సన్నిధి వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీఆంజనేయస్వామి సన్నిధి వద్ద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బ్రహోత్సవ మండపం వద్ద మంత్రి కేటీఆర్, ఆళ్వార్ సన్నిధిలో మంత్రి సత్యవతి రాథోడ్, ఆగ్నేయ ప్రాకార మండపం–3 వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వాయవ్య ప్రాకార మండపం–18 వద్ద మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం–21 వద్ద మంత్రి మల్లారెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం–22 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈశాన్య ప్రాకార మండపం–23 వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈశాన్య ప్రాకార మండపం–24 వద్ద మంత్రి హరీశ్‌రావు, శ్రీరామానుజ సన్నిధి వద్ద సీఎస్ సోమేశ్‌కుమార్, వాయవ్య ప్రాకార మండపం–17 వద్ద ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పాల్గొంటారు. జంటలుగా వీఐపీలు ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న ముఖ్యులు దం పతులతో కలిసి రావాలని ఆహ్వానంలో కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు జంటగా పూజల్లో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదీ.. ► సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో సోమవారం ఉదయం 10.45 గంటలకు యాదాద్రి టెంపుల్ సిటీకి వస్తారు. ► ప్రత్యేక కాన్వాయ్‌లో 10.50 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుంటారు. ► 11.20 గంటలకు మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా యాదాద్రి కొండపైకి వస్తారు. ► కేసీఆర్, కుటుంబ సభ్యులు 11.30 గంటలకు ప్రధానాలయం చుట్టూ నిర్వహించే స్వామివారి శోభయాత్రలో పాల్గొంటారు. ► తర్వాత 11.55 గంటలకు ప్రధానాలయ విమాన గోపురం వద్ద మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు. ► 12.30 గంటల సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి గర్భాలయంలో తొలిపూజ చేస్తారు. ► వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందుకుని.. ఆలయ పునర్నిర్మాణ క్రతువులో పాల్గొన్నవారిని సన్మానిస్తారు. ► మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొండ కింద యాగస్థలంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ భోజనాలు చేస్తారు. తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. పూలు, దీపాలతో అలంకరించి.. మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పూలతో ప్రధానాలయం, మండపాలు, ధ్వజ స్తంభం, గర్భాలయాన్ని ముస్తాబు చేశారు. యాదాద్రి ప్రధానాలయం, పరిసరాలతోపాటు కొండ మొత్తం రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. -
నేత్రదర్శనం.. యాదాద్రి దివ్యక్షేత్రం
యాదగిరి నరసింహుని దివ్యదర్శనం ఆరేళ్ల తర్వాత భక్తులకు లభించనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా రేపు పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది. యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం... యాదాద్రిలో వెలసిన పంచ నారసింహక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు స్వయంభువులుగా వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా, అనన్యసామాన్యంగా నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలదే సింహభాగం. ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా 9.5 లక్షల ఘనపు మీటర్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలను వినియోగించారు. ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. ఆధునికకాలంలో ఇలా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం. విమాన గోపురాన్ని ద్రవిడ శిల్పకళారీతిలోను, అష్టభుజి మండపంలోని గోపురాలను పల్లవ శైలిలోను రూపొందించారు. కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖమంటపాలను కాకతీయ శైలిలో నిర్మించారు. పదిమంది స్థపతులు, ఎనిమిదివందల మంది శిల్పులు ఆలయ మండపాలు, గోపురాలపై 541 దేవతారూపాలను, 58 యాలీ పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణం, శిల్పాల రూపకల్పనలో రఘునాథ పాత్రో, ముత్తయ్య స్థపతి, సౌందరరాజన్, డాక్టర్ ఆనందాచారి వేలు వంటి నిష్ణాతులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన కృష్ణశిల ఏళ్లు గడిచేకొద్ది మరింత నునుపుదేలి, నాణ్యతను సంతరించుకుంటుంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆలయ పునర్నిర్మాణం కోసం భారీస్థాయిలో కృష్ణశిల అవసరం కావడంతో రాష్ట్ర గనులశాఖ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి, నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గురుజపల్లిలో నాణ్యమైన కృష్ణశిల లభించడంతో, ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. రాళ్ల నాణ్యతను ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్’ సంస్థ, వాటితో చెక్కిన శిల్పాల నాణ్యతను ‘మెస్సెర్స్ సివిల్స్ ఇంజినీర్స్’ సంస్థలు పరిశీలించి, ధ్రువీకరించాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. యాదాద్రి ఆలయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. శ్రీవైష్ణవ భక్తిసంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలను, రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడవీథులు, పురవీథుల ప్రాకారాలు, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు– ఇలా ఆలయంలోని ప్రతి నిర్మాణంలోనూ అణువణువునా విష్ణుతత్త్వం ప్రతిఫలించేలా రూపొందించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దేశంలోని అనేక శిల్పకళారీతులను స్వయంగా అధ్యయనం చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఇతర అధికారులు దేశవ్యాప్తంగా సంచరించి, వివిధ ఆలయ శిల్పరీతులను పరిశీలించి వచ్చారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండువేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో అహరహం శ్రమించారు. గుట్టకు మరో గుట్ట జోడింపు ఇదివరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి, మరో మూడెకరాలను కలిపారు. ఉపరితలం నుంచి ఎనభై అడుగుల ఎత్తువరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా, సహజసిద్ధంగా ఉండేలా మట్టితో ఎనభై అడుగుల ఎత్తు వరకు నింపి, మూడెకరాలను విస్తరించారు. మహాయజ్ఞంలా సాగిన ఈ ప్రక్రియకు ఏడాదిన్నర పట్టింది. కొండ కోసం తరలించిన మట్టి, రాళ్లు కూలిపోకుండా పటిష్ఠంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కొత్తగా విస్తరించిన కొండభాగం పటిష్ఠతను, నాణ్యతను జేఎన్టీయూ, ‘నిట్’ నిపుణులు పరీక్షించారు. చలికాలంలో, ఎండాకాలంలోనే కాకుండా భారీగా వర్షాలు కురిసినప్పుడు కొత్తగా జోడించిన కొండ ఎలా ఉంటుందనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. రెండు సీజన్లలో భారీ వర్షాలు పడినప్పటికీ, కొత్తగా జోడించిన కొండ ఏమాత్రం చెక్కుచెదరలేదు. భారీ వాహనాలు, క్రేన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపినా ఎలాంటి సమస్యలూ తలెత్తకపోవడంతో, కొన్ని వందల ఏళ్ల వరకు కొండ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు తేల్చారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్ దాదాపు 2,400 డ్రాయింగ్లను పరిశీలించి, ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. మొత్తం ఆలయ నిర్మాణమంతా యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ఆధ్వర్యంలో జరిగింది. వైటీడీఏ చైర్మన్‌గా సీఎం వ్యవహరిస్తుండగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి కిషన్‌రావు వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా, వ్యయం రూ.1200 కోట్లకు పరిమితమైంది. ఇందులో భూసేకరణ కోసమే ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు రెండువేల ఎకరాల భూమిని సేకరించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశారు. రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్ వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు. రోజుకు నలభైవేల మంది భక్తులు వచ్చినా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 15 వీవీఐపీ కాటేజీలను నిర్మించారు. దాతల సహకారంతో 252 వీఐపీ కాటేజీలను నిర్మించనున్నారు. గానుగ సున్నంతోనే నిర్మాణం ఆధునిక నిర్మాణాల్లో రాళ్లు, ఇటుకలను జోడించి, వాటిని దృఢంగా నిలపడానికి సిమెంటు వాడటం మామూలే! అయితే, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నాన్నే ఉపయోగించారు. ఈ గానుగ సున్నం మిశ్రమం నాణ్యతను బెంగళూరులోని ‘బ్యూరో వెర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పరీక్షించి, ధ్రువీకరించింది. పెద్దపెద్ద జాయింట్ల వద్ద కొన్నిచోట్ల సీసాన్ని కూడా వాడారు. ఆలయంలోని తలుపులకు వాడిన కలపకు సైతం క్షుణ్ణంగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని అమర్చారు. బెంగళూరుకు చెందిన ‘ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ (ఐపీఐఆర్టీఐ) సంస్థ ఆధ్వర్యంలో కలప నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. కలప రకం, మందం, దారుఢ్యం, తేమను తట్టుకునే శక్తి వంటి లక్షణాలన్నింటినీ పరీక్షించి, ఉత్తమమైన కలపనే తలుపుల నిర్మాణం కోసం ఎంపిక చేశారు. యాదాద్రికి ఆనుకుని టెంపుల్ సిటీ ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో 850 ఎకరాలలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం దాదాపు వెయ్యికి పైగా వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. తొలిదశలో 252 వీఐపీ కాటేజీలను ఒక్కొక్కటి రూ.1.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి దాతలు ఏడాదిలో ముప్పయి రోజులు ఈ వసతిగృహాల్లో ఉండవచ్చు. వీటికి తోడు 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్ల పేరిట 15 కాటేజీలను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఒక్కోదానికి ఏడు కోట్లు ఖర్చు చేశారు. ఇక గుట్ట కింద తులసి కాటేజీలో అదనంగా 120 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కాకుండా, ఇంకా ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, ఆస్పత్రి, పాఠశాల వంటి వాటిని కూడా నిర్మించనున్నారు. వీటి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొండపైన విష్ణుపుష్కరిణి, కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణి, స్వామివారి తెప్పోత్సవం కోసం గండిచెరువు, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రతమండపం, ఆర్టీసీ, దేవస్థానం బస్టాండులు, గుట్ట చుట్టూ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఐదువందల బస్సులు తిరిగేందుకు అనువుగా బస్ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. యాదాద్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ అనుసంధానిస్తూ ఆరులేన్ల రహదారిని నిర్మించారు. ఈ రహదారికి ఇరువైపులా అందమైన పూల మొక్కలను పెంచడంతో, ఈ మార్గం పూలవనాన్ని తలపిస్తుంది. ఈ మార్గంలో నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన కూడళ్లలోనూ పూలమొక్కలను ఏర్పాటు చేశారు. గిరిప్రదక్షిణ చేయదలచుకున్న భక్తుల కోసం పన్నెండు అడుగుల వెడల్పుతో ప్రత్యేకమైన రోడ్డును నిర్మిస్తున్నారు. దాదాపు ఇరవైవేల మంది భక్తులు సులువుగా నడిచేందుకు వీలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారుచేసిన అల్యూమినియం, ఇత్తడి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సప్తగోపురాలు యాదాద్రి ప్రధాన ఆలయానికి సప్తగోపురాలను సర్వాంగ సుందరంగా మలచారు. ద్వితీయ ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు గోపురాలను, మూడు పంచతల గోపురాలను, ఒక సప్తతల మహారాజ గోపురాన్ని నిర్మించారు. పశ్చిమదిశలో మహారాజ గోపురాన్ని 85 అడుగుల ఎత్తున, ఒక్కో పంచతల గోపురాన్నీ 57 అడుగుల ఎత్తున, తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లే దారిలో 30.8 అడుగుల ఎత్తున త్రితల గోపురాన్ని, గర్భాలయంపైన విమాన గోపురాన్ని నిర్మించారు. విమానగోపురానికి భక్తుల విరాళాలతో 125 కిలోల బంగారు తాపడం చేయిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే నాటికి భక్తుల నుంచి రూ.17.59 కోట్ల నగదు, ఐదు కిలోల బంగారం వచ్చింది. దర్శన మార్గం గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సరిగ్గా గర్భాలయంపైన విమాన గోపురం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి, గండభేరుండ నారసింహుడు దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుత్మంతుని విగ్రహం, స్వామివారి ఎదుట భారీ దర్పణం, గర్భగుడికి పక్కన ఆండాళ్ అమ్మవారు, శయన మండపం, మెట్ల వెంబడి గరుత్మంతుని విగ్రహాలు, ఆలయంలో వెలుగులు విరజిమ్మే షాండ్లియర్లు, రాజస్థానీ పద్మాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామివారి ప్రధాన ఆలయం రెండో అంతర ప్రాకారాల వద్ద నాలుగు వైపులా నాలుగు మండపాలను నిర్మించారు. ఆగ్నేయంలో స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన రామానుజకూటం మండపం ఉంటుంది. ఈశాన్యంలో నిత్యకల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. రెండో బాహ్య ప్రాకారం వద్ద నాలుగు దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు. స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖమండపాన్ని 150 మందికిపైగా కూర్చునేందుకు అనువైన వేదికగా ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలోకి అడుగుపెడుతూనే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యేలా లోపలి వాతావరణాన్ని తీర్చిదిద్దారు. గర్భగుడి గోడలపై స్వామివారి శంఖుచక్రనామాలు, పంచనారసింహ రూపాలు, ప్రహ్లాద చరిత్ర శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. మూడు ఉపాలయాలు, శయన మండపం, బలిపీఠం, బంగారు తాపడంతో ధ్వజస్తంభం, దర్పణం భక్తులకు కనువిందు చేస్తాయి. చరిత్రలో యాదాద్రి చరిత్రను తరచి చూసుకుంటే, కాకతీయ రాజుల నుంచి నిజాం నవాబుల వరకు ఎందరో యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకుని, ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. కాకతీయులు పదమూడో శతాబ్దిలో ఒక ఆయుర్వేద వైద్యునికి ఈ స్థలాన్ని దానంగా ఇచ్చినట్లు ప్రచారంలో ఉన్నా, అందుకు తగిన ఆధారాలు లేవు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించిన శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. పదిహేనో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయలు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో దొరికిన ఆరువందల సంవత్సరాల నాటి శాసనాలను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరచారు. ఆకట్టుకునేలా ఆళ్వార్ల మండపం శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లకు ప్రత్యేక స్థానం ఉంది. వైష్ణవ భక్తిమార్గ ప్రచారకులుగా, స్వామివారి ప్రియభక్తులుగా ప్రఖ్యాతి పొందిన పన్నెండుమంది ఆళ్వార్లను వైష్ణవభక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటారు. అందుకే యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆళ్వార్ల మండపాన్ని ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేశారు. ఆళ్వార్ల మండపానికిపైన కాకతీయుల స్తంభాలను నిర్మించారు. ఒక్కో ఆళ్వార్ విగ్రహం, ఒక్కో కాకతీయ స్తంభం ఎత్తు 32 అడుగులు ఉంటాయి. పొయ్‌గయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిశైయాళ్వార్, కులశేఖరాళ్వార్, తిరుప్పొణాళ్వార్, తొండరడిప్పొడియాళ్వార్, తిరుమంగయాళ్వార్, మధురకవి ఆళ్వార్, ఆండాళ్, నమ్మాళ్వార్ విగ్రహాలను, తెలంగాణ శిల్పులు వెంకటకృష్ణ, పోతలూరు చారి, రాము తమ బృందంతో కలసి అద్భుతంగా తీర్చిదిద్దారు. పడమటి రాజగోపురం ముందుభాగంలో వేంచేపు మండపాన్ని నిర్మించారు. ప్రత్యేక ఉత్సవాల్లో ఊరేగింపు చేసేటప్పుడు స్వామివారిని భక్తుల సందర్శనార్థం ఇక్కడ కొద్దిసేపు అధిష్ఠింపజేస్తారు. తూర్పు రాజగోపురం ముందుభాగంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి, ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు మాత్రమే కాకుండా సహస్ర దీపాలంకరణ కోసం కూడా ఈ మండపాన్ని వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అరుదుగా అతికొద్ది ఆలయాల్లో మాత్రమే కనిపించే అష్టభుజి ప్రాకార మండపాన్ని యాదాద్రిలోనూ నిర్మించారు. అష్టభుజి ప్రాకార మండపం పైభాగంలో సాలహారాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేశవమూర్తులు, నవ నారసింహులు, ఆళ్వార్లు, అష్టదిక్పాలకులు, అష్టలక్షు్మలు, దశావతారాల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అష్టభుజి మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు. వైకుంఠద్వారం యాదాద్రి ఆలయానికి మెట్లమార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉంటుంది ఈ వైకుంఠద్వారం. పూర్వం వాహన సౌకర్యం లేని కాలంలో ఆనాటి భక్తులు కొందరు కొండపైకి వెళ్లేందుకు వీలుగా రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి వెళ్లి, మొక్కులు తీర్చుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చాలాకాలం వరకు ఇక్కడ మెట్లు ఉన్నాయనే విషయమే జనాలకు తెలిసేది కాదు. రామదయాళ్ సీతారామయ్య శాస్త్రి, నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, గాదె కిష్టయ్య తదితర భక్తులు 1947లో ఆస్థాన కమిటీగా ఏర్పడి, భక్తుల కోసం ఈ వైకుంఠద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లేందుకు 350 మెట్లు ఉండేవి. వీటికి ప్రతిరోజూ పసుపు కుంకుమలు పెట్టి భక్తులు పూజించేవారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వైటీడీఏ, ఆర్ అండ్ బీ అధికారులు 2019 నవంబరు 15న ఈ వైకుంఠద్వారాన్ని కూల్చివేసి, యాలీ పిల్లర్లపై భారీ వైకుంఠద్వారాన్ని కొత్తగా నిర్మించారు. ప్రస్తుతం ఈ వైకుంఠద్వారం నుంచే భక్తులు మెట్లమార్గంలో స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. ఇదివరకు స్వామివారి పాదాల వద్ద ఉన్న మెట్లదారిని తొలగించిన అధికారులు, కొత్తగా నిర్మించిన వైకుంఠద్వారం నుంచే మెట్లదారిని ఏర్పాటు చేశారు. ప్రసాదం తయారీకి ఆధునిక యంత్రాలు ప్రసాదం తయారీ కోసం యాదాద్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. పెద్దసంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ప్రసాదం తయారీ కోసం ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు లక్ష లడ్డూలను, రెండువేల కిలోల పులిహోర తయారు చేసేందుకు వీలుగా యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘అక్షయపాత్ర’ సంస్థవారు ప్రసాదం తయారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేవస్థానంవారే ప్రసాదం తయారు చేసేలా ‘అక్షయపాత్ర’ సంస్థవారు శిక్షణ ఇస్తున్నారు. బంగారు ధగధగలు యాదాద్రి ఆలయాన్ని స్వర్ణకాంతులతో ధగధగలాడేలా తీర్చిదిద్దారు. పంచనారసింహులు కొలువై ఉన్న గర్భాలయ ద్వారాలకు బంగారుతాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి సైతం ఇటీవల బంగారు తొడుగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల ద్వారాలకు వెండితొడుగులను బిగించనున్నారు. ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లోని ద్వారాలకు ఇత్తడి తొడుగులు వేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు బంగారు కలశాలను బిగించారు. అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు. ఆలయంలో అమర్చిన బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. ఉగాది తర్వాత శివాలయం ఉద్ఘాటన యాదాద్రిని హరిహర క్షేత్రంగా చెబుతారు. కొండపైనే అనుబంధ ఆలయంగా కొలువై ఉన్న పర్వతవర్ధని రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రాకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంలోని మండపాల్లో నాలుగువైపులా కృష్ణశిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుని విగ్రహాన్ని కొలువుతీర్చారు. ఆలయానికి ఉత్తరాన స్వామివారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఉగాది తర్వాత జరగనున్న ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయ మండపాల్లోని ప్రాకారాల్లోని సాలహారాల్లో అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుని అవతారాలు, భైరవులు, పార్వతి అమ్మవారి విగ్రహాలను నెలకొల్పారు. ముఖమండపంలో దక్షిణామూర్తి, బ్రహ్మ, భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చారు. ఈ శివాలయ ప్రాంగణంలో అన్నివైపులా భక్తులను ఆకట్టుకునే రీతిలో ఉపాలయాలను నిర్మించారు. నైరుతిలో ఏకతల విమానగోపురంతో గణపతి, వాయువ్యంలో ఏకతల విమాన గోపురంతో పర్వతవర్ధని అమ్మవారు, ఈశాన్యంలో ఆంజనేయస్వామి ఆలయాలు, నవగ్రహ మండపం, ఆగ్నేయంలో యాగశాలలను నిర్మించారు. శివాలయానికి ఎదురుగా సుమారు 26 అడుగుల ఎత్తున ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం భూపాలపల్లి అడవుల నుంచి ఎల్తైన నారవేప చెట్టు నుంచి సేకరించిన కలపదుంగను తీసుకువచ్చారు. యంబ నర్సింహులు, కల్లెం సంపత్‌కుమార్ ఫొటోలు: కొల్లోజు శివకుమార్ యాదాద్రి పరిసర క్షేత్రాలు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందనుంది. పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతంలోని పురాతన చారిత్రక కట్టడాలు, ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. భువనగిరి మండలం వడాయిగూడెంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సకల దేవతల ఆలయాలకు నెలవుగా ఇప్పటికే పర్యాటకులను ఆకట్టుకుంటోంది. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత సురేంద్రపురికే వెళుతుంటారు. యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపురికి బస్సు, ఆటో సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జట్కాబళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. యాదగిరిగుట్ట నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని బస్వాపూర్ గ్రామంలో కాళేశ్వరం జలాలతో సింహసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇక్కడ బెంగళూరులోని బృందావన్ గార్డెన్ తరహా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరంలోని భువనగిరి కోటను కూడా తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా కోట పైకి రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి క్షేత్రానికి అతి సమీపంలోని వడాయిగూడెం, రాయగిరి రైల్వేస్టేషన్ సమీపంలోని గుట్టలను భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. రాయగిరి వద్ద ఆంజనేయ అభయారణ్యం, వడాయిగూడెం సమీపంలో నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహ్లాదభరితమైన వాతావరణం కల్పించేందుకు ఇక్కడ వివిధ రూపాల్లో గొడుగులు, వంతెనలు ఏర్పాటు చేశారు. రాయగిరి చెరువుకట్టపై రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాయగిరి కమాన్ నుంచి కట్టమైసమ్మ ఆలయం వరకు పూలమొక్కలను ఏర్పాటు చేశారు. అలాగే, ఇక్కడ ఒకటిన్నర ఎకరాల స్థలంలో బోటింగ్ జరిపేందుకు వీలుగా పనులు చేస్తున్నారు. పర్యాటకుల కోసం ఇక్కడ రెండు ఫుడ్‌కోర్ట్స్, ఆరు స్టాల్స్, ఒక చేనేత వస్త్రశాల ఏర్పాటు చేసేందుకు పనులు సాగిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఒడిశా నుంచి తెప్పించిన భారీ ఇసుకరాతి శిల్పాలను ఇక్కడకు తీసుకొచ్చారు. యాదాద్రికి 20 కిలోమీటర్ల దూరంలోని కొలనుపాక గ్రామంలో సోమేశ్వర ఆలయం, మహాలక్ష్మీ వీరనారాయణస్వామి ఆలయాల పునరుద్ధరణ కోసం వైటీడీఏ ఇటీవల రూ.1.79 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఒక జైన ఆలయం, పద్దెనిమిది మఠాలు కూడా ఉన్నాయి. యాదాద్రికి 22 కిలోమీటర్ల దూరంలోని రాజపేట సంస్థానం కోట, మల్లాపురం, సైదాపురం, మైలార్గూడెంలలో మినీ ట్యాంక్‌బండ్‌లను అభివృద్ధి చేయనున్నారు. రేపు ఉ. 11.55 గంటలకు దర్శనం యాదాద్రి ఆలయంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి స్వయంభూ మూర్తుల దర్శనం మార్చి 28వ తేదీ ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణతో మొదలవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆలయ పునఃప్రారంభం కోసం మార్చి 21 నుంచి 28 వరకు ప్రతిరోజూ ఉదయం, రాత్రి హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల తరహాలోనే ప్రధానాలయంలో భక్తుల దర్శనాలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతుల కోసం ఇప్పటికే తొలిదశ పనులు పూర్తయ్యాయి. భక్తుల కోసం మిషన్ భగీరథతో పాటు యాదాద్రి జలప్రసాదాన్ని తీసుకు వస్తున్నారు. గండిచెరువు వద్దనున్న దీక్షాపరుల మండపంలో తాత్కాలికంగా భక్తులకు అన్నప్రసాదం కోసం ఏర్పాట్లు చేశారు. బాలాలయంలో మార్చి 28వ తేదీ నుంచి దర్శనాలను నిలిపివేసి, బాలాలయాన్ని తొలగించనున్నారు. ప్రస్తుతం బాలాలయం ఉన్న ప్రదేశంలో సంగీత మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Yadagirigutta Temple: అదిగదిగో యాదాద్రి
సాక్షి, హైదరాబాద్: యాదగిరి లక్ష్మీ నారసింహుడు.. తెలంగాణ ఇలవేల్పు.. ఏడాదికోసారైనా ఇంటిల్లిపాదీ ‘గుట్ట’కు వెళ్లి దర్శించుకోవటం ఆనవాయితీ. ఇప్పుడా నారసింహుడి ఆలయం అద్భుతమైన ‘యాదాద్రి’గా మారి వెలుగులు విరజిమ్ముతోంది. పూర్తి కృష్ణశిలల నిర్మాణం, అబ్బురపడే శిల్పాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుని.. భక్తజన కోటిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తేందుకు సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు తనివితీరా దర్శనమివ్వనున్నాడు. సోమవారం (28వ తేదీన) మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. మరో తిరుమలగా..! ఏపీలోని తిరుమల వెంకన్న సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. సాధారణ రోజుల్లోనే 40 వేల మంది వరకు.. సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో దాదాపు 70– 80 వేల మంది దాకా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత అంతగా భక్తుల తాకిడి ఉండే ఆలయంగా నిలుస్తుందని అంచనా. గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే.. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 40, 50వేల మంది వరకు వస్తారని పేర్కొంటున్నారు. ‘‘ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలవకముందటితో పోలిస్తే.. పనులు మొదలై బాలాలయంలో స్వామి దర్శనాలు మొదలుపెట్టాక అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది. 5 వేల మంది దర్శించుకునే రోజుల్లో 10 వేల మంది రావడం మొదలైంది. ప్రత్యేక సందర్భాల్లో 30వేల మంది వరకు వచ్చారు. కొత్త ఆలయ నిర్మాణంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. భక్తులు, సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నాం. రోజుకు 50వేల మంది వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం’’ అని యాదాద్రి ప్రాంత అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మన్ కిషన్‌రావు చెప్పారు. వెయ్యేళ్లకుపైగా నిలిచేలా.. యాదాద్రి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారు. నిజానికి 17వ శతాబ్దం తర్వాత రాతి నిర్మాణాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇటుకలు, ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగి రాతిని వాడటం ఇబ్బందిగా భావిస్తూ వచ్చారు. జటప్రోలు సంస్థానాధీశులు నిర్మించినవే తెలుగు నేలపై చివరి పూర్తి రాతి మందిరాలు. ఇన్ని వందల ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారి పూర్తి రాతి నిర్మాణానికి యాదాద్రి వేదికైంది. ఆలయం కోసం ఏకంగా రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలను వినియోగించారు. 1,200 మంది శిల్పులు రాత్రింబవళ్లు పనిచేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల పాటు నిలిచేలా ఇంటర్‌లాకింగ్ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్ చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగుపాటుతో నష్టం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయ విమానగోపురంపై సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకాలంకరణలో ఏర్పాటు చేసిన రంగురంగుల ధ్వజాలు అద్భుత శైలి.. ఆకట్టుకునే విగ్రహాలతో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. 2015లో మొదలైన నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అబ్బురపడే రీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఓ రకంగా చెప్పాలంటే గుడి కాదు ఏకంగా గుట్టనే మారిపోయింది. ► యాదాద్రి ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణ శైలులను వినియోగించారు. ► వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆళ్వార్లు ఇక్కడ రాతి స్తంభాల రూపంలో ముఖ మండపంలో కొలువుదీరారు. 12 మంది ఆళ్వార్లు 11 అడుగుల ఎత్తుతో 38 అడుగుల ఎత్తున్న ముఖ మండపానికి ఆధారభూతంగా నిలిచారు. ► మరెక్కడా లేనట్టుగా 1,700 అడుగుల పొడవునా.. దాదాపు 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు. ► 84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహారాజగోపురం.. ఐదు, నాలుగు, మూడు, రెండు అంతస్తులతో మరో ఐదు గోపురాలు, విమాన గోపురం ఇక్కడి మరో ప్రత్యేకత. ► మహారాజగోపురం ఒక్కదానికే ఏకంగా 13 వేల టన్నుల రాయిని వాడారు. ఇది పూర్తవటానికి రెండేళ్లు పట్టింది. ► ఏ దేవాలయంలోనూ లేనట్టు ప్రాకారానికి వెలుపల అష్టభుజి మండపాలను ఏర్పాటు చేశారు. రథయాత్ర సాగినా భక్తులు హాయిగా ఆ మండపాల్లో కూర్చుని చూడొచ్చు. ► సింహం తల, గుర్రం తరహా శరీరం, దిగువ ఏనుగు.. వెరసి యాలీ జంతు రూపం. ఇలాంటి భారీ రాతి శిల్పాలు ఏకంగా 58 కొలువుదీరాయి. నోరు తెరిచి ఉన్నట్టుగా ఉండే ఆ విగ్రహాల నోటిలో అతిపెద్ద రాతి బంతులు ఉండటం విశేషం. ► ఏడు చోట్ల ఐరావతాలు, ప్రవేశం నుంచి ఆలయంలోకి వెళ్లేప్పుడు స్తంభాల రూపంలో ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, యాద మహర్షి, రామానుజుల రూపాలు, గర్భాలయ ద్వారంపైన రాతి ప్యానెల్‌పై గర్భాలయ ఉత్సవ మూర్తి రూపం, ప్రహ్లాదచరిత్ర, పంచ నారసింహుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ► సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించినట్టుగా అదేతరహా కాంతితో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ ఆకట్టుకుంటోంది. ఇది ఓ తంజావూరు.. ఓ శ్రీరంగం గొప్ప రాతినిర్మాణ దేవాలయం అనగానే మనకు తంజావూరు గోపురం గుర్తుకొస్తుంది. శ్రీరంగం మదిలో మెదులుతుంది. ఇప్పుడా రెండు దేవాలయాలు మనకు యాదాద్రిలో కనిపిస్తాయి. ఇది అసాధారణ నిర్మాణం. సీఎం కేసీఆర్ శ్రీకృష్ణదేవరాయలులాగా నిలిచి, ఆలోచనలు పంచి, ఆర్థిక వనరులు కల్పించి కట్టించారు. రాతి దేవాలయాల నిర్మాణ చరిత్రలో యాదాద్రి చిరకాలం నిలిచిపోతుంది. భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు గొప్ప నిర్మాణంలో గడిపిన అనుభూతిని పంచుతుంది. – ఆనంద సాయి, ఆలయ ఆర్కిటెక్ట్ -
అగ్నిమథనం.. ప్రతిష్ఠ
సాక్షి, యాదాద్రి: యాదాద్రిలో శ్రీ నృసింహస్వామివారి సప్తాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక ఉత్సవాలు రెండోరోజు అత్యంత వైభవంగా జరిగాయి. విశ్వశాంతి, లోకకల్యాణార్థం శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ ప్రధానాచార్యులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు కనులపండువగా నిర్వహించారు. బాలాలయంలో ఉదయం 9 గంటలకు శాంతిపాఠం, యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమ«థనం, అగ్నిప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభించారు. విశేష వాహనములు, మూర్తిమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించారు. 30 నిమిషాలపాటు అగ్నిమథనం ఉత్సవాల్లో భాగంగా మహా మండపంలో యాగశాల ముందు భాగంలో అగ్నిమథనం కార్యక్రమాన్ని జరిపించారు. 10 మంది అర్చక స్వాములు, యాజ్ఞీకులు సహజంగా అగ్ని వచ్చేటట్లు అగ్నిమథనం చేశారు. జమ్మి, రాగి చెట్టు కర్రల ద్వారా అగ్నిని పుట్టించారు. ఈ అగ్నిని పుట్టించేందుకు సుమారు 30 నిమిషాలపాటు సంప్రదాయ పద్ధతిలో వేదమంత్రాలతో ఆచార్యులు, పారాయణీకులు పూజలు చేశారు. వృత్త కుండంలో అగ్ని ప్రతిçష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆ వృత్త కుండం నుంచి మిగతా అన్ని కుండాలకు అగ్నిని విస్తరించారు. విశేష యజ్ఞ హవనములు పంచకుండాత్మక మహా యాగంలో అధిష్టాన దైవమైన శ్రీమన్నారాయణుడిని ప్రస్తుతించే మంత్రాలు, మూల మంత్రాలతో దశాంశ, శతాంశ, సహస్రంశాది తర్పణాలు, శ్రీ లక్ష్మీనారసింహుని స్తోత్రాలతో బీజాక్షర మంత్రాలతో విశేష హోమం నిర్వహించారు. బాలాలయంలో రాత్రి సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శ్రీ స్వామి వారి ప్రధానాలయంలో బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం చేశారు. బింబ పరీక్ష ద్వారా ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించిన నూతన శిలస్వరూపులైన దేవతలు శిల్పి ఉలి తాకిడికి ఏర్పడిన అపరాధాన్ని తొలగించడానికి మంత్రోచ్ఛరణతో సంప్రోక్షణ చేయడం, శాంతి హోమం ద్వారా ఆగమశాస్త్రం ప్రకారం ప్రధాన ఆలయంలోని ఆయా మూర్తుల తేజస్సును పెంపొందించే కార్యక్రమం నిర్వహించారు. నవకలశ స్నపనం ద్వారా సర్వాభీష్ట సిద్ధి, సర్వసంపదలు కలగాలని నిర్వహించారు. -
యాదాద్రిలో అద్భుత ఘట్టం (ఫోటోలు)
-
వైభవంగా పంచ కుండాత్మక యాగం
సాక్షి, యాదాద్రి: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అద్భుత ఘడియలు రానే వచ్చాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన ఘట్టానికి సోమవారం అంకురా ర్పణ జరిగింది. యాదాద్రి ప్రధానాలయ మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా వారం రోజుల పాటు జరిగే సప్తాహ్నిక పంచ కుం డాత్మక యాగానికి ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, మో హనాచార్యులు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. తొలిరోజు సోమవారం శ్రీస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పంచ కుండాత్మక యాగానికి ఉదయం స్వస్తి వాచనం, రాత్రి అంకురార్పణ నిర్వహించి ఆధ్యాత్మిక పర్వాలను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో భగవత్ ఆజ్ఞ తీసుకున్న అనంతరం బాలాలయంలో స్వస్తి వాచనం, విష్వక్సేన పూజ, పుకాహశించనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశన, ఋట్విగ్వరణం, అఖండ జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. పంచ కుండాత్మక యాగం పూజలు నిర్వహిస్తున్న ఆచార్యులు గోదావరి జలాలతో స్వామి పాదాలకు అభిషేకం ప్రధానాలయంలో శ్రీపంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం పారాయణీకులు అత్యంత వైభవంగా వాస్తుపూజ నిర్వహించారు. అలాగే మల్లన్న సాగర్ నుంచి కాలువ ద్వారా జంగంపల్లికి వచ్చిన గోదావరి జలాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి పాదాలను అభిషేకించారు. ఆటంకాలు కలుగకుండా విష్వక్సేన పూజ బాలాలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీస్వామి వారి సప్తాహ్నిక పంచ కుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవములలో భాగంగా సాయంత్రం 6 గంటలకు మృ త్సంగ్రహణం, అంకురారోపణం, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన వేడుకలు నిర్వహించారు. మహా కుంభ సంప్రోక్షణ సందర్భంగా ఎలాంటి అటంకాలు కలుగకుండా ఉండేందుకు విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా, సంపూర్ణంగా కొనసాగేందుకు శ్రీ విష్వక్సేన పూజ శ్రీపంచారాత్రాగమ శాస్త్రానుసారం నిర్వహించారు. లోకకల్యాణం కోసం స్వస్తి వాచనం ఆగమ శాస్త్రానుసారంగా స్వస్తి వాచన మంత్రాలతో వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం, ఎలాంటి బాధలు లేకుండా ప్రాణ కోటి సుఖసంతోషాలతో జీవించే విధంగా ఆశీర్వదించమని భగవంతుని వేడుకొనే స్వస్తి వాచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి, సహాయ కార్య నిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆలయంలో ఈ కార్యక్రమాల సందర్భంగా అధికారులు మీడియాను లోపలికి అనుమతించలేదు. కొండపైన, యాదగిరిగుట్టలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు శాంతి పాఠం..అగ్నిమథనం యాదాద్రి ఆలయంలో సప్తాహ్నిక పంచకుం డాత్మక యాగం, మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శాంతి పాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వారతోరణ ధ్వజకుం భారాధనలు, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ట, యజ్ఞ ప్రారంభం చేస్తారు. అనంతరం విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్య లఘు పూర్ణాహుతి జరిపిస్తారు. సాయంత్రం సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమములు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం, నవకలశ స్నపనం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహిస్తారు. -
Yadadri Temple: యాదాద్రిలో మహాక్రతువుకు అంకురార్పణ (ఫొటోలు)
-
ప్రతీ భక్తుడికి జియో ట్యాగింగ్
యాదగిరిగుట్ట: యాదాద్రీశుడికి ఈనెల 28న ఉదయం 11.55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ జరుగుతుందని, ఆ రోజు మధ్యాహ్నం 2గంటల తరువాతే భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. ‘ఉదయం సమయంలో భక్తులు వచ్చి ఇబ్బందులు పడొద్దు.. పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ ఆలయంలోకి అనుమతించడం కుదరదు. పూజలన్నీ పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల తర్వాతే స్వయంభూ దర్శనాలు ప్రారంభమవుతాయి’అని ఆమె వెల్లడించారు. శుక్రవారం కొండపైన తన కార్యాలయంలో ఈఓ గీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘భక్తులు క్యూకాంప్లెక్స్లోకి వెళ్లే క్రమంలో ఆన్లైన్ టికెటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనమైనా, వేరే ఏ దర్శనమైనా అక్కడ భక్తులు పేరు నమోదు చేసుకుంటారు. కొండపైకి ఎంత మంది వచ్చారు, క్యూలైన్లో ఎంత మంది ఉన్నారో పరిశీలించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఒక్కసారి ట్యాగింగ్ చేసిన వ్యక్తి కొండ దిగారా లేదా ఎక్కడ ఉన్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 28న ఉచిత దర్శనాలే ఉంటాయి కాబట్టి 29వ తేదీ నుంచి ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పారు. కొండపైకి భక్తులు వచ్చేందుకు 75 బస్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. 27 వరకు బాలాలయంలో దర్శనాలు ఈ నెల 21న అంకురార్పణతో బాలాలయంలో ప్రారంభమయ్యే పంచకుండాత్మక కార్యక్రమాలు 28 వరకు జరుగుతాయి. 28న ఉదయం పూర్ణాహుతి పూర్తయిన అనంతరం మహా కుంభ సంప్రోక్షణ ఉంటుంది. పంచకుండాత్మక యాగానికి సంబంధించిన పనులన్నీ శనివారం పూర్తవుతాయి. ‘బాలాలయంలో 27వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు ఉంటాయి. 21 నుంచి వచ్చే భక్తులంతా స్వామి వారిని, యాగాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 28న ఉదయం పూర్ణాహుతి, యాగ ఫలం సమర్పించిన అనంతరం బాలాలయంలో ఉన్న సువర్ణ మూర్తులను శోభయాత్రతో ప్రధానాలయానికి తీసుకెళ్తారు. ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు’అని ఆమె తెలిపారు. యాగశాల, మహా కుంభసంప్రోక్షణకు అవసరమైన వేద పారాయణీకులు, ఇతర ఆలయాల్లో ఉన్న అర్చక సిబ్బంది డిప్యూటేషన్‌పై యాదాద్రికి వస్తారన్నారు. సౌకర్యాలన్నీ 28న ప్రారంభం ‘మండల దీక్ష భవనం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణిని 28న ప్రారంభిస్తాం. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం సైతం భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వీలైనంత వరకు అదే రోజు ప్రారంభిస్తాం. కొండపైన క్యూకాంప్లెక్స్ సిద్ధంగా ఉంది. కొండ కింద బస్టాండ్, కొండపైన బస్బే రెడీ అవుతున్నాయి. 21 నుంచి 28 వరకు ఎంత మంది వస్తే అంత మంది భక్తులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్న ప్రసాదం అందిస్తాం’అని గీతారెడ్డి చెప్పారు. 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత ప్రతి శనివారం, ఆదివారం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు శ్రీస్వామి వారి కల్యాణ మండపం కింద ప్రత్యేక వేదిక నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం చెంతనే గల శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన ఏప్రిల్ 25న ఉంటుందన్నారు. అందరూ ఆహ్వానితులే.. ‘శ్రీస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనకు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి వచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ చూసుకుంటారు. మేము ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్రం 28వ తేదీన ఉదయం జరిగే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు. దేవుడికి ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ ఆహ్వానితులే. యాగం జరిగే సమయంలో ఎవరైనా, ఏ సమయంలోనైనా వచ్చి వెళ్లవచ్చు. వచ్చిన వారికి ఆలయ పరంగా మర్యాదలు చేస్తాం’ అని గీతారెడ్డి చెప్పారు. -
ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మిస్తున్నారు: రోజా
-
ఏరియల్ వ్యూ ద్వారా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ సందర్శన
-
చిన్న లోపమూ ఉండొద్దు
సాక్షి, యాదాద్రి: అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే యాదాద్రి ఆలయ పునఃప్రారంభ పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మహా కార్యంలో ఎక్కడా చిన్న లోపం లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 21 నుంచి 28 వరకు మహా సుదర్శనయాగంతో ప్రారంభమై 28న అర్ధ రాత్రి ఆలయ పునఃప్రారంభ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం యాదాద్రిలో విస్తృతంగా పర్యటించారు. ఆలయానికి మధ్యాహ్నం 1:38 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న సీఎం... రాత్రి 7:56 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. సుమారు 6 గంటలపాటు యాదాద్రిలో గడిపారు. ఇందులో 4 గంటలపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగతా సమయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. సీఎం కేసీఆర్‌కు వేద ఆశీర్వచనం అందిస్తున్న ఆలయ అర్చకులు తొలుత ప్రత్యేక పూజలు... ముందుగా సీఎం కేసీఆర్ బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం ఇచ్చారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా ఆలయ పరిసరాలను సీఎం పరిశీలించారు. కల్యాణకట్ట, పుష్కరిణి పనులను పరిశీలించి మంత్రులకు, అధికారులకు పలుసూచనలు చేశారు. ఆపై ప్రత్యేక బస్సులో సీఎం ఆలయ నగరి పరిసరాలను రింగ్‌రోడ్డు మీదుగా కలియతిరుగుతూ పూర్తి కావస్తున్న, పూర్తయిన పనులను పరిశీలించారు. అలాగే కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి అధికారులకు పలుసూచనలు చేశారు. మార్చి 21 నుంచి 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న మహా సుదర్శన యాగం ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను మంత్రి ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. యాగశాల నిర్మాణాలకు సంబంధించిన నమూనాను ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి సీఎంకు వివరించారు. 108 యాగశాలల్లో ప్రధాన యాగశాలను తాటిఆకులతో, మిగతావి రేకులతో ఏర్పాటు చేయాలని సూచించారు. నెలాఖరులోగా పూర్తి చేయాలి.. ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాభ్ది ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమం జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సుమారు 4 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఆయన... ఉద్ఘాటనకు సంబంధించిన పనులన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి కావాలని నిర్దేశించారు. మార్చి 21 నుంచి 28 వరకు ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃసంప్రోక్షణ జరగాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సౌకర్యాలలో ఎక్కడా లోపం ఉండకూడదన్నారు. అనంతరం భక్తులకు వసతుల కోసం బడ్జెట్ కేటాయించారు. మంగళవారం నుంచే ఆయా శాఖలు తమకు కేటాయించిన పనులను వెంటనే ప్రారంభించి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మరో 50 కిలోల బంగారం అవసరం... ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం 120 కిలోల బంగారం అవసరమవగా ఇందులో 30 కిలోల బంగారానికి సరిపడా నగదు ఇప్పటికే సమకూరిందని, మరో 40 కిలోల బంగారం వివిధ వర్గాల నుంచి అందిందని వివరించారు. మరో 50 కిలోల బంగారాన్ని సేకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ప్రధాన ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తాపడం పనులు చివరిదశలో ఉన్నాయని వివరించారు. చెన్నై స్మార్ట్ క్రియేషన్ సంస్థ పనులపై చర్చించారు. 12న ప్రెసిడెన్షియల్ సూట్ల ప్రారంభం... యాదాద్రిలో వీఐపీల కోసం నిర్మించిన 15 ప్రెసిడెన్షియల్ సూట్లను ఈ నెల 12న ప్రారంభించనున్నారు. ఉద్ఘాటన నేపథ్యంలో పెద్ద ఎత్తున వచ్చే వీఐపీల వసతి కోసం 15 సూట్లను ప్రారంభించనున్నారు. యాదాద్రి కలెక్టరేట్, టీఆర్ఎస్ నూతన భవనాల ప్రారంభం కోసం ఈ నెల 12న వస్తున్న సీఎం కేసీఆర్ యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్లను ప్రారంభించనున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి చెప్పారు. సీఎం వెంట మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తదితరులున్నారు. -
నేడు యాదాద్రిలో పర్యటించనున్నతెలంగాణ సీఎం కేసీఆర్
-
రాతి.. చిర ఖ్యాతి!
సాక్షి, హైదరాబాద్: పాత రాతి కట్టడాలు చూస్తే వాటిల్లోని శిల్పాలు అబ్బురపరుస్తాయి. వాటిని చెక్కిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ మండపాలు, ప్రాకారాలు, గోపురాలు.. ఒకటేమిటి అన్నీ కట్టిపడేస్తాయి. కారణం.. అవన్నీ రాతి నిర్మాణాలే. 17వ శతాబ్దంలో జటప్రోలు దేవాలయాల నిర్మాణాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆ స్థాయిలో రాతి నిర్మాణాలు జరగలేదు. ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగాక నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది. రాతి కట్టడాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ అలనాటి అబ్బురాన్ని కళ్లకు కట్టేలా రెండు భారీ రాతి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటు యాదాద్రి.. అటు శ్రీరామానుజుల సహస్రాబ్ధి ప్రాంగణం.. సనాతన సంప్రదాయ నిర్మాణ విధానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాయి. మన శిల్పుల్లో ఆ కళ పదిలం ఎలాంటి ఆధునిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా టన్నుల బరువున్న రాళ్లను పేర్చి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసి శిల్పులు అద్భుతాలు çసృష్టించారు. అయితే ప్రస్తుతం ఆలయాల్లోని మూలవిరాట్టు మినహా మిగతా భాగాలకు రాతితో పని అవసరం లేని సమయంలో నేటి శిల్పుల చేతుల్లో నాటి పనితనం ఉండదన్న అనుమానాలుండేవి. కానీ ఈ రెండు మందిరాలను నిర్మించి వారు నాటి శిల్పుల వారసులేనని నిరూపించారు. యాదాద్రి, రామాను జుల సహస్రాబ్ది మందిరాల్లో దాదాపు 5 వేల మంది శిల్పులు అద్భుత పనితనాన్ని చూపారు. రామానుజుల ప్రాంగణంలో రాతి నిర్మాణాలు యాదాద్రి మందిరానికి 86 వేల టన్నుల నల్లరాయి యాదాద్రి మందిరాన్ని పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించారు. ఇందుకు మేలురకమైన బ్లాక్ గ్రానైట్ కోసం వివిధ ప్రాంతాలను గాలించి ప్రకాశం జిల్లా గుర్జేపల్లి ప్రాంతంలోని క్వారీని ఎంపిక చేశారు. దాదాపు 86 వేల టన్నుల నల్లరాతిని సేకరించారు. ఇందుకు రూ. 48 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ రాతిని చెక్కి ఇటు శిల్పాలు, అటు నగిషీలు, ప్రాకార రాళ్లు.. ఇలా రకరకాలుగా వినియోగించారు. మొత్తంగా యాదాద్రి ఆలయానికి 10 లక్షల క్యూబిక్ ఫీట్ మేర దీన్ని వినియోగించారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణంలో మందిరాలకు రకరకాల రాళ్లు రామానుజుల 216 అడుగుల ఎత్తున్న విగ్రహం దిగువన ఉన్న 54 అడుగుల ఎత్తున్న భద్రపీఠానికి రాజస్తాన్‌లోని బన్సీపహాడ్‌పూర్ ప్రాంతం లోని లేత గులాబీ రంగు ఇసుక రాయిని వాడారు. మౌంట్అబూ ప్రాంతంలోని శిల్పుల చేత దాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ వినియోగించారు. సమతామూర్తి చుట్టూ విస్తరించి ఉన్న 108 దివ్యదేశ మందిరాల్లోని గర్భాలయ అంతరాలయాలకు ఏపీలోని కోటప్పకొండ, మార్టూరు పరిసరాల్లోని బ్లాక్ పెరల్ గ్రానైట్‌ను వాడారు. దివ్య మండపంలో హోయసల, కాకతీయ శైలిలో ఏర్పాటు చేసిన 468 స్తంభాలకు రాజస్తాన్‌లోని బేస్లానా బ్లాక్ మార్బుల్ (నల్ల చలువరాయి) వినియోగించారు. కాంచీపురం సమీపంలోని వాలాజా ప్రాంతంలోని కృష్ణ పురుష శిలను ఆలయాల్లోని ప్రధాన మూర్తులకు వాడారు. మరో 12 రోజుల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహణ జరగబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా 216 అడుగుల భారీ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణం 17వ శతాబ్దం తర్వాత తగ్గిన రాతి నిర్మాణాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరికెళ్లినా రాతితో నిర్మించిన చారిత్రక మందిరాలు దర్శనమిస్తాయి. శాతవాహనులు మొదలు కాకతీయులు, విజయనగర రాజుల వరకు నిర్మాణాలన్నీ రాతితోనే జరిపించారు. డంగు సున్నం మిశ్రమాన్ని నిర్మాణాలకు వినియోగించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా రాతికి రాతికి మధ్య బైండింగ్ వరకే దాన్ని వాడారు తప్ప ఆలయాల నిర్మాణానికి అంతగా వినియోగించలేదు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని దక్కన్ సుల్తాన్‌ను ఓడించిన తర్వాత భారీ రాతి నిర్మాణాలు పెద్దగా జరగలేదు. తర్వాత సంస్థానాలు కొలువుదీరాక 17వ శతాబ్దంలో కొన్ని పెద్ద రాతి దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. జటప్రోలు సంస్థానాధీశులు స్థానికంగా మదనగోపాల స్వామి దేవాలయం, కృష్ణా తీరంలోని మంచాలకట్ట మాధవస్వామి దేవాలయాలు నిర్మించారు. మళ్లీ 3 శతాబ్దాల తర్వాత 1910లో వనపర్తి సంస్థానాధీశులు పెబ్బేరు సమీపంలోని శ్రీరంగాపురంలో రంగనా«థ స్వామి ఆలయాన్ని రాతితో నిర్మించారు. కానీ అది చిన్నగా ఉండే ఒకే దేవాలయం. జటప్రోలు దేవాలయాల తర్వాత ఇంత కాలానికి అత్యంత భారీగా, పూర్తి రాతితో నిర్మించిన దేవాలయం యాదాద్రి. రామానుజుల సహస్రాబ్ధి మందిరాలు కూడా కొంతభాగం సిమెంటు నిర్మాణాలు పోను ప్రధాన మందిరాలను రాతితోనే నిర్మించారు. నగరం నడిబొడ్డున నౌబత్ పహాడ్‌పై పాలరాతితో నిర్మించిన బిర్లామందిరం కూడా రాతి కట్టడమే అయినా తెలుగు ప్రాంతాల సంప్రదాయ శైలికి భిన్నమైంది. -
యాదాద్రి ఏర్పాట్లు ఎలా చేద్దాం?
శంషాబాద్ రూరల్: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునఃప్రారంభం ఏర్పాట్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. యాదాద్రిలో మార్చి 21 నుంచి మహా సుదర్శనయాగం, 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టడానికి ఇదివరకే ముహూర్తం ఖరారుకాగా.. వాటి ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌స్వామితో కేసీఆర్ చర్చించారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీయర్‌స్వామి ఆశ్రమంలో సీఎంకు రుత్వికులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌కు స్వామి మంగళ శాసనాలు అందజేశారు. సీఎం అక్కడి నుంచి జీయర్ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న యాగశాలకు వెళ్లి పనులను పరిశీలించారు. 1,035 కుండాలతో హోమాలు నిర్వహించనున్నట్లు స్వామి వివరించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జీయర్‌స్వామి భారీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ పనులను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం యాగశాల, సమతాస్ఫూర్తి కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు ఇచ్చారు. మిషన్ భగీరథ నీటి సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నందున యాగశాల వద్ద ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి ఫోన్‌చేసి హోమాలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోమం కోసం వినియోగించే నెయ్యిని స్థానిక గోశాలలో సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్న విధానాన్ని అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం ఇక్కడకు వచ్చిన సీఎం మూడు గంటలకు పైగా ఇక్కడ గడిపారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఉన్నారు. -
సీఎం కేసీఆర్.. ఓ ఇంజనీర్
సాక్షి, యాదగిరిగుట్ట (నల్గొండ): సీఎం కేసీఆర్ ఓ ఇంజనీర్‌గా, ఆర్కిటెక్టుగా యాదాద్రి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కలలో కూడా ఊహించని విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోందని.. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆలయం లక్షలాది భక్తులతో విరాజిల్లుతోందన్నారు. మరో రెండు నెలల్లో భక్తులకు స్వయంభూ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బాలాలయంలో ఆచార్యులు మంత్రి సత్యవతి రాథోడ్, కుటుంబసభ్యులకు స్వాగతం పలికారు. -
యాదాద్రిలో పూజవేళల్లో మార్పులు
సాక్షి, యాదగిరిగుట్ట (నల్లగొండ): నూతన సంవత్సరానికి యాదాద్రి ఆలయం లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలి పారు. యాదాద్రి కొండపైన ఉన్న తన కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జనవరి 1వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం పూజల వేళల్లో మార్పులు చేశామని వెల్లడించారు. ఉదయం 3గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9.45 గంటలకు ద్వార బంధనం చేయనున్నట్లు చెప్పా రు. భక్తుల కోసం 100 గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలు మొత్తం కలిపి 60 వేలు తయారీ చేసి అందుబాటులో ఉంచుతామని వివరించారు. అలాగే 13న వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు స్వామివారిని దర్శించుకునేందు కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అదే రోజున అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. పాతగుట్టలోనూ నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశికి ఏర్పా ట్లు చేస్తామన్నారు. సమావేశంలో ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు. -
ధరలు పెంపు, యాదాద్రిలో మరింత ప్రియం కానున్న స్వామివారి లడ్డూ ప్రసాదం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు జరిపించే శ్రీస్వామి వారి కైంకర్యాలు, శాశ్వత పూజలు, భోగాలతో పాటు ప్రసాదం ధరలను పెంచుతున్నట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి దేవస్థానంతో పాటు కొండపై గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, అనుబంధ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సైతం ధరలు పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. యాదాద్రిలో పెంచిన ధరలివి నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.800 చేశారు. ఒక్కరికి రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.400కు పెంచారు. సహస్ర నామార్చనకు రూ.216 ఉంటే రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 ఉంటే రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 ఉంటే రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) రూ.750 ఉంటే రూ.1,000, లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉంటే రూ.2,500, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవకు రూ.750 ఉంటే రూ.1000, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 ఉంటే రూ.800, గో పూజకు రూ.50 ఉంటే రూ.100, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 ఉంటే రూ.500, అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు. ప్రసాదం ధరల వివరాలివీ.. స్వామివారి లడ్డూ ప్రసాదం ధరలను సైతం అధికారులు పెంచారు. వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి పెంచారు. 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు. శివాలయంలో, పాతగుట్ట ఆలయంలోనూ పూజల ధరలను పెంచారు. శాశ్వత పూజల ధరలు కూడా పెరిగాయి. -
కార్తీక మాసం చివరి రోజు: యాదాద్రికి పోటెత్తిన భక్తులు
-
250 విల్లాలు.. ఒక్కోటి 2 కోట్లు
సాక్షి, యాదాద్రి: మహోన్నత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో భక్తులకు వసతి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా టెంపుల్ సిటీలో భారీ వసతి గదుల నిర్మాణానికి వైటీడీఏ (యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ) సన్నాహాలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈనెల 19న యాదాద్రి పనులను స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. తిరుమలకు వచ్చే భక్తులు కుటుంబాలతో మూడు, నాలుగు రోజులు కొండపై ఉంటున్న విధంగా.. యాదాద్రికి వచ్చే భక్తులు కూడా బస చేయడానికి 250 కాటేజీల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయం సమీపంలో ఉన్న పెద్దగుట్టపై టెంపుల్‌సిటీని పరిశీలించిన సీఎం కేసీఆర్.. అక్కడ రూపొందించిన లేఅవుట్లలో చేపట్టనున్న వసతి గదుల నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యాదాద్రి కొండకు ఎదురుగా ఉన్న పెద్దగుట్టపై 900 ఎకరాల్లో టెంపుల్ సిటీని నిర్మించనున్నారు. మొదటగా 250 ఎకరాల్లో రూ.207 కోట్లతో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో 250 ప్లాట్లలో విశాలమైన విల్లాల నిర్మాణం కోసం 40 మందికి పైగా దాతలు ముందుకొచ్చారు. ముందుగా విల్లాల నిర్మాణం భక్తుల వసతి కోసం ముందుగా విల్లాల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి విల్లాలో నాలుగు సూట్లు ఉంటాయి. టెంపుల్‌సిటీలో నిర్మించే ప్రతి బ్లాక్‌కు దేవతల పేర్లు పెట్టనున్నారు. ప్రస్తుతం 250 ఎకరాల్లో లేఅవుట్ సిద్ధంగా ఉంది. మరో 650 ఎకరాల్లో లేఅవుట్‌ను సిద్ధం చేయబోతున్నారు. వీటితోపాటు ప్రస్తుతం అభివృద్ధి చేసిన టెంపుల్ సిటీలో మంచినీరు, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వసతుల కల్పన పూర్తి చేశారు. సుందరీకరణ, గ్రీనరీ పనులు కూడా పూర్తి చేశారు. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం భక్తులకు కనువిందు చేయనుంది. ఐదు రకాల నిర్మాణాలు : పెద్దగుట్టపై ఐదు రకాల అధునాతన కాటేజీలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఒక్కో విల్లాను రూ.2 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. ‘ఎ’టైప్ నుంచి ‘డి’టైప్ వరకు పూర్తిగా ఏసీ కాటేజీలు నిర్మిస్తున్నారు. నాన్ ఏసీ కేటగిరీలో ‘ఇ’టైప్ కాటేజీలు ఉంటాయి. ముందుగా రూ.2 కోట్ల విరాళం ఇచ్చే దాతల పేరిట ‘ఎ’టైప్ వసతి గృహాన్ని నిర్మించనున్నారు. అలాగే రూ.కోటి విరాళం ఇచ్చే దాతల పేరిట ‘బి’టైప్, రూ.50 లక్షలు ఇచ్చేవారి పేరిట ‘సి’టైప్, రూ.25 లక్షలు విరాళం ఇచ్చేవారి పేరిట ‘డి’టైప్ కాటేజీల నిర్మాణాలు జరగనున్నాయి. విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పెద్దగుట్ట మీద నిర్మించే విల్లాల కోసం విరాళాలు ఇవ్వడానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 250 విల్లాలు నిర్మించాలని నిర్ణయించాం. ఒక్కో విల్లా విలువను రూ.2 కోట్లుగా నిర్ణయించాం. ఇప్పటికే 40 మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు. మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. దాతలు బ్యాంకుల్లో విరాళాలు చెల్లించవచ్చు. – కిషన్‌రావు, వైటీడీఏ వైస్ చైర్మన్ -
Yadadri Temple: ‘మేఘా’ 6 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: యాదాద్రి దేవాలయం విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు బంగారాన్ని విరాళంగా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే పలువురు ప్రముఖులు సుమారు 32 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తరఫున ఆరు కిలోల బంగారం విరాళంగా ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఆరు కేజీల బంగారం లేదా సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో త్వరలో అందజేస్తామని ప్రకటించారు. ప్రతిష్టాత్మక పుణ్యస్థలమైన యాదాద్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచల మేరకు మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రణీత్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండీ కామిడి నర్సింహారెడ్డి సంస్థ తరఫున 2 కిలోల బంగారాన్ని, ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వీ రామరాజు తమ సంస్థ (జలవిహార్) తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. విరాళాల కోసం బ్యాంక్ ఖాతా స్వర్ణ తాపడానికి భక్తులు విరాళాలు సమర్పించడానికి బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఇండియన్ బ్యాంక్ యాదగిరిగుట్ట శాఖలో ఖాతా తెరిచారు. దాతలు అకౌంట్ నం. 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011కు నగదు జమ చేయాలని దేవస్థానం ఈఓ గీతారెడ్డి కోరారు. విరాళాలు పారదర్శకంగా ఉండేందుకు బ్యాంక్ ద్వారానే తీసుకోనున్నామని తెలిపారు. బంగారం విరాళంగా ఇస్తే స్వచ్ఛత విషయంలో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున భక్తులు నగదు రూపంలో బ్యాంకులో జమచేయాలని సూచించారు. -
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ఫొటోలు
-
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి భువనగిరి(నల్లగొండ): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఆలయ పున: నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పెద్ద గుట్ట టెంపుల్ సిటీ హెలిప్యాడ్‌పై సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఉన్నారు. ఆలయం పునఃప్రారంభం ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కేసీఆర్ బాటలోనే పార్టీ యంత్రాంగం -
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని పర్యటించి ఆలయ పునః ప్రారంభం తేదీలు, ముహూర్తాన్ని అక్కడికక్కడే ప్రకటించనున్నారు. ఉదయం 11.30కు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నింటిని మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. ఆలయం పునఃప్రారంభం ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. పనులను పరిశీలించనున్న సీఎం... కొండపైన ప్రధానాలయం ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. ఇంకా బస్బే, మెట్లదారి పనులు జరుగుతున్నాయి. క్యూలైన్ల ఏర్పాటు జరిగింది. ప్రసాదం కాంప్లెక్స్, మూడంతస్తుల క్యూకాంప్లెక్స్ పనులు పూర్తి చేశారు. గర్భాలయం ద్వారానికి బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి. కొండకింద భక్తుల అవసరాల కోసం జరుగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలిసి యాదాద్రి ఉద్ఘాటనకు రావాలని ఆహ్వానించిన విష యం తెలిసిందే. ప్రధానంగా కొండ కింద చేపట్టిన కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, రింగ్‌రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్, దీక్షాపరుల మండపం, అన్నప్రసాద వితరణ కేంద్రం, గండిచెరువు అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. యూనివర్సిటీ ఏర్పాటు తిరుమల తిరుపతి తరహాలో యాదాద్రిలో యూనివర్సిటీ, మెడికల్ కళాశాల ఏర్పాటుపై సీఎం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నా యని సమాచారం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ పద్మావతి యూనివర్సిటీ ఉన్నాయి. యాదాద్రిలో సైతం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా లక్ష్మీనరసింహ స్వామి పేరున యూనివర్సిటీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి: ముందస్తు ఎన్నికలకు వెళ్లం: సీఎం కేసీఆర్ -
భక్తులతో కిటకిటలాడుతున్న యాదగిరిగుట్ట
-
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న కిషన్ రెడ్డి
-
యాదాద్రి టెంపుల్ పై భక్తులకు కనీస సదుపాయాలు కరువు
-
యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోటుపాట్లు
-
యాదాద్రి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం
-
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, యాదగిరిగుట్ట: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి చేరుకొని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆచార్యులు ఆయనకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అంతకు ముందు యాదాద్రి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకు మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి, ఆలయ ఈవో గీతారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీజేఐ ఎన్వీ రమణ ప్రధానాలయ పునః నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అనంతరం రింగ్‌రోడ్డు మార్గంలో ఉన్న టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్‌ను సందర్శిస్తారు. చదవండి: కరోనా గుణపాఠాలు.. భవిష్యత్ వ్యూహాలు -
రేపు యాదాద్రికి సీజేఐ..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. శనివారం సీజేఐను కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి సందర్శిం చాలని కోరగా, సీఎం ఆహ్వానాన్ని మన్నించి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. తొలుత ఆదివారం సీజేఐతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ వెళ్తారని వార్తలు వచ్చాయి. అయితే సోమవారం సీజేఐ ఒక్కరే పర్యటిస్తారని దేవాలయ వర్గాలు తెలిపాయి. ముందుగా బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ప్రధానాలయాన్ని పరిశీలిస్తారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శనివారం యాదాద్రికి చేరుకుని ఏర్పాట్లపై జిల్లా పరిపాలనా యంత్రాంగం, వైటీడీఏ అధికారులతో సమీక్షించారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజ్‌భవన్‌లో జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. చదవండి: Telangana: విత్తు.. విపత్తు -
యాదాద్రి ఆలయంపై కోవిడ్ ఎఫెక్ట్
-
యాదాద్రిలో వేసవిలోనూ హరితమయ శోభ..
సాక్షి, యాదగిరిగుట్ట(యాదాద్రి భువనగిరి) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధితో పాటు కొండకు దిగువన ఉన్న ప్రాంతాలు హరితమయంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చని మొక్కలతో యాదాద్రి కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు ఆ పచ్చదనంతో శోభను చూసి ఆనందపడుతున్నారు. వేసవిలోనూ.. రంగురంగుల పూల మొక్కలు.. ఆకర్షించే గ్రీనరీ.. పది అడుగుల మొక్కలు క్షేత్రానికి వచ్చే భక్తులను ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదంలోకి తీసుకెళ్తున్నాయి. మండుతున్న ఎండలకు భక్తులు, స్థానికులు ఈ పచ్చని అందాలను వీక్షిస్తూ సేద తీరుతున్నారు. ఈ మొక్కల సంరక్షణకు నిత్యం కూలీలు శ్రమిస్తున్నారు. -
యాదాద్రి: అర్చకుడు సహా 30 మందికి పాజిటివ్
సాక్షి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అర్చకులు, అధికారి, సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాజిటివ్ వచ్చిన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంతో ఒక్కొక్కరుగా ఆస్పత్రికి క్యూ కట్టి పరీక్షలు చేయించుకుంటున్నారు. కేసులు ఇలా.. యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షల్లో యాదాద్రి ఆలయానికి చెందిన ఓ అర్చకుడికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. 26న మరికొందరు పరీక్షలు చేయించుకోగా నలుగురు యాదాద్రి అర్చకులు, సిబ్బంది, మరో ఇద్దరు హయగ్రీవ స్వామి ఆలయ అర్చకులకు (వీరు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు) పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక శనివారం చేసిన పరీక్షల్లో 30 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో అర్చకులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. భౌతిక దూరం విడిచి.. మాస్క్‌లు మరిచి ఓ వైపు కరోనా వ్యాప్తి చెందుతున్నా యాదాద్రి క్షేత్రంలో కోవిడ్ – 19 నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనల అనంతరం ఆలయంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టారు. కానీ, క్రమేణా వాటిని మరిచారు. ఆలయానికి వచ్చే భక్తులు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించకుండానే ఆలయ పరిసరాల్లో తిరుగుతున్నారు. కనీసం భౌతికదూరం కూడా పాటించడం లేదు. అన్‌లాక్ కావడంతో యాదాద్రి క్షేత్రానికి హైదరాబాద్ జంటనగరాలతో పా టు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నెల 15నుంచి 25వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు అలంకార సేవలు, తిరుకల్యాణం, రథోత్సవం, శ్రీ చక్ర స్నానం వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో గుంపులుగా కూర్చోవడం, మాస్కులు ధరించకపోవడంతో ఆలయంలో అర్చకులు, అధికారులు, సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం శ్రీస్వామి క్షేత్రంలో విధులు నిర్వహించే పలువురు అర్చకులు, అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యా రు. ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ఈఓ, వివిధ సెక్షన్ల కార్యాలయాల్లో శానిటైజేషన్ చేశారు. క్యూలైన్లలో శానిటేషన్ డబ్బాలు ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆలయ పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. మూడు రోజులు ఆర్జిత సేవలు బంద్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆలయంలో శ్రీస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి ప్రకటించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆర్జీత సేవలు నిలిపివేశామన్నారు. నిత్య పూజలన్నీ అంతరంగికంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఘాట్ రోడ్డులోని జీయర్ కుటీర్‌లో రోజూ నిర్వహించే అన్నదానం సైతం మూడు రోజుల పాటు బంద్ చేసినట్లు చెప్పారు. కేవలం భక్తులకు లఘు దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈఓ వెల్లడించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. చదవండి: సూర్యపేట గ్యాలరీ స్టాండ్ ప్రమాదం: ప్రధాన కారణం ఇదే! -
ఏప్రిల్ 15 కల్లా ‘యాదాద్రి’ సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున:ప్రారంభించనున్నందున నిర్దేశించిన గడువులోపు తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. యాదాద్రి పనుల పురోగతిపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణ పనులకు సంబంధించి తుదిదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆలయ దివ్యాలంకృత రూపం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఆలయ అధికారులతో ఆయన చర్చించారు. ఇటీవల తాను యాదాద్రి క్షేత్రంలో పర్యటించిన సందర్భంగా చేసిన సూచనలకు సంబంధించి పురోగతి ఎంతవరకు వచ్చిందన్న దానిపై అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘పునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోంది. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో, కృష్ణ శిలలతో నిర్మితమవుతున్న ఈ ఆలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటోంది. జైనులు, పల్లవుల ఆకృతుల నిర్మాణాలతో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. పున:ప్రారంభ అనంతరం లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలి’అని చెప్పారు. సుందర శివాలయం.. 80 ఫీట్ల దీప స్తంభం యాదాద్రి నారసింహుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి సీఎం పలు సూచనలు చేశారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీని తొలగించి అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని, 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని, ఏప్రిల్ 15కల్లా ఈ క్యూలైన్ నిర్మాణం పూర్తి కావాలని ఆయన గడువు విధించారు. క్యూలైన్ పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలకు సంబంధించి నాలుగు ఆకృతులను ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు చూపించగా అందులో ఒకదాన్ని ఖరారు చేశారు. దీప స్తంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది, నడకదారిలో కూడా ఇత్తడితో ఆకృతులను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్ర పరిధిలో శివాలయ నిర్మాణం గురించి వివరాలు తెలుసుకున్న సీఎం దేవాలయం చుట్టూ 360 డిగ్రీల కోణంలో ఐకానిక్ ఎలిమెంట్‌లా తయారు చేయాలని, ఆలయ ప్రహరీలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలని, ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించేలా గ్రిల్స్, రెయిలింగ్ ఏర్పాటు చేయాలని, ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ కనిపించేలా తుది మెరుగులు దిద్దాలని ఆదేశించారు. సుదర్శన చక్రం తరహాలో.. బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం తరహాలో శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమివ్వాలని, రథశాలను ఆలయాకృతిలో తీర్చిదిద్దాలని, విష్ణు పుష్కరిణి కొండ చుట్టూ నిర్మించే ప్రహరీల మీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలని, 80 ఫీట్ల పొడవున్న దీప స్తంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలని సూచించారు. అద్దాల మండపం పనులు అత్యంత సుందరంగా జరుగుతున్నాయని కితాబిచ్చిన సీఎం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రివేళల్లో ఆలయ సముదాయం, ప్రాంగణం, పరిసరాలు దివ్యమైన విద్యుత్ వెలుగులతో ప్రకాశించేలా రూపొందించిన వీడియోను కేసీఆర్ ఈ సందర్భంగా తిలకించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సీఎం కార్యాలయ కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు, ఆర్కిటెక్ట్‌లు ఆనంద్‌సాయి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
14వ సారి.. 6 గంటలు కలియదిరిగిన సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని.. వచ్చే మే నెల నుంచే స్వయంభూ నరసింహుడి దర్శనం కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. త్రిదండి చినజీయర్‌స్వామి ఆశీర్వచనం తీసుకుని, శుభ ముహూర్తంలో భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. పనుల్లో వేగం పెంచి, ఈ నెలాఖరుకే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు ఆరు గంటల పాటు యాదాద్రిలో గడిపారు. ఆర్కిటెక్ట్, అధికారులకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో యాదాద్రికి రావడం ఇది 14వ సారి కావడం గమనార్హం. పనుల పూర్తిపై సంతృప్తి గురువారం ఉదయం 12.08 గంటలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. తర్వాత కాన్వాయ్‌తో కొండపైకి చేరుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. తర్వాత బాలాలయంలో ప్రతిష్టామూర్తులకు ప్రత్యేక పూజలు, సువర్ణ పుష్పార్చన జరిపించారు. ఆలయ ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు 90 శాతం పూర్తి కావడం పట్ల సీఎం కేసీఆర? సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఏయే పనులు అసంపూర్తిగా ఉన్నాయి, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్న అంశాలను ఆర్కిటెక్ట్, అధికారులతో సమీక్షించారు. నర్సింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలో ఉన్న అనుభూతి కలిగించాలని, దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండేలా చూడాలని సూచించారు. విద్యుత్ దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలగాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో క్యూ కాంప్లెక్సులపై ఆధ్యాత్మిక భావన కల్పించేలా శంకుచక్రనామాలు, నారసింహ రూపాల ఏర్పాటు బాగుందని మెచ్చుకున్నారు. మాడవీధులు, అష్టభుజి ప్రాకారాలు, సాలహారాలు, వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణి, భక్తుల స్నాన గుండం, మెట్లదారి నిర్మాణాలను పరిశీలించారు. ప్రహరీకి మరింత శోభ వచ్చేలా ప్రాచీన చిత్ర కళా అలంకృత రూపం (అర్నమెంటల్ లుక్)తో సుందరంగా తయారు చేయాలని సూచించారు. హడావుడి పడకూడదు అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నప్పుడు హడావుడి పడకూడదని సీఎం కేసీఆర్ సూచించారు. ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లోని శిల్పసంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు చెప్పారు. ప్రహ్లాద చరిత్ర సహ నృసింహుడు, పురాణ దేవతల చరిత్రలు అర్థమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించాలన్నారు. మూల విరాట్టుకు అభిషేకం జరిగే సమయంలో భక్తులకు స్పష్టంగా కనిపించేలా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. గర్భగుడి ముందు ధ్వజ స్తంభాన్ని, తంజావూర్ పెయింటింగ్‌లను.. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులను పరిశీలించారు. ఉప ఆలయాలతోపాటు ఆండాళ్ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా యాదాద్రికి వస్తారని, వారికి అన్ని వసతులు అందేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని కేసీఆర్ చెప్పారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో దేశంలోని ఇతర ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని, అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. చైనాలో పరిశీలించి రండి.. అద్దాల మండపం అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అవసరమైతే చైనాలో ఏడు కిలోమీటర్ల దూరం లైట్లతో నిర్మించిన మాల్‌ను సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని చెప్పారు. హుండీలను, ప్రసాద కౌంటర్లను భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక యాదాద్రి గెస్ట్‌హౌజ్‌లో లిఫ్టులు పూర్తి కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిశా పూరీ జగన్నాథ్ ఆలయం మాదిరిగా.. రిటైర్డ్ పూజారులు, వేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తిని వెళ్లదీసుకునేలా భక్తుల నుంచి కానుకలు స్వీకరించేలా మండపం నిర్మించాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. శ్రావ్యమైన సౌండ్‌సిస్టం ఉండాలి గుట్టపై శివాలయాన్ని సందర్శించిన సీఎం.. రుత్విక్కుల కోసం నిర్మించిన మండపం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల ఆహ్లాదంకోసం భక్తి గీతాలు, శ్లోకాలు శ్రావ్యంగా వినిపించేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరిణి వద్ద అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు. శిల్పులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. తర్వాత ఏసీ ప్లాంట్, గ్యాస్ గోదాం, కొండ దిగువన పచ్చదనం పెంచేందుకు చేపట్టిన పనులను పరిశీలించారు. గుట్ట కింద నిర్మాణాల జాప్యాన్ని నివారించాలి యాదాద్రి చుట్టూ, టెంపుల్ సిటీలో చేపట్టిన రోడ్లు, బస్టాండ్లు, ప్రెసిడెన్సియల్ కాటేజీలు, కల్యాణకట్ట, లక్ష్మి (గండిచెరువు) పుష్కరిణి పనులను కేసీఆర్ పరిశీలించారు. ఇక్కడి పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్న ప్రసాద వితరణ సత్రం పనులపై పలు సూచనలు చేశారు. రింగ్‌రోడ్డు లోపలి ప్రాంతాలను పచ్చదనంతో నింపాలన్నారు. అన్ని రకాల సాయం చేస్తం రింగ్‌రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వ్యాపారులు, ప్రజలతో గుట్ట కింద సీఎం ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. కోల్పోయిన దానికన్న గొప్పగా వారికి అన్ని వసతులతో షోరూంల తరహాలో విశాలమైన దుకాణాలు కట్టిస్తామని, ఉచితంగా ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో గుట్ట మీద వ్యాపారం చేసుకున్న వారికి టెంపుల్ టౌన్లో పాత పద్ధతిలో దుకాణాలు ఇస్తామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పర్యటనలో సీఎం వెంట ఎంపీ సంతోష్, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, అధికారులు ఉన్నారు. కాగా.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి వస్తుండగా సీఎం కేసీఆర్ హెలికాప్టర్ నుంచే నృసింహ (బస్వాపురం) రిజర్వాయర్ పనులను పరిశీలించారు. బస్వాపురం శివారులో ఉన్న మెత్తగుట్ట, తేలవాలుగు గుట్ట, ఉంగరాల గుట్ట మీదుగా హెలికాప్టర్ ప్రయాణించింది. తక్కువ ఎత్తులో వెళుతుండటంతో సీఎం బస్వాపురం కట్టపై దిగుతారేమోనని సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు ఆసక్తిగా చూశారు. -
యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) యాదాద్రికి చేరుకున్నారు. ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండకింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. హెలికాప్టర్లో ఉదయం 11.30 గంటల సమయంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా స్వామివారి పూజలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ అధికారులతో సీఎం.. సమావేశం నిర్వహించనున్నారు. యాదాద్రి ఆలయ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. చదవండి: సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ రాజీనామా! కుంటాల సందర్శకులకు గుడ్ న్యూస్ -
యాదాద్రిలో సీఎం కేసీఆర్